Cantonment
-
Meetho Sakshi: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య
-
ప్రభుత్వమే పేదలకు ఇచ్చిన ఇండ్లు అక్రమం ఎలా అవుతాయి
-
గ్రేటర్లో కంటోన్మెంట్ సివిల్ ఏరియాల విలీనం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు.మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచి్చన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే రక్షణ శాఖకు లేఖ రాశారు.ఈనెల 25 రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సంబంధిత విధి విధానాలపై రక్షణ శాఖ లేఖ రాసింది. దీని ప్రకారం కంటోన్మెంట్‌లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి వర్తిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. -
కంటోన్మెంట్ ఫలితంపై ఉత్కంఠ
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది.వెస్లీ కళాశాల ప్రాంగణంలోని రెండు వేర్వేరు హాళ్లలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వేర్వేరుగా నిర్వహించనున్నారు. మంగళవారం (రేపు) ఉదయం ఆయా కేంద్రాల్లో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 232 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల చొప్పున మొత్తం 17 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. తొలుత బ్యాలెట్ ఓట్లు, అనంతరం సాధారణ ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు లెక్కింపు ప్రక్రియ కొలిక్కి రానుందని అధికారులు వెల్లడించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం జిల్లాల వారీగా హైదరాబాద్, పార్లమెంట్ స్థానం వారీగా చూస్తే మేడ్చల్– మల్కాజ్గిరి పరిధిలోకి వస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు బోగారంలోని హోలీ మేరీ కళాశాల ప్రాంగణంలో, ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలోని ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మాత్రం సికింద్రాబాద్ వెస్లీ కళాశాల ఆవరణలో జరగనుంది. సర్వత్రా ఆసక్తి కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు నెలల క్రితం నాటి ఎన్నికల్లో 1,23,297 ఓట్లు పోలవ్వగా, తాజాగా 1,30,929 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 59,057 ఓట్లు సాధించగా, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేశ్‌కు 41,888, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకు 20,825 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్, కాంగ్రెస్ అభ్యరి్థగా మారారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్‌కు టికెట్ ఇచి్చంది. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత బరిలో నిలిచారు.వార్డు నేతల్లోనూ టెన్షన్కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక వార్డు నేతల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. తమ వార్డులో పార్టీకి మెజారిటీ వస్తుందా లేదా అని ఆయా నేతలు ఆలోచనలో పడిపోయారు. అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా, తమ వార్డులో మెజారిటీ వస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటింగ్ సరళిపై ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. -
Telangana: సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్‌లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్ జరగనుంది.తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ నారాయణన్‌లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు. -
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్‌తో బోణీ కొట్టాలన్న కసితో ఉంది. ప్రత్యర్థులకంటే తామే ఇక్కడ బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్, సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్లో తొలిసారిగా రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయతి్నస్తోంది. మొత్తానికి మూడు పార్టీలూ ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన శ్రీగణేశ్, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్.. నివేదితదివంగత ఎమ్మెల్యే సాయన్న 2014లో టీడీపీ నుంచి గెలిచి రెండేళ్లలోనే బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018లో తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గతేడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన స్థానంలో చిన్న కుమార్తె లాస్య నందిత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం కాగా, బీఆర్ఎస్ మళ్లీ సాయన్న రెండో కుమార్తె నివేదితకు టికెట్ కేటాయించింది. అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జెల నాగేశ్, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. లాస్య నందిత గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఒకనాటి సాయన్న అనుచరులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బోర్డు మాజీ సభ్యులు మాత్రం అండగా నిలవగా, సాయన్న, సోదరి లాస్య సెంటిమెంట్‌పై ఆశలతో నివేదిత తన ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్, తండ్రి, సోదరి సెంటిమెంట్‌తో తన గెలుపు ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.అనుకూలతలు» దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కావడం » ఏడాదిలోనే ఎమ్మెల్యే హోదాలోనే తండ్రి, సోదరిని కోల్పోయిన సానుభూతి » పటిష్టమైన పార్టీ కేడర్ ప్రతికూలతలు»పెద్ద సంఖ్యలో నేతలు పార్టీని వీడటం » ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే గతానుభవాలు » కీలకనేతలు ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్.. శ్రీగణేశ్నారాయణ్ శ్రీగణేశ్ పదిహేనేళ్ల క్రితమే కాంగ్రెస్ యువ నాయకుడిగా కంటోన్మెంట్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే 2018లో ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలకతీతంగా శ్రీగణేశ్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవతో కంటోన్మెంట్ ఓటర్లకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2023లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో అధికార కాంగ్రెస్ శ్రీగణేశ్‌ను పార్టీలోకి ఆహా్వనించింది. శ్రీగణేశ్ వ్యక్తిగత బలం, అధికార పార్టీ అండతో గెలుపు ఖాయం అన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చేరికల జోరుతో కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అనుకూలతలు» అధికార పార్టీ అభ్యర్థి కావడం » ఓడిపోయినా ప్రజల్లోనే ఉండటం » పార్టీలకతీతంగా సొంత కేడర్ ప్రతికూలతలు» తరచూ పార్టీలు మారతాడన్న అపవాదు » పాతనేతలు, కొత్తగా చేరుతున్న వారిమధ్య సమన్వయలేమి » కొన్ని వార్డుల్లో పార్టీ బలహీనంగా ఉండటంబీజేపీ.. టీఎన్ వంశ తిలక్ ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉండే కంటోన్మెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎంపీగా గెలిచినా, కంటోన్మెంట్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్‌ను దాటి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. అయితే ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి శ్రీగణేశ్ కాంగ్రెస్‌లోకి చేరడంతో మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడైన డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌కు టికెట్ కేటాయించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడంతో సీనియర్ నేతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేకపోయారు. అయితే మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు తలొగ్గిన బీజేపీకి ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి రావడంతో మోదీ చరిష్మాతో బీజేపీ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.అనుకూలతలు» పటిష్టమైన పార్టీ కేడర్ » ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు » మోదీ చరిష్మాతో ఉత్తరాది ఓట్లపై ఆశలు ప్రతికూలతలు » కంటోన్మెంట్‌కు పరిచయం లేని వ్యక్తి » పార్టీ నేతల మధ్య సమన్వయలేమి » ప్రచారంలో వెనుకబడిపోవడం -
Cantonment: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
హైదరాబాద్: ఎన్నికల వేళ కంటోన్మెంట్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్.శ్రీగణేశ్ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్ మంగళవారం ఉదయం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్ వాకర్స్తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు. అటు నుంచి శ్రీగణేశ్ నేరుగా పికెట్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీగణేశ్‌ను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్‌లో చేరిపోవడం గమనార్హం. -
కంటోన్మెంట్లో స్కైవేలకు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఎట్టకేలకు కంటోన్మెంట్లో ప్రతిపాదిత స్కైవేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. స్కైవేల నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల కేటాయింపునకు ఇటీవలే అంగీకారం తెలిపిన కేంద్రం, తాజాగా స్కైవేల నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో స్కైవేల నిర్మాణం చేపట్టనుంది. రాజీవ్ రహదారిపై ప్యాట్నీ చౌరస్తా నుంచి హకీంపేట వరకు సుమారు 14 కిలోమీటర్లు, నాగ్‌పూర్ హైవే మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు సుమారు 6.5 కిలోమీటర్లు రెండు ఎలివేటెడ్ కారిడార్లుగా స్కైవేలు నిరి్మంచనున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిరి్మంచాలని భావించినప్పటికీ, ఈ మార్గంలో సుచిత్ర నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ప్రతిపాదిత స్కైవేను బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు కుదించినట్లు తెలుస్తోంది. బీఓఓ కమిటీ ఏర్పాటు ►రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం భాగస్వామ్య పక్షాలతో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ (బీఓఓ) కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ, డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం, లోకల్ మిలటరీ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డుల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ►ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మొత్తం 150 ఎకరాల రక్షణ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇందులో 90 ఎకరాలు ఆర్మీకి సంబంధించిన స్థలాలు కాగా, కంటోన్మెంట్ బోర్డు స్థలాలు 30 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ ఇతరత్రా మరో 30 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలాలు వీటికి అదనం. ►ఈ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు భవనాలు కనుమరుగు కానున్నాయి. ►బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేట ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు సమీపంలో ఫ్లైఓవర్లకు బదులుగా టన్నెల్ రూపంలో రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. దీనిపై త్వరలోనే హెచ్ఎండీఏ పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనుంది. ►ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డు 30 ఎకరాలకు పైగా స్థలాన్ని కోల్పోతున్నందున, అందుకు గానూ సుమారు రూ.300 కోట్ల పరిహారం ఇవ్వాలని బోర్డు అధికారులు కోరారు. అయితే కంటోన్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఎస్టేట్స్, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే కాబట్టి, పరిహారం పూర్తిగా కేంద్రానికి చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డుకు ఎలాంటి పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయింది. ►తాజా భూకేటాయింపుల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బాలంరాయి పంప్ హౌజ్, బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేటలో ఎయిర్‌లైన్స్ స్థలాలు, కొన్ని ఓల్డ్ గ్రాంట్ బంగళాలు తమ స్థలాలను కోల్పోనున్నాయి. ముఖ్యంగా ఎన్సీసీ, ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్ భారీ మొత్తంలో స్థలాలను కోల్పోనున్నాయి. -
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పొడవైన జాతీయ జెండా!
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని గార్డెన్ నంబర్ 95 శ్రీవేణుగోపాలస్వామి టెంపుల్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 54 అడుగుల ఎత్తైన జాతీయ పతాక పోలుపై 12 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నైతిక నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణతంత్ర వేడుకల్లో పిల్లలు ,మహిళలకు ఆట పోటీలు నిర్వహించి వారికి సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం పిల్లల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నైతిక నిర్వాహణ సభ్యుడు ఆడిటర్ జగన్నాథం, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త నర్ర భూపతి రెడ్డి, సామాజిక కార్యకర్త పూస యోగేశ్వర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా స్వాతంత్ర, గణతంత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తామని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించిన కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్‌కు నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్ -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం ఘన చరిత్ర..ఇదే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం కంటోన్మెంట్ని రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఈసారి టిఆర్ఎస్ తరుపున గెలిచారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్దిగా గెలుపొందినా, తదుపరి జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37568 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజేపి తరపున పోటీచేసిన శ్రీ గణేష్‌కు 15500 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 65752 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 28184 ఓట్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో నాలుగుసార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పి.శంకరరావు 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలుపొందినా 2014లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కంటోన్మెంట్లో రెండుసార్లు గెలిచిన బి.వి గురుమూర్తి, ఒకసారి ఖైరతాబాద్‌లో గెలిచారు. 1967లో ఇక్కడ గెలిచిన వి. రామారావు 1957లో షాబాద్‌లో, 1962లో చేవెళ్ళలో గెలిచారు. ఆయన మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వి.మంకమ్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత మరోసారి కూడా గెలుపొందారు. ఇక్కడ గెలిచిన వారిలో బి.వి గురుమూర్తి, ఎన్.ఎ.కృష్ణ. డి. నర్సింగరావులు, డాక్టర్ శంకరరావు మంత్రి పదవులు నిర్వహించారు. మరో నేత గురుమూర్తి రాజ్యసభ సభ్యనిగా కూడా వున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, జనతా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచాయి. శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన సి.ఎమ్.తో విభేదాలలో ఇరుక్కుని పదవి కోల్పోయారు. అయితే ఈయన రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత జగన్‌ను సిబిఐ అరెస్టు చేయడంతో అదంతా రాజకీయ వివాదంగా మారింది. రాష్ట్రంలో కీలకమైన పరిణామానికి కారకుడైన శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్‌ను తీవ్రంగా విమర్శించి మంత్రి పదవిని కోల్పోవడం విశేషం. తదుపరి కాంగ్రెస్ టిక్కెట్‌ను కూడా పొందలేక పోయారు. సర్వే సత్యనారాయణ ఒకసారి టిడిపి పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ నుంచి సిద్దిపేట, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలలో గెలుపొందారు. మల్కాజిగిరి జనరల్ స్థానం అయినప్పటికి కాంగ్రెస్ ఐ తరపున ఈయన పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశారు. 2018లో కంటోన్మోంట్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
కంటోన్మెంట్ ప్రజలకు నిజంగా శుభవార్తే!
దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేసి, వాటిలోని పౌర నివాస ప్రాంతాలను పక్కనున్న నగర పాలక సంస్థల్లో విలీనం చేయాలని, ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త. సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు గత కొన్నేళ్లుగా నగరంలో అలజడి చెలరేగడం తెలుగు ప్రజానీకానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దేశంలోని ఈ కంటోన్మెంట్లలో సైన్యానికి అవసరం లేని, ప్రస్తుతం ఉపయోగంలో లేని లక్షలాది ఎకరాల ఖాళీ భూములను ఆయా నగరాలు, పట్టణాలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, ఆగ్రా వంటి 62 కంటోన్మెంటు నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోంది. చాలీచాలని పౌర సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక, ఎన్నికైన పౌర ప్రజానీకం ప్రతినిధులు, మిలిటరీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పాలనసాగే ఈ మిలిటరీ కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని ప్రాంతాల్లో మరో సమస్య ఉంది. అదేమంటే, సాధారణ ప్రజలకు ప్రభుత్వాలు అందించించే పథకాలు, సదుపాయాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అందడం లేదు. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ల బోర్డుల రద్దుతో ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా రాష్ట్రాల ప్రజలకు సర్కార్ల నుంచి అందే అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అతి పెద్ద భూస్వామి రక్షణ శాఖ. దేశంలో ఈ శాఖకు 17.99 లక్షల ఎకరాల భూమి ఉండగా, మొత్తం 62 మిలిటరీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములు చాలా వరకూ ఇక ముందు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. నాడు బ్రిటీష్ పాలన కోసం కంటోన్మెంట్ల ఏర్పాటు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని తన అధీనంలోని ప్రాంతాల ప్రజలను నియంత్రణలో ఉంచుకోవడానికి, విదేశీ దండయాత్రలను తిప్పికొట్టడానికి ఇంగ్లిష్ ఆఫీసర్లు, భారత సిపాయిలతో కూడిన కంపెనీ సైనిక దళాల మజిలీ కోసం ప్రధాన నగరాలు, పట్టణాల వెలుపల ఈ కంటోన్మెంట్లను ఏర్పాటు చేసింది. నాటి కలకత్తా సమీపంలోని బ్యారక్ పూర్ వద్ద తొలి సైనిక కంటోన్మెంటును 1765 జులై 10న ఈ కంపెనీ స్థాపించింది. బ్రిటిష్ సైనికులు స్థానిక జనంతో కలిసిపోకుండా, తమ సైనిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం పెద్ద ఊళ్లకు బాగా వెలుపల ఈ కంటోన్మెంట్లను వేగంగా ఏర్పాటుచేసుకుంటూ పోయారు. సైనిక కార్యాలయాలు, ఆయుధాగారాలు, ఉదయాన పరేడ్ చేసే గ్రౌండ్లు, ఆటస్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, భవిష్యత్తు ఆర్మీ అవసరాల కోసం ఉంచుకున్న స్థలాలు పోగా కంటోన్మెంటు పరిధిలో మిగిలి ఖాళీ స్థలాల్లో ఇతర సాధారణ పౌరులను ఇళ్లు కట్టుకుని నివసించడానికి కూడా అనుమతించారు. స్వాతంత్య్రం వచ్చేనాటకి 56 కంటోన్మెంట్లు ఉండగా, 1962లో అజ్మేర్ నగరంలో చివరి కంటోన్మెంటు నెలకొల్పారు. అంటే స్వతంత్ర భారతంలో ఆరింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ 75 ఏళ్లలో దేశ జనాభాతో పాటు నగరాల జనసంఖ్య కూడా పెరిగిపోవడంతో జనావాసాలు కంటోన్మెంట్లను తాకేలా ముందుకు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ప్రభుత్వాలు, కంటోన్మెంట్ల బోర్డులను చుట్టుముడుతున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లోని కీలక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అవసరాలకు పది, పదిహేను ఎకరాల భూమి కనపడకపోవడంతో తమకు కంటోన్మెంట్ల అధీనంలోని ఆటస్థలాలు, ఇతర ఖాళీ భూములు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖను గతంలో అభ్యర్థించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే తమ రాజధానుల ప్రాంతాలను చేర్చి ఉన్న కంటోన్మెంట్లను అక్కడ నుంచి తొలగించడానికి సిద్ధపడితే, కాస్త దూరంగా అంతకు రెట్టింపు విస్తీర్ణం గల భూములు ఇస్తామని కూడా కేంద్ర సర్కారుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో సైనిక కంటోన్మెంట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతైనా హర్షణీయం -విజయ సాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు
-
Hyderabad: అగ్నివీర్లు వచ్చేశారు.. రిపోర్టు చేసిన తొలి బ్యాచ్
కంటోన్మెంట్: మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ ట్రెయినింగ్ క్యాంపులు కళకళాడుతున్నాయి. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్లు హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు. 30వ తేదీ వరకు మొత్తం 2,500 మంది అగ్నివీర్లు రిపోర్టు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 చివరి నాటికి మొత్తం 6,000 మంది అగ్నివీరులు తమ శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు ఆర్మీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అగ్నివీర్ల శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. (క్లిక్ చేయండి: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు లేనట్టే!) -
అభివృద్ధికి నిధులివ్వవు, కోర్టుకెళ్తేనే నీళ్లిస్తావా?
కంటోన్మెంట్: కంటోన్మెంట్‌ను దత్తత తీసుకుంటానన్న సీఎం కేసీఆర్.. కబ్జాలు సాధ్యం కావడం లేదనే గాలికొదిలేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ అభివృద్ధి గురించి అడిగితే అది కేంద్ర పాలనలో ఉన్న ప్రాంతం అంటూ తప్పించుకుంటారని మండిపడ్డారు. అదే ఇక్కడి భూములు అవసరమైతే మాత్రం, కంటోన్మెంట్ రాష్ట్రంలో భాగమంటూ డబుల్ గేమ్ ఆడతాడని ఎద్దేవా చేశారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఐదో రోజు శుక్రవారం కంటోన్మెంట్లో సాగింది. అక్కడ ఏర్పాటుచేసిన సభలో బండి మాట్లాడారు. ‘కంటోన్మెంట్‌లోని స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వేలాది కుటుంబాలకు పట్టాలు ఇప్పించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. భూబదలాయింపు కింద, ఆయా స్థలాలను కోరితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏనాడూ భూబదలాయింపు కోరలేదు’అని అన్నారు. కంటోన్మెంట్‌కు ఆర్మీ ఇవ్వాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విషయంలో కొంత అస్పష్టత ఉందని, తాజా లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన రూ.750 కోట్లు తెప్పించే బాధ్యత తనదేనని బండి చెప్పారు. కంటోన్మెంట్ పాక్‌లో ఉందా? జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత మంచినీళ్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్లో ఇవ్వకుండా ఆలస్యం చేసిందని బండి చెప్పారు. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ కోర్టుకు వెళ్లాకే ఇక్కడ కూడా ఉచిత నీళ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. కంటోన్మెంట్ పాకిస్తాన్లో ఉందా లేదా, బంగ్లాదేశ్‌లో ఉందా లేక కేసీఆర్‌కు ఇష్టమైన చైనాలో ఉందా అని దుయ్యబట్టారు. మోదీని కలిసిన ప్రతిసారి వంగి వంగి దండాలు పెట్టడం తప్ప, ఇక్కడి సమస్యలేవీ కేసీఆర్ ప్రస్తావించరన్నారు. ప్రధాని మోదీ 18 గంటలు పనిచేస్తే.. కేసీఆర్18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురి పాత్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురు ప్రమేయం ఉందన్న వీడియో బయటపడటంతోనే ఆయన అంబేడ్కర్ నామస్మరణ చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అందుకే సచివాలయానికి అంబేడ్కర్ పేరంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోబెట్టాలని సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్న కేంద్రం ప్రకటనతోనే కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. కంటోన్మెంట్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం స్థలాలు ఇవ్వడం లేదంటూ కేసీఆర్, ట్విట్టర్ టిల్లూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కేటీఆర్, కవితపై డీకే అరుణ ఆగ్రహం.. ఆ మాటల వెనుక రహస్యమేంటి..?
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్‌కు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ హెచ్చరికలు చేసినందుకు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసలు రక్షణ శాఖ నియంత్రణలోని ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఈ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అని నిలదీశారు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడుచుకొని వచ్చారని, రక్షణ శాఖను గతంలో కేసీఆర్ హేళన చేయడం, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కశ్మీర్.. భారత్‌లో భాగం కాదని చేసిన వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరచి, వారిపై అవాకులు చవాకులు మాట్లాడటం కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు. అంతుకు ముందు కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఏఎస్ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ చేరుకున్న నీటితో కింద ఉన్న నదీమ్ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కంటోన్మెంట్ పరిధిలో కరెంటు, నీటి సరఫరా బంద్ చేస్తామని అని హెచ్చరించారు. -
ఏమిటీ కంటోన్మెంట్.. వివాదమేంటి?
సాక్షి, హైదరాబాద్: ఈస్టిండియా కంపెనీ పేరిట దేశంలో వ్యాపార కేంద్రాలను స్థాపించిన బ్రిటిషర్లు.. వాటి సంరక్షణ కోసం ప్రత్యేక సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బలగాలు ఉండే స్థావరాలను కంటోన్మెంట్లుగా పిలిచేవారు. అలా నిజాం హయాంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పాటైంది. నిజాం రాజ్యం భారత్‌లో విలీనమయ్యాక.. కంటోన్మెంట్ సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అందులోని కొన్ని ప్రాంతాలను 1956లో హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ప్రస్తుతం 10వేల ఎకరాల విస్తీర్ణంలో కంటోన్మెంట్ కొనసాగుతోంది. 7వేల ఎకరాలు పూర్తిగా మిలిటరీ ఆధీనంలో ఉండగా, మిగతా 3 వేల ఎకరాల్లో సాధారణ ప్రజల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఆర్మీ నేతృత్వంలోని కంటోన్మెంట్ బోర్డు పాలనలో ఉంటుంది. రోడ్ల మూసివేతతో..: సికింద్రాబాద్ ప్రాంతం నడిబొడ్డున కంటోన్మెంట్ ఉండటంతో.. చుట్టూ ఉన్న ప్రాంతాల మధ్య రాకపోకలకు కంటోన్మెంట్‌లోని రోడ్లే దిక్కయ్యాయి. అందులో మారేడ్‌పల్లి నుంచి మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాం తాలకు వెళ్లే రోడ్లను.. ఆరేళ్ల కింద ఆర్మీ అధికారులు భద్రతా కారణాలతో మూసేశారు. స్థానికుల ఆందోళన, సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో.. పగలంతా తెరిచి, రాత్రిళ్లు మూసివేస్తూ వచ్చారు. చివరికి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయదలచినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. స్కైవేకు స్థలంపై వివాదం రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న జింఖానా, పోలో మైదానాలను.. ప్యాట్నీ నుంచి హకీంపేట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు స్కైవేల కోసం.. ఆ రోడ్ల వెంట కంటోన్మెంట్ స్థలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా.. ఆ స్థలాలను రాష్ట్ర సర్కారుకు అప్పగిస్తే.. తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతామని కంటోన్మెంట్ బోర్డు మెలికపెట్టింది. ఏటా రూ.31 కోట్లు సర్వీస్ చార్జీలు ఇవ్వాలని కోరింది. దీనితో భూబదలాయింపు ఆగింది. దీనితోపాటు గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోనూ ఇదే తరహా ఇబ్బందులు ఉన్నాయి. -
కంటోన్మెంట్ కథేంటి...?
-
కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్ వేదిక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలంటూ అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నట్లు వార్త చూశా.. దీనికి నేను అంగీకరిస్తున్నా, మీరేమంటారు?’ అంటూ నెటిజన్లను ఆయన ప్రశ్నించారు. దీంతో కంటోన్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు తమ పోరాటానికి వెయ్యేనుగుల బలం వచ్చిందంటున్నారు. సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి తమ పోరాటానికి మద్దతు పలకడంతో సగం విజయం సాధించనట్లేనని అభిప్రాయపడుతున్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్‌లు బుధవారం ఎమ్మెల్యే సాయన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీఆర్ఎస్ ఎంపీల ద్వారా పార్లమెంట్ సమావేశాల్లోనే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై చర్చ లేవనెత్తాలని కోరారు. Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC I am in agreement too. What do you guys say? — KTR (@KTRTRS) September 22, 2021 మూడేళ్లుగా చర్చ కంటోన్మెంట్ బోర్డుల రద్దు అంశంపై మూడేళ్లుగా వార్తలు వెలువుడుతున్నాయి. తాగా గతేడాది కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లలో విలీనంపై అభిప్రాయం కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు బలం చేకూరింది. కాగా ఈ అంశంపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. చదవండి: TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి? -
కంటోన్మెంట్ విలీన వాదనతో ఏకీభవిస్తున్నాను : కేటీఆర్
-
Cantonment: ఇక ఉపాధ్యక్షుడే కీలకం!
