గుడుపల్లె: ద్రవిడ వర్సిటీ వీసీ కంకణాల రత్నయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబట్టారు. వీసీ తమ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ రెండు రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి శుక్రవారం వర్సిటీలోని ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. వర్సిటీ బంద్ పాటించారు. సిబ్బంది లేక భాషా భవనం, పరిపాలనా భవనం, వివిధ శాఖలు బోసిపోయాయి. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సిబ్బంది ఆరోపించారు.
ప్రయివేటు కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై వర్సిటీలో ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేశారని ధ్వజమెత్తారు. వర్సిటీలో చదువుకునేవారు కరువయ్యారని అన్నారు. వీసీ చాం బర్ ఎదుట గంట పాటు ఆందోళన చేసినా ఆయన బయటకు రాకపోవడంతో సిబ్బంది వర్సిటీ మెయిన్‌గేట్ వద్ద బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, వుదీనా, త్యాగరాజు, శ్రీనివాసులు, పాండురంగన్, లక్ష్మీనారాయుణ పాల్గొన్నారు.
వర్సిటీకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధం లేదు
ద్రవిడ వర్సిటీకి అందులో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని వీసీ కంకణాల రత్నయ్యు తెలిపారు. రెండు రోజులు వర్సిటీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని విలేకర్లు వివరణ కోరగా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ద్రవిడ వర్సిటీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు.
వీసీ క్షమాపణ చెప్పాల్సిందే
Published Sat, Oct 18 2014 3:31 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement