Nachavule
-
చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి
'నచ్చావులే' సినిమా హీరోయిన్ మాధవీలత తన ఫేస్బుక్ పేజీలో చచ్చిపోతానన్న వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై వివరణ ఇచ్చింది. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్ పేజిలో.. 'డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు. నేను బానే ఉన్నాను. ఉంటాను. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే... మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి పుట్టి మాత్రమే అలా చెప్పాను. ఇక రిలాక్స్ అవ్వండి. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను మామూలుగానే నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను' అంటూ ఆమె వివరణ ఇచ్చింది. నేను చచ్చిపోతా: హీరోయిన్ -
నేను చచ్చిపోతా: హీరోయిన్
నచ్చావులే సినిమా హీరోయిన్ మాధవీలత తాను చనిపోతానంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. పైగా తాను చచ్చిపోతాననే విషయాన్ని ఫ్రెండ్స్‌తో కూడా చెప్తూ ఉంటానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అలాంటి పిచ్చి పనులు చేయకండని మాధవికి సూచించారు. ధైర్యంగా ఉండండని ఆమెకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ హీరోయిన్ గురువారం అర్ధరాత్రి తాను మరణిస్తానని పోస్ట్ పెట్టింది. ఏదో ఒక రోజు ‘ప్రేమ” సినిమా లో రేవతిలా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా చనిపోతుంది. తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది. అయితే తనకు చిన్న సమస్యలే ఉన్నాయని, కానీ వాటికి ఎక్కువ కాలం మందులు వాడాలని పేర్కొంది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయంది. తనకు మందులంటే అసహ్యమని, కానీ వీటి కోసం మందులు వాడుతున్నానని తెలిపింది. కలలు, కోరికలు, ఆశలున్నాయి.. కానీ ఈ మందులు తన ఆయుష్షును ఉంచవేమో అని భయాన్ని వెలిబుచ్చింది. ఆరోగ్యమే అసలైన సంపద అంటారు. కానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు అని చెప్పుకొచ్చింది. చదవండి: నటి ప్రేమలేఖ నెట్టింట్లో వైరల్ -
ఆ పేరు తెచ్చుకోకూడదు!
చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 17 సినిమాలు చేసిన నటుడు తనీష్ హీరోగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్ష త్రం’ సినిమాలో విలన్‌గా నటించారాయన. హీరోగా తనీష్ తొలి చిత్రం ‘నచ్చావులే..!’ విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో తనీష్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు డిఫెన్స్‌లో జాబ్ చేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇరవైఏళ్ల క్రితం వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఆ తర్వాత నా కెరీర్ కోసం మా నాన్నగారు జాబ్ నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉండేవాళ్లం. చాలా కష్టాలు పడ్డాం. చైల్డ్ ఆర్టిస్టుగా ఇక చాలు.. హీరోగా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో ఓ చాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో సైన్ చేయాలి. ఇంతలోనే రవిబాబుగారి ‘నచ్చావులే..!’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాను. నువ్వు లావు తగ్గితే మా సినిమాలో తీసుకుంటాం అన్నారాయన. ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను. ముందు వచ్చిన అవకాశాన్ని వద్దనుకుని అసలు సెలెక్ట్ అవుతానో లేదో తెలియని రవిబాబుగారి సినిమా కోసం కష్టపడ్డాను. రెండు వారాల్లో దాదాపు 10 కేజీలు తగ్గి ఆయన దగ్గరికి వెళ్లాను. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా రిలీజైన తర్వాత నా తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. నచ్చినప్పుడు నచ్చావ్ అన్నారు. నచ్చనప్పుడు నచ్చలేదు అంటూనే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు.. స్పెషల్‌గా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుగారికి థ్యాంక్స్. ఫిబ్రవరి లేదా మార్చిలో నేను హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ‘బిగ్ బాస్ షో’ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సక్సెస్, ఫెయిల్యూర్స్ నా చేతిలోనే కాదు. ఎవరి చేతిలోనూ లేవు. ఇప్పటివరకు నా జర్నీని ప్లాన్ చేసుకోలేదు. ఇకపై ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం ఉన్నా వీడు మారలేదురా’ అంటారు. ఆ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. అలాగే ఇక రాంగ్ స్టెప్స్ కూడా వేయను. నేను స్టార్‌ని కాదు. యాక్టర్‌ని. నెగటీవ్ పాత్రలే కాదు చాలెంజింగ్‌గా ఉన్న ఏ పాత్ర చేయడానికైనా రెడీ. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు’’ అన్నారు. -
‘కాల్ గర్ల్’గా మారిన తెలుగు హీరోయిన్!
‘నచ్చావులే’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన హీరోయిన్ మాధవీలత. ఆ తర్వాత అడపాదడప సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు షార్ట్ ఫిలింస్ పై దృష్టి పెట్టింది. త్వరలో రానున్న ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ షార్ట్ ఫిలింలో ఆమె ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్ లో కారులో చిన్నారితో మాట్లాడుతూ ఆమె కనిపించారు. ఆమె, ఆమె ఏడేళ్ల కొడుకు ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. గ్రిప్పింగ్ ప్లాట్ తో తెరకెక్కినట్టు కనిపిస్తున్న ఈ షార్ట్ ఫిలిం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో తన పాత్ర గురించి అడుగగా.. ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించడం సవాల్ తో కూడుకున్నదని, అందుకే తాను ఈ పాత్రకు ఒప్పుకున్నానని మాధవీలత తెలిపింది. అయితే, ప్రస్తుతం పెద్దగా తన చేతిలో సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే ఆమె షార్ట్ ఫిలింలో నటించడానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తోంది.