
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధి లోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాలలో ఓ హౌస్‌సర్జన్ తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(24) నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది.
మూడు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శరత్‌చంద్రతో ఆమెకు వివాహమైంది. శరత్‌చంద్ర విజయనగరంలోని వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో పీజీ చదువుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి చైతన్యను భర్త వేధింపులకు గురిచేసేవాడని, నగదు, కారు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తుండేవాడని తెలుస్తోంది. భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన చైతన్య రూమ్‌లో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చైతన్యకు తల్లి జ్యోతికుమారి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది చైతన్య గది వద్దకు వెళ్లి రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment