travel bus
-
అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..!
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దైవభక్తి ఎక్కవతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్‌షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్‌చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్‌షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్‌తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్‌షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్‌కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్రఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.డీఎస్పీ పరిశీలనరేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్‌షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. -
HYD: ట్రావెల్ బస్సులో భారీ చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు
సాక్షి,రంగారెడ్డి : ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం(నవంబర్ 8) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు.తన బ్యాగులో ఉండాల్సిన బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో తొలుత డ్రైవర్ బస్సును హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆపేశాడు. అనంతరం బస్సును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించాడు.బస్సులో ప్రయాణం చేసిన మొత్తం 40 మంది ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోరీకి సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు -
ప్రయాణికురాలి నోట్లో బట్ట కుక్కి.. రేప్
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం(జులై 10) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో- ఆగ్రా హైవేపై ఉన్నావో వద్ద ట్రావెల్ డబుల్ డెక్కర్ బస్సు, పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. #BreakingNews 🚨Major accident happened in Unnao, Uttar Pradesh18 Died & many injured. Double decker Bus collided with Tanker truck 🚛Road Safety must be taken seriously 🙁#Unnao #UP #उन्नाव #UttarPradesh pic.twitter.com/vMjfWHOk7T— Veena Jain (@DrJain21) July 10, 2024 ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, విజయవాడ: గొల్లపూడి వద్ద ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు బోల్తా పడటంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును అధికారులు తొలగించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? -
ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ద్విచక్ర వాహనాలు, ఆటోలను దొంగలించడం సర్వ సాధారణం. అయితే ఓ దొంగ ఏకంగా ట్రావెల్ బస్సునే చోరీకి యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సింధూర గెస్ట్‌హౌస్ పక్కన ట్రావెల్ బస్సును మంగళవారం రాత్రి డ్రైవర్ నిలిపి భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అక్కడ అదృశ్యమైన బస్సు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. టౌన్‌కొత్తరోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ కాళిదాసు, అదనపు ఎస్సై గణేష్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సును తస్కరించిన వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పరారై ఉంటాడని ట్రాఫిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
ట్రావెల్ బస్సులో మంటలు
-
బస్సులో మంటలు.. అందరూ చూస్తుండగానే..
సాక్షి, సంగారెడ్డి : రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఆగిఉన్న ఓ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు మంటలకు ఆహుతైంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముంబైనుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన డ్రైవర్ రామచంద్రాపురం జాతీయ రహదారిపై గల హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు. ఆ వెంటనే బస్సు అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26మంది ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్త కారణంగా పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సులోని ప్రయాణికుల సామాన్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్ బస్ ఏర్పాటు
మన్సూరాబాద్: ఓల్వో బస్‌కు టెకెట్లు బుక్ చేసుకుంటే నాసిరకం హైటెక్ బస్సు (టీఎస్ 12 యూబీ 3645)ను పంపిన ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం.. పంపిన బస్సు నగరం దాటకుండనే మార్గమధ్యంలో నిలిచిపోయిన సంఘటన శుక్రవారం రాత్రి ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్వీఆర్ ట్రావెల్స్‌లోని ఓల్వో బస్‌లో నగరం నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయాణికులు టెకెట్లు బుక్ చేసుకున్నారు. సదరు ట్రావెల్స్ బస్సు ఎల్బీనగర్కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉంది. ప్రయాణికులు పలు మార్లు ఫోన్ చేయగా ఎస్వీఆర్ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు హైటెక్ బస్సును పంపించింది. తీరా బస్సు చింతలకుంటకు రాగానే చెడిపోయి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు యాజమాన్యానికి ఫోన్ చేసి సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి అందోళనకు దిగారు. సాయంత్రం 6.30 నుంచి బస్సు కోసం ఎదరుచూస్తున్నామని, బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎర్పడిందని ఆవేదన చెందారు. ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే తామంతా అవస్థలు పడుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ట్రావెల్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
-
దారి కాసిన ప్రమాదం
పశ్చిమగోదావరి, తణుకు : నేషనల్ హైవేపై రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న సంఘటన.. ఆగి ఉన్న వాహనాన్ని తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన మరో సంఘటన.. ఇలా పదహారో నంబర్ జాతీయ రహదారి నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో రక్తసిక్తమవుతోంది. రెండు జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళుతున్నాయి. అందులో 16వ నంబర్ జాతీయ రహదారి అత్యంత కీలకం. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లే ఈ రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తాయి. జిల్లాలో మెజారిటీ ప్రాంతం ఈ రహదారి మీదే ఉంది. జిల్లాలో కలపర్రు టోల్గేట్ వద్ద నుంచి ప్రారంభమై ఏలూరు, దెందులూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన వాహనాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల అధికారులు సైతం నిర్థారించారు. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సైతం ఈ రహదారిపైనే బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తంతు నడుస్తోంది. తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డుతో పాటు సొసైటీ రోడ్డు, శర్మిష్ట జంక్షన్, తేతలి వైజంక్షన్ ఇలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. ఇలాంటి వాహనాలకు అడ్డుకునేందుకు రవాణా, పోలీసు శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. అడుగడుగునా లోపాలు చెన్నై నుంచి కోల్‌కతా వరకు నాలుగు లేన్లలో విస్తరించిన పదహారో నంబర్ జాతీయ రహదారి తణుకు మండలం దువ్వ నుంచి సుమారు 12 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటోంది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా పట్టణం, గ్రామాలు విస్తరిస్తుండటంతో రోడ్డు దాటేందుకు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా సెంటర్లలో నిర్వహణ లోపం నిర్వహణ లోపం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన సూచికలు, హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పాటు ఆయా సెంటర్లలో బస్సులు, ఇతరత్రా వాహనాలు నిలిపేందుకు బస్బే పేరుతో స్థలం వదలాల్సి ఉండగా ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి 40 కిలోమీటర్లకు 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడంలేదు. దువ్వ సమీపంలోని వెంకయ్య వయ్యేరు, దువ్వ జంక్షన్, తేతలి గ్రామ జంక్షన్, తేతలి జంక్షన్, అయ్యప్పస్వామి దేవాలయం జంక్షన్, శర్మిష్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై జంక్షన్ తదితర ప్రాంతాలను ప్రమాదకర జంక్షన్లుగా గుర్తించారు. అయితే ఆయా జంక్షన్లలో రోడ్డు పక్కనే వాహనాలు ఉంచుతుండటంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చర్యలు తీసుకుంటాం.. రోడ్డు పక్కనే నిలిపి ఉంచే వాహనాలను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలపకుండా చర్యలు తీసుకుంటాం. ట్రావెల్స్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిస్తాం. ప్రధానంగా హైవేపై వాహనాలు నిలిపి ఉంచితే కేసులు నమోదు చేస్తాం.– డీఎస్.చైతన్యకృష్ణ, సీఐ, తణుకు ట్రావెల్స్ దందా హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై వంటి పట్టణాలకు నిత్యం తణుకు పట్టణం మీదుగా ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 20 నుంచి 30 వరకు బస్సులు పట్టణంలోకి వచ్చి వెళుతుండగా మరో వందకు పైగా బస్సులు హైవే మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. తణుకు పట్టణంలోని పలువురు ట్రావెల్స్ యజమానులు బుక్కింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రధాన రోడ్లుపై ట్రావెల్స్ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి దేవాలయం, టౌన్‌హాల్ కాంప్లెక్స్, సొసైటీ రోడ్డులోని కామథేను కాంప్లెక్స్, పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లలో నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలుపుతున్నారు. మరోవైపు హైవేపై సైతం ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా నిలుపుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి.ప్రధాన కూడళ్లలో ఇలా బస్సులు నిలుపుతుండగా వేగంగా వచ్చే వాహనాలు గుర్తించలేకపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. -
బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జ్..!
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : ‘బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తారట. హాస్పటల్లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చి బాధితులకు మెరుగైన చికిత్స చేయాలని, బిల్లు తాము చెల్లిస్తామన్న జిల్లా కలెక్టర్, కావేరి, ఎస్బీటీ ట్రావెల్స్ యజమానుల నుంచి ఇప్పుడు స్పందన లేదు. డిశ్చార్జ్ చేయమంటే బిల్లు కట్టాలని హాస్పటల్ యాజమాన్యం చెబుతోంది. మూడు రోజుల నుంచి కట్టుబట్టలతో ఉన్నాం. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం. జాయింట్ కలెక్టర్–2 బాబూరావును అడిగితే ముందుగా మీరు కట్టేయండి.. తర్వాత మీ ఎకౌంట్లో వేస్తామని చెబుతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు..’ ఇదీ మూడు బస్సుల ఢీ ఘటన బాధితుల ఆవేదన. ఈ నెల 7వ తేదీన కృష్ణా జిల్లా గరికపాడులో మూడు ట్రావెల్స్ బస్‌లు ఒకదానినొకటి ఢీకొనటం, అనేకమంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మందిని భవానీపురం ఆంధ్రా హాస్పటల్లో చేర్పించారు. బాధితులను జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, ట్రావెల్స్ యజమానులు వచ్చి పరామర్శించారు. ఖర్చులు తాము భరిస్తామని హాస్పటల్ యాజమాన్యానికి చెప్పి వెళ్లారు. దీంతో వైద్యులు క్షతగాత్రులకు సర్జరీలతోపాటు వివిధ వైద్య సేవలు అందించారు. అయితే గురువారం ఉదయం నుంచి యాజమాన్యం అందించే వైద్య సేవల్లో మార్పు వచ్చిందని బాధితులు తెలిపారు. డిశ్చార్జ్ తతంగం పూర్తి చేశాక.. బిల్లు కడితేనే పంపిస్తామని చెబుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉదయం నుంచి బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, విషయం తెలుసుకున్న జేసీ–2 బాబూరావు గురువారం మధ్యాహ్నం హాస్పటల్‌కు వచ్చి బాధితుల కుటుంబసభ్యులతో చర్చించారు. ఇప్పటి వరకు ఎవరూ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎవరైనా డిశ్చార్జ్ అవ్వదలుచుకుంటే వెళ్లిపోవచ్చని తెలిపారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న రోగులు కొన్ని రోజులపాటు ఇక్కడే ఉండవచ్చని, సర్జరీలు చేసి విశ్రాంతి తీసుకునే రోగులకు ప్రభుత్వ హాస్పటల్లో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఎన్నాళ్లు అవసరమనిపిస్తే అన్నాళ్లు ఉండవచ్చని తెలిపారు. అలాగే డిశ్చార్జ్ అయ్యే దూరప్రాంతాల రోగులకు అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఆందోళనకు గురైన బాధితుల కుటుంబసభ్యులు ఊరట చెందారు. -
ట్రావెల్స్ బస్సులు ఢీ
జగ్గయ్యపేటలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ పక్క సీట్లో నిద్రిస్తున్న హాల్టింగ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మూడు బస్సుల్లోని 25 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా అమలాపురం, వైజాగ్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది. గరికపాడు (జగ్గయ్యపేట) : 65వ నెంబర్ జాతీయ రహదారిపై మండలంలోని ఆర్టీఏ గరికపాడు చెక్‌పోస్టు వద్ద మూడు ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొనటమే కాకుండా వెనుక బస్సును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీ 28 టీడీ 4444 నంబర్ గల ఎల్వీఆర్ ట్రావెల్స్ బస్సు 30 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయలుదేరింది. మూడు గంటల సమయానికి ఏపీ, తెలంగాణ సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్దకు వచ్చే సరికి ఎదురుగా ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావటంతో బస్సు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలోనే వెనుక వస్తున్న ఏఆర్ 01 జీ 6939 నంబర్ గల జైభారత్ స్లీపర్ కోచ్ బస్సు వేగంగా వచ్చి ముందున్న ఎల్వీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కళ్లు తెరిచేసరికి జై భారత్ బస్సును కావేరి ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అదే సమయంలో ఈ మూడు బస్సులను వాటి వెనుక వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జైభారత్ బస్సులోని డ్రైవర్ పక్క సీట్లో నిద్రిస్తున్న హాల్టింగ్ డ్రైవర్ వాసంశెట్టి శ్రీనివాసరావు (34) ఛాతీ భాగంలో బలమైన దెబ్బ తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న అమలాపురం, వైజాగ్, విజయవాడ ప్రాంతాలకు చెందిన పురుగు శ్రీనివాసరావు, తాడాల వెంకన్న, చంద్రపాడు నాగేశ్వరరావు, గుట్టపాటి మనోహర్ శాస్త్రి, శోభానాథ్ కామేశ్వరరావు, వడ్ల వీర శంకరాచారి, మార్గం వెన్నెల, జిక్కుల శ్రీధర్, చంద్రశేఖర్, పిల్లాల నగేష్, మహ్మద్ ఇజ్రాయిల్, చిత్ర అజయ్, కోటిపల్లి వీరాంజనేయులు, వెగిశాల వెంకట రమణ, వెంకటేశ్వరరావు, గొట్టిపాటి సుబ్బలక్ష్మి, గుడేటి రామలింగేశ్వరరావు, నల్లబెల్లి హరివెంకన్నరెడ్డి, గొట్టెంపాటి చందన, గుత్తి మంగతాయారు, కొప్పర విశ్వ, మహ్మద్ అహ్మద్, బందరుపాటి భారతి, షేక్ అబ్దుల్ ఖాదర్‌లకు తలకు, వెన్నెముక, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావటంతో ప్రమాద సమయంలో ఉన్న పోలీస్, హైవే సిబ్బంది 108 వాహనాల ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎక్కువగా కావేరి, జై భారత్ బస్సుల్లో ప్రయాణించిన వారే ఉన్నారు. స్వల్ప గాయాలైన వారిని పోలీసులు మరో బస్సులో వారి ప్రాంతాలకు తరలించారు. ప్రమాదంలో ముందు రెండు బస్సులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. స్లీపర్ కోచ్‌లు కావటంతో బస్సులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు.. అర్థరాత్రి సమయంలో క్షతగాత్రులను అంబులెన్స్‌లు, ప్రత్యేక వాహనాల ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకురావటంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆస్పత్రికి దశల వారీగా క్షతగాత్రులను తీసుకురావటంతో బెడ్లు లేక మంచాలు, నేలపై పడుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా విధుల్లో వైద్యురాలు శారద ఒక్కరే ఉండటంతో గాయపడిన వారికి వైద్యం పూర్తి స్థాయిలో అందించలేక ఆమె ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి వస్తే వైద్యులు గంట ఆలస్యంగా వచ్చారని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల 108ల ద్వారా గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ పరామర్శ.. గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ బి. లక్ష్మీకాంతం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట జగ్గయ్యపేట తహసీల్దార్ నరసింహారావు ఉన్నారు. ఘటనా స్థలం పరిశీలన.. జాతీయ రహదారిపై ప్రమాద స్థలాన్ని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి వీరప్రసాద్ పరిశీలించారు. ఆయన జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ శంకరాచారిని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంవీఐ ఎంవీఎన్ రాజు, చిల్లకల్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, సీఐ జయకుమార్ పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడిలోకి..
సాక్షి ముంబై: 23 మందితో తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న మినీ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఉన్న ఇసుక ట్రక్కును ఢీ కొనడంతో బస్సులో ఉన్న 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నాసిక్ జిల్లా చాంద్‌వడ్ తాలూకా సోగ్రాస్ గ్రామం వద్ద గురువారం వేకువ జామున 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఓ బాలుడున్నారు. మరణించిన వారందరూ కల్యాణ్, ఉల్లాస్‌నగర్‌తోపాటు నాసిక్ వాసులుగా గుర్తించారు. తెల్లవారు జామున.. సాయిట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సులో డ్రైవర్‌తోపాటు మొత్తం 23 మంది సోమవారం తీర్థయాత్రలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. తెల్లవారుతుండటంతో నిద్రలోనుంచి అçప్పుడప్పుడే కొందరు మేల్కొనసాగారు. అంతలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం.. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఆ పరిసరాలన్నీ రక్తపు మడుగులో ఎర్రగా మారిపోయాయి. క్షతగాత్రుల అర్తనాధాలతో ఆ పరిసరాలన్నీ మారుమోగాయి. ఇలా సూర్యోదయం చూడకముందే ఘటనా స్థలంలోనే ఐదుగురు విగత జీవులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, ఇతర వాహన చోదకుల సహాయంతో గాయపడ్డ వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 13 మందిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఉల్లాస్‌నగర్‌కు చెందిన మినీ బస్సు డ్రైవర్ సంతోష్ పిఠలే (38)కూడా ఉన్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయాలైన వారిలో కాలిదాస్ వాసోదా (38) రాధీ రాఠోడ్ (40), జమునా చవాన్ (70), మంజూ గుజరాతీ (31), ప్రగతీ గుజరాతి (12, కాశిక్ ధావ్ (14), కల్యాణ్ గుజరాత్ (60), ధనూ పరమార్ (60), వసూదుమయా (54), బ్రిజేష్ మల్హోత్రా (20), అజయ్ మల్హోత్రా (45), డ్రైవర్ సంతోశ్ పిఠలేతోపాటు ట్రక్కు క్లీనర్ మాలీకిలు ఉన్నారు. టైర్ పగలడంతోనే....? మినీ బస్సు టైరు పగలడంతోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మొరాయించడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేయసాగారు. అయితే అంతలోనే వేగంగా వస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. టైర్ పగలడంతో మినీ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దీంతోనే ట్రక్కును ఢీ కొట్టిందని తెలిసింది. దీంతో దైవ దర్శనానికి వెళ్లి.. చివరికి మృత్యు ఒడిలోకే వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ట్రావెల్ బస్సు బోల్తా.. 10మంది పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఏడీ జంక్షన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి విశాఖకు 50మంది ప్రయానికులతో బయలుదేరింది. వెంకటరమణ ట్రావెల్ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఆ బస్సు కూడలిలో బస్సు బోల్తా పడింది. బస్సులోని కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
డేంజర్ ట్రావెల్స్ కలెక్షన్లే టార్గెట్..
అనంతపురం – రాయదుర్గం మార్గంలో తిరిగే ఆ బస్సులంటే అందరికీ దడే. మితిమీరిన వేగం, ఓవర్ టేక్‌తో దూసుకొచ్చే ఆ బస్సులను చూస్తే మిగతా వాహనదారులు, పాదచారులు హడలెత్తి పోతున్నారు. ఏ సమయంలో ఎవరిని ప్రమాద రూపంలో బలిగొంటుందోనని భయపడిపోతున్నారు. ఆత్మకూరు: ఆదాయమే పరమావధిగా ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా నిలిపి మరీ ప్రయాణికులను ఎక్కించుకుంటోంది. కలెక్షన్ కోసం రోడ్డు నిబంధనలను ఉల్లంఘించేస్తోంది. మితిమీరిన వేగంతో అవతలి వాహనాల వారికి ప్రాణభయం పుట్టిస్తోంది. ముందు వెళుతున్న వాహనాలను దాటడం కోసం ఓవర్టేక్ చేసేస్తోంది. రెప్పపాటులో డ్రైవర్లు స్టీరింగ్ తిప్పేస్తుండటంతో లోపలున్న ప్రయాణికులు ఒక్క ఉదుటున సీట్లలోంచి కదులుతున్నారు. ఈ బస్సు వచ్చే తీరును చూస్తే ‘మృత్యువు’ దూసుకొచ్చినట్టే కనిపిస్తుందని పలువురు వాహనదారులు చెబుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో తరచూ ప్రమాదాలు అనంతపురం నుంచి ఆత్మకూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గంతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ప్రతి రోజూ ‘దివాకర్ ట్రావెల్స్’ తన బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా దివాకర్ బస్సులే ఈ మార్గంలో అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చేస్తున్నాయి. ఈ నెల మూడో తేదీన ఆత్మకూరు సమీపంలో బొలెరో వాహనాన్ని దివాకర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆత్మా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ) ఎన్.వి.రమణ (50) దుర్మరణం చెందాడు. గత నెలలో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లి వద్ద దివాకర్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌కు వైద్య ఖర్చులకు కూడా ట్రావెల్స్ నిర్వాహకులు సాయం చేయకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు గత నెల 21న గ్రామస్తులతో కలిసి దివాకర్ బస్సులను అడ్డుకున్నాడు. తమకు నష్టపరిహారం చెల్లించి మీ బస్సులు తిప్పుకోండి అంటూ డిమాండ్ చేశారు. ఇలా.. ప్రస్తుతం దివాకర్ బస్సులకు సంబంధించి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. పరిమితికి మించి ప్రయాణం దివాకర్ బస్సులలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. ఈ విషయ తెలిసినా అధికారులు కన్నెత్తి చూడరు. ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోరు. ఈ బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని అతివేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి జాతీయ రహదారిలో బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై గురువారం అర్థరాత్రి జరిగిన పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంకు సంబంధించి బస్సు డ్రైవర్‌పై ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు నమోదు చేశారు. తెనాలి నుంచి వయా గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లే శ్రీ సాయికృష్ణ ట్రావెల్స్ బస్సులో తెనాలి, గుంటూరులో 35 మంది ప్రయాణికులను ఎక్కించుకుని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కుంచనపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కుడివైపునకు వెళ్లి అటు ప్రయాణిస్తున్న మరో లారీని తప్పించబోయి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఒకటి బ్రిడ్జి అంచు భాగంలో వేలాడుతుండగా, మరో చక్రం డివైడర్‌ను ఆనుకుని బస్సు నిలిచిపోయింది. ఆ సమయంలో వెనుకనుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడం వల్ల బస్సు అక్కడితో ఆగిపోయింది. హైవే మీద 60 నుంచి 100 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తూ వెళ్తున్న బస్సు ఎదురుగా ఉన్న ట్రాక్టర్‌ను గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏదేమైనా ప్రమాదం పెద్దదైనప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా బిళ్ళకుదురు మండలానికి చెందిన ఎ.కిషోర్ ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ చక్రపాణి, ట్రావెల్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో డ్రైవర్‌తో పాటు సహాయకుడు కూడా లేడని, కనీసం ప్రమాదం జరిగినప్పుడు అద్దాలు పగులగొట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని ప్రయాణికులు వాపోయారు. బస్సులో ఉన్న యువకులే అద్దాలు పగలగొట్టి బయటకు రావాల్సివచ్చిందని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించకుండా పరారైనట్టు కిషోర్ తెలియచేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
- 8 మంది మృతి - గూడ్సు కంటెయినర్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు సాక్షి నెట్వర్క్ తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సూలగిరి వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తోన్న కంటెయినర్ లారీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 32 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా
ఉంగుటూరు/ తాడేపల్లిగూడెం రూరల్ : ఉంగుటూరు మండలం బాదంపూడి- ఉప్పాకపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన మేఘనా ట్రావెల్స్ వోల్వో బస్సు హైదరాబాద్ వెళుతోంది. బాదంపూడి సమీపంలోకి రాగానే కాలినడకన ద్వారకాతిరుమలకు వెళ్తున్న భక్తులను తప్పించబోయి అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి బావిరెడ్డి (నర్సిపూడి), దొంగ దేవి (సందిపాడు), ఆమె కుమార్తె దొంగ తేజస్వి (10), కంటిపూడి సాయి సమిత్ (కాకినాడ), అమర్తుల తంబి (కాకినాడ)కు తీవ్ర గాయాలయ్యాయి. నల్లమిల్లి సత్యవతి (నర్సిపూడి), సమిళ్ళ సాయిరెడ్డి (నర్సిపూడి), నల్లా లక్ష్మిలతోపాటు మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత నల్లమిల్లి బావిరెడ్డి, కంటిపూడి సాయిసమిత్ను మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మిగిలిన వారు తమ ప్రాంతాలకు తరలివెళ్ళినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించడంలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయ సిబ్బంది సహకరించారు. ప్రమాద సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్ సంస్థ జేకే సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి
కర్నూలు మండలం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్ వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు... విజయ్‌భాస్కర్‌రెడ్డి నగర్ నుంచి రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న నగేష్ (25) మృతి చెందగా మరో మగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్స్ వారితో మాట్లాడి ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు బస్సు బోల్తా: ఆరుగురికి గాయలు
నెల్లూరు: వేగంగా వెళ్తున్న బస్సు లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెన్నాబ్రిడ్జి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. 22మంది ప్రయాణికులతో చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న మూన్ లైట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు పెన్నాబ్రిడ్జి సమీపంలోకి రాగానే లారీని ఓవర్ టేక్ చేయగా మరో లారీ అడ్డు ఉండటంతో దాన్ని తప్పించబోయింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సింహపురి ఆస్పత్రికి తరలించారు. -
అండర్ బ్రిడ్జ్ ను ఢీకొన్నట్రావెల్స్ బస్సు
నెల్లూరు(కావలి): ఓ ట్రావెట్ బస్సు అండర్ బ్రిడ్జ్ ను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కోమిట్ల ట్రావెల్స్ బస్సు జిల్లాలోని కావలి వద్ద ఎన్‌హెచ్5 పై నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన వేరే బస్సులో నెల్లూరుకు తరలించారు. -
స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు
కొరుక్కుపేట: హెవీ వెహికల్స్, ట్రావెల్ బస్సులను తయూరు చేయడంలో పేరుపొందిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చిం ది. మొదటగా ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌ను చెన్నైలోని పర్వీన్ ట్రావెల్స్‌కు అందజేసినట్లు స్కానియా ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆండర్స్ గ్రుండ్ స్టోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో స్కానియా మెట్రోలింగ్ కోచ్‌ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆండర్స్ మాట్లాడుతూ, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణికుల భద్రత ప్రధానంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ఫ్యూచర్లు, సౌకర్యం, సేఫ్టీ ప్రొవిజన్‌తో ఈ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీతో కూడిన ఈ హైవే బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. చెన్నై - కొచ్చి మధ్య నడుపుతున్న పర్వీన్ ట్రావెల్స్‌కు ఐఎస్వో గుర్తింపు పొందటం సంతోషంగా ఉందన్నారు. మొదటగా తాము ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను పర్వీన్ ట్రావెల్స్‌కు అందించటం ఆనందంగా ఉందన్నారు. ఈ బస్సు 85 కిలోమీటర్ల వేగంతో చేరవలసిన గమ్యస్థానానికి నిర్ణీత సమయంలోపే వెళ్లే సౌకర్యం ఉందని అన్నారు. ఆరు ఎమర్జెన్సీ డోర్లు, మానిటర్ డ్రైవర్ మూమెంట్స్, ప్రయాణికులకు సేఫ్టీ వీడియోలు తదితర సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కానియా కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్ డెరైక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.