నేను చచ్చిపోతా: హీరోయిన్‌ | Madhavi Latha Says She May Death Like Prema Movie | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా

Jan 31 2020 1:14 PM | Updated on Jan 31 2020 1:16 PM

Madhavi Latha Says She May Death Like Prema Movie - Sakshi

నచ్చావులే సినిమా హీరోయిన్‌ మాధవీలత తాను చనిపోతానంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. పైగా తాను చచ్చిపోతాననే విషయాన్ని ఫ్రెండ్స్‌తో కూడా చెప్తూ ఉంటానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అలాంటి పిచ్చి పనులు చేయకండని మాధవికి సూచించారు. ధైర్యంగా ఉండండని ఆమెకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ హీరోయిన్‌ గురువారం అర్ధరాత్రి తాను మరణిస్తానని పోస్ట్‌ పెట్టింది. ఏదో ఒక రోజు ‘ప్రేమ” సినిమా లో రేవతిలా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా చనిపోతుంది.

తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది. అయితే తనకు చిన్న సమస్యలే ఉన్నాయని, కానీ వాటికి ఎక్కువ కాలం మందులు వాడాలని పేర్కొంది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయంది. తనకు మందులంటే అసహ్యమని, కానీ వీటి కోసం మందులు వాడుతున్నానని తెలిపింది. కలలు, కోరికలు, ఆశలున్నాయి.. కానీ ఈ మందులు తన ఆయుష్షును ఉంచవేమో అని భయాన్ని వెలిబుచ్చింది. ఆరోగ్యమే అసలైన సంపద అంటారు. కానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు అని చెప్పుకొచ్చింది.

చదవండి:  నటి ప్రేమలేఖ నెట్టింట్లో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement