nagesh
-
మా సినిమా కలెక్షన్స్‌లో 20% వారికే ఇస్తాం: సముద్రుడు టీమ్
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మిస్తున్నారు. హీరో సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు నగేష్ నన్ను చూసి సముద్రుడు అనే టైటిల్ పెట్టాడు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాట నేడు నిజమైంది అన్నారు.మొదటి వ్యక్తి నేనేహీరో సుమన్ మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వ్యక్తిని నేనే! అన్నమయ్య, రామదాసు సినిమాల తర్వాత చేసిన పాత్రలే చేయడం ఎందుకని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను.ఛత్రపతిలా పెద్ద హిట్నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గవాటిలో ఇదీ ఒకటి. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. ఇప్పుడాయన జాలర్ల జీవితాలపై సముద్రుడు తీశాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.20 శాతం వారికే..దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. సముద్రం దగ్గర ఉండే జాలర్లు చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని సినిమాలో చూపించాం. ఒక మంచి పాత్రలో అడగ్గానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు అన్నారు. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. -
ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అక్షయ (2)కు అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే వ్యాధి వచ్చింది. ఈ కారణంగా పాప ఎదుగుతున్నా కండరాలు సహకరించక నిలబడలేకపోతోంది. నడవలేక.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పాప లక్షణాలను బట్టి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌లో జెనటిక్ పరీక్షను చేయించారు. పరీక్షలో ఆ పాపకు స్పైనల్ మసు్కలర్ అట్రోఫిగా నిర్ధారణ అయ్యింది. నిర్లక్ష్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. న్యూరోఫిజీíÙయన్ హేమంత్‌కుమార్ ఆ పాప పరిస్థితిని వివరిస్తూ.. పాప చికిత్సకు జోల్జెరి ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ చేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు అవుతుందని చెప్పారు. జన్యుపర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. కాగా.. బిడ్డను కాపాడుకోవడం రోజు కూలీ చేసుకునే తమకు చాలా కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అక్షయను రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు. -
‘వలస’ నేతల్లో ఒక్కరే గెలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ‘వలస’ నేతల్లో ఒకే ఒక్కరే విజయతీరానికి చేరుకుని సత్తా చాటారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నవారు లేదా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేని వారు మొత్తంగా 9 మంది పోటీచేశారు. ఈ వలస నేతల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నుంచే గెలుపొందారు. మిగతా ఎనిమిది మంది పరాజయం పాలయ్యారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు (ఆయన తన కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు), మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ డా.సీతారాంనాయక్, వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, నల్లగొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌నేత గోమాస శ్రీనివాస్, ఖమ్మం నుంచి సంఘ్‌పరివార్ క్షేత్రాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన తాండ్ర వినోద్‌రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత (సంఘపరివార్‌తో ఉన్న సంబంధాలు కలిసిరాగా, టికెట్ వచ్చే నాటికి బీజేపీ సభ్యత్వం లేకపోయినా ఆమెకు సీటు) వలసనేతల జాబితా కోవలోకి వస్తారు.గెలిచిన 8 ఎంపీల విషయానికొస్తే...ప్రస్తుతం బీజేపీ గెలిచిన 8 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్–బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో, చేరారు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్), ఎం.రఘునందన్‌రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. వీరిలో అర్వింద్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ గత లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీ టికెట్‌పై పోటీచేసినా, ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్‌లో కొనసాగినందున కొత్తగా కమలం గుర్తుతో ఆమెను ఓటర్లు గుర్తించలేదు. దాంతో ఆమె బీజేపీ టికెట్‌పై మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగు పెడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు బీజేపీలో చేరి పదేళ్లకు పైగానే కాగా, 2018–23 మధ్యలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విషయానికొస్తే...2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. 2019లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచే ఆ పార్టీ టికెట్‌పై ఎంపీగా విజయం సాధించారు. టీఆర్ఎస్లో నెంబర్–టుగా ప్రాధాన్యత గల నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాక బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఐతే 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మల్కాజిగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే...బీజేపీలోనే పుట్టి పెరిగి ఒరిజనల్, పక్కా కమలనాథులుగా ఉంటూ ఎంపీలుగా గెలిచిన వారు మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమేనని పాతతరం పార్టీ నాయకులు పేర్కొంటుండడం కొసమెరుపు. -
తాత వారసత్వాన్ని కొనసాగించేందుకు హీరోగా!
దివంగత నటుడు నాగేశ్‌ను ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. ఈ తమిళ నటుడు తెలుగులో శ్రీ రామ బంటు, ఒక చల్లని రాత్రి, తూర్పు పడమర, సోగ్గాడు, పాపం పసివాడు, కొండవీటి సింహం, శ్రీరంగనీతులు, ప్రచండ భైరవి, భలే తమ్ముడు, శత్రువు, నేటి సావిత్రి.. ఇలా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు, నటుడు ఆనంద్‌బాబు కుమారుడు బిజేశ్ నాగేశ్ రంగంలోకి దిగారు. ఈయన ఇంతకు ముందు సంతానం కథానాయకుడిగా నటించిన సర్వర్ సుందరం, ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మాణిక్యవేల్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వానరన్ మూవీతో హీరోగా ఇప్పుడు వానరన్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆరెంజ్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ పద్మనాభన్, సుజాత రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను శ్రీరామ్ పద్మనాభన్ నిర్వహిస్తున్నారు. అక్షయ హీరోయిన్గా నటిస్తుండగా లొల్లుసభ జీవా, దీపా శంకర్, ఆదేశ్ బాలా, నాంజిల్ విజయన్, ఎస్ఎల్ .బాలాజీ, బేబీ వర్ష, వెంకట్రాజ్, శివగురు, రామ్రాజ్, వెడికన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. తండ్రీకొడుకుల అనుబంధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న వానరన్లో బిజేశ్ నాగేశ్ చాలా సహజంగా నటించారన్నారు. అక్షయ.. ఒయిలాట్టం కళాకారిణిగా అద్భుతంగా చేశారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 30 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న తరుణంలో వానరన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం!
కరీంనగర్: పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కూతరు నగేశ్ (21), పడిదం హరీశ్ (19) ఇద్దరు స్నేహితులు. ద్విచక్ర వాహనం (టీఎస్ 22 హెచ్ 6725)పై మల్లాపూర్ నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు సిద్ధార్థ స్కూల్ దాటాక బస్సును ఓవర్టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు, బైక్ ధ్వంసం కాగా, బైక్ నడుపుతున్న నగేశ్, వెనుక కూర్చున్న హరీశ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదిలాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ గౌస్ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. కారు వేగం ధాటికి ఇద్దరు చెరో చోట ఎగిరిపడ్డారు. కాగా రాష్ట్ర రహదారిపై గత కొన్నేళ్లుగా గుంతలు పడ్డ చోటనే ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ప్రమాద సూచికలను రోడ్డుపై ఏర్పాటు చేసిన అధికారులు, రోడ్డును మరమ్మతు చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కడే కుమారుడు.. ప్రమాదంలో మృతి చెందిన పాడిదం హరీశ్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చెర్లపల్లి నుంచి ధర్మారం మండలం మల్లాపూర్‌లో మూడేళ్లుగా నివాసం ఉంటూ సుతారి పనులు చేస్తు హరీశ్ తండ్రి రాజయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీశ్ ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదవగా, మరో సోదరి ఐదో తరగతి చదువుతోంది. సెల్‌ఫోన్ రిపేర్ చేస్తూ.. మృతుడు కూతురు నగేశ్ ఇటీవలే బైక్ కొనుగోలు చేశాడు. కరీంనగర్లో నివాసం ఉంటూ సెల్‌ఫోన్ రిపేర్లు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి పో చమల్లు నగేశ్ చిన్నతనంలోనే మృతి చెందినట్లు తెలిసింది. సోదరుడికి వివాహమైంది. రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాల్లో విషాదం నింపింది. ఇవి చదవండి: హనుమకొండ: దైవదర్శనానికి వెళ్తూ.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి -
పండుగ కోసం బట్టలు కొనేందుకు వెళ్లి.. విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: దసరా సందర్భంగా షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సోన్ మండలం గల 44 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంతోషం రవీందర్ కథనం ప్రకారం.. మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన ఆర్మూర్ నగేశ్ (22) దసరా పండగ కోసం బట్టలు కొనేందుకు ఆదివారం బైక్‌పై నిర్మల్ వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ డ్రైవర్ వేగంగా వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిన నగేశ్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి బోయవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అక్రమ ఆదాయానికి చెక్ పెట్టిన ఏసీబీ సూపర్ రైడ్
-
Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగులలో యువతిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తనపై బ్లేడ్‌తో దాడి చేసింది నగేష్ అని బాధిత యువతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. యువతిపై దాడి జరిగిన సమయంలో నగేష్ మాడుగుల జంక్షన్లో వ్యాపారం చేసుకుంటున్నట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా సేకరించిన తర్వాత ఈ కేసులో నగేష్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని.. మెడికల్ రిపోర్ట్‌ల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సునీల్‌కుమార్ అన్నారు. చదవండి: (దారుణం.. మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్ష సుపారీ) -
నగేష్ కేసు; కీలకం కానున్న నిందితుల స్టేట్మెంట్
సాక్షి, మెదక్: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ అధికారులు బినామీల పాత్రపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆరుగురు బినామీలను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో మెదక్‌తోపాటు హైదరాబాద్ శిర్లలో బినామీల పేర్లతో అస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీరిని ఏసీబీ అధికారుల నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలం కీలకం కానుంది. (నగేష్ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ) -
నగేష్ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై మూడో రోజు అవినితి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడవ రోజు నగేష్ బినామిలను ఏసీబీ విచారించింది. నగేష్ బినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామిని విచారించగా, మెదక్, మనోహర బాద్, మేడ్చల్, కామారెడ్డిలో పలు అక్రమాలను ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం ఏసీబీ అధికారులు విచారించారు. నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారులతో డూప్లికేట్ కీ చేయించి రేపు ఓపెన్ చేయించనున్నారు. (మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు) లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. అయితే ఈ కేసుతో తనకు ఏలాంటి సంబంధం లేదని అడిషనల్ కలెక్టర్ విచారణలో తెలిపారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్‌లో ఉన్న తను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. దీంతో ఆడియో టేపులు ,అగ్రిమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేన్ అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రేపటితో నిందితుల కస్టడీ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రేపు మరోసారి పలువురు అనుమానితులను, సాక్ష్యులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (ఏసీబీ అధికారులను బుకాయించే ప్రయత్నం) -
అడిషనల్ కలెక్టర్ 'నగేష్' కేసులో మహిళ పాత్ర
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై రెండోరోజు విచారణ కొనసాగింది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగేష్ ఆస్తులకు సంబంధించి ముగ్గురు బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. ఇందులో ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డిలో నగేష్ పలు అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగులను సైతం విచారించింది. నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. లాకర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. (బ్యాంకు లాకర్‌పై స్పష్టతనివ్వని నగేష్) అయితే ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేష్ వెల్లడించారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్‌లో ఉన్న నేను అవినీతికి ఎందుకు పాల్పడుతానని ఎసిబిని బుకాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆడియో టేపులు ,అగ్రీమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేష్‌ను ప్రశ్నించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులు మరో మూడు రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. రేపు పలువురు అనుమానితులను , సాక్ష్యులను ఏసీబీ విచారించనుంది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. (అడిషనల్ దందా’పై నగేశ్ మౌనం) -
అడిషనల్ దందా’పై నగేశ్ మౌనం
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో ఇటీవల ఏసీబీ కోర్టు ఐదుగురు నిందితులైన మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ వాసీం, మాజీ ఆర్డీవో అరుణారెడ్డి, మాజీ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, నగేశ్ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను నాలుగురోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నగేశ్ ఆస్తులు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించినట్లు సమా చారం. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపారా? అన్న విషయాలపై నగేశ్ నోరు మెదపలేదని సమాచారం. నగేశ్ తమతో పలు అక్రమ వ్యవహాలు చేసేలా ఒత్తిడి పెంచాడని ఇటీవల పలువురు తహసీల్దార్లు చేసిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నగేశ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వీరి కస్టడీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. పార్టీలు, ప్రలోభాలతో బుట్టలోకి! ఈ క్రమంలో జీవన్‌గౌడ్‌కు సంబంధించి ఏసీబీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టినట్లు సమాచారం. నగేశ్‌పై దాడుల సమయంలో ఏసీబీ అధికారుల బృందం ఒకటి.. జీవన్‌గౌడ్ కోసం ప్రత్యేకంగా అతని స్వస్థలమైన నిర్మల్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానికంగా పైరవీకారుడిగా పేరున్న జీవన్‌గౌడ్ గతంలోనూ పలువురు అధికారులను ఇలాంటి అక్రమాలకు వినియోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం డబ్బుతోపాటు పలు రకాల విలాసాలు, పార్టీలు ఆశజూపి ప్రలోభాలకు గురిచేసే వాడని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలతో తనకు పరిచయాలున్నాయని జీవన్‌గౌడ్ అధికారులను మభ్యపెట్టి పనులు చేయించుకునేవాడని పలువురు రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి తెలిపినట్లు సమాచారం. నగేశ్‌కు జీవన్‌గౌడ్ తక్కువ కాలంలోనే దగ్గరయ్యాడని, నమ్మకస్తుడిగా మారి బినామీగా ఎదిగాడని తెలిసింది. ఏకంగా జీవన్‌గౌడ్ పేరిట పది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని బా«ధితుడు లింగమూర్తిపై ఒత్తిడి చేశాడంటే.. అతను నగేశ్‌కు ఎంతటి ఆప్తుడిగా మారాడో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏసీబీ : ఆరుగంటల పాటు సాగిన విచారణ
సాక్షి, మెదక్ : జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. అనంతరం ఆర్డీవో అరుణా రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులు నాలుగు రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. మొదటిరోజు విచారణలో ఏసీబీకి నిందితులు సహకరించలేదు. బ్యాంక్ లాకర్ పై నగేష్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. (గుట్టకే ఎసరుకు యత్నం) ఏసీబీ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 40 లక్షలు ఎక్కడ అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను, సాక్షులను సైతం అధికారులు విచారించనున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్) -
అదనపు కలెక్టర్ నగేశ్ బాగోతం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్వోసీ ఇవ్వాలంటే కలెక్టర్‌కు రూ.1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ–1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ–2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ–3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ–4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ–5గా నగేశ్ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..? శేరిలింగంపల్లికి చెందిన శరత్ చంద్ర, సత్యనారాయణ ప్రసాద్‌లు ఈ భూమి ఓనర్లు. వీరితో భూమి కొనుగోలుకు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తికి ఒప్పందం కుదిరింది. సర్వే నంబరు 58, 59లలోని ఈ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్‌కు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరి అయింది. దీంతో జూలై 30వ తేదీన ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను లింగమూర్తి ఆశ్రయించాడు. ఎకరానికి లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు కలెక్టర్ ధర్మారెడ్డికి చెల్లిస్తే.. పని అవుతుందని నగేశ్ బేరం పెట్టాడు. విధిలేక లంచం ఇచ్చేందుకు లింగమూర్తి అంగీకరించాడు. మరునాడు జూలై 31న మెదక్‌లోని ఏసీ నగేశ్ ఇంటికి వెళ్లిన లింగమూర్తి రూ.19.5 లక్షల నగదును లం చంగా ఇచ్చాడు. అపుడు ఏసీ నగేశ్ సర్వే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అయిన వాసీంను కలవాలని సూచించాడు. అక్కడ తనకు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని వాసీం డిమాండ్ చేయగా.. లింగమూర్తి తన వద్ద ఉన్న రూ. 4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన రూ.లక్షను గూగుల్ పే ద్వారా వాసీం సూచించినట్లుగా సోమరాజాగౌడ్ అనే వ్యక్తికి మూర్తి తన భార్య, సోదరుడి ఫోన్ల ద్వారా పంపాడు. ఆగస్టు 7వ తేదీన రెండో విడతగా రూ.20.5 లక్షలను లింగమూర్తి ఏసీ నగేశ్‌కు అందజేశాడు. మిగిలిన రూ.72 లక్షలు ఏవని ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా సర్దలేకపో యానని లింగమూర్తి బదులిచ్చాడు. అయితే, ష్యూరిటీ కింద చెక్కులు ఇవ్వాలని ఏసీ నగేశ్ డిమాండ్ చేశాడు. దీంతో తన చందానగర్ ఐసీఐసీఐ ఖాతాకు చెందిన ఎనిమిది ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చాడు లింగమూర్తి. దాంతో అప్పటికే సిద్ధమైన ఎన్వోసీని లింగమూర్తికి అందించాడు నగేశ్. వాస్తవానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌పై జూలై 31 తారీఖునాడే నాటి కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేశారు. మిగతా డబ్బు కోసం ఒకటే ఫోన్లు మిగిలిన డబ్బు కోసం జూనియర్ అసిస్టెంట్ వాసీంతో నగేశ్ పదేపదే ఫోన్లు చేయించాడు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఆ ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడు. ఆగస్టు 14వ తేదీన మెదక్ ఏసీ నగేశ్‌తో లింగమూర్తి మరోసారి సమావేశమయ్యారు. మిగిలిన రూ.72 లక్షలకు సర్దలేకపోతున్నానని లింగమూర్తి చేతులెత్తేశాడు. అయితే ఎన్వోసీ జారీ అయిన 112 ఎకరాల్లో నుంచి పదెకరాలు తాను సూచించిన కోలా జీవన్‌గౌడ్ పేర రిజిస్ట్రేషన్ చేయాలని నగేశ్ సూచించగా, చివరికి ఐదెకరాలకు బేరం కుదిరింది. ఆగస్టు 15న జీవన్‌గౌడ్ పేరిట సేల్‌డీడ్ సిద్ధం చేసిన లింగమూర్తి వాటిని వాట్సాప్ ద్వారా వారికి పంపించాడు. ఈ లావాదేవీలో ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని నగేశ్ ముందుగానే లింగమూర్తిని ఫోన్లో హెచ్చరించాడు. అయితే ఈ సంభాషణ మొత్తం లింగమూర్తి ఫోన్లో రికార్డయింది. తరువాత సేల్ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీని ఆగస్టు 21వ తేదీన కలిసినపుడు లింగమూర్తి నుంచి ఏసీ నగేశ్ తీసుకున్నాడు. ఆగస్టు 22న ఏసీబీ ఆఫీస్‌కు లింగమూర్తి ఆగస్టు 7వ తేదీ నుంచే నగేశ్– లింగమూర్తి మధ్య విభేదాలు పొడసూపినట్లు సమాచారం. జూలై 31 రోజునే ఎన్వోసీ జారీ అయినా.. ఆ విషయం తనకు చెప్పకుండా రూ.20.5 లక్షలు వసూలు చేయడం, పైగా తాను కొనుగోలు చేసిన భూమిలో పదెకరాలు ఇవ్వాలనడం లింగమూర్తికి రుచించలేదు. చివరికి ఐదెకరాలకు ఒప్పందం కుదిరింది. ఆగస్టు 15వ తేదీన వాట్సాప్‌లో సేల్ అగ్రిమెంట్‌ను పంపించిన లింగమూర్తి అడిషనల్ కలెక్టర్‌ను వారం దాకా కలవలేదు. ఈ సమయంలో లింగమూర్తిపై అడిషనల్ కలెక్టర్‌కు అనుమానం వచ్చింది. తనకు ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఆదేశించడంతో ఆగస్టు 21న కలిసి ఇచ్చేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే జాప్యమైందని, తాను ఏసీబీని ఆశ్రయించలేదని వివరణ ఇచ్చుకున్నాడు లింగమూర్తి. చివరకు ఈనెల 9న నగేశ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. విచారణలో నోరువిప్పని ఏసీ..! ఏసీబీ విచారణ సందర్భంగా ఏసీ నగేశ్ నోరు విప్పలేదు. మొదట్లో అసలు లింగమూర్తి ఎవరో తనకు తెలియదన్న నగేశ్.. చిప్పలతుర్తి సమీపంలో ఫిర్యాదుదారుడు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తి భూమి గురించి తనను కొన్నిసార్లు కలిసినట్లు తెలిపాడు. కానీ, ఆయన నుంచి రెండు దఫాల్లో తీసుకున్న రూ.40 లక్షల గురించి ప్రశ్నించగా.. ఎలాంటి డబ్బును తీసుకోలేదన్నాడు. అలాగే మిగిలిన రూ.72 లక్షలకు ఫిర్యాదుదారుడు సంతకం చేసి ఇచ్చిన చెక్కులు, ఐదెకరాల భూమికి చేసుకున్న అగ్రిమెంటు తాలూకు పత్రాల గురించి పదేపదే అడగ్గా.. బహుశా వారు «కలెక్టర్ ధర్మారెడ్డిని కలిశారేమో అంటూ సమాధానమిచ్చాడు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నిందితులు ఐదుగురు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సస్పెన్షన్ మరో నలుగురిపైనా వేటు భూ వ్యవహారంలో మెదక్ అదనపు కలెక్టర్‌సహా నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎకరాకు రూ.లక్ష ఇస్తే 22ఏ(నిషేధిత జాబితా) నుంచి 112 ఎకరాలను తొలగిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేస్తానని నగేశ్ హామీ ఇచ్చి నట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 9న మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూ వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీవో, చిలిపిచెడ్ తహసీల్దార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మరో ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అలాగే మరొకరు అదనపు కలెక్టర్ బినామీగా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్
సాక్షి, మెదక్: జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులో నగేష్‌తో పాటు మరో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: ‘లాకర్’ గుట్టు వీడేనా..!) నగేష్‌తో పాటు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీపీ కోర్టును కోరింది. నిందితులను కస్టడీకి తీసుకోవడం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పిటిషన్‌తో పేర్కొంది. మాజీ కలెక్టర్ పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. అంతేగాక స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు మాజీ కలెక్టర్ రాసిన లేఖ ద్వారా ఈ కేసులో మాజీ కలెక్టర్ పాత్రపై వివరాలు సెకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
‘లాకర్’ గుట్టు వీడేనా..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్‌కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్‌గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్‌పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు. బినామీలు, వారి ఖాతాలపై నజర్ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్‌తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు. రియల్టర్‌పై నజర్.. మెదక్ జిల్లాలో రెండు చోట్ల విద్యాసంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.., అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు భూవ్యవహారాల్లో ఏసీకి అన్నీ తామై కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ కేంద్రంగా తతంగం నడిపించినట్లు గుర్తించారు. వీరిని సైతం ఏసీబీ త్వరలో విచారించనున్నట్లు తెలిసింది. లాకర్, బీరువా తెరిచేందుకు సన్నాహాలు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నగేశ్‌ను ఏసీబీ అధికారులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. సోదాల సమయంలో అదనపు కలెక్టర్ దంపతులు అధికారులకు సహకరించకుండా బ్యాంక్ లాకర్, బీరువా తాళం చెవులు లేవంటూ మొండికేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో వీటిని తెరిచేందుకు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. వీటిని తెరిస్తే నగదు, బినామీల బాగోతం వెలుగుచూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మాజీ కలెక్టర్‌కు నోటీసులు చిప్పల్తుర్తి భూములకు సంబంధించి 112 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22–ఏ నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్డీఓ అరుణారెడ్డి ఏసీబీకి కీలక సమాచారం ఇవ్వడంతో అధికారులు దూకుడుగా ముం దుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
గుట్టకే ఎసరుకు యత్నం
సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో ఉన్న గుట్టకే ఎసరు పెట్టేందుకే యత్నించారు. ఈ విషయం తాజాగా శనివారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పాంబండ గ్రామ శివారులో సర్వే నంబర్ 142లోని ప్రభుత్వ భూమిలో ఇరవై ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో క్వారీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ కోల జీవన్ గౌడ్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ భానుప్రకాశ్ దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. గుట్టకు ఆనుకుని అటవీ ప్రాంతం, గ్రామం ఉండటంతో నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఫైలును వెనక్కి పంపించారు. పలు రకాలుగా ఒత్తిళ్లు ఎలాగైనా క్వారీకి అనుమతులు పొందాలని జీవన్‌గౌడ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ.. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎత్తుగడలు వేశారు. అదనపు కలెక్టర్ నగేశ్‌ను రంగంలోకి దించడంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో సిఫార్సుసు చేయించినట్లు తెలిసింది. క్వారీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌పై పలు రకాలుగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. కాగా, ఎవరు చెప్పినా తహసీల్దార్ వినకపోవడంతో అదనపు కలెక్టర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నాలుగైదు నెలలుగా సదరు తహసీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీన్ని మనసులో పెట్టుకుని తహసీల్దారుపై ఏసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారని.. ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ దాడులతో వెలుగులోకి.. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినప్పుడు నగేశ్‌కు నిర్మల్ జిల్లాకు చెందిన జీవన్‌గౌడ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి భూ వ్యవహార లావాదేవీల్లో అదనపు కలెక్టర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్‌గా నగేశ్ మెదక్ జిల్లాకు వచ్చినప్పటికీ అతడికి జీవన్‌గౌడ్ బినామీగా వ్యవహరించడం.. వారిద్దరి మధ్య స్నేహం ఏ పాటిదో తెలుస్తోంది. అయితే రూ.112 ఎకరాల భూమికి ఎంఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం.. అతడి బినామీ జీవన్‌గౌడ్‌నూ అరెస్టు చేయడంతో జీవన్‌గౌడ్ పాంబండ కేంద్రంగా గుట్టకు ఎసరు పెట్టిన ప్రయత్నాలు వెలుగు చూశాయి. కాగా.. క్వారీ లీజుకు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భావించారా.. జీవన్ గౌడ్ సొంతంగా తీసుకోవాలని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడికి తలొగ్గలేదు: శివ్వంపేట తహసీల్దార్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్న పలు భూ వివాదాలపై తనపై ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చినా.. తలొగ్గ లేదని, అందుకే ఈ రోజు తలెత్తుకొని ఉన్నానని, లేకుంటే తాను కూడా జైలులో ఉండేవాడినని తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శివ్వంపేటలో నెలకొన్న భూ సమస్యల గురించి ప్రస్తావించిన విషయం గురించి తహసీల్దార్ భానుప్రకాశ్ వివరణ ఇచ్చారు. పాంబండ, పిల్లుట్ల గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద భూముల విషయంపై చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన జీవన్‌గౌడ్ సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. -
ఆ ముగ్గురు ఎక్కడ?..
సాక్షి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల నిషేధిత భూమికి ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురు అరెస్టు అయిన విషయం విదితమే. ఎప్పుడైతే నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారో.. అప్పటి నుంచి వీరంతా అదృశ్యమయ్యారు. మరోవైపు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేసి పంపించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి లేఖ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. సన్నిహితంగా ఆ ముగ్గురు అడిషనల్ కలెక్టర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు అదృశ్యమవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి ఇంత వరకు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ ముగ్గురిలో ఒకరు కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో పనిచేస్తారు.. మరొకరు అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో నిత్యం అన్నీ తానై వ్యవహరిస్తారు.. ఇంకొకరు అన్నింటా సహకరించే వ్యక్తి. వీరు సడన్‌గా మాయమవడంతో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారన్న ప్రచారం సాగుతోంది. వివిధ పనులకు రూరల్ ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చినవారు గతంలో పరిచయమున్న సిబ్బంది లేకపోవడంతో గుసగుసలాడుకున్నారు. ధర్మారెడ్డిని విచారించే అవకాశం ఈ భూ వ్యవహారంలో మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పేరు వినిపించడం కలకలం సృష్టించింది. 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అదనపు కలెక్టర్ నగేశ్.. భూమి కొనుగోలు చేసిన లింగమూర్తితో రూ.1.12 కోట్లకు జూలై 31న బేరం కుదుర్చుకున్నారు. భూ ఎన్ఓసీకి సంబంధించిన ఫైలు ఆగస్టు 21న తహసీల్దార్, 23న ఆర్డీవో, 25న కలెక్టర్‌కు చేరింది. ఆ తర్వాత జూలై 31న మూర్తితో రూ.1.12 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. ఇదే రోజు కలెక్టర్ ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వెలుగులోకి వచ్చిన లేఖలో 112 ఎకరాలకు ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఫైలు అందిందని ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ రోజు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందనే కోణంలోనూ వారు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు .. ధర్మారెడ్డి పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇంకా మెదక్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయలేదని సమాచారం. ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి రోజు ఫోన్ చేసి ఆరా తీసే ధర్మారెడ్డి.. అడిషనల్ కలెక్టర్ వివాదం తర్వాత అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో ఆయనను విచారించడం ఖాయమని అవినీతి నిరోధక శాఖకు చెందిన ఒకరు స్పష్టం చేశారు. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెందరి పాత్రలు ఉన్నాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తహసీల్దార్ మాలతికి ప్రశ్నల వర్షం చిప్పల్తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలోని భూమి ఎన్ఓసీకి దరఖాస్తు సమయంలో నర్సాపూర్ తహసీల్దార్ మాలతి సెలవులో ఉన్నారు. అప్పుడు ఆర్డీవో అరుణారెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న సత్తార్‌కు ఈ వ్యవహారంలో రూ.లక్ష చొప్పున ముట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఆర్డీవోను హైదరాబాద్‌కు తీసుకెళ్లేటప్పుడు మాలతిని సైతం తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆర్డీవో మహిళ కావడంతో మాలతిని ఆమెకు తోడుగా తీసుకెళ్లినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత మాలతిని కూడా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో ఎందుకు సెలవు పెట్టారు?.. ఎవరైనా ఒత్తిడి చేశారా?.. ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో సెలవు పెట్టినట్లు ఆమె సమాధానం ఇచ్చారని సమాచారం. -
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్ పట్టుబడిన విషయం తెలిసిందే. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) కాగా కోట్ల రూపాయిలు లంచాలు తీసుకుంటున్న నగేష్‌కు ఏసీబీ అధికారులను చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు 103 డిగ్రీల జ్వరం ఉందని, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉందంటూ చెప్పడంతో... వైద్యుల పర్యవేక్షణలో నగేష్‌కు ఫీవర్ చెక్ చేయడంతో పాటు మందులు అందిస్తూనే మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చేర్పించాలంటూ అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు. (రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ) ఎకరానికి లక్ష చొప్పున ఒప్పందం ఈ కేసుపై ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ‘శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో సోదాలు చేశాం. మాకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. 29 ఫిబ్రవరి 2020 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేయడానికి అమ్మకం ఒప్పందానికి ఎన్వోసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. జులై 31న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్ కుదిరింది. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. ఆగస్ట్ 7 తేదీన ఫిర్యాదుదారుడి నుండి మరోసారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్‌కి బాధితుడు బదిలీ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు తీసుకున్నాడు. లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో లక్ష తహసీల్దార్‌కు వసీం ఇచ్చాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు కూడా గుర్తించాం. నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డీడ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం’ చేసుకున్నట్లు తెలిపారు. -
రూ.కోటి 12 లక్షలు లంచం: ఆడియో సంభాషణ
-
రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్ కలెక్టర్ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్ మొదలు వీఆర్వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్ లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. సోదాలు అనంతరం హైదరాబాద్ ఏసీబి ప్రధాన కార్యాలయంకు తరలించనున్నారు. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) బాధితుడితో అడిషనల్ కలెక్టర్ ఆడియో సంభాషణ ►మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా, మీకు క్లారిటీ ఉందా ►మీకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు - అడిషనల్ కలెక్టర్ ►నాకు క్లారిటీ ఉంది సర్ - బాధితుడు ►మొదటగా 25 లక్షలు ఇస్తాం అన్నారు , ఆ తరువాత 19.5 ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►వసీం 5 లక్షలు ఇచ్చాను , మొదటగా రెండు లక్షలు , ఆ తరువాత మూడు లక్షలు ఇచ్చాను - బాధితుడు ►నేను రెండు లక్షలు చెప్పాను కదా, నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►మీకు వసీం కాల్ చేశాను అని చెప్పాడు , అందుకే ఇచ్చాను సర్ - బాధితుడు ►ఎవరికీ ఏమి ఇచ్చిన ప్రతిదీ నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు - అడిషనల్ కలెక్టర్ ►ఆడియో క్లిప్‌లో డబ్బు లావాదేవీల చర్చతో అడ్డంగా బుక్కైన అధికారి -
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
-
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి) అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా) అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు) -
క్రీడల నేపథ్యంలో...
కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్ నగేశ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ.