
సాక్షి,రంగారెడ్డి : ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం(నవంబర్ 8) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు.
తన బ్యాగులో ఉండాల్సిన బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో తొలుత డ్రైవర్ బస్సును హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆపేశాడు. అనంతరం బస్సును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించాడు.
బస్సులో ప్రయాణం చేసిన మొత్తం 40 మంది ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోరీకి సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
Comments
Please login to add a commentAdd a comment