హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్‌లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.
ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
మరోవైపు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ నారాయణన్‌లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment