
న్యూఢిల్లీ: కంటోన్మెంట్ దారుల వెంట సాధారణ ప్రజల రాకపోకలను అనుమతించాలన్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. కంటోన్మెంట్ దారులను తెరవాలన్న నిర్ణయంపై ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులు భద్రతా కారణాల రీత్యా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మీ అధికారుల భార్యలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ సైతం చేపట్టారు. వారితో సమావేశమై సమస్య గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ దారులను తెరవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ల భద్రతకు చేటుచేసే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఓ ఆర్మీ అధికారి కుటుంబ సభ్యుడు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment