Prashant
-
రాజధానిలో దళితులపై ‘సీఆర్డీయే’ దాష్టీకం!
తాడికొండ: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్‌గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్‌తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్‌కు ఇచ్చి రిటర్న్‌బుల్ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు. పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
అపస్మారక స్థితిలో రాత్రంతా రోడ్డుపైనే..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మందుల కోసం వెళ్లి వరద నీటిలో మునిగిన ఓ యువకుడు.. రాత్రంతా రోడ్డుపైనే ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నక్కా ప్రభుదాస్ తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్ కాలనీ బ్లాక్ 129లో నివసిస్తున్నాడు. బుడమేరుకు వరద రావడంతో సమీపంలో నివసిస్తున్న ఆయన అత్త సామ్రాజ్యం కూడా వారి వద్దకే వచ్చింది. ప్రభుదాస్ కుమారుడు ప్రశాంత్(24) గత ఆదివారం సాయంత్రం అమ్మమ్మ మందుల కోసం వరద నీటిలో ఆమె ఇంటికి వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి వస్తూ నీళ్లలో పడిపోయిన ప్రశాంత్‌ను స్థానికులు కాపాడి.. ఓ పడవలో ఎక్కించారు. ఆ పడవ నడిపే వ్యక్తి ప్రశాంత్‌ను నైనవరం ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే స్పృహ తప్పిన ప్రశాంత్ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. సోమవారం ఉదయం పది గంటలకు తెలిసిన వ్యక్తి.. ప్రశాంత్‌ను గుర్తించి ఇంటికి చేర్చాడు. ప్రశాంత్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. తన కుమారుడికి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని ప్రభుదాస్ కోరుతున్నాడు.పడవలోనే ప్రసవంతల్లీబిడ్డ క్షేమంనిండు గర్భిణికి నొప్పులు వస్తున్నాయని..ఆమెకు సహాయం అందించాలని వీఎంసీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం వచి్చంది. ఆమెను బోటులో ఆస్పత్రికి తరలిస్తుండగానే అందులోనే డెలివరీ అయ్యింది. వాంబే కాలనీకి చెందిన షకీనాబీకి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నొప్పులు వచ్చాయి. ఆమెను సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు తరలించే దారిలో, నొప్పులు అధికంగా రావటంతో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన బోటులోనే షకీనాబీకి ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లై ఓవర్ వద్దకు బోటును తీసుకువచ్చాక అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. –పటమట (విజయవాడ తూర్పు) -
ప్రభాస్ వైపు నీల్ చూపు.. ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి..
-
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
-
ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్టుగా!
చార్మింగ్ స్టార్ ప్రశాంత్ 1990 ప్రాంతంలో టాప్ హీరోగా రాణించాడు. అప్పట్లో ఈయన నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించిన జీన్స్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అతడు తమిళంలో నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై సక్సెసయ్యాయి. ఈయన తెలుగులోనూ తొలిముద్దు, ప్రేమశిఖరం, లాఠీ చిత్రాల్లో హీరోగా నటించారు. వియన విధేయ రామ సినిమాలో చివరిసారిగా కనిపించారు. గోట్ మూవీలో కీలకపాత్ర ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, అజ్మల్, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మాస్కోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజయ్ సినిమాలో ఎందుకు? శనివారం ప్రశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా టాప్ స్టార్‌గా వెలిగిన మీరు విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రశాంత్ బదులిస్తూ వెంకట్‌ప్రభు కథ చెప్పినప్పుడే ఇది మల్టీస్టారర్ చిత్రం అనిపించిందన్నారు. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో విజయ్, ప్రభుదేవాలతో కలిసి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. కథలో చాలా ట్విస్టులు ఉంటాయన్నారు. చిత్రం అన్ని వర్గాల వారికి పసందైన విందుగా ఉంటుందని, విజయ్, ప్రభుదేవాలతో పాట తన డాన్స్ బాగుంటుందన్నారు. OFFICIAL: Team The G.O.A.T Wishing the Top Star #Prashanth a very happy birthday! #TheGreatestOfAllTime @actorvijay @actorprashanth pic.twitter.com/g8m6vJPcoI — Actor Vijay Team (@ActorVijayTeam) April 6, 2024 చదవండి: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే -
జై హనుమాన్తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను
‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వర్క్ ఆరంభమైంది. ‘హనుమాన్’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ‘హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్’ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్ఫుల్ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్‌గారి విజన్’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
రాజమౌళిగారు చేస్తానన్నారని నేను డ్రాప్ అయ్యాను
‘‘ఒక ఫిల్మ్ మేకర్‌గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంపైనే నా ఏకాగ్రత ఉంటుంది. సినిమా విడుదల, థియేటర్ల కేటాయింపులు వంటివి నిర్మాతలకు చెందినవి. ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే పదేళ్లల్లో తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేసేలా మేం కొన్ని ప్లాన్ చేసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఇదంతా (థియేటర్స్ గురించిన వివాదం గురించి పరోక్షంగా స్పందిస్తూ..) జరుగుతోంది. తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు అన్నట్లుగా ఓ సామెత ఉంది. అందుకే కొన్ని విషయాలపై స్పంది స్తున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ప్రశాంత్ వర్మ చెప్పిన విశేషాలు. ∙‘హను–మాన్’ సినిమా కోసం తేజ సజ్జా కొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇక యాక్టింగ్ గురించి నేను అతనికి నేర్పించాల్సింది ఏమీ లేదు. పైగా సెట్స్‌లో ఫలానా సన్నివేశంలో ఇలా యాక్ట్ చెయ్ అని నటించి, చూపించడం నాకు రాదు. ‘హను–మాన్’పై నా కన్నా ఎక్కువగా తేజ ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించాడు. కొత్త సినిమాలేవీ చేయలేదు. రీసెంట్గా ఓ సినిమా ఒప్పుకున్నాడు. సినిమా మొదలైన ఇరవై నిమిషాలు హీరో క్యారెక్టర్ సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే హీరో పాత్రకు సూపర్ పవర్స్ వస్తాయో అప్పట్నుంచి కథ మరింత ఆసక్తిగా ముందుకు వెళ్తుంది. ∙పురాణాలు, ఇతిహాసాల కథలు, హనుమంతునిపై వచ్చిన కొన్ని ఆర్టికల్స్, ప్రచారంలో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. తెలుగు సినిమా స్టైల్‌ని పోలి ఉండే సూపర్ హీరో సినిమా ‘హను–మాన్’. ‘బ్యాట్‌మేన్’ సినిమాను రాజమౌళిగారు తీస్తే ఎలా ఉంటుందో అలా ‘హను–మాన్’ ఉంటుంది. ‘కేజీఎఫ్’లో యశ్‌ను ఎలివేట్ చేసినట్లుగా ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. నిర్మాత నిరంజన్ రెడ్డిగారు నాకన్నా పాజిటివ్ పర్సన్. మేం సినిమా కోసం ఓ ఆలోచన చెబితే, దానికి ఎక్స్టెన్షన్ లెవల్లో ఆయన ఆలోచించేవారు. దాశరథి శివేంద్రగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ∙మేం అనుకున్నదాని కన్నా ‘హను–మాన్’ బడ్జెట్ మూడింతలు పెరిగింది. కానీ పదింతల క్వాలిటీ సినిమాను ఆడియన్స్ చూస్తారు. ఇక ఈ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయాలంటే మరికొంత బడ్జెట్ కావాలి. అందుకే త్రీడీలో విడుదల చేయడం లేదు. అయితే రిలీజ్ తర్వాత మంచి స్పందన వస్తే, భవిష్యత్‌లో రీ–రిలీజ్లో త్రీడీలో కూడా రిలీజ్ చేస్తాం. ఓ నెల గ్యాప్ తర్వాత విదేశీ భాషల్లో ‘హను–మాన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ∙పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. మహాభారతంపై ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ రాజమౌళిగారు చేయాలను టున్నారని తెలిసి డ్రాప్ అయ్యాను. -
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి..
