విజయవాడలో ఖమ్మం వైద్యవిద్యార్థి ఆత్మహత్య  | Khammam Medical Student Committed Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఖమ్మం వైద్యవిద్యార్థి ఆత్మహత్య 

Published Sun, Feb 26 2023 3:24 AM | Last Updated on Sun, Feb 26 2023 4:25 PM

Khammam Medical Student Committed Suicide In Vijayawada - Sakshi

నవీన్‌కుమార్‌

ఏన్కూరు: ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్‌ నాయక్‌ తండాకు చెందిన బానోతు నవీన్‌కుమార్‌ (23) విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ నెల 15వ తేదీన అతను విజయవాడలోని తన గదిలో పురుగు మందు తాగగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి చిక్సిత పొందుతున్న నవీన్‌ శనివారం ఉద­యం మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా, నవీన్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియల్సి ఉందని అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement