madhavi latha
-
నటి మాధవీలతపై కేసు నమోదు
-
మాధవీలతపై కేసు.. ‘జేసీ’ ఆదేశాలతోనే..?
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. -
సినీ నటి మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
-
జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు.. షాకిచ్చిన మాధవీలత
సాక్షి, తాడిపత్రి/హైదరాబాద్: తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జేసీ.. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.ఈ క్రమంలో మాధవీలత కామెంట్స్ తప్పుబడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించారు. అలాగే, జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొచ్చారు.క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది.. సారీ అంటూ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. ‘మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవీలత..‘జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అవినాష్ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్ కు మాధవీలత ఫిర్యాదు
-
జేసీ ప్రభాకర్‌పై పోలీసులకు మాధవీలత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై (Madhavi Latha అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ( J. C. Prabhakar Reddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. తాజాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ..‘జేసీ మాటలతో నేను, నా కుటుంబం ఇబ్బంది పడ్డాం. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా’ అంటూ మాధవీలత ప్రశ్నలు కురిపించారు. జేసీ ప్రభాకర్ మాటలతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా? అని మాధవీలత నిలదీశారు. అంతకుముందు ఆమె ఫిలింఛాంబర్లోనూ ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదుజేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత ఏమన్నారంటే?'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.అసలు వివాదం ఏంటి?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు.బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.కేసులకు భయపడను: మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు.తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
నాది కూడా సీమ రకమే గుర్తుపెట్టుకో జేసీ.. మాధవీలత స్వీట్ వార్నింగ్
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ చాంబర్ లో మాధవీలత ఫిర్యాదు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది. -
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత (Madhavi Latha) బోరున ఏడ్చేసింది. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో ప్రయత్నించా.. కానీ, నేనూ మనిషినే! నా ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. నేను పడ్డ బాధను వర్ణించే పదాలు లేవు. ఎవరో వస్తారని ఎదురుచూడలేదు!ప్రతి క్షణం వేదన అనుభవిస్తున్నాను. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు, పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్నా.. నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. ఎవరి దగ్గరా రూపాయి తీసుకున్నది లేదు.. ఎవరికీ ద్రోహం చేసిందీ లేదు.. మోసం చేసిందీ లేదు.చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?నాపై కక్షతో..కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడూ సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయి అని రాసుకొచ్చారు.ఏం జరిగింది?డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. జేసీ పార్కులో వేడుకలకు మహిళలు వెళ్లొద్దని సూచించారు. తిరుగుప్రయాణంలో అర్ధరాత్రివేళ ఏదైనా జరగడకూడనిది జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ మాధవీలతపై అసభ్య కామెంట్లు చేశారు. ఆమెను వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. తెరపై కనిపించేవాళ్లంతా వ్యభిచారులే అనడం నీ కుసంస్కారానికి అద్దం పడుతోందని మాధవీలత ఫైర్ అయ్యారు. తర్వాత నోరు జారినందుకు జేసీ సారీ చెప్పారు. అయినా సరే మాధవీలతపై విమర్శల దాడి జరుగుతూనే ఉండటంతో తట్టుకోలేక ఇలా ఏడ్చేశారు.సినిమా..కాగా మాధవీలత.. నచ్చావులే సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైంది. తర్వాత ష్, స్నేహితుడా, ఉసురు, చూడాలని చెప్పాలని, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆంబాల అనే మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. చివరగా మధురై మణికురవర్ (2021) అనే తమిళ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Runs NGO ll (@actressmaadhavi) చదవండి: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా -
నేను కూడా మనిషినే.. వెక్కి వెక్కి ఏడ్చిన మాధవీలత
-
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
మాధవీలతకు ‘జేసీ’ బహిరంగ క్షమాపణ
సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ -
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
-
ఆమెతోనా మాకు నీతులు చెప్పించేది
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టవర్ క్లాక్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. ఆయన సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె పెద్ద వ్యభి చారి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దన్నందుకు..నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.జేసీకి మతిపోయిందేమో..ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు రీత్యా మతి ఏమైనా పోయిందేమోనని, ఒకసారి చూపించుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరైంది కాదని హితవు పలికారు.కేసులకు భయపడను : మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
జేసీ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
సాక్షి, అనంతపురం: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక వ్యభిచారి అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత స్పందిస్తూ.. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం. తండ్రి జేసీ అనుచిత వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎందుకు ఖండించరు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు గౌరవం ఇస్తా.. అసభ్య భాషకు కాదు. నేను ఎవరికీ భయపడను. నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేస్తారా?. రాజ్యాంగ బద్ధంగా.. మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్పా?. జేసీ ప్రభాకర్ రెడ్డి కుసంస్కారి.. ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి’’ అంటూ మాధవీలత వ్యాఖ్యానించారు.కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు అన్ని రాజకీయ పార్టీలలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు మహిళా నేతలు తామేమటన్నదీ రుజువుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే పలువురు మహిళా నేతలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.కంగనా రనౌత్నటి కంగనా రనౌత్ ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కంగనా రనౌత్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2024లో వార్తల్లో నిలిచారు.మహువా మోయిత్రాపశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మోయిత్రా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. మహువా మోయిత్రా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.స్వాతి మలివాల్సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ 2024లో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెక్రటరీపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దరిమిలా స్వాతి మలివాల్ పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.కొంపెల్ల మాధవీ లతహైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీ లతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై మాధవీ లత పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించారు.వసుంధర రాజేరాజస్థాన్లో బీజేపీ విజయం సాధించిన దరిమిలా మహిళా నేత వసుంధరా రాజే సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలకు కలతచెందిన వసుంధరా రాజే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వసుంధర రాజే తన ప్రసంగాలు, వ్యాఖ్యల కారణంగా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.ప్రియాంకా గాంధీరెండు దశాబ్దాల కిందట గాంధీ - నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక గాంధీ 2024లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డుస్థాయి విజయం అందుకున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రచార సమయంలో ఆమె ప్రజలతో మమేకమవుతూ ‘తానొక ఫైటర్’ని అంటూ చేసిన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
హోంమంత్రి అనిత మాటలు పచ్చి అబద్ధం: హీరోయిన్ మాధవీలత
ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు. అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్మీట్లో ఈ రూల్స్ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు. కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
అనితపై మాధవీ లత ఫైర్
-
అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు. మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. -
ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి తరపున దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే అక్కడున్న పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
పాతబస్తీలో పతంగేనా?
హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని భూతద్దంలో చూపిస్తుండటంతో హైదరాబాద్ లోక్‌సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్ ఇండియా–మజ్లిస్–ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్‌సైడ్‌గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్ టూ డోర్ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్ శకం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో తొలిసారిగా 1984లో మజ్లిస్ బోణీ కొట్టింది. అప్పటి నుంచి సుల్తాన్సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అనుకూల అంశాలు » అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు » అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం » బలమైన ముస్లిం సామాజిక ఎజెండా » హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు » నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్ » లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం » ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం ప్రతికూల అంశాలు» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు » పాతబస్తీ వెనుకబాటుతనం » తక్కువగా నమోదయ్యే పోలింగ్ శాతం మాధవీలత దూకుడు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీ¯Œ ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు. ఒక నేషనల్ టీవీ చానల్ నిర్వహించిన ‘ఆప్‌కి అదాలత్’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్ ఎంపీ టార్గెట్‌గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్‌రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్ చందర్జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకూల అంశాలు » బలమైన హిందుత్వ ఎజెండా » ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం » పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు » ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు » మజ్లిస్ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం » ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ప్రతికూల అంశాలు» మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం » ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్లోనే ప్రాతినిధ్యం » స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం » బలమైన పార్టీ కేడర్ లేకపోవడం » స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్‌తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో పెట్టింది. అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్ దక్కడం కష్టంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పాతికేళ్లలో కనీసం డిపాజిట్ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ వస్తోంది. -
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్‌ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్‌షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్‌షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్‌షా లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్‌షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్‌టాప్ జీప్‌పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్‌పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్‌పుర, మలక్‌పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్‌పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్‌షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్‌షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్‌షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్‌గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్‌కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది. -
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్‌సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రజాకార్ మూలాలు చిత్తూ చేసి 40 ఏళ్ల చరిత్ర తిరగరాస్తాము
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు 'ప్రధాని ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్ని కల్లో హైదరాబాద్ బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న మాధవీల తకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తాజాగా ఓ టీవీలో నిర్వహించే ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రజత్శర్మ ప్రశ్నలకు మాధవీలత ఇచ్చిన సమాధానాలు అసాధరణమైనవని, చాలా దృఢమైన అంశాలు ప్రస్తావించారని, తర్కంతో మాట్లాడారని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్య క్రమాన్ని అందరూ వీక్షించాలంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలు.. ఒకప్పుడు సంతోష్‌నగర్‌లో తన ఇల్లు వర్షపు నీటిలో మునిగిపోయిన ఘటన వరకు పలు అంశాలను మాధవీలత గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో హైదరాబా ద్లో మత ఘర్షణలు ఎంత భయానక వాతావ రణం సృష్టించేవో తెలిపారు. మత ఘర్షణలకు, రాజకీయ కక్షలకు పెద్దగా తేడాలేదన్నారు. హైదరా బాద్ నగరం లక్షలాది మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల భాగస్వా మ్యం ఒకశాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాధవి లతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎపిసోడ్ చూడండి అంటూ ట్వీట్
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ సొంతం చేసుకున్న హదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా బీజేపీ హస్తగతం చేసుకోవడానికి 'మాధవి లత'ను రంగంలోకి దింపారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవి లత బలమైన ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ బలంగా సాగుతోంది. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె వ్యక్తపరిచిన ఆలోచనలనలకు ప్రధాని మోదీ సైత ఫిదా అయ్యారు. మాధవి లతను ప్రశంసిస్తూ మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ''మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్‌ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. Madhavi Latha Ji, your ‘Aap Ki Adalat’ episode is exceptional. You’ve made very solid points and also done so with logic and passion. My best wishes to you. I also urge everyone to watch the repeat telecast of this programme at 10 AM or 10 PM today. You all will find it very… — Narendra Modi (@narendramodi) April 7, 2024 ఎవరీ మాధవి లత? కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవి లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది. -
జగన్ ప్రభంజనానికి కూటమి ఎదురు రాలేదు: నటి, బీజేపీ నేత
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఏపీ రాజకీయాలపై తాజాగా స్పందించారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ఆమె ముక్కుసూటిగా సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పెద్దగా అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. అయినా కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పంతాను కొనసాగించింది. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. ఏపీలో ఎన్నికల సెగ ప్రారంభమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలను నమ్ముకుని తాను సింగిల్‌గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి గెలుపు రేసులో ముందున్నారు. ఇదే విషయాన్ని అనేక జాతీయ సర్వేలు కూడా వెళ్లడించాయి. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీ, జనసేనను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల గురించి మాధవీ లత ఇలా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నడం వల్ల ఈజీగా గెలిచేద్దాం.. జగన్‌ని ఓడించేద్దాం అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే సీఎం జగన్‌కు చాలా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంతో మేలు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచే అవకాశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు భారీగా ఖర్చు పెట్టిన కూడా జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కష్టం. సీఎం జగన్‌ను దెబ్బ కొట్టాలి అంటే చాలా జాగ్రత్తగా మూడు పార్టీలు కష్టపడాలి. మూడు పార్టీలు కలిశాము కదా.. ఇంకేముందిలే అంటే కుదరదు. మూడు పార్టీలకు ఉన్న బలం అంతా కలుపుకుని గ్రౌండ్ లెవల్ నుంచి నిరంతరం కష్టపడి పనిచేసినా కూటమి గెలిచే అవకాశాలు చాలా తక్కువ.. జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కష్టపడి పనిచేసినా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ,బీజేపీ, జనసేనలకు సీట్లు వస్తాయి. కానీ గెలుపు వస్తుందా? రాదా?? అధికారం వస్తుందా రాదా?? అనేది చాలా ముఖ్యం. ఉన్న బలం అంతా కూడబలుక్కొని ఎంతో కష్టపడితే తప్పితే సీఎం జగన్‌ని ఎవరూ ఓడించలేరు. అది అంత ఈజీ కాదు. అని 2024 ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించిచారు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజేపీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. -
మరో ఇద్దరు రజాకార్లు ఉన్నారు వాళ్ళని కూడా తరిమికొడతాం
-
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి.. ఎవరీ 'మాధవి లత'?
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ కంచు కోటగా ఉంది. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్‌ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో 'కొంపెల్ల మాధవి లత'ను (Kompella Madhavi Latha) హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకీ ఈమె ఎవరనేది ఈ కథనంలో చూసేద్దాం.. కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికి సుపరిచమైంది. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది. -
అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పోస్టులు నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోపై కామెంట్స్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) మాధవిలత పోస్ట్‌లో రాస్తూ.. 'బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఓ సోది టాపిక్. వారిని పెడితే ఎవరూ చూడరు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. ఎవరినీ హౌస్‌లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు. ఈ సీజన్లో చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్ యూ' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్లో సామాన్యుని కేటగిరీలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరీ మాధవిలత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!) -
పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. (ఇది చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) -
బిగ్‌బాస్ 7 ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మాధవీ లత
సెలబ్రిటీలు ఏం తింటారు? ఎలా ఉంటారు? ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటారా? లేదా మనలాగే భావోద్వేగాలను బయటకు చూపిస్తారా? ఇలా చాలా ప్రశ్నలకు సింపుల్ సమాధానమే బిగ్‌బాస్. ఈ రియాలిటీ షోలో తారల రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. అప్పటివరకు వారిని స్క్రీన్‌పై ఎలా చూశామన్నదానికి భిన్నంగా బిగ్‌బాస్ హౌస్‌లో కనబడుతూ ఉంటారు. ఇలాంటి షోకి రావాలని ఎంతోమంది తహతహలాడిపోతుంటే కొందరు మాత్రం వద్దురా బాబూ అని దండం పెట్టేస్తుంటారు. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభం కాబోతోంది. కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడింది బిగ్‌బాస్ మేనేజ్మెంట్. ఈ క్రమంలో నచ్చావులే హీరోయిన్ మాధవీ లతను సంప్రదించారట. తాజాగా ఈ విషయాన్ని సదరు హీరోయినే స్వయంగా ధృవీకరించింది. 'నా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. బిగ్‌బాస్ 7 కోసం ఆ టీమ్ నన్ను సంప్రదించింది. ఇది తొలిసారి కాదు, ఇప్పటివరకు ఇలా మూడుసార్లు నాకు బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఏమాత్రం ఆసక్తి లేదు. నన్ను షోలో పాల్గొనాల్సిందిగా కోరిన బిగ్‌బాస్ టీమ్‌కు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది మాధవి. ఒకసారి ట్రై చేయొచ్చుగా అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా నో చెప్పి మంచి పని చేశారని మరికొందరు ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll sanathani ll BJP Women ll Orator ll NGO ll (@actressmaadhavi) చదవండి: 4 గంటలు ఏడుపు, 10 గంటలు నిద్ర.. అమ్మానాన్న విడాకులు నచ్చలేదు: హీరో కూతురు -
మా బంగారు కొండే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లాలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ పథకం సత్పలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. శనివారం స్థానిక ఐదుబండ్ల మార్కెట్ సమీపంలో రేలంటి ఇవాంశిక అనే చిన్నారి ఇంటిని ఆమె సందర్శించారు. తాను దత్తత తీసుకున్న ఈ బాలికను కలెక్టర్ ఎత్తుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనతతో బాధపడుతుండటంతో ఇవాంశికను బంగారుకొండ పథకం కింద కలెక్టర్ ఎంపిక చేసుకుని దత్తత తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద బలవర్థకమైన ఆహారం, బాలామృతం, కోడిగుడ్లను చిన్నారికి క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. బంగారుకొండ కిట్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్న తీరు పట్ల కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షిస్తుండటంతో 10 రోజుల వ్యవధిలో కేజీ బరువు పెరిగింది. రెండు అంగుళాల పొడవు కూడా పెరగడం గమనించినట్లు మాధవీలత పేర్కొన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ 7.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరింగిందని అధికారులు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలలు నిండి ఆరేళ్ల లోపు 1293 మంది పిల్లలను బంగారుకొండ కింద గుర్తించామని కలెక్టరు తెలిపారు. ప్రతి బుధవారం బాలమిత్రలు చిన్నారుల ఇంటికి వెళ్లి ఆహార పదార్థాలు, ఆరోగ్య వివరాలు పర్యవేక్షిస్తారన్నారు. బంగారుకొండ కిట్ పౌష్టికాహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. ప్రతి నెలా ఒక కిట్ ఇవ్వడం ద్వారా ఆరు నెలలు పాటు పర్యవేక్షిస్తామన్నారు. ఇవాంశికలో చక్కటి పురోగతి కనిపించడంతో ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. జిల్లా శిశుసంక్షేమ .. సాధికారిత ఇన్చార్జి అధికారి,డీఆర్డీఏ పీడీ సిరిపురపు సుభాషిణి, అంగనవాడీసూపర్వైజర్,వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిన్నమాట ఇచ్చారు..నేడు పట్టా ఇచ్చారు
రాజమహేంద్రవరం రూరల్: మాటిస్తే అమలు చేస్తానని మరోమారు నిరూపించుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వివరాలివి. ముఖ్యమంత్రి గత నెల 24న కొవ్వూరు పర్యటనకు వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరుకు వలస వచ్చిన రేవాడి దుర్గ దంపతులు ఈసందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇంటి స్థలం అవస్థలు పడుతున్నామని ఆయనకు అర్జి అందజేశారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇళ్ల స్థలం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. ఆమె చొరవ తీసుకుని సాంకేతిక పరంగా ఉన్న అడ్డంకిని పరిష్కరించి కొవ్వూరు జగనన్న కాలనీలో నివాస స్థలం మంజూరు చేశారు. సోమవారం దుర్గకు ఇంటి పట్టా అందజేశారు. రేవాడి దుర్గ మాట్లాడుతూ తమకు ఇంత త్వరగా ఇంటి స్థలం మంజూరవుతుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.సీఎ జగన్‌కు.. కలెక్టర్ మాధవీలతకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్‌లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్‌లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
చిన్నారి ఆరోగ్యంపై సీఎం జగన్ స్పందన
రాజమహేంద్రవరం సిటీ: తన బిడ్డకు వైద్యం అందించాలని ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొవ్వూరు మండలం ఔరంగబాద్‌కు చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతోందని అర్జీ అందజేశారు. సీఎం స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం తన చాంబర్లో నిస్సి తల్లికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ మాధవీలత అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆరాధ్య తల్లితండ్రులు పాక స్వరూప్, అపర్ణలకు ధైర్యం చెప్పారు. బిడ్డ ఆరాధ్య అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పాప వైద్య సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌కు అప్పగించామని వివరించారు. పాప తండ్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి సీఎం కార్యాలయం లెటర్ ఆఫ్ అధారటీ లేఖ ఇచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!
ఒక అమ్మాయికి 20-25 ఏళ్లు రాగానే.. అందరూ అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న ఎదురవ్వకముందే పెళ్లి చేసుకునేవారు. కానీ ఈ జనరేషన్ అమ్మాయిలు వయసు రాగానే పెళ్లి చేసుకోవడం లేదు. ముందు కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. మంచి ఉద్యోగం లేదా బిజినెస్.. ఇలా ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడగలం అనే నమ్మకం వచ్చాకనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. అయినా కూడా ఇప్పటికి అమ్మాయిల విషయంలో పెళ్లి ప్రస్తావన కామన్ పాయింట్ అయిపోయింది. పదే పదే పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందే హీరోయిన్ మాధవీ లత పడుతున్నారట. ‘నచ్చావులే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తరచు పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ.. మాధవీ మాత్రం సోషల్ మీడియా ద్వారా సమాజంపై ఫుల్ ఫైర్ అవుతోంది. ‘ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం. ప్రస్తుతం నేను శారీకంగానూ, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను. నా భవిష్యత్తుపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం. నా జీవితం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll sanathani ll BJP Women ll Orator ll (@actressmaadhavi) -
ఎన్ఎస్ఈలో విరించి లిస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్‌ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్ఎస్ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది. -
అవును డేటింగ్ నిజమే.. తొలిసారి నోరు విప్పిన హీరోయిన్..!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నానని వెల్లడించింది. మాధవిలత వీడీయోలో మాట్లాడుతూ..' నేను ఒక వ్యక్తిని కలిశా. ముందు అతడిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రెండువైపుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో ఏడాది సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతా. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం అడగొద్దు. అయితే అసలు అతడు తెలుగువ్యక్తి అయితే కాదు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. 2018లో రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరిన ఆమె గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll orator ll sanathani ll BJP Women ll (@actressmaadhavi) -
నేను విన్నాను.. నేను ఉన్నాను...
సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు. తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు. ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు. – గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు. మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి. – సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గా సురేష్‌కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్‌కు ఆర్ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు. పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. – సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది... రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్‌ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు. 3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. – కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం జగనన్న మనసున్న మారాజు... రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు. ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు. – కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం (చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు) -
'సన్నీ చేస్తుంది తప్పు.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతాను'
Madhavi Latha Fires On Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసినప్పటికీ కంటెస్టెంట్ల హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫినాలేలో అడుగుపెట్టిన సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, షణ్ముఖ్.. ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీట్, గెట్ టు గెదర్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం తనకు అండగా నిలబడ్డవాళ్లను కనీసం పట్టించుకోవట్లేదన్న విమర్శలు మొదలయ్యాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం టీవీ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ తన కోసం ఎంతగానో పోరాడిన యూట్యూబ్ రివ్యూయర్లకు, ఓట్ల కోసం కష్టపడ్డ ఫ్యాన్ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదట! దీంతో విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. సన్నీకి ఓట్లేయాలంటూ మద్దతుగా నిలిచిన ఆమె అతడి తలబిరుసును తీవ్రంగా తప్పుపట్టింది. 'సన్నీ కోసం సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కనీసం తనకు ఓట్లేయమని చెప్పనివాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు. బిగ్‌బాస్ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్ చేశానో, ఇప్పుడు తను చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తాను. సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్(పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్)లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే అయిపోతుందా? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్ చేశాడా? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా? తొలి ప్రాధాన్యత ఎవడికి ఇవ్వాలి? మీడియా నుంచి వచ్చా కాబట్టి మీడియాకే ప్రాధాన్యతనిస్తానన్నే సన్నీ బిస్కెట్ బాగానే ఉంది. నీకోసం పర్సనల్ పీఆర్‌లా పనిచేసిన వాళ్లకు లైవ్ అడిగితే దొరక్కుండా పెద్ద ఛానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నావు.. నీ ఫ్యాన్ పేజెస్ మెయింటెన్ చేసిన వాళ్లను కలవాలి, నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు. నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో.. ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేసిన ఒక్కరికీ సన్నీ నుంచి ఎటువంటి మెసేజ్, ఫోన్ రాలేదు. పాపం.. వాళ్లంతా సన్నీ ఏడిస్తే ఏడ్చారు, సన్నీ నవ్వితే నవ్వారు. వారం రోజులవుతున్నా ఇంకా టాప్ ఛానల్స్‌తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా' అని వార్నింగ్ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి! -
నా సక్సెస్ సీక్రెట్ వాళ్లే
ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీనటులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్ కంపెనీ ‘‘సెలబ్రిటీస్ సీక్రెట్’’ అన్నారు డాక్టర్ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్మెంట్ చేసేముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాక అది సక్సెస్ అయితేనే ఆ ట్రీట్మెంట్ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్ గురించి చెప్పటం వల్ల మౌత్ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్’’ ఎండి డాక్టర్ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్. ఈ సందర్భంగా దా. మాధవి వెంకట్ మాట్లాడుతూ–‘‘ ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, ‘బిగ్‌బాస్’ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
Madhavi Latha Shocking Comments On Samantha Special Song In Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో సమంత చేసిన ఐటెం సాంగ్‌కు ఎంతగా రెస్పాన్స్ వస్తుందో అంతే రేంజ్లో వివాదాలు అలుముకుంటున్నాయి. ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట ఓ వైపు వ్యూస్ పరంగా దూసుకుపోతూ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. మరో వైపు మగవారి మనోభవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: Allu Arjun Shoulder Surgery: ‘గతంలో నా ఎడమ భుజానికి రెండుసార్లు సర్జరీ జరిగింది’ మగవాళ్లంతా చెడ్డవారు అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అంతేగాక పుష్ప టీంతో పాటు సమంతపై కూడా కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫేస్బుక్ వేదికగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. చదవండి: గతంలో చాలా తప్పులు చేశాను, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి: స్టార్ హీరోయిన్ నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మాధవిలత పెట్టిన ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. -
'సిరిది సిగ్గులేని జన్మ, ఓట్లు, నోట్ల కోసం దిగజారింది'
Bigg Boss Telugu 5, Madhavi Latha Furious On Siri-Shannu Friendship: బిగ్‌బాస్ ఈ మధ్య సిరి- షణ్నుల ఫ్రెండ్షిప్ను బాగా హైలైట్ చేస్తున్నాడు. దానికి కారణం వీళ్ల స్నేహం కొత్తపుంతలు తొక్కుతోంది. ఎప్పుడూ సిరి జపం చేసే షణ్ను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆమె మీద అజమాయిషీ చేస్తున్నాడన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సిరి ఎప్పుడేం మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది కూడా అతడే డిసైడ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే అది కేరింగ్ అని కొందరు అంటుంటే కాదు కమాండింగ్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఫైర్ అయిన మాధవీలత తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షణ్ముఖ్ ప్రవర్తనను తప్పుపడుతూనే సిరిని సైతం ఏకిపారేసింది. 'సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్ కోసం దిగజారిన బతుకు.. అంత తిట్టినా వాడితో... అది స్నేహం, అది లవ్ అని మెసేజ్‌లు పెడుతున్నారు.. అలా చేస్తే పెళ్లాం కూడా మొగుడి పైత్యం దిగడానికి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం, వచ్చే నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారాలా?! ఓపెన్‌గా తల్లిని అవమానించినా అటు తల్లిని, ఇటు పార్ట్నర్ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. సరేలే పైసల్ కావాలిగా.. షణ్ను ఎక్కడ ముఖం మాడ్చుకుంటాడో అని కన్నా అని ప్రేమగా పిలుస్తావు, కానీ నీ పార్ట్నర్ (శ్రీహాన్)ను కన్నా అని కాకుండా చోటు అని పిలుస్తావ్.. మహానటివి. వాడు మీ అమ్మకు గౌరవం ఇవ్వడు. కానీ నువ్వు మాత్రం వాడిలో పార్ట్నర్ని చూస్కో.. బంధాలు అనుబంధాలకి అర్థాలు మార్చి రాసిన ఘనత మీది.. బిగ్‌బాస్ అయ్యాక నిన్ను భరిస్తాడంటే మీ ఆయన దేవుడు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో వచ్చే జన్మలో అయినా మంచి బుద్ధి ఇస్తాడు. ఇకపోతే షణ్ముఖ్.. ఇమిటేషన్ టాస్కులో అతడిని ఇమిటేషన్ చేయకూడదట! మాటిమాటికి శ్రీరామ్ డ్యాన్స్ చేయకపోయినా ఇమిటేషన్ టాస్కులో షణ్ను డ్యాన్స్ ఎందుకు ఇమిటేట్ చేశాడు? శ్రీరామ్ ఫీల్ అయ్యాడా? స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. మనిషి అంటే నీతులు పక్కనోళ్లకు చెప్పడం కాదు.. వీడు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట.. ఇంట్లో ఉన్న శ్రీరామ్, మానస్, సన్నీ కామపిశాచులు మరి! వాళ్లు సిరి హగ్ కోసం అల్లాడిపోతున్నారు.. అందుకే కదా సిరితో అన్నయ్య అని పిలిపించాడు, ఒక ఫ్రెండ్ అనేవాడు ఇంకో ఫ్రెండ్‌ను అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు?' అంటూ ప్రశ్నించింది మాధవి. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ను, సిరి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
Bigg Boss: టీమ్‌కు సిగ్గులేదు.. ఆడపిల్లపై మానసిక అత్యాచారం..నటి షాకింగ్ కామెంట్
Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show: వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి మాధవీలత తాజాగా మరోసారి బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య సిరి హన్మంత్ వాష్‌రూంలో తల బాదుకోవడాన్ని తప్పుపడుతూ.. బిగ్‌బాస్‌కు రూ.100 కోట్ల జరిమానా వేయిస్తానని చెప్పిన మాధవీ.. తాజాగా మరోసారి సిరి-షణ్ముఖ్‌ల రిలేషన్‌పైనే కామెంట్ చేసింది. షణ్ముఖ్ పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కంటి చూపులతో ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే సిరిపై మరింత సీరియస్ అయ్యాడు షణ్ముఖ్. ఆమెతోపాటు.. ఆమె తల్లి మాటాలను కూడా తప్పు అంటూ వాదించాడు. ‘అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్ ఒరేయ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిపై కోపం ప్రదర్శించాడు. దీంతో సిరి ఏం మాట్లాడలేకపోయింది. అయితే వీటన్నింటిపై స్పందిస్తూ నటి మాధవీలత ఓ సుదీర్ఘ పోస్ట్‌ను తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఎంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఎందండీ ఈ అరాచకం ఏందీ అంటా.. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి.. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషాం తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కదా.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని. స్నేహం ముసుగులో కామ కాలపాలు చూడలేకున్నాము.. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్డ్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది .. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్.. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో’అని మాధవీలత ఆరోపించింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
'బిగ్‌బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారింది.. వీడియోలు ఉన్నాయి'
Actress Madhavi Latha Shocking Comments on Bigg Boss Telugu 5 Show: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెలివిజన్ తెరపై టాప్ టీఆర్పీ రేటింగులతో దూసుకుపోతుంది ఈ షో. ఇక మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగు బిగ్‌బాస్ షోలో సైతం లవ్ ట్రాక్‌లు కామనే. రీసెంట్గా షణ్నూ-సిరిల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ బయట వేరేవాళ్లతో రిలేషన్ షిప్లో ఉన్నప్పటికీ హౌస్‌లో మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. జెస్సీ వెళ్లిపోయాక వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోతున్నాం అంటూనే దూరంగా ఉండలేకపోతున్నారు. తాజాగా బిగ్‌బాస్ షోలో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో వరుస కామెంట్లు చేస్తుంది. బిగ్‌బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారిందని ఫైర్ అయ్యింది. 'బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి..ఆ వీడియోలు, ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు' అంటూ మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవీలత చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. టెలికాస్ట్ కాని కంటెంట్ ఉందంటే..హౌస్‌లో ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్‌బాస్ హౌస్‌లో అనాగరిక చర్య..హోస్ట్‌కి రూ.100 కోట్ల జరిమానా వేయిస్తా: మాధవీలత
Madhavi Latha Shocking Comments On Bigg Boss: వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి మాధవీలత తాజాగా బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోని తాజా పరిస్థితులపై, హోస్ట్ నాగార్జునపై సోషల్ మీడియా వేదికగా మండిపడింది. బిగ్‌బాస్ హౌస్‌లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకునే స్థాయిలో బిగ్‌బాస్, హోస్ట్ నాగార్జున అవమానించారని ఆరోపించింది. ఇలాంటి వాటిపై ఎలాగూ మానవ హక్కులు, ప్రజా సంఘాలు స్పందించవు అని చెబుతూ ఏకిపారేసింది. అదే పని నాగార్జునకు చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలా చేస్తే మరుసటి రోజు 100 శాతం గాయబ్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘మన గత కాలంలో పల్లెటూర్లలో శిక్షలు ఉండేవి. తప్పు చేసిన వాడికి సగం మీసం లేదా అరగుండు లేదా గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఉరేగింపు, రాత్రి కటిక నేలమీద నిద్ర, ఊరంతా నువ్ తప్పు చేసావ్ అని తెలిసేలా మెడలో ఒక బోర్డు అలాంటి శిక్షలు ఉండేవి. సున్నిత మనస్కులు తర్వాత అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇలాంటి కఠిన విష సంసృతి వద్దు అని, మనుషులం మనం మృగాళ్లలా ఉండొద్దు అని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాం. కానీ బిగ్ బాస్ టీంలో ఇప్పటికీ అలాంటి విషపు ఆలోచనలతో ఉన్నవారినే టీంగా తీసుకోవడం, ఒక సైకో మనస్తత్వం ఉన్నవారికి రచన అవకాశం ఇవ్వడం అనేది ఎంతటి దుర్మార్గం. ఈ నాగరిక సమాజంలో అన్ని భాషల్లో ఇలాంటి పనికిమాలిన పద్ధతులు, మనుషులని కించపరచడం.. దానికి బిగ్ బాస్ హౌస్ ఒక దేవాలయం ఇక్కడ జ్ఞానం వస్తుంది అన్నట్లు డబ్బా కొట్టడం.. తప్పుని నిలదీయలేని ఒక హోస్ట్ విషపు ఆలోచనలకి బాటలు వేయడం చూస్తున్న పిల్లలు. సహజంగా సైకో మెంటాలిటీ ఉన్నవాళ్లు సమాజంలో 70% ఉన్నారు. వాళ్ళు ఇదే సరి అయినది అన్నట్లు ఉంటున్నారు. ఇలాంటి అనాగరికపు చర్యలకి దిగజారుతున్న టీవీ షో కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్న ప్రజలు దాని సంబంధిత మినిస్ట్రీ, సెన్సార్. నాకు బిగ్ బాస్‌పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ చెబుతున్నా. కానీ దేవుడి దయవలన డబ్బు వస్తే ఆ ఛానల్‌ని కొని ఆ షోకి నేనే హోస్ట్‌గా వెళ్లి రోస్ట్ చేస్తాను. లేదా ఆ మినిస్ట్రీ మీద నాకు పగ్గాలు వస్తే ఇలాంటి షోని పద్ధతి లేకుండా అనాగరికపు వ్యవస్థకి పట్టం గడుతున్న యాజమాన్యం మరియు హోస్ట్‌కి 100 కోట్ల జరిమానా వేయిస్తాను. సమాజానికి ప్రజలు మర్చిపోయిన అనాకారిక పద్ధతులని భారత దేశం అంతటా బ్యాన్ చేయాలి. ఇది చూస్తూ నోరు మూసుకున్న సామజిక కార్యకర్తలు, టీవీ చానెల్స్ స్పందించాలి. సమంత విడాకులు విషయం ప్రపంచ వింతలా టెలికాస్ట్ చేసిన చానెల్స్, రెచ్చిపోయిన విలేకరులు ఇలాంటి సభ్య సమాజం అస్యహించుకునే అనాకారిక చర్యల మీద మీరు మాట్లాడారా? దైర్యం లేదా? లేక భయమా? లేక మాకెందుకు అనే నిర్లక్షమా? ఎవరైనా మనిషే.. ఒక మనిషిని శిక్షించడానికి మీకు హక్కు లేదు. కేవలం మందలించడం మాత్రమే.. జైలు అంటున్నారు సమంజసం. మెడలో బోర్డులు తగిలించి మానసిక హింసకి గురి చేసిన యాజమాన్యం యొక్క మానసిక స్థితిగతులు ఏంటి? అలాంటి స్క్రిప్ట్ రాసిన వాడి యొక్క రాక్షస ఆలోచనల వలన సమాజం విషం కక్కుతోంది అనే విషయం మరిచారా? భారత దేశంలో బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి ఇలాంటి శిక్ష అనుభవించిన వారి మానసిక వేదన ఎలాంటిది? అప్పట్లో అది ఒక ఊరి ప్రజలకి పరిమితం.. అయినా పరువు కోసం ప్రాణాలు తీసుకునేవారు, మరి ప్రపంచం అంత చూస్తున్న ఒక టీవీ షో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇది చూసి రేపు సరదాలకు సంతోషాలకి ఓడిపోయిన వారికీ ఇలాంటి బోర్డు తగిలించి న్యూ చాలెంజ్ అని ఒక సామజిక దురాచారాలకు తెర లేపుతున్నారు. ఇపుడు మీకోసం ఒక వీరేశలింగం గారు, ఒక రామ్మోహన రాయ్ గారు రాలేరు. దయచేసి ఆపేయండి.. ఇప్పటికే సామాజిక అసమానతల వలెనే ప్రజలు కొట్టుకుంటున్నారు.పిల్లలు ,పెద్దలు ,సైకో మనసు ఉన్నవారికి ఇలాంటివి బాగా నచ్చిచేయడం మొదలు పెడతారు. చదువుకుని జ్ఞానం ఉన్న మనుషులుగా సమాజంలో ఉంటూ పూర్వకాలం నాటి పనికిమాలిన చర్యలని చూపిస్తూ మురిసిపోతున్న టీం. మరియు హోస్ట్ తన బాధ్యతను విస్మరించారని అనాలనిపిస్తుంది మీ సంస్కారానికి. కానీ, నాకు సంస్కారం ఉంది కనుక అనను. ఇది ఇలాగే కొనసాగుతే న్యాయస్థానం ద్వారా మీ చర్యలకి అడ్డు కట్ట వేయించేలా చేస్తాను. రోజూ సమాజంలో ఇప్పటికి జతుగున్న ఎన్నో చర్యలు చూసి బాధగా ఉంటుంది. కానీ చదువుకుని జ్ఞానం ఉన్న మీరు టీవీ షో ద్వారా ఇలా చేయడం బాధగా ఉంది. శత్రువుని సైతం క్షమించే నేల మనది. సరదాకి టీవీ పెడితే సైకిక్ నేచర్‌ని సమర్థిస్తున్నారు. చాలా తప్పు ఇది’ అని మాధవీలత మండిపడింది. -
అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత
Madhavi Latha About Samantha Divorce: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడిపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకొని, నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చై-సామ్ విడాకులు తీసుకోవడంతో.. అక్కినేని అభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. అలాంటి వారిలో సినీనటి మాధవీలత కూడా ఒకరు. తన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన మాధవీలత.. . చై-సామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత చాలా మంచి అమ్మాయి అని, కానీ వందలో 99 శాతం మంది సమంత కారణంగానే విడాకులు తీసుకున్నారని.. ఆమెను తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ దుస్తులు ధరిస్తుంది.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడని కొంతమంది కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నది మాధవిలత. తెరపై ధరించే దుస్తులకి, భార్య భర్తల సంసారానికి సంబంధం ఉండదని ఆమె అన్నారు. సమంత ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీ లతా అన్నారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం ఆమెను వాడుకున్నాడని, ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చిందన్నారు. ధరించే దుస్తులను బట్టి అమ్మాయిల క్యారెక్టర్‌ను డిసైడ్ చెయ్యొద్దని మాధవీలత విజ్ఞప్తి చేశారు. -
వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగా తనను సోషల్ మీడియాలో వేధింపులు చేస్తున్నారని.. ఓ వర్గం వారు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకర పోస్టులు చేస్తున్నారని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కమిషనర్ సజ్జనార్‌ను కలిసి లిఖిపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాలు చేసిన మాధవీలత కొన్నేళ్ల కిందట బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. అయితే ఇటీవల ఆమెను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఓ వర్గం తనను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు చేస్తున్నారని తెలిపింది. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితో అందులో తాను ఉన్నానని లేనిపోనివి కథనాలు సృష్టిస్తున్నారని చెప్పింది. దీనిపై ఇన్నాళ్లు సోషల్ మీడియాలో పోరాటం చేశానని.. ఇకపై మీరు చూసుకోవాలని కమిషనర్‌ను మాధవీలత కోరింది. ఈ తప్పుడు ప్రచారం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె విజ్ఞప్తి చేసింది. Met @cyberabadpolice Commissioner Sajjanar sir and gave a written complaint against abuse and character assassination on social media. This time not just a complaint very soon all those who are abusing me will be booked as per law. pic.twitter.com/2S1tisQ39x — MADHAVI LATHA (@actressmadhavi) February 4, 2021 -
టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకోవడం చూశా..
-
టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకోవడం చూశా..
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో డ్రగ్స్‌పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకోవడం ప్రత్యక్షంగా చూశాని, బయటకు చెప్తే తన ప్రాణానికి ప్రమాదమని భయంతో ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఎక్సైజ్ విచారణ తర్వాత కూడా టాలీవుడ్ తీరు మారలేదని ఆమె విమర్శించారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత డిమాండ్ చేశారు. ఇటీవల జిన్నారంలో పట్టుబడ్డ వందల కోట్ల డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం ఉంటుందని ఆమె ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ విక్రయించేవారు ఎవరు? బాధితులు ఎవరు అనేది అధికారులు తేల్చాలని అన్నారు. సినీ నటులు అందం, ఫిట్నెస్ కోసం మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటారని అన్నారు. (చదవండి : 'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు') టాలీవుడ్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దృష్టి పెట్టాలని మాధవి లత డిమాండ్ చేశారు. కాగా, బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి మాధవీలత మొదటి నుంచి సమర్థిస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు,టాలీవుడ్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని ఆమె ఆరోపించారు. టాలీవుడ్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడుతారని.. అది లేకుండా అసలు పార్టీలు జరగవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో వచ్చిన అతిథి చిత్రంతో వెండితెరకు పరిచమైన మాధవిలత , నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారింది. నానితో కలిసి స్నేహితుడు మూవీలో నటించింది. -
'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు'
బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారంటూ సంచలన నటి కంగనా రనౌత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సమర్థించారు. అంతేకాదు టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు డ్రగ్స్ లేనిదే కొన్నిసార్లు టాలీవుడ్లో పార్టీలు కూడా జరగవని చెప్పారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆదివారం పోస్టు పెట్టారు. "సుశాంత్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం మంచిదే. బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం. కానీ ఇదిగో అదిగో అని ఫైనల్‌గా తుస్సుమనిపిస్తారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే అక్కడ అంతా బడా బాబులే కదా. అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది. కానీ డ్రగ్స్ నేరం. ఒక పేదవాడికి అన్నం పెడతారో, లేదో కానీ మాదక ద్రవ్యాల కోసం వేలకు వేలు పెడతారు. సరే, అది వాళ్ళ ఇష్టం. (చదవండి: ఆ గేమ్‌లోకి వెళ్లను) భారత్‌లో అనుమతి ఉన్నవి తినండి, తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి. కానీ ఇతర దేశాల మాదక ద్రవ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు. తెలంగాణ ఎన్సీబీ సార్లు.. మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. డ్రగ్స్ మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. ఇక్కడ అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు. 2009లో వచ్చారు, కానీ పొలిటికల్ అండతో వెనక్కి వెళ్లిపోయారు. పాపం.. డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి వేరే శాఖకు బదిలీ చేశారు. చట్టానికి చేతులు చాలా పెద్దవి. అందుకే అవి చాచితే విరగొడతారు. మత్తులో చాలా దారుణాలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లు, పబ్స్, విద్యార్థులు వాటిని బాగా వాడుతూ మాదక ద్రవ్యాల వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతున్నారు. కాస్త చూసి అదుపులో పెట్టండి." (చదవండి: సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) "అమ్మో నాకు భయంగా ఉంది. ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో? ఎవరు డ్రగ్స్ జోలికి పోరు. ఆ అధికారులు కూడా చూసీ చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని ఆఫీసర్లను భయపెడతాయి కదా. సరేలే.. నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుంది ఏమో.." అని టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. (చదవండి: ‘రక్త పరీక్షలు నిర్వహిస్తే వారంతా జైలుకే’) -
రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాకేష్ మాస్టర్‌పై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. రాకేష్ మాస్టర్‌ను ఉపేక్షించేది లేదని కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలా చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, అతడికి పరువునష్టం కేసు ద్వారానే సమాధానం చెప్పబోతున్నట్లు వివరించారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచంద్రరావు దిశానిర్దేశంలో ముందుకు వెళ్లబోతున్నట్లు మాధవీ లత తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు. ఇప్పటికే రాకేష్ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్ నోటీస్ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్లనుంది. మరి ఈ నోటీస్‌లపై రాకేష్ మాస్టర్ మరేం కామెంట్స్ చేస్తాడో వేచిచూడాలి. చదవండి: తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్ ఈశ్వర్,అల్లా,జీసస్‌లపై ఒట్టేసిన వర్మ -
సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు
వివాదాలు ఆమెకు కొత్త కాదు.. తను అనుకుంటున్నది ఏదైనా కుండబద్దలు కొట్టి చెప్పే స్వభావం. లాక్డౌన్లో పెళ్లిళ్లు చేసుకున్న కొందరు సెలబ్రెటీలను ఉద్దేశించి నటి మాధవీలత చేసిన ఫేస్బుక్ పోస్ట్ మరోసారి ఆమెను వివాదాల్లోకి లాగింది. లాక్డౌన్ కొనసాగుతుండగా అతికొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న సినీ ప్రముఖులపై తనదైన శైలిలో స్పందిస్తూ.. మాస్కులు పెట్టుకొని మరీ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాది.. పిల్ల దొరకదా లేక పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా? అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. మీరు అంటున్నది నిఖిల్ పెళ్లి గురించా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఏమో అంటూ సమాధానాన్ని దాటవేసింది. ‘పేద, మద్య తరగతి కుటుంబాలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. కానీ సెలబ్రటీలు మాత్రం మాస్కులు వేసుకొని మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నా పోస్ట్ కేవలం సెలబ్రెటీలను ఉద్దేశించి పెట్టినదే’ అంటూ క్లారిటీ మాత్రం ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ఇటీవల పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజుల గురించే పోస్ట్ చేసిందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (వారికి కూడా నా ధన్యవాదాలు: నిఖిల్) మాధవీలత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిప్రాయాలను కొంతమంది సమర్థిస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ‘ఎవరి అభిప్రాయాలు వారివి. మీ ఉచిత సలహాలు ఎందుకు’ అంటూ ఫైర్ అవుతున్నారు. ‘నా ఫేస్బుక్ పోస్ట్ నా ఇష్టం. నా భావాలను చెప్పే హక్కు నాకుంది’ అంటూ పోస్ట్ చేసింది. నిఖిల్, డాక్టర్ పల్లవీ వర్మను అతికొద్ది మంది సమక్షంలో ఈనెల 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా) -
వారి కోసం పెయిడ్ క్వారెంటైన్స్ : మాధవీలత
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాల నుంచి ముంబైకి చేరుకుని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. వీరందరినీ అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి గన్నవరం విమానాశ్రయంలోనే పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. దీని కొరకు హెల్ప్ డెస్క్, వైద్య బృందాలను ఇప్పటికే సిద్ధం చేశారు. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు వేల మంది గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై పర్యవేక్షణాధికారి, జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. వచ్చిన వారందర్నీ 14 రోజులపాటు క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపారు. (విదేశాల నుంచి వచ్చేవారి వివరాల నమోదు) ‘ప్రభుత్వ క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడనివారి కోసం.. పెయిడ్ క్వారంటైన్లు కూడా సిద్ధం చేశాం. నాలుగు కేటగిరీలుగా రూమ్‌లను కేటాయించాం. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్స్‌కు తరలిస్తాం. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతాం. పెయిడ్ క్వారంటైన్స్ వద్ద మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంటుంది. ఆరోగ్యసేతు యాప్‌లో అందరినీ రిజిస్టర్ చేస్తాం. విదేశాల నుంచి వచ్చినవారందరికీ ఇండియా సిమ్‌కార్డులు ఇస్తామని’ మాధవీలత వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు) -
ఈ నెల 16 నుంచి 4వ విడత రేషన్ పంపిణీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పేదలకు నాలుగో విడత రేషన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల పదహారు నుంచి సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు దారులకు ఒక్కో కుటుంబ సభ్యునికి 5కిలోల చోప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డు దారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ, అన్నపూర్ణ కార్డు దారులకు 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. (వారు బయట తిరిగితే చాలా ప్రమాదం: కలెక్టర్) ప్రతీ కార్డుకు కిలో శనగపప్పు ఉచితంగా అందిస్తామన్నారు. లబ్ధిదారులు రేషన్ తీసుకునే సమయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు ధరించి క్యూలో ఆరడుగుల దూరం పాటించాలని సూచించారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి జరగనున్న పంపిణీకి ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
కరోనా : నటి టిక్‌టాక్ వీడియో వైరల్
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. కోవిడ్‌పై అవగాహన పెంచేందుకు పలువురు సెలబ్రిటీలు నడుం బిగించారు. తాజాగా కరోనాపై నటి మాధవిలత చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరస్ చిన్నా, పెద్ద, ఆడ, మగ అనే తేడాల్లేకుండా అందరినీ కబలిస్తోంది. మహమ్మారి ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జీవితంలో ఏం సాధించినా చివరకు మనతో ఏదీ మనతో రాదనే సందేశం కరోనా ఇచ్చిందన్నారు. ఈ వైరస్ ప్రభావాన్ని ఉద్దేశిస్తూ తీసిన వీడియోలో ..మొదటి సంఖ్య నేను అని, ఫస్ట్ ప్లేస్ నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రక్తం పొగరుబోతా..భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో..ఇంట్లోనే ఉండండి. సామాజిక దూరాన్ని పాటించండి అంటూ ఆమె చెప్పిన తీరు పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. -
వారు బయట తిరిగితే చాలా ప్రమాదం: కలెక్టర్
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజయవాడ జాయింట్ కలెక్టర్ మాధవీ కోరారు. విదేశాల నుంచి దొంగచాటుగా వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె విజ్ఙప్తి చేశారు. వారు బయట తిరిగితే చాలా ప్రమాదమని, వారంతట వారే బయటికొస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోమని అన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై విజయవాడలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని, స్వీయ నియంత్రణ ఒక్కటే మేలైన మార్గమని అన్నారు. (మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ) ఆమె మాట్లాడుతూ ‘రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు వికేంద్రీకరణ చేపట్టాం. ఆరు రైతు బజార్లను ఇరవై నాలుగుకు పెంచాం. 30 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడి వాళ్ళకు అక్కడే కూరగాయలు అందే సదుపాయం కల్పిస్తున్నాం. రేషన్ సరుకులు ప్రతి ఒక్కరికీ అందజేస్తాం. అందరికీ రేషన్ చేరే వరకు పంపిణి జరుగుతుంది. వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రజల వ్యవహారశైలిలో మార్పు రావాలి’ అని పేర్కొన్నారు. (రైతు బజార్లకు బారులు తీరిన ప్రజలు) -
భర్త మాటలే సైంటిస్ట్ నుంచి ఐఏఎస్‌కు..
సాక్షి, అమరావతి బ్యూరో: ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటారు. రెండు మూడు పర్యాయాలు ప్రయత్నిస్తే గాని ఎంపిక కాలేరు. కానీ ఆమె మాత్రం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. పైగా తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ (మహిళా విభాగంలో)గా నిలిచి గ్రూప్–1కు సెలెక్టయ్యారు. సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి, గ్రూప్–1 అధికారిగా ఎంపికై, అంచెలంచెలుగా ఐఏఎస్‌కు ఎదిగిన ఆమె కె.మాధవీలత. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాధవీలత విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. వ్యవసాయ పరిశోధనలో 4 గోల్డ్‌మెడల్స్.. మాది కడప. నాన్న కృష్ణారెడ్డి రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. అమ్మ రామలక్ష్మి గృహిణి. అమ్మా, నాన్నలకు ముగ్గురూ ఆడపిల్లలమే. నేను పెద్దదాన్ని. పెద్ద చెల్లెలు రాధిక అమెరికా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్. చిన్న చెల్లెలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు బాగా చదువుకోవాలని, ప్రయోజకురాలివి కావాలని చెప్పేవారు. వారి మాటలు నాలో పట్టుదలను పెంచాయి. నేను అగ్రికల్చర్లో పీహెచ్డీ చేశాను. కందులపై ప్రపంచంలోనే తొలిసారిగా పరిశోధనలు చేసి నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించాను. ఇక్రిసాట్‌లో సైంటిస్టుగా చేరాను. మా వారు పి.రామమునిరెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైంటిస్టు (ప్రస్తుతం పంచాయతీరాజ్‌లో వాటర్‌షెడ్స్ డైరెక్టర్). నువ్వు ప్రతిభావంతురాలివి. గ్రూప్–1కు ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా? అని నా భర్త సూచించారు. అందుకు అంగీకరించి గ్రూప్–1కి ప్రిపేరయ్యాను. దీనికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అంతా ‘ఆయనే’ సమకూర్చారు. రోజుకు 12 గంటలు కష్టపడి చదివి పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే (2007లో) మహిళా విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాను. తొలుత డిప్యూటి కలెక్టర్‌గా, ఆ తర్వాత నంద్యాల, నెల్లూరు ఆర్డీవోగా, తిరుపతి ‘తుడా’ కార్యదర్శిగాను పనిచేశాను. నేను ఉద్యోగంలో చేరకముందు ఎప్పుడూ ఐఏఎస్ కావాలనుకోలేదు.. ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. గ్రూప్–1 అధికారి నుంచి 2014లో ఐఏఎస్ అయ్యాను. లేదంటే నేను శాస్త్రవేత్తగా నా పరిశోధనలు కొనసాగించేదాన్ని. 'అమ్మ మాట నన్ను ఐఏఎస్ దాకా నడిపించింది' ఎంతో సంతృప్తి.. జాయింట్ కలెక్టర్‌గా నా తొలి పోస్టింగ్ కృష్ణా జిల్లాలోనే. గత ఏడాది జూన్‌లో ఇక్కడ చేరాను. సైంటిస్ట్‌గా కొనసాగలేదన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఐఏఎస్‌గా నాకు ఎంతో సంతృప్తి ఉంది. ప్రజలకు నిత్యం సేవ చేసే అవకాశం దక్కిందన్న ఆనందం ఉంది. పురుషుడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ నా విజయం వెనక ‘ఆయన’ ఉన్నారు. నాలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించారు. ఆయన ఆశలకనుగుణంగానే గ్రూప్–1కు ఎంపికయ్యాను. క్రమంగా ఐఏఎస్‌గా పదోన్నతి పొందాను. మాకు ఇద్దరు పిల్లలు. బాబు కౌషిక్‌రెడ్డి ఇంటర్, పాప హర్షిత ఏడో తరగతి చదువుతున్నారు. -
మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్
హైదరాబాద్: ఆదివారం రోజున పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. 'మార్పు మొదలైంది. మోదీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయ్యింది. అయ్య బాబోయ్ మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు. నిన్న జనగణమన పాడేరు. నేడు దేవాలయాలు బాగుచేయాలంటున్నారు. మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్‌ని కోరారు' అని అన్నారు. (చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి) -
చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి
'నచ్చావులే' సినిమా హీరోయిన్ మాధవీలత తన ఫేస్బుక్ పేజీలో చచ్చిపోతానన్న వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై వివరణ ఇచ్చింది. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్ పేజిలో.. 'డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు. నేను బానే ఉన్నాను. ఉంటాను. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే... మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి పుట్టి మాత్రమే అలా చెప్పాను. ఇక రిలాక్స్ అవ్వండి. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను మామూలుగానే నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను' అంటూ ఆమె వివరణ ఇచ్చింది. నేను చచ్చిపోతా: హీరోయిన్ -
నేను చచ్చిపోతా: హీరోయిన్
నచ్చావులే సినిమా హీరోయిన్ మాధవీలత తాను చనిపోతానంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. పైగా తాను చచ్చిపోతాననే విషయాన్ని ఫ్రెండ్స్‌తో కూడా చెప్తూ ఉంటానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అలాంటి పిచ్చి పనులు చేయకండని మాధవికి సూచించారు. ధైర్యంగా ఉండండని ఆమెకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ హీరోయిన్ గురువారం అర్ధరాత్రి తాను మరణిస్తానని పోస్ట్ పెట్టింది. ఏదో ఒక రోజు ‘ప్రేమ” సినిమా లో రేవతిలా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా చనిపోతుంది. తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది. అయితే తనకు చిన్న సమస్యలే ఉన్నాయని, కానీ వాటికి ఎక్కువ కాలం మందులు వాడాలని పేర్కొంది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయంది. తనకు మందులంటే అసహ్యమని, కానీ వీటి కోసం మందులు వాడుతున్నానని తెలిపింది. కలలు, కోరికలు, ఆశలున్నాయి.. కానీ ఈ మందులు తన ఆయుష్షును ఉంచవేమో అని భయాన్ని వెలిబుచ్చింది. ఆరోగ్యమే అసలైన సంపద అంటారు. కానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు అని చెప్పుకొచ్చింది. చదవండి: నటి ప్రేమలేఖ నెట్టింట్లో వైరల్ -
మున్సిపల్ పోరులో మాధవీలత ప్రచారం..
ఘట్కేసర్: మున్సిపాలిటీ 1వ వార్డులో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ ముదిరాజ్, సినీనటి మాధవీలత అభ్యర్థి రవికాంత్‌రెడ్డి, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉమాదేవిని గెలిపించాలని ఆదివారం ప్రచారం చేశారు. -
మాధవీలత ఇక ఐఏఎస్
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ సెక్రటరీ డాక్టర్ కె. మాధవీలత కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది గ్రూప్ వన్ ఆఫీసర్లకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలో తుడా సెక్రటరీ మాధవీలత మొదటి స్థానంలో నిలిచారు. ఏపీపీఎస్సీ 2007లో గ్రూప్ వన్ రాయగా ఆమె రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించారు. శిక్షణ అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓగా, నెల్లూరు ఆర్డీఓగా పనిచేశారు. ఆపై 2014లో తిరుపతి పట్టణాభివృద్ధి సెక్రటరీగా నియమితులయ్యారు. ఈమె జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తుడా వైస్ చైర్మన్, టీటీడీ భూసేకరణ అధికారి, డ్వామా పీడీ, తెలుగు గంగ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా మాధవీలత విజయవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు. మలకాటపల్లె నుంచి ఐఏఎస్ వరకు.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని మలకాటపల్లెకు చెందిన కేవీ కృష్ణారెడ్డి, రామలక్ష్మమ్మ దంపతులకు తొలి సంతానం మాధవీలత. ఈమె ప్రాథమిక విద్య కడపలో, ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ లో చదివారు. అనంతరం ఎంసెట్ ద్వారా వ్యవసాయ విద్యలో సీటు సంపాదించారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో వ్యవసాయ విద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఆపై కంది పంటపై పరిశోధన పూర్తి చేసి, డాక్టరేట్ పొందారు. ఆమె చేసిన పరిశోధనల కారణంగా ప్రముఖ ఇక్రిశాట్ సంస్థలో శాస్త్రవేత్తగా అవకాశం కల్పించింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన భర్త వెంకటరామమునిరెడ్డి (ప్రముఖ సైంటిస్టు) అంతటితో ఆగకుండా గ్రూప్స్ రాయించారు. భర్త నమ్మకాన్ని వమ్ముచేయకుండా మొదటి దశలోనే ఏపీపీఎస్సీలో మహిళా విభాగంలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమెను కేంద్రం కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ప్రకటించింది. మరింత సేవచేసే అవకాశం వ్యవసాయ విద్య ద్వారా రైతుకు అండగా నిలిచి సేవ చేయాలను కున్నా. గ్రూప్ వన్ రాయడంతో రాష్ట్ర మొదటి ర్యాంక్ వచ్చింది. దీంతో వ్యవసాయ రంగాన్ని వదులుకుని అడ్మినిష్ట్రేషన్ రంగంలోకి వచ్చాను. అయితే ఈ రంగం ద్వారా రైతులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మరింగా సేవ చేయవచ్చు. ఐఏఎస్‌గా మరింతగా ప్రజలకు దగ్గరై మెరుగైన సేంలందించే అవకాశం లభించింది. – డాక్టర్ కె. మాధవీలత,తుడా సెక్రటరీ -
ఫస్ట్‌లుక్ 25th June 2018
-
నాచగిరీశుని సన్నిధిలో సినీనటి మాధవీలత
వర్గల్(గజ్వేల్) : నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని మంగళవారం సాయంత్రం సినీ నటి, హీరోయిన్ మాధవీలత సందర్శించారు. గర్భగుడిలో కొలువుదీరిన నృసింహస్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు మాధవీలత పేరిట అర్చన జరిపి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ సినిమాల్లో మాధవీలత హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే. ప్రజలకు సేవలందించాలనే భావనతో తాను బీజేపీలో చేరానని, సినీరంగంలో ఉంటూనే రాజకీయ రంగంలో కొనసాగుతానని ఆమె చెప్పారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యవేత్త వేణుస్వామి ఉన్నారు. -
గుంటూరులో మెరి‘సినీ’ తారలు!
(గుంటూరు): నగరంలో సినీ తారలు సందడి చేశారు. సోమవారం స్థానిక లాలాపేట వెంకటేశ్వరస్వామి గుడిరోడ్లోని శరణంస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్స్ ఎస్తేర్ నూర్హన్ (జయ జానకి నాయక ఫేమ్ ), మాధవీలత ( నచ్చావులే ఫేమ్) విచ్చేశారు. రాజకీయ నాయకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాల్ నిర్వాహకులు శరణం శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, రాయపాటి రంగారావు, మాల్ నిర్వాహకులు కోలా అశోక్‌కుమార్, చీతిరావు పుల్లారావు, అచ్చుత వేణుబాబు, దామోదర చంద్రశేఖర్, కావేటి శివ పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మాధవీలత విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీనటి మాధవీలత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నో సార్లు మాట మార్చారని మండిపడ్డారు. హోదా కంటే ఎక్కువగా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు ఇచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఎవరైనా లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. లారీ ఇసుక ఎత్తేసినందుకు 5లక్షల రూపాయల బిల్లుపెట్టారంటూ మండిపడ్డారు. తన పదో తరగతి నుంచే పవన్ అంటే ఇష్టమని చెప్పిన మాధవీలత, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆపార్టీలో చేరినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పనిచేయాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. అంతేకాదు పోటీ గురించి మాట్లాడుతూ పార్టీ అవకాశం ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానంటూ, తన మనసులోని మాటను చెప్పారు. తనకు ఎలాంటి ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేవని, తమ కుటుంబంలో చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. -
బీజేపీలోకి హీరోయిన్ మాధవీలత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి, హీరోయిన్ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో మాధవీలత పవన్ పార్టీ జనసేన తరపున ప్రచారం చేస్తానంటూ చెప్పారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిలిం ఛాంబర్ ఎదుట సైతం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దికాలంగా మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సైతం హల్చల్ చేశాయి. అయితే ఆమె అనూహ్యంగా శనివారం బీజేపీలో చేరారు. ఆమెతో పాటు కార్వాన్ కాంగ్రెస్ నేత అమర్ సింగ్, కేయూ మాజీ వీసీ వైకుంఠంలు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరడానికి వస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని, ఇది పార్టీ ఎదుగడానికి దోహదపడుతుందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారిని స్వాగతిస్తున్నామని, తెలంగాణ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. -
శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాధవి లత మౌనదీక్ష
-
పోలీసుల అదుపులో మాధవి లత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం చాంబర్ ఎదుట మౌనదీక్ష చేసిన హీరోయిన్ మాధవి లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. బుధవారం ఉదయమే ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్న మాధవి లత.. తలకు, దుస్తులకు నల్లరంగు రిబ్బన్లు ధరించి కార్యాలయం ముందు బైఠాయించారు. పవన్ అభిమానులు సైతం ఆమెతో కలిసి దీక్షలో కూర్చున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు కూడా ఆమెకు మద్దతుపలికినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లోనూ దీక్ష కొనసాగింపు: కొద్ది రోజుల కిందట ఇదే ఫిలిం చాంబర్ ముందు నటి శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దరిమిలా నేటి మాధవి లత దీక్షపై చాంబర్ వర్గాలు ఆందోళన చెందినట్లు తెలిసింది. మాధవి మౌనదీక్షకు కూర్చున్న కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టిన హీరోయిన్.. స్టేషన్లోనూ మౌనదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు: కాస్ట్ కౌచింగ్‌పై గళమెత్తి, దానిని చర్చనీయాంశంగా మార్చిన నటి శ్రీరెడ్డి.. ఇటీవలే నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే. తమ అభిమాన హీరోను దూషించిన నటి శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీ లతకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న పవన్ అభిమానులు.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.