Someshwar Rao
-
ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు
వర్ధన్నపేట రూరల్ : డ్రైవర్ నిద్రమత్తు ఘోర ప్రమాదానికి దారితీసింది. వేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బొంగు వెంకట్రాం, రాధమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సోమేశ్వర్రావు(30) బీఎస్ బ్రదర్స్ ఇంజినీరింగ్ వర్క్స్ నిర్వహిస్తూ పవర్ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో నిర్మిస్తున్న ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇటీవల పనులను ప్రారంభించారు. ఆ పనులను పర్యవేక్షించడానికి బీటెక్ పూర్తి చేసి తన వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న వెప్పర్తి పుణ్యరాజు(23), డ్రైవర్ గరిగెబాటి నాగభూషణం(25), అడిగిబోయిన మనోహర్‌తో కలిసి బొలెరో వాహనంలో మండపేట నుంచి మంచిర్యాలకు ఆదివారం అర్ధరాత్రి బయల్దేరారు. దూరప్రయాణం కావడంతో ఖమ్మం సమీపంలో వాహనం ఆపి కాసేపు నిద్రించారు. సోమవారం ఉదయంలోగా మంచిర్యాలకు చేరుకోవాలనే ఆతృతతో నిద్రమత్తులోనే బయల్దేరారు. ఈ క్రమంలో వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని బొలెరో వాహనం వేగంగా ఢీకొంది. ప్రమాదంలో సోమేశ్వర్రావు, పుణ్యరాజు, నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందగా, మనోహర్ గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. అతడిని హుటాహుటిన 108లో వర్ధన్నపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. వారం రోజుల క్రితమే వాహనం కొనుగోలు పవర్ ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్న సోమేశ్వర్రావు మండపేట నుంచి మంచిర్యాలకు దూరప్రయాణం కావడ ంతో వారం రోజుల క్రితమే బొలెరో వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆ వాహనం వెనకభాగంలో వెల్డింగ్ మిషన్, రెండు గ్యాస్ సిలండర్లను వేసుకుని మంచిర్యాలకు బయల్దేరి ప్రమాదానికి గురయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు సంఘటన స్థలాన్ని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మామునూరు డీఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసిపరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకున్నారు. నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు. -
ఎక్కడో.. చంపి ఇక్కడకు తెచ్చి..
వేటపాలెం : గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వేటపాలెంలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. చీరాల - ఒంగోలు రోడ్డులో గతంలో కనకదుర్గా వైన్స్ నిర్వహించిన భవనం, దాని పక్కనే మరో వ్యక్తి ఇంటికి మధ్య కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంది. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని టైలర్ సోమేశ్వరరావు గమనించాడు. అక్కడ గుర్తుతెలియని యువకుని మృతదేహం ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీరాల సీఐ ఫిరోజ్, ఎస్సై జి.రామిరెడ్డిలు హుటాహుటిన వచ్చి మృత దే హాన్ని పరిశీలించారు. మృతుని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. దుప్పటి తొలిగించి చూడగా దుస్తులు లేవు. మెడకు తాడు బిగించి ఉంది. రెండు కాళ్లు కలిపి తాడుతో కట్టి ఉంది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతునికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృదేహం ఉబ్బి ముఖం గుర్తు పట్టేందుకు వీల్లేకుండా ఉంది. హత్య జరిగి రెండు రోజులై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పడేసినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరహర పరిశీలించారు. చుట్టపక్కల కలియదిరిగిన డాగ్ స్క్వాడ్ ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చింది. హంతకుల ఆధారాల కోసం రూబీ (పోలీసు కుక్క) చుట్టుపక్కల కలియదిరిగింది. మృతదేహం నుంచి పాత కనకదుర్గా వైన్స్ షాపు వెనక మీదగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. అక్కడి నుంచి గడియార స్తంభం సెంటర్ మీదుగా ఒన్‌వే రోడ్ వైపునకు మళ్లింది. తిరిగి పోస్టాఫీస్ రోడ్డు మీదుగా చీరాల -ఒంగోలు రోడ్డుకు వచ్చి మళ్లీ సంఘటన స్థలం చేరుకుని ఆగింది. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికుల్లో భయాందోళన వేటపాలెం ప్రధాన సెంటర్‌కు దగ్గరలో నివాసాలు అధికంగా ఉండే ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడి హత్య సంచలనం సృష్టించింది. స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిత్యం ర ద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భర్తపై అనుమానంతో క్షణికావేశంలో..
విజయవాడలో వివాహిత ఆత్మహత్య మృతురాలు వీరులపాడు మండలంలో టీచర్ మృతదేహం తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలింపు విజయవాడ, న్యూస్‌లైన్ : భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ ఉపాధ్యాయురాలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. కృష్ణలంక రా మాలయం వీధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరి గింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్ర కారం.. కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన సోమేశ్వరరావు ఉయ్యూరుకు చెందిన మాధవీలత(31)ను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. సోమేశ్వరరావు మెడికల్ రిప్రజెంటెటివ్ కాగా, మాధవీలత వీరులపాడు మండలం రంగాపురం గ్రామంలోని మం డల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కృష్ణలంక రామాలయం వీధిలోని ఓ ఇంట్లో నాలుగేళ్లుగా వీరు అద్దెకు ఉంటున్నారు. భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని మాధవీలత అనుమానిస్తోంది. దీంతో ఐదు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, భర్తను లోనికి రానీయకుండా ఆమె తలుపులు వేసుకుంది. చుట్టుపక్కలవారు చూస్తుండటంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. ఈలోగా మాధవీలత భర్తకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా, అతడు తేలిగ్గా తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోనుంచి చూడగా భార్య దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో వెనుకవైపు నుంచి లోనికి వెళ్లి భార్యను ఉరి నుంచి కిందకు దించాడు. కొన ఊపిరి ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. అత్తవారింటికి మృతదేహం తరలింపు మాధవీలత మృతదేహాన్ని భర్త క్రాప గ్రామానికి తీసుకెళ్లిపోయాడు. ఉయ్యూరులో ఉన్న తోడల్లుడు అంజి బాబుకు ఫోన్‌చేసి ఈ విషయం చెప్పాడు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కృష్ణలంకలోని వారింటికి రాగా, మృతదేహాన్ని క్రాప గ్రామానికి తీసుకెళ్లినట్లు చె ప్పారు. వీరుకూడా అక్కడకు వెళ్లి, ఈ ఘటన గురించి అడగ్గా, సోమేశ్వరరావు కుటుంబీకుల తరఫు నుంచి సరైన స్పందనలేదు. దీంతో మృతురాలి తండ్రి వీరంకి నాగేశ్వరరావు విజయవాడ వచ్చి కృష్ణలంక పోలీసుల కు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అందులో పేర్కొన్నారు. దీనిపై స్టేషన్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి రంగప్రవేశం చేశారు. తరువాత నాగేశ్వరరావు మరోసారి పోలీసులను కలిశారు. మాధవీలత తొందరపాటుతో ఆత్మహత్య చేసుకుందని చెప్పి, ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని కోరారు. అయితే వారు ఇందుకు అంగీకరించలేదు. అనంతరం ఏసీపీ లావణ్యలక్ష్మి, కృష్ణలంక సెక్టార్-1 ఎస్సై అడబాల శ్రీనివాస్ సి బ్బందితో క్రాప గ్రామానికి వెళ్లారు. మాధవీలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని బంధువులకు చెప్పి, తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకు ముం దు కొల్లూరు తహశీల్దార్ రాజ్‌కుమార్, ఆర్ఐ నా గరాజరావు, కృష్ణలంక ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో పం చనామా నిర్వహించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిర్వహిస్తున్నారు.