సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. | Actress Madhavi Latha Inaugurates Arihant Fashion World in AS Rao Nagar | Sakshi
Sakshi News home page

మాధవీ లావణ్యం

Published Fri, Apr 6 2018 8:39 AM | Last Updated on Fri, Apr 6 2018 8:39 AM

Actress Madhavi Latha Inaugurates Arihant Fashion World in AS Rao Nagar - Sakshi

సినీతారలు గురువారం సిటీలో తళుక్కుమన్నారు. స్నేహ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వస్త్ర సంబంధ ఉత్పత్తులను ఆవిష్కరించింది. లావణ్య త్రిపాఠి, మాధవీలత ఏఎస్‌రావునగర్‌లోని  వస్త్ర దుకాణంలో సందడి చేశారు. 

ఏఎస్‌రావునగర్‌: హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, మాధవీలతఏఎస్‌రావునగర్‌లో గురువారం సందడి చేశారు. ఇక్కడఏర్పాటు చేసిన ‘అరిహంట్‌ ఫ్యాషన్‌ వరల్డ్‌’ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చి న్యూ కలెక్షన్స్‌ ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సుమిత్‌జైన్, అమిత్‌జైన్, డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీ విద్యాసాగర్, కార్పొరేటర్‌ పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

శారీ సోయగం
మాదాపూర్‌: చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని సినీ నటి భవ్రశ్రీ అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సిల్క్‌ ఇండియా వస్త్ర ప్రదర్శనను ఆమెగురువారం ప్రారంభించారు. 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందించిన చేనేత ఉత్పత్తులు, డ్రెస్‌ మెటీరియల్స్‌ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు మంజునాథ్‌తెలిపారు. సోషలైట్‌ స్నేహాచౌదరి తదితరులు పాల్గొన్నారు.   

స్నేహసౌందర్యం
జూబ్లీహిల్స్‌:సినీ నటి స్నేహ సిటీలో మెరిశారు.హిందుస్థాన్‌యూనిలివర్‌నూతనంగా రూపొందించిన కంఫర్ట్‌ ప్యూర్‌ సాఫ్ట్‌ ఫ్యాబ్రిక్‌కండిషనర్‌ను తాజ్‌కృష్ణా హోటల్‌లోగురువారం నిర్వహించిన కార్యక్రమంలోఆవిష్కరించారు. కార్యక్రమంలో చర్మ సంరక్షణ నిపుణురాలు డాక్టర్‌ రోహిణి వాద్వాని, పిల్లల వైద్య నిపుణులు ఉదయ్‌పాల్, కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌వందనసూరి తదితరులుపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement