పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్! | Tollywood Actress Maadhavi Latha Comments On Her Marriage | Sakshi
Sakshi News home page

Maadhavi Latha: పెళ్లి చేసుకోని వాళ్లంతా బలిసినోళ్లా?.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన మాధవిలత!

Sep 14 2023 6:52 PM | Updated on Sep 14 2023 8:55 PM

Tollywood Actress  Maadhavi Latha Comments On Her Marriage - Sakshi

నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

(ఇది చదవండి:  పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్‌ కౌంటర్‌!)

అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్‌బుక్‌లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. 

మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్‌ నటుడు కన్నుమూత!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement