వినండి.... వదలండి | inter examinations of new moves | Sakshi
Sakshi News home page

వినండి.... వదలండి

Published Fri, Mar 6 2015 2:17 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

వినండి.... వదలండి - Sakshi

వినండి.... వదలండి

 ఇంటర్ పరీక్షలలో కొత్త ఎత్తుగడలు
- మాస్‌కాపీయింగ్ కోసం ముమ్మర యత్నాలు
- ఓ అధికారికి ‘ప్రయివేటు’ భారీ నజరానా?
- ఫలితాల కోసమే యూజమాన్యాల ఆరాటం
- అడ్డుకుంటామంటున్న విద్యార్థి సంఘాలు

నిజామాబాద్ అర్బన్ : ‘‘సర్...మేము చెప్పేది  వినండి. ఈసారి మమ్మల్ని వదలండి. మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. గత ఏడాది కంటే ప్రస్తుతం ఎక్కువగానే అడిగింది ఇస్తాం. ఇంకేమి కావాలి’’ అంటూ వారం రోజులుగా ఇంటర్ అధికారులతో ప్రయివేటు కళాశాలల యజమాన్యాలు చర్చలు కొనసాగిస్తున్నారుు. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఇక్కడ విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఇప్పుడూ అదే పరిస్థితిని తీసుకు రావడానికి ప్రరుువేట్ కళాశాల యజమాన్యాలు భారీ నజరానాతో ఓ అధికారికి గాలం వేశాయని సమాచారం.

మాస్‌కాపీయింగ్ నిరోధానికి ఉన్నతాధికారులు అనేక నూ తన పద్ధతులు ప్రవేశ పెడుతున్నారు. ఇది కళాశాల యూజమాన్యాలకు మింగుడుపడడం లేదు. దీంతో తాము అనుకున్నది సాధించుకోవడానికి నెల రోజులుగా తమ ప్ర యత్నాలు ముమ్మరం చేశారు. ఇంటర్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీంతో వారం రోజులుగా ఆర్‌ఐఓ కార్యా లయానికి వారి రాకపోకలు భారీగా పెరిగాయి.   
 
యథేచ్ఛగా ముడుపులు
ఈ నెల తొమ్మిది నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 27,497, రెండవ సంవత్సరం విద్యార్థులు 29,68 4, ఒకేషనల్ విద్యార్థులు 1,658 మంది హాజరవుతున్నారు. 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిని జీపీఆర్‌ఎస్ ద్వారా నిఘా కిందకు చేర్చారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వీడియోను చిత్రీకరించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఫలితాల కోసం ప్రరుువేటు యజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

కళాశాలల సంఘం నాయకులు ఓ అధికారితో తీవ్రమైన చర్చలు జరుపుతున్నారని తెలిసింది. జిల్లాకు వచ్చిరాగానే వాహనాన్ని బహుమ తిగా పొందిన అధికారి, ఈ ఏడాది కూడా భారీ నజరానాను పొందారని తెలుస్తోంది. కళాశాలకు లక్ష రూపాయల చొప్పున, మరికొన్ని కళాశాలల నుంచి రూ. 30 వేల చొ ప్పున వసూలు చేసిన ఇద్దరు సంఘం నాయకులు మాస్‌కాపీయింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కొన్ని కళాశాలలవారు తమ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్లలో ఇప్పటికే తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను కేటాయించుకున్నారు. ఇందులోనూ ప్రముఖపాత్ర వహించిన అధికారి భారీగా ముడుపులు అందుకు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
కామారెడ్డి డివిజన్‌లోని ఓ కళశాల యజమాని ముడుపుల కోసం వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. నాలుగు రోజుల క్రితం బోధన్‌లోని ఓ విద్యాసంస్థ యజమాని ఆల్లు డు నేరుగా కార్యాలయంలోని అధికారికి ముడుపులు ఇచ్చారని తెలిసింది. ప్రాక్టికల్స్‌లో జోరుగా వసూళ్ల కార్యక్రమం జరిగింది.బాన్సువాడ డివిజన్ నుంచి ముడుపులు అందలేదని ఓ అధికారి నేటి వరకు ఆయా కళశాల యజమాన్యాలను ప్రశ్నిస్తూనే ఉన్నారని తెలిసింది. నెల రోజుల క్రితమే ఆర్మూర్ రోడ్డులోని ఓ కళాశాల యజమానిని కారులో కలుసుకొని బహుమతిగా పొందారని చెబుతున్నారు. దీంతో మాస్‌కాపీయింగ్ విచ్చలవిడిగా జరిగే అవకాశం ఏర్పడింది.

చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెం టల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను కళాశాలకు అనుకూలంగా నియమించారని సమాచారం. గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని ఓ ఉన్నతాధికారి పదవీ విరమణ పేరిట ఇం టర్ అధికారి ఒకరు వసూళ్ల కార్యక్రమం చేపట్టారని సమాచారం. అనంతరం మాస్ కాపీయింగ్ కోసం కళాశాలలకు చెందిన సంఘం నాయకులు సంప్రదించగా ఈసారి నూతన పద్ధతి వీడియో చిత్రీకరణ  ఉందంటూ మొదట మొండికేసిన అధికారి భారీగా ముడుపులు అందడంతో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఇంటర్ ప రీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి మాస్ కాపీయింగ్‌ను పూర్తిగా నిరోధిస్తే మెరిట్ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది.
 
కలెక్టర్ దృష్టిసారించాలి
కలెక్టర్ ఇంటర్ పరీక్షలపై దృష్టిసారించాలి, మాస్ కాపీయింగ్ కోసం ప్రరుువేటు కళాశాలల యజమాన్యాలు, ఇంటర్ అధికారులు కుమ్ముక్కైయ్యారు. అధికారుల ైవై ఫల్యంతోనే జోరుగా మాస్‌కాపీయింగ్ కొనసాగుతుంది. అలాంటి సెంటర్లు, యజమాన్యాలపై ధర్నాలు, దాడులు చేస్తాం. మెరిట్,  పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఉరుకోం.
 - శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement