కెలమంగలం: డెంకణీకోట సమీపంలో మహిళ అనుమానాస్పద మృతిపై హోసూరు సబ్ కలెక్టర్ ప్రియాంక విచారణ చేపట్టారు. డెంకణీకోట తాలూకా బేవనత్తం గ్రామానికి చెందిన మురుగేషన్ భార్య సోనియా (23), వీరికి గత ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగి కొడుకు పుట్టాడు. ఈ నేపథ్యంలో సోనియా ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది.
విషయం తెలుసుకొన్న డెంకణీకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కూతురి మృతి గురించి అనుమానం ఉందని ఆమె తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగి ఏడేళ్లు మాత్రమే కావడంతో హోసూరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment