Telangana Lok Sabha Elections 2024
-
Telangana: డిపాజిట్టూ గోవిందా!
సాక్షి, హైదరాబాద్: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోకొచ్చే 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో అంతటి విజయాన్ని నమోదు చేయలేకపోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. రాజధాని నగరంతో కలగలసి ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు సంగతి అటుంచి కనీసం రెండోస్థానంలో కూడా లేకుండా పోయారు. అంతే కాదు.. డిపాజిట్ తిరిగి పొందడానికి అవసరమైన కనీస ఓట్లను కూడా పొందలేకపోయారు. దీంతో కారు పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రజలు తమ వెంటే ఉన్నారనుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా గ్రేటర్ నగరంలో తమ పట్టు చెక్కు చెదరలేదని పార్టీ నేతలు భావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించనందుకు ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎక్కువ లోక్‌సభ సీట్లు సాధించడం ద్వారా ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. నగరంలో తాము చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు గెలిపిస్తారని, ఎక్కువమంది ఎంపీల బలంతో ఢిల్లీలోనూ సత్తా చూపుదామని ఉత్తేజపరిచారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సభలకు, కేటీఆర్ రోడ్‌షోలకు హాజరైన ప్రజలను చూసి గెలుపు తమదేనని భావించారు. ఫలితాలను చూసి.. కంగు తిని.. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల బలంతో ఎంపీ సీట్లు కూడా తమకే వస్తాయనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే అసెంబ్లీ నాటి విజయం సంగతి అటుంచి పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం పోలైన ఓట్లలో 1/6 (16.66 శాతం) ఓట్లు లభిస్తే అభ్యర్థులు డిపాజిట్‌గా ఉంచిన నగదు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థులు ఆషామాషాగా పోటీ చేయకుండా ఉండేందుకు డిపాజిట్ జమ చేసుకోవడం తెలిసిందే. డిపాజిట్ పొందడానికి అవసరమైనన్ని ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్‌రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
TG: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ రెండు పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఫలితాల పట్టికలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క మెదక్‌లో మాత్రమే ఆధిక్యంలో కనిపించింది. అది కూడా కేవలం వందల ఓట్లతో మాత్రమే లీడ్‌లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రావు, కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు గట్టి పోటీనిస్తున్నారు.బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బలరాం నాయక్ (మహబూబాబాద్), రామసహాయం (ఖమ్మం), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), రఘువీర్ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మల్లు రవి (నాగర్ కర్నూల్) ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.చదవండి: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్ -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. -
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. -
Telangana: జాలీగా..సరదాగా..
రికార్డు స్థాయిలో తన ఆగ్రహాన్ని చూపించాడు సూరీడు.. అయినా ఓటర్ల అనుగ్రహం కోసం అనుక్షణం తపించారు నేతలు.. స్వేదంతో తడిసి ముద్దవుతున్నా పట్టు సడలకుండా ప్రచారం చేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ పారీ్టల అభ్యర్థులు నచ్చిన వ్యాపకాలతో సేదదీరుతున్నారు. ఫలితాలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో ఆహ్లాదంగా గడపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయా పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలూ ప్రచారంలో పాల్గొని.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మనవరాలితో సరదాగా పద్మారావు గౌడ్ సతీమణి అనిత, మనవరాళ్లతో దానం నాగేందర్ మనవడు ఆహాన్‌తో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అలసిసొలసిన మనసుకు చిన్నారి చిరునవ్వులను మించిన సాంత్వన ఏముంది? అందుకేనేమో.. హైదరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన మనవడు ఆహాన్‌తో ఆటల్లో మునిగిపోయారు. తాను సైతం చిన్న పిల్లాడిలా మనవడితో ఆటపాటల్లో మునిగిపోతూ సోమవారం అంతా సేదదీరారు. సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ సైతం మంగళవారం మొత్తంగా ఇంటికే పరిమితమయ్యారు. రోజుల తరబడి అలుపెరగని ఎన్నికల ప్రచారాన్ని సాగించిన ఆయన మరో మూడు రోజుల్లో ఉత్తరాది పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మనవడు రుద్రాంశ్‌తో రాగిడి లక్ష్మారెడ్డి.. ఈ విరామంలో కుటుంబ సభ్యులతో మనవలు, మనవరాళ్లతో గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా క్షణం తీరిక లేకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లోనే ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మంగళవారం సందడిగా గడిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో.. మనవడు భవనం రుద్రాంశ్, కుమారుడు రాగిడి వెంకటసాయి రియాన్ రెడ్డిలతో కలిసి ఆటలాడుతూ వారితో కలిసి స్విమ్ చేస్తూ రీచార్జ్ అయ్యారు. ప్రచారంలో బిజీగా మారిన సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ముగిసిన తర్వాత మంగళవారం కుటుంబంతో కాస్త రిలాక్స్‌గా కనిపించారు. ఉదయం తన మనవరాళ్లతో ఇంట్లో సరదాగా గడిపారు. పచ్చని పరిసరాల్లో... ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసవి ఎండలను లెక్కచేయకుండా క్షణం తీరిక లేకుండా పనిచేశాం. పోలింగ్ పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కొంత మానసిక ప్రశాంతత అవసరం అని కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. మొక్కల మధ్య పచ్చని పరిసరాల్లో గడుపుతూ పెట్స్‌తో రిలాక్స్ అవుతున్నా.– సునీతా మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిఆరోగ్యంపై దృష్టి.. తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవాలి. మనం ఓటరుకు ఏం చెప్పాలనుకుంటున్నామో వారికి చేరవేయాలనే తపనతో నియోజకరవ్గం మొత్తం కలియతిరిగాను. ఇక ఇప్పుడు ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మానసిక ప్రశాంతత కోసం 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా.అలాగే ఈ టైమ్‌లో ఆరోగ్యంపై దృష్టిపెట్టి తగిన మార్పు చేర్పులు చేసుకుంటున్నా. – రంజిత్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి మనవడు ఆర్యవీర్‌తో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ‘సాక్షి’ పత్రిక చదువుతున్న ఎమ్మెల్యే కాలేరు -
మోకాలి గాయం వేధిస్తున్న.. ఓటేసిన కేకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మోకాలి గాయం వేధిస్తున్న ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకున్నారు రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు. కొద్దిరోజుల క్రితమే ఆయనకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఎన్నికల నాటికి ఆయన బయటికి వచ్చి ఓటు వేస్తారో వేయరు తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఆయన వీల్ చైర్ లో బంజారాహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటింగ్ రోజున ఇచ్చే సెలవుని ఓటు హక్కు కోసం మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
-
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు. -
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్
లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq— ANI (@ANI) May 13, 2024 #WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP— ANI (@ANI) May 13, 2024 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Actor and former Union Minister K Chiranjeevi along with his wife surekha and daughter stand in the queue to cast their vote at Jubilee hills club in Hyderabad #Chiranjeevi @TOIHyderabad #ElectionDay #Hyderabad pic.twitter.com/V0tSJd4wu3— Sudhakar Udumula (@sudhakarudumula) May 13, 2024 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటేసిన మహేశ్‌బాబు, రామ్‌చరణ్.Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..🙂Done! YOU? pic.twitter.com/kQUwa1ADG6— rajamouli ss (@ssrajamouli) May 13, 2024 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఎఫ్ ఎన్ సిసి లో ఓటు వేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కుటుంబ సభ్యులు.. #KRaghavendraRao #ElectionDay pic.twitter.com/OydpOtOBmj— Vamsi Kaka (@vamsikaka) May 13, 2024 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.Senior Versatile actor #KotaSrinivasaRao garu to cast his vote at FNCC pic.twitter.com/VOTzqZJg7W— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.Actor @chay_akkineni cast their vote 🗳️ #Elections2024 #NagaChaitanya pic.twitter.com/wS51UCYnGr— Suresh PRO (@SureshPRO_) May 13, 2024#ManchuManoj exercised his right to vote @HeroManoj1#Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/gX0ciNPiB6— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల pic.twitter.com/hgI4v69IhW— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024 -
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తుండగా.. మంచి స్పందన లభిస్తోంది. ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు) మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. ఆ ఫొటోలను సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు. -
Elections 2024: మొదలైన మాక్ పోలింగ్
హైదరాబాద్, గుంటూరు/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్‌పై బూత్ ఏజెంట్స్‌కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు.ఉదయం 7 గం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. -
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సినిమా ఫక్కీలో ఓ ఇన్నోవా కారును ఛేజ్ చేసి డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలో జరిగే అవకాశం ఉంది. డబ్బు తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు. -
Telangana: సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్‌లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్ జరగనుంది.తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ నారాయణన్‌లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు.