విలాసాలకు అలవాటు పడడంతో చోరీలకు పాల్పడిన వైనం
అరెస్ట్ చేసిన హన్మకొండ పోలీసులు
ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
హన్మకొండ చౌరస్తా : హోటల్‌లో సర్వర్ చేస్తున్న ఓ యువకుడికి అక్కడకు వచ్చే వేతనం సరిపోలేదు.. ఇం కా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు దొంగతనం చే యూలని తట్టింది.. ఇంకేంద అనుకున్నదే తడవుగా వాహనాలు దొంగిలించడం వా టిని అమ్మి వచ్చే డబ్బుతో విలాసంగా గడపడం అల వాటుగా చేసుకన్నాడు... ఈ క్రమంలో ఓసారి పోలీసులకు పట్టుబడి జైలు పాలైన ఆయన తీరు మారలేదు.. చివరకు మళ్లీ ఆ యువకుడికి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ సీఐ సంపత్‌రావుతో కలిసి పోలీసుస్టేషన్‌లో వెల్లడించారు.
ఎల్లంపేట టూ హన్మకొండ
మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గోపగాని ప్రశాంత్ నగరంలో ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ హన్మకొండలోని రాంనగర్‌లో నివాసం ఉం టున్నాడు. నిందితుడు ప్రశాంత్ మద్యానికి, జల్సాలకు అలవాటు పడి సర్వర్‌గా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాల చోరీ చేయూలని నిర్ణరుుంచుకున్నాడు. ఎక్కడైతే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు నగరంలోని వివిధ మైదానాల్లో వాకింగ్ వచ్చే వారు పార్క్ చేసే వాహనాలు కనిపించారుు. లోపల వాకర్లు నింపాదిగా ఉన్నప్పుడు బయట నుం చి బయటకు వాహనాలు ఎత్తుకెళ్లడం ఆరంభించాడు. గత మే నెలలో చోరీకి పాల్పడినప్పుడు ప్రశాంత్ సీసీఎస్ పోలీసులకు చిక్కగా జైలుకు పంపించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ తన తీరు మార్చుకోలేదు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, ఆర్ట్స్ కాలేజీ, కేయూ మైదానాల వద్ద మార్నింగ్ వాక్‌కు వచ్చి పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించాడు. ఇలా హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, కేయూసీ పరిధిలో రెండు, సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక వాహనం.. మొత్తం కలిపి ఆరు వాహనాలు చోరీ చేశాడు. ఇక్క చాలనుకున్నాడో ఏమో కానీ ఈసారి ఖమ్మం వెళ్లాడు. అక్కడ ఓ వాహనాన్ని చోరీ చేసిన ప్రశాంత్ నగరానికి వస్తున్నాడన్న సమాచారం అందడంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు హన్మకొండ క్రైం ఎస్సై వెంకట్‌రావు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ మేరకు నిందితుడు ద్విచక్ర వాహనం(టీఎస్04 ఈజీ 2233)పై రాగా ఆరా తీసిన పోలీసులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రా లు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారిం చగా గతంలో కూడా ఆరు వాహనాలు దొంగిలించిన ట్లు అంగీకరించాడు. ఈ మేరకు ప్రశాంత్ నుంచి రూ. 4.50లక్షల విలువైన ఏడు వానాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శోభన్‌కుమార్ తెలిపారు. కాగా, ప్రజ లు మార్కింగ్ వాక్ లేదా షాపింగ్‌కు వెళ్లినప్పుడు వాహనాల పార్కింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఏసీపీ.. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమీప పోలీసుస్టేషన్ లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సంపత్‌రావు, క్రైం ఎస్సై వెంకట్రావ్, హెడ్‌కానిస్టేబుల్ సాంబ మూర్తి, కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, రోషన్ అలీ, రాం రెడ్డి, రమేష్‌ను ఆయన అభినందించారు.
దొంగగా మారిన సర్వర్
Published Wed, Jul 6 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement
Advertisement