private educational institutions
-
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్‌తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్‌కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్‌ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రండి బాబూ రండి.. ముందే రిజర్వ్ చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం కోసం ప్రైవేటు విద్యాసంస్థలు సీట్లను అమ్మకానికి పెట్టాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నాయి. మధ్యవర్తులు, ఏజెంట్లు, తమ సంస్థల్లో చదివే సీనియర్లను రంగంలోకి దించుతున్నాయి. పెద్ద ఎత్తున కరపత్రాలు, ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. గ్రామాల్లో ఆటోలకు మైకులు పెట్టి ఊదరగొడుతున్నాయి. పల్లెల్లో పెద్దల్ని ఆశ్రయించి తమ విద్యార్థులకు తమ సంస్థలను సిఫారసు చేయమని అడుగుతున్నాయి. నిరుద్యోగులను నియమించుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా ఇల్లిల్లూ తిప్పుతున్నాయి. వీలున్న మార్గాల్లో విద్యార్థుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నాయి. ఎల్కేజీ మొదలుకుని, ఇంజనీరింగ్ వరకు స్కూళ్లు, కాలేజీలు ముందస్తు ప్రవేశాలకు తెరతీశాయి. ముందస్తు అడ్మిషన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. ‘బీ’ బ్యాచ్ టార్గెట్ రూ.1,000 కోట్లు! ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంకా పూర్తవ్వలేదు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు మొదలవ్వలేదు. కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడేయాజమాన్య కోటా సీట్ల అమ్మకాలకు తెరలేపాయి. జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. ఇప్పుడే సీటు రిజర్వు చేసుకుంటే తక్కువ మొత్తానికే లభిస్తుందని, తర్వాత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో 150 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలుండగా.. కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 1,07,039 సీట్లున్నాయి. ఇందులో యాజమాన్య కోటా సీట్లు 30 శాతం.. అంటే 32 వేల సీట్లుంటాయి. ప్రధానంగా పది కాలేజీల్లోనే 15 వేల యాజమాన్య కోటా సీట్లున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ సీట్లు 12,500 వరకూ ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 3 వేల సీట్లు వచ్చే వీలుంది. వీటికే ప్రధానంగా డిమాండ్ ఉంటోంది. జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల కొలమానంగా మెరిట్ విద్యార్థులకే సీట్లివ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు వసూలు చేయాలి. కానీ యాజమాన్యాలు ఒక్కో సీటు గరిష్టంగా రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఒక్కో సీటు సగటున రూ.7 లక్షలు అనుకున్నా..17 వేలకు పైగా యాజమాన్య సీట్ల విలువ రూ.1,000 కోట్లు దాటిపోతుందని అంటున్నారు. తగ్గేదే లేదంటున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏటా సగటున 4.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. 2 లక్షల మంది ప్రభుత్వ కాలేజీలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురకులాల్లో చేరుతుంటే, మిగిలిన 2.50 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో 1,500 వరకూ ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో 500కు పైగా కాలేజీలున్న నాలుగు కార్పొరేట్ సంస్థలే హవా కొనసాగిస్తున్నాయి. దాదాపు 1.80 వేల మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. 1,000 వరకు ఉండే లోబడ్జెట్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య 70 వేల వరకూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ముందే ప్రవేశాల ప్రక్రియ మొదలు పెట్టాయి. టెన్త్ పరీక్షలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా..భవిష్యత్‌ను నిర్ణయించేది ఇంటర్మీడియెట్టేనని, ఇక్కడే అసలైన పునాది అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. హాస్టళ్ళలో వసతులు, అత్యాధునిక పద్ధతుల్లో బోధన, నిష్ణాతులైన సిబ్బంది, కొన్నేళ్ళుగా వస్తున్న పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఊళ్ళల్లో చోటామోటా నేతలకు మామూళ్ళిస్తున్నాయి. విలాస వంతమైన ట్రిప్పులు ఏర్పాటు చేస్తున్నాయి. ‘కేజీ’ చదువులపైనా క్రేజ్ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లూ జోరు కొనసాగిస్తున్నాయి. కొత్త విద్యార్థులను చేర్పించమని స్కూల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లకు టార్గెట్లు పెడుతున్నాయి. అడ్మిషన్లకు వేతనాలకు లింక్ పెడుతున్నాయి. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కేవలం 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదువుతుండటం గమనార్హం. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించేటప్పుడే మంచి స్కూళ్ల కోసం గాలిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వారికి గాలం వేస్తున్నాయి. అందమైన బ్రోచర్లతో, ఆకర్షణీయమైన వాట్సాప్ మెసేజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ స్కూల్లో చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మ బలుకుతున్నాయి. అడ్మిషన్లు మొదలయ్యే లోగా చేరే వారికి ప్రత్యేక ప్యాకేజీ అంటున్నాయి. రూ. 50 వేలు మొదలుకొని, పెద్ద కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో రూ.12 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి పరిస్థితి నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్ల కోసం వెంటపడే కాలేజీల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ వ్యవస్థలోకి తేవాలి. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతి వచి్చన తర్వాత అడ్డుకట్ట వేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) కఠిన చర్యలు తప్పవు వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు ఏ కాలేజీకీ అఫ్లియేషన్ ఇవ్వలేదు. కాబట్టి అడ్మిషన్లు చేపట్టినట్టు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా తొందరపడి అడ్మిషన్లు తీసుకోవద్దు. – కృష్ణ ఆదిత్య (ఇంటర్ బోర్డు కార్యదర్శి) -
ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న చట్ట నిబంధన అమలుపై సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.మరోవైపు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. \ఎవరికి ఉచితం? రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్ డెవలప్మెంట్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేసినా ట్యూషన్ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్‌తో నడిచే సీబీఎస్సీ, ఐసీఎస్ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు! -
టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నంబరు జీవో జారీచేశారు. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ వారంలోనే ఫలితాలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈవారంలోనే విడుదలయ్యే అవకాశముంది. మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది. -
స్వాధీనానికి ఒత్తిడి చేయడం లేదు
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను ఒత్తిడి చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగుతుందంటూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీని హైకోర్టు మరికొన్ని విద్యాసంస్థల విషయంలోనూ రికార్డ్ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఒత్తిడి తెచ్చినవారి వివరాలను తమ ముందుంచాలని విద్యాసంస్థల న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలకు తాము ఆదేశాలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటుగా నిర్వహించుకోవడం లేదా వాటిని తమకు స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ కొనసాగుతుంది
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను కూడా ఒత్తిడి చేయడంగానీ, ఈ విషయంలో సమావేశాలు నిర్వహించడంగానీ చేయడానికి వీల్లేదంటూ రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులను (డీఈవోలను) రాతపూర్వకంగా ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఆదేశాలను ఆయన హైకోర్టుకు చదివి వినిపించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలుంటాయని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. స్వాధీనానికి ముందుకురాని విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఏ అధికారి అయినా స్వాధీనానికి ఒత్తిడిచేస్తే ఆ వివరాలను తమ ముందుంచాలని, తాము తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పిటిషనర్లకు తెలిపింది. ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణంగా జారీచేసిన జీవోను సవాలు చేస్తూ పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వానికి స్వాధీనం చేసినా, చేయకపోయినా పాఠశాలలకు ఇస్తున్న గ్రాంట్‌ను నిలిపేసే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యాసంస్థలు మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమన్నారు. ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. పాఠశాలలు, సిబ్బంది స్వాధీనం స్వచ్ఛందమే తప్ప బలవంతం కాదని చెప్పారు. స్వాధీనం చేయకపోయినా గ్రాంట్ అందుతుందని, గతంలోలాగే ఆ పాఠశాలలు నడుస్తాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. -
ఫీజుల ఖరారు.. అందరి మేలు కోసమే
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్ సానుకూల పరిష్కారం చూపిస్తుంది. చదవండి: డ్రోన్ల ఆపరేషన్ సులభతరం అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు కనీస సదుపాయాల్లేకుండా అధిక ఫీజులు వసూలుచేసే సంస్థలపై చర్యలు తప్పవు. మూడేళ్ల వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు కమిషన్ నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే కమిషన్‌కు సంబంధించిన 9150381111 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. గత ఏడాదిలో నిబంధనలు పాటించని 120 విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నాం’.. అని జస్టిస్ కాంతారావు వివరించారు. విద్యారంగంలో మార్పు తెచ్చేందుకే.. వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ఎ. విజయశారదారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో విద్యారంగ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిలో మార్పు తెచ్చేందుకు కమిషన్‌ను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు ప్రాంతాల వారీగా నిర్ణయించిన ఫీజులను వివరించారు. ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించడమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని.. నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యకానుక తదితర కార్యక్రమాల గురించి చెప్పారు. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! ప్రైవేట్ సంస్థలు జీతాలివ్వడంలేదు కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలుచేస్తున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎం దీనిపై దృష్టిపెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూనే ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణను పెట్టారని తెలిపారు. విద్యార్థిపై వెచ్చించే మొత్తం ఆధారంగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలి కానీ అలా జరగడంలేదని.. దీనినే కమిషన్ అమలుచేస్తుందని చెప్పారు. చాలా ప్రైవేటు సంస్థలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడంలేదని.. కనీసం అపాయింట్మెంటు ఆర్డర్ కూడ ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. సర్వీసు రూల్సు అసలు లేవని.. వారికి ఇకపై సర్వీసు రూల్సు పెట్టనున్నట్లు సాంబశివారెడ్డి వెల్లడించారు. అలాగే, రానున్న కాలంలో ఆయా సంస్థల ప్రమాణాలను అనుసరించి ర్యాంకులు, అక్రిడిటేషన్‌ను అమలుచేస్తామని అని తెలిపారు. -
ప్రైవేట్ విద్యతో పేదలకు పిడుగుపాటే
‘‘సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఒకే ఒక గొప్ప సాధనం విద్య. సమ్మిళిత, సమభావనతో కూడిన విద్య సమసమాజం సాధించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి పౌరుడు సమాజంలో గౌరవస్థానం పొందడానికి కలలుకంటూ వాటిని సాధించుకోవడానికి నిరంతరం తపనపడుతుంటారు. భారతదేశంలోని ప్రతి బాలుడు, బాలిక తాము అభివృద్ధి చెంద డానికి అవకాశాలు ఉండాలి. వారి పుట్టుక, సామాజిక నేపథ్యం వల్ల వాళ్ళు నిరాదరణకు గురి కావద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ‘జాతీయ విద్యా విధానం’ విధాన పత్రంలో పేర్కొన్నారు. కస్తూరి రంగన్ నాయకత్వంలో నియమించిన కమిటీ తన నివేదికను డిసెంబర్ 15, 2018న ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత 2020, జూలై 19వ తేదీన కేంద్ర మంత్రి మండలి ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దాదాపు 484 పేజీలతో కూడిన ఈ నివేదిక సారాన్ని 66 పేజీలకు కుదించి, కేంద్ర ప్రభుత్వం తన విధానంగా ప్రకటించుకున్నది. అందులో 27 అంశా లను పొందుపరిచారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆరవభాగంలోనివి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యావిధానంపైన ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ అందరూ విస్మరించిన ఏకైక అంశం ఆరవ భాగం. ఈ మొత్తం విధానంలో ఇదే కీలకమైనదని భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందా? చారిత్రకంగా విద్య సముపార్జనలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు న్యాయం జరగాలని ఆ ఆరవభాగం సారాంశం. దీనికి అనుబంధంగా ఈ విధానంలో 14వ భాగాన్ని కూడా జోడించారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బృందాలుగా పేర్కొన్నారు. ఇందులో మళ్ళీ కొన్ని విభజనలు చేశారు. ఇందులో లింగ వివక్షను ఎదుర్కొంటోన్న మహిళలు, ట్రాన్స్ జెండర్స్, సామాజికంగా, సాంస్కృతికంగా అణగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, భౌగోళికంగా వివక్షకు గురవుతోన్న గ్రామీణ, చిన్నపట్టణాల, వెనుకబడిన జిల్లాల విద్యార్థులు, దివ్యాంగులు, అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోన్న వలస కార్మికులు, స్వల్ప ఆదాయ వర్గాలు, ఇలా ఎన్నో వర్గాలను ఇందులో పేర్కొన్నారు. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యు.డైస్) సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో, దివ్యాంగుల్లో బడిమానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు విద్యను ప్రత్యేకించి, నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారని కూడా నివేదిక స్వయంగా ప్రకటిం చుకున్నది. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. జాతీయ విద్యావిధాన పత్రంలో ఉన్న 27 భాగాల అంశాలు సాంకేతికపరమైనవి, పాలనాపరమైనవి, విధానపరమైనవి. అయితే ప్రభుత్వం నామకరణం చేసిన ఎస్.ఇ.డి.జి వర్గాలకు విద్య అందడా నికి ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న విద్యను అందించడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై సమగ్రమైన ప్రణాళిక లేదని స్పష్టమౌతోంది. ప్రత్యేక నిధుల కేటాయింపు అభినందనీయం ఈ విధానపత్రంలోని 14వ భాగంలో ఏవో కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రభుత్వం ఎన్.ఇ.డి.జి వర్గాల ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ఈ వర్గాల విద్యార్థు లకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. సంతోషమే. అటువంటి నిర్ణయం చేయడంలో శ్రద్ధ చూపించినందుకు అభినందించాలి. అయితే వాటిని ఎట్లా అమలు చేస్తారు? అందులో ప్రభుత్వం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందనేదీ ప్రశ్నార్థకమే. అయితే ఇప్పటివరకు గత ఆరేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికీ, ఇప్పుడు వీరి విద్యా భివృద్ధికి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు గణనీయంగా క్షీణించడం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించుకొని, తన విధానాలలో మార్పులు తీసుకువస్తే, మంచి పరిణామమే అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధే ప్రగతికి కొలమానం భారతదేశంలో అణగారిన వర్గాల సంఖ్య విస్మరించదగినది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ఎస్.ఇ.డి.జి.లు దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటారు. ఈ దేశంలోని ఏ అభివృద్ధినైనా కొలవాలంటే వీరి ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం విద్యారంగంలో తలెత్తుకొని నిల బడాలంటే, ఈ వర్గాలు ఆత్మగౌరవంతో ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలి. అందుకుగాను విద్య ఎంతో ముఖ్యమైన అంశం అవుతుందని జాతీయ విద్యా విధాన పత్రమే స్పష్టం చేసింది. ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మార్గదర్శకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్టాలు ఇంకా కొంత నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న వర్గాల కోసం, ఈ రాష్ట్రాలు ఒక నమూనాగా నిలుస్తున్నా యనడంలో ఆశ్చర్యం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రాణాధారం ఈ వర్గాల్లో విద్యావ్యాప్తి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కనీసం చదువుకొనేందుకు సైతం వారి ఇండ్లు, పరిసరాలు అనువుగా ఉండవనేది ఒక సత్యం. అందుకుగాను ప్రత్యేక హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కావాలనేది 1927లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రారంభమైంది. 2012 సంవ త్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన సబ్‌ప్లాన్ చట్టం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు 188, ఎస్టీ 190, బీసీ 104లకు కొత్తగా అనుమతి లభించగా, ఇప్పటికే 84 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీలకు 268, ఎస్టీలకు 183, బీసీలకు 142, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ విద్యా లయాలున్నాయి. తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు 30 రెసిడెన్షియల్ కళాశా లలున్నాయి. కర్ణాటకలో కూడా ఎస్సీలకు 500, ఎస్టీలకు 153, బీసీలకు 165 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. అయితే తెలంగాణలో మైనారిటీల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలోనే తొలి ప్రయత్నం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, పాఠశాల విద్య కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశా లల్లో మౌలిక వసతుల కోసం పన్నెండు వేలకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 3,800 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు బడికి వెళ్ళే పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి ఇస్తున్నారు. దీన్నే అమ్మఒడి పథకంగా పిలుస్తున్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్, బ్యాగ్‌తో సహా బడికెళ్ళిన రోజే అందిస్తున్నారు. 43 లక్షల మంది పిల్లలు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. 648 కోట్ల రూపాయలు దీనికి కేటా యించారు. గోరుముద్దతో పౌష్టికాహారానికి హామీ మధ్యాహ్న భోజన పథకానికి అదనపు బడ్జెట్ కేటాయించి, మంచి పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. వారికొక భరోసానిస్తుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే, ప్రభుత్వ పాఠశాలలకు గౌరవం తెచ్చిపెట్టే ఇటు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధాన పత్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం, సమకాలీన, సామాజిక, ఆర్థిక పరిస్థితులను విస్మరించడం. ఈ రోజు డ్రాపౌట్స్ సంఖ్య విపరీతంగా పెరగడానికీ, నైపుణ్యత కలిగిన విద్యను అందుకోలేకపోవడానికి పేదరికమే ప్రధాన కారణం. దేశంలోని ఎస్.ఇ.డి.జి. వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాకుండా ఎటువంటి సంస్కరణలైనా తాత్కాలికమే అన్న విషయం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దానికి ఫిలాంత్రఫీ అనే ఒక పదాన్ని పదే పదే వాడారు. ప్రైవేట్ విద్యకు ఫిలాంత్రఫిస్టులు (ధర్మదాతలు) చేత ప్రోత్సహించాలని రాసు కున్నారు. ఇప్పటికీ జరుగుతున్నదదే. ప్రైవేట్ విద్యతో సమాజ సేవ బూటకం ప్రతి ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలందరూ తాము వ్యాపారం కోసం మాత్రమే కాక, సమాజ సేవకోసం విద్యా సంస్థలు నడుపుతున్నామనే చెప్పుకుంటారు. కానీ అసలు నిజం అందరికీ తెలుసు. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడమంటేనే, ఈ దేశం లోని 90 శాతం మంది ప్రజలను, విద్యార్థులను చీకట్లోకి నెట్టివేయ డమే తప్ప మరొకటి కాదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి, చదివే విద్యార్థులతో చెట్లకింద చదివే విద్యార్థులు పోటీపడటం అసాధ్యం. అందుకే ప్రభుత్వాలు మాట్లాడే మాటలను ఆచరణతో పోల్చి చూసు కుంటే నిజా నిజాలు తేటతెల్లం అవుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రైవేట్ విద్యాసంస్థలు బాధ్యత మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి విధిగా ప్రతి నెలా జీతాలు చెల్లించే నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో ఆదివారం కలిశారు. తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకులకు విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం–82లో సవరణలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెలా ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆయా విద్యాసంస్థల యజమానులు కచ్చితంగా నెలవారీ జీతాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐనేని సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్, మదన్ తదితరులున్నారు. -
మైనారిటీ విద్యా సంస్థలకూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా∙గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల వల్ల ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలు స్థూలంగా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించినవని పేర్కొంది. అవి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు ఉద్దేశించినవే కానీ.. ప్రత్యేక హక్కుల మాటున తప్పుడు పరిపాలన విధానాలు అవలంబించేందుకు కాదంది. ‘సేవా ధర్మ భావన నుంచి విద్యను అమ్మకం వస్తువుగా మార్చారు. సంపన్నులకే లభించే వస్తువుగా విద్య మారింది. పేదలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని చదువుకుని, ఆ అప్పులు, వడ్డీలు తీరుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గలుగా ఉండగానే వారిని చిదిమేస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. ‘ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) తెచ్చిన చెడ్డపేరు కారణంగా మొత్తం వైద్య విద్య వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగవలేదు. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది’అని పేర్కొంది. కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి వైద్యులను తయారు చేసిన విషయాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించింది. నీట్’పేర్కొన్న అత్యున్నత నాణ్యత నిబంధనలు పాటిస్తూ సొంతంగా ప్రవేశ పరీక్షలు జరుపుకుంటామని పలు మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
ప్రమాణాలే ప్రామాణికం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేసింది. పాఠశాలల్లో బోధన, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఏప్రిల్ నాటికి ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది. ఫీజులపై చట్టబద్ధమైన విధివిధానాలు లేనందున ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు అందాలని, దీన్ని అమలు చేయిస్తామని పేర్కొంది. సోమవారం విజయవాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వసతులు, ఫీజులు.. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, మరుగుదొడ్లు, మంచినీరు, తరగతి గదులు, లైబ్రరీ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని తనిఖీలు చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. వారు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా.. 260 విద్యా సంస్థల్లో తనిఖీలు – రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13, 14వ తేదీల్లో 130 ప్రైవేట్ పాఠశాలలు, 130 ప్రైవేట్ జూనియర్ కాలేజీలను తనిఖీ చేయగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం. – లోపాలపై విద్యా సంస్థలకు నోటీసులిస్తాం. గడువులోగా సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. దిద్దుబాటుకు అవకాశం లేని విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం. – సీబీఎస్ఈ, ఐసీఎస్సీ పాఠశాలలు, కాలేజీల విషయంలో కూడా ఫీజులు, ఇతర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయి. – పాఠశాలలు ఫీజు రూ.70 వేలు చెబుతూ రూ.95 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సృజనాత్మక బోధనకు బదులుగా బట్టీ విధానాల్లో పాఠాలు చెబుతున్నారు. – ప్రతి యూనిట్ టెస్టుకు విద్యార్ధులను ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మారుస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు. – విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40 మంది పట్టే తరగతి గదుల్లో 80 – 100 మంది వరకు ఉంటున్నారు. – ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. రోజువారీ కూలీలకన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. – గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి. – ఇంజనీరింగ్, డాక్టర్ విద్య మాత్రమే చదువులన్నట్లుగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారం వల్ల విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఒత్తిడికి గురవుతున్నాయి. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. సొసైటీల పేరిట కొన్ని సంస్థలు ఫీజుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి విద్యా సంస్థకు సంబంధించిన ఐటీ రిటర్న్‌లను తెప్పించి పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విద్యాబోధన, ప్రమాణాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. నాణ్యతా ప్రమాణాలపై అలసత్వాన్ని ఉపేక్షించం. – జస్టిస్ కాంతారావు అనువైన వాతావరణం లేదు ప్రైవేట్ సంస్థలు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదు. బోధనా సిబ్బంది నాలుగైదు బ్రాంచిలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులంటూ ఇబ్బంది పెడుతున్నారు. సరైన ఆటస్థలం, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఎక్కడా లేదు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, ఈ–మెయిల్ ప్రవేశపెడుతున్నాం. – విజయ శారదారెడ్డి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి, నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టాన్ని మార్చి, సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తాం. – ఆలూరు సాంబశివారెడ్డి -
ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుండా.. ప్రమాణాలు పాటించకుండా నడిచే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు ఉంటున్నాయో పరిశీలించి.. నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేని వాటిని మూసివేయించాలన్నారు. విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సీఎం వైఎస్ జగన్‌తో మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సుల నివేదికను ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ ముఖ్యమంత్రికి సమర్పించారు. కమిటీ సిఫార్సులపై సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సిఫార్సుల అమల్లోనూ కమిటీ భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపట్టాల్సిన పలు సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి తరగతిలో సమగ్ర బోధనాభ్యసన ప్రక్రియలు కొనసాగాలని, ఇందుకోసం విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాగా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) తరహాలో స్టేట్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనల అమలు, నాణ్యతా ప్రమాణాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. వీటిని నియంత్రించాలన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరైన సదుపాయాలు, ప్రమాణాలు పాటించని వాటిని మూసివేయాలని ఆదేశించారు. 100 ఎకరాలు ఉంటేనే వ్యవసాయ కళాశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో ఈ మేరకు భూమి ఉండడం లేదని, విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యలో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు. చదువు యువతకు ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని, అలా లేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. నాణ్యతా ప్రమాణాలు లేనప్పడు అవి ఇచ్చే సర్టిఫికెట్లకు ఏం విలువ ఉంటుందన్నారు. ‘విద్య అనేది వ్యాపారం కోసమో, డబ్బు కోసమో కాదు. దీన్ని ఒక ఛారిటీలా నిర్వహించాలి.’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ.5 కోట్లతో టీచర్లకు శిక్షణ: సుధా నారాయణమూర్తి కమిటీ సభ్యురాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరఫున రూ.5 కోట్లతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో మంచి మార్పులు వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సాంకేతిక విద్య కమిషనర్ రమణ, నిపుణుల కమిటీ సభ్యులు సాంబశివారెడ్డి, రాజశేఖరరెడ్డి, జంధ్యాల తిలక్, ఈశ్వరయ్య, ప్రసాద్, ప్రొఫెసర్ దేశాయ్, నళినీ జునేజా, వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్), తదితరులు పాల్గొన్నారు. -
హెచ్సీయూకు 11వ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల జాబితాలో తెలంగాణ వర్సిటీల పంట పండింది. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల ర్యాంకులు గతేడాది కంటే ఈసారి మెరుగయ్యాయి. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు 2016 నుంచి కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) బోధన, వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ – 2019 ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ ర్యాంకును సాధించింది. మన రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు కూడా ర్యాంకులజాబితాలో స్థానం దక్కింది. సోమవారం ఢిల్లీలో ఈ ర్యాంకులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ రీసోర్సెస్, రీసర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్, ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్సెప్షన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంహెచ్ఆర్డీ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్‌లో 83.88 పాయింట్లతో ఐఐటీ మద్రాసు మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్థానంలో నిలించింది. ఇందులో ఉన్నత విద్యాసంస్థలకు ఓవరాల్ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో, యూనివర్సిటీల విభాగంలో, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, లా, ఆర్కిటెక్చర్, మెడికల్ కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో 4 విద్యాసంస్థలు ఓవరాల్ కేటగిరీలో టాప్–100లో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలు ర్యాంకులను సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో (ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 61.85 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 11వ స్థానమే లభించింది. గతేడాది 56.92 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఐఐటీ ఈసారి కూడా 26వ స్థానంలో నిలువడం గమనార్హం. 2017–18లో 45వ ర్యాంకు సాధించిన ఉస్మానియా వర్సిటీ ఈసారి తమ ర్యాంకును మెరుగు పరుచుకుంది. 49.86 పాయింట్లతో 43వ ర్యాంకును సాధించింది. ఇక 46.06 పాయింట్లతో వరంగల్ ఎన్ఐటీ ఈసారి 61వ ర్యాంకును సంపాదించింది. గతేడాది వరంగల్ నిట్ 78వ స్థానంలో నిలిచింది. ఇక 101–150 ర్యాంకుల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. 151–200 జాబితాలో.. ఇఫ్లూతోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. ఇంజనీరింగ్ కేటగిరీలో.. ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్‌కు 8వ స్థానం, వరంగల్ ఎన్ఐటీకి 26వ స్థానం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 39వ స్థానం, హైదరాబాద్– జేఎన్టీయూకు 45వ స్థానం, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 83వ స్థానం లభించింది. వీటితోపాటు 101–150, 151–200 స్థానాల్లో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు 6వ స్థానం లభించింది. దాంతోపాటు పలు ప్రైవేటు కాలేజీలకు ర్యాంకుల లభించాయి. డిగ్రీ కాలేజీల విభాగంలో పలు ప్రైవేటు కాలేజీలు ర్యాంకులు సాధించాయి. వర్సిటీల ర్యాంకింగ్‌లో.. యూనివర్సిటీల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగవ ర్యాంకు లభించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 26వ స్థానం లభించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 79వ స్థానం, హైదరాబాద్ ట్రిపుల్ఐటీకి 82వ స్థానం లబించింది. 101–150వ స్థానంలో ఇఫ్లూ, 151–200వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలు ఉన్నాయి. -
స్వైన్ ఫ్లూ భయంతో గ్రామం వెలి!
కోడూరు(అవనిగడ్డ): విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతోందనేందుకు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. స్వైన్ ఫ్లూ భయంతో కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని సమీప గ్రామాల ప్రజలు వెలివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 5వ తేదీన చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. దీంతో నాంచారయ్యతో పాటు మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ వైరస్ ఉందని, వీరు తమతో పాటు కలిస్తే ఆ వ్యాధి తమకు కూడా సోకుతుందంటూ ఆ ఊరి ప్రజలతో శివారు గ్రామస్తులు మాట్లాడడం కూడా మానేశారు. పాలు కూడా పోయడం లేదు. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు చింతకోళ్ల గ్రామం నుంచి వచ్చే చిన్నారులకు సెలవులు ప్రకటించాయి. తాము చెప్పేవరకు విద్యార్థులను పాఠశాలలకు పంపవద్దని పలు యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు స్కూల్ బస్సులను కూడా ఆ గ్రామానికి నిలిపివేశారు. గ్రామ ప్రజలను ఆటోవాలాలు తమ ఆటోల్లో ఎక్కించుకోకుండా దూరం పెడుతున్నట్లు చింతకోళ్లవాసులు వాపోతున్నారు. ఒకవేళ చింతకోళ్ల నుంచి ఆటో వస్తే ఆ ఆటో ఎవరు ఎక్కకుండా ఖాళీగా పంపించేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక చింతకోళ్లకు బంధుత్వం ఎక్కువగా ఉన్న సమీప గ్రామాల్లో అయితే ఏకంగా ‘చింతకోళ్లకు వెళ్లవద్దు.. ఆ గ్రామస్తులను మన గ్రామంలోకి రానివద్దు అంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికీ జ్వరాలు లేవు స్వైన్‌ఫ్లూ మరణంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చింతకోళ్ల గ్రామంలో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులందరికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. మృతుడికి మినహా మిలిగిన ఎవరికీ జ్వరాలు లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తేల్చారు. తమకు ఏవిధమైన వైరస్ సోకకపోయినా మిగిలిన గ్రామస్తులు తమను దూరం పెడుతున్నారని, తమతో మాట్లాడడం లేదని, నిత్యావసరాల కోసం వెళ్తే ఎవరూ స్పందించం లేదని చింతకోళ్లవాసులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో ఏవిధమైన వైరస్ లేదంటూ చుట్టు పక్కల గ్రామాల్లో తెలియజెప్పాలని వారు వేడుకుంటున్నారు. వెలివేసినట్లు చూస్తున్నారు మా గ్రామంలో ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మరణించడంతో గ్రామమంతా ఈ వైరస్ ఉందంటూ తమను చుట్టు పక్కలవారు వెలివేసినట్లుగా చూస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పాల సరఫరాను కూడా నిలిపివేశారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మా గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలలకు రావద్దంటూ సెలవులు ప్రకటించాయి. ఇలా ప్రతి విషయంలో మాముల్ని దూరం పెడడంతో గ్రామస్తులంతా తీవ్ర మనోవేదన చెందుతున్నాం. – సుబ్రహ్మణ్యం, చింతకోళ్ల గ్రామస్తుడు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు చింతకోళ్ల గ్రామంలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉందంటూ మిగిలిన గ్రామాల ప్రజలు చేపట్టిన అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. వైద్యాధికారులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందరికి రక్తపరీక్షలు కూడా చేశారు. గ్రామస్తులకు జ్వరాలు లేవని తేల్చారు. చింతకోళ్లవాసులపై వివక్షత చూపినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.ఎ.నారాయణరెడ్డి, తహసీల్దార్ -
పోరుబాటలో ప్రైవేటు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థ లు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు మళ్లీ పోరుబాట పట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీగా ఏర్పాటైన యాజమాన్య సంఘాలు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టాయి. నగర సమీపంలోని గౌరెల్లిలో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి (కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొంటారని పేర్కొంది. 3 వేల పాఠశాలలు మూతపడ్డాయి విద్యనే సామాజిక మార్పునకు ఏకైక సాధనం అన్న ఆలోచనతో విద్యారంగ వ్యాప్తికి కృషిచేస్తున్న తమను ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని జేఏసీ చైర్మన్ రమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే 3 వేల సాధారణ పాఠశాలలు, 600 జూనియర్ కాలేజీలు, 300 డిగ్రీ కాలేజీలు, వందల్లో ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసమే తాము ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండల నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన ఆట్ల నాగమణి(20) ఓ కార్పోరేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యంగా ఉందని ఉదయం జరిగే స్టడీ అవర్ క్లాసులకు వెళ్లకుండా హాస్టల్ రూంలోనే ఉంది. ఈ క్రమంలో తాను ఉండే గది పక్కనే ఉన్న మరో గదిలో స్నేహితుల బ్యాగులు వెతుకుతుండగా హాస్టల్లో ఉండే విద్యార్థులు గమనించి ఆమె నిలదీశారు. వార్డెన్‌కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్లడంతో మనస్తాపానికి గురైన నాగమణి రూం తలుపులు వేసుకుని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోవటంతో గమనించిన అధ్యాపకులు కిటికీలనుంచి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
27న రాష్ట్ర వ్యాప్త ప్రైవేట్ జూనియర్ కాలేజీల బంద్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లోని టీపీజేఎంఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. వి.నరేందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గౌరి సతీశ్, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డిలతో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇంటర్ బోధన రుసుమును పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. -
విద్యార్థులున్నా.. కాలేజీలు సున్నా
సాక్షి, హైదరాబాద్ : ♦ పాత మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్ మండలంలో 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి. వాటిల్లో 533 మంది పదో తరగతి చదువుతున్నారు. కానీ అక్కడ ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ చదివేందుకు విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. ♦ వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ, ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వాటిల్లో 441 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడా ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ కోసం ఇతర మండలాల్లోని ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తుండగా మరికొంత మంది పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని 106 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుపై ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు దృష్టి సారించకపోగా, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో ఆయా మండలాల్లోని విద్యార్థులు నిత్యం ఇతర ప్రాంతాల్లోనే కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత 125 మండలాలు పెరిగాయి. దీంతో మండలాల సంఖ్య 584కి చేరింది. కానీ 106 మండలాల్లో ఒక్క కాలేజీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలే కాదు.. పాత మండలాల్లోనూ కాలేజీలు లేక పిల్లల్ని ఇతర మండలాలకు పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్థానికుల ఒత్తిడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. గతంలో 10 జిల్లాలుండగా వాటిని 31 జిల్లాలు చేయడం.. పాత మండలాలు 459 ఉండగా 584కు పెంచడంతో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. ఐదారు ఉన్నత పాఠశాలలున్న గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక్క జూనియర్ కాలేజీ లేని మండలాల్లో ఏర్పాటుకు ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలూ సిద్ధం చేయించి ఇంటర్ విద్యా శాఖకు పంపుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు.. ఏయే మండలాల్లో ప్రైవేటు కాలేజీలున్నాయి.. అసలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ లు లేని మండలాలు ఏవో లెక్కలు తేల్చారు. మొత్తం గా 106 మండలాల్లో అటు ప్రభుత్వ జూనియర్ కాలే జీ గాని, ఇటు ప్రైవేటు కాలేజీ కానీ లేదని తేల్చారు. వాటి విషయంలో ఏం చేయాలని యోచిస్తున్నారు. కాలేజీలు లేని మండలాలు మరిన్ని.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ ఉంది. వాటిల్లో 459 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు జూనియర్ కాలేజీ ఒక్కటీ లేదు. అదే జిల్లాలోని కోటపల్లిలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా పదో తరగతి విద్యార్థులు 203 మంది ఉన్నారు. అక్కడా ఒక్క కాలేజీ లేదు. జనగా మ జిల్లాలో తరిగొప్పుల, వరంగల్ రూరల్ జిల్లా లోని దుగ్గొండి, నల్లబెల్లి, యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, నిర్మల్ జిల్లా లోని బాసర, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న మండలాల్లో డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కాలేజీలు లేని కొత్త మండలాలతో పాటు పాత మండలాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపాలి. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
స్కూళ్లకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవే ట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పని చేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది లేదన్నా రు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో సమస్యలపై గురువారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యాసంస్థల అనుమతులు, గుర్తింపు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాయి. అనంతరం సమావేశ వివరాలను కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భద్రతలో యాజమాన్యాలు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని, అగ్నిమాపక చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు మంత్రులు స్పష్టం చేశారు. జాతీయ అగ్నిమాపక నిబంధనలు రాకముందు ఏర్పాటైన పాఠశాలల భవనాలకు ఆ నిబంధనలు వర్తింపజేయడంలో ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దానిపై కమిటీ వేస్తామన్నారు. పాఠశాలలకు ఆస్తిపన్నును తగ్గించాలన్న యాజమాన్యాల విజ్ఞప్తిని మంత్రులు అంగీకరించి, ప్రత్యేక స్లాబులో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు చేపడతామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో అది అమల్లో ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై కమిటీ! ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సరైన న్యాయం జరగడం లేదని పేర్కొనగా.. దానిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య చైర్ పర్సన్‌గా ఆర్థిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యదర్శులు సభ్యులుగా కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు, కాలేజీల అనుమతులకు ఎన్వోసీల జారీని వికేంద్రీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలపై కక్షసాధింపు ధోరణి ఏమీ లేదని, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొన్నారు. -
ప్రైవేటు కనికట్టు.. ఇంటర్ బోర్డు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్సైట్ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్వేర్ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకటి తేలకుండానే ఇంకోటి.. టెస్టింగ్ ప్రాసెస్ తేలకముందే ఇంటర్ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాల ప్రాసెస్ ప్రోగ్రాం మోడల్స్ తెచ్చుకొని కొంత మేర ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాలను ప్రాసెస్ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది. ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని.. విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్సైట్లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు. భారీ కుట్ర! బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్సైట్లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్లైన్ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ మెషీన్ కొనుగోలు పేజీ -
హైకోర్టు ఆదేశిస్తేగానీ స్పందించరా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు ఎలా ఉండాలన్న విధివిధానాలపై హైకోర్టు ఆదేశిస్తేగానీ కమిటీ స్పందించదా అని ప్రశ్నించింది. కమిటీ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 2016–17 నుంచి 18–19 వరకు మూడేళ్ల విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.97 వేలుగా కమిటీ సిఫార్సు చేసింది. ఇలా చేయడాన్ని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఆ కాలేజీల ట్యూషన్ ఫీజు రూ.1.37 లక్షలు, రూ.1.60 లక్షలుగా చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఒక్కరే ఫీజుల్ని నిర్ణయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మిగిలిన కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని, సమావేశాల మినిట్స్ పరిశీలిస్తే డొల్లతనం బట్టబయలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై తీర్పును తర్వాత వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. -
అడ్డగోలు ప్రవేశాలకు అంతేలేదు!
సాక్షి, అమరావతి: ఇంటర్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆదాయ మార్గంగా మార్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాస్తవ సంఖ్యకు, రికార్డుల్లో చూపించే లెక్కకు ఎక్కడా పొంతన ఉండదు. నిర్ణీత ఫీజు కంటే పది రెట్లు ఎక్కువగా పిండుకుంటున్నా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. అనుమతులు లేకుండా హాస్టళ్లను తెరుస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మూడొంతుల మంది ప్రైవేట్ కాలేజీల్లోనే.. రాష్ట్రంలో 3,361 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,143 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు కార్పొరేట్ సంస్థలవే. గతంలో ప్రభుత్వం రూపొందించిన గణాంకాల ప్రకారం శ్రీచైతన్య పరిధిలో 186 కాలేజీలుండగా అందులో 1.52 లక్షల మంది చదువుతున్నట్లు పేర్కొంది. నారాయణ పరిధిలోని 152 కాలేజీల్లో 85 వేల మంది, ఎన్ఆర్ఐ యాజమాన్యం పరిధిలోని 38 కాలేజీల్లో 14 వేల మంది, శ్రీగాయత్రి పరిధిలోని 27 కాలేజీల్లో 12 వేల మంది, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో మిగతా విద్యార్థులు చదువుతున్నట్లు తేల్చారు. అప్పట్లో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు మాత్రమే కాగా ఇప్పుడు ఇంటర్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గత ఏడాది 10.26 లక్షల వరకు ఉంది. వీరిలో 3 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా మిగతా వారంతా ప్రైవేట్ కళాశాలల్లోనే చేరుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని కాలేజీలకే ఇంటర్ గుర్తింపు తీసుకుని పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాల్లో ఇలా జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఎండాకాలంలోనే ప్రవేశాలు పూర్తి ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి బోర్డు పలు నిబంధనలు విధిస్తూ సరŠుయ్యలర్లు జారీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ విధించినా కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం మార్చి 29 నుంచి మే 31 వరకు సెలవులు ఇచ్చి జూన్ 1న కాలేజీలను పునః ప్రారంభించాలి. మొదటి విడత ప్రవేశాలను అప్పుడే నిర్వహించాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలు అంతకు ముందే వేసవి సెలవుల్లోనే చేపడుతున్నాయి. ఒక్కో సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది చొప్పున ఎన్ని సెక్షన్లకు అనుమతి ఉంటే అంత మందిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉన్నా పరిమితికి మించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. రిజర్వేషన్లకు చెల్లుచీటీ నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29% సీట్లు ఇవ్వాలి. అందులో బీసీ(ఏ) 7%, బీసీ(బీ) 10 శాతం, బీసీ(సీ) 1%, బీసీ(డీ) 7 శాతం, బీసీ(ఈ)కి 4% చొప్పున సీట్లు ఇవ్వాలి. దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలి. ఈ నిబంధనలను కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో ప్రవేశాలతో ఫీజుల దందాకు తెర ఇంజనీరింగ్ మాదిరిగానే ఆన్లైన్లో ప్రవేశాల విధానాన్ని తెస్తే ప్రైవేట్ కాలేజీల అరాచకాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఫీజులను కూడా ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా సంబంధిత కాలేజీలకు చెల్లించేలా ఏర్పాటు చేస్తే అడ్డగోలు వసూళ్లకు తెర పడుతుందని, ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారానికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం లేదు. చీమల పుట్టల్లా హాస్టళ్లు... ఒకవైపు లెక్కకు మించి ప్రవేశాలను కల్పిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీలకు అనుబంధంగా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రవేశానికి నిబంధనల ప్రకారం డేస్కాలర్లకు రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైనే గుంజుతున్నాయి. ఇక హాస్టళ్లలో చేరేవారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పిండుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
విలువైన విద్యా.. విలువల విద్యా?
లక్షలు ఖర్చుపెట్టి కార్పొరేట్ కాలేజీల్లో అధిక శాతం మార్కులు, ర్యాంకులు సాధించడం అవసరమా? నైతిక విలువలు, మానవీయ వ్యక్తిత్వం, సృజనాత్మకతతో కూడిన విద్య అవసరమా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నేటి సగటు విద్యార్థిది. కేవలం ర్యాంకులు, మార్కులు, ఆంగ్ల భాషా నైపుణ్యాలుంటే ఐదంకెల ఉద్యోగం దొరుకుతున్న ఈ రోజుల్లో వ్యక్తిత్వం, విలువల గురించి మాట్లాడటం అమాయకత్వమే అవుతుందేమో! మనందరం మర్చిపోతున్న విషయమిది. తెలివి తేటలకు, ప్రతిభకు కొలమానం ఏంటి? సంపన్నులైన తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి అంతర్జాతీయ పాఠశాలలు/కళాశాలల్లో చదివిస్తూ, ట్యూషన్లు, పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తే చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థి ప్రతిభావంతుడా? ఏ అవకాశాలు లేకుండా.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అరకొర వసతులతో, ఓ మోస్తరు మార్కులతో ఉత్తీర్ణులైన వారు ప్రతిభావంతులా? దేశంలో రెండో వర్గపు దురదృష్టవంతులే ఎక్కువ. ఈ ర్యాంకుల గొడవ ఈనాటిది కాదు. బ్రిటిష్ వారు మన దేశంలో విద్యావ్యవస్థను స్థాపించినప్పటినుంచి కేవలం రెండు తరగతులే ఉండేవి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాసులో పాసవ్వాలంటే ఆంగ్లేయ వలస విధానాలకు అనుగుణమైన పాఠ్యాంశాలను బట్టీపట్టాలి. ఈ విధానాలను అందుకోలేక వెనుకబడిన భారతీయుల కోసం ధర్డ్ క్లాస్ అనే మరో తరగతిని సృష్టించారు. చదువుకునే కూలీలను తయారు చేసి వారి అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికే ఈ మూడో తరగతి పనికొచ్చేది. నేటికీ ఇదే విధానం కొనసాగుతూ చదువుకున్న కూలీల సంఖ్యే దేశంలో ఎక్కువగా ఉంది. వీరెవ్వరికీ సృజనాత్మకత, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విలువలు, నైతికత, నిజాయితీ, సామాజిక బాధ్యత వంటివి తెలీవు. అందుకే మనలో లేని విలువలను, నైతికతను, నిజాయితీని, మానవీయ గుణాలను మనపిల్లల్లో చూడాలనుకోవడం అవివేకం కాదా? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను చూశాం. అత్యధిక ర్యాంకులను సాధించిన విద్యా సంస్థలను చూశాం. అత్యున్నత బోధనతో అత్యధిక మార్కుల సాధనకు కృషి చేసే ఉపాధ్యాయులను చూశాం. కానీ మంచి వ్యక్తిత్వం, విలువలు, సృజన, బాధ్యత గల విద్యార్థులను రూపొందించే ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, తల్లిదండ్రులు నేడు అరుదుగా కనబడుతున్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులే ఎక్కువగా దోషులుగా నిలబడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలలో అధికశాతం వీరిదే. మన పిల్లల్లో నేర, హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం వీరికెక్కడా విలువలు గురించి ఆలోచించే సమయం, అవసరం లేకపోవడమే. ఉమ్మడి కుటుం బాలు కనుమరుగవడంతో పిల్లలను కనిపెట్టుకుని సరైన దారిలో నడిచేటట్టు చూసేవారు లేకుండా పోయారు. నేడు పిల్లలు తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం పెద్దల పర్యవేక్షణ లేకపోవడమే. ఇటీవల హర్యానాలో 16 ఏళ్లున్న ఇంటర్మీడియట్ విద్యార్థి.. పాఠశాల ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చి చంపాడు. కారణం హాజరు తక్కువగా ఉన్నం దుకు ప్రిన్సిపల్ హెచ్చరించటంవల్ల, అందరి ముందూ పరువు పోయిందని భావించటం. గుర్గావ్కు చెందిన 7వ తరగతి విద్యార్థి తన తరగతి ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆ మొత్తం సంఘటనను ఫేస్బుక్లో ఉంచటం అతనిలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేటి తరం విద్యార్థుల్లో పెద్దవారి పట్ల గౌరవ భావం, ఉపాధ్యాయులపట్ల భక్తిశ్రద్ధలు, తోటివారితో సంతోషంగా మెలగటం వంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియక పోవటం దురదృష్టం. స్మార్ట్ఫోన్ల శకంలో తామొక మానవ సమూహంలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేటి తరానికి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావటంవల్ల చూడకూడనివి చూస్తున్నారు. నేర్వకూడనివి నేర్చుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలను నియంత్రించటం భౌతి కంగా అయ్యే పని కాదు. కేవలం విలువల ప్రాధాన్యత తెలియ చెప్పటం ద్వారా పరిణతి చెందిన ఆలోచనలతో స్వీయ నియంత్రణను అలవర్చుకుంటారు. ముఖ్యంగా నేటి తరానికి కష్టం అంటే ఏమిటో తెలియదు. విలాసవంతమైన, సుఖమయ జీవనం వీరి సొంతం. ఒకసారి సౌకర్యవంతమైన జీవన పరిధి దాటి బయటకొచ్చినప్పుడు విలువల్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఓర్చుకోవాలంటే గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. విలువలు లేని విద్యతో వాటిని నాశనం చేసుకుంటే మున్ముందు మనిషనేవాడు కనపడడు. ఇప్పటికే ఎటు చూసినా మృగయా వినోదపు ఘీంకారాలు నలుదిశలా మ్రోగుతున్నాయి. వాటికి చరమగీతం పాడాలంటే విలువలతో కూడిన విద్యను మన ముందు తరాలకు అందించటానికి నడుం బిగించాలి. వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొబైల్ : 78931 11985 -
వెట్టి కన్నా ఘోరం
సాక్షి, అమరావతి : అక్కడ పని వెట్టి కన్నా ఘోరం. చట్టాలు, నియమ నిబంధనలూ అస్సలు పట్టవు. ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో... ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇచ్చే వేతనాలూ అరకొర... అవీ ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణం. లైంగిక వేధింపులు షరా మామూలే. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన సెలవులు వీరికి వర్తించవు. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తరగని ఈ వెతలు ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందివి. నియమాలు చట్టుబండలు... రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కేవలం హైస్కూలు స్థాయి వరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కువ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ ఇలా ఇతర కాలేజీలన్నీ అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. విద్యార్ధులూ ప్రభుత్వ సంస్థల్లో కన్నా ప్రైవేటులోనే అత్యధికంగా ఉన్నారు. వీరి నుంచి కోట్ల కొద్దీ సొమ్మును ఫీజుల రూపేణా వసూలు చేస్తున్న ఈ సంస్థలు.. సిబ్బందికి చెల్లించేది మాత్రం నామమాత్రమే. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నట్లు అంచనా. సిబ్బంది గురించి స్పష్టమైన గణాంకాలను ఆయా సంస్థలు ఇవ్వకుండా రికార్డులను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు వేలల్లో∙ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 61 వేల బడుల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే అయినా మొత్తం 72 లక్షల మందిలో సగం వీటిల్లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌లో 9 లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో కేవలం 2 లక్షల మందే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. మిగిలిన వారు ప్రైవేటులోనే ఉన్నారు. డిగ్రీ కళాశాలల విషయంలోనూ ఇదే పరిస్థితి. దయనీయ పరిస్థితులు బీఈడీ, ఎంఈడీ సహా పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇచ్చేది రూ.10 నుంచి రూ.15 వేలే. అదికూడా 10 నెలలే. ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి టీచర్లను బయటకు పంపేస్తున్నారు. సీనియారిటీ పెరిగిన ఉద్యోగులకు వేతనాలుపెంచాల్సి వస్తుందన్న కారణంతో అకారణంగా ఉద్యోగం మానిపిస్తున్నారు. స్కూల్/కాలేజీల్లో పిల్లల్ని చేర్పించే టీచర్ల మీదే మోపుతున్నారు. ఇందులో టార్గెట్లు చేరుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీçసుకొని, ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆదివారాలు, పండగలు, జాతీయ పర్వదినాల్లోనూ సిబ్బందికి సెలవు ఇవ్వరు. సరైన వసతులు ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిల్చునే పనిచేయాలి. మహిళల పరిస్థితి మరీ దారుణం.. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. మెటర్నీటీ లీవులు లేవు. నిండు గర్భంతో ఉన్నా విధులకు రావాల్సిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్ధులే కాదు టీచర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చట్టం ఏం చెబుతోందంటే... ప్రభుత్వ పాఠ్యప్రణాళికను, పాఠ్యాంశాలను, సమయవేళలను తప్పనిసరిగా అనుసరించాలి. విద్యాసంస్థలను వ్యాపార దృక్పథంతో నడపరాదు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను టీచర్లకు, సిబ్బందికి వర్తింపచేయాలి. ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు, 15 శాతం స్కూలు నిర్వహణకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించడానికి వినియోగించాలి. ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించే అధికారం యాజమాన్యానికి లేదు. విధి నిర్వహణలో సరిగా లేకుంటే ఇంక్రిమెంట్ల కోత, సీనియార్టీ తగ్గింపు, అలవెన్సుల్లో కోత, వంటివి విధించవచ్చు. -
భద్రతలేని బతుకులు..!
సాక్షి, అమరావతి: అక్కడ ఉద్యోగం వెట్టి కన్నా ఘోరం.. ఉద్యోగం దినదిన గండం.. ఇచ్చే అరకొర జీతాలు ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక.. మహిళల పరిస్థితి మరీ అధ్వానం.. లైంగిక వేధింపులు సరేసరి.. ప్రత్యేక పరిస్థితుల్లో సెలవులు ఉండవు. గర్భవతులకు, బాలింతలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సెలవుల మాటేలేదు.. ఎవరైనా ప్రశ్నిస్తే అంతే సంగతులు, ఇంటికి పంపేస్తారు. కొన్నిచోట్ల పోలీసులతో బెదిరింపులు.. ఇదీ రాష్ట్రంలోని అనేక ప్రైవేటు విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం. చట్టంలో ఎన్ని నిబంధనలున్నా ఈ సంస్థలకు పట్టవు. చట్టాలు వారికి చుట్టాలు. ప్రభుత్వాధికారులు కూడా అంతే. చూసీచూడనట్లు పోతారు. ఫలితంగా సిబ్బంది దశాబ్దాల తరబడి దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ సంస్థలు సిబ్బందికి మాత్రం మొక్కుబడిగా జీతాలిచ్చి శ్రమదోపిడీ, మేథో దోపిడీకి పాల్పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యంలో 16,684 స్కూళ్లు, 3,300 ఇంటర్మీడియెట్ కాలేజీలు.. 1,400 డిగ్రీ కాలేజీలతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ, ఇలా పలు కోర్సులు నిర్వహించే ప్రైవేటు విద్యా సంస్థలూ అన్నీ కలిపి 3,500 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 61వేల పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే. అలాగే, మొత్తం 72 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 40లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే చదువుతున్నారు. ఇంటర్ కాలేజీల్లోని మొత్తం 9 లక్షల మంది విద్యార్థుల్లో 2–3 లక్షల మందే ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా అంతా ప్రైవేటులోనే ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ విద్యార్ధుల నుంచి కోట్లలో ఫీజులు వసూలుచేస్తున్న యాజమాన్యాలు తమ సిబ్బందికి చెల్లించే జీతాలు మాత్రం నామమాత్రం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో దాదాపుగా 5 లక్షల మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరికి ఎక్కడా కనీస వేతన చట్టాన్ని అమలుచేస్తున్న దాఖలా లేదు. ఉ.8 నుంచి రాత్రి 8 వరకు వీరి పనివేళలు. వీరికి ఉద్యోగ భద్రత అనేదే లేదు. సిబ్బంది, విద్యార్థుల సంఖ్యల్లో దొంగలెక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అసలు పట్టించుకోరు. టీచర్ల దయనీయ పరిస్థితులు – బీఈడీ, ఎంఈడీ సహ పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇక్కడ ఇచ్చేది 10 నుంచి 15 వేలు మాత్రమే. కొన్ని సంస్థల్లో 5 వేలకన్నా తక్కువ వేతనమే ఉంటోంది. ఏడాది అంటే ఈ యాజమాన్యాల దృష్టిలో కేవలం 10 నెలలు మాత్రమే. – రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ద్వారా నిర్దేశించిన సిలబస్ కానీ, పాఠ్య ప్రణాళిక, క్యాలెండర్ కానీ వీటికి పట్టవు. – ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి ఆ తర్వాత పలుచోట్ల టీచర్లను బయటకు పంపేస్తున్నారు. – స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించడం, వారిని స్కూలుకు రప్పించడం టీచర్లదే బాధ్యత. విద్యార్థుల సంఖ్య తగ్గితే టీచర్లకు జీతాలుండవు. అనేకచోట్ల వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. – టీచర్ల నుంచి ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రామిసరీ, నోటు, ఖాళీ చెక్కులు తీసుకుంటూ తరువాత వాటిని చూపించి బెదిరిస్తున్నారు. – ఒక రోజు సెలవు కావాలని అడిగినా.. అనారోగ్యం ఉన్నా సెలవులు ఇచ్చే పరిస్థితిలేదు. వేసవిలో ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు. సెలవు పెడితే జీతం కట్టే. మహిళల పరిస్థితి మరీ దారుణం ప్రైవేట్ సంస్థల్లో మహిళా టీచర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చట్టబద్ధంగా ఉన్న మెటర్నీటీ లీవులు ఉండవు. నిండు గర్భంతో ఉన్నా రావలసిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. నడి వేసవి అయినా పిల్లల్ని చేర్పించడానికి వీధివీధి తిరగాలి. ఇందుకయ్యే ఖర్చులు టీచర్లే భరించుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు. ప్రభుత్వం అంటే లెక్కేలేదు వేసవిలో ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు తరగతులు నిర్వహించరాదు. కానీ, ప్రైవేటు విద్యాసంస్థలు వీటిని అస్సలు పట్టించుకోవు. 9వ తరగతి పిల్లలకు టెన్త్ పాఠాలు, 10 వారికి ఇంటర్ ఫస్టియర్, ఫస్టియర్ వాళ్లకు సెకండియర్, సెకండయర్ వాళ్లకు ఎంసెట్ తదితర కోచింగ్‌లు పెడుతున్నాయి. టీచర్లకు వేతనమే తప్ప ఇతర అదనపు ప్రోత్సాహకాలూ ఉండవు. ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్య ప్రణాళికను, సిలబస్‌ను, క్యాలెండర్‌ను ఏమాత్రం గౌరవించవు. తమ సొంత సిలబస్‌ను, క్యాలెండర్‌ను అమలుచేస్తున్నాయి. పాఠ్యాంశాలకన్నా ఇతర కోచింగ్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ చివర్లో పాఠ్యాంశాలను చెప్పిస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్థులే కాకుండా టీచర్లూ ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. ప్రావిడెంటు ఫండ్‌ను టీచర్ కట్టిన దానికి సమానంగా సంస్థ భరించాలి. కానీ, రెండింటినీ టీచర్ జీతం నుంచే కట్ చేస్తున్నారు. వాటినీ సక్రమంగా జమచేయడం లేదు. కొన్నిసార్లు తప్పుçడు పేర్లతో జమచేస్తున్నారు. చివరకు ఆ ప్రావిడెంటు ఫండూ టీచర్ల చేతికి రావడంలేదు. గ్రాట్యుటీ వంటివి అసలే లేవు. చట్టం ఏం చెబుతోందంటే... – ప్రభుత్వ స్కూళ్లలోని సిబ్బందికి వర్తించే నియమావళినే ఇక్కడా పాటించాలి. – ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య ప్రణళికను, పాఠ్యాంశాలను తప్పనిసరిగా అనుసరించాలి. – పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను వర్తింపజేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమచేయాలి. – ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను కచ్చితంగా పాటించాలి. – గవర్నింగ్ బాడీ నిర్ణయించిన మేరకు సిబ్బందికి జీతాలు చెల్లించాలి. – వసూలైన ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు. 15 శాతాన్ని స్కూలు నిర్వహణకు ఖర్చుచేయాలి. 15 శాతం స్కూలు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించాలి. – ఉద్యోగుల్ని డిస్మిస్ చేయడం, తొలగించడం నిర్ణీత ప్రక్రియల్లో మాత్రమే చేపట్టాలి. మా బతుకులు దుర్భరం ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోదన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కనీస వేతనాలు చెల్లించడంలేదు. ఉద్యోగ భద్రత అసలే లేదు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ, గ్రూప్ ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ వంటివీ లేవు. ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. పిల్లలను చేర్పించకపోతే స్కూలుకు రావద్దని చెబుతున్నారు. అర్థంతరంగా తొలగిస్తుండడంతో కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తోంది. సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు. వేసవిలోనే కాదు ఏ ఇతర సెలవులూ ఇవ్వడంలేదు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – డి. అంబేద్కర్, భరత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
కల్పిత కొలువులు!
నెల్లూరు నగరానికి చెందిన ఒక విద్యార్థి (పేరు వెల్లడించడానికి ఇష్టపడని) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగం పొందేందుకు ఆ కళాశాల యాజమాన్యానికి రూ. లక్ష చెల్లించాడు. ఉద్యోగం వస్తుందని బంధు, మిత్రులకు చెప్పి సంబరపడిపోయాడు. అయితే కొద్ది రోజులకే ఇంటికి చేరడంతో అదేమని అడిగితే నష్టపోయానని, నాలాగా ఎందరో ఉన్నారని వాపోయాడు. ప్రాంగణ ఎంపికల సమయంలో ఉపాధి ఏ విధంగా ఉంటుందో, విధులు ఏమిటో సంబంధిత కంపెనీ ప్రతినిధులు వివరించారు. తీరా చేరిన తర్వాత ముందు చెప్పిన దానికి, ఇచ్చే వేతనానికి, పనికి పొంతన లేకపోవడంతో వెనక్కి వచ్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రీతిలో మోసపోయిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికి ఆయా కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు (టౌన్) : ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్య అంటే క్రేజీగా ఉండేది. ప్రస్తుతం కొంత మేర ప్రాధాన్యత తగ్గినా మెజార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్ వైపే చూస్తున్నారు. నాలుగేళ్లు చదువు పూర్తయిందంటే యువ ఇంజినీర్ చూపులన్నీ ఉపాధి వైపే ఉంటాయి. ఈ డిమాండ్‌ను మెజార్టీ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. క్యాంపస్ సెలెక్షన్స్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందులో పాల్గొనేందుకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం విస్తృత ప్రచారానికి కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. బోగస్ కంపెనీలు, డబ్బా కంపెనీలతో గొప్ప కంపెనీలుగా భ్రమింప చేసి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి (అంతా పకడ్బందీగా) ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. తీరా ఉద్యోగ ఒప్పంద పత్రాలు తీసుకుని ఉద్యోగాలకు వెళ్లితే కానీ.. ఆయా కంపెనీల డొల్లతనం బయటపడుతుంది. చదివిన చదువుకు, అక్కడి ఉద్యోగ బాధ్యతలకు పొంతన లేకపోవడంతో కొద్ది నెలల్లోనే ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకుని.. తిరిగి ఇంటికి రాలేక ఇంకొందరు అరకొర జీతాలకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలకు వేట సాగిస్తున్నారు. సాధారణంగా చివరి సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉద్యోగం కల్పించే దిశగా కళాశాలల యాజమాన్యాలు దృష్టి సారిస్తాయి. అందుకు దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆయా కంపెనీలకు అవసరమైన ఇంజినీర్లను ఎంపిక చేసుకునేందుకు ఆయా కళాశాలలకు వచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తుంటాయి. నిజమైన, గుర్తింపు ఉన్న కంపెనీలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పి యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్‌ను డొల్ల కంపెనీలకు తాకట్టుపెడుతున్నాయి. ఇటీవల కాలంలో కళాశాలలకు వచ్చే కంపెనీలను పరిశీలిస్తే ఏఏ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయో, కంపెనీ వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతుండటం చర్చనీయింశంగా మారింది. కొందరికే అవకాశం జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో చాలా మంది ఉత్తీర్ణత కావడం లేదు. ప్రతిభ ఉన్న విద్యార్థులను మాత్రమే కొన్ని కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల వైపు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు కన్నెత్తి చూడకపోయినా, మా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుని వచ్చే ఏడాదికి అడ్మిషన్లుకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ ఎంపికలంటే మౌఖిక పరీక్ష, వ్యక్తిత్వ వికాసం వంటివి కొలమానం కాదని, నేరుగా డబ్బులు చెల్లిస్తే సరిపోతాయంటూ మోసం చేస్తున్నాయి. రూ.15 వేలకు పైగానే .. ప్రాంగణ ఎంపికలు అనగానే ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నూతనోత్సవం వస్తుంది. దీన్ని పెట్టుబడిగా మలుచుకునేందుకు కొన్ని కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంగణ ఎంపికలకు అడ్మిషన్ చార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు రూ. 50 వేలు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయిని విద్యార్థులే చెబుతున్నారు. అంత ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ముందుగా కొంత మొత్తంను చెల్లించితే వెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుందని, లేకంటే కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఉపాధి పొందడం కష్టమని చెబుతున్నారు. ముందే అంగీకార పత్రాలతో ముప్పతిప్పలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించే కొన్ని కంపెనీలు ముందే కొన్ని షరతులు విధిస్తున్నాయి. రెండేళ్ల పాటు వారి కంపెనీలోనే పనిచేయాలని, ఎక్కడికి పంపితే అక్కడే ఉండి ఉద్యోగం చేయాలని అంగీకార పత్రాలను విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా రాయించుకుంటున్నారు. కంపెనీలో చేరిన తర్వాత తొలి నెల జీతం తమ అకౌంట్ల్లో వేయాలని విద్యార్థితో రాయించుకుంటున్నారు. ఇది పలువురు విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఒక వేళ ఆ కంపెనీలో ఉద్యోగం నచ్చకుంటే బయటకు వచ్చే వీలుండదు. గట్టిగా కాదంటే ఒప్పందం ప్రకారం విద్యార్హత పత్రాలను వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ఉద్యోగం పేరు చెప్పి కళాశాలలకు ప్రాంగణ ఎంపికల కోసం వస్తున్న కంపెనీ వివరాలు, ఎంత వరకు వేతనం ఇవ్వగలదు, ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలో తదితర విషయాలను ముందుగానే విద్యార్థులు తెలుసుకోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో తాము ప్రాంగణ ఎంపికలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామంటూ హడావుడి చేస్తున్నాయి. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శిక్షణకు కొద్ది మొత్తాన్ని చెల్లించినా పెద్దగా నష్టం ఉండబోదంటున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, నిబంధలు పాటించడం తదితర విషయాలు తెలసుకోవచ్చు. ఉద్యోగం పేరు చెప్పి రూ.లక్షలు చెల్లించమని అడిగారంటే అది గ్యారంటీగా నకిలీ కంపెనీగా తెలుసుకోవాలని విద్యా వేత్తలు పేర్కొంటున్నారు. -
నిబంధనలకు పాతర
జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కాలేజీలు నడుపుతూ విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. దీంతో ఏపీ ఉన్నత విద్యా మండలి జిల్లాలోని 24 డిగ్రీ కాలేజీలకు నోటీసులిచ్చింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దె భవనాలు..ఇరుకైన గదులు..ఆట స్థలం లేదు..అసలు కళాశాల వాతావరణమే కనిపించదు. ఫైర్ పర్మిషన్నూ ఉండదు. అంతెందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాల్సిన ఏ ఒక్కటీ కనిపించదు. జిల్లాలో చాలా వరకు డిగ్రీ కళాశాల తాజా పరిస్థితి ఇది. ఉన్నత విద్యామండలిలో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోకపోవడంతో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వసతుల సంగతి పట్టించుకోకుండా విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 డిగ్రీ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 12 ఎయిడెడ్ కళాశాలలుండగా, 112 అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా 25 వేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు డిగ్రీ కళాశాలను అనుమతిచ్చిన ఐదు సంవత్సరాల వరకు అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా సొంత భవనాల్లోనే కళాశాలలు నిర్వహించాలి. విద్యార్థులకు సరిపడా గదులుండాలి. ఆట స్థలం ఉండాలి. ఫైర్ సర్టిఫికెట్, కళాశాలలో పనిచేసే బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా 24 రకాల వసతులు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే డిగ్రీ కళాశాలలు అనుమతులను కొనసాగించాల్సి ఉంది. అయితే చాలా మటుకు కళాశాలలు అద్దె భవనాలు, ఆట స్థలాల్లేని ఇరుకైన గదుల్లో కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు అపార్టుమెంట్లు తీసుకొని ఎక్కడపడితే అక్కడే కళాశాలలు నిర్వహిస్తున్నారు. కళాశాలలకు ఆట స్థలం దేవుడెరుగు. విద్యార్థులు తెచ్చుకునే సైకిళ్లు, బైకుల్లాంటి వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలాల్లేని కళాశాలలు కోకొల్లలు. ఇక విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వసతులు, నాణ్యమైన విద్యాబోధన సంగతి గాలికొదిలేశాయి. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లోనే విద్యనభ్యసించాల్సి వస్తోంది. అన్ని వసతులతో కళాశాలలుండాలని ఏపీ ఉన్నత విద్యామండలి పలు డిగ్రీ కళాశాలలకు చాలాసార్లు మొక్కుబడిగా నోటీసులు జారీ చేయడం మినహా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. దీంతో యాజమాన్యాలు వారిని ఖాతరు చేయడం లేదు. కొందరు ఉన్నతాధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యాజమాన్యాలు పని చక్కబెట్టుకుంటున్నాయి. 24 కళాశాలలకు నోటీసులు: నిబంధనల మేరకు సొంత భవనాల్లో కళాశాలలు ఎందుకు నడపడం లేదంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఒంగోలు 3 డిగ్రీ కళాశాలలు, సంతనూతలపాడు 1, తర్లుపాడు 1, మార్కాపురం 2, మార్టూరు 1, మేదరమెట్ల 1, దర్శి 2, చీమకుర్తి 1, కంభం 2, గిద్దలూరు 1, కొమరోలు 1, చీరాల 2, పర్చూరు 1, కనిగిరి 1, బేస్తవారిపేట 1, అద్దంకి 1, యర్రగొండపాలెం 1 మొత్తం 24 కళాశాలలకు ఏపీ ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చిక్కుల్లో పడ్డాయి. ఉన్నత విద్యామండలి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే పలు డిగ్రీ కళాశాలలపై చర్యలు తప్పని పరిస్థితి. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి డిగ్రీ కళాశాలలు నిబంధనల మేరకు సొంత భవనాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంది. అలా కాకుండా అద్దె భవనాల్లో అక్రమంగా కళాశాలలు నిర్వహించటంతోనే చివరికి ఈ పరిస్థితి తలెత్తింది. ఆన్‌లైన్‌తో తిప్పలు ఉన్నత విద్యామండలి డిగ్రీ కళాశాలల వివరాలను ఈ ఏడాది నుంచి ఆన్లైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ శామ్స్‌తో అనుసంధానమైన ఉన్నత విద్యామండలి మొత్తం వివరాలను ఈ నెల 5 నుంచి ఆన్లైన్ చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం డిగ్రీ కళాశాలలకు సంబంధించిన కళాశాల డాక్యుమెంట్స్‌తో పాటు భవనం, గదుల వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. గదులకు సంబంధించి పంచాయతీరాజ్ లేదా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఇంజినీర్లతో సర్టిఫై చేయించి సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టాలి. గ్రౌండ్ వివరాలతో పాటు బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్లో పెట్టాలి. ఫైర్ సర్టిఫికెట్ చూపించాలి. మొత్తంగా 24 కాలమ్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని కమీషన్ ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే కళాశాలలకు అనుమతులు లభిస్తాయి. -
నీ ఇష్టం.. ఎలాగైనా పరీక్ష రాసుకో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వివిధ కారణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్లను అర్ధాంతరంగా ఆపేసిన విద్యార్థులకు ఒకే సిట్టింగ్‌లో ఆయా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్). కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ కావడంతో ఎన్ఐవోఎస్ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా ఎన్‌ఐవోఎస్‌లో పనిచేసే కొందరు అక్రమాలకు తెరలేపారు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బుధవారం నుంచి విశాఖలోని ఆరు కేంద్రాల్లో ఎన్ఐవోఎస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి.. ద్వారకానగర్ సమీపంలోని శ్రీ కాశ్యప్ కళాశాలకు వెళ్లగా పరీక్షలు ఇష్టారాజ్యంగా జరుగుతున్న సంగతి వెలుగుచూసింది. ప్రైవేటు కళాశాలల్లో పరీక్షలు వాస్తవానికి.. ఎన్ఐవోఎస్ పరీక్షలను కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించాలి. కానీ విశాఖ ఎన్ఐవోఎస్ కేంద్రం నిర్వాహకులు మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిచ్చారు. ఈ ఏడాది విశాఖ ద్వారకానగర్ సమీపంలోని శ్రీ కాశ్యప్ జూనియర్ కళాశాల, ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని మినర్వా స్కూల్, సబ్బవరం బీఎంకే కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడంతా గప్‌చుప్ ఈ నెల 4 నుంచి సీనియర్ సెకండరీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఫిజిక్స్, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి పరీక్షా సమయం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. అయితే శ్రీ కాశ్యప్ కాలేజీలో ఉదయం పదిన్నర గంటల నుంచే ‘మూకుమ్మడి’ పరీక్షలు నిర్వహించేశారు. మూడంతస్తుల చిన్న బిల్డింగ్‌లో కళాశాల నిర్వహిస్తున్న నిర్వాహకులు.. ఇతరులెవరూ లోనికి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం సేకరించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిని కనీసం కళాశాలలోకి కూడా ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఎలాగోలా లోనికి వెళ్లి కళాశాల డైరెక్టర్ నారాయణమూర్తిని కలసి పరీక్షల తీరును ప్రస్తావించగా.. స్క్వాడ్ రాకుంటే విద్యార్థుల ఇష్టమే.. తనిఖీలకు ఎవరూ రాకుండా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థులతో మాట్లాడగా.. ‘పరీక్ష ఏముందండి.. ఎన్ఐవోఎస్ అడ్మిషన్ ఫీజు రూ.2500, పరీక్ష ఫీజు రూ.3500.. ఈ సెంటర్లో ఎగ్జామ్ రాసేందుకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలు ఇస్తే ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది’ అని చెప్పడం గమనార్హం. -
కోర్సుల వారీగానే మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వరుసగా మూడేళ్లపాటు 25 శాతం ప్రవేశాలు లేని కాలేజీలపై చర్యల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఉన్నత విద్యా మండలి తర్జనభర్జన పడుతోంది. 25% ప్రవేశాలను కోర్సుల వారీగానే చూడాలా? కాలేజీల వారీగా చూడాలా? అన్న విషయంలో కొంత ఆలోచనల్లో పడింది. అయితే కాలేజీల వారీగా చూస్తే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనకు వచ్చింది. దీంతో వరుసగా మూడేళ్లలో 25% లోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లోనే ఈసారి ప్రవేశాలకు అనుమతించవద్దన్న అభిప్రాయానికి వచ్చింది. అదే విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇచ్చిన ఉన్నత విద్యామండలి గతంలో ప్రవేశాలు లేవని, ఇప్పుడు కోర్సులకు ఎలా అనుమతి నిరాకరిస్తారన్న విషయంలో కొంత గందరగోళం నెలకొంది. గతంలో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రవేశాలు జరగవని ఎలా ముందుగానే ఊహించి నిర్ణయం తీసుకుంటారన్న వాదనను యాజమాన్యాలు తెరపైకి తెచ్చాయి. దీంతో వర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనల్లో పడ్డాయి. ప్రవేశాలు పూర్తయ్యాక వాటిల్లో చేరిన విద్యార్థుల తరలింపు అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపు ప్రవేశాలు ఉన్న కోర్సులకు వర్సిటీల స్థాయిలోనే అనుబంధ గుర్తింపును నిరాకరించాలన్న ఆలోచనలకు వచ్చాయి. ఈనెల 19న జరిగే వైస్ చాన్స్లర్ల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. నెలాఖరులోగా అనుబంధ గుర్తింపు ప్రస్తుతం రాష్ట్రంలో 51 కాలేజీల్లో వరుసగా మూడేళ్లలో ఒక్క విద్యార్థి చేరకపోగా, మరో 200 కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్నాయి. వాటన్నింటిపై త్వరలోనే విధానపర నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈలోగా ఆ ప్రక్రియ పూర్తయితేనే మే 8వ తేదీన డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయవచ్చని యోచిస్తోంది. -
చితుకుతున్న చిన్న కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: 2014–15లో రాష్ట్రంలో 2,560 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండేవి.. 2015–16 వాటి సంఖ్య 2,259కి తగ్గిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 301 కాలేజీలు మూత పడ్డాయి! 2016–17 విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 1,842కు తగ్గింది. ఏకంగా 417 కాలేజీలు మూతపడ్డాయి. 2017–18 విద్యా సంవత్సరం నాటికి 1,733కు తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. ఈసారి కూడా పెద్దసంఖ్యలో ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితే కనిపిస్తోంది. కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడలేకపోవడమే ఇందుకు కారణం. నాలుగేళ్లలో 827 కాలేజీలు.. ఆకర్షణీయ ప్రకటనలు, ర్యాంకుల ప్రచార హోరులో సాధారణ ప్రైవేటు కాలేజీలు బడా కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఆ సంస్థల దెబ్బకు మూత పడుతున్నాయి. నాలుగేళ్లలో 827 కాలేజీలు మూతపడినట్లు ఇంటర్మీడియట్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం మరిన్ని మూతపడే పరిస్థితి నెలకొంది. కొంత ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులంతా కార్పొరేట్ కాలేజీలు ప్రచారం చేసే ఎంసెట్, జేఈఈ, ఐఐటీ ర్యాంకుల ఆకర్షణకు లోనై లక్షలు వెచ్చించి పిల్లలను వాటిల్లో చేర్చుతున్నారు. ఐఐటీ ర్యాంకుల కోసం అప్పులు చేసి మరీ కార్పొరేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రచార హోరును తట్టుకోలేక, పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించలేక సాధారణ, చిన్న గ్రామీణ కాలేజీలు క్రమంగా మూత పడుతున్నాయి. కార్పొరేట్ కాలేజీల కోసం పీఆర్వోలు కార్పొరేట్ వ్యవస్థలో విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్తగా పీఆర్వో విభాగం మొదలైంది. పట్టణాల వారీగా పీఆర్వోలను నియమించుకుంటున్నాయి. ఈ పీఆర్వోలు పదో తరగతి పరీక్షలకు ముందే ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరించి నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడి కాలేజీల్లో చేర్పించేలా ఒప్పిస్తున్నారు. ఐఐటీ, నిట్ విద్యాసంస్థల మోజులో ఉన్న తల్లిదండ్రులు ఆ కార్పొరేట్ కాలేజీల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా చూసుకోకుండా పిల్లల్ని చేరుస్తున్నారు. వారి ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు అనుమతులు తీసుకోకుండానే కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ.. ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతున్నాయి. దీంతో కార్పొరేట్ దందా ఏటే పెరిగిపోతూనే ఉంది. వాటిల్లో ఎన్నో లోపాలు: ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తనిఖీల్లో కార్పొరేట్ కాలేజీల లోపాలు అనేకం బయటపడ్డాయి. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు చెందిన 146 కాలేజీల హాస్టళ్లు (రంగారెడ్డిలో 35, మేడ్చెల్‌లో 51, హైదరాబాద్‌లో 60) జైళ్లలా ఉన్నాయని తనిఖీల్లో తేల్చారు. ఆయా కాలేజీలు, హాస్టళ్లలో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయడం లేదు. సమయపాలన లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో చదివిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఈసారి మిగిలేవెన్నో... 2018–19 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,684 కాలేజీలు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నా అందులో 760 కాలేజీలు ఇంకా ఫీజు చెల్లించలేదు. 924 ప్రైవేటు కాలేజీలే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించాయి. ఆలస్య రుసుంతో ఈ నెల 20 వరకే గడువు ముగిసింది. ఇపుడు ఫీజు చెల్లించని ఆ 760 కాలేజీల పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. అందులో 350 కాలేజీలకు పక్కా భవనాలు లేవని ఇదివరకే ఇంటర్ బోర్డు తనిఖీల్లో వెల్లడైంది. అవన్నీ రేకుల షెడ్డుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగింది. దీంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందుల్లో పడతారన్న ఉద్దేశంతో.. ఆ కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈసారి మాత్రం ఇచ్చేది లేదని డిసెంబర్లోనే స్పష్టం చేసింది. దీంతో ఆ 350 కాలేజీలు ఆన్లైన్ అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసినా.. వాటిలోని విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు వెళ్లిపోతుండటంతో ఫీజును చెల్లించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆ కాలేజీలు మూత పడే పరిస్థితి నెలకొంది. -
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన పలు బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్పొరేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలని రైతులు అప్పులు చేసి కార్పొరేటు కాలేజీల్లో చేర్పిస్తున్నారని చెప్పారు. కార్పొరేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ఒక యాజమాన్యం కింద ఒకే విద్యాసంస్థ ఉండేలా నిబంధనలను రూపొందించాలన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు ఈ సారి నుంచే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, భూపేశ్ సాగర్ పాల్గొన్నారు. -
24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు నోటీసులు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయం నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లాలో కొనసాగుతున్న 24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్‌జీ తెలిపారు. వర్సిటీ కాలేజ్ డెవలఫ్‌మెంట్ కౌన్సిల్ డీన్ పెద్దకోట చిరంజీవులుతో ఈ సంజాయిషీ నోటీసులు అంశంపై వర్సిటీలో సోమవారం ఆయన చర్చించారు. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు, డిగ్రీ కళాశాలల పరిశీలనకు నియమించిన కమిటీలపై చర్చించారు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం నోటీసులు ఇస్తున్నామని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ ఎన్.రంగనాథ్, ఇదే విశ్వవిద్యాలయంకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎల్.జయశ్రీ, ఏపీ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ టీవీ శ్రీకృష్ణమూర్తి, ఏపీఎస్సీహెచ్ఈ అకడమిక్ సెల్ అధ్యాపకురాలు బీఎస్ సలీనా, స్థానిక బీఆర్‌ఏయా సీడీసీ డీన్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు ప్రైవేటు కళాశాలల్లో అమలవుతున్న నిబంధనలు పరిశీలించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా, చాలా కళాశాలలను నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్(పాలకొండ), స్వర్ణభారతి(ఇచ్ఛాపురం), కృష్ణసాయి(సోంపేట), పీపీఆర్‌ఎస్ కౌముది(శ్రీకాకుళం), శ్రీ సత్యా(కాశీబుగ్గ), శ్రీకుమార్(మందస), టీఎస్ఆర్(ఆమదాలవలస), అమర్(నందిగాం), శ్రీ సాయి(సరుబుజ్జిలి), శ్రీ సిద్ధార్థ(హరిపురం), కృష్ణ సాయి(కంచిలి), షిర్డీసాయి(కాశీబుగ్గ), కిరణ్మయి(పాతపట్నం), రంగముద్రి(రాజాం), రామలీల(పాలకొండ), సంస్కార భారతి(సోంపేట), శ్రీ సాయికృష్ణ(కాశీబుగ్గ), ఎస్వీజే(కవిటి), సూర్యతేజ(పలాస), శాంతినికేతన్(రణస్థలం), కౌముది(ఆమదాలవలస), శ్రీరామా(అట్టలి), శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల(శ్రీకాకుళం)కు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కళాశాలల నుంచి వివరణ సేకరించి, ఉన్నత విద్యా మండలికి సమాచారం అందజేస్తామని అన్నారు. అనంతరం వారి నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు. నిబంధనలు మేర కు ఐదేళ్లు దాటాక సొంత భవనాల్లోకి కళాశాలలు షిఫ్టు చేయాల్సి ఉంటుందని, అయితే నిబంధనలు పాటి ంచకుండా, యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా కళాశాలలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని చెప్పారు. అద్దెభవనాల్లో నిర్వహించటంతో మౌలిక వసతులు కనీసం పాటించటం లేదని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో విద్యా బోధన బలోపేతం, మౌలిక వసతులపై ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. రెండో రెక్టార్‌గా చిరంజీవులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రెక్టార్‌గా ప్రస్తుత ప్రిన్సిపాల్, సీడీసీ డీన్ చిరంజీవులును నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్టు వీసీ రామ్‌జీ చెప్పారు. రెండో రెక్టార్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించనున్నారు. జూన్ 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. గతంలో మొదటి రెక్టార్‌గా ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం రెక్టార్ పోస్టు ఖాళీగా ఉంది. -
పాలకొండలో కలకలం
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో డైట్ రెండో çసంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్తపుమడుగులో చనిపోయి ఉన్న సంఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణంలో టీచర్ కాలనీలో సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన పాలక పావని(21) తన అక్క శిరీషతో కలసి నివసిస్తోంది. శిరీష ఉద్యోగ రీత్యా నరసన్నపేట వెళ్లారు. సోమవారం విధులు నిర్వహించుకుని రాత్రి 8గంటల సమయంలో శిరీష.. ఇంటికి వెళ్లి తలుపులు తట్టగా ఎంతసేపటికీ పావని తలుపులు తీయలేదు. ఆందోళనకు గురైన శిరీష వెనుక ద్వారం నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా హతాశురలైంది. పావని వంటగదిలో రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆమె çఘటనా స్థలంలో మృతి చెందినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కె.వాసునారాయణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పావని మృతిచెందిన తీరుపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వంటగదిలో నాలుగు రకాల (వంటకు, కూరగాయలు తరిగేందుకు ఉపయోగించే) కత్తులు మృతదేహం చుట్టు పక్కల కనిపించడంతో పావని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అని సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రశాంతంగా ఉండే టీచర్సు కాలనీలో ఈ తరహా ఘటనలు మునుపెన్నడూ జరగలేదని అక్కడికుటుం బాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి నిర్ధారణకు రాలేకపోతున్నారు. రాత్రి కావటంతో మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే ఉంచి మంగళవారం పూర్తిస్థాయి దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
విద్యార్థిని మృతదేహంతో రోడ్డుపై ధర్నా
భీమ్‌గల్ (బాల్కొండ): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మం డలం చేంగల్‌లో డిగ్రీ విద్యార్థిని సాయి దీక్షిత(18) అనుమానాస్పద మృతి ఉద్రిక్తతను రేపింది. విద్యార్థిని మృతికి కారణాలను వెల్లడించాలని, కారకులను అరెస్టు చేయా లన్న డిమాండ్‌తో కాలేజీ విద్యార్థులు సోమవారం మృత దేహంతో చేపట్టిన ధర్నా రాత్రి 9 గంటల అనంతరం కూడా కొనసాగింది. సాయి దీక్షిత ఆర్మూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు వందల సంఖ్యలో మృతురాలి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఎస్సై సుఖేందర్ రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీక్షిత మృతిపై గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అనుమానాలున్నాయని మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హాస్టల్లో గంజాయి కలకలం
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బుధవారం అర్ధరాత్రి దాటాక గంజాయి దొరకడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. పట్ట ణంలోని గాయత్రి జూనియర్ కళాశాల హాస్టల్లో అర్ధరాత్రి 100 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాల ప్రకారం.. గాయత్రి కళాశాలకు సమీపంలో హాస్టల్‌ను బాలుర కోసం ఏర్పాటు చేశారు. అయితే రోజు మాది రిగానే కళాశాల విద్యార్థులు సాయంత్రం హాస్టల్‌కు వచ్చి స్టడీ అవర్స్‌లో 10.30 గంటల వరకు ఆరు బయటనే చదువుకున్నారు. కళాశాల వార్డెన్ లింగయ్య 12 కాటన్ల గంజాయిని ఓ ఆటోలో తీసుకొచ్చి కళాశాల హాస్టల్లోని విద్యార్థుల మంచాల కింద దాచి పెట్టాడు. గమనించిన విద్యార్థులు ఏమిటని వార్డెన్‌ను అడుగగా పరీక్ష పేపర్లని చెప్పి బయటికి వెళ్లాడు. విద్యార్థులకు అనుమానం వచ్చి కాటన్లను తెరిచి చూశారు. ఒక్కసారిగా గుప్పుమని గంజాయి వాసన రావడంతో అందులో ఒక విద్యార్థి వారికి తెలిసిన విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థి సంఘాల ధర్నా.. గంజాయి కళాశాల వసతి గృహంలో ఉందని తెలియడంతో టీజీవీపీ, టీవైఎస్ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల హాస్టల్‌కు వెళ్లి సుమారు 100కేజీల గంజాయి కాటన్లను బయటికి తెచ్చి ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 12 కాటన్ల గంజాయిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు 200మంది విద్యార్థులు ఉండే హాస్టల్లో గంజాయి లభ్యం కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. పరారీలో హాస్టల్ వార్డెన్.. గంజాయిని హాస్టల్లో దాచిన వార్డెన్ లింగయ్య ఈ విషయం బయటికి పొక్కడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శివశంకర్ వార్డె¯Œన్‌తో వచ్చిన వారి వివరాలను ఆరా తీశారు. గంజాయి మూలాలపై లోతుగా విచారణ చేపట్టి నిందితుడిని వెంటనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. మాకు ఎలాంటి సంబంధం లేదు : కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తమ కళాశాల హాస్టల్లో గంజాయి దొరికిందని తెలియడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాను. మూడు నెలల క్రితమే కళాశాల హాస్టల్లో వార్డెన్‌గా తేజావత్ లింగయ్యను పెట్టుకున్నాం. అయితే లింగయ్య గంజాయి దందా చేసినట్లు తెలిసింది. రాత్రి కళాశాలకు చేరుకునే సరికి వార్డెన్ లింగయ్య పరారయ్యాడు. కళాశాల యాజమాన్యానికి గంజాయికు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదంతా వార్డెన్ లింగయ్య దొరికితే బయటపడుతుంది. వార్డెన్‌పై కేసు నమోదు సూర్యాపేట క్రైం : కళాశాలలో 100 కేజీలకు పైగా గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచిన హాస్టల్ వార్డెన్ తేజావత్ లింగయ్యపై ప్రిన్సిపాల్ చామకూరి శ్రీనివాస్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్‌తెలిపారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం... అభం శుభం తెలియని విద్యార్థుల పక్కన గంజాయిపెట్టి వారి జీవితాలతో చెలగాటమాడిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా కళాశాలలోని అద్దాలు, కుర్చీలను పగులగొట్టి ధ్వంసం చేశారు. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫర్నిచర్‌ను« ధ్వంసం చేయడంతో వెంటనే సీఐ శివశంకర్ సిబ్బందితో కలిసి చేరుకొని కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్ వంశీ, అహ్మద్అలీ, చాంప్లా, అశోక్, శివ, ఠాగూర్, మణి,సాయి తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలను బహిష్కరించబోం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల బహిష్కరణ నిర్ణయాన్ని తెలంగాణ కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉపసంహరించుకుంది. పరీక్షలు యథా విధిగా జరిగేలా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను తక్షణం ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరణకు జేఏసీ పి లుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సో మవారం ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి చాంబర్లో విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణారెడ్డి, పాపిరెడ్డి, వరదారెడ్డి, నరేందర్, ఇతర నేతలు చర్చించారు. చర్చలు పూర్తిగా సఫలమయ్యాయని అనంతరం వారు మీడియాకు తెలిపారు. ‘‘మా సమస్యలను డిప్యూటీ సీఎం సావధానంగా విన్నారు. పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించారు. అందుకు మార్చి 5న భేటీ అవుతామనడం హర్షణీయం. విద్యాశాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, లేని వాటిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు’’అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఏటా 10 శాతం ఫీజు పెంపు కోరాం ప్రైవేట్ కాలేజీలలో ఫీజులను ఏటా కనీసం 10 శాతం పెంచాలని కడియాన్ని కోరినట్టు జేఏసీ నేతలు చెప్పారు. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీలకు ఒక పద్దు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, పాఠశాలలకు ఒక పద్దుగా వేరుగా నిధు లు విడుదల చేయాలని కోరాం. కాలేజీలకు గుర్తింపునివ్వడంలో సమస్యలను వివరించాం. స్కూళ్లకు, కాలేజీలకు కరెంటు చార్జీలు, ఆస్తి ప న్ను ఎక్కువగా వేస్తున్నారని చెప్పాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలను 30 ఏళ్ల నాటి భవనాలకు సరళతరం చేయాలని కోరాం. చాలా సమస్యలు నిజమైనవేనని, వాటి పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందీ లేదని కడియం చెప్పారు’’అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల బహిష్కరణ పిలుపును వెనక్కు తీసుకున్నందుకు జేఏసీ నేతలకు కడియం ధన్యవాదాలు తెలిపారు. విద్యా సంస్థల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందన్నారు. నిధుల సంబంధిత అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. -
డబ్బులు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా..
హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పదిలోనే ఇంటర్
కడప ఎడ్యుకేషన్: మీ పిల్లవాడు ఫలానా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని తెలిసింది. మీ వాడిని ఇంటర్‌కు మా కళాశాలలో చేర్పిస్తే ఫీజులో రాయితీ ఇస్తాం. పదిలో మంచి గ్రేడ్ తెచ్చుకుంటే మరింత ఎక్కువ రాయితీ ఇస్తాం అంటూ పిల్లల తల్లితండ్రులకు ఎరవేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కడప, పొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలతోపాటు పలు పట్టణాల్లో జరుగుతున్న తంతు. విద్యార్థుల తల్లితండ్రులతో ఫోన్లో కూడా చర్చలను సాగిస్తున్నారు. ఎప్పుడో జూన్‌లో మొదలయ్యే అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి వ్యవహరం సాగుతోందనే అరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఈఏడాది సుమారు 36,283 వేలమంది పదో తరగతి పరీక్షలను రాయనున్నారు. వీరిలో ఎక్కవశాతం ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరిపైన కార్పొరేట్ కళాశాలలు ప్రత్యేక దృష్టి సారించా యి. విద్యార్థులకు సంబంధించిన చిరునామాలను సేకరించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించి కళాశాలల్లో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగానే అడ్వాన్స్‌ఫీజు: కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే తమ వద్ద ఉన్న విద్యార్థులు ఇంటర్లో ఎటూ జారిపోకుం డా పదో తరగతి ఫీజు కట్టేటప్పుడే ఇంటర్‌కు కొంత అడ్వాన్స్ కట్టించుకు ని అడ్మిషన్‌ను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ముందుగా సీటు ను రిజర్వు చేసుకుంటే ఎక్కువశాతం రాయతీ ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. తరువాత ఆ కళాశాలలో చేరమంటే మా త్రం కట్టించుకున్న ఫీజును మాత్రం తిరిగి ఇవ్వరు. ఇది కూడా ప్రైవేటు కళాశాలలకు ఒక వ్యాపారమే. సిబ్బందికి టార్గెట్లు: కళాశాలలలో పనిచేసే సిబ్బందితోపాటు అధ్యాపకులకు టార్గెట్లు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వారంతా ఉద్యోగ భద్రత కోసం ఆదివారం విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, ఫీజు రాయితీల గురించి వివరిస్తున్నారు. మరి కొంతమంది పక్కవాళ్లకు కమీషన్ ఇచ్చి మరీ అడ్మిషన్లు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. పదో తరగతి అర్థ సంవత్సరం(సమ్మెటివ్–1) పరీక్షలు కూడా ప్రారంభం కాక ముందే ప్రైవేటువారు ప్రవేశాల కోసం ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ఇంటర్ అధికారులు స్పందించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం గురించి ఆర్ఐఓ వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
చెప్పుకోలేని బాధ
ప్రైవేటు కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా పరిగణించకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. తరగతుల విరామ సమయంలో చాంతాడంత క్యూలో ఇబ్బందులు పడలేక నీరు తాగడం తగ్గించుకుని అనారోగ్యానికి గురవుతున్నారు. సాక్షి, రాజమండ్రి: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జూనియర్ కళాశాలల్లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు అక్కడి వాతావరణం నివ్వెరపోయేలా చేస్తోంది. ఇరుకైన గదులు, కనిపించని పరిశుభ్రత, ప్రతి నిమిషం చదువుకే అంకితం కావాల్సిన పరిస్థితిలో విద్యార్థులు యాంత్రికంగా తయారవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రోజులో కాసేపైనా ఆటవిడుపునకు నోచుకోక పోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా కళాశాలలు, హాస్టళ్లల్లో టాయ్లెట్లు సరిపడా లేక విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే విశాలమైన తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్టాఫ్‌రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, ఆఫీసురూమ్, ఆటస్థలం, టాయ్‌లెట్స్ తప్పనిసరి. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఈ నిబంధనలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. గాలి, వెలుతురు లేని ఇరుకుగదులు, నాలుగు ట్యూబ్‌లు, ఐదు ఖాళీ బాటిళ్లతో మమ అన్పించే ల్యాబ్‌లతో నెట్టుకొస్తున్నారు. ఎంత మంది విద్యార్థులున్నా రెండే బాత్రూమ్లు. ఇక ఆట స్థలం అంటారా.. ఆ ఊసే లేదు. హాస్టల్ విద్యార్థుల పరిస్థితి ఘోరం.. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఒక్కో గదికి పది నుంచి 20 మందిని కేటాయిస్తున్నారు. గదిలో నడవడానికి సైతం దారి ఉండదు. ఒక్కోసారి మంచాలపైకి ఎక్కి నడవాల్సి ఉంటుంది. ఉదయం పూట బాత్రూమ్ కోసం బకెట్ పట్టుకుని క్యూలో నిల్చోవాలి. ఎవరికైనా అత్యవసరమైతే రిక్వెస్ట్ చేసుకుని ముందు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో విద్యార్థుల మధ్య గొడవలవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు ఫీజుల రూపంలో దండుకుంటున్న యాజమాన్యాలు.. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాత్రూమ్లు నిర్మించాలన్న ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అవన్నీ చిన్న విషయాలు.. చదువు ముఖ్యం.. అలా కాదంటే టీసీ ఇచ్చేస్తాం వేరే చోట చదివించుకోండంటూ ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి చక్కదిద్దాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మంచినీరు తాగడం తగ్గిస్తున్నారు కొంతమంది విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంటుంది. అక్కడి పరిస్థితికి జడిసి పలువురు విద్యార్థులు మంచినీరు తాగడం బాగా తగ్గించేస్తున్నట్టు సమాచారం. మరికొందరు మూత్రం ఆపుకుంటూ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతున్నా యాజమాన్యాలను అడిగే సాహసం చేయలేక పోతున్నారు. ప్రశ్నిస్తే యాజమాన్యం తమ పిల్లలను వేధిస్తుందన్న కారణంతో ఏ ఒక్కరూ సమస్య తెలిసినా మిన్నకుండిపోతున్నారు. అందరికీ అవస్థలే.. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, ఒకేషనల్ 1, సాంఘిక సంక్షేమం 12, ట్రైబల్ వెల్ఫేర్ ఆరు, రెసిడెన్షియల్, మోడల్ రెండు వంతున, 219 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం 50,332, ద్వితీయ సంవత్సరం 45,944 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. తనిఖీలు ముమ్మరం చేస్తాం ప్రైవేటు కళాశాలల్లో కొన్నిసమస్యలు మా దృష్టికి వచ్చాయి. వరుసగా కళాశాలలను తనిఖీ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. - ఎం.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం -
20 రోజుల్లో 40 మంది విద్యార్థుల ఆత్మహత్య
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు 20 రోజుల్లో 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిన నారాయణ, చైతన్య విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మాదాల నారాయణస్వామి భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం విద్యార్థులను మర యంత్రాలుగా మార్చేస్తున్నాయని విమర్శించారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థులు చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలకు చెందిన విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇంటర్‌బోర్డు కార్పొరేట్ కాలేజీల జేబు సంస్థగా మారిందని విమర్శించారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నా, ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు కొనసాగిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం వారి తల్లిదండ్రులేనంటూ ప్రభుత్వం నివేదిక సమర్పించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, ప్రొఫెసర్ నీరదారెడ్డి, చక్రపాణి కమిటీల సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎం.ధనరాజ్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు. -
ప్రైవేటు నుంచి గురుకులాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ గురుకులాలవైపు విద్యార్థులు తరలి వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో గురువారం ‘రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు’పై జరిగిన లఘు చర్చ సందర్భంగా కడియం మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థులు తరలివెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. గతంలో రాష్ట్రంలో 296 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ వచ్చాక కొత్తగా 546 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. 1.02 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ వాటిల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లోని ఆశ్రమ పాఠశాలలో నీటి వసతి లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోగా, ‘ఏమండీ... ఓపిక లేకపోతే ఎలా? పంతులై ఉండి.. ఇలాగైతే చదువు ఎలా చెబుతారు?’అంటూ షబ్బీర్ అన్నారు. దీంతో కాసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. హేతుబద్ధీకరణ, ఆశ్రమ పాఠశాలలు రావడం వల్ల ఇతర ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. గురుకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇదే అంశంపై సభ్యులు సతీశ్‌కుమార్, ఫరూక్ హుస్సేన్, బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. -
వినకపోతే క్రిమినల్ కేసులే!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న 194 కాలేజీలకు నోటీసులు జారీ చేశామని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనుకాడబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై షబ్బీర్‌అలీ, భూపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌లు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. ఈ చర్చ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల తీరుపై అధికార, విపక్ష సభ్యులు మండిపడ్డారు. వాటిని దారిలో పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కఠినంగా వ్యవహరిస్తాం.. ఆగస్టులో కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరిగిన రెండు ఘటనల నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు విచారణ జరిపిందని.. కాలేజీల తీరును గుర్తించిందని కడియం చెప్పారు. ‘‘ఉదయం 6 నుంచి రాత్రి 10.30 వరకు ఊపిరి సలపని షెడ్యూలు, వారం వారం పరీక్షలు, సెలవు రోజుల్లోనూ తరగతులు, హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం వంటివాటి కారణంగా మానసిక ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోర్డు పరిశీలనలో తేలింది. అలాంటి తీరు వద్దని ప్రభుత్వం హెచ్చరించినా.. వినని 194 కాలేజీలకు నోటీసులు జారీచేశాం. ఇటువంటి విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది..’’అని స్పష్టం చేశారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారన్న ఉద్దేశంతో సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. విద్యా సంస్థలు ఎటువంటి సూచనలు పాటించాలనే దానిపై వివరంగా మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు రాష్ట్రంలోని పలు కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కడియం తెలిపారు. వాస్తవానికి కాలేజీలు వచ్చే మార్చి 31 నాటికి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, తాము అనుమతి ఇచ్చిన తర్వాత అడ్మిషన్లు చేసుకోవాలని.. ఆ లోపు తీసుకునే అడ్మిషన్లు చెల్లబోవని స్పష్టం చేశారు. దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. రాష్ట్రంలో అవసరానికి మించి ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఉన్నాయని.. నియంత్రణ చర్యలు చేపట్టడంతో వందలాది కాలేజీలు మూతపడుతున్నాయని తెలిపారు. కాగా.. నారాయణ, చైతన్య కాలేజీలు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయని షబ్బీర్‌అలీ ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై పరిశీలనకు సభా సంఘం వేయాలని కోరారు. అయితే రెండు, మూడు నెలల్లో కార్పొరేట్ కాలేజీలను దారిలో పెడతామని.. అప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాకుంటే హౌస్కమిటీపై ఆలోచన చేస్తామని కడియం సమాధానమిచ్చారు. పెట్రో ఉత్పత్తులు రాష్ట్ర పరిధిలోనే..! రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాకతీయ తదితర పథకాలను అమలు చేస్తున్నందున.. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికి 19 సార్లు పెరిగాయని, ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిచ్చారు. వ్యాట్‌ను సవరించి పెట్రో ఉత్పత్తులపై పన్ను వసూలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నీటి అవసరాలకు ‘గ్రిడ్’ హైదరాబాద్ నగర శివార్లలోని కేశవాపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి రిజర్వాయర్ కోసం అనుమతిచ్చామని మంత్రి కె.తారకరామారావు మండలిలో వెల్లడించారు. చౌటుప్పల్ వద్ద మరో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. గోదావరి, కృష్ణా పరీవాహకాన్ని అనుసంధానం చేయడం ద్వారా తాగునీటి సమస్యను అధిగమిస్తామని.. తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలో నాలాలపై ఉన్న కబ్జాలను తొలగిస్తామన్నారు. -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు హైకోర్టు ఝలక్
సొంతగా ప్రవేశాలు చేసుకోండి.. కానీ ఖరారు చేయడానికి వీల్లేదని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సర ప్రవేశాల విషయంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఉమ్మడి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆన్లైన్ ద్వారానే డిగ్రీ ప్రవేశాలు కల్పించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమకు అనుకూల ఉత్తర్వులు పొం దలేకపోయాయి. కాలేజీలు సొంతగా ప్రవేశాలు కల్పించుకోవచ్చునన్న హైకోర్టు.. ఆ ప్రవేశాలను మాత్రం ఖరారు చేయరాదని తేల్చి చెప్పింది. ప్రవేశాలు పొందే విద్యార్థుల కు ఈ విషయాన్ని తెలియచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. డిగ్రీ కాలేజీలన్నీ ఆన్లైన్ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజునే వసూలు చేయాలంటూ ప్రభుత్వం గత నెల 10న జారీ చేసిన జీవో67ను సవాలుచేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే విధంగా ఈ నెల మొదట్లో కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ టి.సునీల్‌చౌదరి... ఆన్లైన్ ద్వారా కాకుండా సొంత ప్రవేశాలు కల్పించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ఉత్తర్వులను చూపుతూ పలు కాలేజీలు వ్యాజ్యాలు వేశాయి. వీటన్నింటిపై జస్టిస్ నవీన్‌రావు విచారణ జరిపారు. అక్రమాలు, భారీ ఫీజులు... పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రైవేటు డిగ్రీ కాలేజీల ప్రవేశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమన్నారు.ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ తోసిపుచ్చారు. ప్రవేశాల సందర్భంగా పలు కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిందన్నా రు. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రూ.12వేలను మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఇదే వ్యవహారంలో అంతకు ముందు జస్టిస్ సునీల్‌చౌదరి ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు. -
ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్
- ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకూ విద్యార్థుల ఆప్షన్లు - యాజమాన్యాల వైఖరితో అర్హుల జాబితా తయారీ ఆలస్యం..? - సర్కారు నిర్ణయం కోసం ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు - రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ప్రైవేటు కాలేజీలు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ప్రభుత్వ మెడికల్ కాలే జీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ శుక్ర, శనివా రాల్లో జరిగింది. మైనారిటీ కాలేజీ సీట్లకు మొదటి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 267 కన్వీనర్ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్ కోటా సీట్లకు, కొత్తగా కేటాయిం చిన 100 సీట్లకు, మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన 51 నిమ్స్ సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మిగిలిన 236 సీట్లకు విద్యార్థులు తమ ఆప్షన్లు ఇచ్చారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్ జరిగినా వాటికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా ప్రకటన ఆలస్యమయ్యే సూచనలున్నాయి. ప్రైవేటు పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టేను ఎత్తివేయాలని యాజ మాన్యాలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించడంతో గందరగోళం నెలకొంది. తమ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లేఖ రాయడంతో సర్కారు నిర్ణయం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రేపు హైకోర్టులో పిటిషన్ ఫీజుల పెంపు జీవోపై విధించిన స్టేను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజ మాన్యాలు నిర్ణయించాయి. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున అత్యవసర అం శంగా పరిగణించాలని కోరనున్నాయి. హైకోర్టు స్టేను ఎత్తివేయకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫీజుల పెంపుపై రాద్ధాంతం చేస్తున్నారని, ఈసారి నుంచి పీజీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాల్సి ఉన్నందున తమకు పెద్దగా ఫీజులు పెరగలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజుల పెంపు లేకుంటే వాటిని నిర్వహించడం సాధ్యం కాదని చెబు తున్నాయి. ఫీజు పెంపును అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది పరోక్షంగా ఇద్దరు ఉన్నతాధికారులేనని ఆరోపిస్తున్నాయి. నెలాఖరుకు అడ్మిషన్లు పూర్తికాకపోతే అది ప్రభుత్వ బాధ్యతేనని అంటున్నాయి. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మధ్య ఈ వ్యవహారం వివాదాన్ని సృష్టించింది. పెంపుపై ప్రభుత్వం అనుకూలమైనా.. కొందరు అధికారులు వ్యతిరేకిస్తున్నారని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. -
ఫీజుల నియంత్రణపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: ప్రైవేటు కళాశాలలో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి, ఆన్ లైన్లో అడ్మిషన్స్ స్వీకరించేలా ఆదేశించాలని మేడిపల్లి సత్యం అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులు అయిన హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రెటరీకి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీకి నోటిసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని హైకోర్టు కేసును వాయిదా వేసింది. -
నిబంధనలు బేఖాతర్
- వేసవి సెలవులకు ముందే అడ్మిషన్లు - బరి తెగించిన కార్పొరేట్ విద్యాసంస్థలు - అధ్యాపకులు, పీఆర్ఓలకు టార్గెట్లు - ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిన అడ్మిషన్లు - పట్టించుకోని అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం మే చివరి వారంలో నోటిఫికేషన్ ఇవ్వగా...జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంది. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తూచ తప్పకుండా పాటిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వేసవి సెలవులు రాకముందే అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో 70 శాతానికి పైగా అడ్మిషన్లు పూర్తయ్యాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధ్యాపకులకు టార్గెట్లు నారాయణ, చైతన్య, ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యాలు తమ వద్ద పని చేస్తున్న అధ్యాపకులకు అడ్మిషన్ల విషయంలో టార్గెట్లు విధిస్తున్నారు. వీరిలో నెలకు రూ. 6–8 వేలు వేతనం తీసుకునే జూనియర్ అధ్యాపకులు మొదలుకుని నెలకు రూ. 50–70 వేలు తీసుకునే సీనియర్ అధ్యాపకుల వరకు ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదు. విధిగా అడ్మిషన్లు చేయాల్సిందే. ఒక్కొక్కరూ ప్రతినెలా 2–3 ప్రకారం అడ్మిషన్లు చేయాలి. లేదంటే జీతాలు పెండింగ్, లేదంటే సెలవులు మంజూరులో కోత పెడుతున్నారు. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. దీనికితోడు ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకున్నారు. వారికి జీతంతో పాటు ప్రతి అడ్మిషన్‌కు ఇంత మొత్తం కమీషన్ చెల్లిస్తున్నారు. ముందే అడ్మిషన్లయితే ప్రత్యేక ఆఫర్లు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థులను పాఠశాలల వారీగా జాబితాలు సేకరించి పీఆర్ఓలు, అధ్యాపకులకు ఇస్తున్నారు. జాబితాలోని చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ల ఆధారంగా వెళ్లి వారిని కలుస్తున్నారు. కనీసం ఫలితాలు కూడా రాకనే ఎలా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే...వారికి లేనిపోని ఆశలు పెడుతూ ఒప్పిస్తున్నారు. దీనికితోడు ‘మీరు ఇప్పుడే కమిట్ అయితే ఫీజులో కూడా రాయితీ ఇస్తామని’ చెబుతుండడంతో చాలామంది తల్లిదండ్రులు ఒప్పేసుకుంటున్నారు. వాస్తవ ఫీజు నుంచి 10–30 శాతం డిస్కౌంటు ఉంటుందని చెబుతున్నారు. సీటు రిజర్వేషన్లో భాగంగా డేస్కాలర్ విద్యార్థులకైతే రూ. 2300, హాçస్టల్ విద్యార్థులకైతే రూ. 5–10 వేలు వసూలు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత కళాశాలల్లో చేరే సమయంలో మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆందోళనలు చేసినా ఫలితం నిల్ అక్రమ అడ్మిషన్లపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేదు. కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని శాసించేస్థాయిలో ఉండడంతో అధికారులు గట్టిగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. అక్రమ అడ్మిషన్లపై ఇంటర్ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. -
‘ప్రైవేట్’లో ఫీజులు నియంత్రించరా?
శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణను ప్రభుత్వం ఎందుకు పట్టించు కోవడంలేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ కమిటీ నివేదిక, సిఫార్సులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం సమావేశ మవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. -
అంతా టెన్షనే!
- ఫీజు చెల్లించలేదని హాల్‌టికెట్లు ఇవ్వని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు - పరీక్షల సమయంలో దగ్గరపడుతుండడంతో విద్యార్థుల్లో టెన్షన్ - పట్టించుకోని విద్యాధికారులు - అధికారుల ఉదాసీనతతో రెచ్చిపోతున్న కళాశాలల యాజమాన్యం అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కళాశాల ఫీజు మొత్తం చెల్లించింది. అయితే సదరు విద్యార్థిని రెండు రోజుల క్రితం హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లగా రూ.250 బకాయి ఉంది.. ఆమొత్తం చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని తేల్చి చెప్పింది. విషయాన్ని ఆ విద్యార్థిని తన తండ్రికి ఫోన్లో సమాచారం ఇచ్చింది. చివరకు ఆమె తండ్రి వచ్చి రూ.250 చెల్లించిన తర్వాత హాల్ టికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఒక్క విద్యార్థిని సమస్యే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రైవేట్ కళాశాలల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 70,726 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 35,981 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,745 మంది ఉన్నారు. పరీక్షల కోసం మొత్తం 96 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు : పరీక్షల సమయం దగ్గర పడుతోంది..ఫీజు చెల్లించని వారికి హాల్ టికెట్లు ఇచ్చేదిలేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెప్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో చదివిస్తున్నారు. కళాశాలలో పిల్లలను చేర్పించే‡ సమయంలోనే ఫీజు చెల్లించేందుకు అంగీకారం పొంది ఉంటారు. అందులో 70–80 శాతం మొత్తం చెల్లించి ఉంటారు. బకాయి మొత్తం చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ చాలా కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. తమ పిల్లలు పరీక్షలు రాసినంత మాత్రాన కళాశాలకు రాకుండా పోరని, తర్వాత సర్టిఫికెట్లు కోసమైనా కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆలోపు చెల్లిస్తామని తల్లిదండ్రులు ప్రాథేయ పడుతున్నా యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇదిలా ఉండగా హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇస్తారో ఇవ్వరోనన్న బెంగ పెట్టుకుని చాలామంది పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. తీరా పరీక్షల సమయంలో ఇది కొత్త సమస్య తెచ్చే ప్రమాదముందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు : చాలా కళాశాలల్లో ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్న విషయం ఇంటర్మీడియట్ అధికారులకూ తెలుసు. ఏకారణం చేతనూ హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను అవస్థలకు గురి చేయరాదని నిబంధనలు ఉన్నాయి. అయినా యాజమాన్యాలు బరి తెగించి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆర్ఐఓ వెంకటేశులు ఏమంటున్నారంటే... హాల్‌టికెట్లు విద్యార్థులకు కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫీజు బకాయిల వ్యవహారం తర్వాత చూసుకోవాలి తప్పా.. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదు. ఫీజు పెండింగ్ పేరుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఎక్కడైనా ఇబ్బందులకు గురి చేస్తుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించాలి. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. -
వేలిముద్రకు రూ.300
⇒ ‘ఉపకార’, రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనలో కాలేజీల దందా ⇒ దరఖాస్తుల ఆమోదానికి విద్యార్థుల వేలిముద్రలు అవసరం ⇒ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు ఈశ్వర్ హయత్‌నగర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు పరిశీలనకు సంబంధించి వేలిముద్రలు ఇచ్చేందుకు కళాశాల కార్యాలయానికి వెళ్లాడు. రూ. 300 చెల్లిస్తేనే వేలిముద్రలు తీసుకుంటామని సిబ్బంది స్పష్టం చేసింది. గత్యంతరం లేక డబ్బులు చెల్లించి వేలిముద్రలు ఇచ్చాడు. అయితే డబ్బులు తీసుకున్నందుకు రశీదు అడిగితే సిబ్బంది మూకుమ్మడిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈశ్వర్‌కే కాదు.. ప్రస్తుతం కళాశాల విద్యార్థులందరికీ ఇదే అనుభవం ఎదురవుతోంది. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన కరువైంది. లిఖితపూర్వక ఫిర్యాదు లేదన్న సాకుతో చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త పేర్లతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కళాశాలలు తాజాగా కొత్త దందా షురూ చేశాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కోసం చిల్లర వసూళ్లకు ఉపక్రమించాయి. ఈపాస్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో భాగంగా కాలేజీలో వేలిముద్రలు సమర్పించాలి. ఇవి సరిపోలితేనే దరఖాస్తు సంబంధిత సంక్షేమ శాఖకు చేరవేసే వీలుంటుంది. ఈ నెల 15వ తేదీ నాటికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ఆయా దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ముందుగా ఈపాస్ వెబ్సైట్లో నమోదైన దరఖాస్తు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి ఐడీకి వెళ్తుంది. అక్కడ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా సంఖ్య వెరిఫికేషన్ అయ్యాక... బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం కళాశాల ఐడీకి దరఖాస్తులను బదిలీ చేస్తారు. డబ్బులిస్తే సరి... ఈ ఏడాది ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖల పరిధిలో 13.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఎక్కువమంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పైనే ఆధారపడ్డారు. అవి మంజూరు కాకుంటే వారి కోర్సు పూర్తవడం కష్టమే. ఈ చిన్న విషయాన్ని సాకుగా చేసుకున్న కాలేజీ సిబ్బంది చిల్లర వసూళ్లకు తెగబడ్డారు. వేలిముద్రలు సమర్పించే సమయంలో నిర్ణీత మొత్తంలో ఫీజు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అధికంగా ఇంజనీరింగ్, పీజీ కాలేజీలే ఉన్నాయి. ఒక్కో కాలేజీకి ఒక్కో రేటు కాలేజీల్లో ఒక్కో చోట ఒక్కో రకంగా వసూళ్ల దందా కొనసాగుతోంది. హయత్‌నగర్, ఇబ్ర హీంపట్నం సమీపంలో ఉన్న కాలేజీల్లో రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఘట్కేసర్, మొయినాబాద్ ప్రాంతం లో ఉన్న కాలేజీల్లో రూ.200గా నిర్ణయించారు. అలా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే ఆమోదిస్తూ... డబ్బులు చెల్లించని విద్యార్థుల దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్సీ అభివృద్ధి శాఖకు మౌఖిక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతు న్నారు. కానీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాసిస్తే కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడు తుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేట్ల సిరి, లేత ఆశకు ఉరి
సమకాలీనం నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయసులో భావి భారత పౌరులు బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు. కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ‘‘ఆత్మవిశ్వాసాన్నీ, నిగ్రహాన్నీ కోల్పోకుండా... దేన్నయినా వినగలిగే, ఎదు ర్కోగలిగే సామర్థ్యాన్నిచ్చేదే విద్య’’ అంటాడు నాలుగుమార్లు పులిట్జర్ అవార్డు పొందిన అమెరికా కవి రాబర్ట్ లీ ఫ్రాస్ట్. మనం మన పిల్లలకు ఏ రకం విద్య అందిస్తున్నాం? ఎంత ఆత్మ విశ్వాసాన్ని వారిలో నింపగలుగుతున్నాం? ఏపాటి అవగాహన బతుకుపై వారిలో కలిగిస్తున్నాం? ఎంతటి జీవితేచ్ఛను వారిలో రగిలిస్తున్నాం? ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని మనమందరం ఆలోచించాల్సిన అంశం. పాపం, చంద్రశేఖర్, నవీన దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వంశీకృష్ణ గురించి ఎన్నెన్ని కలలు కన్నారో! అంతలోనే ఆ కలలు కల్లలయి.... కన్న కొడుకు లేత వయసులో చదువు చట్రాల ఇరుసులో పడి నలిగాడు. పూవై నూరు రేకులతో వికసించాల్సినవాడు మొగ్గగానే రాలిపోతే... నలభై రోజుల పైగా రెండు హృదయాలు తుపానులో చిగురుటాకుల్లా అల్లాడినై.‘తమకే ఎందుకిలా జరిగింది...’ దుఃఖం తన్నుకొస్తున్నా ఏ వైపు నుంచీ సమాధానం లేదు. కడకు ఆత్మహత్యతో రెండు బతుకులూ కడతేరినై. విన్న ప్రతి హృదయాన్నీ కదిలించిందీ గుంటూరు జిల్లా దుర్ఘటన! వెలిగే ఓ చిరుదివ్వె కొండెక్కితే, ఉన్న రెండు దీపాలూ దీనంగా ఆరిపోయినయ్. ఆ దినమలా గడిచింది. ఎప్పటిలాగే పొద్దువాలింది, మళ్లీ తెల్లారింది. ఏం జరగనట్టే, అంతా సద్దుమణిగింది! రారండంటూ సర్కారు, ప్రైవేటు బడులు స్వాగతం పలికాయి. పొలోమంటూ పిల్లలు బడులకు పరుగులు తీశారు. పిల్లల భవి ష్యత్తు గురించి కలలు కంటున్న తల్లిదండ్రులూ వారిని బడుల్లో దింపు తున్నారు, హాస్టళ్లలో కుక్కుతున్నారు. లేత ఆలోచనల్ని పునాదుల్లో పూడ్చి ఆశల సౌధాలు కడుతూనే ఉన్నారు. షరా మామూలే! ఇదిలా సాగాల్సిందేనా! ఎవరూ మనసు పెట్టి ఆలోచించరా? బడులు–కాలేజీలెందుకు పిల్లల పాలిట వధ్యశిలలవుతున్నాయి? సర్కారు బడులెందుకు కంటికానని దుస్థితికి జారు తున్నాయి? మూడు బడులు ఆరు కాలేజీలై ప్రైవేటు విద్యా వ్యాపారం కోట్లకెలా, ఎందుకు పడగలెత్తుతోంది? చిరుప్రాయంలోనే విద్యాకుసుమాలెం దుకు రాలుతున్నాయి? ఎందరి మెదళ్లనో తొలుస్తున్న శేష ప్రశ్నలివి. అనా రోగ్యంతో అసువులు వీడారనో, ఆత్మహత్యతో కడతేరారనో, ప్రమాదవశాత్తు మరణించారనో... ఎప్పటికప్పుడు ఓ కథ వినిపిస్తున్నారు. నూరు పుటల వారి బతుకు పుస్తకాల్ని తొలి పేజీల్లోనే కర్కశంగా మూసేస్తున్నారు. కన్నవారికి తీరని గర్భశోకం మిగిలిస్తున్నారు. స్వేచ్ఛగా ఎదగాల్సిన లేత మెదళ్లు ఒత్తిడిలో చిత్తవుతున్నాయి. అత్యాశే తప్ప, ఆశెప్పుడూ తప్పు కాదు ఆర్థిక సరళీకరణ తర్వాతి పరిణామాల్లో ఎదుగుదల అవకాశాలు అందరికీ కనిపించాయి. ఆశలు రేపాయి. పద్ధతిగా సాగిన కొన్ని కలలు సజావుగా నెర వేరుతున్నాయి. వాస్తవిక దృక్పథంతో కాకుండా అత్యాశతో ఆలోచించి, పథ కాలు రచించిన చోట విలువలు వేగంగా పతనమయ్యాయి. ఈ దురవస్థ, కుటుంబ వ్యవస్థలో మానవ సంబంధాలైనా, బయటి సమాజంలోని వ్యాపార లావాదేవీలైనా మినహాయింపు లేకుండా అంతటా వర్తిస్తోంది. అభిరుచి స్థాయితో నిమిత్తం లేకుండా తమ పిల్లలు పెద్ద చదువులు చదివి, గొప్ప కొలువులు పట్టి, బోలెడు సంపాదించాలన్న తలిదండ్రుల అత్యాశ పిల్లల లేత మెదళ్లపై ఒత్తిడి పెంచే గుదిబండౌతోంది. ఈ బలహీనతే, తక్కువ సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ధనార్జన చేయాలనుకున్న స్వార్థ విద్యా వ్యాపారులకు పెట్టుబడి అయింది. దొడ్డి దారిన సంపద కూడగట్టాలనుకున్న అధికార పెద్దలకిదొక అక్రమార్జన మార్గమయింది. విశ్వవ్యాప్తంగా, వేల సంవత్సరాలు కీర్తిమానమైన భారతీయ విద్య, విలువలతో కూడిన సంస్కృతి సర్వనాశనమైంది. మనం గొప్పగా చెప్పుకునే కేంబ్రిడ్జి, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి యూనివర్సిటీల కన్నా కొన్ని వందల యేళ్లకు ముందే విశ్వ విద్యకు శ్రీకారం చుట్టిన నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలకు నెలవైన నేల మనది. స్వేచ్ఛా విద్యార్జనకు నిలయంగా విశ్వకవి రవీంద్రుడు ‘శాంతినికేతన్’ నెలకొల్పిందిక్కడే! అటువంటిది ప్రస్తుతం విద్య ఫక్తు వ్యాపా రమైంది. ఆమీర్‌ఖాన్ ఓ చక్కటి కళాఖండంగా తీర్చిదిద్దిన ‘త్రీ ఇడియట్స్’లో సందేహించినట్టు విద్యార్థులుంటున్నది కాలేజీయో, ప్రెజర్కుక్కరో తెలియని పరిస్థితులు దాపురించాయి. భరించలేని ఒత్తిళ్లలో పిల్లలు నలిగి పోవడానికి తల్లిదండ్రుల అత్యాశ కూడా కారణమే! తమ పిల్లల ఆసక్తి, నైపుణ్యాలు, మానసిక ప్రవర్తన వంటి అంశాలతో నిమిత్తం లేకుండానే వారిని ఏదేదో చేసేయాలనుకోవడంలోనే లోపముంది. ఏటా ఎంతమంది ఇంటర్ పాసయి ఉన్నత విద్యకు వెళ్తుంటే, ఎన్ని ఐఐటి సీట్లున్నాయి, ఎంత నిష్పత్తి అన్న లెక్కయినా లేకుండా... పిల్లల్ని ఎట్లయినా నెట్టాలని చూడటమే వింత. వారి అభిరుచి–ఆసక్తిని ఏ మాత్రం లెక్క చేయకుండా ఐఏఎస్–ఐపీఎస్ చేయాల నుకునే ఆశలేమిటో అంతుబట్టదు. వీరి వేలం వెర్రితత్వాన్ని చూసి ఇంటర్, పదో తరగతి, ఆరో తరగతి... ఇలా కిందకు వస్తూ, వస్తూ చివరకు ఒకటో తరగతి నుంచే ఐఐటీ శిక్షణ అని విద్యావ్యాపార సంస్థలు వారికి వలపన్నే దాకా వచ్చింది. ఫలితంగా ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ– టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌స్కూల్, ఇంటర్నేషనల్... ఇలా ఎన్ని పేర్లో! ఎంతెంత ఫీజులో! అంతే లేదు. అక్కడ దరఖాస్తు ఫారమ్ నుంచి పుస్తకాలు, బెల్ట్, డ్రెస్, తిండి, రవాణా... సర్టిఫికేట్ల వరకు ప్రతిదీ వ్యాపారమే! బడుల నుంచి కాలేజీల దాకా.... విద్యా కుసుమాలు అసాధారణ ఒత్తిళ్లలో వాడిపోతున్న విపరీతం అన్ని స్థాయిల్లోనూ ఉంది. ఈ జాఢ్యం పాఠశాలల నుంచి కాలేజీల దాకా పాకింది. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రమేయం పుణ్యమా అని ప్రత్యక్ష–పరోక్ష కారణా లతో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువులు సన్నగిల్లాయి. ఏడు, ఎనిమిది తరగతులకొచ్చాక కూడా సరిగా తెలుగు చదవలేని, రాయలేని, గుణింతాలు–భాగహారాలు చేయలేని ‘ప్రమాణాలు’న్నాయి. సర్కారు విప రీత నిర్లక్ష్యం వాటిని కునారిల్లేలా చేసింది. సర్కారు బడులపై విరక్తి చెంది, అప్పో సొప్పో చేసయినా ప్రైవేటులో చదివించాలని సామాన్యులు కూడా తపన చెందే బలీయ వాతావరణం తీసుకొచ్చారు. తెలంగాణలో 14,250 పై చిలుకు ప్రైవేటు బడుల్లో 29.66 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 9వేల పాఠశాలల్లోనే సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 13,513 ప్రయివేటు పాఠశాలల్లో 27.85 లక్షల విద్యార్థులు న్నారు. అక్కడ కూడా మెజారిటీ పాఠశాలలు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కేంద్రీ కృతమై ఉన్నాయి. భారీ ఫీజులే తప్ప విద్యా ప్రమాణాలు ఎక్కడా గొప్పగా లేవు. ఇక క్రీడలు, సైన్స్ ల్యాబులు, గ్రంథాలయాలు, ఇతరేతర సదుపా యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనుమతి లేకున్నా చాలా చోట్ల హాస్టల్స్ నడుపుతున్నారు. వాటి నిర్వహణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారం వాటిని నడుపుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలన్నీ గాలికిపోతాయి. ప్రవేశాలు, ఫీజులు, సిలబస్, సెలవులు, వసతులు... ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఎప్పటి కప్పుడిచ్చే ఏ ఉత్తర్వుల్నీ వారు పాటించరు. ఇక ఇంటర్ కాలేజీ విద్య విష యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండే విద్యా సంస్థలది ఇష్టారాజ్యం. ప్రభుత్వ విధానాలనే తమకనుకూలంగా వారు ప్రభావితం చేస్తారు. కదిలించే ఆత్మహత్యలు... కంటి తుడుపు విచారణలు అశాస్త్రీయమైన బట్టీ విద్యావిధానంలో నెట్టుకురాలేని విద్యార్థులంతా నలిగి పోతున్నారు. సృజనని హతమార్చి పెట్టే వింత టార్గెట్లతో వారిని పగలూ రాత్రీ రుద్దుతూనే ఉంటారు. హేతుబద్ధంకాని మార్కుల తూనికలు– కొలత లతో, ఒకరితో ఒకర్ని పోల్చి వేధిస్తుంటారు. ఇదంతా ఒత్తిడే! ప్రతిభగల విద్యార్థులు కూడా ఈ వైఫల్యాల్ని జీర్ణించుకోలేక అవమానంగా భావిస్తుం టారు. చిన్న విషయాల్నీ భూతద్దంలో చూస్తున్నారు. విపరీత నిర్ణయాలకు తెగిస్తున్నారు. దీనికి తోడు తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేకపోతున్నామన్న భావన వారిని మరింత వేదనకు గురిచేస్తోంది. నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయ సులో బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు. కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. కాలేజీ విద్యార్థుల బలవన్మరణాలపై ఇంటర్‌బోర్డు మాజీ కార్యదర్శి డి.చక్ర పాణి, మాజీ వీసీ రత్నకుమారిల నేతృత్వంలో ఒక కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇలాగే నియమించిన ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ లోతైన పరిశీలనతో విలువైన సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు హాస్టళ్లు నిర్వహిస్తున్నాయని, అవి జైళ్లకన్నా ఘోరంగా ఉన్నాయని, ఫలితంగా ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేల్చింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన ఓ త్రిసభ్య కమిటీ వారి సిఫార సుల్ని య«థాతథంగా అమలు చేయాలని చెప్పినా సర్కారు మొదట పట్టిం చుకోలేదు. పౌరసమాజం ఒత్తిళ్లకు లొంగి ఉత్తర్వులిచ్చినా... వాటి అమలును కార్పొరేట్ విద్యా సంస్థలు నీరుగార్చాయి. ఆదివారాలు పరీక్షలుండొద్దని, సాయంత్రం 4 తర్వాత స్వేచ్ఛగా తిరగనివ్వాలని, స్టడీ సమయాలు రోజూ 9 గంటలు మించొద్దని, ప్రతికాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లను, సైక్రియాట్రిస్టుల్ని విధిగా నియమించాలని, జీవన నైపుణ్యాలపైన, నైతిక వర్తనపైన ప్రత్యేక తరగతులుండాలని, పేరెంట్స్‌తో కూడిన కమిటీలు–తరచూ సమావేశాలూ ఉండాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదు. ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదు విద్యాసంస్థ ఏదైనా తమ విద్యార్థుల్లో ధైర్యం నూరిపోయాలి. చావు దేనికీ పరిష్కారం కాదని ఒంటబట్టేలా చెప్పాలి. భారత్‌లో ప్రతి లక్ష మందికి 58 మంది విద్యార్థులు బలవన్మరణాల పాలవుతుంటే, 148 మంది విద్యార్థినులు ఆత్మహత్యలకు గురవుతున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు (14.5/లక్ష) కన్నా ఎక్కువ కాగా, బ్రిటన్ సగటు (2.1/లక్ష) కన్నా చాలా ఎక్కువ. భారత అమ్మాయిల్లో పరీక్షలకు సంబంధించిన గెలుపు ఒత్తిళ్లు ఎంతో అధికం. తల్లిదండ్రుల ఆశలకి–వ్యయానికి న్యాయం చేయలేక పోతు న్నామన్న బెంగా వారిలోనే ఎక్కువ. పరీక్షల్లో విఫలమైతే పెళ్లి తప్ప తమ కుండే ప్రత్యామ్నాయాలు తక్కువనే భావన అమ్మాయిల్లో ఈ అధిక ఒత్తిళ్లకు కారణం అయి ఉండవచ్చని చాలా కాలం కింద పీటర్ ఫోస్టర్ (టెలిగ్రాఫ్– బ్రిటన్) రాశారు. భారత ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన యువతను ఎవ రైనా కోరేదొక్కటే! ఆత్మహత్యలు బలవన్మరణాలు సరికాదు. అరుణోదయ తరపున వేదికలపై మార్మోగే విమలక్క పాట స్ఫురణకు వస్తోంది. ‘‘ఎందుకు కాలిపోతవు? నువెందుకు రాలి పోతవు? కాలకురా, రాలకురా... మాడి బూడిద కాకురా!....’’ (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com ) -
మానవహక్కుల సంఘం పేరిట వసూళ్లు
- నలుగురు అరెస్ట్ సుల్తానాబాద్: మానవహక్కుల సంఘం పేరిట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను గత కొన్ని రోజులుగా ఓ ముఠా మానవ హక్కుల సంఘం పేరిట వేధింపులకు గురిచేస్తూ.. అక్రమంగా చందాలు వసూలు చేస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తుల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ విజయేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. -
రాష్ట్ర స్థాయిలో అక్రెడిటేషన్ కౌన్సిల్
- ఏర్పాటు దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు - కాలేజీల్లో నాణ్యతాప్రమాణాల పెంపుపై దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా సం స్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపుపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఉన్నత విద్యా సంస్థలకు నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అక్రెడి టేషన్ కౌన్సిల్(న్యాక్) ఇచ్చే గుర్తింపు తరహాలోనే నాణ్యత ప్రమాణాలను బట్టి రాష్ట్ర స్థారుులో గుర్తింపు ఇచ్చే సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. స్టేట్ అసెస్మెంట్ ఆఫ్ అక్రె డిటేషన్ కౌన్సిల్‌ను(స్యాక్) ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యా సంస్థలను ఉత్తమ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడంతోపాటు న్యాక్ గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టవచ్చని, న్యాక్ గుర్తింపు ఉంటే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షాఅభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలోని విద్యా సంస్థలకు భారీ మొత్తంలో నిధులను రాబట్టుకో వచ్చనే ఆలోచనకు వచ్చింది. ఇందులో భాగంగానే స్యాక్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ వెల్లడించారు. రూసా నిధు లను ఎక్కువ మొత్తంలో రాబట్టుకోవాలంటే న్యాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి అని చెప్పారు. డిసెంబర్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాళ్లతో న్యాక్ అక్రెడిటేషన్ పొందేందుకు కాలేజీలు చేపట్టాల్సిన చర్యలపై సెమినార్ నిర్వహిస్తామని వివరించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా న్యాక్ డెరైక్టర్‌ను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కేరళ లో పర్యటించి అక్కడ అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల్లో ప్రధానంగా ఐదింటిని గుర్తించి రాష్ట్రంలో అమలు చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చామని, త్వరలోనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతామని ఇన్చార్జి చైర్మన్ వివరించారు. -
ముందస్తు అడ్మిషన్లపై ఆగ్రహం
- ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన - ఆయా కళాశాలలపై చర్యలకు డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కార్పొరేట్ కళాశాలలు అప్పుడే అడ్మిషన్లు చేస్తున్నాయంటూ ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు దీన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయానికి గేటు వేసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల వారు ఏకంగా పీఆర్వోలను నియమించి వారిని ఇంటింటికీ పంపి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కరువు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులకు లేనిపోని ఆశలు కల్పించి ఫీజుల రూపంలో వారిని దోచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన పేర్లు పెట్టి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పరుశురాం, మారుతీప్రకాష్, లోకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్, మనోహర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు : ఆర్ఐఓ ఎవరూ ముందస్తు అడ్మిషన్లు చేయకూడదని, జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆర్ఐఓ వెంకటేశులు హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. అడ్మిషన్ దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని, ట్యూషన్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో కళాశాల నోటీస్ బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి జూనియర్ కళాశాలకు మంజూరు చేసిన గ్రూపులను మాత్రమే కళాశాల అప్లికేషన్లో ముద్రించాలన్నారు. సెలవు దినాల్లో కళాశాలలు నడపరాదని, ప్రతి తరగతి గదిలోనూ పరిమితికి మించి విద్యార్థులు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి కళాశాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
ఫీజు దోపిడీ పదింతలు
టెన్త్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు అదనంగా వసూలు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థుల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్ష ఫీజులను నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారుు. రూ.300 నుంచి వెరుు్య రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ విద్యాశాఖాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. తిరుపతి ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నారుు. విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజునే చెల్లించాలి. అరుుతే జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం పరీక్షా ఫీజుల దోపిడీకి తెరతీశారుు. ఇప్పటికే స్కూలు ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, రవాణా అంటూ విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ వేలాది రూపాయలు వసూలు చేశారుు. రూ.వెయి వరకు వసూలు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోవు విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఫీజును ప్రభుత్వం రూ.125లుగా నిర్దేశించింది. ఆ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంది. విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండడంతో అదనంగా కొంత ఖర్చు అవుతుంది. దీనికోసం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా మరో రూ.25వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అరుుతే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వద్ద రూ.300 నుంచి అత్యధికంగా వెరుు్య రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నారుు. కోటికి పైగా వసూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1,148వరకు ఉన్నారుు. ఇందులో ఈ ఏడాది దాదాపు 54,500 మంది విద్యార్థులు టెన్త పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జిల్లాలో 498 వరకు ఉన్నారుు. అందులో దాదాపుగా 28 వేల మంది విద్యార్థులున్నట్లు అంచనా. సరాసరిగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.1.68 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పైసలివ్వాల్సిందే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల నుంచి అధికారులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉండడంతోనే అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రైవేటు యాజమాన్యాలు పేర్కొంటున్నారుు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.100 సమర్పించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉప విద్యాశాఖాధికారి(డీవైఈవో), జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాల్లో ఈ మొత్తాన్ని అనధికారికంగా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారుు. దీనిపై సంబంధిత విద్యాశాఖాధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నారుు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పదికి పరీక్ష!
• పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లు • దోపిడీకి రంగం సిద్ధం చేసిన ప్రైవేటు విద్యాసంస్థలు • అసలు ఫీజు రూ.125, వసూలు రూ.1,700 వరకు • జిల్లాలోని విద్యార్థులపై రూ.1.5 కోట్ల అదనపు భారం • చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ‘పది’ ఈ సంఖ్యకు చాలా క్రేజ్ విద్యార్థుల భవితకు కీలకమైంది పదవ తరగతి. జీవితంలో ఇది తొలి పబ్లిక్ పరీక్ష కావడంతో అందరికీ ‘టెన్’షన్ ఇందులో ప్రతిభ కనబర్చిన వారికే గుర్తింపు అధికం దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నారుు. పరీక్ష ఫీజు పేరిట వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.. ఇదంతా చూస్తూ కూడా విద్యాశాఖ యథావిధిగా మౌనం దాల్చుతోంది...! ఒంగోలు : పరీక్షల ఫీజుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఎవరిష్టం వచ్చినంత వారు దోచుకొనేందుకు రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు వాస్తవానికి రూ. 125 చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా రూ.1000 రూ. 1500 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ఈ అదనపు వసూలు విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దీనిని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరం. గత ఏడాది ఇదే వ్యవహారంపై జిల్లా పరిషత్ చైర్మన్ విద్యాశాఖకు చురకలు అంటించినా ఎలాంటి మార్పు రాలేదు. తుది గడువు ఈనెల 18.. పరీక్షల చెల్లింపునకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షిస్తే దోపిడీని కొంతవరకు అరికట్టువచ్చని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే విద్యార్థులే నేరుగా చలానా చెల్లించే అవకాశం కల్పించాలి. దీనివల్ల యూజమాన్యాల పెత్తనాన్ని అరికట్టువచ్చు. వేలాది మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 370పైగా ప్రభుత్వ, జిల్లా పరిషత్,ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలున్నాయి.వీటిలో 24వేల మంది పదో తరగతి విద్యార్థులున్నారు.ఇక 300పైగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 16వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులు అరుుతే రూ. 125కి అదనంగా రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. అరుుతే వివిధ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో రూ.150 నుంచి రూ. 200 వరకు తీసుకుంటున్నారు. సరాసరిన ఒక్కొక్కరికి రూ. 50 అదనంగా చెల్లించినా రూ. 12 లక్షలు మేర అదనపు భారం తప్పడంలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో గరిష్టంగా రూ. 1700 వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఎవరైనా అడిగితే విద్యాశాఖలోని అధికారులకు కూడా వాటాలు ఇచ్చుకోవాల్సి వస్తుందనే సమాచారం వినిపిస్తుంది. ప్రతి నామినల్ రోల్‌కు కనీసంగా రూ.100 నుంచి రూ.200 చొప్పున వసూలుచేస్తారని వినికిడి. రవాణా ఖర్చుల పేరుతో వసూళ్ల పర్వం.. విద్యార్థికి అందించే సర్వీస్‌తోపాటు పరీక్షల సమయంలో 11 రోజులపాటు విద్యార్థిని పాఠశాల వద్దనుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరిగి అక్కడ నుంచి పాఠశాల వరకు క్షేమంగా తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు పేరుతో గుర్తింపు పొందిన పాఠశాలలు వసూళ్ల పర్వం మొదలుపెట్టేశాయి. ఇక కార్పొరేట్ పాఠశాలల తీరే వేరు. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి సరాసరి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారని అనుకుంటే వసూలయ్యే మొత్తం రూ.1.92 కోట్లు. వాస్తవానికి విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం రూ.20 లక్షలు మాత్రమే. అంటే అనధికారికంగా వసూలు చేస్తున్న మొత్తం రూ.1.72 కోట్లు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల నుంచి రూ.12 లక్షలు, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల నుంచి రూ.1.72 కోట్లు వెరసి రూ.1.84 కోట్ల దోపిడీకి రంగం సిద్ధమైంది. -
ఫీజు బకాయిలు 530 కోట్లు
► ఇంకా విడుదల కాని 2015-16 నిధులు ► పాసవుట్ విద్యార్థులకు ► సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం, ఇందుకు ప్రతిగా కోర్సులు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తుండటంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కంపెనీలు ఇం టర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావా లని పేర్కొంటుండగా కళాశాలల తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో వివిధ సంక్షేమశాఖల్లో రూ.530 కోట్లు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రెజరీల్లోనే బ్రేక్... పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2015-16 వార్షిక సంవత్సరంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తయింది. బ్యాంకు ఖాతాలు సరిపోలక పోవడం, దరఖాస్తుల్లో పొరపాట్లతో దాదాపు 10% దరఖాస్తులు ఇంకా కళాశాలల యూజర్ ఐడీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన దరఖాస్తులు సంక్షేమ శాఖ అధికారుల లాగిన్ నుంచి ట్రెజరీ అధికారుల ఖాతాకు బదలాయిం చారు. అనంతరం సంక్షేమాధికారులు దరఖాస్తుల సమర్పణకు టోకెన్ నంబర్లూ పొందారు. ఈ ప్రక్రియ 5 నెలల క్రితమే ముగిసినా... నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ట్రెజరీల్లో నిధుల విడుదలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రీయింబర్స్మెంట్ విడుదల కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తీవ్రం చేయడంతో ఒకట్రెండు రోజుల్లో రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సర్కారు ఇటీవల హామీ ఇచ్చింది. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు సమ్మతించినప్పటికీ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సంక్షేమ శాఖల వారీగా ఫీజు బకాయిలు..(రూ. కోట్లలో) శాఖ బకాయిలు ఎస్సీ 74.50 బీసీ 208.00 ఎస్టీ 82.05 మైనార్టీ 84.15 ఈబీసీ 81.22 వికలాంగ 0.15 మొత్తం 530.07 -
శాడిస్టు ప్రొఫెసర్
విద్యార్థులపై నిత్యం తిట్లు,హేళనలు ఒక డెంటల్ ప్రొఫెసర్ వేధింపుల పర్వం విజయవాడ: మేము కట్టే పన్నులతో మీరు చదువుకుంటున్నారు. నోరు మూసుకుని చెప్పినట్లు చేయండి. లేకుండా మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు అంటూ ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ రిజర్వేషన్ విద్యార్థుల పట్ల నిత్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గన్నవరం సమీపంలోని ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో ఓరల్ సర్జరీకి చెందిన ఓ ప్రొఫెసర్ గత కొంత కాలంగా పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మా దయతో మీరు చదువుకుంటున్నారని బీసీ, ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రోజూ దెప్పిపొడవడం అతనినైజం. పార్టీలు, సినిమాలు పేరుతోనూ శాడిస్టులా వేధిస్తున్నట్లు తెలిసింది. అతని అభిమాన నటుడు సినిమా విడుదల అంటూ విద్యార్థులతో టికెట్లు తీయించి, పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనిఖీల సమయంలో కూడా విద్యార్థులను అవహేళన చేశారని పలువురు బాధితులు తెలిపారు. బయటకు చెప్పకోలేక ఆవేదన ప్రాక్టికల్స్, మార్కులు ప్రొఫెసర్ల చేతిలో ఉండటంతో తమపై ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారోనని ఆందోళన చెందుతున్న బాధిత విద్యార్థులు అతని ఆగడాలపై బటయకు చెప్పుకోలేకోతున్నారు. గతంలో ఇదే కళాశాలలో ఓ ప్రొఫెసర్ ఇలానే వ్యవహరిస్తే అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం ఇతన్ని చూసీచూడనట్లు వదిలేస్తోందనే విమర్శలున్నాయి. ఒకటిరెండు సార్లు సాధారణ విచారణతో సరిపెట్టడంతో ఇతడు చెలరేగిపోతున్నాడు. అవమానభారంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు. మా దృష్టికి వచ్చాయి ఒక ప్రొఫెసర్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ రాసిన లేఖలు మాకు అందాయి. అయితే అవి ఎవరు రాశారన్నది తేలడం లేదు. విద్యార్థులు ఎవరూ నేరుగా మాకు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ఈ విషయమై విచారణ జరిపించాము. యాజమాన్యం కూడా సీరియస్‌గానే ఉంది. ముందు ఎవరు లేఖలు రాస్తున్నారో తెలుసుకోవాల్సి ఉంది. -డాక్టర్ రామోజీ, కళాశాల ప్రిన్సిపాల్ -
విలువలు వదిలేసిన విద్యా శాఖ
అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు తమ, తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ఘోరంగా విఫలం చెందుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సహితం ఆచరణలో పెట్టలేక, ప్రైవేటు విద్యా సంస్థలతో ఉన్న అవినాభావ అనుబంధంతో వారిని ఏమీ అనలేక ప్రజల దృష్టిలో విద్యాశాఖ చేతగాని, చేవలేని శాఖగా మిగిలి పోతూందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిస్తే, సగటు పౌరుల జీవనం అస్తవ్యస్తమైనప్పుడు విద్యాశాఖతో పని లేకుం డానే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తూ రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఖచ్చితంగా అమలు చేయమని ఆదేశించింది. ఈ ఆదేశాలను మాధ్యమాల్లో చూసి సెలవు ఇచ్చిన విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు పాటించాయే తప్ప విద్యా శాఖను ఏమాత్రం లెక్క చేయని విద్యా సంస్థలు నడుము లోతు నీళ్ళలో సహితం పాఠశాలలు నడిపించపూనుకున్నాయి. ఏకంగా ఓ పాఠశాల అయితే స్కూలు బస్సును ప్రవాహంలాంటి నీళ్లలో 40మంది పిల్లల్ని రవాణా చేయబూనుకుంది. కాలనీవాసులు అడ్డుకోవడంతో పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పింది కానీ, విద్యాశాఖ మాత్రం అచేతనంగా మారింది. ఇక ఏకంగా పాలక పార్టీ శాసనమండలి సభ్యుడు తన పాఠశాలను యథేచ్ఛగా నడిపిస్తుంటే పిల్లల హక్కుల సంస్థలు ఆధారాలతో విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా అతడి స్కూలు వైపు చూసిన పాపాన పోలేదు. ఇక కార్పొరేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నా తెలంగాణా ప్రాంతంలో ఆ స్కూళ్లను పాలకపార్టీ ముఖ్య నేత ఒకరు సొంతం చేసుకుంటున్నారనే వదంతి ఉండ టంతో ఆ పాఠశాలలో పిల్లల హక్కుల ఉల్లంఘన జరు గుతున్నా, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, లైంగిక వేధింపులకు గురౌతున్నా మన విద్యాశాఖ కళ్లు మూసుకొని కూర్చుందే తప్ప ఏమీ అనలేకపోయింది. పాలక రాజకీయ పార్టీలకే పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండటంతో ఏమంటే ఏం ముంచుకోస్తుందో మనకెందుకులే అనే విధానాన్ని పాటిస్తున్న విద్యాశాఖ కళ్లున్నా చూడలేని, చెవులున్నా వినలేని, కాళ్లున్నా నడవలేని, చేతులున్నా చేతగాని వ్యవస్థగా మారింది. పాఠశాలల్లో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో స్కూలు భవనాలు, ఫైర్ మొదలు కొని ఎలాంటి రక్షణా కరువైన పాఠశాలల నిర్వహణ, విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి బదిలీ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం ప్రవేశ పరీక్షలు, టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం విద్యా శాఖ నిర్లిప్తతకు, చేవలేనితనానికి అద్దం పడుతోంది. ఇలా విద్యాశాఖ నామమాత్రపు శాఖగా మారిపో యినపుడు, అధికారగణం, ఉద్యోగులు, కార్యాలయాలు హంగూ, ఆర్భాటాలు అన్నీ అలంకారప్రాయంగానే మారి, విద్యాశాఖ మనుగడే ప్రశ్నార్థకంగా, మారక ముందే అధికారులు మేల్కొంటే విద్యార్థులకు కొంత మేలు జరగవచ్చు. - అచ్యుతరావు వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు మొబైల్ : 93910 24242 -
ఆశయం సరే.. ఆటలూ?
ఏటా నామమాత్రంగా కళాశాల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు అఫ్లియేషన్ ఫీజుతో సరిపెడుతున్న ప్రైవేట్ యాజమాన్యాలు పోటీల్లో కనిపించని ప్రైవేట్ విద్యార్థులు క్రీడలతో మానసిక వికాసం ఉంటుందని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చే అధికారులు, పాలకులు ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యారంగంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పుస్తకాలతో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. చదువు తప్ప మరో వ్యాపకం లేకుండా పోవడంతో చాలా మంది విద్యార్థులు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. శారీరక దఢత్వం లేకుండా పోతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం విద్యార్థి దశలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కావడం గమనార్హం. 41 కళాశాలలకు ఏడుగురు పీడీలు జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్, వత్తివిద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 27 మాత్రమే పీడీ (ఫిజికల్ డైరెక్టర్) పోస్టులుండగా అందులో కేవలం ఏడుగురు మాత్రమే విధుల్లో ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతపురం కొత్తూరు జూనియర్ కళాశాల, పాతూరు కళాశాల, కేఎస్ఆర్ బాలికల కళాశాల, కదిరి బాలికల కళాశాల, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గుంతకల్లు కళాశాలల్లో మాత్రమే పీడీలు ఉన్నారు. అనంతపురంలోని పాతూరు జూనియర్ కళాశాల, హిందూపురం బాలికల కళాశాలకు తప్ప ప్రతి కళాశాలకు మైదానం ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ మైదానాల్లో ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, త్రోబాల్, ఖోఖో, బాల్బ్మాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయలేదు. రన్నింగ్ కోసం ట్రాక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా కనిపించవు. ఆఖరుకు అత్యంత క్రేజీ క్రీడగా పేరుగాంచిన క్రికెట్ ఆడేందుకు సరైన పిచ్‌లు కూడా లేకపోవడం శోచనీయం. ఇవి ప్రభుత్వ కళాశాలల్లో పడకేసిన క్రీడాభివద్ధికి అద్దం పడుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో పరిస్థితి భిన్నం ప్రైవేట్ కళాశాలల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 112 ప్రైవేట్ కళాశాలలుండగా, 15 కళాశాలలకు మాత్రమే మైదానాలున్నాయి. పీడీలు ఉన్నా... విద్యార్థులకు ఎలాంటి ఆటలు ఉండవు. బహుళ అంతస్తుల భవనాల్లో తరగతి గదులు నిర్వహిస్తున్నారు తప్ప పిల్లలకు వ్యాయామ విద్య కరువైంది. బాధాకరమేమిటంటే మైదానాలున్న కళాశాలల్లో సైతం క్రీడలు ఆడించడం లేదు. అయితే క్రీడలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు మాత్రం వసూలు చేస్తుంటారు. అఫ్లియేషన్ ఫీజులతో సరి ఏటా కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో అన్ని ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత జిల్లాస్థాయిలో డీవీఈఓ, ఆర్ఐఓలది. అయితే జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క ప్రైవేట్ కళాశాల నుంచి కూడా విద్యార్థులు స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న దాఖలాలు లేవు. క్రీడల నిర్వహణకు అఫ్లియేషన్ ఫీజు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు కూడా ఫీజు వస్తే చాలు విద్యార్థులు రాకపోయినా పర్వాలేదు అనే ధోరణిలో వెళ్తున్నారు. దీంతో ప్రతిసారి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే క్రీడా పోటీలకు హాజరవుతున్నారు. అదికూడా వేళ్లమీద కళాశాలల పేర్లు లెక్కించొచ్చు. స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొనని కళాశాలలపై చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా... అధికారులు సాహసించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాల్సిందే... స్పోర్ట్స్‌మీట్‌లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాల్సిందే. ఈసారి ఎవర్నీ ఉపేక్షించం. ఇదే విషయాన్ని ఆర్ఐఓకు కూడా స్పష్టం చేశాం. చాలా ప్రభుత్వ కళాశాలల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే పిల్లలకు ఇబ్బంది కలగకుండా చురుకుగా ఉన్న అధ్యాపకులతో ఆటలు ఆడిస్తున్నారు. – వెంకటరమణ, ఆర్జేడీ ================================================ ఆటలు తప్పనిసరి మానసిక ప్రశాంతత కోసం ప్రతి విద్యార్థికీ ఆటలు తప్పనిసరి. ప్రస్తుత పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ఆటలు ఆడే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువులు, ర్యాంకులపైనే దష్టి నిలుపుతున్నారు. ఆటలు లేకపోవడం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపిస్తోంది. దీని ద్వారా సమాజంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు. చెడు మార్గాలను అన్వేషిస్తారు. చిన్నపాటి సమస్యలు సైతం ఆందోళనకు గురి చేస్తాయి. ఇలాంటి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి జీవితంపైనే పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. – డాక్టర్ విజయ్‌కుమార్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం ==================================================== స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ప్రతి విద్యార్థి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలనే కలలు కంటాడు. అయితే చదువుతో పాటు క్రీడలూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా సులువుగా సాధించుకోవచ్చు. 2004, 2006లో రెండు సార్లు కబడ్డీలో ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. రెండు బంగారు పతకాలు సాధించాను. స్పోర్ట్స్ కోటాలోనే పోలీస్ శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాను. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఒత్తిళ్లను అధిగమించొచ్చు. గెలుపోటములను సమానంగా జీర్ణించుకునే స్వభావం అలవాటవుతుంది. – విశ్వనాథ్‌చౌదరి, ఎస్ఐ, బుక్కరాయసముద్రం -
నేడు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్
అమలాపురం టౌన్ : ప్యాకేజీల పేరుతో ఆంధ్రా ప్రజలను మోసగిస్తున్నందుకు నిరసనగా శనివారం జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ పాటిస్తున్నాయని జిల్లా ఏపీ అన్ ఎయిడ్‌డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఆపుస్మా) అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసి వేసి బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
భారత్ బంద్
- గ్యారేజీకి పరిమితం కానున్న బస్సులు - మూతపడనున్న బ్యాంకులు - కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా - సెలవు ప్రకటించిన ప్రైవేట్ విద్యా సంస్థలు ఒంగోలు టౌన్ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జిల్లాలో విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు సిద్ధమయ్యారు. పదిహేను రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సమ్మె పురస్కరించుకొని పోస్టల్, టెలికం, ఎల్ఐసీ కార్యాలతో పాటు బ్యాంకులన్నీ మూతపడే అవకాశాలున్నాయి. ఆర్టీసీలో బస్సులు గ్యారేజీకే పరిమితం కానున్నాయి. అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, వైఎస్‌ఆర్‌టీయూ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 1991 నుంచి కేంద్ర కార్మిక సంఘాలు దశలవారీగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ వస్తున్నాయి. తాజాగా 17వసారి చేయనున్నారు. రెండు లక్షలకు పైగా కార్మికులు పాల్గొనే అవకాశం జిల్లాలోని వివిధ రంగాల్లో 515059 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్షా 50వేల మంది బిల్డింగ్ వర్కర్లు, 25వేల మంది ఆటో కార్మికులు, 25వేల పొగాకు గ్రేడింగ్ కార్మికులున్నారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో 26880, షాపు గుమస్తాలుగా 10900, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో 5625, క్వారీల్లో 7000, ఇటుక బట్టీల్లో 5625, పలకల పరిశ్రమల్లో 3000, రెస్టారెంట్లు, హోటళ్లలో 5442 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన 9485 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 5000 మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, 2985 మంది ఆశ కార్యకర్తలు, 187మంది మెడికల్ రిప్స్, 8600 మంది అంగన్వాడీలున్నారు. వీరంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆర్టీసీలో 4200 మంది కార్మికులుండగా, అందులో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్‌కు సంబంధించిన దాదాపు 2500 మంది కార్మికులు పాల్గొననున్నారు. భారీ ప్రదర్శన, సభకు ఏర్పాట్లు సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలు నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి ప్రదర్శన ప్రారంభమై కలెక్టరేట్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల నేతలు ఎండగట్టనున్నారు. సార్వత్రిక సమ్మెకు ఎన్జీఓ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. -
నేటి నుంచి కాలేజీలు బంద్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్‌కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడం వల్ల కాలేజీల్లో సిబ్బందికి జీతాలు చెల్లించలేక పోతున్నామని కాలేజీల యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో కాలేజీల బంద్ పాటించక తప్పడం లేదని కాలేజీల యాజమాన్యం ప్రకటించింది. -
ప్రై వేట్ డిగ్రీ, పీజీ కళాశాలల 3 రోజుల బంద్
కమాన్‌చౌరస్తా : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి మూడు రోజుల పాటు శాతవాహన యూనివర్సీటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు శాతవాహన యూనివర్సీటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్(సుప్మా) అధ్యక్షుడు వి.సతీశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014–15, 2015–16 విద్యా సంవత్సరానికి ఫీజు బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఆన్లైన్ ప్రవేశాల్లో కళాశాలల్లో అంతర్గత మార్పు చేర్పులు, ఎంసెట్, ఇతర కోర్సుల ప్రవేశాల్లో అడ్మిషన్లు పొందని వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు కరీంనగర్ కల్చరల్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఎంబీఏ తృతీయ సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నట్లు సమన్వయ కేంద్రం సహాయ సంచాలకుడు ఇ.రాజేందర్ రెడ్డి తెలిపారు. 2012 నుంచి 2015 వరకు అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీగ్రీలో ప్రవేశాల కోసం ఈనెల ఎనిమిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని లేదా 7382929606 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ప్రైౖ వేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలోని నలంద జూనియర్ కళాశాలలో గురువారం విజిలెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ శాఖ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో అధికారుల బృందం కళాశాల రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు, బాత్రూంలు, ఆటస్థలాలు, అధ్యాపకుల అర్హతలు, విద్యా సంస్థల ధ్రువపత్రాలు, అనుమతులను తనిఖీ చేస్తున్నామని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందాయా లేదా.. అన్న విషయాన్ని కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించామని, ఇంకా 50 కళాశాలల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు కళాశాలల్లో అగ్నిమాపక, సానిటరీ ధ్రువపత్రాలు లేకపోవడం తమ పరిశీలనలో గుర్తించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ శాఖ ఏఈఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ సతీశ్‌రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
వరంగల్ : నర్మెట మండల కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక సింధూజ డిగ్రీ కాలేజీ, భార్గవి ఒకేషనల్ కాలేజీ, తరిగొప్పులలోని వల్లభి జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్రూంలు, అధ్యాపకుల లభ్యత, ఫీజుæ రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వానికి రహస్య నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సింధూజ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు పార్ట్‌టైంగా పని చేస్తున్నారని తెలిపారు. భార్గవి కళాశాలలో ల్యాబ్, గ్రంథాలయ సమస్య ఉందని, వల్లభి జూనియర్ కళాశాలలో అసంపూర్తి భవనం ఉందన్నారు. 700 కాలేజీలకుగానూ ఇప్పటిదాకా 450 చోట్ల సోదాలు పూర్తయ్యాయయన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈ సుగుణాకర్‌రావు, అధ్యాపకులు అంజయ్య, భాను కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆందోళన: కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్ : చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సెలవులు అడిగినందుకు కాలేజీ సిబ్బంది తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. అందుకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వారు కూడా ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలో దిగి.. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
రాజకీయాలనూ శాసిస్తున్నాయ్!
- ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై స్వామిగౌడ్ - తమను ముట్టుకుంటే అంతం చేస్తామనే పరిస్థితి ఉందని ధ్వజం - టెన్త్ పాసైన వ్యక్తులు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారని ఆవేదన - హైదరాబాద్‌లో ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్ పుస్తకావిష్కరణ - ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, చుక్కా రామయ్య తదితరుల హాజరు సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రైవేటు విద్యాసంస్థలు రాజకీయ రంగాన్నీ శాసించే స్థాయికి చేరాయి. మమ్మల్ని ముట్టుకుంటే ఎవరినై నా అంతం చేస్తామని బెదిరించే స్థాయికి వ చ్చాయి’’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మండిపడ్డారు. ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్(ఈఐ) సంస్థ ఆధ్వర్యంలో విద్య ప్రైవేటీకరణ-వ్యాపారీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు పరిశోధించి రూపొందిం చిన ‘ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్’ పుస్తకాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రైవేటు సంస్థలు భూతాల్లా విస్తరిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్‌కాని వ్యక్తులు మెడికల్ కళాశాలలను, ఏడో తరగతి చదవని వారు ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారంటే ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈఐ సంస్థ పరిశోధనలో తేలిన అంశాలను ప్రభుత ్వం పరిగణనలోకి తీసుకుంటుందని, అందరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణకు అందరం వ్యతిరేకమేనని, సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీలు అధికంగా ఇవ్వడంతో కీలక శాఖలకు నిధుల కొరత ఏర్పడుతోందన్నారు. ఈఐ సూచించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసికెళ్తానన్నారు. కార్యక్రమంలో ఈఐ చీఫ్ కోఆర్డినేటర్ శశిబాలాసింగ్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆంగ్లియో, రీసెర్చ్ ఫ్రొఫెసర్లు సంగీతా కామత్, జొన్నలగడ్డ ఇందిర, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, కొంపల్లి యాదవ్రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, జాఫ్రీ, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, సుబ్బారెడ్డి, తెలంగాణ, ఏపీలకు చెందిన వివిధ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మూడు ప్రైవేటు కళాశాలలను రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలిసారిగా శుక్రవారం తనిఖీ చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ఏఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేష్, సీఐడీ సీఐ సదానిరంజన్, ఏసీబీ సీఐ రమణమూర్తి, విజిలెన్స్ ఇంజనీరింగ్ అధికారి భానుప్రకాష్, ఎఫ్ఆర్ఓ అహ్మద్ మియా, మాధవరావు తదితరులు రెండు బృందాలుగా తనిఖీలు సాగించారు. చర్ల రోడ్డులోగల కళాశాలలో విద్యార్థులకు తగిన వసతులు లేకపోవడాన్ని, వెలుతురు లేని గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండడాన్ని గుర్తించారు. అర్హతగల అధ్యాపకులు లేకుండానే కళాశాల నిర్వహిస్తున్నారని, రికార్డుల్లో నమోదు చేసిన మేరకు విద్యార్థులు లేరని తనిఖీ బృందం గుర్తించినట్టు సమాచారం. ఐటీడీఏ రోడ్లోగల కళాశాలను తనిఖీ చేసిన ఈ బృందం.. అక్కడ అనేక లోపాలను గుర్తించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్‌లో వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాలను నిర్వహిస్తుండడాన్ని, బాలిబాలికలకు అదే క్యాంపస్‌లోనే హాస్టల్ ఏర్పాటు చేయడాన్ని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక్కడ కూడా అర్హత గల అధ్యాపకులు లేరని, విద్యార్థులకు తగిన వసతులు లేవని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ రెండు బృందాలు తమ తనిఖీలలో గమనించిన అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ అధికారులు శనివారం కూడా భద్రాచలంలోని మరికొన్ని కళాశాలలను పరిశీలిస్తారు. తనిఖీ వివరాలను వెల్లడించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అంగీకరించలేదు. తమ పరిశీలనలో తేలిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. -
‘గురు’తర బాధ్యత మరిచారా?
సగటు విద్యార్థులను సమున్నతులుగా తీర్చిదిద్దడం, సమాజానికి ఉపయోగపడే పటుతర శక్తిగా మలచడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చడం ఎంతో ఇష్టంతో, ఆపేక్షతో చేయాల్సిన పనులు. అందుకవసరమైన నిబద్ధతను, నైపుణ్యాన్ని గురువుల్లో పెంపొందింపజేయడం ఉపాధ్యాయ శిక్షణ సారాంశం. ఆ శిక్షణ పొంది, అటుపై డీఎస్సీలాంటి రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు తదితర వడబోతలు పూర్తయి విజేతలుగా నిలిచినవారు ఉపాధ్యాయులవుతారు. తీరా అలా నియమించాక వారు కాస్తా ఏ రాజకీయ నాయకుడి ప్రాపకమో సంపాదించి ప్రజాప్రతినిధుల దగ్గరా, మంత్రుల దగ్గరా వ్యక్తిగత సహాయకులుగా చేరడానికి తహతహలాడుతున్నారు. పాఠం చెప్పడం కంటే అధికార పీఠాలకు సన్నిహితంగా మెలగడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు కొడిగట్టి క్రమేపీ అవి చిక్కి శల్యమై మూతబడుతున్నాయి. మారుమూల పల్లెసీమల్లో సర్కారీ స్కూళ్ల వాలకం చూసి అందులో చదివిస్తే ఎందుకూ కొరగాకుండా పోతారన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి దూరమైనా, భారమైనా తమ పిల్లల్ని ప్రైవేటు విద్యా సంస్థలకు పంపు తున్నారు. గత్యంతరం లేనివారు తమకింతే ప్రాప్తమని సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా పల్లెసీమల్లోని పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల్ని బోధనేతర విధుల్లో కొనసాగించవద్దని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికిచ్చిన ఆదేశాలు ఊరటనిస్తాయి. మన దేశంలో విద్యారంగం భ్రష్టుపట్టడానికి, ప్రమాణాలు నానాటికీ క్షిణి స్తుండటానికి కారణాలెన్నో! అందులో పాలకులుగా ఉంటున్నవారి పాపాలే అధికం. ఉపాధ్యాయులుగా అన్ని అర్హతలూ ఉన్నవారిని సైతం స్పెషల్ టీచర్లుగా, అప్రెంటిస్ టీచర్లుగా, కాంట్రాక్టు టీచర్లుగా నియమించడం మన ప్రభుత్వాలు నేర్చిన విద్య. ఈ పేర్లు పెడితే అరకొర జీతాలిచ్చి, ఇంక్రిమెంట్లు తదితర ప్రయోజనాలు ఎగ్గొట్టి ఎన్నాళ్లయినా కాలక్షేపం చేయొచ్చునని అవి భావిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో సదుపాయాల లేమి సరేసరి. సకల మౌలిక వసతులు, బోధన వనరులున్న స్కూళ్ల సంఖ్య పది శాతం మించడం లేదని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం మరుగుదొడ్డి సౌకర్యం కొరవడి పల్లెల్లో ఆడపిల్లల్ని చదువుకు పంపడమే మానుకుంటున్న దుస్థితి ఉంది. బడి ఈడుకొచ్చిన పిల్లల్లో అధిక శాతంమంది బయటే ఉంటున్నారని, చేరినవారిలో సైతం అనంతరకాలంలో ఎక్కువ శాతం బడి మానేస్తున్నారని ఆ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ సమ స్యలు చాలవన్నట్టు ఉపాధ్యాయ వృత్తికి అంకితమవ్వాల్సినవారు సైతం బడి ఎగ్గొట్టి ఏ ప్రజాప్రతినిధి పంచనో ఏసీ రూముల్లో సేద తీరుదామనుకుంటే, కార్లలో తిరుగుతూ కాలక్షేపం చేద్దామనుకుంటే ఇక చెప్పేదేముంది? ఒకపక్క పాఠశాలలు నాసిరకం ప్రమాణాలతో నీరసిస్తున్నాయని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు ఆందోళనపడుతున్నారు. ఆ సంగతి ఎవరికంటే కూడా ప్రజాప్రతినిధు లకు బాగా తెలుసు. తెలిసికూడా ఉపాధ్యాయుల్ని సహాయకులుగా నియమించు కుని తామూ సమస్యలో భాగమవుతున్నామని వారికి అర్ధం కాకపోవడం ఆశ్చర్య కరం. అంతకన్నా విచిత్రమేమంటే మన విద్యారంగాన్ని ఉన్నతీకరించడానికి అడ్డొస్తున్న అంశాలేవో క్షుణ్ణంగా తెలిసి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు సైతం ఈ విషయంలో మౌనం దాల్చడం! తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య వంటి ఒక సామాజిక సంస్థ లేవనెత్తిన ఈ సమస్య వారెవరికీ స్ఫురణకు రాలేదనుకోవాలా... వచ్చినా మిన్నకుండిపోయారని భావించాలా? తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏడు గ్రామాల ప్రజానీకం నిరుడు హైదరాబాద్ హైకోర్టుకు లేఖలు రాస్తే వాటిని ఉన్నత న్యాయస్థానం ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారేమని నిలదీసింది. ఇదే వరస కొనసాగితే అధికారుల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందోగానీ...పీఏలు, పీఎస్లుగా జీవితం వెళ్లదీస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పిలవాలన్న ఆలోచన మాత్రం రాలేదనుకోవాలి. ఆ మాట సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సివచ్చింది. తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరఫు న్యాయవాది కె. శ్రావణ్‌కుమార్ చెప్పిన వివరాలనుబట్టి చూస్తే సుప్రీంకోర్టు జోక్యం తర్వాత రాష్ట్రంలో పాఠశాలల స్థితి కాస్త మెరుగైంది. మూతబడిన 398 పాఠశాలల్లో 271 తెరుచుకున్నాయి. పిల్లల హాజరు గతంతో పోలిస్తే పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాత్రంగానైనా లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను గాలికొదిలారన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో అయితే డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ వంటి పోస్టుల్లో 90 శాతం ఖాళీలున్నాయని శ్రావణ్‌కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మారుమూల గ్రామాల పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్తున్నారో, లేదో పర్యవేక్షించే వ్యవస్థ పడకేసిందని దీన్నిబట్టి రుజువవుతోంది. ఉపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వడం, ఆ ప్రకారమే వారిని బదిలీ చేస్తుండటం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న పద్ధతి. పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నవారికి, మహిళా ఉపాధ్యాయులకు దీన్ని వర్తింపజేయడం వరకూ మంచిదే. కానీ అందరికీ వర్తింపజేసే ప్రస్తుత విధానంవల్ల కూడా మారుమూల పల్లెలకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. ఇలా అనేకానేక సమస్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు అనాథగా మారాయి. ఎవరూ పట్టించుకోక బావురు మంటున్నాయి. ఒకపక్క ఆరు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందిస్తామంటూ విద్యాహక్కు చట్టం అమల్లోకి తెచ్చి ఆరేళ్లవుతోంది. అయినా విద్యారంగం అంతంతమాత్రంగానే ఉంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. సమస్యలన్నిటినీ సమగ్రంగా సమీక్షించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. -
టీసీ ఇవ్వలేదని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కారేపల్లి: ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వలేదని..ఇంటర్ విద్యార్థిని జ్వరం టాబ్లెట్లు, కిరోసిన్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన తాటి స్వప్న కారేపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో గత ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయగా, కొన్ని సబ్జెక్టులు తప్పాయి. అప్పటి నుంచి టీసీ, సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యం చుట్టూ తిరిగింది. ఈ ఏడాదైన సర్టిఫికెట్లు ఇస్తారేమోననే ఆశతో స్వప్న ఈ నెల 18వ తేదీన కాలేజీకి వెళ్లగా..సోమవారం ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఉదయం స్వప్న కాలేజీకి వెళ్లగా, వ్యాను ఫీజు రూ. 2 వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని దబాయించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్వప్నను స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. -
విద్యాశాఖ కొరడా
విజయనగరం: గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు ప్రధాన అంశంగా విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇన్చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి సారధ్యంలో మండల విద్యాధికారులు 6 బృందాలుగా ఏర్పడి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. 58 పాఠశాలల్ని తనిఖీ చేసి అందులో 19 గుర్తింపు లేనివిగా నిర్థారించారు. వాటిని తక్షణమే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ లింగేశ్వరరెడ్డి సమక్షంలో అమర్ కాన్సెప్ట్ స్కూల్, వెంకటరమణ స్కూల్, బీఎస్ఎం స్కూళ్లకు తక్షణ చర్యలుగా తాళాలు వేశారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తం దాడులు చేస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకొని మరో నాలుగు స్కూళ్లలో యాజమాన్యాలు అనధికార అదనపు తరగతుల విభాలను మూసేశాయి. మూతబడిన పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి రెన్యువల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నవే అధికంగా ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలకు మాత్రమే గుర్తింపు తెచ్చుకొని ఉన్నత పాఠశాల తరగతులను అనధికారికంగా నిర్వహిస్తున్నవి మరికొన్ని ఉన్నాయి. 19 పాఠశాలల్లో పట్టణ పరిధిలోని ప్రసన్న ప్రాధమికోన్నత పాఠశాల, ఆల్ఫా స్కూల్, సరస్వతీ విద్యామందిర్, సాధుసుందరం, గురుదత్తా స్కూల్(కంటోన్మెంట్), ప్రతిభా స్కూల్, రవి స్కూల్, సాయిదుర్గ స్కూల్, సూర్య పబ్లిక్, లివింగ్డాల్ స్కూల్, వశిష్ట స్కూల్, విజయనగరం పబ్లిక్ స్కూల్, ఎయిమ్ ప్రైమరీ స్కూల్, విద్యాన్ యూపీ స్కూల్ ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గుర్తింపులేని స్కూళ్లలో చేరొద్దు గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను ఎట్టిపరిస్థితుల్లో చేర్పించవద్దని ఇన్చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి సీసీఈ విధానం అమలు కాబోతోందని, గుర్తింపులేని పాఠశాలల్లో చదివిన వారికి ఈ విధానం ద్వారా పదోతరగతి ప్రైవేటుగా పరీక్షలకు పంపించడం వీలుపడదని వివరించారు. ఈ నేపధ్యంలో చదివించిన పాఠశాల గుర్తింపు అంశం తెలుసుకోవడంపై తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. -
ప్రైవేటు బస్సా.. ఐతే ఓకే
సామర్థ్య ధ్రువపత్రం లేని 215 బస్సులు డొక్కు బస్సుల్లోనే విద్యార్థుల తరలింపు పట్టించుకోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విజయనగరం : భారీగా ఫీజులు వసూలు చేయడంపై ప్రైవేటు విద్యాసంస్థలు చూపుతున్న శ్రద్ధ విద్యార్థుల భద్రతపై పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నా, వారి భద్రతకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికల్లా తమ బస్సులకు సామర్థ్య పరీక్ష చేయించుకోవలసిన యాజమాన్యాలు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణ శాఖాధికారులు ఏకారణం వల్లో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కన్నెత్తి చూడటం లేదు. జిల్లాలో 509 ప్రైవేటు స్కూల్, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో ఇంతవరకు 294 బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్ష చేయించుకోగా 215 బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికల్లా సామర్థ్య పరీక్ష చేయించుకోని బస్సులు రోడ్కెక్కేందుకు వీల్లేదు. కానీ సోమవారం అత్యధిక ప్రైవేటు పాఠశాలలు డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలించాయి. గత ఏడాది సామర్థ్యం లేని పాఠశాల బస్సులపై రవాణ శాఖాధికారులు కేసులు నమోదు చేసారు. ఈ ఏడాది మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. సామర్థ్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం పొందకుండా తిరుగుతున్న వాహనాలపై మంగళవారం నుంచి దాడులు చేస్తాం. అలాంటి వాటిని సీజ్ చేస్తాం. - ప్రవీణ్‌కుమార్, వెహికల్ ఇన్స్పెక్టర్ -
ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకం కాదు
ఉప ముఖ్యమంత్రి కడియం హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఆధ్వర్యంలో నాగోలు శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో కడియంతో పాటు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు లేదు. లోపాలను సవరించుకోవాలని చెబుతున్నాం. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది. మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ర్టం దిగువ స్థానంలో ఉంది. దీన్ని మెరుగుపరచాలి. రాష్ర్టంలో ప్రైవేటు విద్యా సంస్థల్లోనే అధిక సంఖ్యలో విద్యార్థులున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చేలా బోధన ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రైవేటు విద్యా సంస్థలు ఎదర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తాం. అదే సమయంలో వాటి యాజమాన్యాలు లోపాలు సవరించుకుని బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాల’ని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వానికి సహకారం అందించాలని వినోద్, రాజేశ్వర్‌రెడ్డి కోరారు. అనంతరం ట్రస్మా వెబ్‌సైట్‌ను కడియం ఆవిష్కరించారు. -
'ఆ సంస్థలకు మేం వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందరికి ఉచిత విద్య అందాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. -
బోగస్ విద్యాసంస్థలను ఏరిపారేస్తాం: కేసీఆర్
బోగస్ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాణ్యమైన విద్య, విజిలెన్స్ తనిఖీలు వంటి అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో విద్యాసంస్థలు నడవాలన్నారు. బోగస్ విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పారు. విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన లోపాలను సవరించుకునే అవకాశాన్ని విద్యాసంస్థలకు ఇస్తామన్నారు. విద్యార్థులే లేకుండా కాలేజీలు నడపటం దారుణమని చెప్పారు. వేలంవెర్రిగా ఒకే కోర్సును విద్యార్థులు చేయడం వల్లే.. నిరుద్యోగ సమస్య తలెత్తుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి సమస్యలపై చర్చించినట్టు చెప్పారు. తనిఖీలు గురించి ఆందోళన వద్దన్నారు. లోపాలు సరిదిద్దుకునేందుకు తగిన సమయం ఇస్తానన్నారని తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని కేసీఆర్ సూచించినట్టు ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ తెలిపింది. -
ఓపెన్ దోపిడీ
రాజమహేంద్రవరంలోని ఓ స్టడీసెంటర్ కేంద్రంగా కోరుకొండలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పరీక్షల చూసిరాత బాగోతంపై ఈ నెల నాలుగో తేదీన ‘సాక్షి’లో ‘సొమ్ములిచ్చుకో.. చూసి రాసుకో’ అనే కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. పది రోజుల వ్యవధిలోనే.. మరో యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల నిర్వహణలో ఇలాంటి బాగోతమే తాజాగా వెలుగుచూసింది. గతంలో గోకవరంలో జూనియర్ కళాశాలలో పనిచేసి, ప్రస్తుతం రావులపాలెంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కాంట్రాక్ట్ అధ్యాపకుడు, రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఒకేషనల్ కళాశాల నిర్వాహకులు.. దూరవిద్య పేరుతో ఏటా ఈ దందా సాగిస్తున్నారు. గోకవరం కేంద్రంగా ఏటా రూ.50 లక్షలు కొల్లగొడుతున్నారు. ఓపెన్ స్కూలులో విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు చూసి రాయించడమే వీరు చేసే పని. ఇదే విధానంలో డిగ్రీ కూడా పాసై పోవచ్చంటూ విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఓ విద్యార్థి దొరికాడంటే.. నాలుగేళ్ల పాటు వారికి పండగే. ఓపెన్ స్కూలు ద్వారా ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం, దూర విద్య పేరుతో డిగ్రీ మూడేళ్లు.. ఏమీ చదవకుండా చూసిరాసినందుకు సొమ్ము భారీగా వసూలు చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఒక్క గోకవరంలోనే ఏటా సుమారు 500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్టు అంచనా. గీతం యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపు రం, కిర్లంపూడి, గోకవరం ప్రాంతాల్లో జరుగుతున్నా యి. గోకవరంలోని హన్నా జూనియర్ కళాశాలలో గత కొద్దిరోజులుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోకవరం కేంద్రంలో పరీక్షలు చూసిరాసేందుకు వీలుం టుందని జిల్లావ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఈ కేంద్రాన్నే ఎంచుకుంటున్నారు. డిగ్రీ దూరవిద్య మొ దటి ఏడాదికి పరీక్ష ఫీజు రూ.3,300 ఉండగా, పరీక్షలు చూసిరాసేందుకు రూ.6,500 వంతున ఒకొక్కరి వద్ద కట్టించుకుంటున్నారు. తాము పరీక్ష ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నామని, మిగతా సొమ్ము దందా చేసేవారే జేబులో వేసుకుంటారని, తమకు చెల్లించలేదని వర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. గోకవరంలో ఈ పరీ క్షలు ఫస్టియర్‌కు సుమారు 110 మంది రాస్తుండగా, సెకండియర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి జరగనున్నా యి. నిబంధనల ప్రకారం పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరగాలి. కొందరు అక్రమార్కులు.. ఉన్నతాధికారులను ‘ప్రసన్నం’చేసుకుని, అనుకూలంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. మాకు సంబంధం లేదు ‘ఇక్కడ నిర్వహిస్తున్న పరీక్షలకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదు. పరీక్షలు నిర్వహించుకునేందుకు మా కళాశాల కేంద్రంగా కావాలని అడిగారు. పరీక్షల నిర్వహణ, ఇతర కార్యకలాపాలన్నీ గీతం యూనివర్సిటీ వారే చూసుకుంటున్నారు.’ - సువర్ణ కుమార్, కరస్పాండెంట్, హన్నా కళాశాల అధికంగా వసూలు చేయడం లేదు ‘పరీక్షలు చూసి రాసేందుకు విద్యార్థుల నుంచి మేము అధిక ఫీజులు వసూలు చేయడం లేదు. మధ్యలో దళారులు ఏం చేసినా, ఎంత వసూలు చేసినా మాకు సంబంధం లేదు. పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ అనేది జరగలేదు.’ - రాజు, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, గీతం యూనివర్సిటీ -
‘తీరు మారకుంటే ఎడ్యుకేషన్ హాలిడే’
నాంపల్లి: తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల ఉనికే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారకుంటే ఎడ్యుకేషన్‌కు హాలిడే ప్రకటిస్తామని తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేజీ-పీజీ) జేఏసీ కన్వీనర్ రమణారెడ్డి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో తనిఖీలు చేయడాన్ని జేఏసీ స్వాగతిస్తూనే, పోలీసులతో సోదాలు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. మంగళవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేజీ-పీజీ) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రైవేట్ యాజమాన్యాలు రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ దాడులు-ప్రభుత్వ విధానాలు అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఎం.శ్రీనివాస్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రైవేట్ యాజమాన్యాలకు సంఘీభావం ప్రకటించారు. -
ఖరీదైన కాలేజిలు.. పనికిమాలిన డిగ్రీలు: రాజన్
పెద్ద మొత్తాల్లో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని బడా సంస్ధల్లో డిగ్రీలు చేయడం వల్ల ఏం ప్రయోజనం కలగదనీ.. అందువల్ల విద్యార్ధి అప్పుల పాలవుతారని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. శివనాదర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజన్.. ఈ పై వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంస్థల్లో చేరడం వల్ల ఏమీ ఉపయోగం లేదని, విద్యార్థి డిగ్రీని అందుకునే క్రమంలో అందుకు తగ్గ కృషి చేయాలని ఆయన అన్నారు. ఖరీదైన కాలేజీలు ఇస్తున్నవాటిలో చాలావరకు డిగ్రీలు పనికిమాలినవేనని.. వాటి వల్ల ఉద్యోగాలు రాక, తీసుకున్న విద్యారుణాలు తిరిగి చెల్లించలేక విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు విద్య ఖరీదు ఎక్కువగా ఉందనీ.. రాబోయే కాలంలో ఇది మరింతగా పెరగనుందని అన్నారు. ఈ విద్యాసంస్థలు వెనుకబడిన విద్యార్ధుల వైపు కన్నెత్తి కూడా చూడవనీ.. ఆఖరి అతను పనికిరాని డిగ్రీ, అప్పులతో సతమతం కావాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇలా స్నాతకోత్సవంలో చెప్పిన మాటలను పిల్లలు త్వరగానే మర్చిపోతారని కానీ, ఇప్పటి నుంచి ఐదేళ్ల తర్వాత విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను బట్టి మంచి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. -
ఎంసెట్‌కు సరే.. కానీ..
♦ ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే సమ్మతమన్న ఎంసీఐ ♦ సూత్రప్రాయంగా అంగీకరించిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఎంసెట్‌కు మార్గం సుగమమవుతోంది. కానీ దీనికి భారత వైద్య మండలి(ఎంసీఐ) కొన్ని షరతులు ప్రతిపాదించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం ఈ ఏడాది వరకు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో మాత్రమే ప్రవేశానికి ఎంసెట్‌ను అనుమతించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినా... తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ జరపుతున్న చర్చల నివేదికను బట్టే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్లకు ప్రవేశపరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. వాటికి ‘నీట్’ నుంచి మినహాయింపు ఇవ్వబోమని పేర్కొంది. అలాగే ఇప్పటికే నీట్-1 రాసిన విద్యార్థులు జులై 24న జరగబోయే నీట్-2 పరీక్ష రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వైద్య విద్యలో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నిర్వహణపై పలు రాష్ట్రాలు, ప్రైవేటు వైద్య కళాశాలల అభ్యంతరాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సంబంధిత పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం తిరిగి విచారణ చేపట్టింది. ఎంసీఐ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ పలు నూతన ప్రతిపాదనలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాలను అనుసరించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తే తమకు సమ్మతమేనన్నారు. అయితే, ప్రైవేటు కళాశాలలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ప్రవేశ పరీక్షలు ఉండకుండా ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ అభ్యంతరం చెబుతూ తమకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు, రాష్ట్రస్థాయి చట్టాలతో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సైతం తామే ప్రవేశాలు కల్పిస్తామని ధర్మాసనానికి విన్నవించారు. దీనికి స్పందించిన జస్టిస్ అనిల్ ఆర్ దవే.. ప్రైవేటు కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించబోమని చెప్పారు. దీనిపై ప్రైవేటు కళాశాలల తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ స్పందిస్తూ ఒకవేళ నీట్‌ను తప్పనిసరైతే ఇకపై తాము మెరిట్లో పేద విద్యార్థులకు ఇస్తున్న 50 శాతం సీట్ల రిజర్వేషన్‌ను ఉపసంహరించుకుంటామన్నారు. దీనికి ధర్మాసనం స్పందించలేదు. ఎంసీఐ మరో ప్రతిపాదననూ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. తొలుత తాము జాతీయ పూల్‌లోని 15 శాతం సీట్లను ఉద్దేశించి ఏఐపీఎంటీ పరీక్ష నిర్వహించదలిచామని, అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము దీనిని నీట్-1గా మార్చామని చెప్పింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది విద్యార్థులు గైర్హాజరైనందున వారికి నీట్-2లో అవకాశం కల్పించేందుకు కోర్టు అనుమతించాలని కోరారు. సమయం కోరిన కేంద్రం కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. తాము నీట్ నిర్వహణపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలను స్వీకరించామన్నారు. వీటిపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చలు జరుపుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వారాంతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, తమ వైఖరి తెలిపేందుకు సోమవారం వరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం సమ్మతించింది. చివరగా జస్టిస్ అనిల్ ఆర్ దవే స్పందిస్తూ ‘ప్రైవేటు కళాశాలలు, వాటి అసోసియేషన్లు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదన్న ఎంసీఐ ప్రతిపాదనను మేం సమ్మతిస్తున్నాం. అలాగే నీట్ ఉండాలన్న ప్రతిపాదనకూ సమ్మతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చా లేదా అనే విషయమై సోమవారం అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పే వైఖరిని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. -
ప్రైవేట్ విద్యాసంస్థల ‘తనిఖీ’ తప్పదా?
చాలా ప్రైవేట్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు అనే విషయం బహిరంగ రహస్యం. ఇక్కడ మౌలిక సదుపాయాలు అంటే మొదటిది. టీచింగ్ స్టాఫ్. రెండవది నాన్ టీచింగ్ స్టాఫ్. మూడవది ప్రయోగశాలలు, నాలుగవది తరగతి గదులు మొదలైనవి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి పరిశీ లించినట్లయితే మొదటిది టీచింగ్ స్టాఫ్. చాలా కళాశాలలు సరిపడా అధ్యాపకులను నియమించు కోవడం లేదు. ఉదాహరణకు ఒక కళాశాల బీఎస్సీ, బీజెడ్‌సీకి రెండు సెక్షన్లకు అనుమతి తీసుకుని ఒకే సెక్షన్‌కి అధ్యాపకుడిని నియమించుకుని కళాశాలను నడ పడం. పోనీ.. ఆ అధ్యాపకుడు అయినా ఆ కళాశా లలో ఫుల్‌టైమ్ చేస్తాడా అంటే అదీ ఉండదు. ఒకే అధ్యాపకుడు అదే పట్టణంలో రెండు మూడు కళాశా లల్లో బోధిస్తాడు. దీనివలన కళాశాలలు వేతనాలు తగ్గించుకుని లాభపడటం, విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. రెండోది నాన్ టీచింగ్ స్టాఫ్. అటెం డర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరూ దీనికిందికే వస్తారు. ఇక్కడ ప్రధానమైన లోపం ఎక్కడ కనపడు తుంది అంటే ప్రయోగశాలలో ల్యాబ్ అసిస్టెంట్లు. లైబ్రరీలో లైబ్రేరియన్లు అసలుకే ఉండరు. ఎందు కంటే కళాశాలలో ప్రయోగశాలలు లైబ్రరీలు అంతంత మాత్రమే కాబట్టి, ఇక మూడవది ప్రయోగ శాలలు. ఇవి పేరుకే ఉంటున్నాయి. రూము ముందు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉంటుంది కానీ ల్యాబ్‌లో సరైన ప్రయోగ పరికరాలు ఉండవు. నాలుగవది లైబ్రరీ సౌకర్యం. చాలా కళాశాలల్లో లైబ్రరీ మొత్తం ఒక్క బీరువాకే పరిమితమై కని పిస్తుంది. వాస్తవానికి విద్యార్థులందరికి సరిపడా పుస్తకాలు ఉండాలి. కాని చాలా చోట్ల మనకు అలాంటి పరిస్థితి కనబడదు. ఇక ఐదవది. తరగతి గదులు, అనుమతి పొందిన గ్రూపులకు సరిపడ తరగతి గదులు చాలా కళాశాలల్లో మనకు కనబడవు. కొన్ని కళాశాలల్లో వివిధ గ్రూపుల విద్యార్థులను కలిపి పాఠాలు బోధిస్తారు. ఇక ముఖ్యమైన అంశం ఏమంటే ప్రైవేటు కళా శాలలు.. క్లాసులకే రాని పిల్లలకు కూడా హాజరు శాతం వేసి ఫీజు రీయింబర్స్మెంట్ పొంది లబ్దిపొం దుతున్న విషయం మనం గమనించాలి. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నప్పుడు వాటిని తీసుకుంటున్న కళాశాలలు మౌలిక సదుపా యాలను కల్పించి విద్యావ్యవస్థ అభివృద్ధికి దోహద పడాలి. లేకుంటే విద్యావ్యవస్థకు పెను ప్రమాదం పొంచివుండే కాలం ఎంతో దూరంలో లేదు. పై కారణాల వల్ల ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రయోగశాలలు, లైబ్రరీ సౌకర్యం, సరిపడ తరగతి గదులు గల కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి, ఎవరైతే విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా హాజరవు తారో వారికే స్కాలర్షిప్లు అందేలాగా చర్యలు తీసుకోవాలి. దీనికోసం విద్యార్థు లందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న బయో మెట్రిక్ విధానం విద్యార్థులతోపాటు, అధ్యాపకులకి కూడా వర్తించేటట్టు చేయాలి. మోదాల్ మల్లేష్, జంతుశాస్త్ర అధ్యాపకులు, పాలెం, నకిరేకల్, నల్లగొండ మొబైల్: 9989535675 నీటి కొరతపై చర్యలేవీ? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సి పాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటు న్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం మూలాన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా బావుల్లో నీరు లేకపో వడం, బోర్లు నడవకపోవడం మూలాన ప్రజలు నానాయాతన పడుతున్నారు. మున్సిపా లిటీలు, నగర పంచాయితీలలో నల్లాల ద్వారా నీరు సరఫరా కావడం లేదు. గ్రామ, నగర పంచాయితీల పాలక వర్గాలు ప్రజలకు తాగు నీటిని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ట్యాంకర్ల ద్వారా వారానికి ఓసారి నీటి సరఫరా జరుగుతున్నా అందరికీ నీరు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి. కష్టకాలంలో స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. - కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా -
టెట్, ఎంసెట్‌కు సహకరిస్తాం
♦ ముందుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం ♦ సహకరించేందుకు సిద్ధమంటూ ♦ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం లేఖ ♦ బంద్ యథాతథంగా కొనసాగిస్తామన్న ప్రైవేటు విద్యా సంస్థల టీజేఏసీ సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్ తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం బయటకు వచ్చింది. టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం సంఘం నేతలు గౌతంరావు తదితరులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలసి రాతపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నేతలు కూడా తాము పరీక్షలకు సహకరిస్తామంటూ లేఖ అందజేశారు. మరోవైపు తమ బంద్‌ను యథాతథంగా కొనసాగిస్తామని ఫార్మసీ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, డీఎడ్, బీఎడ్ కాలేజీ యాజమాన్య సంఘాల నేతలు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాందాస్, ఎస్ఎన్ రెడ్డి, రాంచందర్, సతీశ్, సిద్ధేశ్వర్, విజయ భాస్కర్ తదితరులు వెల్లడించారు. ఈ అంశంపై సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీలపై కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ఆ మేరకే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, అంతవరకు తమ ఆందోళ నను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
'మాకు, సీఎంకు గొడవలు పెడుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు ఆహ్వానించే వరకూ బంద్‌పై వెనక్కి తగ్గేది లేదని ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెట్, ఎంసెట్ పరీక్షలకు సెంటర్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అయితే తాము పోలీసుల తనిఖీలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. కొంతమంది తమకు, సీఎంకు మధ్య గొడవలు పెడుతున్నారంటూ ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆరోపించింది. -
టెట్, ఎంసెట్ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి
-ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు -సర్కారుకు టీఎన్జీవోల సంపూర్ణ మద్దతు -ప్రైవేట్ కళాశాలలు బంద్ ఉపసంహరించుకోవాలి కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఎన్జీవోలతో అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం తీరును ఖండించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేపడుతోందని సమర్థించారు. విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు టీఎన్జీవో సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టెట్, ఎంసెట్‌లను బహిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉపసంహరించుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసిన టెట్, ఎంసెట్ నిర్వహణకు ఉద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అవసరమనుకుంటే గౌరవ వేతనం లేకుండా విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కేంద్ర సంఘం నాయకులు రాజయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, వేముల రవీందర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్ పాల్గొన్నారు. -
మే 17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
♦ జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం ♦ ఆన్లైన్లో అనుబంధ గుర్తింపు ♦ ప్రైవేటు కాలేజీల్లోనూ బయోమెట్రిక్ ♦ ప్రైవేటు కాలేజీలతో సమీక్షలో సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను మే 17 నుంచి 31 వరకు నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే ఈ నెల 21న జరిగిన పాలిసెట్-2016 ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయాలని...పాలిటెక్నిక్ డిప్లొమా తరగతులను జూన్ 9 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. కాలేజీల దరఖాస్తు ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో అనుబంధ గుర్తింపును వచ్చే వారంలో చేపట్టి మే 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారానే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈలోగా కాలేజీల్లో లోపాల సవరణకు వారం సమయం ఇవ్వాలని... కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌లో, పరీక్ష విధానంలో మార్పులు తెస్తున్నామని, ఇందుకు యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించారు. తృతీయ సంవత్సర విద్యార్థులకు మాత్రం సీ-14 సిలబస్ ప్రకారమే బోధన కొనసాగుతుందని ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో కచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. కాలేజీలవారీగా వెబ్సైట్లను ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ వెబ్సైట్లో అనుసంధానించాలన్నారు. వార్షిక ఫీజులను రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచాలన్న ఫీజుల కమిటీ సిఫారసుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఎంవీరెడ్డి పేర్కొన్నారు. అఫిలియేషన్లు ఇచ్చే సమయంలో మంజూరైన ఇన్‌టేక్‌ను కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఫ్యాకల్టీని (1:20 నిష్పత్తిలో) చూసి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా పరిశీలిస్తామని డెరైక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్య మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మే 2న పాలిసెట్ ఫలితాలు! పాలిసెట్-2016 ఫలితాలను మే 2న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 30 నాటికి ఫలితాలు సిద్ధమవుతాయని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో మే 2న ఫలితాలు విడుదల చేయాలనుకుంటోంది. కాగా, పదో తరగతిలో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తున్న నేపథ్యంలో ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాల్లోనూ విద్యార్థుల ఆధార్‌ను తీసుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది పాలిసెట్‌కు హాజరయ్యారు. -
టెట్, ఎంసెట్‌ను బహిష్కరిద్దామా..?
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు ఆపకుంటే ప్రభుత్వం చేపట్టే రాష్ట్రస్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల నిర్వహణకు సహకరించొద్దని సర్వసభ్య సమావేశంలో పలు ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1, రెండో తేదీల్లో జరిగే టెట్, ఎంసెట్‌ను ప్రైవేటు విద్యాసంస్థల కేంద్రాల్లో బహిష్కరించాలని సూచించారు. ప్రవేశ పరీక్షలను అడ్డుకుంటే ప్రజలు, ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కేజీ టు పీజీ ప్రైవేటు విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛంధంగా తాళాలు వేసి డిప్యూటీ సీఎంకు తాళం చెవులు అప్పగించాలని ఇంకొందరు సూచించారు. వీటన్నింటి కంటే ముందుగా విద్యాసంస్థల్లో పోలీసుల జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించి, తనిఖీలపై స్టే ఆర్డర్ తెచ్చుకుంటే మంచిదన్నారు. మరోపక్క పోలీసుల తనిఖీలను నిరసిస్తూ... బహిరంగ సభ నిర్వహించాలని కొందరు నాయకులు సూచించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ డిమాండ్లను వివరించి, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని ఆయా సంఘాల నాయకులు ప్రతిపాదించారు. -
అంగట్లో వైద్య సీట్లు
♦ కోట్లు పలుకుతున్న ఎంబీబీఎస్ ♦ భారీగా ‘రిజర్వు’ చేసుకున్న ప్రైవేటు కాలేజీలు ♦ బీ కేటగిరీ సీట్లకు తూతూమంత్రంగా ప్రవేశ పరీక్ష ♦ మరోసారి ఫీజులు పెంచాలని ఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదన? సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య సీట్లు అంగడి సరుకుగా మారాయి. ఇంటర్ ఫలితాలు రావడానికి ముందే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎక్కడికక్కడ సీట్లను అమ్మకానికి పెట్టాయి. ముందస్తు అడ్వాన్సు సొమ్ము చెల్లించిన వారికి వాటిని రిజర్వు చేసి ఉంచాయి! ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ప్రైవేటు మెడికల్ యాజమాన్యాలు నిర్వహించే ప్రత్యేక వైద్య ప్రవేశ పరీక్షలు ఇంకా దరఖాస్తుల ప్రక్రియ స్థాయిలో ఉండగానే పలు ఎంబీబీఎస్ సీట్లను అడ్వాన్సులు పుచ్చుకొని ఇప్పటికే అమ్మేసినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా మినహా మిగతా సీట్లు చాలావరకు ‘రిజర్వ్’ అయిపోయాయని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు కాలేజీల వద్ద ఉన్న బీ కేటగిరీ సీట్లలో దాదాపు సగం వరకు ఇప్పటికే అమ్మేసుకోవడం, కొన్నింటిని రిజర్వులో పెట్టడం జరిగిపోయిందని అంచనా. తల్లిదండ్రులు కూడా డిమాండ్‌ను బట్టి ఒక్కో సీటును రూ. కోటి దాకా పెట్టి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కాలేజీ అయితే ఏకంగా రూ.కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వసూలు చేసిన ‘ఫీజు’లకు రసీదుల వంటివేమీ ఇవ్వకుండా దళారుల చేతుల మీదుగానే దందా నడుస్తున్నట్లు తెలిసింది. ఏ కారణంతోనైనా సీటివ్వలేకపోతే వసూలు చేసిన ఫీజులో కొంత మినహాయించుకుని మిగతాది తిరిగిచ్చేలా ఒప్పందాలు కూడా జరిగిపోయాయని సమాచారం. అన్నిరకాలుగా ‘మేనేజ్’ చేసేశారు... తెలంగాణలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 50 శాతం సీట్లను ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకున్నవారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తారు. 35 శాతం (507) సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. మిగతా 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీల యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. ఈ సీట్లకు ఎంత వసూలు చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. బీ కేటగిరీ సీట్లపైనే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రస్తుతం దృష్టి పెట్టాయి. వాటికి ప్రత్యేకంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను ఏమాత్రం లెక్కచేయకుండా సీట్లను ఇప్పటికే అనేక అక్రమ మార్గాల్లో నింపుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గతేడాది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించినా చివరికి తమకిష్టమైన వారికే సీట్లిచ్చుకున్న యాజమాన్యాలు, ఇప్పుడు కూడా కొందరు అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని... ప్రవేశ పరీక్ష దరఖాస్తు మొదలు ఫలితాల దాకా అన్ని రకాలుగా ఇప్పటికే ‘మేనేజ్’ చేసుకున్నట్టు తెలిసింది. ఫీజు పెంపునకు ప్రతిపాదన... మరోవైపు బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లకు ఫీజులు పెంచాలంటూ కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)కి ప్రతిపాదించినట్లు సమాచారం. ఏడాదికి రూ.9 లక్షలున్న బీ కేటగిరీ సీటు ఫీజును రూ.11-13 లక్షల దాకా, రూ.11 లక్షలున్న సీ కేటగిరీ (ఎన్నారై) సీటుకు రూ. 15-20 లక్షల వరకు పెంచాలని కోరుతున్నట్టు తెలిసింది. పీజీ వైద్య సీట్ల ఫీజులనూ పెంచాలని అవి కోరుతున్నాయి. బీ కేటగిరీ సీట్లన్నీ పకడ్బందీగా భర్తీ చేస్తాం బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు యాజమాన్యాలు ముందే అమ్మేసుకున్నాయన్న ఆరోపణల్లో వాస్తవంలేదు. ప్రత్యేక ప్రవేశ పరీక్షతో వాటికి సంబంధం లేదు. దాన్ని మా ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాం. అందులో ర్యాంకులు సాధించిన వారికే సీట్లు దక్కుతాయి. ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ప్రైవేటు యాజమాన్యాలకు ఎన్నారై కోటా సీట్లపైనే హక్కుంది తప్ప బీ కేటగిరీపై లేదు. - పాపిరెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
దారి మళ్లిన సొమ్ము..!
* డబ్బు స్వాహా చేయడంలో అజయ్‌ది కీలకపాత్ర * ఉద్యోగులకు వాటాలు * 18 ఖాతాలకు ఉపకారవేతనాలు జమ * ఆరుగురు వార్డెన్ల ఖాతాలకు రూ.లక్షలు * స్కాలర్‌షిప్‌ల స్కాంలో ఇదో కోణం * కొనసాగుతున్న ఖాతాల పరిశీలన * ప్రైవేటు కాలేజీల ఖాతాలపైనా అనుమానం శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్: జిల్లాలో కొన్ని రోజులుగా కుదిపేస్తున్న స్కాలర్‌షిప్‌ల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్విన కొద్దీ అక్రమార్కుల దందా వెలుగుచూస్తోంది. ఈ స్కాంలో కంప్యూటర్ ఆపరేటర్ అజయ్‌కుమార్ ప్రధాన సూత్రధారి. ఆయన ప్రస్తుతం పాలకొండలో ఉంటూ అల్లరి చిల్లరగా ఆట్లాడుకుంటున్నాడు. ఉద్యోగులకు సొమ్ము ఎరచూపి కుంభకోణంలోకి దింపాడు. రూ.లక్షల్లో నిధులు దారి మళ్లించి పెద్దమొత్తాలను సొంతచేసుకున్నాడు. పథకం ప్రకారం... చేతిలో చిల్లిగవ్వలేకుండా కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన అజయ్‌కుమార్ తన తెలివితేటలకు పదును పెట్టాడు. అక్రమ మార్గాన డబ్బు సంపాదించేందుకు వ్యూహ రచన చేశాడు. పాలకొండలోనే ఉంటూ అటు బీసీ సంక్షేమ శాఖ, ఇటు గిరిజన సంక్షేమ శాఖలోని మూలాలను తెలుసుకున్నాడు. అక్కడున్న ఉద్యోగులతో మచ్చిక పెంచుకున్నాడు. అతనివద్ద ఉపకార వేతన దరఖాస్తులను ఆన్లైన్ చేసే ఉద్యోగులకు డబ్బుసంపాదన మార్గాలను వివరించాడు. పాలకొండలో ఉంటున్న డే స్కాలర్ విద్యార్థులు హాస్టల్లో ఉన్నట్టు చూపిస్తే అదనంగా డబ్బులు వస్తాయని, అందులో వాటాలు పంచుకుందామని చెప్పి ఉన్నతాధికారులను సైతం ముగ్గులోకి దింపాడు. విద్యార్థులకు చేరాల్సిన ఉపకారవేతనాలు వారి ఖాతాలకు జమచేసి మిగిలిన మొత్తాలను ఎలా కొట్టేయాలో హితబోధ చేశాడు. ఇది నమ్మిన ఉద్యోగులందరూ ఆయన గుప్పెట్లోకి వెళ్లిపోయారు. రూ.లక్షల నిధులు తమ ఖాతాలకు చేరేలా అకౌంటు నంబర్లు సహితం అప్పగించేశారు. అలా అప్పగించిన వారంతా గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్లే కావడంతో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని నిధులు దారిమళ్లించేశాడు. ఇదంతా ఆన్లైన్లో జరిగిన వ్యవహారమే కావడంతో పెద్దగా కంప్యూటర్ నాలెడ్జ్‌లేని వార్డెన్లంతా ఆయన చెప్పినట్టే చేశారు. పంచుకున్నారు... జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 80 వేల మంది బీసీ విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 4వేల మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య నభ్యసిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు మరో 10 వేల మంది చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.35 వేలకు పరిమితం చేసింది. దీంతో వారు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో కొన్నింటిని స్కాలర్‌షిప్‌లకు బదులు వసతిగృహాలకు మళ్లించారు. డే స్కాలర్‌కు నెలకు రూ.325 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే వసతిగృహాల కింద నమోదుచేస్తే నెలకు రూ.1050 అందజేస్తుంది. రూ.7 వేలు అదనంగా వచ్చి చేరుతుండడంతో డే స్కాలర్లుగా ఉన్న బీసీ విద్యార్థులను గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నట్టు చూపించారు. నిధులను కైంకర్యం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులు సస్పెండయ్యారు. మరో అధికారి సస్పెన్షన్‌లోనే ఉన్నారు. మరికొంత మందిపై విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్ల ఖాతాలు పరిశీలిస్తే దారిమళ్లిన స్కాలర్షిప్లు బయటపడే అవకాశం ఉందని, ఆ దిశగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టిసారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇరుక్కున్నారు... మెళియాపుట్టి సబ్‌డివిజన్ పరిధిలోని అందరు వార్డెన్లు అజయ్ కుమార్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ప్రధాన భూమిక పోషించిన ఏటీడబ్ల్యూ ఎర్రన్నాయుడితోపాటు మరో ఆరుగురు వార్డెన్లు ఖాతాలకు స్కాలర్షిప్ నిధులు మళ్లించారు. ఆ డబ్బును తీయించి సగం సగం పంచుకున్నారు. ఇప్పుడు అక్రమాలు వెలుగు చూస్తుండడంతో వార్డెన్లు కలవరపడుతున్నారు. ఖాతాల గుర్తింపు... ఇప్పటివరకు ఆరుగురు గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్ల ఖాతాలకు నిధులు మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో సీతంపేట బాలురు గిరిజన సంక్షేమ శాఖ పోస్టు మెట్రిక్ హాస్టల్ వార్డెన్ రాజారావు ఖాతాకు రూ.4 లక్షల నిధులు మళ్లినట్టు నిర్ధారించారు. మిగిలిన వారిని సైతం భాగస్వాములు చేర్చేందుకు వారి ఖాతాలకు స్వల్ప మొత్తాలను బదలాయించారు. పాలకొండ పోస్టు మెట్రిక్ బాలికల వసతిగృహంతో పాటు సీతంపేట బాలికల వసతిగృహం ఖాతాలకు పెద్దమొత్తాల్లో బిల్లులు జనరేటు చేసినా అందులో కేవలం రూ.15 వేలు మాత్రమే జమైంది. నిధుల మళ్లింపులో మరో 12 ఖాతాలను తెరవాల్సి ఉంది. -
కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు: కడియం ♦ ఈసారి అడ్మిషన్లలో విద్యార్థుల ఆధార్ తీసుకుంటాం ♦ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది ఉచితంగా పుస్తకాలు అందించడం, ఎలాంటి ఫీజుల్లేకుండా చూడడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయనున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాల సమయంలో ఆధార్ నంబరును తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పక్కా భవనాలు, తాగునీరు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది రూ. 201 కోట్లతో కాలేజీలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇంకా 15 కాలేజీలకు పక్కా భవనాలు లేవన్నారు. వాటికి జిల్లా కలెక్టర్లు స్థలాలు చూపిస్తే వెంటనే నిర్మాణాలు చేపడతామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో 22 రకాల సేవలను ఆన్లైన్ చేశామన్నారు. పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు, లైబ్రరీలు లేవని వాటికోసం ఈసారి ప్రణాళిక బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పరికరాల కొనుగోలు కోసం మరో రూ.10 కోట్లు కేటాయించామన్నారు. కంప్యూటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, ఇతరాలకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రూపొందించిన ప్రచార కేలండర్, పోస్టర్‌ను కడియం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ప్రైవేటులో శిక్షణకు ఓకే! ఎంసెట్, ఐఐటీ కోసం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న వారికి ఈ వేసవి సెలవుల్లోనూ శిక్షణ కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు, కాలేజీల విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో నిర్ధారించిన దాని కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ప్రస్తుతం కాలేజీల్లో వసతులు, ఇతరత్రా అంశాలపై తనిఖీలను కొనసాగిస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో ద్వితీయ సంవత్సర తరగతులను కొనసాగిస్తే చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు కాలేజీలు ఫీజులు సరిపోవడం లేదని అడిగినందునే కమిటీ వేశామన్నారు. పాలిసెట్, టెట్, ఎంసెట్, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు సహకరించాలని యాజమాన్యాలకు సూచించామని, లేకపోతే నష్టం జరుగుతుందని చెప్పినందునే ఒప్పుకున్నారన్నారు. పోలీసు తనిఖీలను ఆపే విషయంలో తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. డిగ్రీ ఫీజుల ఖరారుకు ఏఎఫ్ఆర్సీ తరహాలో కొత్త సంస్థ ఏర్పాటు ఆలోచన చేయలేదన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా 50 శాతం మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని భావిస్తున్నట్టు కడియం తెలిపారు. విద్యార్థులు రావాలన్న బలవంతం లేదని, భోజనం కావాలనుకునే వారే రావొచ్చన్నారు. పేదల కోసమే తాము ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు. -
విద్యార్థి బలవన్మరణం
► మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ► ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్ ► అవ్వడమే కారణం ఈపూరు : ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరు యువకుల్లో ఒకరు బలవన్మరణం చెందగా, మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఈపూరులో చోటుచేసుకుంది. ఈపూరు గ్రామానికి చెందిన కోతి శామ్యేలు, దీనమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో రెండో కుమారుడు కోతి చిరంజీవి వినుకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలిసి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అప్పటి వరకు ఇంటి వరండాలో ముచ్చటించిన చిరంజీవి ఒక్కసారిగా ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా చిరంజీవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే బంధువులు చిరంజీవిని ఈపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిరంజీవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పొలంలో పనిచేస్తున్న తల్లి దీనమ్మకు విషయం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చేతికి అందివచ్చిన కొడుకు ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన చూపరులకు కంటతడి పెట్టించింది. వనికుంట గ్రామానికి చెందిన సట్టి శ్రీను, హనీమేరీ కుమారుడు శౌరిరాజు. ప్రకాశం జిల్లా దర్శిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో శౌరిరాజు ఫెయిల్ అయినట్లు తెలియడంతో గొంతు, చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బంధువులు గమనించి ఈపూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. -
రేపటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థల బంద్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్టు విద్యా సంస్థల జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలపై పోలీసు, విజిలెన్స్ దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోపు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యా శాఖ అధికారులతోనే తనిఖీ చేయించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి ఏడాది సమయం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. -
37 ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు వ్యతి రేకంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు టాస్క్ ఫోర్స్ బృందాలు 12,13 తేదీల్లో దాడు లు నిర్వహించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 37 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న జాబితాలో పలు ప్రముఖ కళాశాలలు ఉన్నాయి. మెహిదీపట్నం తార్నాక, సంతోష్‌నగర్, న్యూనల్లకుంట, నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలు, డీడీ కాలనీ,ఎస్ఆర్నగర్, సైదాబాద్ల్లోని శ్రీచైతన్య, బర్కత్‌పురా,చార్మినార్‌లలోని గాయత్రీ, లక్డీకాపూల్‌లో తపస్వీ, మలక్‌పేట్‌లో ఎంఎస్, సైదాబాద్‌లో శ్రీనివాస, హిమాయత్‌నగర్‌లో గురు, సంతోష్‌నగర్‌లో గౌతమి, ఎస్ఆర్నగర్లో సీఎంఎస్ థామస్ జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
ఫ్రైవేటు విద్యాసంస్థకు కారుచౌకగా భూమి
- రూ. 7.14 కోట్ల విలువైన భూమి రూ. 59 లక్షలకే - తిరుపతి సమీపంలో అనంత ఎడ్యుకేషనల్ సొసైటీకి ధారాదత్తం సాక్షి, హైదరాబాద్: తిరుపతికి సమీపంలోని ఆర్.అగ్రహారంలో అత్యంత విలువైన, ముఖ్యమైన ప్రాంతంలో 2.38 ఎకరాల భూమిని ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వం ధారాదత్తం చేసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఆర్. అగ్రహారం ఇటు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు, తిరుపతి బస్సుస్టాండుకు, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎకరా విలువ హీనపక్షం రూ. 3 కోట్లు పైనే ఉంటుంది. ఇంత విలువైన భూమిని అనంత ఎడుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ రవి అనంతకు ఎకరా కేవలం రూ. 25 లక్షల ధరతో 2.38 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ. 7.14 కోట్ల విలువైన 2.38 ఎకరాల భూమిని కేవలం రూ. 59.50 లక్షలకే రవి అనంతకు కట్టబెడుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తు చేసినా.. గత ప్రభుత్వ హయాంలోనే తన విద్యా సంస్థ ఏర్పాటుకోసం భూమి కేటాయించాలని రవి అనంత దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 2009 జూన్ పదో తేదీన చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ప్రతిపాదన వచ్చింది. అయితే గత ప్రభుత్వం ఈ సంస్థకు భూమిని కేటాయించకుండా ఫైలును పక్కన పడేసింది. వ్యాపార దృక్పథంతో విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబరు 27వ తేదీన రవి అనంత మళ్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. దీంతో చకచకా ఫైలు కదిలింది. విద్యా సంస్థ ఏర్పాటు పేరుతో రవి అనంతకు 2.38 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ రెవెన్యూ శాఖ గురువారం జీవో నంబరు 121 జారీ చేసింది. భారీగా ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వ భూమి కేటాయించాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘సేవాభావంతో పనిచేసే సొసైటీలకు నామమాత్రపు ధరతో భూములు ఇవ్వడం సబబే. కానీ వ్యాపార ధోరణితో పనిచేసే విద్యా సంస్థకు ఇలా ఇవ్వడం నిజంగా అన్యాయమే. కోట్లు దండుకునే వారు భూములు కొనుక్కోలేరా? వారికి ప్రభుత్వ భూమి ఎందుకు ఇవ్వాలి?’ అని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఫీజుల పేరిట భారీ దోపిడీ
ప్రైవేటు పాఠశాలల తీరుపై మండిపడ్డ శాసనసభ ♦ కాన్సెప్ట్, టెక్నో, ఐఐటీ ఫౌండేషన్ పేర్లతో దోచుకుంటున్నారు ♦ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఫీజులు రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షలా? ♦ ఫీజు నియంత్రణ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ♦ ప్రైవేటు స్కూళ్లలో పేద వర్గాలకు 25 శాతం రిజర్వేషన్‌పై చర్యలేవి? ♦ అసెంబ్లీలో సర్కారును నిలదీసిన ప్రతిపక్షాలు ♦15 రోజుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్న తీరుపై సోమవారం శాసనసభ అట్టుడికింది. కాన్సెప్ట్, టెక్నో, ఐఐటీ ఫౌండేషన్లని ఏవేవో పేర్లు చెబుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని... వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు ఉన్న తరహాలో పాఠశాలలకు కూడా ‘ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)’లు ఏర్పాటు చేసేందుకు అడ్డేమిటని నిలదీశాయి. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్.కృష్ణయ్య (టీడీపీ), కె.లక్ష్మణ్ (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), పువ్వాడ అజయ్ (కాంగ్రెస్) తదితరులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఫీజులు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ‘‘ఓక్రిడ్జ్, డీపీఎస్, నారాయణ వంటి విద్యా సంస్థలు రూ.లక్షన్నర నుంచి రూ.4లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా హింసిస్తున్నాయి. వాటిల్లో జనవరిలోనే 80 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. విద్యాహక్కు చట్టం నిబంధన ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు 25 శాతం ప్రవేశాలు కల్పించాలన్న నిబంధన అమలు కావడం లేదు..’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని బీజేపీ సభాపక్ష నేత కె.లక్ష్మణ్ చెప్పారు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్ఆర్సీ ఉందని, మరి పాఠశాలలకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక ఫీజు వసూళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, 50 శాతానికి పైగా ఫీజులు వసూలు చేస్తున్న 12 పాఠశాలలకు నోటీసులు ఇచ్చి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కేజీ టు పీజీ కాగితాలకే పరిమితమైపోయిందని విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు మధ్య, దిగువ మధ్య తరగతికి పెనుభారంగా పరిణమించాయని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఒకే యాజమాన్యం కింద వందలాది పాఠశాలలు ఉండకూడదని, ఫీజుల నియంత్రణకు చట్టం కచ్చితంగా ఉండాలని చెప్పారు. కళాశాలల తరహాలో పాఠశాలల్లోనూ ఫీజులను నియంత్రించి, 25 శాతం సీట్లు పేద పిల్లలకు అందేలా చూడాలని కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్ కోరారు. అధిక ఫీజులు వాస్తవమే.. చర్యలు తీసుకుంటాం: కడియం ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. ఫీజుల నియంత్రణ కోసం 2009, 2010లో తెచ్చిన 91, 42 జీవోలపై ప్రైవేటు విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లడంతో అవి అమలు కాలేదన్నారు. అయినా జీవో నంబర్ 1 ద్వారా విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోటీసులు జారీ చేసిన 12 ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇచ్చిన వివరణను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 15 రోజుల్లో ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గుర్తింపులేని పాఠశాలలు గతంలో 650 ఉంటే ఇప్పుడు 152కి తగ్గాయని.. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా పదోతరగతి పరీక్షలు రాసే సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బీపీఎల్ వర్గాల వారికి కేటాయిస్తే... ప్రభుత్వ పాఠశాలలు మూసుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. -
సెల్ఫ్ సెంటర్లలో.. కామ్‌గా కానిచ్చేస్తున్నారు...!
* ఇంటర్ పరీక్షల్లో సర్కారీ కళాశాలల్లో యథేచ్ఛగా చూసి రాతలు * ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదార్లు తొక్కుతున్న వైనం * పట్టుబడుతున్న విద్యార్థులు * ప్రైవేటు కళాశాలల్లోను మాల్‌ప్రాక్టీసులు నమోదు * తాజాగా మరో ఇద్దరు డీబార్-8కి చేరిన మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సెల్ఫ్ సెంటర్లలో కామ్‌గా కాపీయింగ్‌లు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగు పేపర్లకు పరీక్షలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో ప్రధాన పేపర్ల పరీక్షలు ముగియనున్నాయి. ఇదంతా ఒకెత్తయితే సెల్ఫ్ సెంటర్లతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా చూసిరాతలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సమీపంలోని పొరుగు కళాశాలల అధ్యాపకులతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారులే బాహాటంగా సమీపకుల వద్ద చెబుతుండటంతో కాపీయింగ్ల తీరుకు అద్ధం పడుతుతోంది. పలు ప్రైవేటు కళాశాలల్లోను ఇదే సీన్ రిపీటవుతోంది. జిల్లాలో ముఖ్యంగా లావేరు, తొగరాం, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, ప్రియాగ్రహారం, కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లుగా కేటాయించారు. ఈ ఆరు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు. అలాగే కింతలి, వంగర, జలుమూరు, పోలాకి, నౌపడ, ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, బూర్జ, సరుబుజ్జిలి, భామిని, మందస, ఏపీఆర్డబ్ల్యూ మందస తదితర కళాశాలలు పొరుగునే ఉన్న మరో కళాశాల విద్యార్థులతో కలిసి పరీక్షలు రాస్తున్నారు. తనిఖీలెక్కడ? తనిఖీలతో పాటు కేంద్రాలపై నిఘా ఉంచేందుకు ఆర్ఐవో పాత్రుని పాపారావు కన్వీనర్‌గా డీఈసీ కమిటీతో పాటు, హైపవర్ కమిటీ, నాలుగు ఫ్లైయింగ్, మరో ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సెల్ఫ్ సెంటర్లతో పాటు పొరుగు కళాశాల విద్యార్థులతో పరీక్షలు జరుగుతున్న సర్కారీ కళాశాలల కేంద్రాలపై అధికారులు ఆది నుంచి చూసీ చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా కేంద్రాల అధికారులు, విద్యార్థుల పాపం పండి ఇప్పటికే ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఒకేరోజు ముగ్గురు పట్టుబడగా.. తాజాగా మరో సెల్ఫ్ సెంటర్లో విద్యార్థి డీబారయ్యూడు. అయితే అధికారులు పైపై తనిఖీలతో సరిపెడుతుండటంతో యథేచ్ఛగా చూసి రాతలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంపై ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని భావించి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రిన్సిపాళ్లు, జేఎల్స్ మెమోలకు దూరంగా ఉండాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఇటువంటి చూసి రాతలకు, అక్రమాలకు తావిస్తున్నారని అభియోగాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా మరో ఇద్దరు డీబార్... ఇదిలా ఉండగా ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు డీబారయ్యారు. దీంతో జిల్లాలో ఇంతవరకు మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం 8కి చేరుకుంది. పొందూరు సిస్టమ్ జూనియర్ కళాశాలలో మరోసారి మాల్ ప్రాక్టీసులు నమోదు కావడం విశేషం. ఆ కేంద్రంలో జువాలజీ పేపర్-2లో ఓ విద్యార్థి అక్కడి చీఫ్ సూపరింటెండెంట్‌కు పట్టుబడగా.. సెల్ఫ్ సెంటర్‌గా ఉన్న ప్రియూగ్రహారం జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ 2బీ పేపర్లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ తనిఖీలకు వెళ్లిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు దొరికపోవడంతో డీబార్ చేశారు. కాగా శుక్రవారం సెట్-3తో కూడిన జువాలజీ-2, హిస్టరీ-2, మ్యాథ్స్ 2బీ పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాయగా.. జనరల్ ఒకేషనల్ కలిపి 22,919 మందికి 761 మంది గైర్హాజరయ్యారు. -
ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
♦ పరస్పర అవగాహనతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలు ♦ సూర్యాపేటలో గణితం పేపర్ లీకయిందంటూ ప్రచారం... అదేం లేదన్న బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరస్పర అవగాహనతో ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం ఈ తరహా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు పరీక్షల విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లే పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే బుధవారం గణితం పేపర్-2ఏ పరీక్ష సందర్భంగా సూర్యాపేటలో పేపర్ లీకజీ గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు. బుధవారం సూర్యాపేటలో గణితం పేపర్ లీక్ అయిందం టూ ప్రచారం జరిగింది. పలు టీవీ చానెళ్లు స్క్రోలింగ్‌లు కూడా వేశాయి. అయితే ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రీజ నల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ విచారణ జరిపినట్లు... అక్కడ ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని తేల్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ వదంతులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ లీకేజీ ప్రచారాన్ని ఖండించింది. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కుట్రలో భాగంగానే దీన్ని పరిగణించాలని పేర్కొంది. కానీ సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయని జూనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక, కాలేజీల మధ్య ఒప్పందాల మేరకు పరీక్ష ప్రారంభమయ్యాక సెల్‌ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేస్తున్నారని... జవాబులను తిరిగి సెల్‌ఫోన్ ద్వారానే పరీక్ష కేంద్రాల్లోకి చేరవేస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే సూర్యాపేటలో బుధవారం పరీక్ష సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షలకు 94.38 శాతం హాజరు బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 94.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మొత్తం 57 మంది విద్యార్థులు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. -
హాస్టల్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంపేట్ లోని ఓ ప్రైవేట్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. నాగాలాండ్‌కు చెందిన తెచ్మా(17) స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు హాస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసన రామచంద్రాపురం: మెదక్ జిల్లా పటాన్చెరు మండలం అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం రాత్రి క్యాంపస్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. తోటి విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన విద్యార్థి సూరజ్ మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయని క్యాంపస్‌లో యాజమాన్యం సూరజ్‌ను వేధించారు. దీంతో అతను జనవరి 29న క్యాంపస్ భవనంపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సూరజ్ తల్లిదండ్రులు వసంత్‌రావు, సంగీతలు తమ కుమారుడ్ని సికింద్రాబాద్ సన్‌షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సూరజ్ ఈ నెల 14న మృతి చెందాడు. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు, కళాశాల యాజమాన్యం రహస్యంగా ఉంచారు. సూరజ్ తల్లి సంగీత తన కుమారుడు ఎలా కింద పడ్డాడని ఆరా తీసేందుకు గురువారం రాత్రి ఘటన స్థలానికి రాగా.. విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఆమె నుంచి సూరజ్ మృతి వార్త తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. -
జంబ్లింగ్‌ను నిరసిస్తూ నేటినుంచిబంద్
విజయవాడ : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ప్రభుత్వం జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేయటంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పరీక్షలు జరుగుతాయో లేదోనని ఇంటర్ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేయటంతో ప్రైవేటు కళాశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కళాశాలలు నిరవధిక బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొదటిసారిగా... జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 54 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడు లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 47,226 మంది, బైపీసీ విద్యార్థులు 13,663 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు.ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొదటిసారిగా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించకుండా, నిపుణుల బృందం అభిప్రాయం లేకుండా ఈ నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించిందని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఆర్ఐవో నేతృత్వంలోని కమిటీ 82 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ప్రకటించింది. ఈ నెల నాలుగు నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఓఎంఆర్ షీట్లు, పరీక్ష నిర్వహణకు అవసరమైన ార్పొరేట్ కళాశాలల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉన్న ఇంటర్ విద్యార్థుల్లో 60 శాతం మంది రెండు ప్రధాన కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. ఈ క్రమంలో జంబ్లింగ్ పేరుతో ఒక కళాశాల విద్యార్థులను వేరు కళాశాలకు ప్రాక్టికల్స్‌కు పంపేలా జంబ్లింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి కళాశాలల్లో ఉండే ల్యాబ్‌లో తేడాలు ఉంటాయి. ఒక కళాశాల వినియోగించే పరికరాలు వేరే కళాశాల వినియోగించదు. నిబంధనల ప్రకారం ప్రాక్టికల్స్ ఎక్కడ చేశారో పరీక్ష కూడా అక్కడే నిర్వహిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది.అలా కాకుండా ప్రాక్టికల్స్ ఒకచోట, పరీక్ష మరోచోట పెడితే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు రెండు ప్రధాన కార్పొరేట్ విద్యార్థులకు మాత్రం లబ్థి చేకూరేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 82 పరీక్షా కేంద్రాల్లో 16 సెంటర్లు రెండు కార్పొరేట్ సంస్థలవే. దీంతో ఆయా కార్పొరేట్ సంస్థల విద్యార్థులకు ఆ 16 పరీక్షా కేంద్రాల్లో హాల్‌టికెట్లు వచ్చేలా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో మిగిలిన జూనియర్ కళాశాలల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేడు విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శనప్రభుత్వం తీరును నిరసిస్తూ సోమవారం నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తున్నామని జూనియర్ కళాశాలల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని విద్యార్థి సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తాయని వివరించారు. సోమవారం విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహిస్తాయని తెలిపారు. ఇంటర్ ఆర్ఐవో రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఓఎంఆర్ షీట్లు కూడా పంపిణీ చేశామని చెప్పారు. -
'కచ్చితంగా జంబ్లింగ్ విధానం అమలు చేస్తాం'
విజయవాడ: ఏపీ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశాయి. ఈ సందర్భంగా జంబ్లింగ్ విధానంపై ఆయనతో చర్చించారు. ప్రైవేటు కాలేజీలలో జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని వారు చంద్రబాబుకు వివరించారు. దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. జంబ్లింగ్ విధానం కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు చంద్రబాబు సూచించారు. -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు గ్రేడింగ్
నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అక్కర్లేదు ఉన్నత విద్యామండలి సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిన అవసరంలేదని ఉన్నత విద్యామండలి తేల్చింది. ఇప్పటికే ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని, కాలేజీ లకు గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయిం చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల పరిస్థితి, కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలా.. వద్దా.. అనే అంశాలపై వివిధ వర్సిటీల కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిళ్ల డీన్లతో ఉన్నత విద్యామండలి బుధవారం సమావేశం నిర్వహించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2013-14 సంవత్సరంలో ఇచ్చిన 300 డిగ్రీ కాలేజీల్లో చాలావరకు తగిన సంఖ్యలో విద్యార్థుల్లేరని డీన్లు పేర్కొన్నారు. చాలా కాలేజీల్లో 40 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇందుకోసం కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ, ఫలితాలను పరిశీ లించేందుకు టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీల ప్రతినిధులతో కూడిన ఆ కమిటీలు కాలేజీలపై ఇచ్చే నివేదికల ఆధారంగా నాణ్యతాప్రమాణాల బట్టి గ్రేడింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. -
ఫీజు ఫీవర్!
♦ రీయింబర్స్మెంట్ నిధులకు గ్రహణం ♦ జిల్లాకు రావాల్సింది రూ.32కోట్ల పైనే.. ♦ ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు నా పేరు ప్రశాంత్. నేను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. మేము పేదలం. సర్కారు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇస్తుందని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. పరీక్షలు దగ్గరపడుతున్నా నిధులు మంజూరు కాలేదు. కాలేజీ యూజమాన్యం ఫీజు కడితేనే ప్రాక్టికల్స్, పరీక్షలు రాయనిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక్క ప్రశాంత్ పరిస్థితే కాదు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్న ప్రతి విద్యార్థి పరిస్థితి. ఇందూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారుు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుత ప్రభుత్వాల వల్ల చదువు అందని ద్రాక్షగా మారుతోంది. ఆర్థికస్థోమత లేని పేదలు చదువుకు దూరమవుతున్న తరుణంలో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వెలుగునిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో కళాశాల యూజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదు. తరగతి గదుల్లోకి రానివ్వడం లేదు. ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానివ్వమని హుకుం జారీ చేస్తున్నారుు. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. చదువు మానేసే పరిస్థితులు ఉన్నారుు. చదువులు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ సర్కారు నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కేటగిరిలవారీగా నిధుల పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా 2014-15 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 67,062 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కళాశాల యాజమాన్య ఖాతాల్లోకి, స్కాలర్షిప్ నిధులు విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. కానీ.. ఏడాది గడుస్తున్నా నిధుల జాడలేదు. 49,000 మంది ఉన్న బీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.34 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం రూ.11.93 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు కొన్ని కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ అయ్యూరుు. ఇంకా రూ.22 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే విద్యార్థుల చదువులు సవ్యంగా జరిగే అవకాశం ఉంది. స్కాలర్ షిప్ నిధులు కూడా రూ.20 కోట్లకు కేవలం రూ.5 కోట్లు వచ్చారుు. అదే విధంగా 3,600 మంది కలిగిన ఈబీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.1.60 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.3.08 కోట్లు రావాల్సి ఉంది. అలాగే 13,181 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.9.50 కోట్లు అవసరం ఉండగా, రూ.5 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.4.50 కోట్లు రావాల్సి ఉంది. 7,300 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.2.70 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.3.30 కోట్లు రావాలి. అదే విధంగా మైనార్టీ విద్యార్థులు 7,162 మందికి రూ.9.95 కోట్లు అవసరం ఉండగా, రూ.5.58 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.4.37 కోట్లు ప్రభుత్వం నుంచి రావాలి. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి మొత్తంగా రూ.55.95 కోట్లు అవసరం ఉండగా.. కేవలం రూ.21.08 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.32.75 కోట్లు రావాల్సి ఉన్నాయి. స్కాలర్ షిప్ రాలేదు.. స్కాలర్ షిప్ కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు డబ్బులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్కాలర్ షిప్ నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలకు వెళ్లి వచ్చేందుకు దారి ఖర్చులు తల్లిదండ్రుల నుంచి అడిగి తెచ్చుకుంటున్నాను. అదే స్కాలర్ షిప్ వస్తే ఇబ్బందులు తప్పేవి. - ప్రేమ్‌సింగ్, ఇంటర్ మొదటి సంవత్సరం, నవీపేట్ ప్రాక్టికల్స్ చేయనివ్వడం లేదు.. నేను రెంజల్ మండలం శాటపూర్ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ప్రతీ సంవత్సరం ఫీజుల విషయంలో కళాశాల యాజమాన్యంతో ఇబ్బందిగా మారింది. గతేడాది ప్రభుత్వం నిధులు మంజురు చేయకపోవడంతో నేనే ఫీజు చెల్లించి పరీక్ష రాశాను. ఇప్పుడు కూడా ఫీజు నిధులు రాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తోంది. ముందర ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫీజు కడితేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. - గోపి, డిగ్రీ మూడో సంవత్సరం, రెంజల్ -
ప్రైవేటు డిగ్రీ కాలేజీలను అనుమతించాలా.. వద్దా?
ఉన్నత విద్యా మండలి తర్జన భర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలను అనుమతించాలా వద్దా అన్న అంశంపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ప్రస్తుతం ఎన్ని మండలాల్లో డిగ్రీ కాలేజీల సంఖ్య, ఎన్ని కాలేజీలను ఏర్పాటు చేయొచ్చన్న అంశాన్ని తేల్చింది. అయితే జూనియర్ కాలేజీల సంఖ్య, వాటిల్లోని విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతాన్ని బట్టి ఇవ్వాలా.. లేదా డిగ్రీ కాలేజీలు అసలే లేని మండలాల్లో అనుమతించాలా అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆ తరువాతే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 461 మండలాలు ఉండగా అందులో 324 మండలాల్లో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 137 మండలాల్లో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు లేవని తేలింది. -
మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన బస్సు
ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు హైదరాబాద్: ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎ. బాలాజి కథనం ప్రకారం.. గురునానక్ ఇన్స్టిట్యూషన్ టెక్నికల్స్ క్యాంపస్ కళాశాల బస్సు (ఏపీ 09ఎక్స్ 7555) కిషన్‌బాగ్‌లో ఫంక్షన్కని సిటీ కళాశాల నుంచి వస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు పురానాపూల్ చౌరస్తాలోని గుడ్‌విల్ హోటల్ వద్దకు రాగానే బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న సాయిబాబా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ సమయంలో షాపు వద్ద ఉన్న కామాటిపురా మురళీనగర్ ప్రాంతానికి చెందిన శివకళాబాయి (60) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన ప్రేమాబాయి (60), అదే సమయంలో అటు ద్విచక్రవాహనంపై వెళుతున్న ఉస్మాన్‌బాగ్ ప్రాంతానికి చెందిన బషీర్ (32) కూడా తీవ్రంగా గాయపడ్డారు. బషీర్ బైక్‌తో పాటు మెడికల్ షాపు కూడా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శివకళాభాయి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చావుకు కారణం... చదువు కాకూడదు
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కార్పొరేట్ విద్యలో మార్పురావాలి సిద్దిపేట జోన్: చావుకు చదువు కారణం కాకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల ప్రతిభ మేళా-2015’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ విద్యావ్యవస్థలో విపరీతమైన ఫీజలు ఉన్నాయని, వాటి భయంతో చాలామంది చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఆర్థికస్థోమత లేక మరికొందరు చదువును వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరిట ఉత్సవాలు జరపడం పరోక్షంగా బాలలకు ప్రోత్సాహం అందించినట్టు అయిందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా అందించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాం క్షించారు. నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యా న్ని ప్రోత్సహించాలన్నారు. డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ బాల ప్రతిభమేళా ఏటా సిద్దిపేటలో నిర్వహించి బాలలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. -
తమిళనాడులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
కొయంబత్తూర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని(18) బలవన్మరణం చెందింది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సెలమ్ జిల్లా మెట్టూరుకు చెందిన సింతియా కొయంబత్తూర్లోని ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తూండేది. ఈ క్రమంలో ఈ రోజు హాస్టల్ భవనం రెండో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకేసిందని సింతియా రూమ్మేట్స్ చెబుతున్నారు. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి రూమ్మేట్స్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింతియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వారు వివరించారు. -
విద్యార్థుల భవితతో చెలగాటం
కళాశాలకు అనుమతుల్లేకుండానే విద్యార్థులకు బీఈడీ, డీఈడీ సీట్లు విద్యాసంవత్సరం చివరిలో మొండిచెయ్యి హాల్‌టికెట్లు రాక విద్యార్థుల ఆందోళన తాజాగా మోసపోయిన డీఈడీ విద్యార్థులు వినుకొండ ప్రాంతంలో కళాశాలల అక్రమాలు! ప్రైవేటు కళాశాలల ధన దాహానికి విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారుతోంది. వినుకొండ ప్రాంతంలో బీఎడ్, డీఎడ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వచ్చి అనుమతుల్లేకుండానే విద్యార్థులను చేర్చుకుని చివరకు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఉన్నత స్థాయిలో చక్రం తిప్పుతున్న యాజమాన్యాల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా పెద్దసంఖ్యలో డీఎడ్ విద్యార్థులు మోసపోయారు. పరీక్షలు ప్రారంభమైనా వారికి హాల్‌టికెట్లు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. వినుకొండ రూరల్: వినుకొండలో బీఈడీ కళాశాల ధన దాహానికి విద్యార్థులు మరోసారి బలయ్యారు. విలువైన రెండేళ్ల విద్యా సమయంతో పాటు రూ.లక్షల్లో నష్టపోయారు. ఈ ఏడాది ఆగస్టు చివరివారంలో బీఈడీ విద్యార్థులు, ఇప్పుడు డీఈడీ విద్యార్థులు.. ఇలా వరుసగా మోసపోతున్న వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. తాజాగా వినుకొండ పట్టణంలోని పలు డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమైనా యాజమాన్యాలు హాల్‌టికెట్లు అందజేయలేదు. రెండు రోజుల నుంచి ఆందోళన చేసినా ఫలితం లేదు. సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్ష మొదలైనా వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. అనుమతి లేకుండానే అడ్మిషన్లు.. ఈ ప్రాంతంలోని కొన్ని ఎడ్యుకేషన్ కళాశాలలకు అనుమతి లేకపోయినా ఉన్నతాధికారులతో లాలూచీ పడి తాత్కాలికి అడ్మిషన్లకు పర్మిషన్ తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సాధారణంగా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు కళశాలల్లో చేరితే యాజామాన్యాలకు పెద్దగా మిగిలేది ఉండదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో బ్రోకర్లును ఏర్పాటు చేసుకుని విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విద్యాసంవత్సర కాలంలో ఒక్కసారి కూడా కళాశాలకు రానవసరం లేదు.. అడ్మిషన్, పరీక్షల సమయంలో వస్తే చాలు అంటూ ప్రచారం చేసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. తమ నివాసప్రాంతంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్రమే హాజరై సర్టిఫికెట్ పొందొచ్చనే ఆలోచనతో కొందరు వీరి వలలో పడి రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. తీరా విద్యాసంవత్సరం ఆఖరులో హాల్‌టికెట్లు విడుదల కాకపోవటంతో విద్యార్థుల తర ఫున యాజమాన్యాలే కోర్టుకు వెళుతున్నాయి. ఇవేమీ తెలియని విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరటం, పరీక్షల సమయంలో కళాశాల వద్దకు చేరుకుని హాల్‌టికెట్ల కోసం ఎదురు చూడడం నిత్యకృత్యమైపోయింది. గత ఆగస్టు నెలలో వినుకొండలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కళాశాల వద్దకు వివిధ రాష్ట్రాల నుంచి రెండొందల మంది బీఈడీ విద్యార్థులు వచ్చి హాల్‌టికెట్ల కోసం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. యాజమాన్యాలు చెప్పిందే వేదం.. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలిగిన కళాశాలల యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై తమ పబ్బం గడుపుకొంటున్నాయి. పట్టణంలో పలు బీఈడీ, డీఈడీ కళాశాలలు ఒకే క్యాంపస్‌లో కనీసం నాలుగు పేర్లతో నాలుగు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. అందరికీ కలిపి ఒకే తరగతి గదిలో బోధిస్తుంటారనే వాస్తవం అందరికీ తెలిసిన బహిరంగా రహస్యమే. అమరావతి డీఎడ్ కళాశాల అమరావతిలో కాకుండా వినుకొండలో నిర్వహిస్తుండటంతో పాటు జీఎస్ఆర్, ఎస్ఆర్, సలాం ఇలా పలుపేర్లతో ఒకే క్యాంపస్‌లో డీబిఈడీ, డీఈడీ కళాశాలల తరగతులు నిర్వహిస్తున్నారు. ఎన్నోసార్లు విద్యార్థులు తాము మోసపోయాం అంటూ గగ్గోలు పెట్టినా ఇంతవరకు ఇక్కసారి కూడా విచారణ చేయకపోవటంలో ఆంతర్యం విద్యాశాఖాధికారులకే తెలియాలి. -
ఒక్కో సీటు రూ.లక్షన్నర!
♦ అడ్డగోలుగా ఎంఈడీ సీట్ల అమ్మకాలు ♦ వసూలు చేయాల్సిన ఫీజు రూ.22 వేలే ♦ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో కళాశాలల ఇష్టారాజ్యం ♦ కన్వీనర్ కోటాపైనా అనుమానం ♦ ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) ప్రవేశాల్లో కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్య కోటా సీట్ల మాటున ప్రైవేటు కళాశాలలు దండుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. లక్షన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఈడీ కళాశాలలు తక్కువగా ఉండటం.. ఎంఈడీకి డిమాండ్ ఉండటం యాజమాన్యాలకు కలిసొచ్చింది. దీని ఆసరా చేసుకుని సీట్లకు వేలం పెడుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా వారు మౌనం పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఓయూతోపాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల పరిధిలో ఏడు ఎంఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో సీట్లు 350 మాత్రమే. వీటికోసం మూడు వేల పైచిలుకు ఎంఈడీ ర్యాంకర్లు పోటీపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు ఏడాదికి రూ. 22 వేలకు మించి వ సూలు చేయకూడదు. అయితే కన్వీనర్ కోటాలో సీటు దక్కని అభ్యర్థులంతా మేనేజ్మెంట్ సీట్లపై దృష్టి సారించారు. దీన్ని ఆసరాగా చేసుకొని రెండేళ్ల ఎంఈడీ కోర్సుకు సీటుకు రూ. లక్షన్నర చొప్పున వసూలు చేస్తున్నాయి. ఆది నుంచి అనుమానాలే! ఓయూసెట్‌కు సంబంధించిన దాదాపు అన్ని కోర్సుల ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటితో పోలిస్తే ఎంఈడీ కౌన్సెలింగ్ ఆలస్యంగా చేపట్టారు. గత నెల నుంచి రెండు దశలుగా జరిగిన ఎంఈడీ కౌన్సెలింగ్‌ను ఆన్లైన్లో కాకుండా సాధారణ పద్ధతిలో చేపట్టారు. అధికారులు ఒక్క ఎంఈడీకే మాన్యువల్ కౌన్సెలింగ్ ఎంచుకున్నప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. కళాశాలల వారీగా సీట్ల వివరాలనూ వెబ్సైట్లో పొందుపరచలేదు. దీంతో వర్సిటీ పరిధిలో ఎన్ని కళాశాలలు, ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కౌన్సెలింగ్ చేపట్టిన ఓయూ అడ్మిషన్స్ డెరైక్టర్ కార్యాలయం వద్దనే కళాశాలల జాబితాను కౌన్సెలింగ్ జరిగిన రోజున ప్రదర్శించారు. అదీ స్పష్టంగా, సీట్ల వారీగా వివరాలను ఇవ్వలేదు. కొందరికే కౌన్సెలింగ్ ర్యాంకులు కేటాయించిన ప్రతి అభ్యర్థిని కౌన్సెలింగ్‌కు పిలవాలి. కానీ ఎంఈడీ సబ్జెక్టులో దాదాపు 3 వేలకు పైగా అభ్యర్థులకు ర్యాంకులు ఇచ్చినా కొద్దిమందినే కౌన్సెలింగ్‌కు పిలిచారు. తుది దశ కౌన్సెలింగ్‌లోనూ ఇదే తంతు. కౌన్సెలింగ్‌కు కూడా పిలవకుండా అధికారులే తమ అవకాశాలను దెబ్బతీయడమేంటని అభ్యర్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై ప్రవేశాల డెరైక్టర్ గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘సీట్లు కొద్దిగానే ఉన్నాయి. ఏ కేటగిరీలో ఏ ర్యాంకు వరకు సీటు వస్తుందన్న అంచనాలు మాకు తెలుసు. అందుకే అన్ని ర్యాంకుల వారిని కౌన్సెలింగ్‌కు పిలవలేదు. కొద్దిమందినే పిలిచాం’ అని వివరించారు. -
ప్రైవేటు విద్యతో ప్రమాదఘంటికలు
ప్రపంచంలోని పెట్టుబడిదారి సిద్ధాంత కర్తలు, మేధావుల ఆదిగురువైన ఆడమ్‌స్మిత్ కూడా నాడు తన రచనలలో విద్య, వైద్య నిపుణతల అభివృద్ధి వంటి అంశాలలో ప్రభుత్వం పాత్ర గురించి విస్తారంగా చర్చించాడు. చంద్రబాబు మాత్రం, ఈ మొత్తం క్రమానికి విరుద్ధ దశలో ప్రయాణం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని అతి పెద్ద ప్రైవేట్ వెంచర్‌గా మార్చివేశారు. పైగా సమస్త జీవన రంగాలనూ ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ఆయన చేపట్టారు. రానున్న కాలంలో, సామాజిక అశాంతికి ఇది ఆరంభం అవుతుంది..! సమకాలీన ప్రపంచంలో విద్య ప్రజల జీవితాల, జీవన ప్రమాణాల తాలూ కు కీలక నిర్ణేతగా ఉంది. గత 3-4 దశాబ్దాల క్రితం కంటే కూడా నేడు విద్యా వంతులు కావడం అనేది జీవనోపాధికి తప్పనిసరి అవసరంగా మారింది. నేడు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా పేరిట, దేశీయ యువజనులలో ‘నిపుణతల’ పెంపుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. మన దేశ జనాభాలోని 65% మంది 35 ఏళ్ల వయసులోపున్న యువజనులే. కాగా, వీరిలోని అత్యధికులు నిరక్షరాస్యులూ, లేదా అతిస్వల్పస్థాయి విద్యా స్థాయిని కలిగినవారే. ఉదా :- మనదేశంలోని ఉపాధిరంగంలో ఉన్న కార్మికులలోని 70% మంది మాత్రమే కనీస స్థాయి విద్యావంతులు. అంటే, మిగతా 30% మంది నిరక్షరాస్యులే. పైగా, ఆ 70% మందిలో కూడా 25% వరకు కేవలం ప్రాథమిక విద్యలోపుగా చదువును ఆపేసినవారే. ఇదీ పరిస్థితి. కాగా, మన దేశంలోని విద్యారంగం గత రెండు దశాబ్దాలుగా మరింతగా పేదలకు దూర మైపోయింది. ప్రైవేటు విద్య ప్రాధాన్యత శ్రుతిమించి పెరిగిపోయి, విద్య నేడు సామాన్య జనానికి అందని ద్రాక్షే అయిపోయింది. నేడు రాష్ట్రంలో, సీఎం చంద్రబాబు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన యత్నాలను ఈ నేపథ్యంలోనే మనం చూడాలి. నిజానికి చంద్రబాబు హయాంలోనే 2004 నాటికల్లా పలు విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట, ఉన్నత విద్యారంగంలో డబ్బుపాత్ర పెరిగిపోయింది. అయి తే, అనంతరం 2004లో ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం, హయాంలో ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక స్థోమత లేని లక్షలాది మందికి విద్యార్జనా అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ నేడు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆలోచనలతో టీడీపీ ప్రభుత్వం ముందుకు వస్తోన్న తీరు ముందుముందు మరింత ప్రమాదకరంగా పరిణ మించగలదు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న ప్రతి దేశంలోనూ ఆర్థిక అసమా నతలు సుదీర్ఘకాలంగా ఉన్నవే. కానీ, అవి ఆ వ్యవస్థల పునాదులను కుదిపివే యకుండా, కాపాడింది - ఆ దేశాల్లోని విద్యారంగాలే. అమెరికా, యూరప్ దేశాలు, జపాన్, చైనా, దక్షిణ కొరియాలవంటి అన్ని మార్కెట్ ఆధారిత దేశా లలోనూ తొలి నుంచీ విద్యారంగంలో ప్రభుత్వానికి పెద్దపాత్ర ఉంది. నేడు, దీనిని ‘సబ్సిడీల వ్యవస్థ’ అని కొందరు విమర్శంచవచ్చును. కానీ, ఈ ‘సబ్సి డీల’ వ్యవస్థ అనేదే, నిజానికి మన దేశంలో కూడా పలు దశాబ్దాలుగా దేశం లోని మెజార్టీ అట్టడుగు వర్గాలకు ఆసరా అయ్యింది. వాస్తవానికి, మన దేశం లోకంటే కూడా ఈ సబ్సిడీలు ధనిక పెట్టుబడిదారీ దేశాలలోనే అధిక స్థాయి లో ఉన్నాయి. తద్వారా అన్ని దేశాలలోనూ సామా జిక చలన శీలతను కాపా డుతూ వచ్చారు. 1950లలో కేరళ రాష్ట్రం దేశంలోని పేద రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. కానీ, అక్కడ ప్రభుత్వాలు ఆరంభించి, కొనసాగించిన సార్వజనీన ఉచిత విద్య, వైద్యం వంటి అంశాలు నేడు ఆ రాష్ట్రాన్ని ‘మానవ అభివృద్ధి సూచిక’పై దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపాయి. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని క్యూబా తన నిబద్ధతతో నేడు ప్రపంచంలోనే అత్యున్నత విద్య, వైద్య రంగా లు ఉన్న దేశాల సరసన నిలిచి, ఐక్యరాజ్యసమితి ప్రశంసలను పొందుతోంది. ఇక, ప్రపంచంలోని పెట్టుబడిదారి సిద్ధాంత కర్తలందరికీ ఆదిగురువైన ఆడమ్ స్మిత్ కూడా నాడు విద్య, వైద్య, నిపుణతల అభివృద్ధి వంటి అంశాలలో ప్రభుత్వం పాత్ర గురించి విస్తారంగా చర్చించాడు. అదీ అసలు విషయం. కాగా, నేడు దేశంలో సంస్కరణలకు మార్గదర్శకుడనని భావించే చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఈ మొత్తం క్రమానికి విరుద్ధ దశలో ప్రయాణం చేస్తున్నారు. నిజానికి, గత 3-4 దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తం గానూ, సుమారు 2 దశాబ్దాలుగా మన దేశంలోనూ కూడా నయా ఉదార వాద, ప్రపంచీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి. వివిధ రంగాలలో భారీగా ప్రైవేటీకరణ జరిగింది. దీనితో ప్రపంచం అంతటా, నేడు ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. ఉదాహరణకు అమెరికాలో పోగవు తున్న సంపదలోని 99 శాతం భాగం, నేడు ఆ దేశంలోని ఒక్కశాతం మంది అతి పెద్ద ధనికుల పరమౌతోంది. కాగా, మిగతా 1 శాతం సంపద మాత్రమే మిగతా 99% ప్రజలకు దక్కుతోంది. నయా ఉదారవాద విధానాల నీడలో ఉన్న దేశాలు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే, 2008లో ప్రపంచ ఫైనాన్స్, ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. ఈ సంక్షోభం నేడు మరింత లోతుగా వ్యవస్థల మూలాలను తొలిచేస్తోంది. ప్రపంచంలోని ధనిక దేశాలతో సహా అన్ని చోట్లా ప్రజలలో, ముఖ్యంగా యువజనులలో ఇది తీవ్ర అసంతృప్తికీ, వ్యవస్థ పట్ల వ్యతిరేకతకూ దారి తీస్తోంది. యూరో, అమెరికా, జపాన్లలో కూడా జరుగుతోన్న రాజకీయ పరిణామాలను దీనిలో భాగంగా నే చూడగలం. అన్ని ధనిక దేశాలలో కూడా జనసామాన్యం వామపక్ష భావాలు ఉన్న నేతలూ, పార్టీల దిశగా మళ్లక తప్పని స్థితి నేడు ఉంది. ఈ పరిణామాలు అన్నింటి వెనుకనా ఉన్నది గత 3-4 దశాబ్దాలుగా పెట్టుబడిదారీ దేశాలు అన్నింటిలోనూ అమలు జరిగిన ప్రైవేటీకరణ, నయా ఉదారవాద విధానాలే. ఈ విధానాల వలన విద్యారంగం వంటివి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. అయితే, అక్కడ కొంతలో కొంత ఊరడింపుగా తొలి నుంచి సామాన్య విద్యార్థులు ‘విద్యారుణాల’పై ఆధారపడి చదువుకొనే పద్ధతి ఉంది. కానీ, దీని పాత్ర కూడా నేడు పరిమితమే. పైగా నేడు ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోయిన ఆర్థిక పోటీ పరిస్థితుల్లో, వివిధ దేశాలలో ఉపాధి కల్పనా అవకాశాలు భారీగా క్షీణించి పోతున్నాయి. అంటే, ఒక పక్కన విద్యా సముపార్జన ఖరీదైనదిగా మారిపోతుండగా, మరోపక్కన ఈ ఉపాధి రహిత అభివృద్ధి క్రమం వలన నేడు ప్రపంచంలోని ధనిక దేశాలలో కూడా యువజనుల స్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే యూరప్ లోని గ్రీస్ వంటి దేశాల తాలూకు యువజనులలో నిరుద్యోగిత స్థాయి 50%పైబడే ఉంది. అందుచేతనే నేడు ప్రపంచంలోని ధనిక దేశాలలో, ప్రస్తు తతరం యువజనులను ‘(భవిష్యత్) కోల్పోయిన తరం’గా పిలుస్తున్నారు. అమెరికా వంటి దేశాలలో నేడు చదువుకునేందుకు తీసుకున్న విద్యా రుణా లను కూడా చెల్లించలేని దుస్థితిలో యువతరం పడిపోతోంది. దీనికి కారణం వీరికి చదువుల అనంతరం ఉపాధి లభించకపోవటమో, లేదా తాత్కాలిక, కాంట్రాక్ట్ లేదా స్వల్ప ఆదాయ ఉపాధి మాత్రమే లభించటమో కారణంగా ఉంది. అందుచేతనే, 2008లో ఆ దేశీయ బ్యాంకులను దెబ్బతీసిన ‘రియల్ ఎస్టేట్’ రుణాల చెల్లింపుల వైఫల్య సమస్యలాగానే, నేడు ‘విద్యార్థి రుణాలు’ బ్యాంకుల పాలిటి మరో టైం బాంబు కానున్నాయని, అమెరికా నుంచి వెలువడే ‘టైమ్’ పత్రిక ఈ మధ్యనే ఒక వ్యాసంలో హెచ్చరించింది. ఈ కథనం నేపథ్యంలో, నేడు ఈ దేశాలలోని పాలకవర్గాలలో వివిధ విధానాల పట్ల పునరాలోచన జరుగుతోంది. గతంలో ప్రైవేటీకరణ పాలబడి, నేడు తిరిగి ప్రభుత్వపరం అయ్యే దిశగా సాగిన బ్రిటన్‌లోని రైల్వే రంగం తీరు లోనే, పలు దేశాలలో ప్రాథమిక రంగాలు తిరిగి ప్రభుత్వపరం చేయాలనే డిమాండ్ వినపడుతోంది. కాగా, మన పాలకుల విధానాలు దీనికి విరుద్ధ దిశలో సాగుతున్నాయి. అందులోనూ ఈ విధానాల అమలునే గర్వకార ణంగా భావించే చంద్రబాబు, నేడు ఈ దిశగా మరింత వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగమే, నేడు ఆయన ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రస్తావనను తేవడం. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణాన్ని అతి పెద్ద ప్రైవేట్ వెంచర్‌గా మార్చివేశారు. ఇక ఇదీ అదీ అని కాక సమస్త జీవన రంగాలనూ ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ఆయన చేపట్టారు. రానున్న కాలంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా యువజనులూ, విద్యార్థులూ, జనసామాన్యం, రైతాంగ వర్గాలలో మరింతగా పెరిగిపోనున్న సామాజిక అశాంతి, అలజడులకు ఇది ఆరంభం అవుతుంది..! ప్రయాణం ఇదే దిశగా సాగితే అంతిమంగా అది చేరేది అశాంతి, అలజడుల తీరాన్ని మాత్రమే. ఇది ఇప్పటికే ప్రపంచం అంతటా నిరూపితమైన కఠోర వాస్తవం...! వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సెల్: 9866179615 - డి. పాపారావు -
‘ప్రైవేటు’పై చిన్నచూపా?
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుండి పార్టీకి ఉద్యమానికి అండదండగా ఉంటూ వచ్చిన ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను యాజమాన్యాలను చిన్నచూపు చూడడం ప్రభుత్వానికి సమంజసం కాదు. చదువుకున్న వారు ఉద్యోగాలు రాక ఉపా ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని భార్యాబిడ్డలను పోషించుకుంటూ తోటి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి విద్యా సంస్థలపై చిన్నచూపు తగునా? దాదాపు 80% విద్యా ర్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చదువుతున్నా రు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే మంచి నాణ్యమైన విద్యనందిస్తున్నాం. రాష్ట్రంలో ఒకటి రెండు కార్పొరేట్ కళాశాలలను, స్కూళ్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని అన్ని ప్రైవే టు విద్యాసంస్థలను ఒకే గాటిపై కట్టి చూడడం న్యాయంకాదు. ప్రభుత్వం దయతో ప్రైవేటు విద్యాసంస్థలను కాపాడాలని కోరుతున్నాం. - రమేశ్, కార్యదర్శి, తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల పరిరక్షణ సంఘం, కరీంనగర్ -
సర్టిఫికెట్ల కోసం విద్యార్థి అవస్థలు
-
సర్టిఫికెట్ల కోసం విద్యార్థి అవస్థలు
రంగారెడ్డి: ప్రైవేటు కళాశాలలో చేరడమే వారు చేసిన తప్పా? కాలేజీ ప్రవేశాల సమయంలో కాలేజీ యాజమాన్యాలే ఇళ్లకు వచ్చి మరీ విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకుంటారు. కానీ, సర్టిఫికెట్ల కోసం మాత్రం చివరలో విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. తన సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ విద్యార్థి కాలేజీ అధికారుల కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా కళాశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ కాలేజీలో వెలుగు చూసింది. ఆ విద్యార్థి, తన తల్లిదండ్రులతో పాటు కాలేజీకి చేరుకుని అధికారులను బతిమాలాడారు. -
మిథ్యా బోధన !
సమాజాన్ని ప్రభావితం చేసే సత్తా ఒక గురువుకే ఉంది. తన జీవిత కాలంలో వేల మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగల నేర్పు, ఓర్పు వీరి సొంతం. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి రాబోతున్న వారికి గుడ్డి శిక్షణ నిచ్చే కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తరగతులకు డుమ్మా కొట్టే చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫీజుల రూపంలో వేల రూపాయలు పిండుతూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల తీరు ఇది. ఆళ్లగడ్డ టౌన్ : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే కచ్చితంగా డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) లేదంటే బీఈడీ(బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) చదివి ఉండాలి. ఈ కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. రికార్డుల పరంగా ఉన్న మార్కులను వీరు వజ్రాయుధంగా వాడుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వేల రూపాయల్లో అక్రమంగా ఫీజులను దండుకుంటున్నారు. జిల్లాలో 63 సీట్లు ఉన్న ప్రైవేటు డీఎడ్ కళాశాలలు 50, వంద సీట్లు ఉన్న కళాశాలలు నాలుగు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు 41 ఉన్నాయి. డైట్, ఎడ్ సెట్ అర్హత పరీక్ష రాసి కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన వారికే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ కళాశాలో రూ.230, ప్రైవేటు కళాశాలకు అయితే ఏడాదికి రూ. 12500 చొప్పున ఫీజు చెల్లించాలి అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఇవీ నిబంధనలు.. ► నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాలలలో పది గదులకు తక్కువ కాకుండా ఉండాలి. ► {పథమ సంవత్సరం పది, ద్వితీయ సంవత్సరం పది సబ్జెక్టులు ఉంటాయి. వీటిని బోధించేందుకు ఎంఎడ్ అర్హత కలిగిన ఒక ప్రిన్సిపాల్ సహా 14 మంది లెక్చరర్లు ఉండాలి. ► అర్హత కల్గిని లైబ్రేరియన్, ఫిజికల్ డెరైక్టర్, కంప్యూటర్ ఫ్యాకల్లీ, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్, స్వీపర్, వాచ్మెన్ తదితర సిబ్బంది ఉండాలి. అమలు ఇలా.. ► జిల్లాలోని దాదాపు అన్ని ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల్లో ఎక్కడా వసతులు లేవు. ► ఒక్కో కళాశాలలో ఇద్దరు లేక ము గ్గురు మాత్రమే సిబ్బంది ఉంటూ అన్ని తామై విధులు దులు నిర్వహిస్తున్నారు. ► కొన్ని చోట్ల అటెండర్ నుంచి మొదులుకుని క్లర్క్, ప్రిన్సిపాల్, లెక్చరర్ అన్నీ వారే అవుతున్నారు. ► ఆళ్లగడ్డ పట్టణంలో ఒకేచోట ఉన్న ఒక బీఈడీ, రెండు డీఈడీ కళాశాల్లో మొత్తం మూడు కళాశాలలకు కలిపి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ► మరో చోట ఉన్న బీఈడీ, డీఈడీ రెండు కళాశాలకు కలుపుకొని ఒక్క రే ప్యూన్ నుంచి ప్రిన్సిపాల్ వరకు వ్యవహరిస్తున్నారు. ► కొన్ని కళాశాలల్లో కనీసం విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు కూడా లేవు. ఇవీ ఆఫర్లు ► తరగతులకు రానవసరం లేదు. రికార్డులు రాయనవసరం లేదు. ప్రయోగ పరీక్షలు మేమే చేస్తాం. అయితే ఒక్కో విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తే చాలు అంటూ కొన్ని కళాశాలలు ఆఫర్లు ఇస్తున్నాయి. ► తరగతులకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు రూ. 100 కూడా చేయని రికార్డులను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వెచ్చించి కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. -
ఫీజుల దోపిడీపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
నాంపల్లి: ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ సంఘం నేత సిరిబాబు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు చెందిన సిరిబాబు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న సిరిబాబును నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పిస్తే అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి యాజమాన్యం పోలీసుల సహాయంతో బయటకు గెంటేసిందని, వైద్యం అందకపోవడంతో అతను మృతి చెందాడని కృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. మరిన్ని ఆత్మబలిదానాలు కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని, వైద్యం అందించకుండా సూరిబాబును గెంటివేసిన యశోదా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ ఈ ఘటనపై విచారణ జరిపి సెప్టెంబర్ 1 లోగా సమగ్రమైన నివేదికను అందజేయాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులను జారీ చేసింది. హెచ్చార్సీకి ఫిర్యాదు అందజేసిన వారిలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు శారదాగౌడ్, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌గౌడ్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. పృధ్విరాజ్‌గౌడ్ ఉన్నారు. -
రెండు బైకులను ఢీకొన్న లారీ
తొండంగి : బెండపూడి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు బైకులను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సంఘటనలో బెండపూడికి చెందిన ఇద్దరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బెండపూడి గ్రామానికి చెందిన గోపిశెట్టి నారాయణరావు (40) ఓ ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్‌గా పనిచేస్తుండగా, పాపాన రాము (30) బెండపూడి శివారు సుబ్బరాయపురం సమీపంలో దాబా నిర్వహిస్తుంటారు. అయితే పుష్కరాల సందర్భంగా సెలవులు కావడంతో నారాయణరావు రత్నగిరిపై తాత్కాలికంగా మైక్ అనౌన్సర్‌గా, రాము సత్యదేవుని నమూనా ఆలయం ఎదురుగా తాత్కాలికంగా హోటల్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. రాము తన బైక్‌పై సతీష్ అనే వ్యక్తిని, నారాయణరావు తన బైక్‌పై సింహాచలాన్ని ఎక్కించుకున్నారు. రెండు బైక్‌లపై నమూనా ఆలయం వద్ద హోటల్‌కు బయలుదేరారు. వీరంతా బెండపూడి వైపు నుంచి అన్నవరం బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా వై జంక్షన్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. నారాయణరావు, రాము అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. లారీ వేగంగా రావడంతో రామును సుమారు 25 మీటర్లు ఈడ్చుకు పోయింది. బైకులు నుజ్జయ్యాయి. రాముకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నారాయణరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి చెందినవారి కుటుంబీకులు సంఘటన స్థలంలో రోదించిన తీరు కలచివేసింది. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. -
ఫీజు చెల్లిస్తేనే సీటు.!
- ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నా అదనంగా వసూలు - ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కళాశాలలు - పట్టించుకోని యూనివర్సిటీ సిబ్బంది నిజామాబాద్‌అర్బన్ : ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం రీరుంబర్స్మెంట్ సౌకర్యం కల్పించినా అదనపు ఫీజులు చెల్లించక తప్పడం లేదు. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ చేయించుకుంటూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. అంతేకాకుండా అదనపు ఫీజు ను విడతల వారీగా కాకుండా మొత్తం ఒకేసారి చెల్లించాలని కొన్ని కళాశాలలు ముందుగానే షరతులు విధిస్తున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇదీ పరిస్థితి.... జిల్లాలో 56 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మిషన్లు ఒక్కో కళాశాలల ఒక్కో విధంగా సాగుతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేసుకున్న ఓ కళాశాల 25 వేలు, మిగిలిన కళాశాలలు 15 వేల చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించినా వీరు మాత్రం అదనపు ఫీజు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. సీట్లు ఖాళీలేవని సాకు చూపుతూ యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకోవాలని అందుకోసం రూ. 3,500 వసూలు చేస్తున్నారు. కానీ, వాస్తవానికి యూనివర్సిటీకి రూ.2 వేల మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ వస్తుంది కదా..? అని విద్యార్థులు ప్రశ్నిస్తే మాత్రం అది వచ్చినప్పుడు మీది మీకు తిరిగి ఇస్తామని క ళాశాల సిబ్బంది సమాధానం చెబుతున్నట్టు సమాచారం. సీట్ల బదలాయింపు...... కొన్ని కళాశాలలు సీట్ల బదలాయింపు కొనసాగిస్తున్నాయి. తమ కళాశాలల్లోని అడ్మిషన్లను ఇతర కళాశాలలకు బదలారుుస్తున్నారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. నాలుగు కళాశాలలు సీట్ల బదలాయింపు చర్యకు పాల్పడుతున్నట్టు తెలిసింది. పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ కళాశాల ఖలీల్వాడిలోని మరో కళాశాలకు సీట్లు బదలాయిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై యూనివర్శిటీ అధికారులు మేల్కొని తనిఖీలు చేస్తే కళాశాలల ఆగడాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి ‘ప్రైవేట్’ ఆగడాలకు ముకుతాడు వేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. -
మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత
-
మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత
* తెలంగాణలో 29 నుంచి ప్రారంభం * ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 6 నుంచి మొదలయ్యే అవకాశం * ఒకట్రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం * తెలంగాణ కళాశాలలకు హైదరాబాద్, వరంగల్, విజయవాడల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. తొలుత తెలంగాణలో ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఏపీలో మెడికల్ కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 30లోగా అన్ని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కావాలన్నది భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నిబంధన . ఈ నేపథ్యంలో తొలుత తెలంగాణలోని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం ఉంటాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులతోపాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, వైద్యవిద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొన్నటివరకు 2,950 ఎంబీబీఎస్ సీట్లుండగా, ఇటీవలే మల్లారెడ్డి వైద్య కళాశాలలకు సంబంధించి 300 సీట్ల రెన్యువల్‌కు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. దీంతో సీట్లు 2,650కి తగ్గాయి. ప్రభుత్వకళాశాలల్లో 850 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 1,800 సీట్లున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 1,800 సీట్లలో 900 సీట్లను కన్వీనర్ కోటా కింద వర్సిటీయే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. అంటే మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు డెంటల్ సీట్లను 29 నుంచి జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఏపీలో కౌన్సెలింగ్‌పై 2 రోజుల్లో స్పష్టత తెలంగాణ కళాశాలలకు సంబంధించి 29 నుంచి కనీసం ఐదు రోజులపాటు కౌన్సెలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఆగస్టు మొదటి వారంలో, వీలైతే 6వ తేదీ నుంచి ఏపీలోని వైద్యసీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరపాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడ, తిరుపతిల్లో కౌన్సెలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో కేంద్రం పెట్టాలా వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీలోని మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేటుకాలేల్లో 1,950 సీట్లుండగా ఇందులో 975 (50 శాతం) సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. మొత్తం 2,725 ఎంబీ బీఎస్, డెంటల్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లోని మిగతా 50 శాతం ఎంబీ బీఎస్ సీట్లు.. అంటే 975 సీట్లలో 685 సీట్లను (మొత్తం సీట్లలో 35 శాతం) మేనేజ్మెంట్ కోటా కింద (ఎంసెట్ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా), సుమారు 268 సీట్లను(మొత్తం సీట్లలో 15 శాతం) ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్ పూర్తయ్యాక యాజమాన్య కోటాను భర్తీ చేస్తారు. యాజమాన్య కోటా సీట్ల ర్యాంకులపై కసరత్తు ఏపీలోని 35 శాతం (మేనేజ్మెంట్ కోటా) సీట్లకు జరిగిన ఎంసెట్ ఏసీ (అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ర్యాంకులపై కసరత్తు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రెండు రాష్ట్రాల్లో ప్రభు త్వ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తి కాగానే ఈ సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాలతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఉంటుంది. - డాక్టర్ రవిరాజు, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇరు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు కోటా తెలంగాణ ఏపీ ప్రభుత్వ కళాశాలల్లో... 850 1,750 ప్రైవేటు కళాశాలల్లో... 1,800 1,950 ఇందులో కన్వీనర్ కోటా (50%) 900 975 -
ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి: ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓంప్రకాశ్ (17) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గుర్తించిన తోటి స్నేహితులు, కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
సొంత పాఠాలు చెల్లవు
సాక్షి, కర్నూలు : ఇష్టారాజ్యంగా పేర్లు పెట్టుకుని, సంబంధం లేని పుస్తకాలను పిల్లలతో కొనుగోలు చేయించి.. ‘విద్యా శాఖ’ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేటు విద్యా సంస్థల చర్యలను అరికట్టేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులకు అవసరం ఉన్నా.. లేకున్నా.. రూ. వేలతో పుస్తకాలను అంటగట్టే విధానాన్ని రూపుమాపేందుకు సన్నద్ధమైంది. అనవసర గైడ్లు, స్టడీ మెటీరియళ్లను అడ్డుకోనుంది. దీనికోసం జిల్లా అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు మీరినట్లు తేలితే పాఠశాల గుర్తింపును రద్దు చేసేందుకూ వెనుకాడబోమని విద్యాశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సమాంతర విద్యా వ్యవస్థను నడపడం గతం. బోర్డు పరీక్షలు మినహా మిగిలిన తరగతులకు సంబంధించిన పరీక్షలను విద్యాశాఖ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా నిర్వహించుకునేవారు. కొంతకాలంగా విద్యాశాఖ నిఘా పెంచడంతో ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. ‘బట్టీ చదువు’లకు చరమగీతం పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘కంటిన్యూయస్ అండ్ కాంప్రెహెన్సీవ్ ఎవాల్యూయేషన్(సీసీఈ) పద్ధతిని గతేడాది నుంచి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో గత ఏడాది ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోని సిలబస్‌ను సీసీఈకి అనుగుణంగా సమూలంగా మార్చారు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాలను సీసీఈ విధానంతో సంబంధం లేకుండా తమకు అనుగుణంగా ముద్రింపజేసుకున్నారు. దీనివల్ల విద్యార్థుల సృజనాత్మకలో మార్పేమీ ఉండబోదని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతుల్లో తప్పని సరిగా సీసీఈ ప్రణాళికనే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఈవో సుప్రకాశ్ అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీ చేయాలని డిప్యూటీ ఈవోలకు, ఎంఈవోలకు, ఆదేశాలివ్వాల్సి ఉంది. ప్రైవేటుగా బోధనకు పుస్తకాలు, మెటీరియళ్లు వినియోగించినట్లు తనిఖీల్లో తేలితే గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. తగ్గనున్న పుస్తక భారం.. సీసీఈ పక్కాగా అమలైతే విద్యార్థుల పుస్తకాల నుంచి బరువు తగ్గే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇటీవలే చేపట్టిన ఓ సర్వే ప్రకారం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 10-12 కిలోలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 15-17 కిలోల బరువైన పుస్తకాలను నిత్యం మోస్తున్నట్లు తేలింది. దీంతో చిన్నారుల వెన్నెముకపై భారం పడి ఆరోగ్యంపై దుష్ర్పభావం పడుతోంది. అందుకే అనవసర భారం అటు పిల్లలపై, ఇటు తల్లిదండ్రులపై మోపనీయొద్దని విద్యాశాఖ నిర్ణయించుకుంది. -
కదం తొక్కిన విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి చేస్తున్న అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా శుక్రవారం కడపలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ పెద్ద పెత్తున అందోళన చేసింది. వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధక్షుడు ఖాజా రహ్మతుల్లా అధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులతో కడప నగరంలో పలు ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించటంతోపాటు కోటిరెడ్డి కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారు. సంబంధిత విషయాన్ని పలుమార్లు డీఈఓ, ఆర్జేడీల దృష్టికి తీసికెళ్లినా స్పందన కరువైయిందన్నారు. డీఈఓ ప్రతాప్‌రెడ్డి ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పలు ప్రవేటు విద్యాసంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. గతేడాది పదికి పది మార్కులు వచ్చిన విద్యార్థులు జిల్లాలో 70 మంది ఉంటే ఈ ఏడాది ఒక్క రాయచోటిలోనే పదికి పది 70 మందికి వచ్చాయన్నారు. అది ఎలా సాధ్యమైయిందో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. డీఈఓను సస్పెండ్ చేయాలి: కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా యాజమాన్యంతో ముడుపులు తీసుకుని దానికి అనుమతి ఇచ్చారన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నుంచి లక్షల్లో ముడుపులు తీసుకుని పాఠశాలలకు అనుమతులు లేకున్నా పట్టించుకోవటం లేదన్నారు. డీఈఓకు, ఆర్ఐఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోటిరెడ్డి సర్కిల్ చూట్టూ ప్రదర్శనలు చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ స్టూడెంట్ జిల్లా యూత్ ప్రసిడెంట్ చల్లా రాజశేఖర్, వైఎస్ఆర్ యూత్ రాష్ట్ర జనరల్‌సెక్రెటరీ హరీస్‌కుమార్‌యాదవ్‌లు మద్దతును ప్రకటించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక వసూళ్ల చేసే పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జశ్వంత్‌రెడ్డితోపాటు నాయకులు మహమ్మద్ అలీ, నిత్య పూజయ్య, యాసిన్, విజయ్, కరీముల్లా, పెంచలయ్య, నాగార్జునరెడ్డి, సునిల్‌రెడ్డి, బాష, శ్రీనివాస్‌తోపాటు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫిట్ లెస్ బస్సులు
- 800 బస్సులకు ముగిసిన కాలపరిమితి - ఆర్టీఏకు చిక్కకుండా విద్యార్థుల తరలింపు - పాఠశాల యాజమాన్యాలకు రవాణాశాఖ నోటీసులు - కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకొనేందుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో : ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులే కాదు. కాలం చెల్లిన వాటిలో సైతం విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గత పదిహేను రోజులుగా స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800లకు పైగా కాలం చెల్లిన స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని పాఠశాలల నిర్వాహకులు రవాణా చట్టాలను బేఖాతరు చేస్తూ 15 ఏళ్ల కాలపరిమితి ముగిసి, రవాణాకు పనికి రాని బస్సులను పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో రెండోశ్రేణి, పదిహేనేళ్ల గడువు సమీపించిన బస్సులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇలాంటి బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం గ్రేటర్ పరిధిలో 10 వేలకు పైగా స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్కూల్ బస్సుల నిబంధనలను కఠినతరం చేశారు. ఏటా విధిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అనుమతి పొందాలనే నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 800కు పైగా బస్సులు చాలా ఏళ్లుగా ఫిట్నెస్ పరీక్షలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు రవాణాశాఖ పరిశీలనల్లో వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. విద్యాసంస్థలకు నోటీసులు నగరంలో కాలంతీరిన బస్సులు 300 ఉండగా, శివారు ప్రాంతాల్లో మరో 500లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇవి లెక్కల్లో తేలినవి మాత్రమే. రికార్డులకు అందకుండా ఎక్కువ సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు విద్యాసంస్థలకు నోటీసులు సైతం జారీ చేశారు. అంతేగాకుండా అధికారులు స్వయంగా ప్రతి స్కూల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఎంవీఐ తన పరిధిలోని 8 నుంచి 10 స్కూళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోలు, వ్యాన్లపైనా తనిఖీలు : ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను తీసుకెళ్లే ఆటోలు, మారుతీ ఓమ్నీ వాహనాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. 8 సీట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాన్లలో మాత్రమే పిల్లలను తీసుకెళ్లాలనే నిబంధనను ఉల్లంఘిస్తూ, ఆటోల్లోనూ పరిమితికి మించి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని సీజ్ చేయనున్నట్లు తెలిపారు. -
విద్యా సంస్థల బంద్ విజయవంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తూ విద్యా, వైద్య పరిరక్షణ సమితి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ కరువు జిల్లాలో ఫీజులు నియంత్రించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇస్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నా, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌కు అండగా నిలుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక వసతుల కల్పన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యా, వైద్య పరిరక్షణ సమితి నాయకులు నాగరాజు, ఆకుల రాఘవేంద్ర, సాకే నరేష్, వేణుగోపాల్, రమేష్, అమర్‌యాదవ్, ధనుంజయనాయక్, ఆనంద్, చంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేటు విద్య
రూ.వేలల్లో ఫీజులు వసూలు యథేచ్ఛగా ప్రయివేట్ స్కూళ్ల దందా పట్టించుకోని ప్రభుత్వం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు విశాఖ ఎడ్యుకేషన్: సాంకేతిక విప్లవంతో విద్యా ప్రమాణాల్లో ఎప్పటికప్పుడు పెను మార్పు లు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే పిల్లలకు మంచి విద్య అందించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది. నాణ్యమైన విద్యనందించడంలో ప్రభుత్వ పాఠశాలలు బాగా వెనుకబడి పోవడంతో ప్రయివేట్ విద్యా సంస్థల దందా కొనసాగుతోంది. కాస్త మెరుగైన విద్యనందిస్తుండడంతో సామా న్య ప్రజలు సైతం ప్రయివేట్ స్కూళ్లవైపు పరుగులు తీసున్నారు. అప్పోసొప్పో చేసి ఆ పాఠశాలల యాజమాన్యం అడిగినంత సమర్పించుకుని తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం అందులో చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంస్థలు ప్రతి ఏటా ఫీజులు పెంచేసి ఎడాపెడా సొమ్ములు గుంజేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్, టెక్నో, ఈ-టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్ పేరుతో రోజుకో పాఠశాల పుట్టుకొస్తూ విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చేశాయి. జూన్ వచ్చిందంటే హడల్... ఏటా జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఈ నెల వచ్చిందంటే హడలిపోతారు. దానికి కారణం పిల్లల చదువులు... వాటి కోసం ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు రకరకాల పేర్లతో వసూలు చేసే ఫీజులే. కార్పొరేట్ పాఠశాలలో కొత్తగా ఓ విద్యార్థిని ఎల్కేజీలో చేర్చేందుకు అప్లికేషన్ ఫీజు, అడ్మిషన్, బిల్డింగ్ ఫండ్ అంటూ రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్, షూలు కలిపి మరో రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెట్టిస్తున్నా రు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్థాయిలో ఫీజులు చెల్లించడానికి ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టడమో లేదా అప్పులు చేయడమో తప్పడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో కొరవడ్డ విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో ఫీజులు ఎక్కువైనా ప్రయివేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదివించాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ చెబుతున్న మాటలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో కూడా విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం అమలు శూన్యం ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం 8వ తరగతి వరకు ఫీజులు వసూలు చేయకూడదనే నిబంధన ఉన్న అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రయివేట్ పాఠశాలల్లో కచ్చితంగా క్రీడా మైదానం, అగ్నిమాపక పరికరాల ఏర్పాటుతో పాటు ఫీజుల నియంత్రణపై కమిటీల ద్వారా పర్యవేక్షణ జరిపి తల్లిదండ్రులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఈ చట్టాన్ని ప్రయివేట్ పాఠశాలలు అస్సలు అనుసరించడం లేదు. పుస్తకాలు, యూనిఫాం స్కూళ్లలో విక్రయించరాదన్న నిబంధన ఉన్న బహిరంగంగానే వీటి అమ్మకాలు సాగుతున్నాయి. పలు పాఠశాలలు కొన్ని షాపులతో బేరం కుదుర్చుకొని తమ విద్యార్థులను వారి వద్దకు పంపిస్తున్నాయి. మొత్తం మీద చదువుల పేరుతో సాగుతున్న ఫీజుల దందాకు సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రుల నడ్డి విరిగిపోతోంది. -
ప్రైవేటు వైద్య సీట్లలో ఇంటర్ వెయిటేజీకి మంగళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ద్వారా భర్తీ అయ్యే 35 శాతం యాజమాన్య వైద్య సీట్లలో ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పాడారు. సాధారణ ఎంసెట్‌లో ఉన్న 25 శాతం ఇంటర్ వెయిటేజీని ప్రత్యేక ఎం-సెట్ ద్వారా భర్తీ అయ్యే యాజమాన్యాల సీట్ల విషయంలో ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సొంత పరీక్ష... అంతకుముందే సీట్ల విక్రయం... ఫీజుల పెంపు వంటి విషయాల్లో వివాదాల్లో చిక్కుకుపోయిన ప్రైవేటు కాలేజీలు.. ఇంటర్ మార్కుల వెయిటేజీని చాకచక్యంగా రద్దు చేయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వారికి వత్తాసు పలకడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మైనారిటీ వైద్య కళాశాల్లోని యాజమాన్య సీట్ల భర్తీకి ఇంటర్ మార్కుల వెయిటేజీని ఏకంగా 50 శాతం చేస్తే... నాన్ మైనారిటీ ప్రైవేటు వైద్య యాజమాన్య సీట్లలో వెయిటేజీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎం-సెట్ పరీక్ష జరిగి వారం కావస్తున్నా ర్యాంకింగ్ ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత రాకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ వెయిటేజీ ఉంటుందని... ఆ ప్రకారమే ర్యాంకింగ్ ఖరారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎం-సెట్లోని మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ధ్రువీకరించారు. గాలికి వదిలేసిన సర్కారు ప్రత్యేక ఎం-సెట్ ముగిసినా ఇంకా కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయలేదు. ఈ విషయంలో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేదు. ఎం-సెట్ కన్వీనర్ ఎలా ఉంటారు? ఆయన ఫోన్ నంబర్ కూడా అధికారుల వద్ద సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మొదటి నుంచీ గోప్యత పాటిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడం లేదు. వెబ్సైట్లో ప్రకటించి వదిలేస్తున్నాయి. ఇప్పటికే 35 శాతం కోటా సీట్లు అమ్మేసుకున్న యాజమాన్యాలు గోప్యత పాటిస్తూ మరిన్ని అక్రమాలకు తెరలేపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు ప్రభుత్వ ప్రతినిధి.. ప్రత్యేక ఎం-సెట్ నేపథ్యంలో జరగబోయే కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిని పంపుతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలు తమకు తెలియదన్నారు. -
వైద్య సీట్లకు ‘ప్రైవేటు’ పరీక్ష
-
వైద్య సీట్లకు ‘ప్రైవేటు’ పరీక్ష
- 35 శాతం ప్రైవేటు వైద్య సీట్లకు ప్రత్యేక ఎంసెట్ - ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచే కన్వీనర్ - స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ - ‘బి’ కేటగిరీ ఎత్తివేత, 10 శాతం వైద్య, దంత సీట్లకు ఫీజుల పెంపు - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి రాష్ర్ట ప్రభుత్వం తలొగ్గింది. ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోని 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లను మినహాయించి.. మిగిలిన 35 శాతం సీట్లకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ‘బి’ కేటగిరీని ఎత్తేసి ఆ 10 శాతం సీట్లకు ఫీజులను భారీగా పెంచింది. రాష్ర్టంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం(1,050) సీట్లు, ‘బి’ కేటగిరీ 10 శాతం(210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ఇప్పటిదాకా ప్రభుత్వం భర్తీ చేస్తూ వచ్చింది. మిగిలిన 40 శాతం (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చిన రీతిన భర్తీ చేసుకునేవి. ఇప్పుడు ‘బి’ కేటగిరీని ఎత్తేశారు. అందులోని 10 శాతం సీట్లను ఎంసెట్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించారు. దీంతో మొత్తంగా 50 శాతం(1,050) సీట్లు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినట్లయింది. అయితే 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లను మినహాయించి మిగిలిన 35 శాతం(735) సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. బి కేటగిరీని ఎత్తేసి, ఫీజులు పెంచడం అత్యంత దారుణమని జూనియర్ డాక్టర్ల(జూడా) కన్వీనర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలతో మొత్తం వైద్య విద్య ప్రైవేటు చేతుల్లోకి పోయినట్లేనన్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ర్యాంకులు అమ్మే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షకు మార్గదర్శకాలు తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం(టీపీఎండీసీఎంఏ) నేతృత్వంలో వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష-కళాశాలల సంఘం(ఎంసెట్-ఏసీ) ఏర్పాటవుతుంది. సీట్ల భర్తీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. అందులో యూనివర్సిటీ నుంచి కూడా ప్రతినిధి ఉంటారు. ఆ కమిటీలో నుంచి ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకుంటారు. - కన్వీనర్ ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. - ఈ పరీక్షను ప్రభుత్వ ఆధ్వర్యంలోని అడ్మిషన్ అండ్ ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) పర్యవేక్షిస్తుంది. - ఎంసెట్-ఏసీ పరీక్ష తేదీని, పరీక్ష జరిగే కేంద్రాలను తెలియజేస్తూ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. - తెలంగాణలోని ముఖ్య కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్రాల్లోనూ పరీక్ష ఉంటుంది. - ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్ల భర్తీ జరుగుతుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం లేదా వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయి. - కన్వీనరే కౌన్సెలింగ్ జరిగే స్థలం, తేదీ, సమయాన్ని ప్రకటిస్తారు. - ఎంసెట్-ఏసీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కమిటీ తయారుచేస్తుంది. - ఒకే ర్యాంకు ఎక్కువ మందికి వస్తే ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో మార్కులను ఆధారం చేసుకుంటారు. - ఇక రెండో కౌన్సెలింగ్‌లోనూ ‘ఎ’ కేటగిరీలో భర్తీ కాని సీట్లను కూడా కాలేజీలవారీగా ‘సి’ కేటగిరీలోకి చేర్చుతారు. అందని ద్రాక్షగా వైద్య విద్య ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ర్టంలో వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. పది శాతం ఉండే ‘బి’ కేటగిరీ వైద్య సీట్లను ప్రైవేటు కాలేజీలకే అప్పగించడంతో పాటు వాటి ఫీజును రూ.2.40 లక్షల నుంచి రూ.9 లక్షలకు సర్కారు పెంచింది. బి, సీ1 కేటగిరీలను కలిపి 35 శాతం సీట్లకు ఏకీకృత ఫీజును నిర్ధారించారు. ఇక నుంచి 35 శాతం సీట్లను ‘బి’ కేటగిరీగానే పిలుస్తారు. ప్రైవేటు దంత కళాశాలల్లోనూ ‘బి’ కేటగిరీని ఎత్తివేశారు. అందులోని 10 శాతం సీట్ల ఫీజునూ పెంచేశారు. ఇంతకుముందు రూ. 1.30 లక్షలుగా ఉన్న ఫీజును రూ. 4 లక్షలకు పెంచారు. మైనారిటీ కాలేజీల్లో మాత్రం ఈ కేటగిరీ సీట్లకు ఫీజును రూ. 2.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్య ఖరీదైపోయింది. గతంలో 2 నుంచి 3 వేల మధ్య ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు బి కేటగిరిలో సీటు వస్తే ఏటా 2.40 లక్షల ఫీజు చెల్లించే వారు. ఇప్పుడు ఆ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఈసారి సీటు రాదు. ఎందుకంటే బీ కేటగిరీ ఎంసెట్ పరిధిలో ఉండదు. పోనీ ప్రైవేట్ కాలేజీలు పెట్టే ప్రత్యేక పరీక్షలో తొలి ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలంటే రూ.50 లక్షలు ఖర్చు కానుంది. ఇది తలకు మించిన భారమే. -
ప్రైవేటు విద్యాసంస్థలపై ‘అద్దె’ భారం
- 10 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న బీఎంసీ - గడిచిన రెండేళ్ల నుంచే అమల్లోకి అని వెల్లడి - తాజా నిర్ణయంతో పాఠశాలలు మూత పడే అవకాశం! సాక్షి, ముంబై: బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. ఆ భవనాల అద్దెను పది శాతం పెంచుతున్నట్లు బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గడిచిన రెండేళ్ల నుంచి వర్తిస్తుందని చెప్పి మరో పిడుగు వేసింది. ఈ మేరకు రెండేళ్లకు ఒక్కో విద్యా సంస్థ రూ. మూడు లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మరాఠీ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లపై భారం మోపేందుకు బీఎంసీ సిద్ధపడటంతో చాలా పాఠశాలలు మూత పడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి (నైట్ స్కూల్స్) నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ముంబైలో ఉన్న సుమారు 289 పాఠశాలల్లో 70 శాతం బీఎంసీ ఆధ్వరంలో నడుస్తుండగా, మిగతా 30 శాతం పాఠశాలల భవనాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు 2013 నుంచి ప్రతి తరగతి గదికి రూ. వెయ్యి చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించడానికే విద్యా సంస్థలు నానాతంటాలు పడుతుంటే ఈ పెంపు మరింత భారం కానుంది. ప్రభుత్వం ఇదివరకే వేతనేతర పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడం కూడా నిలిపివేయడంతో.. తాజా నిర్ణయం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అద్దె పెంపును రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బీఎంసీ స్థలాల్లో అనేక స్వయం సేవా సంస్థలు తమ కార్యకలాపాలు, తరగతులు జరుగుతున్నాయి. ఇందుకు బీఎం సీ నుంచి ఆర్థిక మద్దతు, రాయితీ లభిస్తోంది. -
ప్రైవేటు స్కూల్స్‌పై వాణిజ్య శాఖ నజర్!
పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలపై ఆరా అమ్మకం పన్ను ఎగవేయకుండా చర్యలు {పైవేటు యాజమాన్యాలతో సమావేశం సెప్టెంబర్‌లోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు విద్యా సంస్ధలపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ప్రైవేటు స్కూల్స్ ప్రతి యేట విద్యా సంవత్సరం ప్రారంభంలో తమ స్టాల్స్ ద్వారా కోట్లాది రూపాయల విలువ గల పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ తదితర అమ్మకాలు సాగిస్తూ వ్యాట్ చెల్లించకపోవడాన్ని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. గ్రేటర్లో సుమారు నాలుగు వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికి కనీసం వ్యాట్ పన్ను చెల్లించక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా 2015-16 విద్యా సంవత్సరం అమ్మకాలపై ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మహానగరంలోని ఏడు ఉప వాణిజ్య పన్నుల శాఖల పరిధిలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, స్టాల్స్ ద్వారా జరిగే అమ్మకాలపై వ్యాట్ చెల్లించే విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠశాలలకు నమూనా పత్రంతో కూడిన సర్కులర్ కూడా జారీ చేసింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు స్టాల్స్ ద్వారా జరిగిన అమ్మకాల వివరాలను నిర్దేశిత నమూనా పత్రంలో సమగ్రంగా పూరించి సెప్టెంబర్‌లోగా సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. పూర్తి వివరాలకు సర్కిల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు స్కూల్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి బలవంతపు అమ్మకాలు సాగించ వ ద్దని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రథమ ఇంటర్లో ‘ప్రైవేట్’ హవా
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రైవేట్ కళాశాలల హవా కొనసాగింది. ఎంఈసీలో శ్రీమేధావి కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బీ. కుమారస్వామి, టీవీ మానస 500 మార్కులకు గాను 488 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచారు. జేకే అంజలి 481. ఎం. నవ్యశ్రీలక్ష్మీ 481, కే. ఫణిరాజ్ 479, జీ. అస్మిత్ 478, బీ. ఇందుశేఖర్ 477, కే. శ్రీసౌధ 475, జీ.కీర్తన 474, శ్రీ మంజునాథ 472, బీ. అపర్ణ 452, జీ.ఉమామహేశ్వరరెడ్డి 452, కే. పావని 452, ఎస్ఎస్ జ్యోతి 451, సాయిప్రతాప్‌రెడ్డి 443 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీలో పీ. రాజ 450, ఎస్. షకీరాబాను 435, జే.లిఖిత 433, బీ. రోహిణి 426, సీఈసీలో ఎస్. ఉషారాణి 411 మార్కులు సాధించారు. ఈ విద్యార్థులను కళాశాల డెరైక్టర్లు టీ. శ్రీధర్, బీ. రాఘవయ్య, ప్రిన్సిపల్. అబూబకర్, సిద్ధీక్ అభినందించారు. నలంద కళాశాల జయకేతనం నలంద కళాశాల విద్యార్థులు ఎంఈసీ గ్రూపులో జయకేతనం ఎగురవేశారు. సీ.జాన్సీ 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించి జిల్లా ప్రథమస్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. అలాగే విష్ణువర్ధన్ 487, సీ. ఉషారాణి 486, ఎస్. సయిదీక్షిత 482, జీ. హరిచందన, కే శ్రీనందన్ 480, పీ.కృష్ణసాయిరెడ్డి 478, ఎస్. శ్రీరంగలిఖిత్ 476, పీ. భరత్‌కుమార్ 475, ఎల్.చందన, ఎం. షరీన్ 474, టీ. తన్మయి 472, పీ. రమ్యసాయి, వై. కావ్య, ఎం. ఈశ్వర్‌నాయక్ 471 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీలో డీ. నవీన్‌కుమార్ 459, డబ్ల్యూ సాయినిరీష 457, కే. భాను 457, వై.హర్షిత 456, సూర్యప్రకాష్ 456, బీ. లక్ష్మీ 454, కేఎస్.మౌనిక 452, పీ.అనిల్‌కుమార్, కే. గౌతమి, పీ. తిరుపతినాయుడు, జీ.సతీష్‌కుమార్ 451 మార్కులు సాధించారు. సీఈసీ గ్రూపులో వీ. సాయికీర్తన 477, ఏ.శ్రీనిధి 442, కే. యశోదభాయి 438, పీ.షణ్ముక 430, ఎస్. జుబేర్ 429, ఏ. సంధ్య 417 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపల్ కే.మాధవరావు అభినందించారు. సత్తా చాటిన ‘వివేకానంద’ విద్యార్థులు స్థానిక వివేకానంద జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీలో ఏ.రాజరాజేశ్వరి 462, ఎస్.వేదావతి 461, ఎన్. అజయ్‌కృష్ణ 459, బీ. బాలకృష్ణ 458, జీ. ప్రబానంద 458, బైపీసీలో ఎస్. లక్ష్మీపల్లవి 428, కే. సాగరిక 415, ఎంఈసీలో కే. కేతియరామ్ 476, సీ. స్వేత 475, సీఈసీలో బీ. షామిలి 454, ఎస్. మహబూబ్‌బాషా 448, ఎన్. వినయ్‌కుమార్‌రెడ్డి 445 మార్కులు సాధించారు. విద్యార్థులను విద్యా సంస్థల డెరైక్టర్ కే. రవీంద్ర అభినందించారు. విజ్ఞాన్ విజయఢంకా విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు. ఎంఈసీలో కే. సాయిప్రణవి 481, ఎంపీసీలో టీ. మౌనిక 451, కేఎన్ పూజ 445, ఎస్. దివ్య 445, జే. మనోహర్ 442, బైపీసీలో వై.మనీష 406, సీఈసీలో ఎస్.సుదర్శన్ 448 మార్కులు సాధించారు. వీరిని డెరైక్టర్లు ఎంపీ శ్రీనివాసులు, రామ్‌కుమార్, శివశంకర్, కరుణాకర్, ప్రిన్సిపాళ్లు రమేష్, అంజనమ్మ అభినందించారు. మాస్టర్స్ విద్యార్థుల ప్రతిభ స్థానిక మాస్టర్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభచాటారు. ఎంపీసీలో శ్రీజ 460, శిరీష 459, వాణి 456, ఎంఈసీలో వై. చంద్రమౌళి 479, సీఈసీలో మేఘన 427, గోవర్ధన్ 419 మార్కులు సాధించారు. శ్రీ సత్యసాయి, ఎస్ఎల్ఎన్ విద్యార్థులు రాణింపు స్థానిక శ్రీసత్యసాయి, ఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాణించారు. ఎంపీసీలో గోవిందరాజులు, టీ. శైలజ 459, కే. సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్. తేజ 457, జీ. వెంకటేష్, బీ. జ్ఞానప్రసన్న 456, డీఆర్ గౌతమి 455, జీ. హరితలక్ష్మీ 454 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్. శ్రీలక్ష్మీ 426, వీ.జబిన్తాజ్ 422, ఎంఈసీలో ఈ. ప్రకాష్‌రెడ్డి 471, కే. శ్రావణి 462 మార్కులు సాధించారు. -
డబ్బున్న వారికే డాక్టర్ చదువు!
ప్రైవేటు కళాశాలల్లో ఇకపై 50 శాతం సీట్లు యాజమాన్యాల చేతుల్లోనే... రూ.5.5 లక్షల నుంచి రూ.11.5 లక్షలకు పెరిగిన యాజమాన్య కోటా ఫీజు సాక్షి, హైదరాబాద్: పేదవాడి మెడిసిన్ కల చెదిరిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. డాక్టర్ అవుదా మనుకున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలు అడియాసలు కానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సగం సీట్లను యాజమాన్యాల ఇష్టానికే వదిలేయడం, ఉన్నఫళంగా ఫీజులు లక్షలాది రూపాయలు పెంచడాన్ని చూస్తే ప్రభుత్వం డబ్బున్న వారికే వైద్య డిగ్రీని పరిమితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇకమీదట ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీటు కావాలంటే అధికారికంగా ఏడాదికి రూ.11.50 లక్షలు చెల్లించాలి. బి కేటగిరీ ఎత్తివేత ఇప్పటివరకు ప్రైవేటు వైద్య కళాశాలల సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 10 శాతం బి-కేటగిరీలో, మిగిలిన 40 శాతం.. యాజమాన్య (25), ఎన్ఆర్ఐ (15) కోటా సీట్లుగా భర్తీ చేసేవారు. కానీ వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి ప్రభుత్వం బి- కేటగిరీ సీట్లనూ యాజమాన్య కోటాలో కలిపేస్తోంది. అంటే మొత్తం యాజమాన్య కోటా 50 శాతం అవుతుందన్నమాట. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు చెల్లించి వైద్య విద్యను చదవాలనుకునేవారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. బి- కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏడాదికి రూ.2.40 లక్షల ఫీజు ఉండేది. అయితే అర్హత ఉన్న విద్యార్థులకు అప్పట్లో ప్రభుత్వమే ఈ ఫీజును రీయింబర్స్ చేసేది. తాజాగా ఈ సీట్లన్నీ యాజమాన్య కోటాలోకి వెళుతున్నాయి కాబట్టి వీటికి ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొందే వారు ఏడాదికి 60 వేలు ఫీజు చెల్లిస్తున్నారు. బి-కేట గిరీ ఎత్తేయడంతో కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను తగ్గించాలని భావిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల ఒత్తిడితో యాజ మాన్య కోటా సీట్లకు ఏడాదికి 11.5 లక్షల ఫీజును నిర్ధారిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మకానికి అదనంగా 200 ఎంబీబీఎస్ సీట్లు సర్కారు తాజా నిర్ణయం ప్రకారం ప్రైవేటు కళాశాలలకు 200 సీట్లు అమ్ముకునేందుకు అవకాశం లభించింది. గతంలో బి- కేటగిరీ సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేది. ప్రస్తుతం ఈ 10 శాతం సీట్లను ప్రైవేటు కళాశాలలే యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకోనున్నాయి. ఈ సీటు పొందిన విద్యార్థి ఏడాదికి రూ.11.5 లక్షలు చెల్లించాలి. వైద్య విద్య టెర్మ్ నాలుగున్నరేళ్లే అయినా ప్రైవేటు కళాశాలల్లో ఐదేళ్లకూ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఐదేళ్లకు రూ.57.5 లక్షలు అవుతుంది. 200 సీట్లకు ఏడాదికి రూ.23 కోట్లు లెక్కన ఐదేళ్లలో రూ.115 కోట్లు లభిస్తాయన్న మాట. ఇదెక్కడి న్యాయం ఇప్పటికే పేద విద్యార్థులు చాలామంది ఫీజులు చెల్లించలేక వైద్యవిద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బి కేటగిరీ సీట్లను ప్రైవేటుకు అప్పజెప్పడం, యాజమాన్యకోటా సీట్ల ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసం? కర్ణాటక తరహాలోనే వైద్య విద్యను ప్రైవేటుకు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. - డాక్టర్ స్నిగ్ధ, పీజీ వైద్యవిద్యార్థిని, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
విద్యార్థులు ధర్నా... పోలీసులు లాఠీ చార్జీ
హైదరాబాద్: ఆహారం, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఆరోపిస్తూ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్ ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. తెల్లవారుజామున కాలేజీ హాస్టల్‌కు నిప్పు పెట్టారు. దీంతో హాస్టల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. దాంతో కళాశాల హాస్టల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసుల రాకతో విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనలో విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. -
ప్రైవేట్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన!
-
నేలపైనే పరీక్ష
బుచ్చిరెడ్డిపాళెం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు విద్యార్థులకు పరీక్షగానే మారాయి. వసతుల లేమితో కింద కూర్చుని రాయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల కుమ్మక్కుతో పక్కపక్కనే నంబర్లు వేయడంతో పక్కా కాపీయింగ్ అవకాశమిచ్చే పరిస్థితి తలెత్తుతోంది. ఏడాది పాటు కష్టపడిన తమ పిల్లలు కింద కూర్చుని రాయాల్సి రావడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. బుధవారం డీఎల్ఎన్ఆర్ ఏ, బీ సెంటర్లలో పరిస్థితి ఇది. డీఎల్ఎన్ఆర్ కళాశాలలో పైఫ్లోర్ను ఏగా, కింద ఫ్లోర్‌ను బీగా కేటాయించారు. రెండు సెంటర్లలో చాలామంది విద్యార్థులు కింద కూర్చుని రాయాల్సి వచ్చింది. వరండాలో వేసి నంబర్లు పక్కపక్కనే ఉండటంతో కాపీయింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కింద కూర్చుని రాయాల్సి రావడంతో మానసిక ఒత్తిడికి గురై పరీక్ష సరిగా రాయలేదని కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడ్డారు. ఏ కేంద్రంలో 344 మంది విద్యార్థులను కేటాయించగా 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బీ సెంటర్లో 359 మందిని కేటాయించగా 19 మంది గైర్హాజరయ్యారు. సీ సెంటర్ బాలికల ఉన్నత పాఠశాలలో 316 మంది హాజరుకావాల్సి ఉండగా 17 మంది గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఆర్ఐఓ పరంధామయ్యను సంప్రదించగా కింద కూర్చున్న విషయం తన దృష్టికి వచ్చిందని, గురువారం పరీక్షకు కుర్చీలు వేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
వినండి.... వదలండి
ఇంటర్ పరీక్షలలో కొత్త ఎత్తుగడలు - మాస్‌కాపీయింగ్ కోసం ముమ్మర యత్నాలు - ఓ అధికారికి ‘ప్రయివేటు’ భారీ నజరానా? - ఫలితాల కోసమే యూజమాన్యాల ఆరాటం - అడ్డుకుంటామంటున్న విద్యార్థి సంఘాలు నిజామాబాద్ అర్బన్ : ‘‘సర్...మేము చెప్పేది వినండి. ఈసారి మమ్మల్ని వదలండి. మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. గత ఏడాది కంటే ప్రస్తుతం ఎక్కువగానే అడిగింది ఇస్తాం. ఇంకేమి కావాలి’’ అంటూ వారం రోజులుగా ఇంటర్ అధికారులతో ప్రయివేటు కళాశాలల యజమాన్యాలు చర్చలు కొనసాగిస్తున్నారుు. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఇక్కడ విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఇప్పుడూ అదే పరిస్థితిని తీసుకు రావడానికి ప్రరుువేట్ కళాశాల యజమాన్యాలు భారీ నజరానాతో ఓ అధికారికి గాలం వేశాయని సమాచారం. మాస్‌కాపీయింగ్ నిరోధానికి ఉన్నతాధికారులు అనేక నూ తన పద్ధతులు ప్రవేశ పెడుతున్నారు. ఇది కళాశాల యూజమాన్యాలకు మింగుడుపడడం లేదు. దీంతో తాము అనుకున్నది సాధించుకోవడానికి నెల రోజులుగా తమ ప్ర యత్నాలు ముమ్మరం చేశారు. ఇంటర్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీంతో వారం రోజులుగా ఆర్ఐఓ కార్యా లయానికి వారి రాకపోకలు భారీగా పెరిగాయి. యథేచ్ఛగా ముడుపులు ఈ నెల తొమ్మిది నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 27,497, రెండవ సంవత్సరం విద్యార్థులు 29,68 4, ఒకేషనల్ విద్యార్థులు 1,658 మంది హాజరవుతున్నారు. 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిని జీపీఆర్ఎస్ ద్వారా నిఘా కిందకు చేర్చారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వీడియోను చిత్రీకరించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఫలితాల కోసం ప్రరుువేటు యజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కళాశాలల సంఘం నాయకులు ఓ అధికారితో తీవ్రమైన చర్చలు జరుపుతున్నారని తెలిసింది. జిల్లాకు వచ్చిరాగానే వాహనాన్ని బహుమ తిగా పొందిన అధికారి, ఈ ఏడాది కూడా భారీ నజరానాను పొందారని తెలుస్తోంది. కళాశాలకు లక్ష రూపాయల చొప్పున, మరికొన్ని కళాశాలల నుంచి రూ. 30 వేల చొ ప్పున వసూలు చేసిన ఇద్దరు సంఘం నాయకులు మాస్‌కాపీయింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కొన్ని కళాశాలలవారు తమ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్లలో ఇప్పటికే తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను కేటాయించుకున్నారు. ఇందులోనూ ప్రముఖపాత్ర వహించిన అధికారి భారీగా ముడుపులు అందుకు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి డివిజన్లోని ఓ కళశాల యజమాని ముడుపుల కోసం వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. నాలుగు రోజుల క్రితం బోధన్‌లోని ఓ విద్యాసంస్థ యజమాని ఆల్లు డు నేరుగా కార్యాలయంలోని అధికారికి ముడుపులు ఇచ్చారని తెలిసింది. ప్రాక్టికల్స్‌లో జోరుగా వసూళ్ల కార్యక్రమం జరిగింది.బాన్సువాడ డివిజన్ నుంచి ముడుపులు అందలేదని ఓ అధికారి నేటి వరకు ఆయా కళశాల యజమాన్యాలను ప్రశ్నిస్తూనే ఉన్నారని తెలిసింది. నెల రోజుల క్రితమే ఆర్మూర్ రోడ్డులోని ఓ కళాశాల యజమానిని కారులో కలుసుకొని బహుమతిగా పొందారని చెబుతున్నారు. దీంతో మాస్‌కాపీయింగ్ విచ్చలవిడిగా జరిగే అవకాశం ఏర్పడింది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెం టల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను కళాశాలకు అనుకూలంగా నియమించారని సమాచారం. గత డిసెంబర్లో హైదరాబాద్‌లోని ఓ ఉన్నతాధికారి పదవీ విరమణ పేరిట ఇం టర్ అధికారి ఒకరు వసూళ్ల కార్యక్రమం చేపట్టారని సమాచారం. అనంతరం మాస్ కాపీయింగ్ కోసం కళాశాలలకు చెందిన సంఘం నాయకులు సంప్రదించగా ఈసారి నూతన పద్ధతి వీడియో చిత్రీకరణ ఉందంటూ మొదట మొండికేసిన అధికారి భారీగా ముడుపులు అందడంతో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఇంటర్ ప రీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి మాస్ కాపీయింగ్‌ను పూర్తిగా నిరోధిస్తే మెరిట్ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. కలెక్టర్ దృష్టిసారించాలి కలెక్టర్ ఇంటర్ పరీక్షలపై దృష్టిసారించాలి, మాస్ కాపీయింగ్ కోసం ప్రరుువేటు కళాశాలల యజమాన్యాలు, ఇంటర్ అధికారులు కుమ్ముక్కైయ్యారు. అధికారుల ైవై ఫల్యంతోనే జోరుగా మాస్‌కాపీయింగ్ కొనసాగుతుంది. అలాంటి సెంటర్లు, యజమాన్యాలపై ధర్నాలు, దాడులు చేస్తాం. మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఉరుకోం. - శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ -
'ప్రైవేటు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి'
వరంగల్: విద్యార్ధులకు ప్రైవేటు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం నగరంలోని రంగశాయిపేట గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల అధ్యక్షులు సంగంరెడ్డి సుందర్రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర ఎంతో ఉందన్నారు. కళాశాలలకు రావాల్సిన పాత బకాయిలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా కళాశాలల సమస్యల పరిష్కారంలో అండగా ఉంటానని కడియం శ్రీహరి హామీనిచ్చారు. అదే విధంగా నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజక వర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. (కరీమాబాద్) -
కొత్త డిగ్రీ కాలేజీల అనుమతికి నో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా పెద్ద సంఖ్యలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు పుట్టుకొచ్చాయని... దీంతో ఈ ఏడాది కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎలాగూ ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వస్తుందని ఇష్టమొచ్చినట్లుగా కాలేజీలు ఏర్పాటు చేశారని, అందువల్ల ఇప్పట్లో కొత్త డిగ్రీ కాలేజీల ఏర్పాటు అనవసరమని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అవసరమున్నా, లేకున్నా రాజకీయ పలుకుబడి, పైరవీలతో పెద్ద సంఖ్యలో కొత్త డిగ్రీ కాలేజీలు పుట్టుకువచ్చాయి. వీటిల్లో చాలా కాలేజీలు విచారణకు వెళ్లిన అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. అసలు గత ఇరవయ్యేళ్లుగా ఏటా పదిలోపే కొత్త ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులివ్వగా... గత రెండేళ్లలో మాత్రం ఏకంగా 296 డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎలాగూ ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వస్తుందని అవసరం లేనిచోట కూడా కాలేజీలను ఏర్పాటు చేశారని, కనీస వసతులు, అర్హులైన అధ్యాపకులు లేరని ఉన్నత విద్యా మండలికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో కొత్త కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని యోచిస్తోంది. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ధర్నా
అచ్చంపేట(మహబూబ్‌నగర్): మండల కేంద్రంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు కాలేజి యాజమాన్యాలు పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు. -
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులకు సవాలే నిలిచాయి. గతేడాది ఇంటర్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారన్న ఆరోపణలు వచ్చాయి. మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఏకంగా అప్పటి ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి, జేసీ వెంకటేశ్వర్రావులు నిజామాబాద్ కాకతీయ జూనియర్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల అధినేతను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడ పలుచోట్ల ఇంటర్ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్, మార్చి 9 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో ముందస్తు ప్రణాళికపై ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఎ.విజయ్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లో.. మూత పడిన 20 కాలేజీలు.. జిల్లాలో మొత్తం 163 ఇంటర్ కాలేజీలు ఉంటే అందులో ఈ ఏడాది 143 కళాశాలల విద్యార్థులే పరీక్షలకు హాజరవుతున్నారు. గత రెండు మూడేళ్లుగా 20 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది నిజామాబాద్‌లో విశ్వభారతి, బాన్సువాడలో ప్రగతి కాలేజీలను మూసేశారు. 31 ప్రభుత్వ, 4 ఎయిడెడ్ కళాశాలు, 15 మోడల్ స్కూల్స్, 13 సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల కళాశాలతో పాటు 80ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 60,592 ఈసారి పరీక్షలు రాయనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 9 నుంచి జరిగే ఇంటర్ ప్రథ మ, ద్వితీయ పరీక్షలకు ఇప్పటి నుంచే పకబ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను ‘జంబ్లింగ్’ పద్ధతిన ఏర్పా టు చేయనున్నాము. ఉదాహరణకు నిజామాబాద్‌లో 18 కాలజీలుంటే వాటి ని మూడు జోన్లుగా విభజించి ఏ కాలేజీలో చదివే పిల్లలు ఆ కాలేజీలో పరీక్ష రాసే అవకాశం ఉండకుండా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తాము. గతంలో ఆరోపణలు వచ్చిన కళాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. పరీక్షల నిర్వహణపై సమావేశం... ఇంటర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ఓ స మావేశం నిర్వహించనున్నాము. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల నిర్వాహకు లు హాజరయ్యే విధంగా ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నాము. 143 ప్ర భుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఏ సెంటర్లో పరీక్ష రాయాల్సి వచ్చి నా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది సూచిస్తాము. కళాశాలల నిర్వాహకులు ఖచ్చితంగా హాజరయ్యేలా ప్రణాళికబద్ధంగా నిర్వహించే సమావేశం పరీక్షలకు కీలకం కానుంది. ప్రాక్టికల్స్ ఎక్కడికక్కడే.. ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 12న ముగిసింది. ఈ లె క్కన 29,250 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం పరీక్ష రాయనుండగా, 31,342 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. అ యితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీలోనే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఉంటాయి. కేవలం రాత పరీ క్షలు మాత్రమే ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి. ’కాపీయింగ్’పై తల్లిదండ్రుల వ్యతిరేకత ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ‘విద్యార్థులకు జలుబు పడితే తల్లిదండ్రులకు తుమ్ములు వస్తున్నాయి’. తమ పిల్లల భవిష్యత్‌పై కలలుకంటున్న వారు కాపీయింగ్‌ను కోరుకునే పరిస్థితిలో అసలే లేరు. అయితే కొన్ని విద్యాసంస్థలు ర్యాంకుల కోసం గతంలో ఈ పద్ధతులు అవలంభించినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో అవకతవకలకు అస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాము. అవకతవకలకు పాల్పడితే ఇంటికే.. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. పిల్లలు ఉత్తములుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అనేక వ్యయప్రయాసాలకు సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల్లో అవకతవకలకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాము. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన బోధకులకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు ఇవ్వం. ఇన్విజిలేట ర్లు అక్రమాలకు అవకాశం కల్పిస్తే ఇంటికి పంపడం ఖాయం. ఈ పరీక్షల్లో 400 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను వినియోగించనున్నాము. -
టెన్త్ విద్యార్థులపై ప్రైవేటు ఫీ‘జులుం’
విజయనగరం అర్బన్ :పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు దందా చేస్తున్నాయి. విద్యాశాఖలోని కొంతమంది అధికారుల అండతో పలు ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్ష ఫీజుతోపాటు అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. విద్యాశాఖ పరీక్షల విభాగం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం... పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు సబ్జెక్టులకు మించి రాస్తున్నట్లయితే రూ.1 25 ఫీజుగా చెల్లించాలి. ప్రైవేట్‌గా చదివే విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.650 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును పాఠశాలలకు విద్యార్థులు చెల్లిస్తే ప్రధానోపాధ్యాయులు వాటిని ట్రెజెరీ కార్యాలయంలో జమ చేస్తారు. అనంతరం నామినల్ రోళ్లను ఉప విద్యాశాఖాధికారి ద్వారా డీఈఓ కార్యాలయంలో పరీక్షల వి భాగానికి అందించి, విద్యాశాఖ ఆమోదం పొందుతా రు. జిల్లాలో మొత్తం 500 పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీటి లో గుర్తింపు లేనివి, అనుమతి లేని అదనపు సెక్షన్లు ఉన్నవి సుమారు 30 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఈ పాఠశాలల వారు ఏదో ఒక గుర్తింపు ఉన్న పాఠశాల ద్వారా విద్యార్థులను పరీక్షలకు పంపుతున్నారు. ఇలాంటి లొసుగులను ఆసరాగా తీసుకొని కొన్ని పాఠశాలల్లో రూ. 300 వసూలు చేస్తుండగా మరికొన్నింటిలో రూ. 600 నుంచి రూ.800, రూ1000 వరకూ రాబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం విద్యాశా ఖ అధికారులకు తెలిసినా... నజరానాలు ముట్టడంతో మిన్నకుండిపోతున్నారు. ఈ విషయంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, సంబంధిత అధికారుల మధ్య వారధిగా విద్యాశాఖ పరీక్షల విభాగంలోని కొం దరు సిబ్బంది, డీఈఓ కార్యాలయంలో కొందరు సిబ్బం ది కీలకపాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పిల్ల ల భవిష్యత్తికి ముడిపడిన సమస్య కావడంతో ప్రైవేటు విద్యాసంస్థల వసూళ్ల దందాను తల్లిదండ్రులు బయటకు చెప్పలేకపోతున్నారు. గత ఏడాది 30 వేల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరి లో 13 వేల మందికి పైగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. గుర్తింపులేని పాఠశాలలను ఉపేక్షించబోమని విద్యాసంవత్సరం ఆరంభంలో హెచ్చరికలు జారీ చేసే విద్యాశాఖ అధికారులు ఆ తరువాత మామూళ్ల మత్తులలో చల్లబడడంతో జిల్లాలో ఇప్పటికీ 30 వరకు గుర్తింపులేని పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం టెన్త్ పరీక్ష ఫీజులను నిబంధనలకు విరుద్ధంగా అదనం గా వసూళ్లు చేసే ప్రైవేటు విద్యాసంస్థలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. నిర్ణీత ఫీజు మాత్రమే చెల్లించాలని చెప్పారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
శాతవాహన యూనివర్శిటీ : ప్రైవేటు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి విద్యార్థులకు శాపమైంది. పరీక్షల సమయానికి హాల్‌టికె ట్లు ఇస్తామనే యాజమాన్యం మాటలు నమ్మి విద్యార్థులు మోసపోయారు. తమ కళాశాలకు ప్రత్యేక అనుమతి కోసం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉందని, దాని నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదని క్రిసెంట్ డీఈడీకళాశాల యాజమాన్యం చేతులె త్తేసింది. దీంతోతాము మోసపోయూమని వి ద్యార్థులు కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ప్రత్యేక అనుమతినిచ్చిపరీక్షల రాయడానికి అవకాశం కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పరీక్ష కోల్పోయిన50 మంది విద్యార్థులు... క్రిసెంట్ డీఎడ్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 50మంది విద్యార్థులున్నారు. వీరందరికి కళాశాల యాజమాన్యం మేనేజ్మెంట్ కోటాలో లక్షలాది రూపాయలకు సీట్ల అమ్మే క్రమంలో కళాశాలకు అనుమతి ఉందని నమ్మబలికింది. డీఈవో అనుమతి మేరకు వివిధ పాఠశాలల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేయడంతో అనుమతి ఉందని నమ్మారు. పరీక్షల సమయం దగ్గర పడడం, హాల్‌టికెట్లు ఇవ్వడానికి జాప్యం చేయడంతో అసలు విషయం బయటపడింది. కళాశాలకు ఎస్ఈఆర్టీ నుంచి పర్మిషన్ లేదన్న విషయం తెలిసింది. దీంతో హాల్‌టికెట్స్ రాక బుధవారం ప్రారంభమైన డీఎడ్ ఫస్టియర్ వార్షిక పరీక్షలకు క్రిసెంట్ కళాశాలలో 50 మంది విద్యార్థులు అర్హతను కోల్పోయారు. నిబంధనలు పాటించకనే.. క్రిసెంట్ డీఎడ్ కళాశాల నిర్వహిస్తున్న ఒక భవనంలోనే పాఠశాలస్థాయి నుంచి బీఈడీ, డీఎడ్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. డీఎడ్ కోర్సు నిర్వహణకు ఎస్ఈఆర్టీ నుంచి ఏటా అఫ్లియేషన్ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కళాశాలకు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వ అనుమతి నిమిత్తం పంపించినా కొన్ని కారణాలతో అనుమతి రాలేదన్న అభిప్రాయాలున్నాయి. దీనిని పర్యవేక్షణ తన పరిధిలో లేదని డీఈవో జిల్లా రెవెన్యూ అధికారుల ముందే స్పష్టం చే శారు. అరుుతే అధికారం లేనిదే టీచింగ్ ప్రాక్టీస్‌కు పంపే క్రమంలో డీఈవో అనే మాటను కళాశాల నిర్వాహకులు ఎందుకు చెప్పారని విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్ఈఆర్టీ నామ్స్ మేరకు మా పరిధిలో పనిచేశామని జిల్లా విద్యాధికారి చెప్పారు. రాస్తారోకో... ఆందోళనలు కళాశాల నిర్లక్ష్యంతో అర్హత కోల్పోయిన 50 మంది విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటను ఎంచుకున్నారు. ఉదయం క్రిసెంట్ కళాశాల ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించి హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు కన్నీరుపెట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు, విద్యాధికారికి విన తిపత్రం రాశారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన డీఈవోకు విషయూన్ని వివరించారు. సమస్య తన పరిధిలో లేదని జిల్లా విద్యాధికారి చెప్పారు. అప్పుడే కలెక్టర్ వాహనం అటు వైపు రావడంతో ఎంతోఆశతో విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. దానిపై విచారణ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
ఆ మూడు వర్గాల్లోనే సంతోషం: పొన్నాల
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఇన్నోవా డీలర్లు.. సిమెంట్ కంపెనీలు.. ప్రైవేటు కాలేజీలు.. కేసీఆర్ ఆరు నెలల పాలనలో ఈ మూడు వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ ‘ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్‌కు ముందున్నది ముసళ్ల పండగ.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టేది లేదు’ అంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు వివేక్, సిరిసిల్ల రాజయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
యాజమాన్యాల ఆశల గల్లంతు!
ఆశించినమేర చేరని విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల్లో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. ఎక్కువ మొత్తం లో విద్యార్థులు చేరుతారనుకుంటే తక్కువ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలోని 135 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జరిగిన కౌన్సెలింగ్‌లో కేవలం 3,115 మంది మాత్రమే సీట్లు పొందారు. ఈ సీట్ల కేటాయింపు వివరాలను ఆదివారం ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెల్లడించింది. కనీసంగా 25 వేల వరకు విద్యార్థులు తమ కాలేజీల్లో చేరుతారని యాజమాన్యాలు అంచనా వేసుకోగా.. అంత సంఖ్యలో విద్యార్థులు చేరలేదు. అన్నీ సక్రమంగా ఉన్న 149 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు ఉంటే కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు ఇచ్చిన వారు 55,094 మంది మాత్రమే. అందులో 52,839 మంది విద్యార్థులకుసీట్లు లభిం చాయి. 15,677 సీట్లు మిగిలిపోయాయి. అఫిలియేషన్లు లభిం చని 161 కాలేజీలు సుప్రీంకోర్టును పలుమార్లు ఆశ్రయించాయి. గత నెలలో సుప్రీం కోర్టు వాటిలోనూ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలు మినహా మిగతా 135 కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో ఉన్న 45,293 సీట్ల భర్తీకి ఈ నెల 5 నుంచి 7 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించింది. 3,261 మంది సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోగా 3,115 మం ది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఆదివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 42,178 సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 10, 11 తేదీల్లో సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించి అలాట్మెంట్ లెటర్‌పై ధ్రువీకరణ తీసుకుని ఈనెల 12వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పలువురికి గాయాలు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఘటన ఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్, డీఎస్పీ బెరైడ్డిపల్లె: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ప్రయివేటు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని జాలారిపల్లె వద్ద చోటుచేసుకుంది. పలమనేరులోని ఓ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో జాలారిపల్లె వద్ద రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఇతర పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రయాణికులతో కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ అదుపు తప్పి కళాశాల బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తున్న మండలంలోని కామినాయనపల్లెకు చెందిన అబ్దుల్లా కుమారుడు ఇర్షాద్(18), బాబ్జాన్, మహమ్మద్, దావద్, రాజేష్, నీరజ, కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న జయలక్ష్మి, రజిత గాయపడ్డారు. ఇర్షాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీకి తరలిం చారు. అక్క డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగి న సమయంలో సబ్ కలెక్టర్ కరుణన్ కుప్పం వెళుతున్నారు. వెంటనే వాహనా న్ని ఆపి పరిస్థితిని సమీక్షించారు. డీ ఎస్పీ హరినాథ్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బెరైడ్డిపల్లె ఎస్ఐ హరిహరప్రసాద్, సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇర్షాద్ మృతితో తల్లడిల్లిన కుటుంబం ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఇర్షాద్‌పై అబ్దుల్లా దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చేతికంది వచ్చిన కుమారుడు అండగా ఉంటాడని అనుకుంటుండగా మృత్యువు కబళించడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పో యింది. ‘మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా నాయనా’ అంటూ తల్లి కు మారుడి మృతదేహంపై పడి ఏడవడం చూపరులను కంటతడి పెట్టించి ంది. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం మృతిచెందిన ఇర్షాద్ కుటుంబాన్ని ఆదుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక పం పుతాం. గాయపడిన బాబ్జాన్, మహమ్మద్‌కు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాం. రాము, పలమనేరు డిపో డీఎం -
షెడ్యూలు అక్కరలేదట!
డైట్‌సెట్ ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత రాకపోవడంతో విద్యా సంవత్సరం నష్టపోతామనే భయం వారిని వెన్నాడుతోంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలు మాత్రం నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే యాజమాన్య కోటా సీట్లకు బేరసారాలు సాగిస్తున్నాయి. కౌన్సెలింగ్‌లో సీటు వస్తుందో.. రాదో తెలియని సంకట స్థితిలో యాజమాన్యాల డిమాండుకు విద్యార్థులు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఈ యేడాది జూన్ 15న జరిగిన డైట్‌సెట్-2014కు (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) జిల్లా నుంచి 43,037 మంది దరఖాస్తు చేసుకోగా 40,354 మంది పరీక్షకు హాజరయ్యారు. నవంబర్ మొదటివారంలో ఫలితాలు వెలువడినా కౌన్సెలింగ్ షెడ్యూలుపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. రెండేళ్ల డీఎడ్‌కు సంబంధించి ఇప్పటికే ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు కూడా ముగిసినా మొదటి సంవత్సరం ప్రవేశాలపై స్పష్టత రావడం లేదు. షెడ్యూలుపై స్పష్టత లేకపోవడంతో అటు డిగ్రీలో చేరలేక, ఇటు కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూడలేక విద్యార్థులు అయోమయం ఎదుర్కొంటున్నారు. ఇంటర్మీడియేట్ తర్వాత రెండేళ్ల శిక్షణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉండడంతో డీఎడ్‌పై విద్యార్థులు ఆశలు పెంచుకున్నారు. వచ్చే యేడాది నుంచి డీఎస్సీకి సంబంధించి వరుస నోటిఫికేషన్లు ఉంటాయనే ప్రచారంతో విద్యార్థులు డీఎడ్‌పై ఆసక్తి చూపుతున్నారు. డీఎడ్‌లో చేరేందుకు వయో పరిమితి నిబంధన ఎత్తివేయడంతో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా డైట్‌సెట్‌కు హాజరయ్యారు. మరోవైపు ప్రస్తుతమున్న నిబంధన సవరిస్తూ డైట్‌సెట్‌లో అర్హత సాధించిన వారినే యాజమాన్య కోటా కింద ప్రవేశం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే యేడాది నుంచి అమలవుతాయని చెబుతూ డైట్‌సెట్‌లో అర్హత సాధించని వారికి కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీంతో డీఎడ్ సీట్లకు మునుపెన్నడూ లేనంత స్థాయిలో పోటీ నెలకొంది. యాజమాన్య కోటాకు గిరాకీ జిల్లాలో ప్రభుత్వ డైట్ కాలేజీతో పాటు మొత్తం 33 డైట్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ డైట్ కాలేజీలో 150, ప్రైవేటు కాలేజీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 20శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకునే అవకాశం మేనేజ్మెంట్లకు కల్పించారు. దీంతో ఒక్కో కాలేజీకి సగటున 10 సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశముంది. డీఎడ్ సీట్లకు తీవ్ర పోటీ ఉండటంతో యాజమాన్యాలు సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నాయి. కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడక మునుపే చాలా కాలేజీలో యాజమాన్య కోటా ముగిసినట్లు ప్రకటిస్తున్నాయి. ఒక్కో సీటుకు విద్యార్థుల నుంచి రూ.1.60లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు డిమాండు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టత లేకపోవడం, ఒకవేళ కౌన్సిలింగ్ నిర్వహించినా సీటు దక్కదనే భయంతో విద్యార్థులు యాజమాన్యాల బేరసారాలకు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్పష్టత ఇస్తేనే అభ్యర్థుల్లో అస్పష్టత తొలిగే అవకాశం ఉంది. -
వీసీ క్షమాపణ చెప్పాల్సిందే
గుడుపల్లె: ద్రవిడ వర్సిటీ వీసీ కంకణాల రత్నయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబట్టారు. వీసీ తమ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ రెండు రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి శుక్రవారం వర్సిటీలోని ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. వర్సిటీ బంద్ పాటించారు. సిబ్బంది లేక భాషా భవనం, పరిపాలనా భవనం, వివిధ శాఖలు బోసిపోయాయి. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సిబ్బంది ఆరోపించారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై వర్సిటీలో ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేశారని ధ్వజమెత్తారు. వర్సిటీలో చదువుకునేవారు కరువయ్యారని అన్నారు. వీసీ చాం బర్ ఎదుట గంట పాటు ఆందోళన చేసినా ఆయన బయటకు రాకపోవడంతో సిబ్బంది వర్సిటీ మెయిన్‌గేట్ వద్ద బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, వుదీనా, త్యాగరాజు, శ్రీనివాసులు, పాండురంగన్, లక్ష్మీనారాయుణ పాల్గొన్నారు. వర్సిటీకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధం లేదు ద్రవిడ వర్సిటీకి అందులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని వీసీ కంకణాల రత్నయ్యు తెలిపారు. రెండు రోజులు వర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని విలేకర్లు వివరణ కోరగా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ద్రవిడ వర్సిటీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. -
ఫీజులుం
పరీక్ష ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల దోపిడీ రూ.300 ఫీజుకు రూ.1,500 వసూలు రెండేళ్లకూ ఒకేసారి చెల్లిస్తే రూ.2,500 చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులని బెదిరింపులు అధికారులు పట్టించుకోవడం లేదంటున్న తల్లిదండ్రులు కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆర్ఐవో గుడివాడ : ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల నిర్వాహకులు విద్యార్థులను దోచుకుంటున్నారు. ఏడాదికి పరీక్ష ఫీజు రూ.300 కాగా, ఇందుకు ఐదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే... పరీక్షల సమయంలో ఖర్చులుంటాయని బదులిస్తున్నారు. ఒక్కో ప్రయివేటు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు రెట్లు అధికంగా వసూలు జిల్లాలో 23 ప్రభుత్వ, 227 ప్రయివేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు ఐదు వేలమంది, ప్రయివేటు కళాశాలల్లో 95వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 65వేల మంది ప్రథమ సంవత్సరం, 35వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి రాజారావు చెప్పారు. వీరందరూ పబ్లిక్ పరీక్షలకు ఈ నెల 17వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. మొదటి ఏడాది విద్యార్థులు(అన్ని గ్రూపులు) కేవలం రూ.300 చొప్పున మాత్రమే చెల్లించాల్సి ఉంది. మొదటి ఏడాది సబ్జెక్టులు మిగిలి ఉండి వాటితోపాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు గరిష్టంగా రూ.600 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం ప్రాక్టికల్స్ ఫీజు నిమిత్తం రూ.100 అదనంగా చెల్లించాలని బోర్డు ప్రకటించింది. అయితే, గుడివాడలోని కొన్ని కళాశాలలు ఇందుకు విరుద్ధంగా మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి రెండేళ్లకు ఒకేసారి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. మరికొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు తాము చెప్పినట్లు ఫీజు చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, హాల్ టికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన 95 వేల మంది నుంచి అదనంగా వసూలు చేసే మొత్తం రూ.9కోట్ల వరకు ఉంటుందని అంచనా. కళాశాలల నిర్వాహకులు వసూలు చేసే మొత్తంలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు కూడా వాటాలు ఉంటాయని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందువల్లే వారు కళాశాలలవైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు : ఆర్ఐవో కళాశాలల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి(ఆర్ఐవో) రాజారావు చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆయా కళాశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే తన సెల్ నంబర్ 9848308998కు ఫోన్ చేయాలని ఆర్ఐవో సూచించారు. -
తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి : తిరుపతి తుమ్మలకుంటలోని ఓ ప్రయివేట్ కళాశాల క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన రేఖ ... ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోమవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే రేఖ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం గత రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేసి రేఖకు సీరియస్‌గా ఉందని చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు. తాము కాలేజ్ వద్దకు వచ్చేసరికి ఇక్కడ యాజమాన్యంకి సంబంధించిన వారు ఎవరూ లేరని అన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై ఉరి వేసుకుని చనిపోయిన ఆనవాళ్లు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే చనిపోయి ఉంటుందన్నారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. -
లోపాలున్నప్పటికీ డీఎడ్ కాలేజీలకు రెన్యువల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీల్లో నిబంధనల ప్రకారం ఉన్నవి 40 కాలేజీలే. మిగిలినవాటిలో ఏదో ఒక లోపం ఉన్నప్పటికీ 259 ప్రైవేట్ కాలేజీలకు అనుమతులను రెన్యువల్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. విద్యాసంవత్సరం ఆలస్యం అవుతున్నందున ఈసారికి రెన్యువల్ చే యాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ వారంలో రెన్యువల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికోసం తెలంగాణ, ఏపీల్లోని 2.19 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీలోని 476కి పైగా కాలేజీలకు రెన్యువల్స్ రాలేదు. దీంతో తెలంగాణలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇదీ కాలేజీల పరిస్థితి : 199 డీఎడ్ కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అన్నిట్లోనూ అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పా ట్లు లేవని తేలింది. ఇక 55 కాలేజీల్లోనైతే బోధన, బోధనేతర సిబ్బంది నిబంధనల మేరకు లేరు. దీంతో వీటికి ఈ ఒక్క ఏడాదికే అనుమతులను రెన్యువల్ చేసి, వచ్చేఏడాది పకడ్బందీగా తనిఖీ లు చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణలో డైట్‌సెట్‌కు ప్రత్యేకంగా కన్వీనర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి డైట్‌సెట్-2014 జరిగింది. వేరుగా కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యం అవుతుందా? అనేది ప్రశ్నార్థంగా మారింది. -
‘డీసీఈబీ’కి మంగళం
విజయనగరం :అర్బన్: పాఠశాల విద్యారంగంలో కీలకపాత్ర వహిస్తున్న జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసింది. పాఠశాల విద్యలో 6 నుంచి 10వ తరగతి వరకూ పరీక్షా పత్రాలను తయారు చేయడం నుంచి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు, సంస్కరణలపై ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించడం వరకు కీలకభూమిక పోషిస్తూ విద్యారంగం అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు జీఓ నంబరు 118ను పాఠశాల విద్యాకమిషనర్ ఉషారాణి అన్ని జిల్లాల విద్యాశాఖలకు పంపారు. పాఠశాల విద్యారంగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఈ వ్యవస్థను రద్దు చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యను ఉచితంగా అందించడంలో, పాఠశాలలో చదువుకోని, అక్షరజ్ఞానం ఉన్న పిల్లలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 8, 9వ తరగతులకు అర్హత కల్పించే విషయంలో ఈ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. దీనివల్ల విద్యాహక్కు చట్టం అమలు (2009-10) అయినప్పటి నుంచి ఇంతవరకు జిల్లాలో ఏడాదికి 800 నుంచి వెయ్యి మంది వరకు విద్యార్థులు 9వ తరగతి విద్యా అర్హత పొందుతూ వచ్చారు. బోర్డును రద్దు చేయడంతో ఈ ప్ర క్రియకు బ్రేక్ పడుతుంది. దీంతోవిద్యాహక్కు చట్టానికి తూట్లు పొడిచినట్లయింది. జిల్లా స్థాయిలో విద్యాప్రమాణాలను కొలమానికంగా చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల తరగతులకు త్రై మాస,అర్ధ సంవత్సర పరీక్షా పత్రాలు తయారుచేసి డీసీఈబీ పంపిణీ చేసేది. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర నిరంతర మూల్యాంక న(సీసీఈ) విధానం వల్ల క్లస్టర్ పరిధి ప్రధానోపాధ్యాయులకు ఈ కీలక ప్రక్రియను అ ప్పగించారు. దీంతో ఆ పని డీసీఈబీకి లేదని సమర్థిం చుకున్నా... ప్రైవేటు విద్యాసంస్థలకు పరీక్షా పత్రాల పంపిణీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకించి పరీక్షాపత్రాల తయారీలో ప్రభుత్వ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థ లు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించేపరిస్థితి వస్తుంది. దీంతో పాఠశాల విద్య నాణ్యత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ఉత్తమ ఫలితాల కోసం డీసీఈబీ ఉండాలి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాల సాధన కో సం డీసీఈబీ కీలకపాత్ర వహిస్తోందని, అలాంటి వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ప్రధానోపాధ్యాయ సం ఘం ప్రధాన కార్యదర్శి టి.సన్యాసిరాజు అన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సిలబస్‌పై జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు, ఉత్తమ ఫలితాల సాధన కోసం ఏటా స్టడీ మెటీరియల్ తయారు చేసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు పంపిణీ చేయడం వంటి కీలకపాత్ర వహించేదన్నారు.