
ఫీజు ఫీవర్!
♦ రీయింబర్స్‌మెంట్ నిధులకు గ్రహణం
♦ జిల్లాకు రావాల్సింది రూ.32కోట్ల పైనే..
♦ ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
నా పేరు ప్రశాంత్. నేను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. మేము పేదలం. సర్కారు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇస్తుందని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. పరీక్షలు దగ్గరపడుతున్నా నిధులు మంజూరు కాలేదు. కాలేజీ యూజమాన్యం ఫీజు కడితేనే ప్రాక్టికల్స్, పరీక్షలు రాయనిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక్క ప్రశాంత్ పరిస్థితే కాదు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్న ప్రతి విద్యార్థి పరిస్థితి.
ఇందూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారుు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుత ప్రభుత్వాల వల్ల చదువు అందని ద్రాక్షగా మారుతోంది. ఆర్థికస్థోమత లేని పేదలు చదువుకు దూరమవుతున్న తరుణంలో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వెలుగునిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో కళాశాల యూజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదు. తరగతి గదుల్లోకి రానివ్వడం లేదు. ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానివ్వమని హుకుం జారీ చేస్తున్నారుు. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. చదువు మానేసే పరిస్థితులు ఉన్నారుు. చదువులు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ సర్కారు నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
కేటగిరిలవారీగా నిధుల పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 2014-15 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 67,062 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కళాశాల యాజమాన్య ఖాతాల్లోకి, స్కాలర్‌షిప్ నిధులు విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. కానీ.. ఏడాది గడుస్తున్నా నిధుల జాడలేదు. 49,000 మంది ఉన్న బీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.34 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం రూ.11.93 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులు కొన్ని కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ అయ్యూరుు. ఇంకా రూ.22 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే విద్యార్థుల చదువులు సవ్యంగా జరిగే అవకాశం ఉంది. స్కాలర్ షిప్ నిధులు కూడా రూ.20 కోట్లకు కేవలం రూ.5 కోట్లు వచ్చారుు. అదే విధంగా 3,600 మంది కలిగిన ఈబీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.1.60 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.3.08 కోట్లు రావాల్సి ఉంది. అలాగే 13,181 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.9.50 కోట్లు అవసరం ఉండగా, రూ.5 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.4.50 కోట్లు రావాల్సి ఉంది.
7,300 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.2.70 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.3.30 కోట్లు రావాలి. అదే విధంగా మైనార్టీ విద్యార్థులు 7,162 మందికి రూ.9.95 కోట్లు అవసరం ఉండగా, రూ.5.58 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.4.37 కోట్లు ప్రభుత్వం నుంచి రావాలి. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి మొత్తంగా రూ.55.95 కోట్లు అవసరం ఉండగా.. కేవలం రూ.21.08 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.32.75 కోట్లు రావాల్సి ఉన్నాయి.
స్కాలర్ షిప్ రాలేదు..
స్కాలర్ షిప్ కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు డబ్బులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్కాలర్ షిప్ నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలకు వెళ్లి వచ్చేందుకు దారి ఖర్చులు తల్లిదండ్రుల నుంచి అడిగి తెచ్చుకుంటున్నాను. అదే స్కాలర్ షిప్ వస్తే ఇబ్బందులు తప్పేవి.
- ప్రేమ్‌సింగ్, ఇంటర్ మొదటి సంవత్సరం, నవీపేట్
ప్రాక్టికల్స్ చేయనివ్వడం లేదు..
నేను రెంజల్ మండలం శాటపూర్ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ప్రతీ సంవత్సరం ఫీజుల విషయంలో కళాశాల యాజమాన్యంతో ఇబ్బందిగా మారింది. గతేడాది ప్రభుత్వం నిధులు మంజురు చేయకపోవడంతో నేనే ఫీజు చెల్లించి పరీక్ష రాశాను. ఇప్పుడు కూడా ఫీజు నిధులు రాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తోంది. ముందర ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫీజు కడితేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.
- గోపి, డిగ్రీ మూడో సంవత్సరం, రెంజల్