మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
హైదరాబాద్: మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందరికి ఉచిత విద్య అందాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు సహకరించాలని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
ప్రైవేట్ విద్యా సంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు.