ఫీజు దోపిడీ పదింతలు
టెన్త్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు అదనంగా వసూలు
చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
పదో తరగతి విద్యార్థుల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్ష ఫీజులను నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారుు. రూ.300 నుంచి వెరుు్య రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ విద్యాశాఖాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.
తిరుపతి ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నారుు. విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజునే చెల్లించాలి. అరుుతే జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం పరీక్షా ఫీజుల దోపిడీకి తెరతీశారుు. ఇప్పటికే స్కూలు ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, రవాణా అంటూ విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ వేలాది రూపాయలు వసూలు చేశారుు.
రూ.వెయి వరకు వసూలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోవు విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఫీజును ప్రభుత్వం రూ.125లుగా నిర్దేశించింది. ఆ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంది. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాల్సి ఉండడంతో అదనంగా కొంత ఖర్చు అవుతుంది. దీనికోసం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా మరో రూ.25వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అరుుతే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వద్ద రూ.300 నుంచి అత్యధికంగా వెరుు్య రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నారుు.
కోటికి పైగా వసూలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1,148వరకు ఉన్నారుు. ఇందులో ఈ ఏడాది దాదాపు 54,500 మంది విద్యార్థులు టెన్‌త పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జిల్లాలో 498 వరకు ఉన్నారుు. అందులో దాదాపుగా 28 వేల మంది విద్యార్థులున్నట్లు అంచనా. సరాసరిగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.1.68 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
పైసలివ్వాల్సిందే
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల నుంచి అధికారులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉండడంతోనే అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రైవేటు యాజమాన్యాలు పేర్కొంటున్నారుు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.100 సమర్పించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉప విద్యాశాఖాధికారి(డీవైఈవో), జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాల్లో ఈ మొత్తాన్ని అనధికారికంగా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారుు. దీనిపై సంబంధిత విద్యాశాఖాధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నారుు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు.