తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ రెండు పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఫలితాల పట్టికలో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోయింది.
మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ ఒక్క మెదక్‌లో మాత్రమే ఆధిక్యంలో కనిపించింది. అది కూడా కేవలం వందల ఓట్లతో మాత్రమే లీడ్‌లో ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రావు, కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు గట్టి పోటీనిస్తున్నారు.
బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బలరాం నాయక్ (మహబూబాబాద్), రామసహాయం (ఖమ్మం), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), రఘువీర్ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మల్లు రవి (నాగర్ కర్నూల్) ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment