సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్ కృష్ణబాబు సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్‌ను జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్‌గా నియమించింది. కృష్ణబాబుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్.సుకుమార్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ప్రియదర్శినిలు కూడా బదిలీ అయ్యారు. అయితే వారికీ ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రేమండ్ పీటర్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అధికారులు బదిలీ వివరాలు..