Dravidian University
-
ద్రవిడియన్ వర్సిటీలో స్క్రాప్ దందా!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. అక్షర జ్ఞానం అందించాల్సిన యూనివర్సిటీల్లో అవినీతి దందా రాజ్యమేలుతోంది. రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని తుంగలో తొక్కి వైస్ చాన్సలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడం గొప్పగా భావించిన ‘కూటమి’ పెద్దలు... వర్సిటీల్లో చదువులను గాలికొదిలేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీలో దిగజారిన పరిస్థితులే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ద్రవిడియన్ యూనివర్సిటీ ‘పైసా వసూల్’కు కేంద్రంగా మారింది. పైసలు ముట్టచెబితే ఏకంగా పీహెచ్‌డీలను పప్పుబెల్లం మాదిరిగా అమ్మేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ ఆస్తులను కూడా ‘స్క్రాప్’ పేరుతో కారుచౌకగా అమ్మేసి అందిన కాడికి దోచేస్తుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుండటం గమనార్హం. – సాక్షి, అమరావతిచదువుకునే పుస్తకాలు చెత్తలో పడేసి..!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమాల కారణంగా దాదాపు విశ్వసనీయత కోల్పోయింది. ఈ క్రమంలో దూరవిద్య విభాగం సైతం మూతపడింది. అయితే దూర విద్య కోసం ముద్రించిన స్టడీ మెటీరీయల్ వర్సిటీలో ఉండిపోయింది. ఆ పుస్తకాలను కూడా చెత్తలో కలిపేసిన వర్సిటీ పాలకులు... వాటిని తమిళనాడుకు తీసుకువెళ్లి కారుచౌకగా అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో టన్ను పేపర్లు(చెత్త) ధర రూ.26వేలు పలుకుతోంది. అలాంటిది విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్‌ను టన్ను రూ.15వేల లోపే తమ అనుయాయులకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు లారీల స్టడీ మెటీరియల్ స్క్రాప్ కింద బయటకు వెళితే... యూనివర్సిటీ లెక్కల్లో మాత్రం మూడు లారీల సరుకునే చూపించినట్టు సమాచారం.బినామీల పేరుతో పెద్దల మాయాజాలం!ద్రవిడియన్ వర్సిటీ కీర్తిప్రతిష్టలను, ఆస్తులను కాపాడాల్సిన పెద్దలే దొరికింది దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా సుమారు పది రోజుల కిందట ఈ యూనివర్సిటీలో పెద్దలు ‘స్క్రాప్’ పేరుతో అవినీతి దందాకు తెరదీశారు. నిబంధనల ప్రకారం విస్తృతంగా ప్రచారం కల్పించిన తర్వాతే వర్సిటీలో పనికిరాని వస్తువులను విక్రయించేందుకు ‘స్క్రాప్’ టెండర్లు పిలవాలి. కానీ, అధికారులు మాత్రం బయటకు తెలియకుండా నామమాత్రంగా ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న డ్రైవర్లతో ‘స్క్రాప్’ కొనుగోలుకు టెండర్లు వేయించారు. వారిలో కూడా తక్కువ రేటు కోట్ చేసిన వ్యక్తికే టెండర్ కట్టబెట్టారు. వినియోగంలో ఉన్న వస్తువులను, స్వల్పంగా మరమ్మతులు చేస్తే ఉపయోగించుకునే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ సామగ్రిని అప్పనంగా అమ్మేశారు. దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలు విలువైన వస్తువులను కేవలం రూ.5లక్షలకు విక్రయించినట్టు సమాచారం. వీటిల్లో మూడు జనరేటర్లు, 300 కంప్యూటర్లు, 25 ఏసీలు, రెండు లారీల్లో డెస్క్‌లు, కుర్చీలు ఉన్నాయి. కంప్యూటర్లు, ఏసీల్లో చాలావరకు పనిచేసేవి ఉన్నట్టు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎక్కువ కోట్ చేసిన వ్యక్తికి టెండర్ దక్కకపోవడంతో అసలు ఈ అవినీతి దందా బయటకు పొక్కింది. నాలుగు బ్రాంచ్‌లు పెట్టి ‘పీహెచ్డీ’ వ్యాపారం!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమ పీహెచ్‌డీల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పైసలిస్తే పీహెచ్‌డీల దందా పడగవిప్పింది. ఏడు నెలల్లో సుమారు వందకు పైగా పీహెచ్‌డీలు ప్రదానం చేశారని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. వాస్తవానికి యూజీసీ నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలు చెల్లవు. ఇక్కడ దూరవిద్య కేంద్రం మూతపడింది. అయినా పాత తేదీలతో రోజుకు రెండు, మూడు పీహెచ్‌డీలు అవార్డు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యూనివర్సిటీ బాస్... దక్షిణ భారతదేశంలో నాలుగు బ్రాంచ్‌లు పెట్టి మరీ పీహెచ్‌డీల వ్యాపారం చేస్తున్నట్టు అధ్యాపకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తిరుమల, చెన్నై, మైసూరు, కోయంబత్తూరు కేంద్రాలుగా ఈ పీహెచ్‌డీల వ్యాపారం, మార్కెటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో పీహెచ్డీ ప్రొసీడింగ్స్‌పై సంతకం పెట్టాలంటే సగటున రూ.లక్ష వసూలు చేస్తున్నారని తెలిసింది. పైగా న్యాక్ బృందం పర్యటనలోనూ వీటినే రెగ్యులర్ పీహెచ్‌డీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన వర్సిటీల పని తీరుపైన ప్రభావం పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘నువ్వు అటెండర్‌గా పనికిరావు.. స్వీపర్‌గా పనిచేసుకో’
కుప్పం: ‘నువ్వు అటెండర్‌గా పనికిరావు..స్వీపర్‌గా, తోటమాలిగా పనిచేసుకో’ అంటూ రిజిస్టార్ వేధిస్తున్నారని బాధితురాలు మీడియాతో ఆదివారం వాపోయింది. బాధితురాలి కథనం మేరకు, 2007లో ద్రవిడ వర్శిటీలో భాగ్యలక్ష్మి అటెండర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అటెండర్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో వర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. అప్పట్లో భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆ ధర్నాలకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై యూనియన్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ధర్నాకు రాలేదని తమిళ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో భాగ్యలక్ష్మిపై దాడి చేయించి గాయపరిచారు. దీనిపై అప్పట్లో గుడుపల్లె పోలీస్ స్టేషన్లో భాగ్యలక్ష్మి ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వాపసు తీసుకోవాలని వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే అటెండర్ నుంచి స్వీపర్‌గా మార్చుతామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయారు. దీంతో పాటు తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ విషయం వర్సిటీ అధికారులకు తెలిసినా మరింత ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఈ మేరకు వర్సిటీ మహిళా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 25న పేదింటి యువతి వివాహం -
ద్రవిడియన్ వర్సిటీకి యూజీసీ నోటీసులు
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలపై యూజీసీ విచారణ చేపట్టింది. ఈ మేరకు వర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక ప్రొఫార్మా సూచించిన యూజీసీ, దాని ప్రకారం పీహెచ్‌డీల వివరాలు అందించాలని వర్సిటీని ఆదేశించింది. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ గురువారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేసిన పీహెచ్‌డీలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2010లో టూ మెన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా 95శాతం పీహెచ్‌డీలు మంజూరు చేసినట్టు నిర్ధారించిందన్నారు. 2023 –24, 2024–25 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీల మంజూరు ప్రక్రియలో విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాలు, కోర్టు ఉత్తర్వులు, జస్టిస్ శేషశయనరెడ్డి కమిటీ సమర్పించిన విచారణ నివేదిక అంశాలను ఉల్లంఘించడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు. లైబ్రేరియన్ నియామకంపై ఏసీబీ దర్యాప్తు వర్సిటీలోని లైబ్రేరియన్ అసిస్టెంట్ నరేష్ నియామకంపై ఏసీబీ విచారణ చేపట్టింది. వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ సమయానికి కూడా సదరు వ్యక్తికి విద్యార్హత సరి్టఫికెట్లు లేకుండానే ఉద్యోగంలో చేరినట్టు గతంలో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ వాస్తవాలు గుర్తించేందుకు నరే‹Ùను విచారించినట్టు సమాచారం. అయితే కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏసీబీ అధికారులను పిలిపించి ఎటువంటి తప్పు జరగలేదని నివేదిక ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే కోర్టుకు సమరి్పంచే నివేదిక కావడంతో అధికారులు తాము ఏమీ చేయలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. -
పైసలిస్తే.. పీహెచ్డీ!
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ ఉన్నతంగా వెలుగొందిన వర్సిటీలకు కళంకం ఏర్పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తూ 17 వర్సిటీల వైస్ చాన్సలర్ల మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయించడంతో తిరోగమనం మొదలైంది. అది కాస్తా.. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ అడ్డగోలుగా పీహెచ్‌డీలు మంజూరు చేసే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ పెద్దలు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులు కొందరికి ఇన్చార్జి వీసీ పోస్టులు కట్టబెట్టారు. ఇందులో భాగంగానే ద్రవిడియన్ వర్సిటీలో తమకు ‘స్వామి భక్తి’ ప్రదర్శించే వ్యక్తికి వర్సిటీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సదరు వ్యక్తి కనుసన్నల్లో ‘పీహెచ్‌డీలో పైసా వసూల్’ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఏకంగా 100కిపైగా ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలకు ప్రొసీడింగ్ (అవార్డు) చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి యూజీసీ 2009లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలను నిలిపివేసింది. కానీ, కాసులే పరమావధిగా ద్రవిడియన్ వర్సిటీ ఇన్చార్జి బాస్ అమాయక విద్యార్థుల ఆశలను అడ్డుపెట్టుకుని పనికిరాని పీహెచ్‌డీలు ఇస్తూ రూ.కోట్లలో అవినీతి దందాకు తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, అమరావతి ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే రూ.లక్ష పీహెచ్డీ అవార్డు కంటే ముందు వర్సిటీ విద్యార్థికి ప్రొసీడింగ్స్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ద్రవిడియన్ వర్సిటీలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థికి గైడ్ ఎవరనేది చూడకుండా.. థీసిస్‌ను పరిశీలించకుండా.. జాతీయస్థాయి వర్సిటీలకు కూడా సాధ్యపడని విధంగా ప్రతిరోజూ రెండు/మూడు పీహెచ్‌డీలను ద్రవిడియన్ వర్సిటీ ఇచ్చేస్తోంది. అది కూడా యూజీసీ గుర్తించని డిస్టెన్స్ విధానంలో ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో వర్సిటీలో అక్రమ సరి్టఫికెట్లతో లైబ్రరీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి ద్రవిడియన్ వర్సిటీలో పీహెచ్డీ మంజూరులో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల బహిరంగ లేఖను విడుదల చేసింది. గత ప్రభుత్వంలో పీహెచ్డీ అక్రమాలపై జస్టిస్ బి.శేషశయనరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఆఫ్ క్యాంపస్‌లో పీహెచ్‌డీలు ఇస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 ముందు రిజి్రస్టేషన్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పీహెచ్డీ ఇవ్వాలన్న యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ద్రవిడియన్ వర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తాత్కాలిక ఉద్యోగి.. ఇన్చార్జి వీసీ ద్రవిడియన్ వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డెప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగు పెట్టిన సదరు స్వామిభక్తి పరుడు ఎక్కడిక్కడ నిబంధనలకు విరుద్ధంగానే ప్రమోషన్లు పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు లేకుండానే నేరుగా డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టులోకి రావడానికి అప్పట్లోనే తెరవెనుక చక్రం తిప్పారు. ఆ తరువాత తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చిన వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు కోర్టుకు వెళ్లారు. వర్సిటీ తీరును తప్పుపట్టిన కోర్టు.. త్వరలోనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే.. తాత్కాలిక పద్ధతిపై వచ్చిన వారిని తొలగించకుండా వర్సిటీ అధికారులు కొందరు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ రెగ్యులర్ నోటిఫికేషన్‌ను తాత్సారం చేశారు. ఇదే అదనుగా స్వామిభక్తి పరుడు వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగిగా మారిపోయారు. అంతటితో ఆగలేదు.. నాన్‌టీచింగ్ డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారు. సుమారు ఆరేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తేనే ప్రొఫెసర్ హోదాకు అర్హత లభిస్తుంది. కానీ.. అప్పుడెప్పుడో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని లెక్కగట్టి కేవలం వర్సిటీలోకి నాన్–టీచింగ్ ఉద్యోగిగా వచ్చిన మూడేళ్లలోనే ప్రొఫెసర్‌గా మారిపోయారు. సదరు స్వామిభక్తి పరుడిపై 2014లో హైకోర్టులో మరో కేసు నమోదైంది.అది ఇప్పటికీ విచారణలో ఉండడం గమనార్హం. వీటన్నింటినీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ద్రవిడియన్ వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. పైగా సదరు వ్యక్తి తనపై కేసులేమీ లేవని వర్సిటీ విజిలెన్స్ రిపోర్టు తీసుకుని వైస్ చాన్సలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ భోగట్టా. రాజకీయాలకు వేదికగా.. ద్రవిడియన్ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి క్యాంపస్‌లో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగలేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్సిటీ క్యాంపస్ రాజకీయాలకు అడ్డగా మారిపోయింది. స్వామి భక్తిపరుడు సీటులో కూర్చోవడంతో ఇది మరింత పెరిగింది. ఈ నెల 1వ తేదీన ఏకంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించి స్వామిభక్తిని చాటుకున్నారు. -
ద్రావిడ సంస్కృతిపై శోధన సాగాలంటే...
ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు మొదట్లో ఉత్తర భారతంలో నివసించేవారు. ఆర్యుల రాక తర్వాత వారు దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక విలక్షణమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోది చేశారు. దక్షిణ భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అనేక జాతులతో కలిసి జీవన గమనాన్ని సాగించినప్పటికీ వారి సాంస్కృతిక విలక్షణత మాత్రం పుస్తె కట్టడం నుండి పాడె కట్టడం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతులు అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ భాషల్లో సాహిత్యం మాత్రం పదో శతాబ్దానికి అటూ ఇటుగా మాత్రమే లభిస్తోంది. తమిళులు మాత్రమే తమ సంగ సాహిత్యం అత్యంత ప్రాచీనమైనదనీ, ఈ సాహిత్యం క్రీ.పూ. 500 నుండి కనిపిస్తున్నదనీ ప్రకటించుకున్నారు. దాదాపుగా క్రీస్తుశకం ఒకటో శతాబ్దం వాడైన శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించి గుదిగుచ్చిన ‘గాథా సప్తశతి’ అనే ప్రాకృత గ్రంథంలో పిల్ల, పొట్ట, కరణి వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాటికే తెలుగు భాష సమాజంలో బాగా స్థిరపడిన వ్యవహారిక భాషగా ఉందని చెప్పవచ్చు. అంతేగాకుండా, సాహిత్య భాషలుగా పేరుపడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రంథ రూపంలో లభిస్తున్న సాహిత్యం కంటే ముందే మౌఖిక రూపంలో నిక్షిప్తమైన జానపద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా తప్పకుండా ఉండి ఉంటుంది. ఉదా హరణకు ఇప్పటివరకు ఉన్న ఆధారాలను అనుసరించి తెలుగులో నన్నయ భారతాన్ని ఆది గ్రంథంగా భావిస్తున్నాం. అయితే, నన్నయ తల్లి పాడిన జోల పాట కూడా మౌఖిక వాఙ్మయంలో ఆనాటికే నెలకొని ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ మనం మరచిపోకూడదు. కాబట్టి, నన్నయకు పూర్వమే తెలుగువారికి విస్తృతమైన మౌఖిక సాహిత్యం కూడా తప్పకుండా ఉంది. ఇటువంటి సాహిత్యం మాత్రమే ఒక జాతికి సంబంధించిన సహజమైన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అందుచేత, పరిశోధకులు ప్రధానంగా మూల వాసులు మౌఖికంగా నిక్షిప్తం చేసిన జానపద సాహిత్యంపై విరివిగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. నేటి భాషా శాస్త్ర పరిశోధకుల అంచనాలకు అందినంతవరకు ద్రావిడ భాషలు 27 కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మరింత పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే కాకుండా, ఈ ఆదిమ జాతులు అందించిన సంస్కృతిపై తగినంత పరిశోధన జరగలేదు అన్నది నిర్వివాదాంశం. ఈ లోటును భర్తీ చేయడం కోసమే ప్రొఫెసర్ వీఐ సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి కాశీ పాండ్యన్ వంటి మేధావులు కొందరు ద్రవిడ సంస్కృతిపై పరిశోధన కోసం ఒక కేంద్రాన్ని మంజూరు చేయాలని నాటి సీఎం నందమూరి తారక రామారావుని కోరారు. అయితే ద్రవిడ సంస్కృతిపై అత్యంత ఆదరాభిమానాలు కలిగిన రామారావు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్నే మంజూరు చేశారు. అది 1997 అక్టోబర్ 20న కుప్పంలో ప్రారంభమైంది. ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలలో కొన్ని... ద్రవిడ సంస్కృతిలోని ప్రాచీనత, విలక్షణతను, విశిష్టతను లోక విదితం చేయడం; ద్రవిడ సంస్కృతిపై వివిధ భాషల్లో నేటి వరకు జరిగిన పరి శోధనలు, ప్రచురణలను పదిల పరచడం, ప్రచారం చేయడం; తద్వారా, భావ వినిమయానికి, సంస్కృతీ పరిరక్షణకు బాటలు వేయడం. ద్రావిడ కుటుంబానికి చెందిన గిరిజన భాషలతో సహా లిఖిత భాషలు, మాట్లాడే ద్రావిడ భాషల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం; ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కళలు, హస్తకళలు, అనుబంధ విషయాలలో ఉన్నత స్థాయిలో బోధనను, శిక్షణను అందించడం. భారత దేశం లోపల, వెలుపల ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతికత వాటి అనుబంధ విషయాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడం. విశ్వ విద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల సాహిత్యాన్ని ద్రావిడ భాషలలోకి అనువదించడం అలాగే ద్రావిడ భాషల సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించడం. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే మూలికా వనం ఏర్పాటయింది. ఈ వనంలో ద్రవిడ సాహిత్యంలోనూ, వైద్యంలోనూ కనిపించే చాలా అరుదైన, వివిధ జాతులకు చెందిన 250 వన మూలికలు సేకరించి, పెంచుతున్నారు. జానపద గిరిజన విజ్ఞానాలపై ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేశారు. అరుదైన తాళ పత్రాలను సేకరించి భద్రపరిచారు. ఒక ద్రావిడ భాషలో ప్రచురితమైన విలువైన పుస్తకాలను, పదకోశాలను ఇతర ద్రావిడ భాషల్లోకి అనువదించి ముద్రించారు. ద్రావిడ సంస్కృతిని మరింత మూలాల్లోకి వెళ్లి పరిశోధించడానికి తగిన విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ‘తెలుగు ప్రాచీన హోదా కేంద్రా’న్ని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి గట్టి కృషి చేయాలి. అలాగే, తెలుగు అకాడమీని (ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీని) కూడా ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన, జరుగుతున్న విశేష కృషిని సమన్వయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సంస్కృత సాహిత్యంలో ప్రవేశించిన ద్రావిడ సాంస్కృతిక మూలాలను కూడా మరింత లోతుగా అన్వేషించే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలపై చొరవను చూపినట్లయితే ప్రభుత్వం ద్రావిడ సంస్కృతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. (క్లిక్ చేయండి: ఆనీ ఎర్నౌ.. ఆమె కథ మన జీవిత కథ) – డాక్టర్ వేలం పళని సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం (అక్టోబర్ 20న ద్రావిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా) -
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..!
ద్రవిడ వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 8 వేల మందికి ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించడంలో ఎలాంటి తప్పులేదని, రాష్ట్రంలో వర్సిటీల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలకు విశ్వసనీయత ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. దర్యాప్తు వల్ల ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న నెపంతో నిలుపుదల చేయలేమంది. దర్యాప్తు పేరుతో ఎంఫిల్, పీహెచ్‌డీల కోసం ద్రవిడ వర్సిటీలో రిజిష్టర్ చేసుకున్న వ్యక్తులను ఏ రకమైన వేధింపులకు గురి చేయరాదని, దీనిపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని సీఐడీ అదనపు డీజీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ద్రవిడ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఎంఫిల్ డిగ్రీలు, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జె.ప్రసాద్‌బాబు, అప్పాజీ, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. -
వివాహితపై అత్యాచార యుత్నం
గుడుపల్లె: ద్రవిడ వర్సిటీలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వేల్ వుురుగన్ అనే వ్యక్తి వివాహితపై అత్యాచార యుత్నం చేశాడు. గుడుపల్లె ఎస్ఐ బాస్కర్ కథనం మేరకు... వుండలంలోని ఏ జ్యోగిండ్ల గ్రావూనికి చెందిన వివాహిత ద్రవిడ వర్సిటీలోని ఒక ఇంట్లో పాచి పనుల చేసకుంటూ జీవనం సాగిస్తోంది. గత శనివారం పనుల పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా వర్సిటీ ఆవరణలోని ప్రసార భవనం వద్ద వర్సిటీలోని సెక్యూరిటీ గార్డు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. పెనుగులాటలో ఆమె తీవ్రంగా గాయపడింది. అతని నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ క్రమంలో బుధవారం తనపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వ్యక్తిని గుర్తు పట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వేల్వుురుగన్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ భాస్కర్ తెలిపారు. -
వీసీ క్షమాపణ చెప్పాల్సిందే
గుడుపల్లె: ద్రవిడ వర్సిటీ వీసీ కంకణాల రత్నయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబట్టారు. వీసీ తమ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ రెండు రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి శుక్రవారం వర్సిటీలోని ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. వర్సిటీ బంద్ పాటించారు. సిబ్బంది లేక భాషా భవనం, పరిపాలనా భవనం, వివిధ శాఖలు బోసిపోయాయి. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సిబ్బంది ఆరోపించారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై వర్సిటీలో ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేశారని ధ్వజమెత్తారు. వర్సిటీలో చదువుకునేవారు కరువయ్యారని అన్నారు. వీసీ చాం బర్ ఎదుట గంట పాటు ఆందోళన చేసినా ఆయన బయటకు రాకపోవడంతో సిబ్బంది వర్సిటీ మెయిన్‌గేట్ వద్ద బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, వుదీనా, త్యాగరాజు, శ్రీనివాసులు, పాండురంగన్, లక్ష్మీనారాయుణ పాల్గొన్నారు. వర్సిటీకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధం లేదు ద్రవిడ వర్సిటీకి అందులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని వీసీ కంకణాల రత్నయ్యు తెలిపారు. రెండు రోజులు వర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని విలేకర్లు వివరణ కోరగా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ద్రవిడ వర్సిటీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. -
మద్యం దుకాణం వద్దంటూ రాస్తారోకో
గుడుపల్లె : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టొద్దు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు అని మహిళలు నినదించారు. దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కుప్పం నుంచి ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమం మండలంలోని కనమనపల్లెలో గురువారం జరిగింది. గ్రామంలోని ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై ఎక్సైజ్ అధికారులు బుధవారం మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. మందుబాబులు వీరంగం చేయడంతో గురువారం ఆగ్రహంతో మహిళలు రోడ్డు మీదకు వచ్చారు. గ్రామం నుంచి మద్యం దుకాణం తరలించాలని పట్టుబట్టి, రోడ్డుపై బైఠాయిం చారు. ద్రవిడ వర్సిటీతో పాటు చుట్టుపక్కల గ్రావూలకు బస్సులు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వుద్యం దుకాణం తొల గించే వరకు ఆందోళన చేస్తావుని హెచ్చరించారు. ఈ మార్గంలో విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించాలంటే మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మద్యం వల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని తెలి పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మద్యం దుకాణం తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ వుునినారాయుణ, ఎక్సైజ్ ఎస్ఐ సాగర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వుహిళలతో మాట్లాడారు. వారి మాటలను మహిళలు ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. చేసేది లేక వుద్యం దుకాణం వద్దని వినతిపత్రం సమర్పిస్తే, అధికారులకు నివేదిస్తామని అధికారులు సమాధానపరిచారు. నివేదిక వచ్చిన వెంటనే కనవునపల్లెలో వుద్యం దుకాణం తొలగిస్తావుని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారంలోపు తొలగించకుంటే ఆందోళన చేస్తావుని వుహిళలు హెచ్చరించారు.