madhavilata
-
అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు. మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
మూడు రోజులు.. ఇంకా కోమాలోనే మాధవీలత !
ఒంగోలు /చీమకుర్తి: మండల పరిధిలో మూడురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మిడసల మాధవీలత, కుమారుడు జనార్దన్‌లు ఇంకా కోమాలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం రిమ్స్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈనెల 8న పేర్నమిట్ట శాంతినగర్‌కు చెందిన మాధవీలత, కొడుకు, కూతురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కూతురు విజయలక్ష్మి అప్పుడే మృతిచెందగా మాధవీలత, జనార్దన్ మృత్యువుతో పోరాడుతున్నారు. శరీరంలో పురుగుల మందు ప్రభావం కనీసం వారం రోజుల వరకు ఉంటుందని వైద్యం చేస్తున్న డాక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని వారం రోజులు గడిస్తేగాని వారి ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తాలూకా సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను నిపుణులచే పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మాధవీలత ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొంతమందికి ఇవ్వాల్సిన చిన్న అప్పులను కూడా పిలిచి ఇచ్చినట్లు, అంటే ఆత్మహత్య చేసుకోవాలనే ముందే అనుకుని ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు సీఎంను, కలెక్టర్‌ను అడ్రెస్ చేస్తూ తన భర్త చనిపోవడానికి గల కారకుల పేర్లను సూసైడ్‌నోట్‌లో రాసి ఉంచటమే కాకుండా మాధవీలత చేతుల మీదకూడా వారి పేర్లు రాసినట్లు చెప్పుకుంటున్నారు. -
సిరిమల్లె పువ్వల్లె నవ్వు..
సినీతారలు గురువారం సిటీలో తళుక్కుమన్నారు. స్నేహ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో వస్త్ర సంబంధ ఉత్పత్తులను ఆవిష్కరించింది. లావణ్య త్రిపాఠి, మాధవీలత ఏఎస్‌రావునగర్‌లోని వస్త్ర దుకాణంలో సందడి చేశారు. ఏఎస్‌రావునగర్: హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, మాధవీలతఏఎస్రావునగర్లో గురువారం సందడి చేశారు. ఇక్కడఏర్పాటు చేసిన ‘అరిహంట్ ఫ్యాషన్ వరల్డ్’ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చి న్యూ కలెక్షన్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సుమిత్జైన్, అమిత్‌జైన్, డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీ విద్యాసాగర్, కార్పొరేటర్ పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శారీ సోయగం మాదాపూర్: చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని సినీ నటి భవ్రశ్రీ అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శనను ఆమెగురువారం ప్రారంభించారు. 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందించిన చేనేత ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు మంజునాథ్తెలిపారు. సోషలైట్ స్నేహాచౌదరి తదితరులు పాల్గొన్నారు. స్నేహసౌందర్యం జూబ్లీహిల్స్:సినీ నటి స్నేహ సిటీలో మెరిశారు.హిందుస్థాన్యూనిలివర్నూతనంగా రూపొందించిన కంఫర్ట్ ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్కండిషనర్ను తాజ్‌కృష్ణా హోటల్లోగురువారం నిర్వహించిన కార్యక్రమంలోఆవిష్కరించారు. కార్యక్రమంలో చర్మ సంరక్షణ నిపుణురాలు డాక్టర్ రోహిణి వాద్వాని, పిల్లల వైద్య నిపుణులు ఉదయ్‌పాల్, కంపెనీ మార్కెటింగ్ హెడ్వందనసూరి తదితరులుపాల్గొన్నారు. -
స్వైన్ టై..
చెన్నైలో చికిత్సపొందుతూ మహిళ మృతి అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ డోర్ టూ డోర్ సర్వేకు శ్రీకారం నెల్లూరు (అర్బన్): స్వైన్‌ఫ్లూపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వెంకటాచలం మండలానికి చెందిన మాధవీలత స్వైన్‌ఫ్లూ సోకి చెన్నైలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. అలాగే ఇటీవల నెల్లూరు నగరానికి చెందిన మహిళ కూడా ఫ్లూ లక్షణాలు కనపడటంతో చెన్నైలో చికిత్స చేయించుకొని నయం చేసుకొని వచ్చారు. అయితే సోమవారం జిల్లాకు చెందిన మహిళ మృతిచెందడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. మహిళ చనిపోయిన ప్రాంతంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఇంకా ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భారతిరెడ్డి తెలిపారు. తాను ఆ ప్రాంతానికి వెళ్లి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడానన్నారు. కాగా మృతి విషయమై జిల్లా కలెక్టర్ జానకి ఆరాతీసినట్లు తెలిసింది. డీఎంహెచ్ఓ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నట్లు, ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో విస్త్రతంగా అవగాహన తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. డోర్ టూ డోర్ సర్వే.. : జిల్లావ్యాప్తంగా డోర్ టూ డోర్ సర్వే చేయించే ప్రయత్నంలో వైద్యశాఖ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఇంటికి తమ సిబ్బందిని పంపించి నాలుగైదు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వారికి చికిత్స చేయించాలని, నయం కాకపోతే స్వైన్‌ఫ్లూ పరీక్ష జరపాలని భావిస్తున్నారు. మెడికల్ అధికారులతో దీనిపై డీఎంహెచ్ఓ మాట్లాడారు. డోర్ టూ డోర్ సర్వే పెద్ద అంశం కాబట్టి సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అంతా కుదిరితే సర్వే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరపత్రాలను విస్త్రృతంగా పంపిణీ చేయాలని, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని, ఫ్లూపై నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆమె క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చారు. చెన్నైకు ఫ్లూ అనుమానితుడు..: ఇదిలాఉండగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత మూడు, నాలుగు రోజులుగా జ్వరం కారణంగా చికిత్సపొందుతున్న వ్యక్తిని ఫ్లూ అనుమానంతో చెన్నైకు తరలించినట్లు సమాచారం. ఆస్పత్రి వైద్యు ల సూచన మేరకు ఫ్లూ పరీక్ష చేయించేం దుకు అతడిని తీసుకెళ్లారు. ఫ్లూ అనుమానితులు ఎవ్వరూ నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకొనేందు కు ఇష్టపడటం లేదు. నాలుగైదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న పలువురు ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్ల సలహా మేరకు ఫ్లూ నిర్ధారణ పరీక్ష చేయించుకొనేందుకు చెన్నై బాట పడుతున్నారు. -
భర్తపై అనుమానంతో క్షణికావేశంలో..
విజయవాడలో వివాహిత ఆత్మహత్య మృతురాలు వీరులపాడు మండలంలో టీచర్ మృతదేహం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలింపు విజయవాడ, న్యూస్‌లైన్ : భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ ఉపాధ్యాయురాలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. కృష్ణలంక రా మాలయం వీధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరి గింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్ర కారం.. కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన సోమేశ్వరరావు ఉయ్యూరుకు చెందిన మాధవీలత(31)ను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. సోమేశ్వరరావు మెడికల్ రిప్రజెంటెటివ్ కాగా, మాధవీలత వీరులపాడు మండలం రంగాపురం గ్రామంలోని మం డల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కృష్ణలంక రామాలయం వీధిలోని ఓ ఇంట్లో నాలుగేళ్లుగా వీరు అద్దెకు ఉంటున్నారు. భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని మాధవీలత అనుమానిస్తోంది. దీంతో ఐదు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, భర్తను లోనికి రానీయకుండా ఆమె తలుపులు వేసుకుంది. చుట్టుపక్కలవారు చూస్తుండటంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. ఈలోగా మాధవీలత భర్తకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా, అతడు తేలిగ్గా తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోనుంచి చూడగా భార్య దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో వెనుకవైపు నుంచి లోనికి వెళ్లి భార్యను ఉరి నుంచి కిందకు దించాడు. కొన ఊపిరి ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. అత్తవారింటికి మృతదేహం తరలింపు మాధవీలత మృతదేహాన్ని భర్త క్రాప గ్రామానికి తీసుకెళ్లిపోయాడు. ఉయ్యూరులో ఉన్న తోడల్లుడు అంజి బాబుకు ఫోన్‌చేసి ఈ విషయం చెప్పాడు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కృష్ణలంకలోని వారింటికి రాగా, మృతదేహాన్ని క్రాప గ్రామానికి తీసుకెళ్లినట్లు చె ప్పారు. వీరుకూడా అక్కడకు వెళ్లి, ఈ ఘటన గురించి అడగ్గా, సోమేశ్వరరావు కుటుంబీకుల తరఫు నుంచి సరైన స్పందనలేదు. దీంతో మృతురాలి తండ్రి వీరంకి నాగేశ్వరరావు విజయవాడ వచ్చి కృష్ణలంక పోలీసుల కు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అందులో పేర్కొన్నారు. దీనిపై స్టేషన్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి రంగప్రవేశం చేశారు. తరువాత నాగేశ్వరరావు మరోసారి పోలీసులను కలిశారు. మాధవీలత తొందరపాటుతో ఆత్మహత్య చేసుకుందని చెప్పి, ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని కోరారు. అయితే వారు ఇందుకు అంగీకరించలేదు. అనంతరం ఏసీపీ లావణ్యలక్ష్మి, కృష్ణలంక సెక్టార్-1 ఎస్సై అడబాల శ్రీనివాస్ సి బ్బందితో క్రాప గ్రామానికి వెళ్లారు. మాధవీలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని బంధువులకు చెప్పి, తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకు ముం దు కొల్లూరు తహశీల్దార్ రాజ్‌కుమార్, ఆర్ఐ నా గరాజరావు, కృష్ణలంక ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో పం చనామా నిర్వహించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిర్వహిస్తున్నారు.