ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు.
అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్‌మీట్‌లో ఈ రూల్స్ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)
మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..
ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు.
కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment