తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
సైబరాబాద్ కమిషనర్‌కు మాధవీలత లేఖ పూర్వక ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని ఆరోపిస్తూ ఆమె మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అవినాష్ మహంతికు లేఖ పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నటీమణులు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులలో భయాన్ని, బాధను కలిగించాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ముందు జేసీ పార్క్ వద్ద తరచుగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు హాజరుకావద్దని మాధవీలత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి ఆమెపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment