పాలకొండలో కలకలం | Diet Student Suspicious Death | Sakshi
Sakshi News home page

పాలకొండలో కలకలం

Published Tue, Mar 13 2018 1:20 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Diet Student Suspicious Death - Sakshi

పావని మృతదేహం (ఇన్‌సెట్లో) పావని ఫైల్‌ , మృతదేహం వద్ద వివిధ రకాల కత్తులు , మృతురాలి అక్క శిరీషను ప్రశ్నిస్తున్న ఎస్సై

శ్రీకాకుళం, పాలకొండ రూరల్‌:  స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో డైట్‌ రెండో çసంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్తపుమడుగులో చనిపోయి ఉన్న సంఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణంలో టీచర్‌ కాలనీలో సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన పాలక పావని(21) తన అక్క శిరీషతో కలసి నివసిస్తోంది. శిరీష ఉద్యోగ రీత్యా నరసన్నపేట వెళ్లారు. సోమవారం విధులు నిర్వహించుకుని రాత్రి 8గంటల సమయంలో శిరీష.. ఇంటికి వెళ్లి తలుపులు తట్టగా ఎంతసేపటికీ పావని తలుపులు తీయలేదు. ఆందోళనకు గురైన శిరీష వెనుక ద్వారం నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా హతాశురలైంది. పావని వంటగదిలో రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

వారంతా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆమె çఘటనా స్థలంలో మృతి చెందినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కె.వాసునారాయణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పావని మృతిచెందిన తీరుపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వంటగదిలో నాలుగు రకాల (వంటకు, కూరగాయలు తరిగేందుకు ఉపయోగించే) కత్తులు మృతదేహం చుట్టు పక్కల కనిపించడంతో పావని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అని సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రశాంతంగా ఉండే టీచర్సు కాలనీలో ఈ తరహా ఘటనలు మునుపెన్నడూ జరగలేదని అక్కడికుటుం బాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి నిర్ధారణకు రాలేకపోతున్నారు. రాత్రి కావటంతో మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే ఉంచి  మంగళవారం పూర్తిస్థాయి దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement