
భీమ్‌గల్ (బాల్కొండ): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మం డలం చేంగల్‌లో డిగ్రీ విద్యార్థిని సాయి దీక్షిత(18) అనుమానాస్పద మృతి ఉద్రిక్తతను రేపింది. విద్యార్థిని మృతికి కారణాలను వెల్లడించాలని, కారకులను అరెస్టు చేయా లన్న డిమాండ్‌తో కాలేజీ విద్యార్థులు సోమవారం మృత దేహంతో చేపట్టిన ధర్నా రాత్రి 9 గంటల అనంతరం కూడా కొనసాగింది. సాయి దీక్షిత ఆర్మూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది.
విషయం తెలుసుకున్న విద్యార్థులు వందల సంఖ్యలో మృతురాలి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఎస్సై సుఖేందర్ రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీక్షిత మృతిపై గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అనుమానాలున్నాయని మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment