కర్నూలు మండలం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్ వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ బస్సు... విజయ్‌భాస్కర్‌రెడ్డి నగర్ నుంచి రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్‌ను ఢీకొంది.
దీంతో ట్రాక్టర్‌పై ఉన్న నగేష్ (25) మృతి చెందగా మరో మగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్స్ వారితో మాట్లాడి ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.