అతను ఎంటెక్ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగాడు. అతనే ప్రశాంత్ అలియాస్ ప్రసూబేబీ. సాక్షి, అనంతపురం డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక సబ్‌స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్‌కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు వీడియోలను రెగ్యులర్‌గా రూపొందించి ఇందులో అప్లోడ్ చేస్తున్నా . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంటుకు కూడా 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్లో వచ్చిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటెక్ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్ ఇక్కడి నుంచే సీరియస్ ‘యాక్టింగ్’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి.. ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. జేఎన్టీయూ (అనంతపురం)లో ఎంటెక్ చేశాడు. ఇంజినీరింగ్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్‌టాక్’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్కావడంతో లక్షల్లో సబ్‌స్రై్కబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు. ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నా. – ప్రశాంత్ -
ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. కెజీఎఫ్ కోటలోకి ధనుష్ ఎంట్రీ
-
టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్‌ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్‌లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. సంజయ్ ఆదేశాలతోనే లీక్ ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. ‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్‌లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్‌తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్‌పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్‌సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్‌ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్‌లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు. చట్టప్రకారమే అరెస్టులు బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్‌లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు. రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ.. హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ.. ♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే అవకాశం ఉంది. ♦ నిందితులు రిమాండ్‌కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్‌గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు. ♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది. ♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్‌కు పంపాలి. -
పాపం ప్రశాంత్ చోప్రా 99 అవుట్.. షారుఖ్ 79 నాటౌట్... సెమీస్‌లో ఆ రెండు జట్లు
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై... హిమాచల్ ప్రదేశ్ ఐదు వికెట్లతో ఉత్తర ప్రదేశ్‌పై గెలిచాయి. కర్ణాటకతో మ్యాచ్‌లో తొలుత తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగులు చేసింది. జగదీశన్ (102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. షారుఖ్ ఖాన్ (39 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. మరో క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రశాంత్ చోప్రా (99; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), హిమాచల్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం! WHAT. A. WIN! 👍 👍 The @rishid100-led Himachal Pradesh beat Uttar Pradesh by 5 wickets in the #QF1 of the #VijayHazareTrophy & seal a place in the semifinals. 👏 👏 #HPvUP Scorecard ▶️ https://t.co/gXfyqMBD2N pic.twitter.com/MW6Yl0XYkw — BCCI Domestic (@BCCIdomestic) December 21, 2021 -
తెలంగాణ చిన్నమ్మ ఉండుంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలి అన్వేషణలో పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన తెలుగు యువకుడు ప్రశాంత్ విషయంలో ఇకపై దౌత్యపరమైన సంప్రదింపులే కీలకం కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే భారత ప్రభుత్వానికి సమాచారం ఉందని ప్రశాంత్ తండ్రి మాటల ద్వారా తెలిసింది. దీంతో ప్రశాంత్‌ను విడుదల చేసేందుకు విదేశాంగశాఖ పాత్ర కీలకం అవుతుందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ అమాయకుడని, అతని మానసిక పరిస్థితిపై పాకిస్తాన్ ముందే అభిప్రాయానికి వచ్చింది కాబట్టే.. అతని ఇంటికి వీడియో సందేశం పంపారని పలువురు భావిస్తున్నారు. కాబట్టి దౌత్య సంప్రదింపులతో ప్రశాంత్ ఇండియాకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ట్వీట్ చేస్తే చాలు.. 2014 నుంచి 2019 వరకు విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించిన సుష్మా స్వరాజ్ భారతీయులను, ముఖ్యంగా విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ముందుండేవారు. చిన్న ట్వీట్ చేస్తే గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేవారు. ‘భారతీయులు అంగారక గ్రహం మీద ఉన్నా సరే.. వారిని క్షేమంగా తీసుకువస్తాం’అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ భారతీయుల సంక్షేమంపై ఆమెకు ఉన్న సంకల్పాన్ని చాటిచెప్పింది. పాకిస్తానీయులకు సైతం అత్యవసర వైద్యం కోసం అభ్యర్థించగానే వెంటనే వీసాలు మంజూరు అయ్యేలా చొరవచూపిన అమ్మ మనసు ఆమెది. గతంలో దారితప్పి పాకిస్తాన్లో ప్రవేశించిన బధిర బాలిక గీత విషయంలో సుష్మా స్వరాజ్ చూపిన చొరవను మాటల్లో అభివర్ణించలేం. తాజాగా ప్రశాంత్ విషయంలో నెటిజన్లు సుష్మా స్వరాజ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఉండి ఉంటే భరోసా ఇచ్చేవారని అంటున్నారు. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తుపెట్టుకోవాలన్న సుష్మా స్వరాజ్‌ను మిస్సవుతున్నామంటూ పలువురు పోస్టింగులు పెడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రశాంత్ తండ్రి బాబూరావు కేపీహెచ్‌బీ కాలనీ: ప్రశాంత్‌ను క్షేమంగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరేందుకు ప్రశాంత్ తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రశాంత్‌ను క్షేమంగా మన దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని భారత దౌత్య కార్యాలయ అధికారులను కోరనున్నారు. అయితే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడంతో బుధవారం దౌత్య కార్యాలయ అధికారులను బాబూరావు కలవలేకపోయినట్లు తెలిసింది. -
ప్రాణం ఖరీదు ఎంత?
చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1978లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందడం విశేషం. ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందింది. నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ‘ప్రాణం ఖరీదు’ ఎంత? ఆ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. మా సినిమా బాగుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
ఆంధ్ర ఖాతాలో మరో ‘డ్రా’
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం అందించకపోవడంతో బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఆంధ్రకు మూడు పాయింట్లు లభించగా... బెంగాల్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 321/9తో మ్యాచ్ చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు మరో మూడు బంతులు ఆడి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. 21 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు 40.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 223 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు ధాటిగా ఆడినా... ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో ఏడు వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రశాంత్, జ్యోతి సాయికృష్ణ (45; 5 ఫోర్లు, సిక్స్) రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో ఒకదశలో ఆంధ్ర జట్టుకు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే సాయికృష్ణ ఔటయ్యాక రికీ భుయ్ (16; 3 ఫోర్లు), భరత్ (0), గిరినాథ్ రెడ్డి (9), శశికాంత్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సెంచరీ దిశగా సాగిన ప్రశాంత్ కీలకదశలో నిష్క్రమించడంతో చివరకు ఆంధ్ర మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 9 జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర రెండింటిలో ఓడి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం 8 పాయిం ట్లతో గ్రూప్‌లో చివరి స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఆంధ్ర తలపడుతుంది. శుబ్‌మన్ మెరుపు సెంచరీ సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన హైదరాబాద్‌కు మూడు పాయింట్లు లభించగా... పంజాబ్‌కు ఒక పాయింట్ దక్కింది. నిర్ణీత 57 ఓవర్లలో 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లకు 324 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (154 బంతుల్లో 148; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) హడలెత్తించాడు. అయితే 50వ ఓవర్లో జట్టు స్కోరు 290 వద్ద జోరుమీదున్న శుబ్‌మన్ ఐదో వికెట్ రూపంలో వెనుదిరగడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 155/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 3 వికెట్లకు 323 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (161 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. -
కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలురు
ఎదులాపురం(ఆదిలాబాద్): హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మహారాష్ట్రకు తరలించగా ఇద్దరు బాలురు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాలు.. హైదరాబాద్ భెల్ కాలనీలో నివాసం ఉంటున్న ఓరిరాల్ ప్రశాంత్(16) అక్కడి ఉద్యానవానికి బుధవారం ఆడుకోవడానికి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు తినుబండారాల్లో మత్తు పదార్థాలు కలిపి బాలుడిని కారులో మహారాష్ట్ర ఉత్కేడ్‌కు తీసుకెళ్లారు. అతడిని ఎవరూ గుర్తించకుండా గుండు చేయించారు. ప్రశాంత్ మెలకువ వచ్చేసరికి గుర్తుతెలియని ప్రాంతంలోని ఓ గదిలో ఉండ డంతో కిడ్నాప్ అయ్యాయని తెలుసుకున్నాడు. అతడితో పాటు మరో బాలుడు ఉండగా వారిరువురు అక్కడినుంచి తప్పించుకున్నారు. రైల్వేస్టేషన్ చేరుకుని ఎవరికి తోచిన రైలులో వారు ఎక్కగా ప్రశాంత్ ఆదిలాబాద్‌కు చేరుకున్నాడు. స్టేషన్లో దిగిన బాలుడు రైల్వే పోలీసును సంప్రదించగా వారు తమకు అప్పగించారని అమృత్‌రావు వివరించారు. గురువారం ఆదిలాబాద్ చేరుకున్న తల్లి వాణికి బాలుడిని అప్పగించారు. -
ప్రశాంత్ శతకం
అగర్తలా: ఆంధ్ర టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కదంతొక్కడంతో త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర భారీస్కోరుపై కన్నేసింది. గురువారం ఇక్కడ మొదలైన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన త్రిపుర ఫీల్డింగ్ ఎంచుకోగా... ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (120 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. శ్రీకర్ భరత్ (18) విఫలమవగా... కెప్టెన్ హనుమ విహారి (62 బ్యాటింగ్; 9 ఫోర్లు)తో కలిసి ప్రశాంత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. అర్ధసెంచరీ పూర్తయిన కాసేపటికి విహారి జట్టు స్కోరు 131 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తర్వాత ప్రశాంత్‌కు రికీ భుయ్ (49 బ్యాటింగ్; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆటముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. త్రిపుర బౌలర్లలో మురాసింగ్, గురీందర్ సింగ్ చెరో వికెట్ తీశారు. -
విహారి, ప్రశాంత్ శతకాలు
సాక్షి, విజయనగరం: ఆంధ్ర బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో ఒడిషాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ హనుమ విహారి (248 బంతుల్లో 143 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), డీబీ ప్రశాంత్ (270 బంతుల్లో 127; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు బాదడంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (3) అవుటైన తర్వాత విహారి, ప్రశాంత్ రెండో వికెట్‌కు 270 పరుగులు జోడించడం విశేషం. బయటి వేదికపై తొలి రెండు మ్యాచ్ లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆంధ్రకు ఈ సీజన్లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ హలో సర్. నా వయసు 22. ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెకు పెళ్లయింది. కాని ఆ అమ్మాయంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నానని ఆమెకు తెలుసు. కాని నేనెప్పుడూ ఆమెకు నా మనసులో మాట చెప్పలేదు. నేను చెబుదామంటే మా ఇంటిచుట్టూ వున్నవాళ్లందరూ వాళ్ల చుట్టాలే. ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని భయపడుతున్నాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. తను కూడా నాలాగే భయపడుతోంది. నేను తనని చూడకుండా ఉండలేకపోతున్నా. ప్రతిక్షణం ఆమే గుర్తుకువస్తోంది. ఎప్పుడూ తననే చూడాలనిపిస్తోంది. దయచేసి నాకేదైనా ఉపాయం చెబుతారని ఆశిస్తున్నాను. – ప్రశాంత్, ఈ–మెయిల్ అరటిపండు తింటూ నీ సమస్య చదువుతున్నాను. నాలుగో వాక్యం చదివేసరికి తోలు తింటున్నాను. ఈ విషయం నేను గమనించలేదు. పక్కనే ఉన్న నీలాంబరి కెవ్వుమని అరిచింది. ఏమని... ‘సార్ పండు వదిలి తోలు తింటున్నార్సార్.... !’ తోలుతీస్తా... పెళ్లయిన అమ్మాయితో ప్రేమేందోయ్...! ప్రేమకు కారణాలు ఉండవు కాని, ధర్మం ఉండదా? వావి, వరస, గౌరవం ఉండవా? పెళ్లయిన అమ్మాయి వదినతో సమానం. వదిన తల్లితో సమానం. నాశనం చేస్తున్నావ్! నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావ్! రాముడు సీతమ్మవారి ఆభరణాలను లక్ష్మణుడుకి చూపించి ‘ఇవి మీ వదినవేనా?’ అని అడుగుతాడు. ఉన్న నగలన్నింటిలో లక్ష్మణుడు గుర్తించినవి అమ్మవారి అందెలే. ఎందుకో తెలుసా? లక్ష్మణుడు వదినగారిని నేరుగా ఎప్పుడూ చూడలేదు. ఆవిడ పాదాలను మాత్రమే రోజూ పొద్దునే నమస్కరించేవాడు. అందుకే కాళ్ల అందెలను గుర్తుపట్టాడు. ఇది మన సంస్కారం. వద్దు తమ్ముడూ ప్రేమను ఇంత లోకువ చేయవద్దు. నీకో మంచి పరిష్కారం చెబుతాను. నీ ప్రేమను ఆరాధనగా మార్చుకో. ఆ తల్లిని గౌరవించు. ఆ తల్లికీ, తన కుటుంబానికీ లక్ష్మణుడిలాగే కాకుండా హనుమంతుడిలా కూడా సేవించు. నీకు తప్పకుండా ప్రాయశ్చిత్తం దక్కుతుంది. లవ్ డాక్టర్ ఏంటి... స్వామీజీలా ఉపదేశాలు ఇస్తున్నాడేంటి? అనుకోవద్దు. నీ ప్రేమని అర్ధం చేసుకోక కాదు, ఆ తల్లి కష్టం అర్థం చేసుకొని ఇలా చెప్పాను. ఇంత వేదనతో నీకు చెబుతున్నానంటే నిన్ను ఒక మహా పాపం నుంచి కాపాడుకోవడానికి మాత్రమే. దీంట్లో ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. ‘ప్రేమ గుడ్డిది కదా!’ అని నువ్వు నన్ను అడగవచ్చు. ప్రేమ గుడ్డిది కావచ్చు కాని దాని వల్ల మన జీవితం చీకటి మయం అయితే పర్వాలేదు కాని, ఇంకొకరి జీవితంలో చీకటి ప్రవేశిం^è కూడదు. నేనిన్ని చెప్పిన తర్వాత కూడా మనసు వశం కాకపోతే ఆ తల్లి దగ్గర నుంచి బాగా దూరంగా వెళ్లిపో. దూరంగానే ఉండు. అంతే...! ఆన్సర్ రాసిన తర్వాత నీలాంబరి ఆనందం పట్టలేక ‘భేష్ సార్... భేష్.. భలే సమాధానం ఇచ్చారు’ అంటూ ఇంకో అరటిపండు చేతికిచ్చింది. నేను తోలు తీశా! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
మా సినిమాపై నమ్మకం ఉంది
సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. శివ శ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డా. మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మించారు. వికాస్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. వినోదం పంచుతూనే సందేశం ఇచ్చేలా ఉంటుంది. మా బ్యానర్ విలువకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. ఈ నెలలో పెద్ద చిత్రాల విడుదల ఉన్నప్పటికీ, మా సినిమాపై ఉన్న నమ్మకంతో మేం కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘కొత్త వాళ్లతో సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. విజయ్‌ప్రసాద్ ఆ ధైర్యంతోనే ఈ చిత్రం తీశారు. అనుభవం ఉన్నవాడిలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. చిత్ర దర్శకుడు శివ శ్రీ, నిర్మాత కె.ఎస్.రామారావు, సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న, వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంకేంటి నువ్వే చెప్పు’ ఆడియో లాంచ్
-
ఇంకేంటి నువ్వే చెప్పు!
‘‘మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా మాకున్న పేరు, విలువ ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమిది’’ అన్నారు నిర్మాత మళ్ల విజయప్రసాద్. ప్రశాంత్, సన్ని, అక్ఛిత, ప్రసన్నలను హీరో హీరోయిన్లుగా, శివశ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. వికాస్ సంగీతమందించిన పాటలను విశాఖ ఆర్కే బీచ్‌లో విడుదల చేశారు. ‘‘అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత . వెల్ఫేర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మళ్ల అరుణకుమారి, నటుడు సుమన్, సహ నిర్మాత విద్యార్థి వెంకట్రావ్ పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ బస్తీలో నివసించే కోడేటి ప్రశాంత్(22) డ్రైవర్. బస్తీకి చెందిన బాలిక(15)ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గోడను ఢీకొన్న బైక్..యువకుడి మృతి
మణుగూరు మండలం కోడిపుంజుల వాగు వద్ద ఆర్ అండ్ బీ అధికారులు ప్రధాన రహదారిపై నిర్మించిన గోడను ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వాగుమల్లారం గ్రామానికి చెందిన ప్రశాంత్(28) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..శేఖర్ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ పత్రాలతో వీసాకు యత్నం..ఒకరి అరెస్టు
నకిలీ పత్రాలతో అమెరికాకు వెళ్లేందుకు వీసాలకు యత్నించిన ఓ వ్యక్తిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. కే రళ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్(32) అమెరికాకు విజిటింగ్ వీసాపై వెళ్లేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో హైదరబాద్ శామీర్‌పేట్‌లోని డూపాంట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వీసా కోసం అమెరికన్ కాన్సులేట్‌లో పత్రాలను దాఖలు చేశారు. అయితే, కాన్సులేట్ అధికారులు వెరిఫికేషన్‌లో భాగంగా డూపాంట్ కంపెనీని సంప్రదించగా అవి తాము జారీ చేయలేదని తెలిపారు. ప్రశాంత్ అనే వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడంలేదని చెప్పారు. దీంతో అమెరికన్ కాన్సులేట్ అధికారులు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్‌ను గురువారం అరెస్టు చేశారు. -
దొంగగా మారిన సర్వర్
విలాసాలకు అలవాటు పడడంతో చోరీలకు పాల్పడిన వైనం అరెస్ట్ చేసిన హన్మకొండ పోలీసులు ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం హన్మకొండ చౌరస్తా : హోటల్లో సర్వర్ చేస్తున్న ఓ యువకుడికి అక్కడకు వచ్చే వేతనం సరిపోలేదు.. ఇం కా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు దొంగతనం చే యూలని తట్టింది.. ఇంకేంద అనుకున్నదే తడవుగా వాహనాలు దొంగిలించడం వా టిని అమ్మి వచ్చే డబ్బుతో విలాసంగా గడపడం అల వాటుగా చేసుకన్నాడు... ఈ క్రమంలో ఓసారి పోలీసులకు పట్టుబడి జైలు పాలైన ఆయన తీరు మారలేదు.. చివరకు మళ్లీ ఆ యువకుడికి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ సీఐ సంపత్‌రావుతో కలిసి పోలీసుస్టేషన్లో వెల్లడించారు. ఎల్లంపేట టూ హన్మకొండ మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గోపగాని ప్రశాంత్ నగరంలో ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ హన్మకొండలోని రాంనగర్లో నివాసం ఉం టున్నాడు. నిందితుడు ప్రశాంత్ మద్యానికి, జల్సాలకు అలవాటు పడి సర్వర్‌గా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాల చోరీ చేయూలని నిర్ణరుుంచుకున్నాడు. ఎక్కడైతే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు నగరంలోని వివిధ మైదానాల్లో వాకింగ్ వచ్చే వారు పార్క్ చేసే వాహనాలు కనిపించారుు. లోపల వాకర్లు నింపాదిగా ఉన్నప్పుడు బయట నుం చి బయటకు వాహనాలు ఎత్తుకెళ్లడం ఆరంభించాడు. గత మే నెలలో చోరీకి పాల్పడినప్పుడు ప్రశాంత్ సీసీఎస్ పోలీసులకు చిక్కగా జైలుకు పంపించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ తన తీరు మార్చుకోలేదు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఆర్ట్స్ కాలేజీ, కేయూ మైదానాల వద్ద మార్నింగ్ వాక్కు వచ్చి పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించాడు. ఇలా హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, కేయూసీ పరిధిలో రెండు, సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక వాహనం.. మొత్తం కలిపి ఆరు వాహనాలు చోరీ చేశాడు. ఇక్క చాలనుకున్నాడో ఏమో కానీ ఈసారి ఖమ్మం వెళ్లాడు. అక్కడ ఓ వాహనాన్ని చోరీ చేసిన ప్రశాంత్ నగరానికి వస్తున్నాడన్న సమాచారం అందడంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు హన్మకొండ క్రైం ఎస్సై వెంకట్రావు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు నిందితుడు ద్విచక్ర వాహనం(టీఎస్04 ఈజీ 2233)పై రాగా ఆరా తీసిన పోలీసులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రా లు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారిం చగా గతంలో కూడా ఆరు వాహనాలు దొంగిలించిన ట్లు అంగీకరించాడు. ఈ మేరకు ప్రశాంత్ నుంచి రూ. 4.50లక్షల విలువైన ఏడు వానాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శోభన్‌కుమార్ తెలిపారు. కాగా, ప్రజ లు మార్కింగ్ వాక్ లేదా షాపింగ్‌కు వెళ్లినప్పుడు వాహనాల పార్కింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఏసీపీ.. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమీప పోలీసుస్టేషన్ లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సంపత్‌రావు, క్రైం ఎస్సై వెంకట్రావ్, హెడ్‌కానిస్టేబుల్ సాంబ మూర్తి, కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, రోషన్ అలీ, రాం రెడ్డి, రమేష్‌ను ఆయన అభినందించారు. -
నార్సింగిలో కాల్పుల కలకలం
హైదరాబాద్: నార్సింగి మండలం గండిపేట్‌లో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. గండిపేట్ గ్రామ సర్పంచి ప్రశాంత్ ఇంటికి వచ్చిన ఆయన బంధువు వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌గౌడ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, అది మిస్ ఫైరా? కావాలనే కాల్చాడా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏటీఎం దొంగ అరెస్టు
ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి రూ.లక్ష మేర కాజేసి, పోలీసులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన బాణాల ప్రశాంత్ విలాసాల కోసం వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఆంధ్రా బ్యాంకు ఏటీఎం సెంటర్లే టార్గెట్ చేసుకున్నాడు. డెబిట్ కార్డును వాడుకుని ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్లు చూపకుండానే హడావుడిగా వెళ్లిపోయే వినియోగదారులను ప్రశాంత్ గుర్తించేవాడు. ఆ వెంటనే ఏటీఎం సెంటర్లోకి వెళ్లి.. వారి ట్రాన్సాక్షన్‌ను కొనసాగించి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా పలువురి ఖాతాల నుంచి రూ.90 వేల వరకు డ్రా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.80 వేలను రికవరీ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
తెలంగాణలో పిడుగుల బీభత్సం
కరీంనగర్లో ఒకరి మృతి ఆదిలాబాద్‌లో నలుగురికి తీవ్రగాయాలు కరీంనగర్/ఆదిలాబాద్ ఉరుములు-మెరుపులతో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కురిసిన వాన రాష్ట్ర ప్రజలను వణికించింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. కరీంనగర్ జిల్లా లోని కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వానలో ప్రశాంత్(23) అనే యువకుడు మృతి చెందాడు. తన పొలంలో పనిచేస్తుండగా అతనిపై పిడుగుపడింది. వేములవాడ మండలం చెక్కపల్లిలో ఎద్దు మృతి చెందింది. ఈదుగాలులతో కూడిన వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో వడగండ్ల వానకు భారీగా పంట నష్టం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు నలుగురుగు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. -
అంబులెన్స్ ఢీకొని ఇద్దరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట వద్ద గురువారం చోటుచేసుకుంది. మార్కాపురం నుంచి మృతదేహాన్ని తీసుకొని కంభం వెళ్తున్న అంబులెన్స్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న చింతకుంట్ల నాగేష్(24), ప్రశాంత్(22) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేటపాలెంలో ఏం జరిగింది?
అమ్మా నాన్నా అనే పిలుపుకు దూరమై, మంచీ చెడుల తేడా తెలియని కొంత మంది పిల్లలు క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే కథాంశంతో తెరకెక్కిన చిత్ర ం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్యా, శిల్ప నాయకా నాయికలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ. -
తల్లీ కొడుకులను పొడిచి చంపేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ప్రాంతంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వ్యక్తిగత కక్షలతో తల్లీ కొడుకులను హత్యచేసిన ఓ వ్యక్తి, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అంజుదేవి, ఆమె కుమారుడు ప్రశాంత్ (16) లను ఆ కుటుంబానికి బాగా తెలిసిన శ్యామ్ సింగ్ (32) అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 4 గంటల సమయంలో శ్యామ్ నేరుగా వంటింట్లో చొరబడ్డాడు. తెలిసినవాడు కావడంతో అక్కడే చదువుకుంటున్న ప్రశాంత్ అభ్యంతరం చెప్పలేదు. వంటింట్లోంచి కత్తి తెచ్చుకుని హఠాత్తుగా ప్రశాంత్ పై దాడిచేశాడు. మెడపై ఏడుసార్లు పొడిచాడు. పొరుగువారితో మాట్లాడుతున్న తల్లి.. తన కొడుకు అరుపులు విని పరుగెత్తుకొచ్చింది. కానీ అప్పటికే ప్రశాంత్ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. ఆమె ఆ షాక్ లో ఉండగానే ఆమెపై కూడా దాడిచేసి 8 సార్లు పొట్టలో కత్తితో పొడిచాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈలోపు తల్లీబిడ్డల ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇంటిముందు గుమిగూడారు. దీంతో అతను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించాడు. ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోగా, అంజు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. అంజుదేవి భర్త రాంజీ చిరువ్యాపారి. ఈ దంపతుల కుమార్తె జైపూర్‌లో చదువుకుంటోంది. ఈ కుటుంబానికి శ్యామ్సింగ్ కుటుంబం బాగా సన్నిహితంగా మెలుగుతారు. ఇరు కుటుంబాలు బిహార్‌కు చెందినవారని పోలీసుల విచారలో తేలింది. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు ఇరువైపులా బంధువులను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ హత్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారి దీపేంద్ర పాథక్ తెలిపారు. -
కాలేజీకి వెళ్లి గొంతుకోశాడు
ఘజియాబాద్: ఉత్తర ప్రదేశ్లోదారుణం చోటుచేసుకుంది. పీజీ చదువుతున్న విద్యార్థి ఓ విద్యార్థిని గొంతుకోశాడు. అనంతరం తాను విషం తీసుకున్నాడు. యూపీలోని ఘజియాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఘజియాబాద్‌లోని శంబు దయాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తికి బాధితురాలికి మధ్య కొద్ది రోజులుగా అన్యోన్య సంబంధం ఉంది. అయితే, మంగళవారం కాలేజీకి వచ్చిన ప్రశాంత్ అనే పీజీ విద్యార్థి ఆ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గొంతుకోసి తాను విషం తాగాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టగా మిగితా విద్యార్థులు అక్కడి చేరుకొని ప్రశాంత్ ను చితక్కొట్టారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన ప్రశాంత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
ఫీజు ఫీవర్!
♦ రీయింబర్స్మెంట్ నిధులకు గ్రహణం ♦ జిల్లాకు రావాల్సింది రూ.32కోట్ల పైనే.. ♦ ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు నా పేరు ప్రశాంత్. నేను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. మేము పేదలం. సర్కారు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇస్తుందని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. పరీక్షలు దగ్గరపడుతున్నా నిధులు మంజూరు కాలేదు. కాలేజీ యూజమాన్యం ఫీజు కడితేనే ప్రాక్టికల్స్, పరీక్షలు రాయనిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక్క ప్రశాంత్ పరిస్థితే కాదు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్న ప్రతి విద్యార్థి పరిస్థితి. ఇందూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారుు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుత ప్రభుత్వాల వల్ల చదువు అందని ద్రాక్షగా మారుతోంది. ఆర్థికస్థోమత లేని పేదలు చదువుకు దూరమవుతున్న తరుణంలో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వెలుగునిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో కళాశాల యూజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదు. తరగతి గదుల్లోకి రానివ్వడం లేదు. ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానివ్వమని హుకుం జారీ చేస్తున్నారుు. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. చదువు మానేసే పరిస్థితులు ఉన్నారుు. చదువులు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ సర్కారు నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కేటగిరిలవారీగా నిధుల పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా 2014-15 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 67,062 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కళాశాల యాజమాన్య ఖాతాల్లోకి, స్కాలర్షిప్ నిధులు విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. కానీ.. ఏడాది గడుస్తున్నా నిధుల జాడలేదు. 49,000 మంది ఉన్న బీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.34 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం రూ.11.93 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు కొన్ని కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ అయ్యూరుు. ఇంకా రూ.22 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే విద్యార్థుల చదువులు సవ్యంగా జరిగే అవకాశం ఉంది. స్కాలర్ షిప్ నిధులు కూడా రూ.20 కోట్లకు కేవలం రూ.5 కోట్లు వచ్చారుు. అదే విధంగా 3,600 మంది కలిగిన ఈబీసీ విద్యార్థులకు ఫీజు నిధులు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.1.60 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.3.08 కోట్లు రావాల్సి ఉంది. అలాగే 13,181 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.9.50 కోట్లు అవసరం ఉండగా, రూ.5 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.4.50 కోట్లు రావాల్సి ఉంది. 7,300 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.6 కోట్లు అవసరం ఉండగా, రూ.2.70 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.3.30 కోట్లు రావాలి. అదే విధంగా మైనార్టీ విద్యార్థులు 7,162 మందికి రూ.9.95 కోట్లు అవసరం ఉండగా, రూ.5.58 కోట్లు వచ్చారుు. ఇంకా రూ.4.37 కోట్లు ప్రభుత్వం నుంచి రావాలి. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి మొత్తంగా రూ.55.95 కోట్లు అవసరం ఉండగా.. కేవలం రూ.21.08 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.32.75 కోట్లు రావాల్సి ఉన్నాయి. స్కాలర్ షిప్ రాలేదు.. స్కాలర్ షిప్ కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు డబ్బులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్కాలర్ షిప్ నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలకు వెళ్లి వచ్చేందుకు దారి ఖర్చులు తల్లిదండ్రుల నుంచి అడిగి తెచ్చుకుంటున్నాను. అదే స్కాలర్ షిప్ వస్తే ఇబ్బందులు తప్పేవి. - ప్రేమ్‌సింగ్, ఇంటర్ మొదటి సంవత్సరం, నవీపేట్ ప్రాక్టికల్స్ చేయనివ్వడం లేదు.. నేను రెంజల్ మండలం శాటపూర్ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ప్రతీ సంవత్సరం ఫీజుల విషయంలో కళాశాల యాజమాన్యంతో ఇబ్బందిగా మారింది. గతేడాది ప్రభుత్వం నిధులు మంజురు చేయకపోవడంతో నేనే ఫీజు చెల్లించి పరీక్ష రాశాను. ఇప్పుడు కూడా ఫీజు నిధులు రాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తోంది. ముందర ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫీజు కడితేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. - గోపి, డిగ్రీ మూడో సంవత్సరం, రెంజల్ -
అనాథ పిల్లల నేపథ్యంలో...
అనాథ పిల్లలకు సరైన గెడైన్స్ లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, శిల్ప, లావణ్య ప్రధాన పాత్రల్లో హని, ప్రణి ఫిలింస్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ నటించి, నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని బేబి శ్లోక ఆవిష్కరించి, దైవజ్ఞ శర్మకు ఇచ్చారు. ‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మనుసును తాకే సన్నివేశాలుంటాయి’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ఎం.ఎం. రెడ్డి, సంగీత దర్శకుడు ఎ.ఆర్. సన్నీ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ, సమర్పణ: మాస్టర్ అమరావతి సురోచన్. -
ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు
జీన్స్ చిత్రంలో ప్రశాంత్‌తో అందాలరాశి ఐశ్వర్యారాయ్ రొమాన్స్ చేసిన విషయం ఆ చిత్రంతో ఆ జంట హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రశాంత్‌తో తాజాగా ఆస్ట్రేలియా అందగత్తె అమండా డ్యూయెట్స్ పాడుకోవడం విశేషం. చార్మింగ్ హీరో ప్రశాంత్ తాజాగా నటిస్తున్న భారీ చిత్రం సాహసం. పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని స్టార్ మూవీస్ అధినేత సీనియర్ నటుడు త్యాగరాజన్ వెల్లడించారు. నవ దర్శకుడు అరుణ్‌రాజ్ వర్మ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి పలువురు ప్రముఖ నటీమణుల పేరు ప్రచారంలో ఉన్నాయి. దీంతో అసలు చిత్ర హీరోయిన్ ఎవరన్న రహస్యాన్ని నిర్మాత త్యాగరాజన్ శుక్రవారం బయటపెట్టారు. ఈ సందర్భంగా చిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ను హీరో ప్రశాంత్ పరిచయం చేశారు. ఆస్ట్రేలియా బ్యూటీ : హీరోయిన్ పేరు అమండా. ఆస్ట్రేలియా వాసి. తల్లి ఇండియన్, తండ్రి ఇంగ్లాడ్ దేశస్థుడు. 19 ఏళ్ల అమండా పెరిగింది ఆస్ట్రేలియాలో. అందం, అభినయం మెండు గా గల ఈమె ఒక బాలే డాన్సర్. ఈ నృత్యంలో పలు బహుమతులను గెలుచుకున్న ఈ బ్యూటీ నటనా పాఠశాలలో శిక్షణ పొందారు. ఈ సుందరికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవి . ఈ అవకాశం అదృష్టం : ప్రశాంత్ లాంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అని అమండా అన్నారు. కాగా ఈమె నటనను ఆ చిత్రంలో నటిస్తున్న మరో సీనియర్ న టుడు నాజర్ అభినందించారట. కోలీవుడ్‌కు లభించిన మరో చక్కని నటి అమండా అంటూ ప్రశంసలు పొందిన లక్కీ గర్ల్ అమండా. సుదీర్ఘ అన్వేషణ ఫలం : సాహసం చిత్ర హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించామన్నారు. వందలాదిమంది అన్వేషణలో ఎంపికైన నటి అమండా అని అన్నారు. సాహసం చిత్రం కోసం అందం, అభినయం, నృత్యం తెలిసిన నటి అవసరం అయ్యారన్నారు. ఎనిమిది నెలల సుదీర్ఘ అన్వేషణ ఫలితం ఈ అమండా అని పేర్కొన్నారు. సాహసం చిత్రం విడుదలైనాంతరం అమండా గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటారన్నారు. పెద్ద పెద్ద సంభాషణలకు కూడా ఆమె బట్టీపట్టి చక్కగా చెప్పేశారన్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే హాలీవుడ్ నటి నర్గీస్ బక్రి సింగిల్‌సాంగ్ ప్రశాంత్‌తో ఆడి దుమ్ములేపారు. విదేశాలలో గీతాలు: తాజాగా ఈ ఆస్ట్రేలియా బ్యూటీ సాహసం చిత్రం కోసం 40 రోజులు నటించారు. ఇప్పుడు ప్రశాంత్‌తో కలిసి జపాన్, మలేషియా, కొరియా దేశాల్లో యువళగీతాలు పాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. గ్రాండ్‌గా ఆడియో : ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలో చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కథనం, సంభాషణల కర్త త్యాగరాజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్రం కోసం పాడిన మోహిత్ చాహాన్ శ్రీయ ఘోషల్, శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు అనిరుద్, నటుడు శింబు, లక్ష్మీమీనన్, ఆండ్రియా పాల్గొననున్నారని తెలిపారు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
గేట్లో ఏపీ విద్యార్థి టాప్
వైఎస్సార్ జిల్లాకు చెందిన చంద్రకాంత్‌రెడ్డికి మొదటి ర్యాంక్ బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి ప్రశాంత్‌కి 65వ ర్యాంక్ సాక్షి, హైదరాబాద్/ఆర్మూర్, రాయచోటి: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015 ఫలితాల్లో జాతీయ స్థాయిలో వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన విద్యార్థి చంద్రకాంత్‌రెడ్డి జియో ఫిజిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అతని తల్లిదండ్రులు రాణెమ్మ, మునిరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులే. ఇక గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రశాంత్ ఈసీఈ విభాగంలో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించాడు. ప్రశాంత్ 100 మార్కులకుగాను 69 మార్కులు పొందాడు. ఇతనితోపాటు మరో 30 మంది ట్రిపుల్ఐటీ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శ్రీనితిన్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 132వ ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనితిన్ 67.27 శాతం, 832 మార్కులతో ఈ ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు తేదీల్లో నిర్వహించిన గేట్ పరీక్షలకు తెలంగాణ నుంచి 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల స్కోర్ కార్డులను 27 నుంచి 29 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. -
శెభాష్ పోలీస్....
మాయగాడి నుంచి ఇద్దరు అమ్మాయిలను రక్షించిన పోలీసులు మారేడుపల్లి: మాయగాడి వలలో పడబోయిన ఇద్దరు అమ్మాయిలను కాపాడి మారేడుపల్లి పోలీసులు శెభాష్ అనిపించుకున్నారు. ఎస్.ఐ రవికుమార్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా లోతట్ట గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు (16,17 ఏళ్లు) పేదకుటుంబానికి చెందిన వారు. నగరంలో ఉద్యోగం చేసుకుని జీవిద్దామని ఈనెల 27న సికింద్రాబాద్‌కు వచ్చారు. రెండ్రోజుల పాటు జేబీఎస్ పరిసరాల్లో తలదాచుకుని తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. మళ్లీ ఈనెల 3న జేబీఎస్‌కు చేరుకున్న వారు అమాయకం అటూ, ఇటూ తిరుగుతుండగా జేబీఎస్ ప్రాంగణంలో కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న ప్రశాంత్(30) గమనించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నమ్మబలికాడు. వారిని ఆ రోజు రాత్రి జేబీఎస్ సమీపంలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ప్రశాంత్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసి అమ్మాయిలను బుధవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సమయానికి స్పందించి ఇద్దరు అమ్మాయిల జీవితాలను కాపాడినందుకు స్థానికులు పోలీసుల మెచ్చుకున్నారు. అమ్మాయిలు ఈ విధంగా ఏమి తెలియకుండా ఉద్యోగాల కోసమని నగరానికి వచ్చి, మాయగాళ్ల వలలో పడొద్దని ఎస్ఐ రవికుమార్ సూచించారు. -
లవ్లీ జర్నీ
ప్రశాంత్ లహోటి, రేఖ లహోటి YOU AND I "Success in marriage does not come merely through finding the right mate, but through being the right mate" అన్నాడు బార్నెట్ ఆర్ బ్రిక్నర్. ఆర్టిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ రేఖ లహోటి, ఇంజనీర్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ లహోటి.. ఈ ఇద్దరూ అంతే! ఒకరికొకరు సరి జోడు అనుకొని జతకూడలేదు. జంట ప్రయాణంలో ఒకరికొకరు తగిన తోడుగా తమనుతాము మలచుకుంటున్నారు. ఆ సర్దుబాటు, దిద్దుబాటే వాళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతోంది! ఆ దంపతుల ముచ్చట్లు... ..:: సరస్వతి రమ ‘జాతకాలు కుదిర్చిన పెళ్లి మాది’ అని మొదలుపెట్టారు ఇద్దరూ! సంభాషణకు ముందు రెండు కుటుంబ నేపథ్యాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ బెంగాలీ అయినా పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. ఆ మాటకొస్తే 150 ఏళ్ల కిందటే వాళ్ల పూర్వీకులు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. అందుకే ‘నేను పక్కా హైదరాబాదీ’ అంటాడాయన. రేఖ పుట్టిపెరిగిందంతా కోల్‌కతాలోనే. ప్రశాంత్‌తో కొంగుముడివేసుకున్నాకే హైదరాబాద్ ఆమెకు పరిచయమైంది. వ్యక్తిత్వాలు,నేపథ్యాలు కన్నా.. ‘నేను చిన్నప్పటి నుంచి బబ్లీ టైప్. పదిహేనోయేట నుంచే డ్రైవింగ్ చేసేదాన్ని. కలివిడితనం ఎక్కువ. దాంతో మా ఇంట్లో వాళ్లంతా నేను లవ్ మ్యారేజే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను మాత్రం భిన్నంగా ఆలోచించాను. పుట్టిపెరిగిన కోల్‌కతాలోనే స్థిరపడాలని అనుకోలేదు. బయటి ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాను. కాబట్టి పెద్దలు చూసిన సంబంధానికి ఓకే అన్నాను’ అంటారు రేఖ. ‘మా బంధువుల ద్వారా ఈ సంబంధం ఖాయం అయింది. మా వ్యక్తిత్వాలు, మా నేపథ్యాల కన్నా మా జాతకాలే ముందు మమ్మల్ని కలిపాయి’ అంటూ పెళ్లయిన తీరు చెప్పారు ప్రశాంత్. పూర్తి విరుద్ధం.. ‘స్వభావరీత్యా మేమిద్దరం పూర్తి విరుద్ధం’ అని ఆమె అంటుంటే ‘అందుకే మా రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంది’ అని పూరించారు ఆయన. ‘నాకు కోపమెక్కువ’ అని రేఖ, ‘నాకు ఓపిక ఎక్కువ’ అని ప్రశాంత్, ‘తను చాలా ఉదారంగా ఉంటారు’ అని ఆమె, ‘రేఖ తన మేనేజ్మెంట్ స్కిల్స్‌తో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది’ అని ఆయన, ‘ప్రశాంత్ ఇంట్రావర్ట్. ఆయనకెప్పుడైనా కోపమొస్తే ఎక్స్‌ప్రెస్సే చేయడు. ఆయన అలక తీర్చే చాన్సే ఇవ్వడు’ అని ఆమె, ‘రేఖ వెరీ ఎక్స్‌ప్రెసివ్’ అని ఆయన.. ఇలా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలకు కంప్లయింట్స్ అండ్ కాంప్లిమెంట్స్ రూపమిచ్చారు. కళాకృతి.. ‘మా ఇద్దరి బిడ్డ’ అంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నిజానికి రేఖ మంచి ఆర్టిస్ట్’ అని ప్రశాంత్ కితాబిచ్చేలోపే ‘ఎనిమిదో ఏటనుంచే బొమ్మలు గీసేదాన్ని. డిగ్రీ తర్వాత ఫైనార్ట్స్ కూడా చేశాను. పెళ్ల్లయ్యాక నా మనసు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది. మా అత్తమామల ఎంకరేజ్‌మెంట్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ చేశా. నేను బొమ్మలేయడం కంటే ఎక్కువగా ప్రశాంత్ ఆర్ట్‌ని ఇష్టపడతాడు. ఆయన ఈస్తటిక్సెన్స్కి నిలువెత్తు నిదర్శనమే కళాకృతి ఆర్ట్ గ్యాలరీ’ అని భర్త కళాభిరుచిని వివరించారు రేఖ. ‘దాదాపు 20 ఏళ్ల కింద కళాకృతిని ఏర్పాటు చేశాం. ఆ ఆలోచన వచ్చిన వెంటనే రేఖతో షేర్ చేసుకున్నాను. తనకూ నచ్చింది. అయితే ఆ రోజే అనుకున్నాం.. మా గ్యాలరీ ప్యూర్ ఆర్ట్‌కి డయాస్లాగా ఉండాలి తప్ప కమర్షియల్ ప్రాఫిట్‌కి చానల్‌లా కాదు అని. ఇప్పటికీ ఆ విషయంలో రాజీ లేదు’ అని చెప్తారు ప్రశాంత్. ‘కళాకృతి..ఆలోచన ఆయనది. అనుసరణ నాది. కళాకృతి కాకుండా మా ఇద్దరికీ సపరేట్ కెరీర్ ఉంది. ఆయన బిల్డర్. నాకు బొటిక్ ఉంది. అయినా కళాకృతి మా ఇద్దరి గారాలపట్టి. ఎంత బిజీగా ఉన్నా ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఏ అంశాన్నీ అలక్ష్యం చేయం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త వర్క్ కొలువుదీరేలా ప్రయత్నిస్తుంటాం. అలా త్వరలోనే చక్కటి కాఫీ తాగుతూ నచ్చిన పెయింటింగ్‌ను ఆస్వాదించే కాఫీడేనూ స్టార్ట్ చేయబోతున్నాం’ అని భవిష్యత్ కార్యాచరణను తెలిపారు రేఖ. స్మార్ట్ థింకింగ్ అండ్ హార్డ్‌వర్కింగ్ మీ ఇద్దరి ప్రొఫెషనల్ జర్నీని ఒక వాక్యంలో వర్ణించండి అంటే ‘ఆయనది స్మార్ట్ థింకింగ్ నాది హార్ట్వర్కింగ్’ అని చెప్పారు రేఖ. ‘కళాకృతికి సంబంధించిన విషయం తప్ప మా ఇద్దరి కెరీర్లో ఒకరికొకరం జోక్యం చేసుకోం’ అంటారు ప్రశాంత్. ‘ఆయన అద్భుతమైన ఐడియాలిస్తారు’ అని రేఖ అంటుంటే ‘తను వాటిని అంతకన్నా అద్భుతంగా చేసి చూపిస్తుంది’ అంటారు ప్రశాంత్. ‘మా అమ్మాయికి ఆయన పోలికే. అబ్బాయికి నా పోలిక.వాళ్లిద్దరూ కూర్చున్నచోట అలా ఐడియాలిస్తుంటే మేమిద్దరం కష్టపడుతుంటాం’ అంటారు రేఖ నవ్వుతూ. వ్యత్యాసాలు ఒక్కటయ్యేదెప్పుడు? ‘పిల్లల విషయంలో’ ఏకకంఠంతో ఇద్దరూ. ‘పిల్లల పెంపకంలో మా ఇద్దరి ఆలోచనలు, అనుసరణలు ఒకేరకంగా ఉంటాయి. వాళ్లతో గడిపే సమయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వం’ అంటారిద్దరూ. ప్రశాంత్, రేఖ.. పేజ్ త్రీ కపుల్. ‘ఫ్రెండ్ సర్కిల్‌కి సంబంధించీ ఇద్దరం ఒకేలా ఉంటాం. తొందరగా కొత్తవాళ్లతో క్లోజ్ అయిపోం.నచ్చినవాళ్లు తక్కువమందే. వాళ్లతోనే చాలా సన్నిహితంగా ఉంటాం. గెట్ టు గెదర్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం’ అని చెప్తారు ప్రశాంత్. లవ్లీ జర్నీ.. ‘తప్పొప్పులు, భిన్నాభిప్రాయాలు ఏ జంటకైనా సాధారణం. అయితే అవి ఆర్గ్యుమెంట్స్‌గా కాక డిస్కషన్స్గా ఉంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మా మధ్య డిస్కషన్సే ఎక్కువ’ అని రేఖ అంటారు. ‘తప్పయినప్పుడు సారీ చెప్పడాలు ఉండవ్. ఆ తప్పును సరిదిద్దుకొని ఇంకోసారి అలాంటిది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. అంతే!’ ప్రశాంత్ మాట.‘సరిదిద్దుకున్నామంటేనే ఈ తప్పును అడ్మిట్ చేసుకున్నట్టే కదా’ రేఖ సమర్థింపు. ‘కాలం గడుస్తున్నాకొద్దీ ఇండివిడ్యువల్‌గా ఇద్దరం పరిణతి చెందుతూనే ఉంటాం కదా. ఒకరి మెచ్యూరిటీ ఒకరికి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది’ ఉభయుల కామెంట్. ‘ఏమైనా ఇట్స్ ఎ లవ్లీ జర్నీ’ అంటూ ఈ సంభాషణకు అందమైన ముగింపునిచ్చారు ఇద్దరూ!. -
ఆంధ్ర ఫాలోఆన్
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ విశాఖపట్నం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర ఫాలో ఆన్‌లో పడింది. మూడో రోజు మంగళవారం ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 107.4 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 121/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో పటిష్ట స్థితితో ఆట ప్రారంభించిన ఆంధ్ర తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. డీబీ ప్రశాంత్ (257 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (75) మరో 4 పరుగులు జత చేసి అవుటయ్యాడు. చివర్లో శివకుమార్ (33), అయ్యప్ప (31) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఖాద్రీ, రవికిరణ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. యువరాజ్ సెంచరీ పటియాలా: హరియాణాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 330 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువరాజ్ సింగ్ (160 బంతుల్లో 130; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి శతకం సాధించడం విశేషం. అనంతరం 321 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హరియాణా మూడో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లకు 26 పరుగులు చేసింది. -
ర్యాగింగ్ వల్లే ప్రమాదం: ప్రశాంత్ తండ్రి
విశాఖపట్నం: ర్యాగింగ్ కారణంగా జరిగిన ప్రమాదం వల్లే తమ అబ్బాయి భవనంపై నుంచి కిందపడ్డాడని విద్యార్థి ప్రశాంత్ తండ్రి చెప్పారు. తగరపువలస ఎన్ఆర్ఐ కాలనీ హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి నిన్న ప్రశాంత్ కింద పడ్డాడు. ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నానని, బయట వేరే రూమ్‌లో ఉంచి చదివించాలని తన కొడుకు ఫోన్లో చెప్పినట్లు ఆయన చెప్పారు. సీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ** -
మళ్లీ కోలీవుడ్‌లో పాగా
హీరోయిన్ల లక్ ఏమిటంటే ఒక భాషలో అవకాశాలు ముఖం చాటేస్తే మరో భాషలో ఆహ్వానం పలుకుతుంటాయి. అలా ఒక భాషలో ఐరన్ లెగ్గా ముద్ర వేసుకున్న తారలు ఇతర భాషల్లో జయించి మళ్లీ ఎక్కడ ఓడారో అక్కడే గెలుస్తారు. అనుష్క, ఇలియానా, తమన్నా ఇలా ఈ లిస్ట్‌లో చాలా మంది తారలున్నారు. తమన్నా విషయానికే వస్తే కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఆ తర్వాత తెలుగులో హ్యాపీడేస్ చిత్రంతో విజయాల ఖాతా ఓపెన్ అయ్యింది. దీంతో మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇక్కడ సక్సెక్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ కొంచెం గ్యాప్ తరువాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చారుు. అక్కడ కొన్ని విజయాలను అందుకుంది. తాజాగా టాలీవుడ్లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు కోలీవుడ్ ఆదుకుంటోంది. తమిళంలో ప్రస్తుతం ప్రశాంత్ సరసన సాహసం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా తమన్నాను మరో అవకాశం వరించింది. హీరోయిన్లకు ఇష్టసఖుడిగా గుర్తింపు పొందిన ఆర్యతో రొమాన్స్ చెయ్యడానికి తమన్నా సిద్ధం అవుతోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఇందులో హాస్య నటుడు సంతానం ముఖ్య భూమికను పోషించనున్నారు. ఆ విధంగా తమన్నా కోలీవుడ్‌లో మళ్లీ పాగా వేస్తోంది. -
ఇంకా ఆస్పత్రిలోనే...
కళ్లు తెరవని వరుణ్‌గౌడ్... నెమ్మదిగా తేరుకుంటున్న ప్రశాంత్... శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు. ప్రశాంత్(6) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరత్(6), నితిషా(7)లు నెమ్మదిగా కోలుకుంటున్నారు. మూసాయిపేట్ రైల్వేక్రాసింగ్ ఘటనలో 18 మంది మృతి చెందగా, 20 మంది క్షతగాత్రులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. వీరిలో వైష్ణవి, తరుణ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందగా, 14 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన నలుగురినీ ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్య నిపుణులు, 100 మంది పారా మెడికల్ స్టాఫ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. పది రోజులుగా అదే స్థితి... వెంకటాయపల్లికి చెందిన మల్లేష్, లత దంపతులకు రుచిత గౌడ్(8), వరుణ్ గౌడ్(7), శృతి గౌడ్(6) ముగ్గురు పిల్లలు. వీరందరినీ కాకతీయ టెక్నో స్కూల్లో చదివిస్తున్నారు. ఘటన జరిగిన రోజు శృతి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన రుచితగౌడ్, వరుణ్‌గౌడ్‌లను యశోద ఆస్పత్రికి తరలించారు. రుచిత పూర్తిగా కోలుకోవడంతో గురువారం వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. కుమారుడు వరుణ్‌గౌడ్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. మెదడు దెబ్బతింది. కుడి కాలర్ ఎముక విరిగింది. ఛాతి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో ఒత్తిడికి అవి దెబ్బతిన్నాయి. ఎడమ మోకాలి కార్టిలేజ్‌పై చర్మం అంతా ఊడిపోయింది. ఐదు రో జుల క్రితం ఆయనకు ప్లాస్లిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇప్పటి వరకు కళ్లు కూడా తెరువలేదు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. పూర్తిగా మందులే వినియోగిస్తున్నారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా పిల్లల్లాగే తన కుమారుడు వరుణ్‌గౌడ్ కూడా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అతని తల్లిదండ్రులు కనిపించిన దేవుడినల్లా ప్రార్థిస్తున్నారు. కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే తీపి కబురు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ మెదడు చుట్టూ నీరు... వెంకటాయపల్లికి చెందిన స్వామి, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రశాంత్(6) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరణ్‌గౌడ్‌తో పోలిస్తే ఇతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. పుర్రె ఎముక విరిగి మెదడుకు ఆనుకుంది. తలపై చర్మం ఊడిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తొడ భాగంలోని కొంత చర్మాన్ని తీసి తలపై అమర్చారు. మెదడు చుట్టూ నీరు చేరుతుండటంతో మూడు రోజుల క్రితం సర్జరీ చేసి, నీటిని బయటికి తీసేశారు. ముఖంపై గాయాలు ఇంకా మాన లేదు. ఎడమ చేయి విరగడంతో శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. సహజ పద్ధతిలో ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిట్స్ రావడంతో వైద్యుల పరిశీలనలో ఉంచారు. మరోసారి ఫిట్స్ వస్తే...మళ్లీ వెంటిలేటర్ అమర్చాల్సి ఉంటుందని ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ బి.జె.రాజేశ్ తెలిపారు. -
రాజకీయ నేపథ్యంలో...
ప్రస్తుత రాజకీయ పరిణామాలు సగటు మనిషి జీవితాన్ని ఏ విధంగా మారుస్తున్నాయి? అనే కథాంశంతో సుధా మూవీస్ పతాకంపై గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో జె.సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతినిధి’. నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప హీరో హీరోయిన్లు. ప్రశాంత్ మండవ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదలైన ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత చెబుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. టైటిల్ రోల్‌ని నారా రోహిత్ అద్భుతంగా చేశారు. పాటలతో పాటు ప్రచార చిత్రానికి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాన్ని యూ ట్యూబ్‌లో ఐదు లక్షల మంది వీక్షించారు. కొత్త దర్శకుడైనా ప్రశాంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. -
ప్రశాంత్‌కు 8 వికెట్లు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ‘ఎ’ 2,3 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో సుల్తాన్ షాహి బౌలర్ ప్రశాంత్ (8/43) చెలరేగాడు. కీలక సమయంలో ఎనిమిది వికెట్లు తీయడంతో 196 పరుగుల తేడాతో విజయ్ హనుమాన్ జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సుల్తాన్ షాహి 309 పరుగులు చేసింది. ప్రసాద్ యాదవ్ (52), వంశీ రాఘవ (52), సత్కుమార్ (48) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విజయ్ హనుమాన్ 113 పరుగులకే కుప్పకూలింది. ప్రశాంత్ ధాటికి చకచకా వికెట్లు కోల్పోయింది. సుకేన్ జైన్ (41) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో సీసీఓబీ 116 పరుగుల తేడాతో తెలంగాణ టీమ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీసీఓబీ 229 పరుగులు చేసింది. షాహబాజ్ తుంబి (85), నఫీజ్ (47) ఫర్వాలేదనిపించారు. జయసూర్య (5/52) శ్రమ వృథా అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ 113 పరుగులకు మాత్రమే పరిమితమైంది. జయసూర్య (32) కాస్త రాణించాడు. పర్వేజ్, అబ్దుల్, మన్నన్లు తలా మూడు వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు ఠ జెమిని ఫ్రెండ్స్: 133 (క్రిస్ కళ్యాణ్ 43, ఖురేషి 3/27); ఎస్ఏ అంబర్పేట్: 88/3 (పరమ్‌వీర్ 42 నాటౌట్). ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోరు వివరాలు ఠ మణికుమార్: 177 (శ్రీకాంత్ 31, సాయి కుమార్ 30, రామ్‌దేవ్ 37, అరాఫత్ 3/4); ఏవీసీసీ: 181/2 (యాష్ కపాడియా 74 నాటౌట్, సాయి ప్రజ్ఞాన్ 50 నాటౌట్). ఠ సదరన్ రేమండ్స్: 251/9 (అరుణ్ 89, ఆదిల్ 4/36); డెక్కన్ బ్లూస్: 100