కంటోన్మెంట్: బ్రిటీష్ పాలనావశేషాలుగా కొనసాగుతూ..రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్లలో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మిలటరీ ఆధిపత్యంలో పాలన సాగే కంటోన్మెంట్లలో తొలిసారిగా ప్రజాప్రతినిధులకు తగిన అధికారాలు కల్పించబోతున్నారు. 1924లో రూపొందించిన తొలి కంటోన్మెంట్ చట్టంలో కొద్దిపాటి మార్పులతో 2006లో ది కంటోన్మెంట్స్ యాక్ట్–2006 రూపొందించారు. తాజాగా నాటి చట్టంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటకీ, బోర్డు స్వరూపాన్నే మార్చే తరహాలో కీలక సవరణలు చేపట్టారు. ఇంతకాలం కంటోన్మెంట్ బోర్డుల్లో నామమాత్రంగానే కొనసాగిన ప్రజాప్రతినిధులైన బోర్డు సభ్యులు ఇకపై నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్లలోనూ పార్టీ గుర్తులపై బోర్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఉపాధ్యక్షడిని సైతం ప్రత్యక్ష తరహాలో నేరుగా ప్రజలే ఎన్నుకోనున్నారు. ఏ–1 కేటగిరికి చెందిన సికింద్రాబాద్‌తో సహా, పలు కంటోన్మెంట్లలో ఇకపై బోర్డు బోర్డు సభ్యులు సంఖ్య 68 నుంచి 18కి పెరగనుంది. 2020 జూన్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది కంటోన్మెంట్స్ బిల్–2020 ముసాయిదాలో కొన్ని మార్పులతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత కంటోన్మెంట్ల పాలన నూతన చట్టం ఆధారంగానే కొనసాగనుంది. పార్టీ గుర్తులపై ఎన్నికలు ► ప్రస్తుతం కేటగిరి–1 కంటోన్మెంట్‌గా కొనసాగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉంది. ► నూతన చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ పార్టీల గుర్తులపై ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించనున్నారు. ► ఎనిమిది వార్డుల నుంచి ఒక్కో సభ్యుడితో పాటు, అన్ని వార్డుల ప్రజలు ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకునే అవకాశం కల్పించారు. కీలకం కానున్న ఉపాధ్యక్షుడు ► కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యే వారికి బోర్డులో చెప్పుకోతగ్గ అధికారాలేమీ లేవు. ► కేవలం బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించడం మినహా, బోర్డు సభ్యులకు అధికారికంగా ప్రత్యేక కార్యాలయం కూడా లేదు. ► ఉపాధ్యక్షుడికి సైతం బోర్డు సభ్యులతో పోలిస్తే ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. ► తాజా చట్టం ప్రకారం పాలనా సౌలభ్యం కోసం ఆర్థిక, విద్య, వైద్యం, సివిల్ ఏరియా వంటి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ► అన్ని కమిటీల్లోనూ ఉపాధ్యక్షుడు కీలకం కానున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్ పాలనాంశాలన్నింటిలోనూ ఇకపై బోర్డు ఉపాధ్యక్షుడు వెన్నెముకగా మారనున్నారు. ఓట్లు పునరుద్ధరించే అవకాశం ► ఎన్నికల కమిషన్‌తో సంబంధం లేకుండా కంటోన్మెంట్లో ఓటరు జాబితా ప్రత్యేకంగా రూపొందిస్తారు. ► ఇక ఈ త్వరలో జరగాల్సిన బోర్డు ఎన్నికల కోసం ఈ పాటికే ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లు సైతం మారే అవకాశం ఉంది. ► మొత్తానికి ఈ రెండు నూతన చట్టాలు అమల్లోకి వస్తే కంటోన్మెంట్ల పాలనా వ్యవహారాల్లో కీలక మార్పులు రానున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్‌రామ్‌లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్‌కు సహకరించిన జగత్ విఖ్యాత్‌తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్‌లో పనిచేసే రత్నాకర్‌లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్‌లను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్, జగత్‌విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్‌పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. -
కంటోన్మెంట్..కేంద్ర పాలిత ప్రాంతమా?
సాక్షి, కంటోన్మెంట్: కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించి.. రక్షణ మంత్రి ప్రారంభించిన ఆస్పత్రిని ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉంచుతారా.. అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కంటోన్మెంట్ బోర్డు అధికారులపై మండిపడ్డారు. బొల్లారంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రి(సీజీహెచ్)ని మంత్రి బుధవారం సందర్శించారు. సీజీహెచ్‌ను కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తూ చేపట్టిన పనులను సమీక్షించారు. ఐదేళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆస్పత్రిని నేటికీ ఎలాంటి వైద్య అవసరాలకు వినియోగించకపోవడమేంటని బోర్డు అధ్యక్షుడు అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్‌రెడ్డిని ప్రశ్నించారు. కంటోన్మెంట్ అంటే ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు జవాబుదారీగా ఉండటం లేదన్నారు. ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన నిధుల వివరాలతో లేఖ రాస్తే కేంద్రం నుంచి ఇప్పిస్తానని మంత్రి బోర్డు అధికారులకు సూచించారు. అనంతరం వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వారి వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చాలని కేంద్రం ఆదేశించిందని, యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయన్నారు. చదవండి: ‘108 అంబులెన్సులు ఎక్కడికి పోయాయి’: వైఎస్ షర్మిల -
కాలగర్భంలో కలిసిపోయిన మిలటరీ ఫామ్స్
న్యూఢిల్లీ: సైనిక యూనిట్లకు పాలు సరఫరా చేసేందుకు బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన మిలటరీ ఫామ్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 132 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన పాల ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో మిలటరీ ఫామ్స్ ఉన్నాయి. వీటిలో 25 వేల ఆవులు/గేదెలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం వేలాది లీటర్ల పాలు ఇచ్చేవి. భారత్‌లో మొదటి మిలటరీ ఫామ్ 1889 ఫిబ్రవరి 1న అలహాబాద్‌లో ప్రారంభమయ్యింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి 130 ఫామ్‌లు, 30 వేల ఆవులు/గేదెలు ఉన్నాయి. 20 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మిల్క్ ఫామ్స్ నిర్వహణ కోసం సైన్యం ప్రతిఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసేది. ఫామ్స్‌ను మూసివేయడంతో వీటిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రభుత్వ విభాగాలకు, డెయిరీ సహకార సంఘాలకు తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ చదవండి: కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక -
బర్త్‌డే: తప్పతాగి యువకుడి మృతి?
సాక్షి, కంటోన్మెంట్: పుట్టిన రోజు వేడుక జరుపుకొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. విందులో అధికంగా మద్యం తాగడం వల్లే మరణించినట్లు తెలుస్తోంది. గోపాలపురం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తమిళనాడులోని ముళ్లిపట్టుకు చెందిన కేశవ ప్రకాశ్ (28) ఎనిమిది నెలలుగా రెజిమెంటల్ బజార్‌లోని జేఎంజే హాస్టల్లో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం చేసే కేశవ్ సోమవారం రాత్రి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని రూమ్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం అతను బయటికి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా కేశవ్ ప్రకాశ్ తన రూమ్‌లో పడి ఉన్నాడు. ఈ మేరకు హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్లే కేశవ్ మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ, ఇతర కారణాలు ఏవైనా ఉంటాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘రేవంత్ ఉన్నడా.. నాకు బాగా దగ్గరోడు ఆయన’ -
కంటోన్మెంట్‌ను ముట్టడిస్తాం
కంటోన్మెంట్ (హైదరాబాద్): కంటోన్మెంట్లో బీ–3, బీ–4 స్థలాలను క్రమబద్ధీకరించాలని, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విడుదల కోసం త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిఖ్‌విలేజ్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన..అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలోని బీ–3, బీ–4 స్థలాల్లో నివసిస్తున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సిఖ్‌విలేజ్ శ్రీరామ్‌నగర్, గాంధీనగర్‌లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారం రోజుల్లోగా మంచినీటి సదుపాయం కల్పించాలని సీఈఓ అజిత్‌రెడ్డికి సూచించారు. -
టీఆర్ఎస్కు ఝలక్!
సాక్షి, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించగా, ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనంటూ స్పష్టం చేశారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యులంతా తమ పార్టీలోనే ఉన్నారంటూ చెప్పుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ పెద్దలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పత్రికా ముఖంగా వెల్లడించారు. అయినప్పటికీ సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి బదులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి తోడు సోమ వారం బోర్డు కార్యాలయంలో తన అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. తోటి సభ్యులతో పొసగకనే..: రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తనను టీఆర్ఎస్ పెద్దలు ఆదరించి, ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని రామకృష్ణ అన్నారు. అయితే తోటి బోర్డు సభ్యుల్లో కొందరితో పొసగని కారణంగానే తాను టీఆర్ఎస్కు దూరం కావాల్సి వస్తోందని రాజీనామా ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవేళ అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చినా తన నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నారు. వార్డు పరిధిలోని కార్యకర్తలు, తన అభిమానులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అవిశ్వాసం తప్పకపోవచ్చు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, మిగిలిన ఏడుగురు టీఆర్ఎస్ బోర్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యాక, నేరుగా బోర్డు అధ్యక్షుడు అభిజిత్ చంద్రను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఇంతకాలం రామకృష్ణకు మద్దతుదారులుగా నిలిచిన బోర్డు సభ్యులు సైతం పేర్కొంటూ ఉండటం గమనార్హం. -
భౌతిక దూరం కోసం కంటోన్మెంట్
‘భారతీయులు, కుక్కలకు నిషేధం’ఇలా రాసి ఉన్న బోర్డులు కంటోన్మెంట్ ప్రాంతంలో విరివిగా కనిపించేవి. ప్రధాన ద్వారం, ఆసుపత్రి, క్లబ్, క్రీడా ప్రాంగణం, ఈత కొలను, చర్చీలు.. ఇలాంటి అన్ని చోట్ల ఈ బోర్డులు ఉండేవి. స్థానికులతో కలిస్తే వ్యాధులు సోకుతాయన్న భయం. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే స్థానికులతో భౌతిక దూరాన్ని పాటించాలనేది నాటి నిబంధన. తాము పెంచుకున్న కుక్కలు తప్ప, స్థానిక కుక్కలు రాకుండా చూసుకునేవారు. ఇది 1865 సమయంలో రూపుదిద్దుకున్న కంటోన్మెంట్ కథ’ సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ‘మందు’భౌతిక దూరం పాటించటమే.. ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న విధానం ఇదే. ఈ సూత్రం తెలియకపోవటం వల్లే వందేళ్ల కింద స్పానిష్ ఇన్ఫ్లుయెంజా విసిరిన పంజాకు మన దేశంలో ఏకంగా కోటిన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. మన దేశంలో అన్ని మరణాలు సంభవించినా.. ఇక్కడ పాలనా పగ్గాలు పట్టుకుని ఉన్న బ్రిటిష్ వాళ్లు మాత్రం అంత ఎక్కువ సంఖ్యలో చనిపోలేదు. దానికి కారణం.. భౌతిక దూరాన్ని పాటించటమే. సిఫారసులు ఇలా.. ► భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న బ్రిటిష్ సిబ్బంది, స్థానిక భారతీయులతో మెసలకుండా ప్రత్యేకంగా నివాసం ఉండాలి. ► స్థానికుల ద్వారా వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి వారి మరణానికి కారణమవుతున్నాయి. ► బ్రిటిష్ సిబ్బందికి విశాలమైన ప్రాంతంలో దూరం దూరంగా ఉండేలా కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మించాలి. ► వారికి శుద్ధి చేసిన నీరు అందించాలి. మంచి భవనాలు నిర్మించాలి. నీరు నిలిచిపోని విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఈగలు, దోమలు లేకుండా చూడాలి. ► ఆ ప్రాంగణాల్లోకి భారతీయులను అనుమతించొద్దు. సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ అందుకే.. సికింద్రాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం.. ఈ భౌతిక దూరం సూత్రంపైనే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చరిత్రకారులు నాటి బ్రిటిష్ వారి దూరాలోచనను గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కంటోన్మెంట్ ప్రాంతాలున్నాయి. ఇవన్నీ నాటి ఆంగ్లేయులు నిర్మించినవే. అన్నింటి ఉద్దేశం ఒకటే. స్థానిక భారతీయులతో ‘సామాజిక’దూరాన్ని పాటించటం. 40 శాతం మంది చనిపోతుండటంతో.. ఇది 1850 నాటి సంగతి.. మన దేశంలో పాలన కోసం 10 వేల మంది బ్రిటిష్ సిబ్బంది ఉండేవారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. కానీ వీరిలో ఏకంగా 40 శాతం మంది అంటురోగాలు, ఇతర వ్యాధులతో చనిపోయేవారు. మూడింట ఒక వంతు మంది వ్యాధులతో ఎప్పుడూ చికిత్స పొందుతుండేవారు. ఐదారేళ్లు కాగానే 30 శాతం మంది సిబ్బందే మిగిలేవారు. దీంతో ఎప్పటికప్పుడు కావాల్సినంత మందిని ఇంగ్లండ్ నుంచి రప్పించాల్సి వచ్చేది. ఇది ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. దీంతో దీనికి కారణాలు కనుక్కుంటూ పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశిస్తూ ఆ దేశం రాయల్ శానిటరీ కమిషన్‌ను నియమించింది. 1863 ప్రాంతంలో ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. వెంటనే కంటోన్మెంట్ నిర్మాణం హైదరాబాద్ ప్రాంతం నిజాం కేంద్రంగా ఉండగా, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్ తమకు వీలుగా వాడుకునేవారు. అందుకే సికింద్రాబాద్‌లో ప్రత్యేకంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో వారికి కార్యాలయాలు, నివాసాలు, రీక్రియేషన్ కేంద్రాలు, ఆట మైదానాలు, చర్చీలు, ఉద్యానవనాలు వెలిశాయి. అవన్నీ భౌతిక దూరం పద్ధతిలో దూరం దూరంగా నిర్మించారు. కంటోన్మెంట్ నిర్మాణం తర్వాత బ్రిటిష్ సిబ్బందిలో మరణాల రేటు తగ్గిపోయింది. వారికి ప్రత్యేకంగా మంచినీటి వసతి ఉండటం, నిరంతరం పారేలా మురుగునీటి వ్యవస్థ ఏర్పడటం, మానసిక శారీరక ఉల్లాసానికి ఏర్పాట్లు ఉండటం, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం, మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండటం, రోగాలతో బాధపడే స్థానికులకు దూరంగా ఉండటం వెరసి వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపించింది. ‘1918లో ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన స్పానిష్ ఇన్ఫ్లుయెంజా ప్రభావం మన దేశంలోని కంటోన్మెంట్లలో భద్రంగా ఉన్న బ్రిటిష్‌వారిపై అంతగా ప్రభావం చూపలేదు. ఆ వ్యాధి సోకిన భారతీయులతో వారు భౌతిక దూరాన్ని పాటించడమే దీనికి కారణం. అందుకు కంటోన్మెంట్ ఉపయోగపడింది’అని చరిత్ర పరిశోధకులు డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. అప్పట్లోనే 500 పడకలతో ఆసుపత్రి కంటోన్మెంట్ ప్రాంతంలో 1870 నాటికి కంబైండ్ మిలిటరీ హాస్పిటల్‌ను నిర్మించారు. దీన్ని 1920 నాటికి 500 పడకల స్థాయికి పెంచారు. ఇందులో బ్రిటిష్ నుంచి ఎప్పుడూ నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులను కావాల్సినంత మందిని ఉంచేవారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా, బ్రిటిష్ వారికి వెంటనే నాణ్యమైన వైద్యం అందేది. ప్రస్తుతం సికింద్రాబాద్ క్లబ్‌గా వాడుకుంటున్న క్లబ్‌ను అప్పట్లో బ్రిటిష్ వారి కోసమే వినియోగించేవారు. జింఖానా క్రికెట్ మైదానం ఉన్న చోట వారికి క్రీడా సదుపాయాలుండేవి. -
స్కైవేల కథ కంచికేనా?
కంటోన్మెంట్: కంటోన్మెంట్ రూపురేఖలను మార్చేస్తామంటూ మూడేళ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఊదరగొడుతున్న స్కైవేల నిర్మాణం అటకెక్కినట్లే కనిపిస్తోంది. పోలో మైదానంలో సచివాలయంతో పాటు కంటోన్మెంట్లో రెండు స్కైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు బోర్డు సభ్యులూ తెగ హడావిడి చేశారు. అయితే తాజాగా సచివాలయం తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడంతో ప్రతిపాదిత స్కైవేల భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సచివాలంతో పాటు స్కైవేల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు ఆర్మీ అంగీకారం తెలిపినప్పటికీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం. తాజాగా నూతన సచివాలయానికి పాత స్థలంలోనే శంకుస్థాపన కూడా చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంతో ముడిపడి ఉన్న స్కైవేల నిర్మాణం ఆగిపోయినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం వేలాది మంది కంటోన్మెంట్ వాసులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపాదిత స్కైవేల మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న వారి వ్యాపారాల భవిష్యత్ ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. రెండు ప్రధాన మార్గాల్లో.. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు కంటోన్మెంట్ ద్వారానే రాజధానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కంటోన్మెంట్‌లోని ఇరుకైన రోడ్ల కారణంగా తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం 5–8 కిలోమీటర్ల కంటోన్మెంట్‌ను దాటేందుకే ఒక్కోసారి గంటకు పైగా సమయం కేటాయించాల్సి వస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఈ మార్గం నుంచే తన ఫామ్ హౌజ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే పోలో మైదానంలోకి సచివాలయం తరలింపుతో పాటే స్కైవేల నిర్మాణం చేపట్టేందుకు ఆర్మీ స్థల సేకరణ చేపట్టారు. ఈ మేరకు సచివాలయానికి 60 ఎకరాలతో పాటు, నాగ్‌పూర్ హైవేపై ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు, ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట వరకు నిర్మించనున్న స్కైవేల కోసం మరో 90 ఎకరాల కంటోన్మెంట్ భూములను సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 550 ఎకరాలు అప్పగించేందుకు అధికారుల మధ్య ప్రాథమిక స్థాయిలో ఒప్పందం కూడా ఖరారైంది. స్థల బదలాయింపుతో పాటు సర్వీసు చార్జీల పేరిట ఏటా సుమారు రూ.30 కోట్లు చెల్లించాలన్న కంటోన్మెంట్ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తరఫున తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అప్పటి మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ పలుమార్లు వెల్లడించారు. తాజాగా సచివాలయ తరలింపుపై రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గడంతో స్కైవేల నిర్మాణ ప్రతిపాదనలు నిలిచిపోయినట్లేనని అనధికారిక సమాచారం. వ్యాపారుల్లో తొలగని ఆందోళన.. స్కైవేల నిర్మాణ ప్రక్రియి దాదాపు నిలిచిపోయినట్లేనని తెలుస్తున్నా ప్రతిపాదిత ప్రాంతాల్లోని వ్యాపారుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. కంటోన్మెంట్ పరిధిలోని కమర్షియల్ భవనాల్లో దాదాపు 80 శాతం ప్రతిపాదిత స్కైవేల మార్గంలోనే ఉన్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారి విస్తరణకు సంబంధించి మూడేళ్ల క్రితమే రోడ్డుకిరువైపులా మార్కింగ్‌లు కూడా చేశారు. దీంతో ఆయా భవన యజమానులతో పాటు, అందులోని వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఏ క్షణాన్నైనా విస్తరణ పనులు ప్రారంభమవుతాయని బిక్కుబిక్కుమంటూ కాలం గడుతున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు వారికి ఊరట కలిగిస్తున్నా, అధికారిక ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్గంలో అధికారులు మార్కింగ్‌లు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఖాళీ అయ్యాయి. టులెట్ బోర్డులు పెడుతున్నా కొత్త వ్యాపారులెవరూ సాహసించకపోవడంతో ఇటు యజమానులతో పాటు, అటు కంటోన్మెంట్ బోర్డుకూ నష్టం వాటిల్లుతోంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లు భారీగా తగ్గినట్లు బోర్డు సిబ్బంది పేర్కొంటున్నారు. -
కంటోన్మెంట్లో మహాకూటమి బలంగా ఉంది
-
పబ్లిక్ మేనిఫెస్టో కంటోన్మెంట్ - సికింద్రబాద్
-
‘కంటోన్మెంట్ దారుల’ నిర్ణయంపై పునఃసమీక్ష!
న్యూఢిల్లీ: కంటోన్మెంట్ దారుల వెంట సాధారణ ప్రజల రాకపోకలను అనుమతించాలన్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. కంటోన్మెంట్ దారులను తెరవాలన్న నిర్ణయంపై ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులు భద్రతా కారణాల రీత్యా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ అధికారుల భార్యలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ సైతం చేపట్టారు. వారితో సమావేశమై సమస్య గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ దారులను తెరవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ల భద్రతకు చేటుచేసే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఓ ఆర్మీ అధికారి కుటుంబ సభ్యుడు విజ్ఞప్తి చేశారు. -
బస్సులో వచ్చి..బైకుపై వెళ్తాడు!
కంటోన్మెంట్ : అతను ఓ గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశాడు... కరీంనగర్ జిల్లాలోని తన ఊరి నుంచి నగరానికి బస్సులో వస్తాడు.. తిరిగి వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ జేబీఎస్ సమీపంలో పార్కు చేసి ఉన్న ద్విచక్ర వాహనాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని దానిపై ఉడాయిస్తాడు...వారం పదిరోజులకోసారి క్రమం తప్పకుండా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతడు చోరీ చేసిన వాహనాల చేసిస్ నెంబర్లు మార్చే వ్యక్తిని నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన అలుమల్ల విజేందర్‌రెడ్డి గ్రామ ఉపసర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా పనిచేశాడు. జేసీబీ కొనుగోలు చేసిన ఇతను ఆర్థికంగా నష్టపోయాడు. ఇందులోనుంచి బయపడేందుకు బైక్ చోరీలను ఎంచుకున్నాడు. తరచూ నగరానికి వచ్చే ఇతను బైకులను చోరీ చేసేవాడు. ఎత్తుకెళ్లిన వాహనాలను కరీంనగర్ జిల్లా, కశ్మీర్‌గూడకు చెందిన మహ్మద్ యూనిస్ మోయినుద్దీన్ సహకారంతో చేసిన నెంబర్ సహా రూపురేఖలు మార్చి విక్రయించే వాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో తరచూ బైక్‌లు చోరీకి గురవుతుండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను పది బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. 2016లోనూ నిందితుడు విజేందర్ రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు అప్పట్లో 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన మార్కెట్ పోలీసులను అభినందించారు. సమావేశంలో మహంకాళీ ఏసీపీ ఏ. వినోద్ కుమార్, సీఐ ఎం. మట్టయ్య, డీఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
కంటోన్మెంట్ స్థలం ఇవ్వండి
• రోడ్ల విస్తరణ కోసం అప్పగించాలని • కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు కేటీఆర్ విజ్ఞప్తి • హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ స్థలాలను అప్పగించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామా రావు విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాలకు బదులుగా మరో చోట స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వివరించారు. సోమవా రం ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతా ల్లో రోడ్ల విస్తరణ తదితర అంశాలపై చర్చిం చారు. గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ఇరు కుగా ఉన్నాయని... వాటిని విస్తరిస్తే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రసూల్‌పురాలో కేంద్ర హోంశాఖకు చెందిన రెండెకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. దాని బదులుగా మరోచోట క్వార్టర్స్ నిర్మించి ఇస్తామన్నారు. రహదారుల విస్తరణ కోసం కంటోన్మెంట్ స్థలాలు ఇచ్చి తెలంగాణ అభి వృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీం తోపాటు రాష్ట్రంలో మావోరుుస్టు ప్రభావిత జిల్లాలకు రూ.1,290కోట్లు ఇవ్వాలని.. రెండే ళ్లుగా ఈ నిధుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనంతరం తుమ్మలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తుల పట్ల రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో 2,600 కిలోమీటర్ల రహదారుల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. యాదాద్రి, వరంగల్ రహదారి విస్తరణ పనుల ఆలస్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళతామన్నారు. కొత్తగూడెం, జగ్దల్పూర్ రహదారి పనులు వేగవంతం చేయాలని కోరతామన్నారు. ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో భేటీ సోమవారం భారత్‌లో ఆస్ట్రేలియా హైకమి షనర్ హరీందర్ సిద్ధూతోనూ కేటీఆర్ సమావే శమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబ డులకు ఉన్న అవకాశాలను వివరించారు. డిసెంబర్లో మెల్ బోర్న్లో నిర్వహించే ఇండియా- ఆస్ట్రేలియా లీడర్షిప్ సదస్సు లో పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను సిద్ధూ ఆహ్వానించారు. అలాగే పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడింట్తోను కేటీఆర్ సమావేశమై... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారి శ్రామిక విధానాల గురించి వివరించారు. గోల్కొండ బ్రాండ్ ఔట్లెట్ ఏర్పాటు చేస్తాం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి ఢిల్లీలో జరుగుతున్న భారత వాణిజ్య మేళాలో కేటీఆర్ పాల్గొన్నారు. అక్కడి స్టాల్స్‌ను సందర్శించారు. చేర్యాల, నిర్మల్, పెంబర్తి, కరీంనగర్ చేనేత ఉత్పత్తులు, మిషన్ భగీరథ, ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ డిజిటల్ తెలంగాణ థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఉత్పత్తులను గోల్కొండ బ్రాండ్‌గా ఢిల్లీలో ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న పాలసీలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నామని, అరుుతే దీనితో సామాన్యులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశమై పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. కేటీఆర్ వెంట పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్, సీతారాం నాయక్, బీబీ పాటిల్ ఉన్నారు. -
కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తాం: పరీకర్
బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిని ప్రారంభించిన రక్షణ మంత్రి ఆర్మీ అధికారులు రోడ్లు మూసేస్తున్నారు.. ఇళ్లు కూలుస్తున్నారు: ఎంపీ మల్లారెడ్డి ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా అంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డులో ఆర్మీకి, సాధారణ ప్రజలకు మధ్య నెలకొన్న సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైనికాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. బొల్లారంలో పునర్నిర్మించిన 30 పడకల కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మల్లారెడ్డి.. రోడ్ల మూసివేత, మిలిటరీ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు సీఈవో వ్యవహార శైలి తదితర అంశాలను పరీకర్ దృష్టికి తెచ్చారు. ‘‘కంటోన్మెంట్‌లోని ప్రజలు కొంతకాలంగా భయాందోళనలకు గురవుతున్నారు. మిలిటరీ వాళ్లు రోడ్లను మూసేస్తున్నారు. ఇళ్లు కూల్చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్నట్లుగా పరిస్థితి నెలకొంది. పన్నులు వసూలు చేస్తున్న సీఈవో ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. మసీదు, చర్చిలకు కూడా వెళ్లలేని విధంగా రోడ్లు బంద్ చేయడం ఎందుకు? ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా? పన్ను చెల్లిస్తూ పరాయి వాళ్లలా బతకాలా’’ అని ప్రశ్నించారు. తర్వాత పరీకర్ మాట్లాడుతూ.. ‘‘కంటోన్మెంట్ బోర్డులో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మిలిటరీ దళాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. మిలిటరీ వ్యక్తులు శత్రువులు కాదు. దేశం కోసం పనిచేసే వారికి ప్రశాంత వాతావరణం అవసరం. అదే సమయంలో స్థానికంగా నివసించే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మంత్రి కె. తారకరామారావుతో చర్చించా. త్వరలోనే సమస్యలకు పరిష్కారం కనుగొంటాం’’ అని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రెండో దశకు కంటోన్మెంట్‌లోని రక్షణ భూములు ఇవ్వాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు వేరేచోట భూములు కేటాయించాలన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కంటోన్మెంట్ బోర్డులోని రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని పరీకర్‌ను కోరారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, కనకారెడ్డి, సీఈవో సుజాత గుప్తా, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కంటోన్మెంట్ ఏరియాలో భారీ జలాశయం
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో భారీ జలాశయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సుమారు 1.5 లక్షల గ్యాలన్ల సామర్థ్యం కలిగిన సంపు, లక్ష లీటర్ల ఓవర్‌హెడ్ రిజర్వాయర్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా సర్కారు అంగీకారం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు పాండుయాదవ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, జలమండలి అధికారులు ఇక్రిశాట్ ఫేజ్-2లోని స్థలాన్ని ఇందుకోసం పరిశీలించారు. అంతేకాకుండా ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని ట్రెంచింగ్ గ్రౌండ్ స్థలంలో మరో భారీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. -
పంజాబ్‌లో మళ్లీ కలకలం!
-
పరుగుతో ఆరోగ్యం పదిలం: మల్లారెడ్డి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో బోయిన్ పల్లి ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో 1 కే రన్ నిర్వహించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం సైనికులు సుదీర్ఘ పోరాటం చేసి దక్కించుకున్నారని తెలిపారు. సైనికుల పోరాటానికి తాను సహకారం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవ సంబరాలకు మళ్లీ తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. -
'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
దూకుడు పెంచిన ఆర్మీ అధికారులు
కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సామాన్యుల రాకపోకలను అక్టోబర్ 2 నుంచి రాత్రి వేళల్లో నియంత్రించనున్నట్టు ప్రకటించిన ఆర్మీ అధికారులు.. రెండ్రోజుల ముందే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మారేడ్‌పల్లి నుంచి ఏఓసీకి వెళ్లే మార్గంలోని అలహాబాద్ గేట్ వద్ద, పికెట్- ఏఓసీ మార్గంలో స్టాప్ అండ్ గో బేకరీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలో మీటర్లు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తూతూ మంత్రంగా భేటీ ఆంక్షల అమలు నేపథ్యంలో ఏఓసీ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం సమీప కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం మొక్కుబడిగా ముగిసింది. భేటీకి హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న అభిప్రాయాలను సైతం ఖాతరు చేయకుండా ఆర్మీ అధికారులు తామేమి చెప్పాలనుకున్నారో దానికే పరిమితమయ్యారు. ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కూడిన సివిల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసే వరకు రాత్రివేళల్లో సైతం రోడ్లను మూసేయొద్దని ఎంపీ, ఎమ్మెల్యే పదేపదే కోరినా అర్మీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి, సాయన్న సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో ప్రజలు సైతం వారిని అనుసరించారు. బాబుతో ఒత్తిడి తెప్పిస్తా: మల్లారెడ్డి సమస్యను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త
- బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో భోజనం, టిఫిన్ - వెల్లడించిన మంత్రి హరీష్‌రావు - ఉన్నతాధికారులతో కలిసి మార్కెట్ పరిశీలన - సమస్యల పరిష్కారంపై అక్కడికక్కడే సమీక్ష కంటోన్మెంట్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అయితే ఇది నగరం మొత్తం కాదండోయ్..నగరం చుట్టుపక్కల ఆయా ప్రాంతాల నుంచి ఎంతో శ్రమించి కూరగాయలు తీసుకొచ్చే రైతులు,హమాలీల కోసం బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో టిఫిన్ ,భోజనం అందించనున్నారు. ఈమేరకు త్వరలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మరోమంత్రి పద్మారావు,మార్కెటింగ్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం మార్కెట్‌ను సందర్శించిన ఆయన సుమారు 3గంటలపాటు కలియతిరిగారు. ప్రతీ సమస్యను నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరుగా షాపుల వద్దకు చేరుకుని మార్కెట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు,రిటైల్ విక్రేతలతో మాట్లాడారు. ధరల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా హామాలీలు ప్రధానంగా క్యాంటీన్ సమస్యను మంత్రి ద ృష్టికి తీసుకొచ్చి సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, క్యాంటీన్, నిరుపయోగంగా ఉన్న రైతుల రెస్ట్‌రూమ్‌లను పరిశీలించారు. అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతులు, హమాలీలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో త్వరలో రూ.3 అల్పాహారం, రూ.5కే భోజనాన్ని అందిస్తామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇలాంటి విధానంపై అధ్యయనం చేసి అతిత్వరలో మార్కెట్‌యార్డులోనూ సబ్సిడీతో కూడి న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బినామీ పేర్ల మీద నడుస్తున్న దుకాణాలు, కేటాయింపు జరిగినా రోడ్డుపైనే క్రయ,విక్రయాలు సాగిస్తున్న 39 దుకాణాల అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధరల నియంత్రణపై దృష్టి : కూరగాయ ల ధరల నియంత్రణకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పలురకాల కూరగాయలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున..వాటి ధరల్ని రాష్ట్రస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆయాశాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీభాయి తదితరులున్నారు. -
కంటోన్మెంట్లో సెల్ మోగదా!
టవర్ఫ్రీ జోన్‌కు అధికారుల యోచన నిబంధనలు, భద్రత పేరుతోమరో వివాదాస్పద అడుగు కేవలం బీఎస్ఎన్ఎల్ టవర్లకే అనుమతిచ్చే యోచన హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మళ్లీ ల్యాండ్లైన్ల కాలం రానుందా? నిత్యావసరంగా మారిపోయిన సెల్‌ఫోన్‌ను అక్కడ ఇక వదిలేయాల్సిందేనా? మిలటరీ అధికారుల విపరీత ఆలోచనలు చూస్తుంటే అదే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది! నిబంధనలు, భద్రతా కారణాల్ని సాకుగా చూపుతూ అధికారులు ఈ దిశగా యోచిస్తున్నారు. కంటోన్మెంట్‌ను టవర్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో పాతకాలం నాటి తమ చట్టాల్ని మార్చుకోవడంపై దృష్టి సారించకుండా.. గుడ్డెద్దు చేనులో పడిందన్న చందంగా అధికారులు వ్యవరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అమలు అత్యంత కష్టసాధ్యమని కొందరు ఉన్నతాధికారులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ గోల? : కంటోన్మెంట్ బోర్డు ఆదాయం పెంపుపై తీవ్రంగా శ్రమిస్తున్న సీఈవో సుజాత గుప్తా దృష్టి సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై పడింది. ప్రస్తుతం కంటోన్మెంట్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఏ ఒక్క సెల్‌టవర్, హోర్డింగ్‌కూ బోర్డు నుంచి అనుమతి లేదు. దీంతో వీటి వివరాలు సేకరించిన బోర్డు అధికారులు వాటిని ఏర్పాటు చేసిన సంస్థలు, యజమానులకు నోటీసులు జారీ చేశారు. తద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించారు. అయితే ఇప్పటికీ ఏ ఒక్కరికీ అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఇందుకు కంటోన్మెంట్ నిబంధనలు అడ్డంకిగా మారడమే కారణమని తెలుస్తోంది. కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 60 వేల నివాసాల్లో కమర్షియల్ అనుమతులు ఉన్నవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని మాత్రమే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశముంది. గిఫ్టెడ్, అన్గిఫ్టెడ్ కాలనీల్లోని రెసిడెన్షియల్ నివాసాలపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లకు అనుమతి లేదు. దీనిపై మిలటరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అసలు కంటోన్మెంట్లో సెల్‌టవర్లను అనుమతించకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టవర్లను ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి? వీటిని ఏ అవసరాలకు, ఎవరు వినియోగిస్తున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. భద్రతా కారణాల రీత్యా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిలటరీ అధికారులు కంటోన్మెంట్‌ను ‘టవర్ ఫ్రీ జోన్’గా మార్చాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో బోర్డు అధికారులు ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్కే అనుమతిచ్చే అవకాశం సెల్‌టవర్లను తొలగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కేవలం బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు అనుమతించే అవకాశముందని తెలుస్తోంది. సెల్టవర్ల యజమానులకు నోటీసులిచ్చాక ఇప్పటివరకు కేవలం బీఎస్ఎన్ఎల్ అధికారులు మాత్రమే కంటోన్మెంట్ అధికారులతో భేటీ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మిలటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగించని విధంగా కేవలం తక్కువ ఫ్రీక్వెన్సీ టవర్లను కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. కంటోన్మెంట్లో మిలటరీ అధికారులు పలు వివాదాస్పద నిర్ణయాలను మొండిగా అమలు చేస్తున్నారని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. రోడ్ల మూసివేత నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. ఈ విషయంలో కోర్టు ఆక్షేపణ తెలిపినా భద్రతా కారణాల పేరుతో తమ నిర్ణయం అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం నామమాత్రం గానే స్పందిస్తుండడంతో అధికారులకు కలసి వస్తోంది. -
మా ఖర్చింతే సార్..!
ఎన్నికల్లో రూ. పది లక్షలు కూడా ఖర్చుకాలేదని లెక్కచూపిన అభ్యర్థులు సాక్షి, సిటీబ్యూరో: మన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.10 లక్షలు కూడా దాటలేదు. అంతేనా అంటే ఇంతకంటే తక్కువే ఖర్చుచేశాం అనే సమాధానమొస్తుంది. ఎన్నికల కమిషనే రూ.28 లక్షల వరకు ఖర్చుచేసుకోవచ్చు అని వెసులుబాటిస్తే మన నాయకులు అంతకంటే తక్కువే ఖర్చుచేశామని అధికారులకు ఖర్చులు చూపించారు. అది ఎంతవరకు నిజమోకానీ నివేదిక మాత్రం అలాగే ఇచ్చారు. నగరం నుంచి పలు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి గెలిచిన అభ్యర్థులు రూ. 28 లక్షలు కాదు కదా అందులో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. అంతెందుకు పది లక్షలు కూడా ఖర్చు చేయని వారు చాలా మందే ఉన్నారు. కేవలం రూ. 3.61 లక్షలతోనే గెలిచిన వారు కూడా ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారికి వారు సమర్పించిన ఎన్నికల ఖర్చులో అంతే చూ పారు మరి. అలా తక్కువ ఖర్చుతో గెలిచిన వారిలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి జి.కిషన్‌రెడ్డి(రూ.3,61,482), కంటోన్మెంట్ నుంచి జి.సాయన్న( రూ. 5,37,614) ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ ఖర్చు చేసిన వారిలో గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ రూ. 13,05,956 ఖర్చు చూపగా, ఆ తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన టి.పద్మారావు రూ. 11,99,430 ఖర్చు చేసినట్లు చూపారు. జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారిలో గెలిచిన వారు.. రెండో స్థానంలో నిలిచిన వారు ఎన్నికల అధికారికి పంపిన సమాచారం మేరకు వారు చేసిన ఖర్చు వివరాలిలా ఉన్నాయి. -
ది ఎండ్..!
ముగిసిన కంటోన్మెంట్ పాలకమండలి గడువు ఏడాది వరకు ఎన్నికలు లేనట్లే..? ‘నామినేటెడ్’ ఎంపికపై ఊహాగానాలు కంటోన్మెంట్,న్యూస్‌లైన్: కంటోన్మెంట్ చట్టం-2006 అమల్లోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఏర్పాటైన తొలి పాలకమండలి గడువు ముగిసింది. పూర్తి ఐదేళ్లతోపాటు, చట్టం అనుమతించిన గరిష్ట పొడిగింపు ఏడాది కలుపుకుని తాజా పాలకమండలి ఆరేళ్లపాటు కొనసాగి ఈనెల 5వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం బోర్డులో అధ్యక్షుడు సునీల్ ఎస్ బోధేతోపాటు, సభ్యకార్యదర్శిగా వ్యవహరించే సీఈవో సుజాతగుప్తా మాత్ర మే మిగిలారు. తదుపరి బోర్డు ఎన్నికలు ఆలస్యమయ్యే నేపథ్యంలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించే నామినేటెడ్ సభ్యుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏడాది వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. యథావిధిగా కొనసాగుతున్న మూడు బోర్డులు: దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ బోర్డులుండగా..పాలకమండలి ఉన్నవి 58 మాత్రమే. నాలుగు కంటోన్మెంట్లలో సామాన్య జనాభా అతితక్కువగా ఉన్నందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేదు. మిల టరీ అధికారుల ఆజమాయిషీలోనే పా లన ఉంటుంది. బోర్డుల ఆధ్వర్యంలో పాలన సాగే మిగతా 58 కంటోన్మెంట్లలో 55 బోర్డుల పదవీకాలం ఈనెల 5తో ముగిసింది. సాధారణంగా కంటోన్మెంట్లలో ప్రతీటా సెప్టెంబర్ 15న తాజా ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. అయితే విద్యాసంవత్సరం ముగింపు, బడ్జెట్ రూపకల్పన సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవచ్చని.. వచ్చే వేసవిలోనే జరగొచ్చని ఆలిండియా కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుల సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి వినోద్మాథూర్వాలా స్పష్టం చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆరేళ్లలో నలుగురు: 2008 మే 18న కొలువుదీరిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలిలో నలుగురు అధ్యక్షులు, నలుగురు ఉపాధ్యక్షులు, నలుగురు సీఈవోలు మారారు. పార్టీ గుర్తుల్లేకుండా 2008లో జరిగిన ఎన్నికల్లో 8మంది సభ్యులు జంపన విద్యావతి, సాద కేశవరెడ్డి, జంపన ప్రతాప్, పి.వెంకట్రావు, అనూరాధ, భానుక నర్మద, పి.శ్యామ్‌కుమార్, జైప్రకాశ్లు ఎన్నికయ్యారు. -
‘టోల్ ’ తీసే దమ్ముందా..?
ఎంపీ అభ్యర్థులకు స్థానికుల సవాల్ ప్రజల పాలిట శాపంగా టోల్‌ట్యాక్స్ వసూళ్లు సొంతూళ్లో పరాయి బతుకులా? కంటోన్మెంట్ వాసుల విస్మయం పుట్టి పెరిగిన ఊరు.. ఏళ్ల తరబడి నివాసం.. కానీ పరాయి వాళ్లలా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి.. ఇదీ కంటోన్మెంట్‌వాసుల కన్నీటి గాధ. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘పన్నులను పటాపంచలు చేస్తాం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం’ అన్న నేతల వాగ్దానాలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయి. అందుకే ఈసారి కంటోన్మెంట్ ప్రజానీకం ఓటడిగేందుకు వచ్చే అభ్యర్థులందరికీ ఓ సవాల్ విసురుతోంది ‘ఈ ఏరియాలో రోడ్లపై పన్నుల వసూళ్లకు ఫుల్స్టాప్ పెట్టే దమ్ముందా?’ అని. కంటోన్మెంట్ ప్రాంతంలోకి వచ్చే సరుకు, రవాణా వాహనాల నుంచి ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ పేరిట పన్ను వసూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కంటోన్మెంట్‌లోని రోడ్లను వినియోగిస్తున్నందుకు గాను టోల్‌ట్యాక్స్, సరుకు రవాణా చేస్తున్నందుకు ఆక్ట్రాయ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ వసూళ్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. 2013-14 సంవత్సరాలకు గాను ఈ వసూళ్ల కాంట్రాక్టును ఆయా కాంట్రాక్టర్లు రూ.11 కోట్లకు దక్కించుకున్నారు. అంటే వారు కంటోన్మెంట్ బోర్డుకు రూ.11 కోట్లు చెల్లించి కంటోన్మెంట్ చుట్టూరా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వసూళ్లు చేసుకునే హక్కు సాధించారు. వీరు కనిష్టంగా ఏడాదికి రూ.30 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నేతల హామీలేమయ్యాయి? కంటోన్మెంట్ ప్రజల పాలిట శాపమైన ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయిస్తానని స్థానిక ఎంపీ సర్వే సత్యనారాయణ గతంలో పలుమార్లు హామీలిచ్చాడు. ఈ మేరకు బోర్డు కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంపీగా, ఇటీవల కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సర్వే తన పదవీకాలంలో ఎందుకీ హామీ అమలు చేయలేకపోయారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!! పైగా ఈసారి కూడా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికైనా టోల్‌ట్యాక్స్ వసూళ్లపై ఆయన వైఖరిని స్పష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డి, మైనంపలి ఏమంటారో? కంటోన్మెంట్‌కు గుండెలాంటి బోయిన్పల్లి నివాసి అయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డికి ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ వసూళ్ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సొంతప్రాంతం వారి కష్టాలకు ఆయన ఏ భరోసా ఇస్తారోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుకు కంటోన్మెంట్ ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ కాంట్రాక్టరు (ఆయన అనుచరుల పేరిట)గానే ఆయన ఇక్కడి వారికి సుపరిచితులు. ఏళ్ల తరబడి ప్రజల నుంచి కోట్లాది రూపాయల వసూళ్లు చేయడంపై ఓ నేతగా ఆయన ఏం సమాధానం చెబుతారో? ఆయన గెలిస్తే టోల్ ట్యాక్స్‌ను ఎత్తేస్తానని హామీ ఇవ్వగలరా అని స్థానికులు సవాలు విసురుతున్నారు. ఇక కంటోన్మెంట్‌తో అనుబంధం ఉండి మల్కాజిగిరి బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల వైఖరి ఇలా ఉండగా.. పోలీస్‌బాస్‌గా పేరొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దినేశ్‌రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో!! -
జగ్గారెడ్డిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు
హైదరాబాద్: కంటోన్మెంట్‌లోని గన్‌రాక్ గార్డెన్లో శనివారం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సెల్ఫోన్లు, ఇతర వస్తువులను పంచిన మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు, మరో ముగ్గురిపై కార్ఖానా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. జగ్గారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 171ఈ, 177బీ, 188 కింద కేసు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం రాబడుతున్నట్టు సీఐ తెలిపారు. -
సిట్టింగ్ రంగ
కాంగ్రెస్ జాబితా.. పదిచోట్ల సిట్టింగ్‌లకే మళ్లీ చాన్స్ దానం, ముఖేష్ పాత స్థానాల నుంచే పోటీ శంకర్రావు, సబితకు దక్కని అవకాశం రాజేందర్, మైనంపల్లికి కలిసిరాని ఫిరాయింపు పాతబస్తీలో కొత్త వారికే టికెట్లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. పాత అభ్యర్థులకే పెద్దపీట వేసింది. గ్రేటర్ పరిధిలోని 24 శాసనసభ స్థానాల్లో పది స్థానాలను.. వాటికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారికే కేటాయించింది. మరో పది చోట్ల పూర్తిగా కొత్త ముఖాలను బరిలోకి దించింది. ఇప్పటికే రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలం కలిగిన వి.హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాన్ని కేటాయించింది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌లో అవకాశమిచ్చింది. మహేశ్వరం, కంటోన్మెంట్ సీట్ల విషయంలో ఒకింత సంచలనానికి తావిచ్చింది. ఈ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ శంకర్రావుకు మొండిచేయి చూపింది. మల్కాజిగిరి సీటును జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నందికంటి శ్రీధర్‌కు కేటాయించింది. ఈ శాసనసభ స్థానం కోసం పోటాపోటీగా టీఆర్ఎస్, టీడీపీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, మైనంపల్లి హన్మంతరావుకు రిక్తహస్తమే మిగిలింది. కూకట్పల్లి స్థానానికి సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరకు ప్రజారాజ్యం నుంచి పాత బోయిన్పల్లి కార్పొరేటర్‌గా గెలిచిన ముద్దం నర్సింహయాదవ్ పేరు ఖరారైంది. ఇక, స్థాన మార్పిడి కోసం యత్నించినా.. దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌కు పాత (ఖైరతాబాద్, గోషామహల్) స్థానాలే దక్కాయి. సికింద్రాబాద్ స్థానం కోసం అనేక మంది పోటీపడ్డా సినీ నటి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ పట్లే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు స్థానాల్లో సిట్టింగ్‌లే మళ్లీ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. ఉప్పల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డికి కేటాయించారు. శంకర్రావు, సబితలకు నో ఛాన్స్ అనేక వివాదాలు, విచిత్రకరమైన వ్యవహారశైలికి కేరాఫ్‌గా నిలిచే డాక్టర్ పి.శంకర్రావుకు టికెట్ దక్కలేదు. తనకు బదులు తన కుమార్తె సుష్మిత పేరైనా పరిశీలించాలని ఆయన చేసిన విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోలేదు. ‘ఒక కుటుంబం- ఒక సీటు’ నినాదం దరిమిలా.. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డికి ఎక్కడి నుంచీ అవకాశం ఇవ్వకుండా, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ కేటాయించింది. మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుటుంబ సభ్యులకూ అవకాశం కల్పించలేదు. ముషీరాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న అంజయ్య సతీమణి మణెమ్మ తనకు బదులు కుమారుడు శ్రీనివాసరెడ్డికి అవకాశమివ్వాలని చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. నాంపల్లి, కార్వాన్లలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన వినోద్, రూప్సింగ్లకు ఈసారీ అవకాశం దక్కగా, మలక్‌పేటలో 1986లో కార్పొరేటర్‌గా గెలిచిన దూదిపాల వెంకటనర్సింహారెడ్డికి టికెట్ కేటాయించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా స్థానాల్లో కొత్త వారిని రంగంలోకి దించారు. అభ్యర్థి పేరు:వి. హనుంతరావు తల్లిదండ్రులు: కోటమ్మ, లక్ష్మయ్య పుట్టిన తేదీ: 16.6.1948 విద్యార్హతలు: బీఏ కుటుంబం: భార్య, ముగ్గురు కుమార్తెలు రాజకీయ నేపథ్యం: 1974 నుంచి 78 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. 1982-83లో బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా,1990-92 పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1992 నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. పేరు: ఎం.ముఖేష్‌గౌడ్ తల్లిదండ్రులు: నర్సింహాగౌడ్, లలిత వయసు: 55 ఏళ్లు కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె రాజకీయ నేపథ్యం: 1985లో జాంబాగ్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1989లో మహరాజ్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో 150 ఓట్ల తేడాతో ఓటమి. 1999లో మరోసారి ఓటమి. 2004లో మహరాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహాల్ నుంచి గెలుపు. అభ్యర్థి పేరు:మర్రి శశిధర్‌రెడ్డి తండ్రి: మర్రి చెన్నారెడ్డి వయసు: 59 ఏళ్లు చదువు: ఎంఎస్ కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు చిరునామా: లాలాగూడ, సికింద్రాబాద్. రాజకీయ నేపథ్యం: 1992లో తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 1999లో శ్రీపతి రాజేశ్వర్ (టీడీపీ) చేతిలో ఓటమి. 2004, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: పి.విష్ణువర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు: పి.జనార్ధన్‌రెడ్డి, ఇందిర విద్యార్హత: పాలిటెక్నిక్ నివాసం: దోమలగూడ కుటుంబం: భార్య, ఓ కూతురు రాజకీయ నేపథ్యం: తండ్రి పి.జనార్ధన్‌రెడ్డి మరణానంతరం విష్ణువర్ధన్‌రెడ్డి ఉప ఎన్నికలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందా రు. నియోజకవర్గాల పునర్విభజనలో భా గంగా 2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తండ్రి: జయచంద్రారెడ్డి కుటుంబం: భార్య, ఇద్దరు కొడుకులు పుట్టిన తేదీ: 27-7-1962 విద్యార్హత: బీఏ రాజకీయ నేపథ్యం: 1980లో కాంగ్రెస్ పార్టీ లో చేరిక. 1986 నుంచి 2004 వరకు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, నగర కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శిగా, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004-2008 మధ్య హుడా చైర్మన్‌గా, 2009లో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: మారబోయిన భిక్షపతి యాదవ్ తండ్రి: సందయ్య పుట్టిన తేదీ: 6-1-1956 విద్య: మెట్రిక్యులేషన్ కుటుంబం: భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు రాజకీయ నేపథ్యం: 1970లో కొండాపూర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం శేరిలింగంపల్లి మున్సిపల్ చైర్మన్, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, శేరిలింగంపల్లి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభ్యర్థి పేరు: బండారి లక్ష్మారెడ్డి తండ్రి: జంగారెడ్డి పుట్టిన తేదీ: 27 నవంబర్ 1967 విద్యార్హత: బి.కామ్ చిరునామా: సైనిక్‌పురి, కాప్రా. రాజకీయ నేపథ్యం: ఉప్పల్ సిట్టంగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డికి ఇతను సోదరుడు. జేఎన్టీయూ హెచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అభ్యర్థి పేరు: ముద్దం నర్సింహ యాదవ్ పుట్టిన తేదీ: 31.12.1969 చదువు: 5వ తరగతి కుటుంబం: భార్య,కొడుకు తల్లిదండ్రులు: శంకరయ్య, లక్ష్మమ్మ రాజకీయ నేపథ్యం: కూకట్పల్లి మున్సిపాలి టీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. ప్రజారాజ్యం ఆవిర్భాంతో అందులో చేరారు. 2009లో ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గ్రేటర్ లో పీఆర్పీ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఈయనే. అభ్యర్థి పేరు:నందికంటి శ్రీధర్ పుట్టిన తేదీ: 2-9-1972 విద్యార్హత: బీకామ్ కుటుంబం: భార్య, ఇద్దరు పిల్లలు రాజకీయ నేపథ్యం: అల్వాల్ యూత్ కాం గ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 2000-2005 కౌన్సిలర్‌గాను, ప్రస్తుతం గ్రేటర్ కో ఆష్షన్ సభ్యులుగా ఉన్నారు. మల్కాజిగిరి సీటు హాట్ ఫేవరెట్‌గా మారిన క్రమంలో ఈయన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అభ్యర్థి పేరు: కె.వెంకటేశ్ తండ్రి: ప్రకాశ్ పుట్టిన తేదీ: 9-8-1970 విద్యార్హత: బీకామ్ కుటుంబం: భార్య, కుమారుడు, కుమార్తె రాజకీయ నేపథ్యం: 2006లో ఆంధ్రప్రదేశ్ రాజీవ్ సేవా సమితిని స్థాపించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అభ్యర్థి పేరు: బి.ఆర్.సదానంద్ ముదిరాజ్ తండ్రి: డి.రాములు పుట్టిన తేదీ: 22-6-1976 విద్యార్హత: బీఏ కుటుంబం: భార్య, కూతురు రాజకీయ నేపథ్యం: 1988 నుంచి పార్టీలో క్రీయాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్ఎస్యూఐ గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఫలక్‌నుమా డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయుసీ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అభ్యర్థి పేరు: సయ్యద్ అబ్దుల్ సమీ (అత్తర్) తండ్రి : అబ్దుల్ హమీద్ పుట్టిన తేదీ : 11-6-1971 విద్యార్హత : బీకామ్ కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు రాజకీయ నేపథ్యం: 2002లో కాంగ్రెస్‌లో చేరారు. 2003లో బహదూర్‌పురా నియోజకవర్గం మైనార్టీ కో-ఆర్డినేటర్‌గా, 2005లో కాంగ్రెస్ గ్రేటర్ కమిటీ వైస్ చైర్మన్‌గా, రాజేంద్రనగర్ డిపో ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అభ్యర్థి పేరు: దూదిపాల వెంకట నర్సింహారెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, అనసూయదేవి పుట్టిన తేదీ: 11-1-1955 విద్యార్హతలు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కుటుంబం: భార్య హేమలత, ఇద్దరు కుమారులు రాజకీయ నేపథ్యం: 1977 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. 1986లో మూసారంబాగ్ కార్పొరేటర్‌గా అటు తరువాత యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అభ్యర్థి పేరు: బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తండ్రి: వెంకటస్వామి పుట్టిన తేదీ: 27-05-1964 విద్యార్హత: బీఏ రాజకీయ నేపథ్యం: 1991-97 వరకు రాజేంద్రనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో బండ్లగూడ గ్రామ జాగీర్ సర్పంచ్, నార్సింగ్ వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అభ్యర్థి పేరు: దానం నాగేందర్ తండ్రి: లింగమూర్తి పుట్టిన తేదీ: 9 ఆగస్టు 1958 విద్యార్హత: ఎంఏ నివాసం: బంజారాహిల్స్ రాజకీయ నేపథ్యం: మూడుసార్లు ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా, 2009లో ఖైరతాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ సీటు దక్కిన సిట్టింగ్‌లు.. దానం నాగేందర్= ఖైరతాబాద్ ముఖేష్‌గౌడ్ =గోషామహల్ మర్రి శశిధర్‌రెడి= సనత్‌నగర్ విష్ణువర్ధన్‌రెడ్డి =జూబీహిల్స్ జయసుధ= సికింద్రాబాద్ సుధీర్‌రెడ్డి =ఎల్బీనగర్ భిక్షపతియాదవ్= శేరిలింగంపల్లి కూన శ్రీశైలంగౌడ్= కుత్బుల్లాపూర్ నందీశ్వర్‌గౌడ్= పటాన్చెరు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి =మేడ్చల్ వీరికి తొలిసారి పోటీకి అవకాశం బండారి లక్ష్మారెడ్డి- ఉప్పల్ ఎం.నర్సింహయాదవ్- కూకట్పల్లి నందికంటి శ్రీధర్- మల్కాజిగిరి వినయ్‌కుమార్- ముషీరాబాద్ క్రిషాంక్- కంటోన్మెంట్ అశ్విన్‌రెడ్డి- చాంద్రాయణగుట్ట కె.వెంకటేష్- చార్మినార్ సదానంద్ ముదిరాజ్ -యాకుత్‌పురా అబ్దుల్ సమీ- బహదూర్‌పురా డీవీఎన్‌రెడ్డి- మలక్‌పేట గతంలో పోటీ.. మళ్లీ చాన్స్.. రూప్సింగ్= కార్వాన్ వినోద్‌కుమార్= నాంపల్లి జ్ఞానేశ్వర్ ముదిరాజ్= రాజేంద్రనగర్ వి.హన్మంతరావు= అంబర్‌పేట మహేశ్వరం= సీపీఐ -
కంటోన్మెంట్‌పై ప్రభావం నిల్
కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లినప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం పాలన యథావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అధికారుల పర్యవేక్షణలో పాలన సాగే కంటోన్మెంట్లో రాష్ట్రప్రభుత్వ పాత్ర చాలా పరిమితం. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదని కంటోన్మెంట్ పెద్దలు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా అటానమస్ పద్ధతిలోనే పాలన కొనసాగుతుందని కంటోన్మెంట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) సుజాత గుప్తా స్పష్టం చేశారు. పాలనపై ప్రభావం ఉండదు కంటోన్మెంట్లో అభివృద్ధి పనులన్నీ బోర్డు ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. నెలకోసారి జరిగే ఈ సమావేశంలో అభివృద్ధి పనుల ప్రణాళిక, వివిధ టెండర్లు, ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, వినియోగం తదితర అంశాలన్నింటికీ బోర్డు ఆమోదం ఉంటే సరిపోతుంది. అధికార యంత్రాంగం సైతం పూర్తిగా బోర్డు ఆదీనంలో పనిచేస్తుంది. కంటోన్మెంట్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తంలో పాలనాపరంగా అమలయ్యే ఆంక్షలు కంటోన్మెంట్లో వర్తించవని పరిశీలకులు పేర్కొంటున్నారు. అటానమస్గానే కొనసాగుతుంది కంటోన్మెంట్ ప్రాంతాల్లో పాలన మొదటి నుంచి భిన్నంగానే ఉంటుంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనలు ఏమీ ఉండవు. గతంలో మాదిరిగానే అటానమస్‌గా పాలన కొనసాగుతుంది. బోర్డు సమావేశాలు, నిర్ణయాలు యథావిధిగానే కొనసాగించే వెసులుబాటు ఉంటుంది. - సుజాత గుప్తా, సీఈఓ ముందు నుంచీ కేంద్రం పాలనే కంటోన్మెంట్ ప్రాంతం ముందు నుంచీ కేంద్రం ఆధీనంలోనే కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలన అమలయ్యే ప్రాంతాలు కేంద్రం ఆధీనంలోకి వెళతాయి. అంటే రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కొత్తగా కంటోన్మెంట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. రాష్ట్రప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలపై మాత్రం దీని ప్రభావం ఉండొచ్చు. బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నా. కంటోన్మెంట్లో రహదారులపై మిలట్రీ అధికారులు ఆంక్షలు విధించకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల మూసివేతపై మిలట్రీ అధికారులు, పౌరులతోపాటు బోర్డు సభ్యులు, నగర పోలీస్, ట్రాఫిక్ విభాగం ప్రతినిధులతో క మిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకువాలని అభిప్రాయపడ్డారు. - జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు, వైఎస్సార్ సీపీ నేత -
ఆర్మీ ఆంక్షలపై నిరసన
రోడ్ల మూసివేతపై భగ్గుమంటున్న జనం పోరాట మార్గాలపై మల్లగుల్లాలు ప్రజలకు వ్యతిరేకం కాదంటున్న మిలటరీ అధికారులు ప్రత్యామ్నామ మార్గాలు లేక జనం సతమత ం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సాధారణ వాహనాల రాకపోకల్ని నిషేధిస్తూ మిలటరీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై చుట్టుపక్కల కాలనీల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాత్రివేళల్లో ఆంక్షల్ని అమలు చేస్తున్న మిలటరీ అధికారులు పగటిపూట కూడా ఆంక్షల్ని ఆరంభిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆర్మీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా వివిధ వర్గాలు, పార్టీలు, అసోసియేషన్లు ఎవరికి వారు తమదైన శైలిలో పోరాటాలు ఆరంభించారు. వినతులు, విజ్ఞప్తులు, నిరసనలతో పాటు కోర్టు ద్వారా కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రధానంగా సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి వచ్చేరోడ్డు మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే మల్కాజ్గిరి, ఉప్పల్ నియోజకవర్గాల ప్రజలు ఉద్యమానికి సైతం సిద్ధమవుతున్నారు. వీరికి కంటోన్మెంట్ ప్రజలు కూడా తోడైతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆర్మీ పాలనలోని కంటోన్మెంట్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యులు సైతం మిలటరీ అధికారులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. గతంలో కంటోన్మెంట్ నిధులతో అభివృద్ధి చేసిన రోడ్లపైకి సాధారణ పౌరుల రాకపోకల్ని ఎలా నిషేధిస్తారంటూ ఇటీవల బోర్డు సమావేశంలో సీనియర్ బోర్డు సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు జంపన ప్రతాప్, వెంకట్రావులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా మిలటరీ అధికారుల వాదన మరోలా ఉంది. కంటోన్మెంట్లో పెరిగిపోయిన ట్రాఫిక్ వల్ల తమ శిక్ష ణ కార్యకలాపాలు, ఇతరత్రా విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, భద్రత పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో కంటోన్మెంట్ పరిధిలో సాధారణ పౌరులు, మిలటరీ సిబ్బం ది మధ్య ఉండాల్సిన పరస్పర సహకారం, బాధ్యతలు, విధులు, హక్కుల అంశాలు చర్చనీయాంశమయ్యాయి. కంటోన్మెంట్ విభిన్నం సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీబీ) చాలా భిన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన ఎస్సీబీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కంటోన్మెంట్. మొత్తం 10వేల ఎకరాల్లో మూడు భాగాలుగా విస్తరించిన ఎస్సీబీ పరిధిలో సుమారు 6వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. 3 వేల ఎకరాల పరిధిలో కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతం ఉంది. మిగతా వెయ్యి ఎకరాల్లో బేగంపేట ఎయిర్‌పోర్టు, బీ-3, బీ-4 కేటగిరీ స్థలాలున్నాయి. ఏళ్ల తరబడి కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల (ఇప్పుడు జీహెచ్ఎంసీలో భాగమయ్యాయి) ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ రోడ్లను వినియోస్తూ వచ్చారు. గత పదేళ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందనే కారణంతో వివిధ రోడ్లపై సివిలియన్ల రాకపోకలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. మల్కాజ్‌గిరికి తెగనున్న లింక్ మిలటరీ అధికారుల తాజా ఆంక్షల్లో ప్రధానంగా సఫిల్‌గూడ నుంచి మారేడ్‌పల్లి/ సికింద్రాబాద్ క్లబ్‌కు దారితీసే రోడ్డు మూతతో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు కంటోన్మెంట్‌తో లింక్ తెగిపోతుంది. దీంతో సివిలియన్ ప్రాంతాలకు ఆనుకుని సాగే ఈ రోడ్డుపైనైనా రాకపోకల్ని అనుమతించాలని పలువురు కోరుతున్నారు. ఆర్కేపురం- తిరుమలగిరి రోడ్డు మాదిరిగానే ఈ మార్గాన్ని కొనసాగిస్తే మెజారిటీ ప్రజల సమస్య తీరినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. కాలనీల ప్రతినిధులతో చర్చలు: ఆర్మీ ఈ విషయమై మార్చి 2న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ సమీప కాలనీ ప్రతినిధులతో చర్చించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మీ శిక్షణ సంస్థలకు ఇబ్బందులు కలగని రీతిలో ఆర్మీ రోడ్లను వినియోగించే అంశాన్ని చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో స్థానిక సంస్థల అధికారులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్, పోలీసులతో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. బోర్డు నిధులతోనే నిర్మించాం ఆర్మీ కంటోన్మెంట్‌లోని పలు రోడ్లను సివిలియన్ కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి చేశాం. కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఒక్కొక్కటిగా రోడ్లు మూసివేస్తూ వస్తున్నారు. దీంతో సమీప కాలనీలతో కంటోన్మెంట్ ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అందాల్సిన సర్వీసు చార్జీలు సకాలంలో అందడం లేదు. తాజాగా ఈ బకాయిలు రూ.315 కోట్లకు చేరాయి. ఈ నిధుల్ని అందిస్తే అంతర్గతంగా రోడ్లను విస్తరించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. - జంపన ప్రతాప్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు కచ్చితమైన సమాచారం లేదు కంటోన్మెంట్ పరిధిలో ఏయే రోడ్లు బోర్డు పరిధిలోకి వస్తాయి? ఏ రోడ్లు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) పరి ధిలోకి వస్తాయనే పక్కా సమాచారం బోర్డులో అందుబాటులో లేదు. ఆర్కే పురం- తిరుమలగిరి మధ్య ఉన్న మార్గం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) అజమాయిషిలో ఉన్నట్లు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేశారు. తాజాగా ఆంక్షల నేపథ్యంలో రోడ్లపై విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంతర్గత రోడ్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. - సుజాత గుప్తా, కంటోన్మెంట్ సీఈఓ న్యాయపోరాటం చేస్తాం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సాధారణ ప్రజలు వినియోగిస్తున్న రోడ్లను అర్ధంతరంగా మూసివేయ డం సరికాదు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తాం. కొంత కాలంగా ప్రజలు ఉపయోగిస్తున్న రోడ్లను సహేతుక కారణాలు లేకుండా మూసివేయం ఈజ్మెంట్ రైట్‌కు భంగం కలిగించడం అవుతుంది. ఈ కోణంలోనూ మా పోరాటాన్ని కొనసాగిస్తాం. - రమణ, సీనియర్ అడ్వకేట్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉద్యమం చేస్తాం కంటోన్మెంట్లో ఆర్మీ ఆంక్షలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సివిలియన్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీ (ఎంసీహెచ్)లో విలీనం చేయాలని 1998లో స్థానిక ఎమ్మెల్యేగా తీవ్ర ప్రయత్నం చేశాను. ఇందుకు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలోని రక్షణ శాఖ మంత్రి కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ, స్థానిక బోర్డు సభ్యులు సహకరించలేదు. రోడ్లపై ఆంక్షల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రజా ఉద్యమంతో పాటు, న్యాయపోరాటం కూడా చేస్తాం. - సాయన్న, మాజీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఆంక్షలొద్దు: హైకోర్టు ఆదేశం కంటోన్మెంట్ పరిధిలో రక్షణాధికారుల ఆంక్షల వల్ల ఇబ్బం దులు పడుతున్న సాధారణ ప్రజానీకానికి హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఎటువంటి ఆంక్షలు విధించకుండా వాహనాల రాకపోకలను అనుమతించాలని రక్షణ మంత్రిత్వశా ఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రక్షణశాఖాధికారులు భద్రతను కారణంగా చూపుతూ పలు రహదారులను మూసివేశారని, దీని వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎటువంటి ఆంక్షలు లేకుండా వాహనాల రాకపోకలకు అనుమతిని మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ మల్కాజిగిరి నియోజకవర్గ కోఆర్టినేటర్ గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన బి.కృష్ణవిజయారావులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. కంటోన్మెంట్ రోడ్లపై వాహనదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలను తదుపరి విచారణ నిమిత్తం మార్చి 6కి వాయిదా వేశారు. ఆంక్షలు వద్దని కోర్టు పేర్కొన్న మార్గాలివీ... ఎంట్రన్స్రోడ్ : ఎస్పీ రోడ్డు, ఈస్ట్ మారేడ్‌పల్లి నుంచి అలహాబాద్ గేట్ వెల్లింగ్టన్రోడ్ : సికింద్రాబాద్ క్లబ్ నుంచి అలహాబాద్రోడ్. ఆర్డినెన్స్ రోడ్ : సఫిల్‌గూడ జంక్షన్ నుంచి మార్నింగ్టన్ రోడ్ : తిరుమలగిరి హనుమాన్ దేవస్థానం నుంచి గాఫ్ రోడ్. గాఫ్ రోడ్ : కేంద్రీయ విద్యాలయ క్రాసింగ్ నుంచి ఈస్ట్, వెస్ట్ మారేడ్‌పల్లి గత పదేళ్లలో మూతపడిన ప్రధాన రహదారులు బొల్లారం నుంచి బాలాజీనగర్, భవన్స్ కాలేజీ మీదుగా సైనిక్‌పురి వేళ్లే మార్గాన్ని ఏడేళ్ల క్రితం మూసేశారు. శామీర్‌పేట నుంచి రహదారి నుంచి నేరుగా ఈసీఐఎల్ వైపు వెళ్లే వారు ఈ మార్గాన్నే ఉపయోగించేవారు. ఈ రోడ్డు మూసివేతతో బొల్లారం- కౌకూరు- యాప్రాల్ మీదుగా బాలాజీనగర్ చేరుకోవాల్సి వస్తోంది. బోయిన్పల్లి చెక్‌పోస్టు సమీపంలోని నందమూరి నగర్ నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీలకు ఉన్న రహదారిని ఐదేళ్ల క్రితం మూసేశారు. దీంతో ఒకటిన్నన కిలోమీటరు దూరంలోనే ఉన్న ఆయా కాలనీలకు చేరుకోవాలంటే ప్రస్తుతం సుచిత్ర జంక్షన్ నుంచి లేదా, బాలానగర్-ఐడీపీఎల్ -చింతల్ మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చర్యల వల్ల కంటోన్మెంట్‌కు కుత్బుల్లాపూర్‌కు ఉన్న లింక్ దాదాపుగా తెగిపోయింది. బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రహదారి ఆర్మీ ఈగల్ స్టాట్యూ నుంచి నేరుగా బాలాజీనగర్- భవన్స్ మార్గాలకు చేరేందుకు అనువుగా ఉండేది. మూడేళ్ల క్రితం ఈ రోడ్డు మూతతో అల్వాల్- లోతుకుంట- మల్లారెడ్డినగర్- రాష్ట్రపతినిలయం మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. రామకృష్ణాపురం ఫ్లైఓవర్ నుంచి తిరుమలగిరి చౌరస్తాకు వచ్చే మార్గంలోని కుడివైపు రోడ్లలోని పలు సబ్ రోడ్లను దశలవారీగా మూసేస్తూ వచ్చారు. తాజాగా ఈ మార్గంలో ఎడమవైపు (కేంద్రీయ విద్యాలయం చౌరస్తా నుంచి ఏఓసీకి వెళ్లే రోడ్డు) మార్గాన్ని మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం నుంచి, సికింద్రాబాద్ క్లబ్/ పికెట్ నుంచి ఈస్మారేడ్పల్లి/ ఎస్పీరోడ్డు నుంచి, సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి ఏఓసీకి దారి తీసే మార్గాలన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. -
నేటి నుంచి దారి బంద్
కంటోన్మెంట్,న్యూస్‌లైన్: ప్రజావసరాలు, ఆందోళనల్ని ఏమాత్రమూ ఖాతరు చేయని ఆర్మీ అధికారులు తమ పని కానిచ్చేస్తున్నారు. తమ పరిధిలోని రోడ్లపై ఆంక్షల అమలుకు రంగం సిద్ధంచేస్తున్నారు. కంటోన్మెంట్‌లోని ఏవోసీ సెంటర్ నుంచి వెళ్లే రోడ్లపై మంగళవారం (25వ తేదీ) రాత్రి నుంచి సాధారణవాహనాల రాకపోకల్ని నిషేధించనున్నారు. మార్చి 10 నుంచి ఆర్మీ మినహా ఇతర వాహనాల రాకపోకల్ని అనుమతించరు. దీంతో ఇంతకాలం కంటోన్మెంట్ నుంచి మారేడుపల్లి, సికింద్రాబాద్ క్లబ్ మార్గాల్లో నగరంలోకి ప్రవేశించే మల్కాజిగిరి, సఫిల్‌గూడ, ఈసీఐఎల్, ఆర్కేపురం, ఏఎస్‌రావునగర్, మౌలాలి, సైనిక్‌పురి, కుషాయిగూడ తదితరప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పవు. ఇకనుంచి వీరు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయడంతోపాటు అధిక సమయం వెచ్చించక తప్పదు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న తిరుమలగిరి చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు మూడింతలు పెరుగనున్నాయి. రోడ్ల మూసివేతను నిరసిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా ఆందోళనలకు సిద్ధమవుతుండగా ప్రజాప్రతినిధులు మాత్రం కేవలం ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. సివిలియన్ కంటోన్మెంట్ నిధులతో వేసిన రోడ్లను తమ అనుమతి లేకుండా ఎలా మూస్తారంటూ బోర్డు సభ్యులు ప్రగల్భాలకు పోతున్నప్పటికీ, రోడ్లమూసివేతపై వారికి కనీస సమాచారం కూడా ఇవ్వకపోడం గమనార్హం. ఈ మేరకు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని బోర్డు సీఈవో సుజాతగుప్తా వెల్లడించారు. మూసివేసే మార్గాలివే... 1. సికింద్రాబాద్క్లబ్, పికెట్/వెస్ట్‌మారేడుపల్లి నుంచి వెల్లింగ్టన్రోడ్డులో ఏవోసీ సెంటర్ ఏవోసీ సెంటర్‌కు అనుమతి ఉండదు. 2. ఈస్ట్‌మారేడుపల్లి/ఎస్పీ రోడ్డు నుంచి ఏవోసీకి వెళ్లే మార్గం 3. సఫిల్‌గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏఓసీ ద్వారా సికింద్రాబాద్క్లబ్/ఈస్ట్‌మారేడ్‌పల్లికి వచ్చేమార్గం (మల్కాజిగిరి నుంచి కంటోన్మెంట్‌లోకి ప్రాంతంలోకి దారితీసే ఏకైక మార్గమదే). ఆయా మార్గాల్లో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8.00 గంటల మధ్య సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. మార్చి 10 నుంచి పూర్తిగా అనుమతించరు. ఎవరెవరికి ఇబ్బందులు.. 1 సఫిల్‌గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏవోసీ మార్గంలో మారేడుపల్లి/సికింద్రాబాద్ క్లబ్ మధ్య దూరం 2 కి.మీ., ప్రయాణ సమయం 5 నుంచి 10 నిమిషాలు (మధ్యలో ఎలాంటి సిగ్నళ్లు లేవు) ప్రత్యామ్నాయ మార్గం: సఫిల్‌గూడ-మల్కాజిగిరి-తుకారంగేట్-అడ్డగుట్ట-మారేడుపల్లి దూరం : 6 కి.మీ., ప్రయాణ సమయం: 40 నిమిషాలు 2. ఆర్కేపురం బ్రిడ్జి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి- ఏవోసీ మార్గంలో నేరుగా మారేడుపల్లికి చేరుకుంటున్నారు. ఈ మార్గం మూసివేస్తే తప్పనిసరిగా తిరుమలగిరి చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఇరుకైన రోడ్లు కారణంగా ఈ చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్జామ్లవుతున్నాయి.ఆర్మీ కంటోన్మెంట్లో రోడ్లపై ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ మార్గంలో వెళ్లే వాహనాలు తిరుమలగిరి చౌరస్తా నుంచి వెళ్లాల్సి వస్తుంది. సిగ్నల్ దాటాలంటే కనీసం అరగంట వేచి ఉండక తప్పదు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు తిప్పలే.. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు పెద్దసంఖ్యలో కంటోన్మెంట్ చుట్టుపక్కల కాలనీల్లో స్థిరపడ్డారు. వీరంతా నగరానికి వెళ్లాలంటే కంటోన్మెంట్ రోడ్ల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి సామాన్యులు కూడా ఈ రోడ్లను వినియోగిస్తున్నప్పటికీ, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అఖిలపక్షం ద్వారా అభిప్రాయం సేకరించి రోడ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలి. - జి.రమణారెడ్డి, ఏపీసీసీ ఎక్స్‌సర్వీస్‌మెన్ విభాగం కన్వీనర్ -
‘కంటోన్మెంట్’ బడ్జెట్ రూ.217 కోట్లు
కంటోన్మెంట్, న్యూస్‌లైన్: 2013-14 వార్షిక బడ్జెట్‌కు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.217 కోట్ల బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. బోర్డు అధ్యక్షుడు సునీల్ బీ బోదే అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఉ పాధ్యక్షుడు కేశవరెడ్డి, సభ్యులు జంపన విద్యావతి, జంపన ప్రతాప్, వెంకట్రావు, అనూరాధ, భానుక నర్మద, పి.శ్యామ్‌కుమార్, జైప్రకాశ్, నామినేటెడ్ సభ్యులు, బోర్డు అధికారులు పాల్గొన్నారు. బోర్డు పరిధిలో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.55 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని సభ్యులు కోరారు. జలమండలికి బోర్డు బకాయి పడ్డ రూ.55 కోట్లను చెల్లించేందుకు వీలు గా ఈ గ్రాంటును కోరారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వార్షిక బడ్జెట్ రూ.29 కోట్లు అధికం. బోర్డు ఉపాధ్యక్షుడిపై అవిశ్వాసం కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు కేశవరెడ్డికి పదవీ గండం వచ్చి పడింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు శుక్రవారం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బోర్డు సభ్యురాలు అనూరాధ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా జైప్రకాశ్, వెంకట్రావు, జంపన ప్రతాప్, జంపన విద్యావతి, భానుక నర్మద సంతకాలు చేసి సమావేశం ముగింపులో అధ్యక్షుడు సునీల్ బోదేకు అందించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఈఓ సుజాత గుప్తాకు అధ్యక్షుడు సూచించారు. వారం రోజుల్లో బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది.