ఏపీ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసాయి.
విజయవాడ: ఏపీ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశాయి. ఈ సందర్భంగా జంబ్లింగ్ విధానంపై ఆయనతో చర్చించారు. ప్రైవేటు కాలేజీలలో జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని వారు చంద్రబాబుకు వివరించారు.
దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. జంబ్లింగ్ విధానం కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు చంద్రబాబు సూచించారు.