
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని గార్డెన్ నంబర్ 95 శ్రీవేణుగోపాలస్వామి టెంపుల్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 54 అడుగుల ఎత్తైన జాతీయ పతాక పోలుపై 12 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నైతిక నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణతంత్ర వేడుకల్లో పిల్లలు ,మహిళలకు ఆట పోటీలు నిర్వహించి వారికి సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం పిల్లల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నైతిక నిర్వాహణ సభ్యుడు ఆడిటర్ జగన్నాథం, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త నర్ర భూపతి రెడ్డి, సామాజిక కార్యకర్త పూస యోగేశ్వర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా స్వాతంత్ర, గణతంత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తామని తెలియజేశారు.
గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించిన కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్‌కు నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment