అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ | Actress Madhavi Latha Instagram Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Maadhavi Latha: బిగ్‌బాస్‌ కంటే మాకు ఇజ్జత్ ముఖ్యం.. ఆ టాపిక్ ఓ సోది: మాధవిలత పోస్ట్ వైరల్!

Published Sun, Sep 17 2023 7:03 PM | Last Updated on Mon, Sep 18 2023 5:05 PM

Actress Madhavi Latha Instagram Post Goes Viral On Social Media - Sakshi

టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పోస్టులు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్‌ బాస్‌ షోపై కామెంట్స్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

(ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)

మాధవిలత పోస్ట్‌లో రాస్తూ.. 'బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఓ సోది టాపిక్. వారిని పెడితే ఎవరూ చూడరు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. ఎవరినీ హౌస్‌లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు. ఈ సీజన్‌లో చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్‌ యూ' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్‌లో సామాన్యుని కేటగిరీలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరీ మాధవిలత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement