ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు.
మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది.
(ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )
కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment