- విజయవాడలో వివాహిత ఆత్మహత్య
- మృతురాలు వీరులపాడు మండలంలో టీచర్
- మృతదేహం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలింపు
విజయవాడ, న్యూస్‌లైన్ : భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ ఉపాధ్యాయురాలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. కృష్ణలంక రా మాలయం వీధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరి గింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్ర కారం.. కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన సోమేశ్వరరావు ఉయ్యూరుకు చెందిన మాధవీలత(31)ను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
సోమేశ్వరరావు మెడికల్ రిప్రజెంటెటివ్ కాగా, మాధవీలత వీరులపాడు మండలం రంగాపురం గ్రామంలోని మం డల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కృష్ణలంక రామాలయం వీధిలోని ఓ ఇంట్లో నాలుగేళ్లుగా వీరు అద్దెకు ఉంటున్నారు. భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని మాధవీలత అనుమానిస్తోంది. దీంతో ఐదు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అతడు గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, భర్తను లోనికి రానీయకుండా ఆమె తలుపులు వేసుకుంది. చుట్టుపక్కలవారు చూస్తుండటంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. ఈలోగా మాధవీలత భర్తకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా, అతడు తేలిగ్గా తీసుకున్నాడు.
కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోనుంచి చూడగా భార్య దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో వెనుకవైపు నుంచి లోనికి వెళ్లి భార్యను ఉరి నుంచి కిందకు దించాడు. కొన ఊపిరి ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.
అత్తవారింటికి మృతదేహం తరలింపు
మాధవీలత మృతదేహాన్ని భర్త క్రాప గ్రామానికి తీసుకెళ్లిపోయాడు. ఉయ్యూరులో ఉన్న తోడల్లుడు అంజి బాబుకు ఫోన్‌చేసి ఈ విషయం చెప్పాడు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కృష్ణలంకలోని వారింటికి రాగా, మృతదేహాన్ని క్రాప గ్రామానికి తీసుకెళ్లినట్లు చె ప్పారు. వీరుకూడా అక్కడకు వెళ్లి, ఈ ఘటన గురించి అడగ్గా, సోమేశ్వరరావు కుటుంబీకుల తరఫు నుంచి సరైన స్పందనలేదు. దీంతో మృతురాలి తండ్రి వీరంకి నాగేశ్వరరావు విజయవాడ వచ్చి కృష్ణలంక పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అందులో పేర్కొన్నారు. దీనిపై స్టేషన్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి రంగప్రవేశం చేశారు. తరువాత నాగేశ్వరరావు మరోసారి పోలీసులను కలిశారు. మాధవీలత తొందరపాటుతో ఆత్మహత్య చేసుకుందని చెప్పి, ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని కోరారు. అయితే వారు ఇందుకు అంగీకరించలేదు.
అనంతరం ఏసీపీ లావణ్యలక్ష్మి, కృష్ణలంక సెక్టార్-1 ఎస్సై అడబాల శ్రీనివాస్ సి బ్బందితో క్రాప గ్రామానికి వెళ్లారు. మాధవీలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని బంధువులకు చెప్పి, తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకు ముం దు కొల్లూరు తహశీల్దార్ రాజ్‌కుమార్, ఆర్‌ఐ నా గరాజరావు, కృష్ణలంక ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో పం చనామా నిర్వహించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిర్వహిస్తున్నారు.