
మాధవిలత షేర్ చేసిన వీడియోలోని దృశ్యం
హైదరాబాద్: టాలీవుడ్ నటి మాధవిలత మరో అంశంపై తెరపైకి వచ్చారు. భారత్‌లో ఉన్న రూల్స్ చూసి సిగ్గుపడాలంటూ కామెంట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్‌కు వస్తున్నారన్న నేపథ్యంలో రంగులు వేస్తూ హడావుడి చేయడంపై మాధవిలత ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు సంబంధించిన సమస్యను చూపిస్తూ.. ఈ విషయంలో మహిళలకు సహకరించని ప్రభుత్వ నిబంధనలపై ఆమె మండిపడ్డారు.
ఆడవాళ్లు రుతుస్రావం సమయంలో వాడే ప్యాడ్స్‌పై 12 శాతం పన్ను(టాక్స్) విధించిన ప్రభుత్వం కండోమ్స్ పై మాత్రం వేయలేదన్నది వీడియోలో చూడవచ్చు. ప్రియాంక పెరుమాల్ అనే నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోను నటి మాధవిలత తన ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ 'షేమ్ ఆన్ ఇండియన్ రూల్స్' అంటూ అసహనం వ్యక్తం చేశారు. శానిటరీ ప్యాడ్ కొనేందుకు వచ్చిన ఆమెకు పన్ను కలిపిన ధర చెప్పిన దుకాణాదారుడు, మరో వ్యక్తి వచ్చి కండోమ్ అడిగితే ప్రభుత్వం దీనిపై ట్యాక్స్ విధించలేదంటూ అతి తక్కువ ధరకు (కండోమ్) విక్రయిస్తాడు. టాలీవుడ్ నటి మాధవిలత షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 88 శాతం ఆడవాళ్లు శానిటరీ ప్యాడ్స్ బదులుగా గుడ్డలు, బూడిద, ఇసుక లాంటివి వాడుతున్నారట.
Comments
Please login to add a commentAdd a comment