Man Died Due To Online Loan Apps Harassments In Vijayawada - Sakshi
Sakshi News home page

Vijayawada: ఫొటోలు మార్ఫింగ్ చేసి భార్యకు పంపిన లోన్ యాప్ నిర్వాహకులు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Jan 29 2023 11:39 AM | Last Updated on Sun, Jan 29 2023 4:17 PM

Ap Vijayawada Man Died Because Loan App Harassment - Sakshi

విజయవాడ: లోన్ యాప్ వేధింపులు భరించలేక విజయవాడకు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చెల్లించలేదని యాప్ నిర్వాహకులు తరచూ వేధిస్తుండటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాప్ నిర్వాహకులు ఈ వ్యక్తి ఫొటోలు మార్ఫింగ్ చేసి మానసిక వేధనకు గురిచేశారు.

మృతుడి పేరు రాజేశ్. మార్ఫింగ్ చేసిన ఫొటోలను భార్యకు పంపడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే మరో వ్యక్తి కూడా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement