
పాత బస్తీలో మాధవీలతను అడ్డుకున్న యువకులు.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు.
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్‌లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు.