Greater Hyderabad Municipal Corporation (GHMC)
-
హైదరాబాద్: మేయర్‌పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ కార్యక్రమంలో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తూ బతుకమ్మ వేడుకలకు అనుమతించి, సమయానికి మించి అధిక డెసిబుల్ సంగీతాన్ని అనుమతించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. -
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు ఇక ఆన్లైన్లో.. హాల్ విస్తీర్ణం, అద్దె వివరాలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఆధ్వర్యంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్‌ను త్వరలో ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల తరహాలో జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా న్యువల్‌గా జరుగుతున్న బుకింగ్‌లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నా యో, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భా రీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ద్వా రా అవతవకలకు తావుండదని, పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వచ్చేనెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టల్‌లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిది తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.95.70 కోట్లతో 25 ఫంక్షన్ హాళ్లు.. జీహెచ్ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు మంజూరై ఏళ్లు గడుస్తుండగా, ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడింటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పనులు పురోగతిలో ఉన్నవి.. ► హెచ్‌ఎఫ్‌నగర్, రహ్మత్‌నగర్ ► అయ్యప్ప క్రీడామైదానం దగ్గర, వెంగళ్రావునగర్ ► టీఎస్ఐఐసీ కాలనీ, సూరారం ► వాలీబాల్ కోర్టు దగ్గర, తార్నాక ► పాటిగడ్డ, బేగంపేట ► ఆరంభ టౌన్షిప్, పాపిరెడ్డికాలనీ ► గోపన్‌పల్లి,గచ్చిబౌలి ► జుమ్మేరాత్‌బజార్ అడ్డగుట్ట, సికింద్రాబాద్ అన్ని ఫంక్షన్లకూ.. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు వివిధ రకాల ఫంక్షన్లకు వీటిని అద్దెకిస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కలి్పంచాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెస్తోంది. వీటికి నిషేధం.. రాజకీయ సంబంధమైన, రాజకీయ పార్టీలకు సంబంధించిన, మత సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్‌హాళ్లలో అనుమతించరు. హాల్ విస్తీర్ణాన్ని బట్టి.. అద్దె ధరలు రోజుకు ► 2వేల చ.మీ వరకు:రూ.10,000 ► 2001–4000 చదరపు మీటర్ల వరకు: రూ.15,000 ► 4000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ: రూ.20,000 ► ఈ ధరలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ► పారిశుద్ధ్య చార్జీల కింద 20 శాతం చెల్లించాలి. రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లి స్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు. నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు.. ► బన్సీలాల్‌పేట కమ్యూనిటీ హాల్ ► చైతన్యనగర్, పటాన్చెరు ► భగత్‌సింగ్‌నగర్, చింతల్ ► కేపీహెచ్‌బీ4 ఫేజ్,భగత్‌సింగ్‌నగర్ గాం«దీనగర్, రామంతాపూర్ ► గాంధీ విగ్రహం దగ్గర, చంపాపేట ► నెహ్రూనగర్ పార్క్, మారేడ్‌పల్లి ► వెస్ట్రన్హిల్స్, అడ్డగుట్ట ► సీతాఫల్మండి, సికింద్రాబాద్ -
హైదరాబాద్‌ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు
కేంద్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి ‘బూస్టర్’ దక్కలేదు. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎస్సార్డీపీ పనులకు నిధులు విదిల్చలేదు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.48వేల కోట్లు కేటాయించినప్పటికీ, వీటిలో గ్రేటర్ నగరానికి ఎన్ని నిధులందుతాయో చెప్పలేని పరిస్థితి. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం శూన్య హస్తమే చూపింది. ప్రధానంగా జలమండలి, మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కరువైంది. రెండు అంశాల్లో మాత్రం నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర బడ్జెట్లో నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్లో ఈసారి జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్‌రోడ్లు, స్లిప్రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. (చదవండి: ఒక్కరోజే 2,850 కరోనా కేసులు) పోస్టాఫీసులకు మహర్దశ ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. పరుగులు పెట్టనున్న వందే భారత్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి.కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. (చదవండి: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం! ) -
ప్రచారం నేతలది.. ఖర్చు జీహెచ్ఎంసీది.. ఎలాగంటారా?
బంజారాహిల్స్: రాజకీయ నేతలు రోడ్లకిరువైపులా, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్, రోడ్లను సైతం ఆక్రమిస్తుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్‌లపై పెద్ద పెద్ద కర్రలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూడళ్లలో చెట్లను తొలగించి, గడ్డిని సైతం తవ్వి ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అగ్రసేన్ చౌరస్తాలో భారీ వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తిపై ఫ్లెక్సీ పడగా ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. (చదవండి: Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?) సొంత నిధులతో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్త కటౌట్లు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు ఎవరి దగ్గర కూడా జరిమానాలు వసూలు చేసినట్లు కనిపించడం లేదు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వాటిని తొలగిస్తున్నారు. కటౌట్లు ఏర్పాటు చేసిన నేత వాటిని తొలగించే ఖర్చు నుంచి తప్పించుకుంటుండగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం మాత్రం తమ సొంత సిబ్బందితో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ వాటిని తొలగిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. కటౌట్ పెట్టిన నేత వాటిని తొలగించే బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉండగా జీహెచ్ఎంసీ పుణ్యమా అంటూ తొలగించే ఖర్చులు మిగులుతున్నాయి. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) -
జీహెచ్ఎంసీకి కాగ్ ఆక్షింతలు
గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల పనితీరు ఏమాత్రం బాగోలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. వ్యయ నిర్వహణ, సేవల తీరు, ఆర్థిక క్రమశిక్షణ, నిర్లక్ష్యం, నష్టాలకు కారణాలను కూలంకుశంగా పేర్కొన్న కాగ్..జలమండలి, ప్రభుత్వ ఆస్పత్రులు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలను కడిగిపారేసింది. అధికారులు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రూ.కోట్ల నష్టాలు మిగిలాయని పేర్కొంది. ప్రజలకుసక్రమమైన సేవలు అందలేదని స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: నాలాల్లో డీసిల్టింగ్ (పూడికతీత)కు సంబంధించి అవకతవకలు జరిగినా అధికారులు కళ్లు మూసుకున్నారని, తత్ఫలితంగా జీహెచ్ఎంసీ నుంచి రూ.53.56 లక్షల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్ నివేదిక కడిగి పారేసింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచింది. 2015–17 మధ్యకాలంలో జీహెచ్ఎంసీ చేసిన 766 డీసిల్టింగ్ పనుల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు 207 ఉన్నాయని, వాటిల్లో మచ్చుకు 21 పనుల్ని ఆడిట్ తనిఖీ చేయగా అక్రమాలు వెలుగు చూశాయని తెలిపింది. మొత్తం తనిఖీ చేస్తే ఇంకెంతమేర అక్రమాలుంటాయోనని అభిప్రాయపడింది. ప్రయాణికుల వాహనాల్లో పూడికను తరలించినట్లు కాంట్రాక్టర్లు పేర్కొన్నా అధికారులు గుర్తించకపోవడం అశ్రద్ధకు పరాకాష్టగా విమర్శించింది. రవాణాశాఖ వద్ద నమోదైన వాహనాల నెంబర్లతో పోల్చిచూడగా ఈవిషయం వెలుగు చూసింది. అంతేకాదు వివిధ వాహనాలను రవాణాశాఖ అనుమతించిన గరిష్ట బరువు కంటే ఎక్కువ బరువైన పూడికను తరలించేందుకు వినియోగించినట్లు మెజర్మెంట్స్ రికార్డుల్లో ఉందని పేర్కొంది. 20 పనులకు సంబంధించి 133 వాహనాల ద్వారా 1326 ట్రిప్పుల్లో తరలించిన పూడిక బరువు, సదరు వాహనాలను అనుమతించిన గరిష్ట బరువుకంటే ఎక్కువగా ఉందని తెలిపింది. చెరువుల నిర్వహణపైనా... నగరంలో చెరువుల్ని నిర్లక్ష్యం చేయడంపై కాగ్ తప్పుపట్టింది. ప్రభుత్వం 2014–18 మధ్యకాలంలో చెరువుల కోసం రూ.287.33 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం రూ. 42.14 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని తెలిపింది. ఈ నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులకు, వినాయక చవితి సందర్భంగా విగ్రహాల నిమజ్జనాలకు కుంటలు, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. మిషన్ కాకతీయ నాలుగో ఫేజ్ కింద 2018–19 మధ్య జీహెచ్ఎంసీ పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికోసం రూ. 282.63 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిందని పేర్కొంది. ఈ పనులు చేసేందుకు చెరువుల్లో నీటి నాణ్యతపై దృష్టి సారించలేదని తప్పుబట్టింది. మిషన్ కాకతీయ మార్గదర్శకాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన చెరువుల్ని ఎంపిక చేయడం వల్ల గ్రేటర్ పరిధిలోని చెరువుల సహజత్వానికే భంగం వాటిల్లిందని అభిప్రాయపడింది. అంతేకాదు.. గ్రేటర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలను అడ్డుకునేవారు లేక చెరువుల ఉనికే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. దుర్గంచెరువు చుట్టూ నిర్మాణాల వల్ల ఎఫ్టీఎల్ విస్తీర్ణం తగ్గిందని స్పష్టం చేసింది. సైకిల్‌ట్రాక్‌ను తొలగించాలని లేక్‌ప్రొటెక్షన్ కమిటీ ఆదేశించినా అమలు చేయలేదని తప్పుపట్టింది. దుర్గం చెరువు సుందరీకరణను సీఎస్సార్ కింద కే.రహేజా ఐటీపార్క్‌కు అప్పజెప్పడం తగని చర్యగా పేర్కొంది. 2016లో నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, 18 చెరువులకు సంబంధించి నిర్వహించిన సర్వేలో 8 చెరువుల ఎఫ్టీఎల్లో రోడ్లు, 11 చెరువుల ఎఫ్టీఎల్లో భవనాలు, 17 చెరువుల బఫర్జోన్లలో భవనాలున్నా యని వెల్లడించింది. చెరువులకు సంబంధించి ఇంకా వివిధ అంశాల్లో ఆయా ప్రభుత్వశాఖల బాధ్యతారాహిత్యాన్ని కాగ్ తప్పుబట్టింది. రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకాన్ని కాగ్ ఎత్తి చూపింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ఫీజుల వసూళ్లలో చేతివాటంపై అభ్యంతరాలు వ్యక్తం చేసి రెండేళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంపై కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో తాకట్టు లావాదేవీలను సాధారణ దస్తావేజుల డిపాజిట్‌గా పరిగణించడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగా గండి పడింది. వాస్తవంగా దస్తావేజుల ద్వారా తీసుకున్న రుణాలపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయాల్సి ఉండగా హైదరాబాద్ (దక్షిణం) డీఆర్, షాద్‌నగర్, కూకట్పల్లి, చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్లు ఒక్కో దస్తావేజుపై రూ.10 వేల చొప్పున మాత్రమే వసూలు చేసి చేతివాటం ప్రదర్శించినట్లు కాగ్ వెల్లడించింది. ఫలితంగా సుమారు రూ.4.44 కోట్ల ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. దీనిపై రెండేళ్ల క్రితమే అభ్యంతరాలు వ్యక్తం చేసినా..ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాగ్ పేర్కొంది. రిజిస్టర్ అయిన దస్తావేజులపై తక్కువగా సుంకాలు విధించడంతో సుమారు రూ.20 కోట్ల ఆదాయానికి గండి పడిందని హైదరాబాద్ సౌత్, మేడ్చల్ డీఆర్, బాలానగర్, దూద్‌బౌలి, గోల్కొండ, కాప్రా, కూకట్పల్లి, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్లపై కాగ్ అభియోగాలు మోపింది. అభ్యంతరాలపై lసరైన సమాధానాలు ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టింది. ఆర్థికంగా బలహీనమే.. జలమండలి పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అక్షింతలు వేసింది. తాజాగా శాసనసభకు సమర్పించిన నివేదికలో..వాటర్ బోర్డు 2013–17 మధ్యకాలానికి సంబంధించి వార్షిక పద్దులను ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించలేదని ఆక్షేపించింది. ఇక 2010–13 మధ్యకాలానికి సంబంధించిన వార్షిక పద్దులను సమర్పించినా.. ప్రభుత్వం ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇక జలమండలికి జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ.761.96 కోట్ల బకాయిలు రాకపోవడంతో వాటర్‌బోర్డు ఆర్థికంగా బలహీనమైందని పేర్కొంది. జలమండలి తన పరిధిలో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల నీటిని సరఫరా చేయలేకపోతుందని..వాస్తవంగా సరఫరా చేస్తున్న నీరు 66–71 లీటర్ల మధ్యన ఉందని తెలిపింది. ‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణలో విఫలం ‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణకు ఎంపిక చేసిన ఆస్పత్రులు ఘోరంగా విఫలమైనట్లు కాగ్ స్పష్టం చేసింది. ఆస్పత్రులకు వచ్చే ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్ల వివరాలను ఎలక్ట్రానిక్ రికార్డులో పొందుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈహెచ్ఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని గాంధీ, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందుకు రూ.10.49 కోట్లు కేటాయించి, ఇందులో రూ.10.20 లక్షలు రెండు విడతల్లో చెల్లించింది. కానీ అధికారులు మాత్రం ఈ పథకం అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చూపినట్లు కాగ్ పేర్కొంది. గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లును మంజూరు చేసింది. పరిశోధనల కోసం రెండు ఎంఆర్ఐ మిషన్లను అందించింది. అయితే వాటికి అవసరమైన స్థల కేటాయింపు, సిబ్బంది నియామకం, నిర్వహణ అంశాల్లో రెండు కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా కీలక వైద్య పరికరాలు రాకుండా పోయినట్లు కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. -
అలర్ట్: జీహెచ్ఎంసీకి వెళ్లాలనుకుంటున్నారా...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్–19 పాజిటివ్ కేసుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై పాక్షిక ఆంక్షలు విధిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా ఆంక్షలు ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా కచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని.. భౌతిక దూరం, మాస్క్‌లను ధరించడం, హ్యాండ్ వాష్ విధిగా పాటించాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల సందర్శనపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏవైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉంటే మై–జీహెచ్ఎంసీ యాప్ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద నున్న గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్ పేర్కొన్నారు. అధికారులు, సెక్షన్లలో సిబ్బందిని సాధ్యమైనంత మేర కలువరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షలపై జీహెచ్ఎంసీ అధికారులకు, సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో జరిగే కార్యక్రమాల అధికారిక సమాచారాన్ని సీపీఆరోఓ ద్వారా పత్రికా ప్రతినిధులకు అందచేయడం జరుగుతుందని, ఏదైనా అదనపు సమాచారం కోసం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అవసరమైతే మధ్యాహ్నం 3 గంటలనుండి 5 గంటల లోపు కార్యాలయంలోని సీపీఆర్ఓను మాత్రమే కలవాలని తెలిపారు. పాత్రికేయుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జీహెచ్ఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఐటీ, అకౌంట్స్, స్పోర్ట్స్ విభాగాల్లోని వారికి పదిమందికి పైగా కోవిడ్–19 నిర్ధారణ అయినట్లు తెలిసింది. చదవండి: ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే! -
హైదరాబాద్: మోగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా!
-
మోగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4 న కౌంటింగ్ చేపట్టే దిశగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రి ముగియనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ జీహెచ్ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారు. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్‌గా బన్సీలాల్‌పేట్. ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే నగరవాసులకు ఆస్తి పన్నులో మినహాయింపు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు వంటి తాయిలాలు ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేల చొప్పున వరద సాయం అందించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో పరాభవం ఎదువడంతో కారు పార్టీలో కొంత కలవరం మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు శాయశక్తులా శ్రమించినా విజయం దక్కలేదు. దీంతో కారు పార్టీ మరింత అప్రమత్తమైంది. బల్దియా ఎన్నికల్లో 17 మంది మంత్రులను ఇంచార్చిలుగా టీఆర్ఎస్ నియమించనుంది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యుడిగా చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు దుబ్బాకలో సంచలనం విజయం సాధించిన బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ శ్రేణులు పోటీకి తయారవుతున్నాయి. (చదవండి: టీఆర్ఎస్లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు) -
బల్దియా ఆవాజ్.. బడ్జెట్పే నజర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. శుక్రవారం అన్ని డివిజన్లలో తుది ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచుతున్న యంత్రాంగం ఆదివారం (15వ తేదీ) ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నోటిఫికేషన్– పోలింగ్ మధ్య కనీసం రెండువారాల గడువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలో 6వ తేదీ లోపునే ఏదో ఒకరోజు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా డిసెంబర్ మాసమే అనుకూలమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలో గురువారం నాటి పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. జీహెచ్ఎంసీ పీఠాన్ని మళ్లీ రికార్డు మెజారిటీతో చేజిక్కుంచుకునే దిశగా అధికార టీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తుండగా, షహర్ హమారా.. మేయర్ హమారా నినాదంతో బీజేపీ దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ పీఠాన్ని ఎక్కువ కాలం తమ గుప్పిట్లో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన పట్టును తిరిగి సాధించుకునేందుకు ఎత్తులు వేయనుంది. ప్రతి ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎం సైతం మేయర్ స్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్లనుంది. గతంలో పలుమార్లు సొంతంగా, ఇతర పారీ్టలతో కలిసి మేయర్ పదవిని దక్కించుకున్న ఎంఐఎం ఈసారి సొంతంగా మరోసారి తమ జెండాను ఎగురవేసే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఇతరులు.. మేల్కొనే లోపే.. ప్రస్తుత పాలవర్గం గడువు ఫిబ్రవరి వరకు ఉన్నా.. మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ఓవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమాన్ని సైతం పరుగులు పెట్టించింది. నగరంలో 150 డివిజన్లలో పోటీ చేసేందుకు సిట్టింగ్ కార్పొరేటర్లతో పాటు కొత్తవారితో కూడిన జాబితాలను సైతం సిద్ధం చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎంఐఎం సైతం ఎన్నికల కార్యాచరణను ఇప్పటికే రూపొందించుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఇటీవలీ దుబ్బాక ఎన్నిక విజయంతో మంచి ఊపు మీద ఉన్నా.. వార్డు, డివిజన్ స్థాయి కసరత్తును ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ సైతం మెజారిటీ డివిజన్లలో విజయానికి ఆశించిన రీతిలో ప్రణాళికలు రూపొందించలేదు. ప్రధాన పారీ్టలు బరిలోకి దిగే వరకు తాము ఎన్నికల అంశాన్నే పూర్తి చేసే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒకరు ఒక వార్డు నుంచే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి ఒక డివిజన్ (వార్డు) నుంచి మాత్రమే పోటీ చేసేందుకు అర్హులని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న అభ్యర్ధి ఏ డివిజన్ నుంచైనా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. ఒక అభ్యర్ధి రెండు మూడు డివిజన్ల నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, ఉపసంహరణ గడువు నాటికి ఒక్క డివిజన్‌కు మించి ఉండరాదని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ డివిజన్లలో ఉంటే, అన్నీ రద్దవుతాయన్నారు. పోటీ చేసేందుకు అర్హత ఉండదన్నారు. జీహెచ్ఎంసీలో ఓటర్లు ఇలా.. ► (మహిళలు)...35,46,731 ► (పురుషులు)...38,56,617 ► (ఇతరులు).. 669 ►(మొత్తం)...74,04,017 ► 150 (మొత్తం డివిజన్లు) ► 76 (మహిళా కార్పొరేటర్లు) ప్రస్తుతం పార్టీల వారీగా కార్పొరేటర్లు ► టీఆర్ఎస్ 99 ►ఎంఐఎం 44 ►బీజేపీ 04 ►కాంగ్రెస్ 02 ►టీడీపీ 01 సాక్షి, సిటీబ్యూరో: ఏటికేడాది అధికంగా ఉండే జీహెచ్ఎంసీ బడ్జెట్ రాబోయే (2021– 22) ఆరి్థక సంవత్సరానికి సంబంధించి తగ్గించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం బడ్జెట్ రూ.6,973.64 కోట్లు కాగా, కొత్త బడ్జెట్‌ను రూ.5,600 కోట్లకు కుదించారు. గత బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ నిధులది.. ఇతర కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులది వేర్వేరుగా ‘ఎ’, ‘బి’లుగా ప్రకటించగా.. ఈసారి విభజన చూపకుండా ప్రతిపాదించారు. రూ.5,600 కోట్లతో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ముందుంచారు. జీహెచ్ఎంసీ నిధులకే సంబంధించి పరిశీలిస్తే మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఆరి్థక సంవత్సరానిది ప్రస్తుత ఆరి్థక సంవత్సర బడ్జెట్ రూ.5,380 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2,226.23 కోట్లు ఖర్చయ్యాయి. బడ్జెట్లో అత్యధికంగా రూ.1582.51 కోట్లు రోడ్లు, పేవ్మెంట్లకే కేటాయించారు. ఆ తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు, గ్రీన్ బడ్జెట్‌కు ఎక్కువగా కేటాయించారు. అంటే రోడ్లు, హరిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇతర కార్పొరేషన్ల నుంచి వస్తాయనుకున్న నిధులు రాకపోవడంతో ఈసారి వాటిని చేర్చలేదని తెలుస్తోంది. అప్పులే గొప్పలు.. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంలో ఆస్తిపన్ను అంచనా రూ.1,850 కోట్లు కాగా, అప్పులు రూ.1,224.51 కోట్లు. అసైన్డ్ రెవెన్యూ ఆదాయంగా రూ.652.10 కోట్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు ఆదేశం అవసరం కావడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్దగా చూపలేదు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ నిధులకు సంబంధించిన రూ.5,380 కోట్ల బడ్జెట్‌ను రూ.5,500 కోట్లుగా సవరిస్తూ ప్రతిపాదించారు. కొత్త బడ్జెట్ (2021–22)ను డిసెంబర్ 10వ తేదీలోగా స్టాండింగ్ కమిటీ ఆమోదించి 15వ తేదీలోగా పాలకమండలి ముందు ఉంచాలి. 2021 జనవరి 10వ తేదీలోగా జనరల్ బాడీ సమావేశంలో సమీక్షించాలి. ఫిబ్రవరి 20వ తేదీలోగా కార్పొరేషన్ ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం 2021 మార్చి 7వ తేదీ వరకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలి. ఎస్లాబ్లిష్మెంట్... 1226.91 నిర్వహణ ఖర్చులు... 905.30 ఇతర రెవెన్యూ ఖర్చులు... 281.79 రోడ్లు, పేవ్మెంట్లు.... 1582.51 భూమి, భూ అభివృద్ధి.... 445.19 వరద కాలువలు.... 170.00 గ్రీన్‌బడ్జెట్... 560.00 వాటర్ సప్లై, సివరేజీ... 131.87 ఇతర క్యాపిటల్ ఖర్చులు 296.43 -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం
-
డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీలతో భేటీ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వార్డుల విభజనలో అవకతవకలు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినట్లు ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని వార్డుల్లో ప్రజలకు నష్టం, మరికొన్ని వార్డుల్లో ప్రజలకు లాభం కలుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం వార్డు వారీగా సగటు ఓట్లు 49,360 కాగా.. 140 వార్డుల్లో ఉండాల్సిన ఓటర్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. కేవలం పది వార్డుల్లో మాత్రమే చట్టం ప్రకారం ఓటర్లున్నారని సంఘం కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి(59)వార్డులో 79,290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం(112)లో 27,831 మంది ఓటర్లున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా వార్డుల విభజన చేపట్టడం వల్లే ఈ అక్రమాలు వెలుగుచూశాయన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేసేందుకు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఏమి చేయలేక మళ్లీ అదే తప్పు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాలని కోరారు. వార్డుల వారీగా ఓటర్ల విభజన సరిచేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. -
కరోనా: ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డులు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డ్లను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో న్యాయవాది శివగణేష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని హైకోర్టు విచారించగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్, వెంటిలేటర్స్ ఉన్నాయో డిస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దీని వలన ప్రజలు ఆస్పత్రుల వద్ద పడిగాపులు గాయకుండా ఉంటారని తెలిపారు. పిటీషనర్ వాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ చీఫ్ సెక్రటరీ మెడికల్ & హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫ్యామిలీ వెల్ఫైర్కు కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేసింది. (కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..! ) హైకోర్టులో 10 మందికి పాజిటివ్ -
హైదరాబాద్‌లో కరోనా మృత్యు ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్ హైదరాబాద్ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్ నర్సు కరోనాతో మృతి చెందారు. ఈనెల 30న పదవీ విమరణ చేయాల్సిన తరుణంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తాను వయసురీత్యా పెద్ద కావడంతో కరోనా ఐసోలేషన్ వార్డులో పనిచేయలేనని, ఆ విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను అభ్యర్థించినా ఆయన అంగీకరించలేదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..) కాగా, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 20 మంది వైద్యులు, పది మంది పారా మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడగా.. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సుమారు వంద మందికి వైరస్ సోకింది. ఇక నిమ్స్‌లో 67 మందికి కరోనా సోకగా, వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. మలక్‌పేట్, కొండాపూర్ ఆస్పత్రుల్లోనూ 30 మంది వైద్య సిబ్బంది వైరస్ బారినపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరుకున్న సత్తెమ్మ అనే బాధితురాలు ఆస్పత్రి గేటు ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. (బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు) గాంధీ సూపరింటెండెంట్ పేషీలో... కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కరో నా కలకలం సృష్టించింది. పేషీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్‌తోపాటు టైపిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఆస్పత్రి మినిస్టీరియల్ విభాగంలో విధులు నిర్వ హించే సీనియర్ అసిస్టెంట్‌తోపాటు ఓ నర్సుకు కూడా పాజిటివ్ రావడంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మరో ఉద్యోగికి.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోరోజు మరో కరోనా పాజిటివ్ కేసు నమో దైంది. మూడో అంతస్తులోని పరిపాలనా విభాగం లో ఓ ఉద్యోగికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహ్మారావు కన్నుమూత తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొనుగోటి నర్సింహారావు(70) కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చివ్వెంలకు చెందిన నర్సింహారావు పది రోజుల క్రితం బిల్డర్లకు రావాల్సిన బకాయిలు, వివిధ రకాల అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరినా ఫలితం లేకపోయింది. -
గ్రేటర్లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. (చైనా ఉత్పత్తులకు తగ్గని ఆదరణ) కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. (ఇక నుంచి ఇవి ప్లాట్‌ఫాంపై అమ్మబడును) -
ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు, లేబొరేటరీలు కోవిడ్ నిబంధనల్ని అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు. (చదవండి: పండుటాకుల గుండె కోత!) మరణాల రేటు తక్కువ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతోందని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందు చూపుతోనే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న కరోనా) -
తెలంగాణ: 164 కేసులు, 9 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4484 కు చేరింది. ఇందులో 449 మంది వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. ఇక తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 133 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యవిభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు. మేడ్చల్, రంగారెడ్డిలో 6 చొప్పున, సంగారెడ్డి 4, నిజామాబాద్ 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగు 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్ బారినపడ్డవారిలో ఆదివారం 285 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2278కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2032 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ బారినపడి ఇప్పటివరకు 174 మంది మరణించారు. (చదవండి: కొండపోచమ్మ: సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ) -
కరోనా @ 3,000
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్‌లో వైరస్ ఉధృతి ఏ మాత్రమూ తగ్గట్లేదు. రోజూ వంద వరకు కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 129 కొత్త కేసులు నమోదైతే.. వాటిలో 108 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా బారినపడిన వారి సంఖ్య 2,105కు చేరింది. రంగారెడ్డిలో 6, ఆసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో రెండు చొప్పున, మహబూబ్‌నగర్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. వీరితో పాటు మరో ఇద్దరు వలస కార్మికులకు సోకింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,020కు చేరింది. ఇప్పటివరకు 1,556 మందిని డిశ్చార్జి చేయగా, 1,365 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా బుధవా రం ఒక్క రోజే ఏడుగురు కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 99కు చేరింది. గత 3 రోజుల వ్యవధిలోనే 17 మంది మృత్యువాత పడ్డారు. -
తెలంగాణ: 129 కేసులు, ఏడు మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3020 కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం సాయంత్రం మీడియా బులెటిన్‌లో వెల్లడించారు. వలసదారుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో వైరస్ బాధితుల్లో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 99కి చేరింది. తాజాగా మరో 92 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1556 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
‘సడలింపులతోనే నగరాల్లో అధిక కేసులు’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ అన్నారు. కరోనా కట్టడికి ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపులతోనే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతోందని వెల్లడించారు. గత 15 రోజుల నుంచి హైదరాబాద్‌లో రద్దీ పెరగడం.. జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజారోగ్య విభాగం డెరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు మినహా కుటుంబసభ్యులు రోడ్లపైకి రావొద్దని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
తెలంగాణ: 66 పాజిటివ్.. ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనాతో సోమవారం మరో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,920 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 72 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 700 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
తెలంగాణలో కొత్తగా 27 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సం ఖ్య 1661కి చేరగా.. మరణాలు 40కి చేరాయి. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన 61 ఏళ్ల వ్య క్తి, చాంద్రాయణగుట్టకు చెందిన 81 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా.. వలసదారులు 12 మంది ఉన్నారు. (సేఫ్ సర్వీస్!) వలసదారులంతా జగి త్యాల, జనగాం జిల్లాలకు చెందినవారని ప్ర జారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 89 మంది వలసదారులు ఉన్నారు. ఇక బుధవారం ఇద్దరు డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1013కి చేరుకుంది. ఆసుపత్రిలో 608 మంది చికిత్స పొందుతున్నారు. ఒకే ఇంట్లో 8 మందికి పాజిటివ్ అబిడ్స్: గోషామహల్ జీహెచ్ఎంసీ 14వ జోన్ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. స్థానిక నట్రాజ్‌నగర్‌లో ఉంటున్న ఓ వ్యాపారికి (34) ఐదురోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వ్యాపారి తండ్రి(55), తల్లి(48), భార్య(30), కుమారుడు(4), తమ్ముడు(28) తమ్ముడి భార్య(22), ఇద్దరు చెల్లెళ్లకు (22), (23) కరోనా సోకినట్టు తేలింది. -
టేక్ అవేకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్డౌన్ పొడిగించటంతో పాటు పలు కొత్త సడలింపులిస్తూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమతి వీటికే.. ► జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో బస్సులు, ఇతర ప్రయాణికుల వాహనాలను అనుమతిస్తారు. ► టేక్ అవే (పార్సిల్ తీసుకునిపోవడం)/హోం డెలివరీ సేవలందించడానికి రెస్టారెంట్లను అనుమతిస్తారు. మా స్కులు, గ్లౌజు లు, భౌతికదూరం, క్రమం తప్పకుండా డిస్‌ఇఫెక్టాంట్ (క్రి మినివారిణి)తో శుభ్రపరచడం వంటివి తప్పనిసరి. ► ముందుజాగ్రత్త చర్యలతో బార్బర్ షాపులు, స్పాలు, సెలూన్స్‌ను అనుమతిస్తారు. ► ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలకు అనుమతి. క్యాబ్‌లు, ట్యాక్సీల్లో డ్రైవర్ మినహా గరిష్టంగా మరో ముగ్గురు, ఆటో రిక్షాల్లో డ్రైవర్ మినహా గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. వీరు తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలి. డ్రైవర్లు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ద్విచక్ర వాహనాల పిలియన్ రైడర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో ద్విచక్రవాహనంపై ఇద్దరు కలసి ప్రయాణించవచ్చు. ► అన్ని షాపులను తెరిచేందుకు అనుమతి. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో పక్కపక్కనే ఉండే రెండు దుకాణాలు ఒకేరోజు తెరవకుండా ఉండే విధంగా ఒకరోజు మారి ఒకరోజు దుకాణాలు తెరవాలి. ఏ దుకాణం ఏ రోజు తెరవాలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోస్టర్‌ను ఖరారు చేస్తారు. ► ఈ–కామర్స్ ద్వారా అన్ని రకాల సరుకుల క్రయవిక్రయాలకు అనుమతి ఊ భౌతికదూరం పాటిస్తూ పెళ్లిళ్లు, సంబంధిత సామూహిక కార్యక్రమాలను 50 మంది అతిథులతో నిర్వహించుకోవచ్చు. ► భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియలు, సంబంధిత సామూహిక కార్యక్రమాలకు 20 మందికి అనుమతి. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం వీటిపైనే.. ► దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు... మెట్రో రైల్ సర్వీసులు ► అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర ప్రయాణికుల వాహనాల అంతర్రాష్ట్ర కదలికలు ► చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లు మినహా మిగిలిన ప్రయాణికుల రైళ్లపై నిషేధం ► అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా/కోచింగ్/ట్రైనింగ్ సంస్థలు తదితరాలు ► హోటళ్లు, లాడ్జీలు వంటి ఆతిథ్య సేవలు. అయితే వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు సేవలందించే వాటికి మినహాయింపు ► బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, క్రీడా సముదాయాలు, అమ్యూజ్మెంట్ అండ్ జూపార్క్స్, మ్యూజియంలు, ఆడిటోరియంలు ► సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక తదితర రంగాలకు సంబంధించిన అన్ని సామూహిక కార్యక్రమాలు... ళీ అన్ని మతపర స్థలాలు, మతపర సామూహిక కార్యక్రమాలు. కర్ఫ్యూ యథాతథం... ► రాత్రిపూట కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది. ► అన్ని రకాల సరుకుల వాహనాలకు అంతర్రాష్ట్ర రవాణా అనుమతి. ఖాళీ ట్రక్కులతో సహా.. ► అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు, నిర్మాణ రంగం కార్యకలాపాలకు అనుమతి ► అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అయితే, కార్యాలయాల నిర్వహణ కు జారీ చేసిన ప్రామాణిక విధానాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ► అన్ని దుకాణాలు, సముదాయాలు, కార్యాలయాలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలి. కరోనా వ్యాప్తి చెందకుండా సమూహాలను నివారించాలి. భౌతిక దూరం ఉండేలా చూడాలి. ► నిబంధనల ప్రకారం కచ్చితమైన చుట్టుకొలతలతో కంటైన్మెంట్ జోన్లను గుర్తిస్తారు. వీటి నుంచి ఏ ఒక్క వ్యక్తి బయటకి వెళ్లేందుకు, బయట నుంచి లోపలికి వచ్చేందుకు అనుమతించరు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు, సేవల నిర్వహణ అవసరాల విషయంలో మినహాయింపు. ► 65 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన వ్యక్తులు, ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన వారు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ల వద్దే ఉండాలి. అత్యవసర వైద్యం, నిత్యావసరాల కోసమే బయటకి రావాలి. -
కరోనా: తెలంగాణలో మరో 33 మందికి
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఆదివారం మరో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 26 నమోదుకాగా, మిగిలిన 7 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారివి. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు 1,196కు చేరుకున్నాయి. తాజాగా ఎవరూ డిశ్చార్జి కాలేదు. ఇప్ప టివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, 751 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 415 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. తాజా లెక్కలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 11 మందికి వలస వ్యక్తులకు కరోనా సోకినట్లయింది. వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణకు చెందినవారు. అలా వచ్చిన పాజిటివ్ కేసులన్నింటినీ వలసల కిందనే లెక్కిస్తున్నారు. వారు ఏ జిల్లా వారో ఆ జిల్లాల కరోనా కేసుల జాబితాలో చూపడం లేదు. (చదవండి: సాహో.. ఆరోగ్య సేతు..!) 14 రోజులుగా 24 జిల్లాల్లో కేసుల్లేవ్... గత 14 రోజులుగా అసలే కేసులు నమోదు కాని జిల్లాలు 24 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, నిర్మల్ జిల్లాలు అందులో ఉన్నాయి. (చదవండి: బర్త్‌డేలో సూపర్ స్ప్రెడ్!) -
తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. 14 పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 872కు చేరింది. తాజా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 12, మేడ్చల్‌లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఇద్దరు మరణించడంతో వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 23కు చేరుకుంది. 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 677 గా ఉంది. ఇక కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి:తెలంగాణలో రోజూ సగటున 17 కేసులు) (చదవండి: గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి ప్రారంభం..) -
కరోనా: గ్రేటర్లో మరో 17 పాజిటివ్ కేసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తుండగా.. రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా.. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 18 కేసులు నమోదవగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల 858కి చేరగా.. 186 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 651 గా ఉంది. మరో కానిస్టేబుల్‌కు కరోనా.. నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిక్కడపల్లి పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు కోవిడ్ బాధితులుగా మారారు. -
ఆ ఏడు సంస్థలకు జీహెచ్ఎంసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలను అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టాప్ ఏడు సంస్థలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందే భారీగా జరిమానా విధించినా ఆ ఏడు సంస్థలు ఫైన్ కట్టకుండా అలసత్వం ప్రదర్శించడంతోనే నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. అయితే ఇదే విషయమై ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ స్పందిస్తూ.. ఇప్పటికైనా సదరు సంస్థలు వెంటనే జరిమానా కట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిన ఏడు సంస్థలు వివరాలు ఇలా ఉన్నాయి. ►ది నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్ : 39 లక్షల 56 వేలు ►ది బ్రిటిష్ స్పోకేన్ ఇంగ్లీష్ : 33 లక్షల 62 వేలు ►ది వెంకట్ జాబ్స్ ఇన్ ఎంఎన్ సీ : 29 లక్షల 44 వేలు ►యాక్ట్ ఫైబర్ నెట్ : 14 లక్షల 19 వేలు ►ది ర్యాపిడో బైక్ టాక్సి : 13 లక్షల 79 వేలు ►ది బిల్ సాఫ్ట్ టెక్నాలజీస్ : 9 లక్షల 38వేలు ►ది హత్ వే బ్రాడ్ బాండ్ : 8 లక్షల 13 వేలు -
న్యుమోనియాతో వస్తే.. ప్రాణాలు పోయాయి
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని ఐసీయూలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ చిన్నారులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి అగ్ని మాపక అనుమతులు తీసుకోలేదని తమ విచారణలో తేలినట్టు విశ్వజిత్ చెప్పారు. (చదవండి : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు) నగరంలోని అన్ని ఆసుపత్రులకు అగ్నిమాపక అనుమతుల విషయంపై నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అగ్ని మాపక అనుమతులు లేని ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అగ్ని మాపక అనుమతుల విషయంపై విచారిస్తామని అన్నారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, స్కూళ్లకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదం నేపథ్యంలో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, షైన్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ కుమార్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. వైద్యుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం) గతంలో కూడా ఇలాగే జరిగింది.. చికిత్స కోసం వస్తే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని షైన్ హాస్పిటల్లో చనిపోయిన బాలుడి తండ్రి నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘న్యుమోనియాతో బాధపడుతున్న నా కుమారున్ని ఈ నెల 17న షైన్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాను. యాదాద్రి జిల్లా నుంచి వైద్యం కోసం ఇక్కడికి వచ్చాం. గతంలో కూడా ఇదే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్లీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మా బాబు చనిపోయాడు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగి ఇన్ని గంటలు కావొస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదు’అని నరేష్ వాపోయారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగి..!
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకుంటుండగా ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇల్లు కుట్టకునేందుకు బిద్లాన్ ధర్మేందర్‌సింగ్ అనే వ్యక్తి చార్మినార్ సర్కిల్-9లో దరఖాస్తు చేశాడు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అష్రఫ్ అహ్మద్ పర్మిషన్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు విషయం చెప్పడంతో.. అష్రఫ్ లంచం తీసుకుంటుండగా జామా మజీద్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. -
రాతి గుండె.. ప్రేమ నిండె..
-
గ్రేటర్లో ‘గ్రేట్’..
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 78 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. 33 శాతంగా ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి పెరగడంతో జీహెచ్ఎంసీలోని 150 కార్పొరేటర్లకు 75 స్థానాలు వారికే కేటాయించారు. జనరల్ స్థానాల నుంచి మరో ముగ్గురు గెలిచారు. 1987లో ఎంసీహెచ్ పాలకమండలిలో 100 మంది కార్పొరేటర్లకు 15 మంది మహిళలకే అవకాశం దక్కింది. 2002 ఎన్నికల్లో 36 మంది ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో 51 మంది మహిళలకు కార్పొరేటర్లయ్యే అవకాశం లభించింది. ఇప్పుడు ఈ సంఖ్య 78కి పెరిగి గ్రేటర్లో ఆమె ‘గ్రేట్’ అనిపించుకొంది. ఓటర్లు : 82,65,004 ⇒47% 38,55,291 మహిళలు ⇒53% 44,09,713 పురుషులు కార్పొరేటర్లు :150 ⇒ 48% పురుషులు ⇒ 52% మహిళలు పారిశుధ్య కార్మికులు : 18,591 ⇒ 19% పురుషులు ⇒ 81% మహిళలు 15,085 -
మహా బడ్జెట్
రూ.5643 కోట్లు! స్టాండింగ్ కమిటీ ముందుకు ముసారుుదా 24న కమిటీలో చర్చించాక ఆమోదం సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ సిద్ధమరుుంది. గురువారం 2017-18 సంవత్సరానికి రూ.5643 కోట్లతో ముసారుుదా బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనిపై అధ్యయనం చేసి.. ఈనెల 24న జరిగే సమావేశంలో చర్చించాక ఆమోదం తెలపనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడు సైతం బడ్జెట్‌ను భారీ గా ప్రతిపాదించారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సైతం రూ.5600 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, వాస్తవంగా అది అమలయ్యే పరిస్థితి లేదు. మొదటి ఆరుమాసాలకు సుమారు రూ.1300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా మిగిలి ఉన్న కాలంలో మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసినా మొత్తం రూ. 3,000 కోట్లు దాటే పరిస్థితి లేదు. 2015-16లో సైతం రూ. 5600 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినా రూ.3034 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్లో పేర్కొన్న ఆదాయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను, ఇతరత్రా ఫీజులు వెరసి రూ.2,768 కోట్లు అంచనా వేసినప్పటికీ, తొలి ఆరునెలల్లో రూ.889 కోట్లు మాత్రమే వచ్చారుు. ట్రేడ్ లెసైన్సుల ఫీజులు, ప్రకటనల పన్నులు, భవననిర్మాణ అనుమతులు వాటిద్వారా రూ.926 కోట్లు అంచనా వేసినప్పటికీ, రూ.300 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో ఆస్తిపన్ను, ఇతర ఫీజుల రూపంలో పదిరోజుల్లోనే దాదాపు రూ.200 కోట్ల మేర వసూలైంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెలలో వసూలయ్యే మొత్తాలే ఇప్పుడు వసూలైనట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలా ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలో ఎక్కువ వసూళ్లు ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల వాటాలు రూ.3630 కోట్లు అంచనా వేయగా, సెప్టెంబర్ వరకు రూ.75 కోట్లు మాత్రమే వచ్చారుు. ఈ నేపథ్యంలో ఏటికేడు బడ్జెట్ పెంచుతూ పోతున్నప్పటికీ, అది కాగితాల్లో తప్ప వాస్తవంగా అమలు కావడం లేదు. ముసారుుదా ప్రతిపాదనల మేరకు బడ్జెట్, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, ఖర్చుల పరిస్థితి వివరాలిలా ఉన్నారుు. బాండ్ల ద్వారా రూ. 887 కోట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) రూ.887 కోట్లు జీహెచ్ఎంసీ బాండ్ల ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు. ఇందుకు త్వరలో బాండ్లు జారీ చేయనున్నారు. ఎస్సార్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్)లో భాగంగా స్కైవేలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు తదితర పనులకు వీటిని వినియోగించేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. -
30 సర్కిళ్లు మారిన గ్రేటర్ ముఖచిత్రం
పూర్తయిన జీహెచ్ఎంసీ పునర్విభజన 24 నుంచి 30కి పెరిగిన సర్కిళ్లు 3 డివిజన్లున్న సర్కిళ్లు: గచ్చిబౌలి, ఆర్సీపురం,పటాన్చెరు, అల్వాల్ 8 డివిజన్లున్న సర్కిల్: చార్మినార్ కొత్త సర్కిళ్ల పేర్లు: హయత్‌నగర్, గడ్డిఅన్నారం, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, బేగంబజార్, ఫలక్‌నుమా,మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, మూసాపేట, గాజులరామారం, మోండా మార్కెట్ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ముఖచిత్రం మారింది. ప్రస్తుతం 24 సర్కిళ్లుగా ఉండగా, వీటిని 30 సర్కిళ్లకు మార్చారు. దీంతో ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ పునర్విభజన పూర్తరుునట్లే. 2011 జనాభా లెక్కల మేరకు జీహెచ్ఎంసీని గతంలో ఉన్న 18 సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు మార్చాలని కమిటీ సిఫారసు చేయగా, గత సంవత్సరం సెప్టెంబర్ 9న 18 సర్కిళ్లను 24 సర్కిళ్లుగా మార్చారు. ప్రస్తుతం మరో ఆరు సర్కిళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ మొత్తం 30 సర్కిళ్లుగా మార్చారు. ప్రసాదరావు కమిటీ స్టాఫింగ్ ప్యాటర్న్ మేరకు మొత్తం 30 సర్కిళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో జోన్‌కు ఆరు సర్కిళ్లు ఉండనున్నారుు. జీహెచ్ఎంసీలో మొత్తం ఐదు జోన్లుండటం తెలిసిందే. 2011 జనాభా లెక్కల మేరకు, కోర్ఏరియా పరిధిలోని 15 సర్కిళ్లల్లో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.65 లక్షల జనాభా, శివార్లలోని సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.25 లక్షల జనాభా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790 కాగా, ఒక్కో డివిజన్లో దాదాపు 45 వేల జనాభా ఉంది. గతంలో ఒక సర్కిల్లో 3 డివిజన్లు మాత్రమే ఉండగా, ఒక డివిజన్లో 16 డివిజన్ల వరకున్నారుు. ప్రస్తుతం భారీ వ్యత్యాసం లేకుండా సగటున ఒక్కో సర్కిల్లో ఐదారు డివిజన్లుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కొత్త సర్కిళ్లలో కొన్నింట్లో అత్యల్పంగా మూడు డివిజన్లు మాత్రమే ఉండగా, అత్యధికంగా చార్మినార్ సర్కిల్లో 8 డివిజన్లున్నారుు. -
బదిలీ భయం!
జీహెచ్ఎంసీలో ఏకీకృత సర్వీస్ రూల్స్? ఇక ఉద్యోగులకు తప్పని స్థానచలనం వర్క్‌షాపులో వెల్లడించిన కేటీఆర్ అధికార వర్గాల్లో చర్చోపచర్చలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయనున్నారా... బదిలీ అన్నదే తెలియని జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల భయం పట్టుకుందా...ఏళ్ల తరబడి సిటీలో అటో ఇటో తిరుగుతూ ఇక్కడే ఉండిపోయిన ఉద్యోగులు కలవరానికి గురవుతు న్నారా...అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రేటర్ ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడు ‘ఏకీకృత సర్వీస్ రూల్స్’ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సుదీర్ఘ వర్క్‌షాప్‌లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల పనితీరు విషయంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని సృష్టం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల భయం లేకపోవడం వల్లే కొన్నిస్థాయిల అధికారులు, ఉద్యోగులు విధినిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఇకపై ఇలాంటివి సాగవని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ‘ఎంసీహెచ్/జీహెచ్ఎంసీలోనే పుట్టాం.. ఇక్కడే ఉంటాం.. మమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరు. మహా అయితే ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్‌కు. ఈ జోన్ నుంచి ఆ జోన్‌కు. ఎక్కడైనా హైదరాబాద్‌లోనే ఉంటాం .. ’అనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. త్వరలోనే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ ప్రతిపాదన ఎంతోకాలంగా ఉన్నప్పటికీ, దీనిపై గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. దీంతో స్థానిక సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు అదే స్థానిక సంస్థలో రిటైర్ అయ్యే వరకు కొనసాగే వారు. ఈ నేపథ్యంలో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని ఇతర స్థానిక సంస్థల్లోనూ ఇదే పద్ధతి ఉంది. దీంతో పైస్థాయి ఉద్యోగులే కాక నాలుగో తరగతి అటెండర్లు సైతం తమనెవరూ ఏమీ చేయలేరనే భరోసాతో ఉండేవారు. ఇటీవల జీహెచ్ఎంసీ అంశాలపై సుదీర్ఘ వర్క్‌షాప్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ త్వరలో ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. మహా అయితే వేరే సర్కిల్‌కు బదిలీ చేస్తారు అని మీరు భావిస్తుండవచ్చు. కానీ ఇకపై అలాంటి విధానాలు సాగవు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తెస్తాం. మిమ్మల్ని ఇతర కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలకు బదిలీ చేస్తాం. ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేస్తాం. అయినా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైరయ్యే వరకు ఒకేచోట బావిలోని కప్పలా ఉంటే బయటి ప్రపంచం ఏం తెలుస్తుంది?’ అంటూనే ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని మంత్రి కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. మీరు మీ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా..? రోడ్డు మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల మీద చెత్త, డెబ్రిస్ వీటిని తొలగించాలని కూడా మంత్రులు, కమిషనర్ చెప్పాలా..? సొంతంగా మీకు ఆలోచ నలు రావా.. ? మన నగరాన్ని మనం బాగు చేసుకుందామని ఎందుకు స్ఫురించదు..? అంటూ ఒకే చోట ఉంటే ఇలాగే తయారవుతారంటూ ఏకీకృత సర్వీసు రూల్స్‌లను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఒక ఇంజినీర్ లేచి మేం చాలా కష్టపడుతున్నాం.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తున్నామని చెప్పగా, అన్ని గంటలు ఎవరు చేయమన్నారు.. ? స్మార్ట్ వర్క్ చేయాలి .. ఔట్పుట్ కనిపించాలి.. అని పరోక్షంగా చురకలంటించినట్లు తెలిసింది. మరొకరు తగినంత స్టాఫ్ లేదనడంతో.. ఉన్నవారు చేస్తున్న పని చేమిటో చెప్పమని ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది. మొత్తానికి ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు కేటీఆర్ వెల్లడించడంతో కొందరు ఉద్యోగులో భయం పట్టుకుంది. మరికొందరు మాత్రం ఒకే చోట ఉంటే బోర్ కొడుతుందని, మార్పు మంచిదే అంటున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. -
సహజ రంగులు వాడేలా చర్యలు
* గ్రేటర్ అధికారులకు హైకోర్టు ఆదేశం * తయారీదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించండి * ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించండి * వినాయక చవితికి ముందే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయండి * దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను మా ముందుంచండి * విచారణ జూన్ 4కు వాయిదా సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలకు కృత్రిమ రంగుల స్థానంలో సహజ రంగులను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులను ఆదేశించింది. విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్లి వారికి సహజ రంగుల పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వారికి వివరించాలంది. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు బంకమట్టిని ఉపయోగించేలా చూడాలంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగుల వినియోగం వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాల గురించి పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని గ్రేటర్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియనంతా కూడా వినాయక చవితికి ముందే పూర్తి చేయాలంది. ఈ విషయంలో గణేష్ ఉత్సవ సమితులతో చర్చించి, వారు కూడా సహకరించేలా చూడాలంది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. అన్ని చోట్లా భారీ విగ్రహాలు వద్దు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ, విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఎన్క్లోజర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 అడుగులకు మించి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఒకటి రెండు చోట్లు భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పు లేదని, అయతే ఒకరిని చూసి మరొకరు ఎత్తుపై పోటీపడుతూ అన్ని చోట్ల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కాదంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, విగ్రహాలకు సహజ రంగులు ఉపయోగించే విషయంలో ప్రభుత్వం నిధులు జారీ చేసిందన్నారు. ఈ సమయంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
నేడు మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఎంపిక
దారుస్సలాంలో కార్పొరేటర్ల సమావేశం ఎంఎ గఫార్ లేదా మహ్మద్ మెబీన్కు అవకాశం సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీ గా అవతరించిన మజ్లిస్ పార్టీలో ఫ్లోర్ లీడర్ ఎంపిక కీలకంగా మారింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో జరిగే కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫ్లోర్ లీడర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థి పనితీరు, విధేయత, ప్రజల్లో గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. అనుభవంతో నిమిత్తం లేకుండా కొత్త ముఖాలను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం 44 మంది అభ్యర్ధులు కార్పొరేటర్లుగా ఎంపిక కాగా, అందులో 35 మంది కొత్త వారే. కావడం గమనార్హం. సీనియర్ కార్పొరేటర్లు ఎంఎ గఫార్ (దూద్‌బౌలి) మహ్మద్ మెబీన్(రామ్నాస్పురా)ల్లో ఒకరిని ఫ్లోర్‌లీడర్‌గా ఎంపిక చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
పట్ట భధ్రులు బల్దియా సారథులు
బల్దియా పాలకమండలిలో ‘యువ’ నాయకత్వం 50 ఏళ్ల లోపువారు 129 మంది నూతనంగా ఎన్నికైనవారిలో 58 మంది పట్టభద్రులు ‘విశ్వనగరానికి బాటలు వేసే విద్యావంతులే మాకు కావాలంటూ..’ గ్రేటర్ వాసులు విస్పష్టంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్యావంతులకే ఎక్కువ శాతం మంది ఓటేశారు. తద్వారా ఉన్నత విద్య కలిగిన యువ నేతలు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. మొత్తం 150 మంది కార్పొరేటర్లలో 58 మంది పట్టభద్రులు, 15 మంది పీజీ పూర్తి చేసినవారు, పదుల సంఖ్యలో బీటెక్, ఎంటెక్, లా పూర్తి చేసిన వారు ఉండడం విశేషం. ఇక 40 ఏళ్ల లోపు వయసున్నవారు 69 మంది, 50 ఏళ్ల లోపు ఉన్న వారు 60 మంది ఉన్నారు. తద్వారా యువనేతలకు, విద్యావంతులకే ప్రజలు పట్టం కట్టారన్న విషయం స్పష్టమవుతోంది. సిటీబ్యూరో: సిటీ ప్రజలు విద్యావంతులకే ఓటన్నారు. గ్రేటర్ పోరులో పట్టభద్రులకే పట్టంకట్టారు. మహానగరం.. విశ్వనగరం బాటలో దూసుకెళ్లాంటే కార్పొరేటర్లుగా ఉన్నత విద్యావంతులు ఉండాల్సిందేనంటూ వారినే కార్పొరేటర్లుగా గెలిపించారు. తాజాగా ఎన్నికైన కార్పొరేటర్ల విద్యార్హతలను పరిశీలిస్తే.. వీరిలో 58 మంది పట్టభద్రులు ఉండడం విశేషం. ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం వెనుకంజే.. అన్న నానుడిని తోసిరాజని మొత్తం 150 డివిజన్లలో 75 మంది మహిళా అభ్యర్థులే గెలుపొందారు. అంతేకాదు గెలిచిన వారిలో డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అధికంగా ఉండడంతో ఈసారి బల్దియా పాలకమండలి ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇక డిగ్రీల విషయానికి వస్తే ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, వైద్యం, బీఈడీ వంటి ఉన్నత వృత్తివిద్యా కోర్సులను పూర్తి చేసినవారు కూడా కార్పొరేటర్లుగా ఎన్నికవడంతో బల్దియా పాలకమండలి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంలా నిలవనుంది. విభిన్న కోర్సులు చదివిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడంతో ఆయా రంగాలలో గ్రేటర్ నగరం అభివృద్ధికి వారంతా విలువైన సలహాలు, సూచనలు అందించి అత్యున్నత ప్రమాణాలున్న సరికొత్త విధానాలను రూపొందించే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. యువ నాయకత్వానికే ఓటు.. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల వయసును బట్టి చూస్తే యువతే అధికంగా ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించే సమర్థత, సత్తా ఉన్నవారు యువతేనని ఓటర్లు స్పష్టం చేశారు. ఓటు అనే వజ్రాయుధాన్ని యువతే అందించారు. గెలిచిన 150 మందిలో కార్పొరేటర్లలో 40 ఏళ్లలోపు వయసున్న వారు ఏకంగా 69 మంది ఉండడం విశేషం. 40 నుంచి 50 ఏళ్ల లోపున్న వారు 60 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు కేవలం ఇద్దరే ఉండడం గమనార్హం. విద్యా ప్రమాణాలకే మద్దతు.. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లలో డిగ్రీ పూర్తిచేసిన వారు 58 మంది ఉన్నారు. ఇక పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు 15 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు 24 మంది ఉండగా.. పదోతరగతి, సెకండరీ విద్యాభ్యాసం పూర్తి చేసినవారు 52 మంది ఉన్నారు. మరొకరు వైద్య విద్యనభ్యసించారు. ఇక లా, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు చదివినవారూ ఉన్నారు. వీరిలో కొందరు గూగుల్ వంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన పి. విజయారెడ్డి ఎంటెక్ పూర్తిచేశారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి లా చదివారు. ఓల్డ్ మలక్‌పేట్ కార్పొరేటర్ జువేనా ఫాతిమా ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీఏ చేసిన సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ గూగుల్‌లో ఉద్యోగం మానేసి ప్రజాసేవలో అడుగుపెట్టడం విశేషం. యువ హోరు.. జోరు.. మహానగర పాలన సంస్థ పరిపాలన,ప్రజా సేవలందించే పాలకమండలిలో ఈసారి యువహోరు..జోరు కనిపిస్తోంది. మొత్తం 150 మంది కార్పొరేటర్లలో 40 ఏళ్ల వయస్సు లోపలున్నవారు 69 మంది ఉండడం విశేషం. విశ్వనగరం దిశగా మహానగరాన్ని తీసుకెళ్లే దక్షత, సామర్థ్యం, జవాబుదారీతనం యువతకే అధికంగా ఉంటాయని,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేందుకు టెక్గురు అవతారం ఎత్తడం యువతకే సాధ్యమని,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే శక్తి వారికే ఉంటుందని భావించిన గ్రేటర్ ఓటర్లు పలువురు యువతీ, యువకులనుకార్పొరేటర్లుగా గెలిపించి తమ విజ్ఞతను చాటుకున్నారు. ఇక తాజాగా ఎన్నికైన కార్పొరేటర్లలో 40 నుంచి 50 ఏళ్ల మధ్యనున్నవారు 60 మంది ఉండడం విశేషం. గెలిచిన కార్పొరేటర్లలో 50 నుంచి 60 ఏళ్లలోపున్న వారు 19 మంది,అరవై ఏళ్లు దాటిన వారు ఇద్దరే ఉండడం విశేషం. సీమాంధ్రులూ భారీగానే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర మూలాలున్న అభ్యర్థులు కార్పొరేటర్లుగా భారీగానే విజయం సాధించారు. ఇందులో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచే ఎన్నికయ్యారు. కాజా సూర్యనారాయణ (జూబ్లిహిల్స్), ఎ. విజయలక్ష్మి (సోమాజిగూడ), శేషుకుమారి (అమీర్‌పేట) కిలారి మనోహర్ (వెంగళరావు నగర్), మేకా రమేష్ (మియాపూర్), జానకి రామరాజు (హైదర్‌నగర్), విజయకుమారి (అడ్డగుట్ట) కె.శ్రీదేవి (నేరేడ్మెట్), టీడీపీ తరపున మందాడి శ్రీనివాసరావు (కేపీహెచ్‌బీ) తదితరులు ఉన్నారు. ఇక తమిళ మూలాలున్న సర్వరాజ్ శివమణి (కాప్రా) విజయం సాధించారు. -
బల్దియా భవితవ్యం.. తేలేది నేడే
* సాయంత్రం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు * 5 గంటలకల్లా తొలి ఫలితాలు.. 7 గంటలకల్లా తుది లెక్కలు * గెలుపు ధీమాతో అధికార టీఆర్ఎస్ * మెజారిటీ స్థానాలు తమవే అంటున్న గులాబీ శ్రేణులు * నేడు పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ * భారీగా బందోబస్తు.. 800 మంది ఆర్ఏఎఫ్ సిబ్బంది మోహరింపు సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో విజేతలెవరో కొద్దిగంటల్లో తేలిపోనుంది. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... సాయంత్రం 5 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశముంది. 7 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మెజారిటీ డివిజన్లు దక్కించుకుని, ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని అధికార టీఆర్ఎస్ నాయకత్వం భరోసాతో ఉంది. జీహెచ్ఎంసీ-2009 ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లోనూ పోటీ చేయని టీఆర్ఎస్... ఈసారి ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో 150 డివిజన్లకు పోటీ పడింది. ఎంఐఎం ప్రభావం బలంగా ఉంటుందని భావించే పాతబస్తీలోనూ ఈసారి తాము ఖాతా తెరుస్తామన్న ఆశాభావాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలపై ఉత్కంఠ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన మంగళవారం పాతబస్తీలో ఎంఐఎం-కాంగ్రెస్, ఎంఐఎం-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ... ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం నాడే పురానాపూల్ డివిజన్ కు రీపోలింగ్ జరగనుండడంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ రోజే వివిధ మీడియా, ఇతర సంస్థలు స్వతంత్రంగా జరిపిన సర్వేలు, ‘ఎగ్జిట్ పోల్’ల అంచనాల ఆధారంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ, ఎంఐఎం, ఇతరులు గెలుపొందే డివిజన్ల సంఖ్యపై ప్రచారం జరిగింది. దీంతో సహజంగానే శుక్రవారం జరగనున్న కౌంటింగ్‌పై చర్చ జరుగుతోంది. రీపోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభిస్తామని, 5గంటల కల్లా తొలి ఫలితాలు వెలువడతాయని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తుది ఫలితాలు ఏడు గంటల కల్లా వెలువడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గెలుపుపై టీఆర్ఎస్ భరోసా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ (76)ను దాటుతామని టీఆర్ఎస్ నాయకత్వం భరోసా వ్యక్తం చేస్తోంది. తాము 77 నుంచి 85 డివిజన్ల దాకా గెలవబోతున్నామని... ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ 19.71 శాతం ఓట్లను పొందింది. తాజాగా తమ అంతర్గత సర్వేల ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 42 శాతం ఓట్లు పొందుతామని పార్టీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయని తెలిసింది. ఈ కారణంగానే అత్యధిక డివిజన్లలో గెలుస్తామని, జీహెచ్ఎంసీలో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తామని చెబుతోంది. ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం అధికార పార్టీ 90కిపైగా డివిజన్లలో విజయం సాధిస్తుందని నివేదికలు అందించినట్లు తెలిసింది. పురానాపూల్ డివిజన్లో భారీగా బందోబస్తు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీలోని పురానాపూల్‌లో చోటు చేసుకున్న ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పురానాపూల్ డివిజన్‌కు శుక్రవారం జరుగనున్న రీ-పోలింగ్‌కు శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతల నుంచి సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను తప్పించి.. మరో సీనియర్ పోలీసు అధికారికి అప్పగించాలని గురువారం ఆదేశించింది. ఈ మేరకు పురానాపూల్ డివిజన్ రీ-పోలింగ్ ఇన్చార్జిగా సంయుక్త పోలీస్ కమిషనర్ శివప్రసాద్‌ను నియమిస్తూ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పురానాపూల్‌లో కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్లోని 36 పోలింగ్ స్టేషన్లకు 36 మంది ఇన్స్పెక్టర్లను నియమించారు. ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. సంయుక్త, అదనపు పోలీసు కమిషనర్లు సైతం పరిస్థితుల్ని సమీక్షిస్తుంటారు. 800 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరిస్తున్నారు. -
పాతబస్తీలో పాగానే లక్ష్యం
⇒ రెండు దశాబ్దాలుగా ఎంబీటీ యత్నం ⇒ 17 డివిజన్లలో ఈసారి పోటీ ⇒ అక్షరాస్యత, అభివృద్ధే ప్రచారాస్త్రాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఒకే ఒక కార్పొరేటర్ స్థానానికి పరిమితమైన మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబీటీ) పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 డివిజన్లలో పోటీ పడుతోంది. ప్రధాన రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)ను మట్టికరిపించేందుకు రెండు దశాబ్దాలుగా ఎంబీటీ ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో జరిగిన ఎన్నికల్లో రెండు డివిజన్లను దక్కించుకున్న ఎంబీటీ గత ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక డివిజన్‌కు పరిమతమైంది. ఈసారి పాతబస్తీతో పాటు కొత్త నగరంలోనూ అభ్యర్థులను రంగంలో దింపింది. మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పాతబస్తీలో అక్షరాస్యత, అభివృద్ధి నినాదంతో ముమ్మర ప్రచారం సాగిస్తోంది. పట్టువదులకుండా... పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం అప్పటి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లా ఖాన్ నాయకత్వంలో 1993లో మజ్లిస్- బచావ్ తహరీక్ (ఎంబీటీ) పురుడుపోసుకుంది 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచుకోట చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయ కేతనం ఎగురవేయగా, మజ్లిస్ కేవలం ఒకే చార్మినార్ నియోజకవర్గానికి పరిమితమైంది. అది కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అరంగ్రేటంతో చార్మినార్ దక్కినట్లయింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపు కోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి జీహెచ్ఎంసీలో... జీహెచ్ఎంసీలో మొట్ట మొదటిసారిగా ఎంబీటీ పక్షాన ఇద్దరు కార్పొరేటర్లు అడుగుపెట్టారు. 2002లో జరిగిన ఎన్నికల్లో చంచల్‌గూడ డివిజన్ నుంచి అమానుల్లా ఖాన్ కుమారుడు అమ్జదుల్లా ఖాన్, బార్కాస్ నుంచి ఆయన సతీమణి సాలేహ బా హమీద్ గెలుపొందారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో అజాంపుర డివిజన్ నుంచి అమ్జదుల్లాఖాన్ ఒక్కరే కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈసారి మాత్రం 17 డివిజన్లలో ఎంబీటీ తలపడుతూ ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తోంది. -
టీడీపీకి ‘పొత్తు’ పోటు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. 150 డివిజన్లలో 63 డివిజన్లను బీజేపీకి కేటాయించి, 87 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీకి ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తుల గొడవ ఎక్కువైంది. టీఆర్ఎస్తో కుమ్ముక్కై బీజేపీకి గెలిచే సీట్లను కేటాయించారని పలు డివిజన్ల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టికెట్లు ఇప్పిస్తామని అడ్వాన్సుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఒకరిద్దరు నాయకులను టిక్కెట్ల కోసం నిలదీస్తున్నారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలోనే శేరిలింగంపల్లిలోని ఓ డివిజన్ టికెట్ ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకున్న ఓ ముఖ్యనేతను నిలదీసినట్లు సమాచారం. సదరు సీటు బీజేపీకి కేటాయించడంతో తరువాత అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన నేతను బూతులు తిడుతూ తన సొమ్ము తనకు ఇమ్మని గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. చివరికి ఆ డివిజన్‌కు బదులు వేరే చోట టికెట్ కేటాయించిన పరిస్థితి. అలాగే ఖైరతాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల్లో కూడా కొన్ని సీట్లను బేరం చేసుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి వంటి శివార్లలో బీజేపీకి సీట్లు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ వద్ద శని, ఆదివారాల్లో గొడవలకు దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌లను టిక్కెట్లు దక్కని నాయకులు తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగడం రెండు రోజులుగా సర్వసాధారణమైంది. ఒక్కో నియోజకవర్గంలో రెండేనా? అంబర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, మలక్‌పేట, ఎల్బీ నగర్, మల్కాజిగిరి వంటి నియోజవకర్గాలు ఒకప్పుడు టీడీపీకి బలమైన స్థానాలు. అయితే వీటిలో బీజేపీ మెజారిటీ సీట్లను తీసుకొని టీడీపీ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే తీసుకోవడంపై తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంబర్‌పేటలో కేవలం నల్లకుంట, ముషీరాబాద్‌లో ముషీరాబాద్, కవాడిగూడ, ఖైరతాబాద్‌లో ఖైరతాబాద్, సోమాజీగూడ, సికింద్రాబాద్‌లో మూడు, సనత్‌నగర్‌లో రెండు సీట్లలో మాత్రమే పోటీ చేయడంపై టీడీపీ కార్యకర్తలు కత్తులు దూస్తున్నారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో 25 నుంచి 30 సీట్ల వరకు టీడీపీ పోటీ చేస్తుండటం, గెలిచే అవకాశాలున్న స్థానాలను బీజేపీకి కేటాయించడం నాయకత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లలో బీజేపీకి అడిగినన్ని సీట్లు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ స్థానాల్లో రెబల్స్ 150 డివిజన్లలో 60 సీట్లు బీజేపీకి అని మొదట భావించినప్పటికీ, తరువాత గెలుపు అవకాశాలున్న సీట్లతో పాటు మరో మూడింటిని అదనంగా ఇచ్చారని తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ సీట్లు హిమాయత్‌నగర్, అమీర్‌పేట, గాంధీనగర్ వంటి డివిజన్లను కూడా బీజేపీకి కేటాయించడంపై గరంతో ఉన్న నేతలు టీడీపీ అభ్యర్థులుగానే నామినేషన్లు వేశారు. స్నేహపూర్వకపోటీలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని, బీ-ఫారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ తరఫున ఒకటికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా కొనసాగుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
సీట్ల పంపకాలపై పీటముడి
-
పూర్తి వివరాలను మా ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఓటర్ల జాబితాలో ఉన్న 7.90 లక్షల డూప్లికేట్ పేర్ల తొలగింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ) హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సీఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితాలో 7.90 లక్షల డూప్లికేట్ పేర్లు ఉన్నాయని, వాటిని ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలగిస్తామంటూ సీఈసీ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌గౌడ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే.. ఎన్నికల విషయంలో కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయని, ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఉన్నట్లు సీఈసీనే అంగీకరించిందని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. బోగస్ ఓట్లు అనడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగా, ఓటర్ల జాబితాలో 7.90 లక్షల డూప్లికేట్ పేర్లు ఉన్నట్లు అంగీకరించిన సీఈసీ, వాటిని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాతే తొలగిస్తామంటూ గత నెల 17న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఉదయం ఈ కేసు గురించి ప్రస్తావించేటప్పుడు బోగస్ ఓట్లని చెప్పారు. ఇప్పుడు డూప్లికేట్ పేర్లు అని చెబుతున్నారు. బోగస్‌కు, డూప్లికేట్‌కు చాలా తేడా ఉంది. ఈ విధంగా చెప్పడం సరికాదు. డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లు కానే కాదు. ఒకవ్యక్తి పేరే రెండు మూడుసార్లు ఓటర్ల జాబితాలో పునరావృతమైతే అది డూప్లికేట్ అవుతుందే తప్ప బోగస్ కాదు. మీరు ఊహల ఆధారంగా వాదనలు చేస్తున్నారే తప్ప, వాస్తవాల ఆధారంగా కాదు. ఊహలను మేం అంగీకరించబోం’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. డూప్లికేట్ పేర్లను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్‌ను ప్రశ్నించింది. నోటీసులు జారీ చేసిన తర్వాతే తొలగింపునకు చర్యలు తీసుకుంటామని అవి నాశ్ తెలిపారు. నోటీసుల అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించగా, నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తే కోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అయితే 7.90 లక్షల డూప్లికేట్ పేర్ల తొలగింపునకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. గడువు పెంచండి.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ గడువును మరో 45 రోజుల పాటు పొడిగించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టుకిచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ విఫలమయ్యాయని, ఉద్దేశపూర్వకంగానే వారు గడువు పొడిగింపు కోరకుండా ప్రభుత్వానికి మేలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు. డిసెంబర్ 15 నాటికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని విధివిధానాలను పూర్తి చేసి, ఆ తర్వాత 45 రోజులకు అంటే జనవరి 31, 2016కల్లా ఎన్నికలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎన్నికలకు ముందు విధివిధానాలనే పూర్తి చేయలేదని, దీనివల్ల అభ్యంతరాలు తెలిపేందుకు ఓటర్లకు గడువు లేకుండాపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. హైకోర్టు నిర్దేశించిన గడువుకు 3 వారాల వెనక ఉన్నారని, ఈ నెల 31కల్లా ఎన్నికలు పూర్తిచేయడం అవదన్నారు. గడువు పెంచకుంటే బీసీ ఓటర్లకు, రాజకీయ పార్టీలకు నష్టం కలుగుతుందన్నారు. -
‘గ్రేటర్’పై హైడ్రామా
* జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడ * షెడ్యూల్ కుదింపుపై న్యాయపర అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులను సవాలు చేస్తూ విపక్షాలు న్యాయస్థానం గడప తొక్కకుండా నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించడం లేదని తెలుస్తోంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ మూడు రోజుల కిందే సీఎం కేసీఆర్ సంతకం చేయడం గమనార్హం. మొత్తంగా డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే... రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకకాలంలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లను ప్రకటించే విధంగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ జారీ తర్వాత ఒకట్రెండు రోజులకు నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనవాయితీ. అయినా ఈసారి షెడ్యూల్‌తోపాటే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం పథక రచన చేసింది. దీని ప్రకారం ఈ నెల 7వ తేదీన రాత్రి ప్రభుత్వం డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఎన్నికల సంఘం ఓ సారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత న్యాయస్థానాలు ఎలాంటి అభ్యంతరాలపై అయినా వ్యాజ్యాలను స్వీకరించవు. అంటే రాత్రి రిజర్వేషన్లు ప్రకటించి, ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు వస్తే... అనంతరం ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకింత వ్యూహాత్మకం? జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను 26 రోజుల నుంచి 15 రోజులకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించింది. నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ గడువును 4-7 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించింది. అయితే కేవలం మూడు రోజుల వ్యవధిలో రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం రాజకీయ పార్టీలకు సవాలుగా మారనుంది. దాంతోపాటు మొత్తంగా 15 రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయి. దీనివల్ల ప్రచారం నిర్వహించేందుకు సరిపడా సమయం లభించే అవకాశాలు ఉండవని పార్టీలు భావిస్తున్నాయి. అసలు ఎన్నికల షెడ్యూల్‌ను కుదించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏ చట్టానికైనా సవరణలు జరపవచ్చని పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 పేర్కొంటోంది. ఈ వెసులుబాటు ఆధారంగానే ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించి ఎన్నికల షెడ్యూల్‌ను కుదించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టేందుకు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటుహక్కు కల్పించేందుకు ఇదే బాటను అనుసరించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుపరిపాలన వేదిక అనే సంస్థ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. స్వీయ అవసరాల కోసం ప్రభుత్వం పదేపదే పునర్విభజన చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సెలవు వచ్చినా లెక్కలోకే..! జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు టీఆర్ఎస్ సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి ప్రభుత్వ సెలవు దినాలు. ఇవి ఎన్నికల ప్రక్రియ మధ్యలో వస్తే.. ఆ తర్వాతి రోజులకు నామినేషన్లు, ఉపసంహరణ వంటివి పొడిగించాలి. దీంతో ఎన్నికల ప్రక్రియ గడువును కుదించి కూడా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావి స్తోంది. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియను 3 వారాల నుంచి 2 వారాలకు కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించింది. కానీ నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలకు నిర్దేశించిన తేదీల్లో సెలవు దినాలుంటే మరు సటి పనిదినం నాడు వాటిని అనుమతించాలని ఇదే చట్టంలో సెక్షన్-40 చేబుతోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ గడువులో సెలవు దినాలున్నా... వాటిని సైతం వర్కింగ్ డేలుగానే పరిగణించేలా సెక్షన్-40ని సవరించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై బుధవారం ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
క్రమబద్ధీకరణ చేయొద్దు!
* మేం ఆదేశాలిచ్చేదాకా జీవో 146ను అమలు చేయకండి * అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * దరఖాస్తులను మాత్రం స్వీకరించవచ్చు * జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించిన తీరు సరికాదు * శాసన ప్రక్రియ ద్వారా సవరించుకోవచ్చు * పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం * విచారణ జనవరి 27కు వాయిదా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను తాము చెప్పే వరకూ క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసిన తీరు సరికాదని, కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కావాలంటే శాసన ప్రక్రియ ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చని సూచించింది. అయితే క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రం అనుమతించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. ఆ చట్ట సవరణ తప్పు: పిటిషనర్ న్యాయవాది జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన 146, 152 జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని మంగళవారం హైకోర్టు విచారించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 146 జారీ చేసిందని కోర్టుకు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 455ఎఎకు సవరణ చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారని... ఈ సవరణ ప్రకారం క్రమబద్ధీకరణ గడువును 5.12.2007 నుంచి 2015కు పొడిగించారని చెప్పారు. అయితే సెక్షన్ 101 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టాన్నయినా వర్తింప (అడాప్ట్) చేసుకోవచ్చని, సవరణ మాత్రం చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ వాదనల్లో వాస్తవముంది: ధర్మాసనం పిటిషనర్ న్యాయవాది వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మా ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది. సెక్షన్ 101 కేవలం ఓ చట్టాన్ని అన్వయించుకోవడానికి ఉద్దేశించిందే. దాని కింద చట్ట సవరణ చేయడానికి వీల్లేదు. చట్ట సవరణ చేసే విషయంలో మీకు (రాష్ట్ర ప్రభుత్వానికి) హక్కులపై మాకు కొంత సందేహం ఉంది..’’ అని పేర్కొంది. అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదిస్తూ... ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 100, రాజ్యాంగంలోని 131, 372 అధికరణల ప్రకారం ఈ చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగానే క్రమబద్ధీకరణ జీవో జారీ చేశామని కోర్టుకు విన్నవించారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం... శాసనాధికారం ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చే తప్ప, ఇలా కార్యనిర్వాహక అధికారాల ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు జీవో 146 ప్రకారం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించవచ్చని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. -
‘గ్రేటర్’ సమస్యలకు ‘యాప్’తో చెక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో ప్రభుత్వ విభాగాలు మొబైల్ ‘యాప్’ బాటపట్టాయి. నగరవాసులకు యూజర్ ఫ్రెండ్లీ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా గుంతలుపడ్డ రహదారులు.. మూతలు లేని మ్యాన్‌హోల్స్.. దెబ్బతిన్న వరదనీటి కాల్వలు.. తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించాలని జీహెచ్ఎంసీ, జలమండలి నిర్ణయించాయి. ‘హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ’ పేరిట త్వరలోనే ఈ మొబైల్ యాప్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మీరు రహదారిపై వెళుతున్నప్పుడు ఎదురైన సమస్యలను మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో క్లిక్ మనిపించి.. ఈ యాప్ ద్వారా సంబంధిత విభాగాలకు చేరవేయవచ్చు. దీంతో సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. యాప్ ఎలా వినియోగించాలి * వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నుంచి గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ‘హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ’ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. * అందులో కన్స్యూమర్ సర్వీసెస్ యాప్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. * ఇందులో మీ మొబైల్ నంబర్‌ను ఒకసారి నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా టైప్ చేయాలి. * అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ అందుతుంది. దీని ఆధారంగా దెబ్బతిన్న రోడ్లు, మ్యాన్‌హోల్స్, వరదనీటి కాల్వలపై ఫిర్యాదు చేయవచ్చు. * అంతేకాదు మీ మొబైల్ నుంచి ఆయా సమస్యలను చిత్రీకరించి ఆ ఫొటోలను యాప్‌తో సంబంధిత విభాగాలకు పంపొచ్చు. * ప్రతి ఫిర్యాదుకు నంబర్‌ను కేటాయిస్తారు. సదరు ఫిర్యాదు క్షణాల్లో సంబంధిత అధికారి వద్దకు వెళుతుంది. * రోజువారీగా యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఫొటోలతో పాటు డౌన్లోడ్ చేసి.. పరిష్కారానికి సంబంధిత సిబ్బందిని రంగంలోకి దించుతారు. * సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదు చేసిన వినియోగదారుని మొబైల్‌కు సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారు. -
గ్రేటర్లో 150 డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని 150 వార్డుల (డివిజన్ల)తో పునర్వ్యవస్థీకరించారు. గత నెల 28న జారీ చేసిన ముసాయిదాకు ఆయా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వు జారీ చేసింది. వార్డుల పునర్వ్యవస్థీకరణ తుది జాబితాకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వు వెలువరించింది. ఈ జీవో (నం.166) మేరకు ఫారం-6 ద్వారా వార్డుల విభజనపై శుక్రవారం తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ముసాయిదా జాబితాపై మొత్తం 635 అభ్యంతరాలు, సూచనలు అందాయి. వీటిల్లో వార్డుల పేర్లు, సరిహద్దులు మార్చాల్సిందిగా అందిన అభ్యంతరాల్లో 65 ఫిర్యాదులు, సలహాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరో 38 ఫిర్యాదుల్ని పాక్షికంగా పరిశీలించామని, సహేతుకత లేకపోవడంతో 532 దరఖాస్తుల్ని తిరస్కరించినట్లు తెలిపారు. జనాభా... భౌగోళిక సరిహద్దులు: ప్రస్తుతమున్న 150 డివిజన్ల(వార్డుల) సంఖ్యలో మార్పు లేనప్పటికీ జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల ఆధారంగా కొత్త డివిజన్లను వెలువరించారు. పాతవి కనుమరుగయ్యి కొత్తగా 27 డివిజన్లు చేరాయి. గతంలో కొన్ని డివిజన్లలో 20 వేల జనాభా ఉంటే మరికొన్నింటిలో 70 వేలకు పైగా ఉంది. ప్రస్తుతమలా కాకుండా దాదాపు అన్నింటా సగటున 44 వేల జనాభా ఉందని చెబుతున్నారు. అయితే ఆయా డివిజన్లలోని జనాభాను కానీ, వాటికి సంబంధించిన మ్యాపుల్ని కానీ అధికారికంగా విడుదల చేయలేదు. మార్పులిలా: ముసాయిదాకు, తుది జాబితాకు నాలుగు డివిజన్ల పేర్లలో మార్పు జరిగింది. ముసాయిదాలోని బర్కత్‌పురా, మోతీనగర్ డివిజన్లు తుది నివేదికలో కనుమరుగయ్యాయి. అలాగే కొత్త డివిజన్‌గా అవతరిస్తుందనుకున్న అబిడ్స్ కూడా తెరమరుగైంది. ముసాయిదాలో మోతీనగర్గా ఉన్న డివిజన్ పేరును మూసాపేటగా రూపాంతరం చేశారు. మూసాపేట పేరుతో ఉన్న డివిజన్‌ను బాలాజీనగర్గా కొత్తగా చేర్చారు. బర్కత్‌పురా డివిజన్ పేరును కాచిగూడగా మార్చారు. అబిడ్స్ డివిజన్‌కు పాత పేరైన గన్ఫౌండ్రినే ఉంచారు. కొద్ది డివిజన్ల సరిహద్దుల్లో మాత్రం స్వల్ప మార్పులు జరిగాయి. అంతకుమించి భౌగోళిక సరిహద్దులు, ఇతరత్రా అంశాల్లో పెద్దగా మార్పుల్లేవు. కనుమరుగైన డివిజన్లు: 1.కర్మన్‌ఘాట్, 2.పీ అండ్ టీ కాలనీ, 3.సలీంనగర్, 4.నూర్‌ఖాన్‌బజార్, 5.అలియాబాద్, 6.ఫతేదర్వాజ, 7.హుస్సేనిఆలం, 8.ధూల్‌పేట, 9.శివరాంపల్లి, 10.మురాద్‌నగర్, 11.చింతల్‌బస్తీ, 12.విద్యానగర్, 13.సుల్తాన్‌బజార్, 14.బాగ్‌లింగంపల్లి, 15.దోమలగూడ, 16.పంజగుట్ట, 17.బల్కంపేట, 18.శ్రీనగర్‌కాలనీ, 19.షాపూర్‌నగర్, 20.యాప్రాల్, 21.డిఫెన్స్‌కాలనీ, 22.సఫిల్‌గూడ, 23.చిలకలగూడ, 24.పద్మారావునగర్, 25.మారేడ్‌పల్లి, 26.మోతీనగర్, 27.బర్కత్‌పురా. తాజా విభజన మేరకు ఇకపై జీహెచ్ఎంసీలోని డివిజన్లు ఇవీ... 1. కాప్రా(కొత్త), 2. డా.ఎ.ఎస్.రావు నగర్, 3. చర్లపల్లి, 4. మీర్‌పేట హెచ్‌బీకాలనీ (కొత్త), 5. మల్లాపూర్, 6. నాచారం, 7. చిలుకానగర్(కొత్త), 8. హబ్సిగూడ, 9. రామంతాపూర్, 10. ఉప్పల్, 11. నాగోల్ (కొత్త), 12. మన్సూరాబాద్, 13. హయత్‌నగర్, 14. బీఎన్‌రెడ్డి నగర్(కొత్త), 15. వనస్థలిపురం, 16. హస్తినాపురం(కొత్త), 17. చంపాపేట, 18. లింగోజిగూడ(కొత్త), 19. సరూర్‌నగర్, 20. రామకృష్ణాపురం, 21. కొత్తపేట, 22. చైతన్యపురి (కొత్త), 23. గడ్డిఅన్నారం, 24. సైదాబాద్, 25. మూసారాంబాగ్, 26. ఓల్డ్ మలక్‌పేట, 27. అక్బర్‌బాగ్, 28. ఆజంపురా, 29. చావ్నీ, 30. డబీర్‌పురా, 31. రెయిన్‌బజార్, 32. పత్తర్‌ఘట్టి, 33. మొఘల్‌పురా, 34. తలాబ్ చంచలం, 35. గౌలిపురా, 36. లలిత్‌బాగ్, 37. కుర్మగూడ, 38. ఐఎస్ సదన్, 39. సంతోష్‌నగర్, 40. రియాసత్‌నగర్, 41. కంచన్‌బాగ్, 42. బార్కాస్, 43. చాంద్రాయణగుట్ట, 44. ఉప్పుగూడ, 45. జంగమ్మెట్, 46. ఫలక్‌నుమా, 47. నవాబ్‌సాహెబ్‌కుంట, 48. శాలిబండ, 49. ఘాన్సీబజార్, 50. బేగంబజార్, 51. గోషామహల్, 52. పురానాపూల్, 53. దూద్‌బౌలి, 54. జహనుమా, 55. రామ్నాస్పురా, 56. కిషన్‌బాగ్, 57. సులేమాన్‌నగర్(కొత్త), 58. శాస్త్రిపురం (కొత్త), 59. మైలార్‌దేవ్‌పల్లి, 60. రాజేంద్రనగర్, 61. అత్తాపూర్, 62. జియాగూడ, 63. మంగళ్‌హాట్, 64. దత్తాత్రేయనగర్, 65. కార్వాన్, 66. లంగర్‌హౌస్, 67. గోల్కొండ (కొత్త), 68.టోలిచౌకి, 69. నానల్‌నగర్, 70. మెహిదీపట్నం, 71. గుడిమల్కాపూర్, 72. ఆసిఫ్‌నగర్, 73. విజయనగర్‌కాలనీ, 74. అహ్మద్‌నగర్, 75. రెడ్‌హిల్స్, 76. మల్లేపల్లి, 77. జాంబాగ్, 78. గన్‌ఫౌండ్రి, 79. హిమాయత్‌నగర్, 80. కాచిగూడ, 81. నల్లకుంట, 82. గోల్నాక, 83. అంబర్‌పేట, 84. బాగ్‌అంబర్‌పేట, 85. అడిక్‌మెట్, 86. ముషీరాబాద్, 87. రామ్‌నగర్, 88. భోలక్‌పూర్, 89. గాంధీనగర్, 90. కవాడిగూడ, 91. ఖైరతాబాద్, 92. వెంకటేశ్వరకాలనీ (కొత్త), 93. బంజారాహిల్స్, 94. షేక్‌పేట, 95. జూబ్లీహిల్స్, 96. యూసుఫ్‌గూడ, 97. సోమాజిగూడ, 98. అమీర్‌పేట, 99. వెంగళ్రావునగర్, 100. సనత్‌నగర్, 101. ఎర్రగడ్డ, 102. రహ్మత్‌నగర్, 103. బోరబండ, 104. కొండాపూర్ (కొత్త), 105.గచ్చిబౌలి, 106.శేరిలింగంపల్లి, 107. మాదాపూర్ (కొత్త), 108.మియాపూర్ (కొత్త), 109.హఫీజ్‌పేట, 110.చందానగర్, 111.భారతీనగర్ (కొత్త), 112.రామచంద్రాపురం, 113.పటాన్చెరు, 114.కేపీహెచ్‌బీ కాలనీ, 115.బాలాజీనగర్(కొత్త), 116.అల్లాపూర్ (కొత్త), 117.మూసాపేట, 118. ఫతేనగర్, 119.ఓల్డ్ బోయిన్పల్లి, 120.బాలానగర్ (కొత్త), 121.కూకట్పల్లి, 122.వివేకానందనగర్ కాలనీ, 123.హైదర్‌నగర్, 124.ఆల్విన్‌కాలనీ(కొత్త), 125.గాజులరామారం, 126.జగద్గిరిగుట్ట, 127.రంగారెడ్డినగర్(కొత్త), 128. చింతల్, 129.సూరారం, 130. సుభాష్‌నగర్(కొత్త), 131.కుత్బుల్లాపూర్, 132.జీడిమెట్ల, 133.మచ్చబొల్లారం, 134. అల్వాల్, 135. వెంకటాపురం(కొత్త), 136.నేరేడ్మెట్(కొత్త), 137.వినాయకనగర్(కొత్త), 138. మౌలాలి, 139.ఈస్ట్ ఆనంద్‌బాగ్(కొత్త), 140. మల్కాజిగిరి, 141. గౌతమ్‌నగర్, 142. అడ్డగుట్ట, 143. తార్నాక, 144. మెట్టుగూడ, 145. సీతాఫల్మండి, 146. బౌద్ధనగర్, 147.బన్సీలాల్‌పేట, 148. రామ్‌గోపాల్‌పేట, 149. బేగంపేట, 150. మోండా మార్కెట్ (కొత్త). -
కీలక అధికారిని ఇంటికి పంపితేనే అంతా దారిలోకి
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణదారులకు జారీ చేసిన నోటీసులు చాలా అస్పష్టంగా ఉన్నాయని, దీనిని బట్టి అధికారులు తమ ఉత్తర్వులను చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే జీహెచ్ఎంసీలో కీలక అధికారిని ఒకరిని ఇంటికి సాగనంపితే, మిగిలినవారు దారిలోకి వస్తారంది. నోటీసుల్లో కోర్టు ఆదేశాల మేరకు జారీ చేసినట్లు పేర్కొనడంపై హైకోర్టు నిలదీసింది. ‘మేం చెబితే గానీ మీరు ఏ పనీ చేయరా..? ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని కూడా మేమే చెప్పాలా..? మేం చెబితే మీరు చేయడమేంటి..? మీ పని మేం చేయాలా..? మేం చెబితేనే మీరు నెల నెలా జీతాలు తీసుకుంటున్నారా..? మరి వాటిని మమ్మల్ని అడిగి చేయనప్పుడు, ఆక్రమణదారులపై చర్యలు కూడా మీరంతట మీరే తీసుకోవాలి కదా.!’ అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను 29కి వాయిదా ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి మరో అవకాశమిస్తూ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సిద్దంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. దీనికి స్వయంగా హాజరు కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంచార్జ్ డిప్యూటీ కమిషనర్ కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే ఆక్రమణదారులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు జారీ చేశామంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, అందులో ఆ నోటీసులను ఎప్పుడు జారీ చేశారు..? వాటిని ఆక్రమణదారు ఎప్పుడు అందుకున్నారు..? వారు ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలి..? స్పందించపోతే ఏం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది..? తదితర వివరాలు లేకపోవడాన్ని ప్రశ్నించింది. ‘జీహెచ్ఎంసీ అధికారులు చాలా తెలివిగా నోటీసులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఆక్రమణదారులకు సాయం చేసేందుకే ఇలా అస్పష్టంగా ఇచ్చినట్లుంది. ఇవి ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు. అసలు వీటిని నోటీసులంటారా..? కోర్టు ఉత్తర్వులను అధికారులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు ఈ నోటీసులను పరిశీలించిన తరువాత అర్థమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులంటే మీకు లెక్క లేదా..? ఇందుకు కిందిస్థాయి సిబ్బందిని బలి పశువుని చేయడం తగదు. జీహెచ్ఎంసీలో కీలక స్థాయిలో ఉన్న అధికారిని ఇంటికి సాగనంపితే, మిగిలిన వారంతా దార్లోకి వస్తారు. ఇటువంటి నోటీసులు జారీ చేసినందుకు ఈ అధికారి (కోర్టు ముందు హాజరైన డిప్యూటీ కమిషనర్)పై చర్యలు తీసుకోమంటారా..?’ అని నిలదీసింది. ఇదే సమయంలో ఓ వ్యాపారి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమ షాపు ముందు ఉన్న స్థలం తమ సొంతదని, దానిని జీహెచ్ఎంసీ వారిదిగా పేర్కొంటూ అక్కడున్న నిర్మాణాన్ని తొలగించిందని తెలి పారు. దీనిపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోబోమని, నోటీసులు అందుకున్న వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై ఎటువంటి సామాగ్రిని ఉంచబోమంటూ రాతపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
‘ గ్రేటర్’ లక్ష్యంగా స్వచ్ఛ హైదరాబాద్!
జంటనగరాల్లో అధికార పార్టీ నేతల హడావుడి స్వయంగా కాలనీలు తిరిగిన సీఎం కేసీఆర్ వాడలను చుట్టివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో, అధికార పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా బస్తీలు తిరగడం.. వాడల్లో ప్రజల తో మమేకం కావడం... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంటనగరాలను చుట్టి రావడం.. చర్చనీయాంశమైంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పీఠమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్లో ప్రజలను నేరుగా కలవడం, వారి సమస్యలను వినడం, తాత్కాలికమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సి పనులకు హామీలు ఇవ్వడం కోసం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఉపయోగపడిందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంఐఎం పట్టున్న పాతబస్తీతోపాటు విపక్ష టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధుల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఉద్యమంగా జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పరిశీలించిన వర్గాలు ఇది కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా చేపట్టిందేనని వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం అయిదు రోజుల్లో సుమారు 7 లక్షల మంది ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా క లుసుకోగలిగామని జీహెచ్ఎంసీ అధికారికంగానే ప్రకటించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి రోడ్ల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, గ్రంథాలయాలు, జిమ్‌ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలకు కూడా అందాయి. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఏకంగా ఐదు వందల బృందాలను రంగంలోకి దింపారు. నగర ప్రజల ముంగిట్లోకి వెళ్లి, వారిని నేరుగా కలిసి మాట్లాడారు. ప్రధానంగా నగరంలోని వివిధ బస్తీ వాసుల్లో విశ్వాసం నింపేలా వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ వరసగా రెండు రోజుల పాటు హామీలు ఇచ్చారు. యూనివర్సిటీ జాగాల్లో పక్కా ఇళ్ళు కట్టిస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధానంగా తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికార పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. పాతబస్తీలో ఎంఐఎం నేతల నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన కార్యక్రమం కావడంతో నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అనివార్యంగా పాల్గొనడమే కాకుండా, ఎలాంటి విమర్శలు చే యలేకపోయారు. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
అక్టోబర్ 31 వరకే గడువు
గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఆ తరువాత 45 రోజులకల్లా అంటే డిసెంబర్ 15 నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరడంతోపాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో ఉన్న 150 వార్డులను 200కు పెంచామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని, డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. చేయాల్సిన పనులు చాలా ఉండటంతోనే 219 రోజుల గడువు కోరుతున్నామని ఆయన వివరించారు. తరువాత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం చెప్పిన ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయడానికి 158 రోజులు సరిపోతాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, 219 రోజుల గడువు సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో మొత్తం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, కనీసం ఏడు నెలల గడువన్నా ఇవ్వాలని అభ్యర్థించగా, ధర్మాసనం సున్నితంగా తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
* ఎన్నికల సంఘానికి నివేదిక పుంపుతాం * అన్ని ప్రక్రియల పూర్తికి 249 రోజులు కావాలి * హైకోర్టుకు నివేదించిన టీ సర్కార్ * విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. వార్డుల పునర్విభజన, అభ్యంతరాల స్వీకరణ, బీసీ ఓటర్ల గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించేందుకు 249 రోజులు పడుతుందని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో తెలిపింది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని వివరించింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు రాగానే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందులోని అంశాలను చదివి వినిపించారు. రాష్ట్ర విభజన తరువాత ఐఏఎస్ అధికారుల కేటాయింపులో ఆలస్యం జరిగిందని, పని ఒత్తిడి వల్ల వార్డుల పునర్విభజనను కోర్టు ఆదేశాలిచ్చిన వెంటనే చేపట్టలేకపోయామని ఆయన వివరించారు. కేటాయింపులు పూర్తయిన తర్వాత వార్డుల పునర్విభజనకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వార్డుల పునర్విభజన, పునర్విభజన ముసాయిదా ప్రతిపాదనలు, అభ్యంతరాల స్వీకరణ, ప్రభుత్వానికి తుది ప్రతిపాదనల సమర్పణ, ఆమోదించిన ప్రతిపాదనలు గెజిట్‌లో ప్రచురణ, వార్డులు- పోలింగ్ కేంద్రాల వారీ ఓటర్ల జాబితా తయారీ, బీసీ ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే, బీసీ ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసేందుకు 249 రోజులు పడుతుందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, ఇప్పటి వరకు ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పిందే తప్ప, అసలు విషయం చెప్పడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ కౌంటర్‌పై అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
జీహెచ్ఎంసీని విభజించాలి: మర్రి శశిధర్‌రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నగరంలో పెరుగుతున్న జనాభా, వారి అవసరాల దృష్ట్యా... దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ ఎంసీని విభజించాలని తెలిపారు. జనాభా దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీ కార్పొరేషన్ కూడా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయాన్ని మర్రి శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. జాప్యమైన సర్వే డివిజన్ల పునర్ విభజన ప్రక్రియ శాస్త్రీయంగా చేపట్టాలని ప్రభుత్వానికి మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. జీహెచ్ ఎంసీ పాలక వర్గం పదవి కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. త్వరలో జీహెచ్ ఎంసీకి ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ను విభజించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనిపై ఇంకా ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. అయితే కార్పొరేషన్ విభజించాలని పలు రాజకీయ పక్షాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
2 కార్పొరేషన్లు?
ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు విభజించాకే ఎన్నికలకు వెళ్లే యోచన జీహెచ్ఎంసీని రెండుగా విభజించే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదన సాధ్యం కాదని సంబంధిత నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజాగా దీనికి మరోసారి కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసిన వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీని ఉత్తర, దక్షిణ (నార్త్, సౌత్) కార్పొరేషన్లుగా విభజించేందుకు కసరత్తు సాగుతోంది. సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) రెండుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఇది అసాధ్యమని ఓ వైపు నిపుణులు అంటుండగా... మరోవైపు దీనిని రెండుగా విభజించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీని ఢిల్లీ, ముంబయ్లతరహాలో రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వెల్లడించారు. తాజా సమాచారం మేరకు జీహెచ్ఎంసీని రెండు (నార్త్, సౌత్‌లుగా) కార్పొరేషన్లుగా విభజించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయం తొలుత వినిపించింది. రాజకీయ అవసరాలు, వివిధ పార్టీల బలాబలాలు, తమతో కలిసివచ్చే పార్టీలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండైతేనే మేలనే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ జెండాను ఎగురవేయాలనే కృతనిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీగా ఒక్కటే ఉంటే విజయావకాశాలు సులువు కాదనే భావనతో ‘రెండింటి’ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉండటం.. కేంద్రంలోని అధికార బీజేపీతో పొత్తు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మైత్రి కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 3 తర్వాత వేగవంతం డిసెంబర్ 3వ తేదీతో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తోంది. ఆ తరువాత విభజన చర్యలు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోగానే దీన్ని పూర్తి చేయనున్నారు. విభజన లేకపోయినా ఇప్పటికిప్పుడు పాలకమండలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. వార్డుల డీలిమిటేషన్.. బీసీల గణన పూర్తి కావాల్సి ఉంది. వీటిని పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలంటే ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుంది. డీలిమిటేషన్‌పై జీహెచ్ఎంసీకి ఇంకా మార్గదర్శకాలు అందలేదు. ఈలోగా జీహెచ్ఎంసీ విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నది సర్కారు యోచన. సౌత్.. ఈ కార్పొరేషన్ పరిధిలోకి హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, కార్వాన్, గోషామహల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని నాంపల్లి, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎల్బీనగర్, మెదక్ లోక్‌సభ పరిధిలోని పటాన్చెరు, ఆర్సీపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నార్త్.. నార్త్ కార్పొరేషన్ పరిధిలోకి మల్కాజిగిరి లోక్‌సభలోని ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్‌సభలోని సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకుల అంచనా. -
గ్రేటర్ వార్
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, కమిషనర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్ఈడీల ఏర్పాటుపై కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచింది. కమిటీ అనుమతివ్వకపోయినా డిసెంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి తెస్తామని కమిషనర్ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌ల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొంది. ఒకటీ అరా సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బట్టబయలైనప్పటికీ, అంతలోనే సర్దుబాటయ్యాయి. రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధిస్తామనే ప్రకటనతో తమకు సంబంధం లేదని మేయర్ చెప్పడంతో పాటు మరికొన్ని అంశాల్లోనూ అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి. తాజాగా.. రూ. 4వేల లోపు నివాస గృహాలకు ఆస్తిపన్ను రద్దుకు మేయర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం సమావేశమైన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. మరోవైపు నగరమంతా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పా టుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచడంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు బయటపడ్డాయి. నగరాన్ని వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు విద్యుత్ పొదుపునకు ఉపకరిస్తుందనే భావనతో ఎల్ఈడీల ఏర్పాటుకు కమిషనర్ సిద్ధమయ్యారు. ఈ కాంట్రాక్టున ఈఈఎస్ఎల్కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనికి కమిటీ అంగీకరించలేదు. దీని ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే తలంపుతో కొందరు ముఖ్యనేతలు మేయర్ ద్వారా ఆటంకాలు సృష్టించినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీలో చర్చ సందర్భంగా కమిషనర్ ఈ అంశంపై గట్టిగా పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీరు ఇప్పుడు అంగీకరించకపోయినా.. డిసెంబర్4 తర్వాత అమల్లోకి తెస్తా’మని కమిషనర్ అన్నట్లు సమాచారం. డిసెంబర్ 3తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లు పెంచేందుకు కమిషనర్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో.. మేయర్ రూ. 4వేల లోపు ఆస్తిపన్ను రద్దు చేస్తూ ప్రకటన చేయడం విభేదాలపై ప్రచారాలకు ఊతమిస్తోంది. -
34 కొత్త నియోజకవర్గాలు
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు షురూ ►119 స్థానే 153కు చేరనున్న తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ►ఎస్సీలకు 23, ఎస్టీలకు 19 స్థానాలు కేటాయించే అవకాశం ►రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు, నిజామాబాద్‌లో అత్యల్పం ►కొత్త వాటిల్లోనే 2019 ఎన్నికలు, 2026 వరకు కొనసాగింపు కొత్త రాష్ట్రంలో మరిన్ని శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణ పది జిల్లాల్లో మరో 34 శాసనసభ స్థానాలు ఏర్పాటు దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక కసరత్తును ప్రారంభించటంతో రాజకీయ పార్టీలు, నాయకుల్లో మళ్లీ ఆసక్తికరమైన చర్చలకు తెరలేస్తోంది. దీంతో ప్రస్తుత శాసనసభ నియోజకవర్గాల హద్దులు మారిపోవటం, కొత్తగా మరిన్ని ఏర్పాటు అవుతుండడం, ఎస్సీ, ఎస్టీలకు ఇంకొన్ని నియోజకవర్గాలు రిజర్వు కానున్న నేపథ్యంలో అందరి దృష్టి నియోజకవర్గాల పునర్విభజనపై పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 2,30,064 జనాభా సగటును ప్రామాణికంగా తీసుకుని ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతవుున్న 119 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 153కు చేరుకోనుంది. ఈ పునర్విభజనలో అత్యధిక స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పెరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా పదకొండు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నారుు. మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటై మొత్తం సంఖ్య 18కి చేరనుంది. పునర్విభజన సాగేదిలా... 2001 జనాభా లెక్కల మేరకు ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12లకు రిజర్వు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలు విడిపోవటంతో 42 లోక్‌సభ పరిధిలో కొత్తగా రెండేసి చొప్పున శాసనసభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 34 (119+34=153) శాసనసభ స్థానాలు పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 2026 వరకు యథావిధిగా ఉంటాయి. 2011 జనాభా లెక్కల వివరాలను పరిగణనలోకి తీసుకుని శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. ఈ ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978గా తేల్చారు. దీంతో మొత్తం జనాభాను 153తో విభజిస్తే వచ్చే సగటు మేరకు నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుంది. అంటే 2,30,026 జనాభాకు ఒక్క నియోజకవర్గం ఏర్పాటవుతున్నట్లు లెక్క. అయితే పునర్విభజన చట్టం మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ జనాభా రాష్ట్ర సగటు కంటే 10 శాతం తక్కువ లేదా 10 శాతం ఎక్కువతోనైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. దళితులకు 23 శాసనసభ స్థానాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల జనాభా 16.19 (2001 జనాభా) శాతంగా నమోదు కాగా, విడిపోయిన అనంతరం తెలంగాణలో దళితుల జనాభా సగటు 15.44 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రస్తుతం 19 స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 23కు చేరుకోనున్నాయి. జిల్లాలోని ఎస్సీ జనాభా ఆధారంగా ఈ స్థానాలను రిజర్వ్ చేస్తారు. అత్యధికంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎస్సీలకు మూడేసి చొప్పున నియోజకవర్గాలు రిజర్వయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్లో దళితులకు మూడు నియోజకవర్గాలు రిజర్వు కాగా, పెరిగే స్థానాలు వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కేటాయించే అవకాశం ఉంది. ఎస్టీలకు 16 స్థానాలు... ఎస్టీలకు ప్రస్తుతం 12 శాసనసభ స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 16కు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 9.34 శాతం గిరిజనులు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఈ మేరకు గిరిజనులకు మరో నాలుగు స్థానాలు పెరుగుతాయి. రిజర్వేషన్లను మాత్రం రాష్ట్ర యూనిట్‌గా తీసుకుని కేటాయింపు చేస్తారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎస్టీలకు మరిన్ని సీట్లు రిజర్వు కానున్నాయి. గ్రేటర్‌లోనే కొత్తగా పది స్థానాలు పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్‌లో కనీసం పది శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్‌సిటీ(హైదరాబాద్ జిల్లా)లో రెండు నియోజకవర్గాలు పెరుగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో భాగమైన శివార్లు(రంగారెడ్డి జిల్లా) కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కనీసం ఎనిమిది కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ఇలా.. తెలంగాణ జనాభా(2011) : 3,51,93,978 నియోజకవర్గ సగటు జ నాభా : 2,30, 026 మొత్తం నియోజకవర్గాలు : 153 ఎస్సీలకు రిజర్వు అయ్యేవి : 23 ఎస్టీలకు రిజర్వు అయ్యేవి : 16 అత్యధిక స్థానాల జిల్లా : రంగారెడ్డి (23) తక్కువ స్థానాల జిల్లా : నిజామాబాద్(11) -
3 ముక్కలు కానివ్వం
అమిత్ షా అభినందన సభలో దత్తాత్రేయ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ ఎత్తులు పారనివ్వబోమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంఐఎంతో చేతులు కలిపిన టీఆర్ఎస్ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొంటోందని తీవ్రంగా విమర్శించారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ప్రభుత్వం చెబుతోందని...వాటి ఫలితాలను చూసి నిరుద్యోగులు, నిరుపేదలను సంఘటిత పర్చి ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని దత్తాత్రేయ హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రావడానికి బీజేపీ ఎలా తోడ్పాటు అందించిందో...అభివృద్ధి విషయంలోనూ అలాగే ముందుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో 40 లక్షల వాహనాలు ఉన్నాయని... వీటివల్ల వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు. ఇంటింటికీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని దత్తాత్రేయ వెల్లడించారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించాలంటే బూత్ స్థాయిలోనే పార్టీని పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
నేడే ‘సర్వే’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం సర్వే ప్రారంభం కానుండగా.. అధికారులు మాత్రం సోమవారం రాత్రి నుంచే పల్లెలకు చేరుకున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.10 లక్షల కుటుంబాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 25లక్షల జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం 28 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. పక్కాగా.. పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను పక్కా సమాచారంతో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాన్ని 380 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసింది. మొత్తం 8.10 లక్షల కుటుంబాలకు గాను 8.30 లక్షల సర్వే పత్రాలను ముద్రించి మండల కేంద్రాలకు తరలించింది. కుటుంబ సభ్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, వారి ధ్రువీకరణ ప్రతాలను చూసిన తర్వాతే వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు, హాస్టళ్లలో చదివేవారు మాత్రం అందుబాటులో లేనప్పటికీ ధ్రువీకరణతో నమోదు చేసుకోనున్నారు. ఉదయం 6గంటల నుంచే.. సర్వే ప్రక్రియలో భాగస్వాములయ్యే సిబ్బంది మంగళవారం ఉదయం 6గంటలకే మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న ఉద్యోగులు అల్పాహారం పూర్తి చేసుకుని సర్వే మెటీరియల్‌ను తీసుకుని ఏడు గంటలకు బయలుదేరుతారు. వీరిని గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం 1,300 బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటలకు వివరాల సేకరణ మొదలు పెట్టిన ఉద్యోగులు.. వారికి నిర్దేశించిన కుటుంబాల నుంచి సాయంత్రం 6గంటల లోపు వివరాలు సేకరించాలి. అనంతరం వాటిని క్లోజ్ చేస్తూ సమాచారాన్ని ప్రత్యేకాధికారికి అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలి. అలా వచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా స్థాయిలో సర్వే చేసిన సంఖ్యపై రాత్రి 9గంటలకు స్పష్టత వస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా సర్వే ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. -
వార్డుల పునర్విభజనపైమీ వైఖరేంటి?
పభుత్వానికి, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు విచారణ ఆగస్టు 5కు వాయిదా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డులన్నింటినీ కూడా సమాన జనాభా ప్రాతిపదికన విభజించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల పునర్విభజన నిమిత్తం 1996లో జారీ చేసిన జీఓ 570ని అమలు చేయడం లేదని, వార్డుల జనాభా మధ్య సగటున 15 శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతుంటే, అంతకుమించి తేడా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మలక్‌పేటకు చెందిన బీజేపీ నేత జీఆర్ కరుణాకర్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మంగళవారం విచారించారు. కొన్ని వార్డుల్లో జనాభా 17 వేలు ఉంటే, మరికొన్ని చోట్ల 70 వేలు, ఇంకొన్ని చోట్ల 90 వేలు ఉందని, ఇలా ఉండటం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2011 లెక్కల ప్రకారం జనాభా 67,31,790 అని, దీనిప్రకారం 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు 15 శాతం మించకుండా చూస్తే 44 వేల జనాభా ఉండాలని వివరించారు. అయితే ప్రస్తుతం అలా లేదన్నారు. దీని ప్రభావం అభివృద్ధిపై పడుతోందని, తక్కువ జనాభా ఉన్న వార్డుకూ, ఎక్కువ జనాభా ఉన్న వార్డుకూ ఏకరీతిన నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ఎక్కువ జనాభా ఉన్న వార్డుల్లో అభివృద్ధి సాధ్యం కావడం లేదని వివరించారు. అంతేకాక అనేక వార్డులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ల కింద కేటాయించారని వారు తెలిపారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాలంటే వార్డులను పునర్విభజన చేసి తీరాలన్నారు. అందువల్ల వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక పనులను వెంటనే ప్రారంభించేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు. -
అనుమతి ఉన్నా... కూల్చేశారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులకు బుధవారం పెద్ద ఝలక్ తగిలింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాన్ని కూడా అక్రమ నిర్మాణం అనుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారం భవనాన్ని నిర్మించానని యజమాని జీహెచ్ ఎంసీ అధికారులు ఎదుట ఆందోళనకు దిగాడు. దాంతో తమ తప్పు తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను భవన యజమాని ప్రశ్నించాడు. దాంతో నీళ్లు నమలడం జీహెచ్ఎంసీ అధికారుల వంతైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో గురుకుల ట్రస్ట్‌కు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం ఆదేశించారు. దాంతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండవ రోజు బుధవారం అక్రమకట్టడం కూల్చివేస్తు పక్కనే ఉన్న భవనాన్ని కూడా కూల్చివేశారు. దాంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. అ క్రమంలో భవన నిర్మాణానికి పొందిన అనుమతులను భవన యజమాని సదరు అధికారులకు చూపించారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు తప్పైపోయిందంటూ నాలిక కర్చుకున్నారు. -
రెండోవ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత బుధవారం వరుసగా రెండోరోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ వెల్లడించారు. అందుకోసం 5 బృందాలు, 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత నేపథ్యంలో అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. వేలాది కోట్ల రూపాయిల విలువ గల అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములలో అధిక సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో సదరు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దాంతో జీహెచ్ఎంసీ మంగళవారం రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. -
జనాభా కంటే ఓటర్లెక్కువ!?
2011 జనగణన ప్రకారం ‘గ్రేటర్ ’ జనాభా 67,31,790 జీహెచ్ఎంసీలో ప్రస్తుత ఓటర్లు 78,48,259 ఇదీ గ్రేటర్ వి‘చిత్రం’ సాక్షి, సిటీబ్యూరో : సాధారణంగా మొత్తం జనాభాలో ఓటర్లు 70 శాతానికి అటూ ఇటూగా ఉంటారనేది నిపుణుల అంచనా. అదేమి విచిత్రమో కానీ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మాత్రం జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే జనాభా 2011 జనగణన వివరాల మేరకు కాగా.. ఓటర్ల సంఖ్య మాత్రం తాజాది. 2011 జనగణన ప్రకారం గ్రేటర్ జనాభా 67,31,790 ఉంటే ఓటర్లు 78,48,259 మంది ఉన్నారు. అంటే కేవలం మూడేళ్లలోనే ఓటర్లు జనాభాను మించిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారా? అంటే గత మూడేళ్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అదీ లేదు. అయినా గ్రేటర్లో జనాభా కంటే ఓటర్లు సుమారు 11 లక్షలకు పైగా పెరిగిపోయారు. ఇదే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2011లో జనగణన జరిగిన సమయంలో టీ ఆర్ఎస్, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, ఇతరత్రా ఆందోళనలు జరిగాయని జీహెచ్ఎంసీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా జనగణన వివరాలు అందజేయాలి కనుక అప్పట్లో జనగణన కార్యక్రమం గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో సవ్యంగా జరగలేదని ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దీనికితోడు ఓటు హక్కుపై పెరిగిన ప్రచారం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల పెరిగిన చైతన్యం వెరసి ఓటర్లు ఇటీవల భారీగా పెరిగారు. గడచిన మూడుమాసాల్లోనే కొత్త ఓటర్లుగా 3.66 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారంటేనే ఓటుపై ప్రచారం ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కంటే ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్న వారు పెరిగినప్పటికీ.. జనాభా కంటే ఎక్కువైతే ఉండరు. జనగణన సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మరో ముఖ్యవిషయమేమిటంటే.. మెదక్‌జిల్లా పరిధిలోని పటాన్చెరు డివిజన్ కూడా గ్రేటర్‌లోనే ఉంది. ఈ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే గ్రేటర్లో ఉన్నందున ఆ నియోజకవర్గ ఓటర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ నియోజకవర్గ మొత్తం ఓటర్లను (2,93,768మందిని) పరిగణనలోకి తీసుకుంటే ఓటర్లు 81,42,027 గా ఉన్నారు. ఈ లెక్కల్ని బట్టి గ్రేటర్ జనాభా దాదాపు కోటికి చేరి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
జీహెచ్ఎంసీపై హైకోర్టు కన్నెర్ర
-
జీహెచ్ఎంసీపై హైకోర్టు కన్నెర్ర
హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లకు ల్యాప్‌టాప్‌లు, జర్నలిస్టులకు ఐపాడ్ల పంపిణీ వ్యవహారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. చెత్త ఊడవడానికే డబ్బులు లేవు, కార్పొరేటర్లకు ఎలా ల్యాప్‌టాప్‌లు ఇస్తారంటూ ఘాటుగా ప్రశ్నించింది. మీకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటూ నిలదీసింది. ఏ చట్టప్రకారం ఐపాడ్లు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారని అడిగింది. దీన్ని మేయర్ ప్రతిపాదించారని, కమిషనర్ పెట్టలేదని కోర్టుకు జీహెచ్ఎంసీ విన్నవించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
మాజిద్ రాజీనామాను ఆమోదించని కౌన్సిల్
హైదరాబాద్ : హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. కౌన్సిల్ సాధారణ సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామాను కౌన్సిల్ ఆమోదించలేదు. కాంగ్రెస్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా రాజీనామా చేస్తారంటూ మరోవైపు టీడీపీ, బీజేపీ ప్రశ్నించాయి. సమావేశం నుంచి బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. కాగా కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అయితే, అంతకుముందు కాంగ్రెస్ మేయర్ బండ కార్తీక రెడ్డి రెండు నెలలు అదనంగా ఉన్నందున తాను కూడా రెండు నెలలు అదనంగా ఉన్నానని మాజిద్ చెప్పారు. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య ఎన్నికల పొత్తు కూడా తేలకపోవడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మేయర్ పదవికి మాజిద్ రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. -
రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే
-
రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే
* జిల్లాల్లోని ఉద్యోగులకు ‘విభజన’ వర్తించదు * కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టీకరణ * వర్సిటీలు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడ నియమితులై తే అక్కడే * సచివాలయంలోని శాశ్వత ఉద్యోగులనే విభజనలో పరిగణలోకి తీసుకుంటారు * విభజన పనుల పురోగతిపై సంతృప్తి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మినహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో నియమితులైన ఉద్యోగులు రాష్ట్ర విభజన పరిధిలోకి రారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. అక్కడ నియమితులైన వారు ఉద్యోగులు అక్కడే పనిచేస్తారని ఆ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి తెలిపారు. వారు అదే సంస్థల్లో పనిచేయడానికి నియమితులైన ందున వారు ఆప్షన్ పరిధిలోకి రారని వివరించారు. విభజన విషయంలో ఎవరీకి అన్యాయం జరగకుండా మానవతా దృక్పథంతో, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. విభజన ప్రక్రియ పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్‌లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు విభజనపై ఏర్పాటు చేసిన కమిటీల ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయమని, అక్కడి ఉద్యోగుల పరిస్థితి ఎలా అని ఓ అధికారి ప్రశ్నించగా గోస్వామి పై విధంగా స్పందించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తారు తప్ప.. ఇతర జిల్లాలకు పంపించడానికి వీలుండదని రాష్ట్ర ఉన్నతాధికారి కూడా ఒకరు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై గోస్వామి పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానంగా ఫైళ్లు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల విభజన కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ.. తెలంగాణ రాష్ట్ర ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించాలని అనిల్‌గోస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో బుధవారం సమావేశమై ఖాతా ఏర్పాటుపై చర్చించనున్నారు. * జూన్ ఒకటో తేదీ అర్థరాత్రికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రోజుకు ఉన్న కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. * రాష్ట్ర శాసనసభ ఇదివరకే అమోదించిన ఆరు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆధారంగా నిధులు వ్యయం చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే వీలు కల్పించారని ఓ అధికారి వివరించారు. * రాష్ట్రస్థాయి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ అయ్యాక, పూర్తి సమాచారాన్ని కేంద్రానికి నివేదిస్తారు. స్థానికత, విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరికను ప్రామాణికత తీసుకుంటారా? అన్నది కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే తేలుతుంది. * విభజన సమయంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లోని శాశ్వత ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విభజన పరిధిలోకి తీసుకోరు. వారికి న్యాయపరంగా హక్కు లేనందున వారిని విభజన పరిధిలోకి తీసుకోం. * కమలనాథన్ కమిటీ ఇచ్చే సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. * సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీకి కేంద్రం ఒక కమిటీని నియమిస్తుంది. వారి నిర్ణయమే ఫైనల్. * జూన్ 2న ఇరు రాష్ట్రాలకు సీఎస్‌లు, డీజీపీలు ఉండటంతో పాటు.. ట్రెజరీలు, ఖాతాలు ఉంటాయి. * ఏప్రిల్ చివరి నాటికి పూర్తి సమాచారం సిద్ధంగా ఉండాలి. జూన్ రెండో తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు రాష్ట్రాల పాలన సాగాలి. * గవర్నర్‌తో అనిల్‌గోస్వామి భేటీ: అనిల్‌గోస్వామి మంగళవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్యకంగా కలుసుకున్నారు. మరోవైపు.. గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్కుమార్లకు సీఎస్ మహంతి మంగళవారం ప్రైవేట్ హోటల్లో విందు ఇచ్చారు. * పోలీసు విభజనపై నేడు సమీక్ష: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసులు, పోలీసు సంస్థల పంపిణీ అంశాలపై కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అనిల్‌గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్‌కుమార్‌లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. మరోవైపు పాలక మండలి (బోర్డు)లో విభజన తీర్మానం చేసి పంపాలని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన ప్రదీప్ చంద్ర కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యింది. ఇందులో 65 ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంస్థలకు చెందిన ఎండీలు పాల్గొన్నారు. మార్చి 25 నాటికి పూర్తిస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు పాలనా ట్రిబ్యునల్ లేదా? పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొరపాటు.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి పాలనా (అడ్మినిస్ట్రేటివ్) ట్రిబ్యునల్ ఏర్పాటు కాదా? అంటే.. ఏర్పాటు కాదు అనే సమాధానం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై చట్టంలో పొరపాటు ఉందని ఒక అధికారి ప్రస్తావించారు. దీనిపై గోస్వామి స్పందిస్తూ.. చట్టంలో పొరపాటు జరిగిన మాట వాస్తవ మేనని, అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక దీనిపై న్యాయ సలహా తీసుకుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని 371-డి అధికరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని స్పష్టంచేశారు. అయితే.. తెలంగాణలో పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. చట్టంలో సవరణలు చేయకుండా ఇతర మార్గాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని, రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఈ విషయంపై న్యాయ సలహాలతో ముందుకు వెళ్తారని గోస్వామి పేర్కొన్నట్లు తెలిసింది. -
హైదరాబాద్ మేయర్ రాజీనామా: మాజిద్ హుస్సేన్
అసెంబ్లీ బరిలో దిగనున్న మాజిద్ హుస్సేన్ సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు శుక్రవారం సాయంత్రం అందజేశారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశానికనుగుణంగా, క్రమశిక్షణగల సైనికునిగా రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అప్పట్లోనే మాజిద్ రాజీనామా చేస్తారని భావించారు. అయితే, ఆయన అదనంగా రెండు నెలలు పదవిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాజీనామా చేయడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఆయన సొంత డివిజన్ అహ్మద్‌నగర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉంది. నాంపల్లి నుంచే ఆయన పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. కార్వాన్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు కూడా మాజిద్ పేరును ఎంఐఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాజిద్ తరచూ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన వెళ్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవసరమైతే అక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని సమాచారం. -
మున్సిపోల్స్‌లో ‘నోటా’ లేనట్లే!
అమలు చేయాలంటే చ ట్టం మార్చాల్సిందేనన్న న్యాయశాఖ పురపాలకశాఖ ఫైలును తిప్పి పంపిన అధికారులు ముస్లింలలోని 14 కులాలు బీసీ రిజర్వేషన్ కింద పోటీకి అర్హులే! సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో... వారెవరికీ ఓటు వేయుడం లేదని పేర్కొనే ‘నోటా’ బటన్‌ను ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యపడేలా కనిపించడం లేదు. మున్సిపోల్స్‌లో ‘నోటా’ను అమలుచేయాలంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై పురపాలక శాఖ అధికారులు ఫైలు సిద్ధం చేసినప్పటికీ.. ప్రస్తుతం ‘నోటా’ అమలు చేయడం కుదరదని న్యాయశాఖ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, పురపాలక సంఘాల చట్టాలను సవరిస్తే తప్ప ‘నోటా’ను అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. ఈ మేరకు ఫైలును పురపాలక శాఖకు తిప్పి పంపింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ అయినందున.. ఇప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చట్టానికి సవరణలు చేయడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో మున్సిపోల్స్‌లో ‘నోటా’ లేనట్లే. ఎమ్మెల్యేలకు ఓటు హక్కుపై.. రాష్ట్ర శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నందున మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక సమయంలో శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినట్లు సమాచారం. దీనిపై న్యాయపరమైన అభిప్రాయం కోరుతూ పురపాలక శాఖ న్యాయశాఖకు ఫైలు పంపించింది. ముస్లింలలోని 14 కులాలు బీసీలే... మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల్లోని 14 ఉప కులాలను బీసీలుగా గుర్తిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వారు కూడా ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కింద పోటీ చేయవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారు లు మాత్రం దీనిపై ఒక వివరణ ఇవ్వాలని కోరుతూ.. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలుగా గుర్తించిన కులాలు.. అచ్చుకండ్లవాళ్లు, అత్తరుసాయబులు/అత్తరోళ్లు, దోబీ ముస్లిం, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం/ఫకీర్ సాయబులు, ఎలుగుబంటువాళ్లు, హాజం, లబ్బి, పకీర్ల, ఖురేషి, షేక్, సిద్ది, తురుక కాషా కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. ఈ కులాల పేర్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉచ్చరిస్తున్నందున వాటిని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్ మిట్టల్ 22 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారికి ఆదేశించారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాప్‌ల మూసివేత.. వాహనాల తనిఖీ, అనధికారికంగా తరలిస్తున్న డబ్బును సీజ్ చేయడం, నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, ఓటర్లకు పోలింగ్ తేదీకి ముందే స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై తగిన సూచనలు ఇచ్చారు. -
‘ఫుల్’గా.. తాగుతుండ్రు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మద్యాన్ని తెగతాగేస్తున్నారు. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలో జూలై వరకు రూ.504 కోట్లకు పైగా జరిగిన మద్యం అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఈ అమ్మకాలు ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. కాగా విక్రయాలు జోరందుకోవడంతో జిల్లాలో ప్రస్తుతమున్న మద్యం షాపులకు తోడు కొత్తగా మరో పది దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లెసైన్సు అమ్మకం కాని దుకాణాలను మెదక్ జిల్లాలో అత్యధికంగా మద్యం అమ్మకాలున్న చోటుకు బదిలీ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం 36 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మద్యం దుకాణాల లెసైన్స్‌ల కోసం వ్యాపారులు పోటీపడనున్నారు. వచ్చే ఏడు నెలల కాలానికి జిల్లాలో 36 మద్యం షాపులకు లెసైన్సుల జారీకి ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు రూ.60,66,667 లెసైన్సు ఫీజుగా నిర్ణయించారు. మిగతా దుకాణాలకు ఆయా ప్రాంతాలను బట్టి రూ.24.50 లక్షల నుంచి రూ.18.95 లక్షల వరకు లెసైన్సు కోసం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 67 మద్యం దుకాణాలకు గాను జీహెచ్ఎంసీ పరిధిలో ఫీజు ఎక్కువగా ఉండటంతో 2012 జూలైలో నిర్వహించిన డ్రాలో 19 దుకాణాల లెసైన్సుల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. యేడాదికోమారు వ్యాపారులు లెసైన్సు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 2013 జూలైలో మరో ఏడుగురు లెసైన్సు దారులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 26 మద్యం దుకాణాలకు లెసైన్సులు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో వేలం పాటకు నోచుకోని మరో పది దుకాణాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా మెదక్ జిల్లాకు కేటాయించారు. లెసైన్సు ఫీజుతో పోలిస్తే ఏడు రెట్లు మద్యం అమ్మకాలు (టర్నోవర్) సాగిన చోట కొత్త దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తంగా జిల్లాలో 36 మద్యం దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, మిరుదొడ్డి, అందోలు తదితర ప్రాంతాల్లో కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రూ.700 కోట్లకుపైగా అమ్మకాలు? గత ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.504.22 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అమ్మకాలు రూ.770 కోట్లు దాటే అవకాశముందని మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏడు పర్యాయాలు నోటిఫికేషన్ జారీ చేసినా లెసైన్సు ఫీజు అధికంగా ఉందనే సాకుతో వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదు. లెసైన్సు అమ్మకాలు జరగని చోట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తామని ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటయ్యే పది మద్యం దుకాణాలకు తీవ్ర పోటీ ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. -
సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ కృష్ణబాబు సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా నియమించింది. కృష్ణబాబుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్.సుకుమార్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియదర్శినిలు కూడా బదిలీ అయ్యారు. అయితే వారికీ ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రేమండ్ పీటర్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అధికారులు బదిలీ వివరాలు.. -
విలీనం వద్దు.. జీహెచ్ఎంసీ సర్వసభ్య మండలి ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం విలీనమైన శివారు ప్రాంతాల ప్రజలు ఒకవైపు సమస్యలతో సతవుతవువుతుండగా, ఇటీవలి కాలంలో మరో 35 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. జీహెచ్ఎంసీ సర్వసభ్య మండలి సమావేశంలో రాజకీయాల కతీతంగా పార్టీలన్నీ విలీనాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాయి. విలీనాన్ని ఒప్పుకోబోవుని, ఇందుకు సంబంధించిన జీవోలను ఉపసంహరించుకోవాలని పార్టీలు డిమాండ్ చేశాయి. నిధుల కొరతవల్ల, ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లోపించినందునే పంచాయుతీల విలీనాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించినట్టు జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రకటించారు. నగరంలో తాగునీటి అవసరాలను తీర్చడం తమచేత కాదని ఇప్పటికే జలమండలి స్పష్టం చేస్తున్నా, ప్రభుత్వం ఏ అంచనాతో హడావుడిగా పంచాయుతీల విలీనం చేపట్టిందని, అసలు విలీనంచేసిన గ్రామాలపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటని వివిధ పార్టీల సభ్యులు నిలదీశారు. ఆయా గ్రామాల ప్రజల వ్యతిరేకిస్తున్నా,..15 గ్రావూల విలీనం ప్రతిపాదనను గత సర్వసభ్య సవూవేశం ఏకగ్రీవంగా తిరస్కరించినా సదరు తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చే సిందన్నారు. విలీనంతో ఆయా గ్రామాల ప్రజలపై పన్నుల భార ం తప్ప, వారికెలాంటి సేవలు అందబోవన్నారు. ఇప్పటికే గ్రేటర్లో కలిసిన 12 మునిసిపాలిటీల పరిస్థితిని కూడా వారు ప్రస్తావించారు. విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత మొత్తంతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారో చెప్పాలంటూ పార్టీలు డిమాండ్ చేశాయి. అప్పటి వరకు జీహెచ్ఎంసీ నిధులతో ఎలాంటి పనులు చేపట్టరాదని తీర్మానించారు. రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ నివ్వాలని, కార్యాచరణ అమలుపై శ్వేతపత్రం వెలువరించాలని, అప్పటి వరకు యుథాతథ స్థితిని కొనసాగించాలని కోరాయి. ఈ అంశంలో సీఎంను కలసి తమ వాణి వినిపించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పంచాయుతీల విలీనాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్సీపీ వ్యతిరేకించారుు. బీజేపీ సభ్యులు సభలో లేకపోయినప్పటికీ, విలీన వ్యతిరేక తీర్మానానికి ఆమోదం తెలిపారు. రోడ్ల దుస్థితికి, గ్రామాల విలీనచర్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో, వారిని అంతకువుుందు మార్షల్స్ సాయుంతో బయటకు పంపించారు. -
గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్‌లో మహాధర్నా
-
గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్‌లో మహాధర్నా
నగర శివారుల్లోని 17 గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో విలీనం చేయడంపై అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని అయా గ్రామాల ప్రజలు శనివారం నార్సింగ్‌లో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో దుకాణదారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే పాఠశాలను కూడ మూసివేశారు. ఆ బంద్‌కు మద్దతుగా 17 గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో శనివారం ఉదయం నార్సింగ్ చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మెహరించారు. -
వెనక్కి తగ్గాల్సిందే
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గ్రేటర్లో జిల్లాలోని 35 పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పంచాయతీలను విలీనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.హరీశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ కె.విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఉనికిని దెబ్బతీసే క్రమంలో భాగంగానే విలీన నిర్ణయాన్ని తీసుకున్నట్లు హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తాజాగా విలీనంతో జిల్లాలోని 4.38 లక్షల జనాభా గ్రేటర్లో కలుస్తోందన్నారు. ఇప్పటికే చంద్రబాబు, ైవె ఎస్ పాలనలో జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, తాజాగా విలీన ప్రక్రియతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణికొండ లో లగడపాటి, కావూరి తదితర సీమాంధ్రుల ఆస్తులపై ఎక్కువ పన్ను పడకుండా జాగ్రత్త పడుతూ ఈ గ్రామానికి ఎన్నికలు నిర్వహించేలా ఎత్తులు వేశారన్నారు. జిల్లాలోని కొంత భాగాన్ని నల్లగొండలో, మరికొంత భాగాన్ని మెదక్ జిల్లాలో కలిపి జిల్లాను కనుమరుగు చేసేలా కుట్ర జరుగుతుందని హరీశ్వర్‌రెడ్డి అన్నారు. విలీన ప్రక్రియపై, అదేవిధంగా జిల్లా అస్తిత్వానికి ముప్పు వాటిల్లే పరిణామాలపై టీఆర్ఎస్ ఉద్యమించనున్నట్లు చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు, అదేవిధంగా జిల్లా పరిషత్‌లో ఆమరణ దీక్షకు దిగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ఖరారు చేయనున్నటు నాగేందర్‌గౌడ్ చెప్పారు. విలీనానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వరంలో టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని వివరించారు. -
మహా.. నగరం జనాభా 67,31,790
625 చ.కి.మీల నుంచి 922 చ.కి.మీలకు పెరిగిన విస్తీర్ణం 67.31 లక్షల నుంచి 71.70 లక్షలకు చేరిన జనాభా మారిన గ్రేటర్ ముఖచిత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు దాకా విస్తరణ..! సాక్షి, సిటీబ్యూరో: 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) జనాభా 67,31,790. ప్రస్తుతం అది 71,70,545కు చేరింది. శివార్లలోని 35 పంచాయతీల విలీనంతో అదనంగా 4,38,755 జనాభా కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చింది. విస్తీర్ణం 625 చ .కి.మీల నుంచి 922 చ.కి.మీలకు పెరిగి, నగర ముఖచిత్రం మారిపోయింది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి కానుంది. ప్రస్తుతమున్న 150 డివిజన్ల సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. జనాభా కనుగుణంగా డివిజన్లను హేతుబద్ధీకరించనున్నారు. కోర్ ఏరియా(పాత ఎంసీహెచ్)పరిధిలో వంద, శివార్లలో 50 డివిజన్లుండగా.. పునర్వ్యవస్థీకరణతో కోర్ఏరియాలో 75, శివార్లలో 75 డివిజన్లు రాగలవని అంచనా. సర్కిళ్లు, డివిజన్లు, ఆయూ డివిజన్లో జనాభాను వీటన్నింటినీ హేతుబద్ధం చేసి, ఒక్కో సర్కిల్లో రెండున్నర లక్షల జనాభాతో 30 సర్కిళ్లు ఏర్పాటు చేయునున్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచేందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు. ఒక్కో సర్కిల్ మినీ కార్పొరేషన్‌గా మారనుంది. ఇప్పటి ఐదు జోన్లలో మార్పు లేకున్నా, ఒక్కో జోన్ పరిధిలో ఆరు సర్కిళ్ల వంతున ఉంటాయి. వూరిన వ్యవస్థలో జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. యాభైవేల జనాభాకో డివిజన్.. గ్రేటర్లో ఇక 50వేల జనాభాకు ఒక డివిజన్ ఉంటుంది. పరిపాలనలో ఇబ్బందులెదురవకుండా సర్కిళ్లలో అన్ని విభాగాల్లో తగిన సిబ్బందిని నియమిస్తావుని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. ఇంజనీరింగ్ ఏఈలు, పారిశుధ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఘనవ్యర్థాల నిర్వహణలో ఏఈ.. ఇలా అన్ని ముఖ్యవిభాగాల అధికారులు డివిజన్స్థాయిలోనే ఉంటారని, 150 డివిజన్ కార్యాలయాల నుంచే వీరు విధులు నిర్వహిస్తారని కృష్ణబాబు చెప్పారు. -
భగ్గు మంటున్న గ్రామస్తులు
సాక్షి, సిటీబ్యూరో: శివారు గ్రామపంచాయతీల విలీన ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సర్కారు ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజాప్రతినిధుల మాట వినకుండా జీహెచ్ఎంసీలో 21 గ్రామాలను విలీనం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం కూడా పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. గ్రామ పంచాయతీల రికార్డులను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఉదయం నుంచే పంచాయతీ కార్యలయాలకు చేరుకున్నారు. ధర్నాలు చేసి, కార్యాలయాలకు తాళాలు వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే 625 చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రజలకు పలు సమస్యలు సృష్టిస్తున్న జీహెచ్ఎంసీలో ఇతర గ్రామాలను కలపవద్దంటూ సర్వసభ్య సమావేశం తీర్మానించినా.. పచ్చని చేలతో, పంట పొలాలతో ఉన్న తమ గ్రామాల్లో ఎలంటి సదుపాయాలు కల్పించకుండా కేవలం పన్నుల కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దంటూ ఆయా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకోని సర్కారు విలీనం చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీలో శివారు ప్రజలు తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోకున్నా.. భారీగా ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్‌లెసైన్సు ఫీజులు వంటివి వసూలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. విలీనం ఏ శక్తుల కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. నగరానికి దగ్గర్లో ఉన్న గ్రామాలను కాదని దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేయడంలో హేతుబద్ధీకరణ ఉందా? అని మండిపడుతున్నారు. ఉదాహరణకు ఉప్పల్ సర్కిల్‌కు దగ్గర్లోని బోడుప్పల్‌ను కాకుండా దూరంగా ఉన్న పర్వతాపూర్, ఫిర్జాదిగూడలను కలపడంలో ఆంతర్యమేంటని ధ్వజమెత్తుతున్నారు. అలాగే మణికొండ, కోకాపేట, గండిపేట, మంచిరేవులను మాత్రం పంచాయతీలుగానే ఉంచినప్పటికీ, వాటికంటే దూరంగా కుగ్రామంగా ఉన్న వట్టినాగులపల్లిని విలీనం చేయడంపై ఆ గ్రామ ప్రజలు శివాలెత్తుతున్నారు. మంగళవారం అధికారులను నిర్బంధించిన ఆ గ్రామస్తులు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. పీర్జాదిగూడ, పర్వతాపూర్లలోనూ రాజకీయాలకతీతంగా ఆందోళనలు చేశారు. పర్వతాపూర్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. షోకాజ్ ఏదీ..? 15 గ్రామాల విలీనం జీహెచ్ఎంసీ జనరల్ కౌన్సిల్లో చర్చకు వ చ్చినప్పుడు అంగీకరించేది లేదంటూ పాలకమండలి తిరస్కరించినప్పటికీ, ప్రభుత్వం తన విశేషాధికారాలతో విలీనం చేసింది. అయితే, ఆ తీర్మానాన్ని అంగీకరించని పక్షంలో షోకాజ్ జారీ చేయాల్సి ఉంటుందని నిబంధన లు క్షుణ్ణంగా తెలిసిన ఓ అధికారి తెలిపారు. ఓవైపు.. ఢిల్లీ, ముంబై వంటి కార్పొరేషన్లను పరిపాలనా సౌలభ్యం కోసం అదనపు కార్పొరేషన్లుగా విభజించగా.. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచడం.. మరిన్ని సమస్యలు సృష్టించడమేనని మునిసిపల్ పరిపాలనపై అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. విభజన కోసం ఉద్యమాలు జరుగుతుండగా, అందరూ వద్దంటున్నా విలీనం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. -
17 పంచాయతీలకు 21న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం కాని 17 పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని 14 పంచాయతీలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 పంచాయతీలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనం కాని ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొంపల్లికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈనెల 6న ఆయా జిల్లా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజు నుంచి 10వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన, 12న తిరస్కృత నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు, 13న అప్పీళ్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతాయి. పోలింగ్ జరిగే 21వ తేదీనే ఫలితాల ప్రకటనతోపాటు, ఉపసర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు జరిగే పంచాయతీలు: కుత్బుల్లాపూర్ మండలంలో కొంపల్లి, ప్రగతినగర్, దూలపల్లి, కీసర మండలంలో నాగారం, దమ్మాయిగూడెం, ఘట్కేసర్ మండలంలో చెంగిచెర్ల, మేడిపల్లి, బోడుప్పల్, రాజేంద్రనగర్ మండలంలో మణికొండ జాగీర్, కోకాపేట, మంచిరేవుల, గండిపేట, మేడ్చెల్ మండలం గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట మండలంలో జవహర్‌నగర్ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తి, వనపర్తి మండలంలోని నాగవరం, శ్రీనివాసపురం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఆస్తిపన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో అనధికార నిర్మాణాలకు పాల్పడినవారి నుంచి నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. కానీ ఇకపై నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను, అదనంగా భారీ మొత్తంలో జరిమానా వసూలు చేయనున్నాయి. ఈ వసూళ్లకు ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనుమతి తీసుకున్న తరువాత నిర్మాణంలో ఉల్లంఘనల శాతం ఆధారంగా అదనపు పన్ను ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏకంగా వందశాతం అదనంగా ఆస్తిపన్ను విధించడానికి కూడా నగరపాలక, పురపాలక సంస్థలకు అధికారం కల్పించింది. భవన నిర్మాణానికి అనుమతించిన ప్రణాళిక (ప్లాన్)లో నాలుగువైపులా వదలాల్సిన స్థలంలో (సెట్‌బ్యాక్) పది శాతం ఉల్లంఘనతో నిర్మాణం జరిగితే ఆస్తిపన్నుతో పాటు అదనంగా 25 శాతం జరిమానా వసూలు చేస్తారు. పదిశాతం కంటే ఎక్కువ ఉల్లంఘన జరిగితే ఆస్తిపన్నుతో పాటు 50 శాతం జరిమానా, అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తే వందశాతం జరిమానా, అలాగే పూర్తిగా అనుమతి లేని నిర్మాణానికి కూడా వందశాతం జరిమానా విధించడానికి అనుమతినిచ్చింది. ఆస్తిపన్ను వసూలు చేసినంత మాత్రాన ఆ ఇంటిని క్రమబద్ధం చేసినట్లు కాదని, ఇంటిని కూల్చే వరకు ఈ ఆస్తిపన్ను వసూలు చేస్తారని స్పష్టం చేసింది. దీంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో ఆస్తిపన్ను, జరిమానాలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించేవారికి, చెల్లించని వారికి ఒకే తరహా సౌకర్యాలు అందుతున్నాయని, ఆస్తిపన్ను చెల్లించకున్నా అనధికార కట్టడాల యజమానులు అన్ని సౌకర్యాలూ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆస్తిపన్ను చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా ఆస్తిపన్ను మొత్తాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే.. వారికి ఆస్తిపన్నుపై ఐదుశాతం రాయితీ ఇవ్వనున్నారు. గడువు దాటి చెల్లిస్తే నెలకు రెండు శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. పనుల మంజూరు అధికారాల విస్తృతి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌కు ప్రస్తుతమున్న రూ.20 లక్షల విలువ చేసే పనుల మంజూరు అధికారాన్ని రూ.50 లక్షలకు, స్టాండింగ్ కమిటీకి ఇప్పుడున్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు, సర్వసభ్య సమావేశానికి ప్రస్తుతమున్న రూ.2 కోట్ల మంజూరు అధికారాన్ని రూ.5 కోట్లకు పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ల కమిషనర్లు రూ.20 లక్షల వరకు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని, మిగిలిన కార్పొరేషన్లలో కమిషనర్లు రూ.10 లక్షలు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని పేర్కొంది. -
సిటీ రోడ్లపై సీఎం సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ‘ఢిల్లీలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడెందుకింత అధ్వానంగా దెబ్బతింటున్నాయి? ఒక్క వానకే ఛిద్రమవుతున్నాయెందుకు? సమస్య పరిష్కారానికి మీరేం చేస్తున్నారు?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారుల తీరు పై మండిపడ్డారు. నగరంలో ర హదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. యంత్రాంగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిధుల సమస్య లేదు. ఎన్ని కావాలో చెప్పండి. రోడ్లు మాత్రం బాగుండాలి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, నిర్వహణ పనులు జరగాలి’ అన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో వారంలో తనకు నివేదికనివ్వాలని ఆదేశించారు. వచ్చేవారం మరోమారు సమీక్షిస్తానన్నారు. ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాల సమన్వయంతో తగిన ప్రణాళికతో జీహెచ్ఎంసీ ముందుకు రావాలన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా, నగర జనాభాకు తగిన విధంగా, అన్ని కాలాల్లో మన్నికగా ఉండేలా పనులు చేపట్టాల న్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి సహించేది లేదన్నారు. వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తగిన కేంబర్తో, నాణ్యమైన సామగ్రితో రహదారుల పనులు చేయాలని సూచిం చారు. సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్‌గౌడ్, డి.నాగేందర్, చీఫ్ సెక్రటరీ మహంతి, మున్సిపల్ పరిపాలన, పట్టాణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, జలమండలి ఎండీ శ్యామలరావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేంచంద్రారెడ్డి, ఆయా విభాగాల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలు.. నగర రోడ్ల ప్రస్తుత దుస్థితికి తగిన ప్రణాళిక లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం, నిబద్ధతలేమి కారణాలని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చేవారానికల్లా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జోషికి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సీజన్లో నిరంతరాయంగా.. ఎక్కువ వర్షాలు కురియడం వ ల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయని కృష్ణబాబు తెలిపారు. దీంతో నీటి నిల్వలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 512 మి.మీ.ల వర్షపాతం నమోదైందని, సాధారణం కంటే ఇది 26.1 శాతం ఎక్కువన్నారు. జీహెచ్ఎంసీలో సాధారణ వర్షపాతం 406 మి.మీలని తెలిపారు. నీటినిల్వ ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. కేంబర్ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో మిల్లింగ్లతోపాటు బీటీ రోడ్లకు రీకార్పెటింగ్ పనులు చేస్తామని చెప్పారు. నీటి లీకేజీలు, మురుగునీటి ప్రవాహం, వివిధ విభాగాల అవసరార్థం రోడ్డు కటింగ్ల వల్ల కూడా రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనుల్ని కొనసాగిస్తామని, శాశ్వత రీకార్పెటింగ్ పనుల్ని మాత్రం వర్షాకాలం ముగిసిన వెంటనే చేపడతామన్నారు. ఈ సీజన్లో 2739 ప్రాంతాల్లో 61.35 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 39.54 కి.మీ.ల మేర మరమ్మతులు చేశామని, 15310 గుంతలకు 13501 పూడ్చామని ఆయన వివరించారు. -
రోడ్డెక్కితే అంతే! ఉప్పల్‌లో నాలుగు గంటలు నరకయాతన
మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రస్తుతం మాత్రం దాని దెబ్బకు క్షణక్షణం నరకం చూస్తున్నాడు వాహనదారుడు. దానికితోడు వర్షాలు... ఎక్కడ చూసినా గుంతలు... కావల్సినంత బురద... వద్దన్నా వచ్చిపడే దుమ్ము... అన్నింటికీ మించి నిర్లక్ష్యపు వ్యవస్థ... గమ్యం చేరేలోపే సిటీజనుడి బండే కాదు... ఒళ్లూ ‘గుల్ల’వుతోంది. ఈ ఫొటోలు ఉప్పల్ నుంచి హబ్సిగూడ వెళ్లే రహదారిలోనివి. రాత్రికిరాత్రే రోడ్లపై ఉన్న గుంతలను రబ్బీస్‌తో పూడ్చారు మెట్రో సిబ్బంది. దీంతో మంగళవారం ఉదయం... వచ్చిన వాహనం వచ్చినట్టు ఆ రబ్బీస్లో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితి. చివరకు పక్కనున్న వాహనదారులు దిగి తోస్తే కానీ బయట పడలేదు. నిమిషనిమిషానికీ పరిస్థితి మరింత దిగజారింది. ఉదయం 8 గంటలు మొదలు ఇదే తంతు. ఎటు చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి పదేపదే సమాచారమందించినా గంట తరువాత గానీ అక్కడకు చేరుకోలేదు. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరైతే బండి దిగి కాలినడకన వెళ్లారు. అక్కడక్కడా ఉన్న వరదనీటి కాలువలను మెట్రో, ఆర్ అండ్ బీ అధికారులు మూసివేయడంతో వాన నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. అవి చాలవన్నట్టు రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వ్యాపారాలు. వెరసి ఎక్కినవారిని ముప్పుతిప్పలు పెట్టి... ముచ్చమటలు పట్టిస్తున్నాయి ‘మహా’నగర రోడ్లు.