కుప్పం: ‘నువ్వు అటెండర్‌గా పనికిరావు..స్వీపర్‌గా, తోటమాలిగా పనిచేసుకో’ అంటూ రిజిస్టార్ వేధిస్తున్నారని బాధితురాలు మీడియాతో ఆదివారం వాపోయింది. బాధితురాలి కథనం మేరకు, 2007లో ద్రవిడ వర్శిటీలో భాగ్యలక్ష్మి అటెండర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అటెండర్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో వర్సిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు.
అప్పట్లో భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆ ధర్నాలకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై యూనియన్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ధర్నాకు రాలేదని తమిళ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో భాగ్యలక్ష్మిపై దాడి చేయించి గాయపరిచారు. దీనిపై అప్పట్లో గుడుపల్లె పోలీస్ స్టేషన్‌లో భాగ్యలక్ష్మి ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును వాపసు తీసుకోవాలని వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే అటెండర్ నుంచి స్వీపర్‌గా మార్చుతామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయారు. దీంతో పాటు తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ విషయం వర్సిటీ అధికారులకు తెలిసినా మరింత ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఈ మేరకు వర్సిటీ మహిళా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
25న పేదింటి యువతి వివాహం
Comments
Please login to add a commentAdd a comment