గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం' | Ghazal Srinivas to debut as a hero | Sakshi
Sakshi News home page

గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం'

Published Wed, Jul 1 2015 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం'

గజల్ శ్రీనివాస్, మాధవి లత 'అనుష్టానం'

హైదరబాద్ : తన వినులవిందైన గజల్ గానంతో శ్రోతలను సమ్మోహితుల్ని చేసి... గజల్నే ఇంటి పేరుగా మార్చుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ హీరోగా అనుష్ఠానం చిత్రం తెరకెక్కుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. గజల్ శ్రీనివాస్ సరసన మాధవి లత నటిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య నెలకొన్న సున్నితమైన అంశాలే ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1950లో ప్రముఖ కవి గుడిపాటి వెంకటాచలం రచించిన 'అనుష్టానం' కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వాసా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనుష్టానానికి స్వరాలు కూడా దర్శకుడు కృష్ణ అందిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement