మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్‌ | Actor Madhavi Latha Comments On Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్‌

Published Mon, Feb 10 2020 4:05 PM | Last Updated on Mon, Feb 10 2020 10:19 PM

Actor Madhavi Latha Comments On Akbaruddin Owaisi - Sakshi

హైదరాబాద్‌: ఆదివారం రోజున పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. 'మార్పు మొదలైంది. మోదీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయ్యింది. అయ్య బాబోయ్‌ మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు. నిన్న జనగణమన పాడేరు. నేడు దేవాలయాలు బాగుచేయాలంటున్నారు. మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా. హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభాప‍క్ష నాయకుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌, సీఎం కేసీఆర్‌ని కోరారు' అని అన్నారు. 

(చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement