
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ కార్యక్రమంలో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది.
శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తూ బతుకమ్మ వేడుకలకు అనుమతించి, సమయానికి మించి అధిక డెసిబుల్ సంగీతాన్ని అనుమతించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.