మాధవి లతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎపిసోడ్ చూడండి అంటూ ట్వీట్ | Narendra Modi Message To Owaisi Challenger Madhavi Latha | Sakshi
Sakshi News home page

మాధవి లతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎపిసోడ్ చూడండి అంటూ ట్వీట్

Published Sun, Apr 7 2024 2:10 PM | Last Updated on Sun, Apr 7 2024 3:13 PM

Narendra Modi Message To Owaisi Challenger Madhavi Latha - Sakshi

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ సొంతం చేసుకున్న హదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా బీజేపీ హస్తగతం చేసుకోవడానికి 'మాధవి లత'ను రంగంలోకి దింపారు.

బీజేపీ తరపున పోటీ చేస్తున్న విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవి లత బలమైన ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ బలంగా సాగుతోంది. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె వ్యక్తపరిచిన ఆలోచనలనలకు ప్రధాని మోదీ సైత ఫిదా అయ్యారు.

మాధవి లతను ప్రశంసిస్తూ మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ''మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్‌ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.

ఎవరీ మాధవి లత?
కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్‌. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.

హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవి లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చినట్లు సమాచారం.

ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement