
ఫిలింనగర్: సినీ హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ రోడ్డునంబర్–8లో సినీ హీరో విశ్వక్సేన్ నివసిస్తున్నాడు. ఈనెల 14న తెల్లవారుజామున దుండగులు అతని ఇంటి తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలతో పాటు హెడ్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. దీంతో అదేరోజు విశ్వక్సేన్ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన ఎస్‌ఐ సతీశ్‌కుమార్, కానిస్టేబుళ్లు సురేందర్ రాథోడ్, ఇంతియాజ్ హుస్సేన్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజుల పాటు సుమారుగా 200లకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. బేగంపేట మయూరిమార్గ్‌లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసు వీడింది. కొత్తగూడెంకు చెందిన భీమవరపు స్వరాజ్ (21), బొల్లి కార్తీక్ (22), నేరేడుమల్లి సందీప్ (21) ఫుడ్ డెలివరీబాయిస్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీపై దృష్టిపెట్టారు.
సినీ హీరో విశ్వక్సేన్ ఇంటి వద్ద వారం పాటు రెక్కీ నిర్వహించి ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దృష్టి పెట్టారు. ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై విశ్వక్సేన్ ఇంటికి చేరుకుని కొద్ది దూరంలో బైక్ ఆపారు. స్వరాజ్ ఇంటి తాళాలు పగులగొట్టి డైమండ్ రింగ్‌లతో పాటు హెడ్‌ఫోన్ చోరీ చేసి బయటకు రాగానే ముగ్గురు కలిసి బైక్‌పై ఉడాయించారు. వీరిని అరెస్టు చేసి డైమండ్ రింగ్‌లతో పాటు 3 మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను స్వా«దీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
Comments
Please login to add a commentAdd a comment