
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C
— ANI (@ANI) May 13, 2024
దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment