
సాక్షి,హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆదివారం(జనవరి26) పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్‌లో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు. జనవరి 26న ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, రాజ్ భవన్ పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గ్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ థియేటర్ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment